Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోదశో7ధ్యాయః

నారద ఉవాచ : శిష్ట ద్వీపప్రమాణంచ వదసర్వార్థ దర్శన | యేన విజ్ఞాత మాత్రేణ పరానం దమమో భ##వేత్‌. 1

శ్రీ నారాయణ ఉవాచః కుశద్వీ పస్య పరితో ఘృతో దావరణం మహత్‌ |

తతో బహిః క్రౌంచ ద్వీపో ద్విగుణః స్యాత్స్వమా నతః. 2

క్షీరో దేనావృతో భాతి యస్మి న్క్రౌం చాద్రి రస్తి చ | నామ నిర్వర్తకః సో7యం ద్వీప స్య పరివర్తతే. 3

యో7సౌ గుహస్య శక్త్యా చ భిన్న కుక్షిః పురా7భవత్‌|క్షీరోదేనాసిచ్యమానో వరుణన చరక్షితః. 4

ఘృత పృష్ఠో నామ యస్య విభాతి కిల నాయకః |ప్రియ వ్రతాత్మజః శ్రీమాన్సర్వలోకనమస్కృతః. 5

స్వద్వీ పంతు విభ##జ్యైవ సప్త ధాసస్వాత్మజా న్దదౌ | పుత్ర నామ సు వర్షేషు వర్షపా న్స న్నివేశయన్‌. 6

స్వ యం భగవత స్త స్య శరణం సంజగామ హ | ఆమో మధురహశ్చైవ మేఘ షష్ఠః సుధా మకః. 7

భ్రాజిష్ఠో లోహితార్ణ శ్చ వన స్పతి రితీవచ | నగా నద్య శ్చ సపై#్తన విఖ్యాతాభువి సర్వతః. 8

శుక్లోవై వర్ద మానశ్చ భోజన శ్చాపబర్హణః | న శ్చ నందనః సర్వతోభద్ర ఇతి కీర్తితాః. 9

అభయా అమృతౌఘా చార్యకా తీర్థవతీతి చ | వృత్తిరూపవతీ శుక్లా పవిత్రవతికా తథా. 10

ఏతసా ముదకం పుణ్యం చాతుర్వర్ణ్యేన పీయతే | పురుషఋషభౌ తద్వద్ధృవిణా ఖ్యశ్చ దేవకః. 11

ఏతే చతుర్వర్ణ జాతాః పురుషా నివసంతి హి | తత్రత్యాః పురుషా అపోమయం దేవ మపాంపతిమ్‌. 12

పదుమూడవ అధ్యాయము

భువన వ్యవస్థ

నారదు డిట్లనెను : ఓ సర్వార్థ దర్శనా ! మిగిలిన దీవుల ప్రమాణముల గూర్చియు నెఱింగింపుము. వాని నెఱిగి నందువలన పరమానందము చేకూరును. నారాయణు డిట్టులనియెను : కుశ ద్వీపము చుట్టు నేతిసంద్రము గలదు. దానికి రెండింతల పరిమాణముతో క్రౌంచద్వీపమొప్పుచుండును.దీనికి చుట్టును పాలసంద్రము తనరును. ఈ ద్వీపమున క్రౌంచాద్రి యుండుట వలన దీనికి క్రౌంచద్వీపమను పేరు గల్గెను. మున్ను కుమారస్వామి తన శక్తి బాణముతో దీని నడిమి భాగము చీల్చెను. దానిని వరుణుడు పాలసంద్రముచేత తడిపి కాపాడెను. దీని కధినాయకుడు ప్రియవ్రతుని కొడుకగు ఘృత పృష్ఠుడు . ఇతడు సర్వలోకవందితుడై విరాజిల్లుచున్నాడు. ఇతడును తన యేడ్గురు కొడుకుల పేర్లమీద నేడువర్షము లేర్పరిచి వారి కప్పగించెను. అతడు స్వయముగ శ్రీ భగవానుని శరణు జొచ్చెను. ఆమము - మధురుహము- మేఘపృష్ఠము- సుధామకము-భ్రాజిష్ఠము-లోహితార్ణము- వనస్పతి-యను నేడువర్షములు. అందేడేసి సంఖ్యలలో నదీ పర్వతములు లలరారు చుండును. శుక్లము-వర్ధమానము-భోజనము-ఉపబర్హణము-నందము- నందనము-సర్వతోభ్రదమనున వచటి గిరి ముఖ్యములు. అభయ-అమృతౌఘ - ఆర్యక- తీర్థపతి-వృత్తి రూపవతి-శుక్ల-పవిత్రవతి-యనునవినదులు. వీని పుణ్యజలములు నాల్గు వర్ణములు ప్రజలు గ్రోలుదురు. పురుష-ఋషభ-ద్రవిణ-దేవక-లను నాలుగు వర్ణములు వార లచట వసిందురు. అచటి ప్రజలు జలమయుడు-జలాధిపతి-యగు దేవుని గొల్తురు.

వూర్ణేనాంజలినా భక్త్యా యజంతే వివిధక్రియాః | ఆపః పురుషవీర్యాః స్థ పునంతీర్బూర్బువః స్వః. 13

తానః పునీతా7మీవఘ్నీః సృశతామాత్మనాభువః | ఇతి మంత్రజపాంతే చ స్తువంతి వివిధైః స్తవైః. 14

ఏవం పరస్తా తీరోదాత్పరిత శ్చోప వేశితః | ద్వాత్రింశల్లక్ష సంఖ్యాక యోజనాయామ మాళ్రితః. 15

స్వమానేన చ ద్వీపో7యం దధిమండో దకేన చ | శాకద్వీపో విశిష్టో7యం యస్మిన్‌శాకో మహీరుహః. 16

స్వక్షేత్రవ్యపదేశస్య కారణం సహినారద |పై#్రయవ్రతో7ధిస్తస్య మేధాతిథి రితిస్మృతః. 17

విభజ్య సప్త వర్షాణి పుత్త్రనామాని తేషుచ | సప్త పుత్రాన్ని జాన్‌ స్థాప్య స్వయం యోగగతిం గతః. 18

పురోజవో మనః పూర్వజవో7థ పవమానకః ధూమ్రానీక శ్చిత్రరేఫో బహురూపో7థ విశ్వధృక్‌. 19

మర్యాదాగిరియః సప్తనద్యః సపై#్తన కీర్తితాః | ఈశాన ఊరుశృంగో7థ బలభధ్రః శతకేశరః. 20

సహస్ర స్రోతకో దేవపాలో7ప్యంతే మహాశనః | ఏతే7ద్రయః సప్తచోక్తాః సరిన్నామాని సప్తచ. 21

అనఘా ప్రథమాయుర్దా ఉభయసృష్టి రేవ చ | అపరాజితా పంచపదీ సహస్రశుతి రేవచ. 22

తతో నిజధృతిశ్చోక్తాః సప్తనద్యోమహోజ్ణ్వలాః | తద్వర్ష పురుషాః సర్వే సత్యవ్రతక్రతు వ్రతౌ. 23

దానవ్రతానువ్రతౌ చ చతుర్వర్ణా ఉదీరితాః | భగవంతం ప్రాణవాయుం ప్రాణాయామేన సంయుతాః. 24

వారు భక్తితో జలాంజలులతో పెక్కు విధముల నిట్లు నుతింతురు. '' ఓ జలదేవాః నీవు పురుషోత్తముని వీర్యమవు. నీవలన భూర్‌ - భువః - స్వర్లోకములు పునీతములై యున్నవి. నిన్ను తాకుచున్న మా మేనుల నాత్మరూపుడవై పవిత్రమొనరింపుము.'' అను మంత్రజపముతో వివిధ స్తుతులతో నచటి వారు జలపతిని నుతింతురు. ఇట్లు క్రౌంచద్వీపము ముప్పది రెండు లక్షల యోజనముల విస్తీర్ణము గల్గి క్షీరసాగరముచేత చుట్టబడియుండును. అంతే పరిమాణముగలదధిసముద్రముచేత శాకద్వీపము చుట్టబడియుండును. అందు కోకొల్లలుగ శాకవృక్షములు గలవు. నారదా! అది తన క్షేత్ర వైశాల్యమున కడు పెద్దది. ఆ దీవికి ప్రియవ్రతుని పుత్రుడు మేధాతిథియనువా డధిపతిగ నుండెను. అతడును దాని నేడు భాగములు చేసి తన యేడుగురు కొడుకుల పేర్లు పెట్టి వారి కిచ్చి తాను యోగమార్గ మవలంభించెను. పురోజవము- మనః పూర్వజవము-పవమానకము-ధూమ్రానీకము- చిత్రరేఫము-బహురూపము-విశ్వధృక్కు-అనునవి ప్రసిద్ధవర్షములు. - నదులు నేడు గలవు. ఈశానము-ఉరుశృంగము-బలభద్రము- శతకేశరము- సహస్రస్రోతకము- దేవపాలము-మహాశనము-నను నవి ప్రసిద్ధ గిరుల నామ ములు. ఏడు నదుల పేర్లు వినుము: అనఘ-ఆయుర్ద ఉభయస్పృష్టి- అపరాజిత -పంచపది-సహస్రశ్రుతి- నిజధృతి-యను నవి పేరొందిన నదీమతల్లులు. అచటి జనులెల్లరును-సత్యవ్రత-క్రతువత-దానవ్రత-అనువ్రత-యను నాల్గు వర్ణముల నొప్పుచుందురు. వారు వాయుదేవుని ప్రాణాయామ పూర్వకముగ నుతింతురు.

యజంతి నిర్దూత రజస్తమసః పరమ హరిమ్‌ | అంతః ప్రవిశ్య భూతాని యోబిభర్త్యాత్మకేతుభిః. 25

అంతర్యా మీశ్వరః సాక్షా త్పాతు నోయద్వశే ఇదమ్‌ | పురస్తాద్దధి మండోదాత్తత స్తు బహు విస్తరః. 26

పుష్కర ద్వీప నామా యం శాకద్వీ పద్వి సంగుణః | స్వసమానేన స్వీదూదకేనా యం పరివేష్టితః. 27

యత్రా77స్తే పుష్కరం భ్రాజదగ్నిచూడాని భాని చ | పత్రాణి విశదానీహ స్వర్ణ పత్రాయుతా యుతమ్‌. 28

శ్రీ మద్భగవత శ్చేద మాసనం పరమేష్ఠినః | కల్పితం లోకగురుణా సర్వలో సకి సృక్షయా. 29

తద్ద్వీప ఏక ఏవా7యం మానసోత్తరనామకః | అర్వాచీన పరా చీన వర్షయో రవధి ర్గిరిః. 30

ఉచ్చృ యాయామయోః సంఖ్యా7యుతయోజన సమ్మితా | యత్ర దిక్షు చ చత్వారి చత సృషు పురాణిహ. 31

ఇంద్రాది లోకపాలానాం యదుపర్యర్క నిర్గమః | మేరుం ప్రదక్షిణీ కుర్వ న్బానుః పర్యేతి యత్ర హి. 32

సంవత్సరాత్మకం చక్రం దేవాహోరాత్ర తోభ్రమన్‌ | పై#్ర యవ్రతో7ధిపో వీతిహోత్రః స్వాత్మజక ద్వయమ్‌. 33

వర్షద్వయే పరిస్థాప్య వర్షనామ ధరం క్రమాత్‌ | రమణో ధాతకి శ్చైవ తత్త ద్వర్షపతీ ఉభౌ. 34

కృతాః స్వయం పూర్వజన ద్బ గవ ద్బక్తి తత్పరాః | తద్వర్షపురుషా బ్రహ్మరూపిణం పరమేశ్వరమ్‌. 35

సకర్మకేన యోగేన యజంతి పరిశీలితాః | యత్త త్కర్మమయం లింగం బ్రహ్మలింగంజనో7ర్చయేత్‌. 36

ఏకాంతమద్వయం శాంతం తసై#్మ భగవతే నమః.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ7అష్టమస్కంధే త్రయోదశో7ధ్యాయః.

వారు రజస్తమస్సులులేని సత్త్వరూపుడగు శ్రీహరిని గొల్తురు. ఆ దేవుడు ప్రాణరూపమున భూతములందు జొచ్చి ప్రాణములను భరించును. ఈ జగములన్నియు నతని వసమందుండును. అట్టి సర్వాంతరుడైన యీశ్వరుడు మమ్ముగాపాడుతమని వారు నుతింతురు. దధిసముద్రమునకు మిక్కిలి విశాలముగ పుష్కరద్వీపము గలదు. పుష్కరద్వీపకుశాక ద్వీపమునకు రెండింతులు గలదు. అది తనంతటి పరిమాణముగల మంచినీటి సంద్రముచే చుట్టబడియున్నది. ఈ ద్వీపమందు నగ్నివలయములవలె పుష్కరములు(కమలములు) పసిడిరేకులతో వేనకువేలు చెన్నొందును. ఈ పుష్కరములను సర్వలోకములు రచింపగోరిన లోకగురవగు బ్రహ్మదేవుడు తన కమలాసనముగ కల్పించెను. ఈ దీవియందు నాటినుండి నేటి వఱకు నలరుచున్న యొకేయొక గిరి గలదు. అది మానసోత్తరగిరి. ఇది తన పొడవు-వెడల్పు-నందు పదివేల యోజనములంత గలదు. దీని నలుదెసల నాల్గు పురములు విలసిల్లుచున్నవి. ఈ పురము లింద్రాదిలోకపాలకులవి. వీనికి పైగా మేరుగిరికి ప్రదక్షిణముగ భాస్కరుడు వెల్గుచు తిరుగుచుండును. ఇచట సంవత్సరమందలి యుత్తరాయణ-దక్షిణాయనములు దేవతల కొక పగలు - రేతిరి యగును. ప్రియవ్రతుని పుత్రుడు వీతిహోత్రుడు దీని కధినేత. ఇతనికిర్వురు.కుమారులు. అతడు వారిపేర్ల మీద రమణము -ధాతకి-యను పేర్లుంచిన రెండు వర్షము లేర్పఱచి వారిని వాని కధిపతులుగా జేసెను. అతడును తన పూర్వజుల పగిది భగవద్బక్తి తత్పరుడయ్యెను. అచటి ప్రజలు బ్రహ్మరూపియగు పరమేశుని ధ్యానింతురు. వారు తమ దేవుని కర్మయోగముతో గొల్తురు. వారు శీలసంపన్నులై బ్రహ్మసాలోక్యమునకు సాధనములు వెదకుదురు. ఏకాంతము - అద్వయము-శాంతము-నగు భగవానునకు వారభివందనములు చేతురు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున పదుమూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters