Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశో7ధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ: భారతా ఖ్యే చ వర్షే7స్మి న్నహమాది చ పూరుషః | తిష్ఠామి భవతా చైవ స్తవనం క్రియతే నిశమ్‌. 1

నారద ఉవాచ : ఓం నమో భగవతే ఉపశమశీలాయో పరతానాత్మ్యాయ నమో7 కిం చన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమ గురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి | కర్తా7స్య నర్గాదిషు యోన బధ్యతే న హన్యతే దేహగతో7పి దైహికైః | ద్రష్టుర్న దృశ్యస్య గుణౖ ర్విదూష్యతే తసై#్మ నమో సక్త వివిక్త సాక్షిణ 2

ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్బో భగవాన్‌ జగాదయత్‌ |

యదంత కాలే త్వయి నిర్గుణ మనో భక్త్యా దధీతోజ్ఘిత దుష్కలేవరః. 3

యథైహి కాముష్మిక కా మలంపటః సుతేషు దారేషు ధనేషు చింతయన్‌ |

శంకేత విద్వాన్కుకలే వరాత్య యాద్యస్తస్య యత్నః శ్రమ ఏవకేవలమ్‌. 4

తన్నః ప్రభో త్వం కుకలే వరార్పితాం త్వం మాయయా7హంమమతా మధోక్షజ |

భింద్యామ యేనాశు వయం సుదుర్బిదాం విధే హి యోగంత్వయినః స్వభావజమ్‌. 5

ఏవం స్తౌతి సదా దేవం నారాయణమనామయమ్‌ | నారదో మునిశార్దూలః ప్రజ్ఞాతాఖిలసారదృక్‌. 6

అస్మిన్వై భారతే సర్షే వరిచ్ఛైలా స్తుసంతి హి | తాత్ప్ర వక్ష్యామి దేవర్షే శృణు షై#్వకాగ్రమానసః. 7

మలయో మంగలప్రస్థోమైనాక శ్చిత్రకూటకః | ఋషభః కుటకః కోల్లః సహ్యో దేవగిరి స్తథా 8

ఋష్యమూకశ్చ శ్రీశైలో వ్యంకటాద్రి ర్మహేంద్రకః వారిధారశ్చ వింధ్యశ్చ భుక్తిమానృక్షపర్వతః. 9

పారియాత్ర స్తథా ద్రోణశ్చితకూట గిరిస్తథా | గోవర్థనో రైవతకః కకుభో నీలపర్వతః. 10

గౌరముఖశ్చేంద్రకీలో గిరిః కామగిరి స్తథా | ఏతే చాన్యే7ప్య సంఖ్యాతా గిరయోబహు పుణ్యదాః. 11

పదనొకండవ అధ్యాయము

భవన వ్యవస్థ

శ్రీనారాయణు డిట్లనెను : ఇంక నాల్గు వేదములు పుట్టిన జీవధాత్రి కర్మభూమియగు పావన భారతవర్షమునందు నే నాదిపురుష రూపమున విరాజిల్లుదును. నన్ను నీవి విధముగ సంస్తుతింతువు. నారదు డిట్టనును : శాంతికి నెలవు దరిద్రుల పాలిటి పెన్నిధి ఋషిశిఖామణి అహంకారరహితుడు పరమహంస పరమగురువు ఆత్మారాముల కధిపతి యగు నరనారాయణుడను భగవానునకు నా ప్రణామముల. ఈ సకల విశ్వమునకు కర్త యయ్యును కర్మచేత బద్ధుడుగాని వాడును దేహియయ్యును దేహబాధలు లేనివాడును ద్రష్ట యయ్యును విషయములచే చెడని చూపుగలవాడును సంగమములేని వివిక్తసాక్షియు నగు దేవునకు ప్రణామములు. ఓ యోగీశ్వరా ! అంత కాలమందున నిర్గుణుడవగు నీయందు పరమభక్తితో మనస్సు నిలిపి తనువు చాలించుటే యోగ నైపుణ్యమని యా హిరణ్యగర్బుడు పలికెను. ఎవడు విద్యాంసుడయ్యు నిహపరలోకములందు లంపటుడో ఎవ్వడు ధన-దార-సుతులయం దాసక్తుడగునో యీ వట్టి మట్టి తనువు వదలుటకు బాధ పడునో యట్టి వాని జ్ఞానమంతయును బూడిదలో బోసిన పన్నీరే; శ్రమమాత్రమే సుమా ఓ యధోక్షజా ! నీ మాయవలన శరీరమందలి యహం కార మమకారములు చెలరేగును. వానిని రూపుమాపగల్గు నీ సహజమైన ప్రేమభక్తియోగము మా కీయగదవే ! ఈ విధముగ సకల సారవిదుడు మునివరుడు నగు నారదమహర్షి నిత్యమనామయుడగు శ్రీనారాణుని సంస్తుతించుచుండును. ఓ దేవ ఋషీ! ఈ భారతవర్షమందలి నదీ-పర్వతముల గూర్చి వివరింతును. సావధానముగ నాలకింపుము. శ్రీమలయగిరి మంగల ప్రస్థము మైనాకము చిత్రకూటము ఋషభకూటము కోల్లము సహ్యము దేవగిరి ఋష్యమూకము శ్రీశైలము శ్రీవేంకటాచలము మహేంద్రము వారి ధారము వింధ్యము ముక్తిమంతయు ఋక్షగిరి పారి యాత్రము ద్రోణము చిత్రకూటగిరి గోవర్థనమురైవతకము కుకుభము నీలగిరి గౌరముఖము ఇంద్రకీలము కామగిరి మున్నగునవి కాకింకెన్నో పుణ్యప్రదములగు పర్వతములు విలసిల్లుచున్నవి.

ఏతదుత్పన్న సరితః శతశో7థ సహస్రశః | పానావగాహన స్నానదర్శనోత్కీర్త నైరపి. 12

నాశయంతి చ పాపాని త్రివిధాని శరీరిణామ్‌ | తామ్రపర్ణీ చంద్రవశా కృతమాలా వటోదకా. 13

వైహాయసీ చ కావేరీ వేణా చైవ పయస్వినీ | తుంగభద్రా కృష్ణవేణా శర్కరావర్తకా తథా. 14

గోదావరీ భీమర థీ నిర్వింధ్యా చ పయోష్ణికా | తాపీ రేవా చ సురసా నర్మదా చ సరస్వతీ. 15

చర్మణ్వతీ చ సింధుశ్చ అంధశోణౌ మహాన దౌ | ఋషికుల్యా త్రి సమా చ వేదస్మృతి మహానదే. 16

కౌశికీ యమునా చైవ మందాకినీ దృషద్వతీ | గోమతీ సరయూ గోథవతీ సప్త వతీ తథా. 17

సుషోమా చ శతద్రు శ్చ చంద్రభాగా మరుద్వృధా | వితస్తా చ అసిక్నీ చ విశ్వా చేతి ప్రకీర్తి తాః. 18

అస్మి న్వర్షే లబ్ధజన్మ పురుషై స్వస్వకర్మభిః | శుక్లలోహితకృష్ణాఖ్యై ర్దివ్యమానుష నారకాః. 19

భవంతి వివిధా భోగాః సర్వేషాం చ నివాసినామ్‌ | యథావర్ణవిధానే నాపవర్గో భవతి స్ఫుటమ్‌. 20

ఏత దేవ చ వర్షస్య ప్రాధాన్యం కార్యసిద్ధితః. | వదంతి మునయో వేదవాదినః స్వర్గవాసినః. 21

అహో అమీషాం కిమకారిశోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః |

యైర్జన్మలబ్ధం నృషుభారతాజిరే ముకుందసేవౌపయికం స్పృహా హి నః. 22

వీనినుండి పుట్టిన వందల-వేల-నదీ-నదములు చూచిన-త్రాగిన గ్రుంకిన-కీర్తించిన మాత్రన పావన మొనర్చును. ఇవి జీవుల ముడు విధముల పాపములను నశింపజేయును. తామ్రపర్ణి చంద్రవంశ కృతమాల వటోదక వైహాయసి కావేరి పయస్విని తుంగభద్ర కృష్ణ శర్కరావర వేణ గోదావరి భీమరథి నిర్వింధ్వ పయోష్ణి తాపి రేవ నర్మద సురస సరస్వతి చర్మణ్వతి సింధు అంధశోణ ఋషికుల్య త్రిసామ వేదస్మృతి మహానది కౌశికి యమున మందాకిని దృషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషోమ శతద్రు చంద్రభాగ మరుద్వృధ వితస్త అసిక్ని విశ్వ మున్నగు నదీనదములు జీవన ప్రదములై పుణ్యభారతభూమిపై ప్రసిద్ధములై యున్నది. భారతవర్షమందలి జనులు కారణజన్ములు. వారు సత్త్వము-రజస్సు-తమస్సుల కారణముగ తెలుపు-ఎఱుపు-నలుపులుగల స్వర్గ-భూ-నరభోగము లనుభవింతురు. ఇచట నివసించు వార లెల్ల భోగము లనుభవింతురు. ఆయా వర్ణముల ధర్మము ననుసరించి ఎల్లరికి ముక్తి గల్గును. ఎల్ల కార్యములు తేలికగ సిద్ధి బొందుట యీ భారతవర్షముయొక్క విశిష్టలక్షణము. అని వేదవిదులగు మునులు స్వర్గవాసులను పల్కుచుందురు. శ్రీహరి విశేషించి భారతీయులపట్ల ప్రసన్నత వహించును. వీరు భారతదేశమున జన్మించి హరిచరణ కమలసేవచేసి మాకును కనువిప్పు గల్గింతురు గదా ! ఆహా! ఈ భారతీయు లెంతటి పుణ్యవంతులో కదా!

కిం దుష్కరై ర్నః క్రతుభి స్తపోవ్రతై ర్దానాది భిర్వా ద్యుజయేన ఫల్గునా |

న యత్రనారాయణ పాద పంకజస్మృతిః ప్రముషా7 తిశ##యేంద్రి యోత్సవాత్‌. 23

కల్పాయుషాం స్థానజయా త్పునర్బవా త్షణాయుషాం భారతభూజయోవరమ్‌ |

క్షణన మర్త్యేన కృతం మనస్వినః సంన్యస్య సంయాంత్యభయం పదం హరేః. 24

న యత్ర వైకుంఠ యథాసుధాపగా నసాధవో భాగవతా స్తదాశ్రయాః |

న యత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకో7పి న వై ససేవ్యతామ్‌. 25

ప్రాప్తా నృజాతిం త్విహ యే చ జంతవో జ్ఞాన క్రియా ద్రవ్య కలాపసంభృతామ్‌ |

నవై య తే రన్న పునర్బవాయతే భూయోవనౌకా ఇవ యాంతిబంధనమ్‌. 26

యైః శ్రద్ధయా బర్హిషి భాగశో హవిర్నిరుప్త మిష్టం విధిమంత్రవస్తుతః !

ఏకః పృథక్‌ నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణం స్వయామాశిషాం ప్రభుః. 27

సత్యం దిశత్య ర్థిత మర్థితో నృణాం నై వార్థదో యత్పునరర్థితా యతః |

స్వయం విధత్తే భజతా మునిచ్ఛతా మిచ్ఛా పిధాఆనం నిజపాద పల్లవమ్‌. 28

యద్యత్రనః స్వర్గ సుఖావశేషితం స్వష్టస్యపూర్తస్యకృతస్య శోభనమ్‌ |

తేనాబ్జనాభేః స్మృతి మజ్జన్మనః స్యాద్వర్షే హరిర్బజతాంశం తనో తి.

నారాయణ ఉవాచ : ఏవం స్వర్గగతా దేవాః సిద్ధా శ్చ పరమమర్షయః |

ప్రవదంతి చ మాహాత్మ్యం భారతస్య సుశోభనమ్‌. 29

జంబుద్వీపస్యచా7ష్టౌ హి ఉపద్వీపాః స్మృతాః పరే | హయమార్గాన్విశో ధద్బిః సాగరైః పరికల్పితాః. 30

స్వర్ణప్రస్థశ్చంద్రశుక్ర ఆవర్తనరమాణకౌ | మందరోపాఖ్య హరిణః పాంచజన్య స్తథైవచ. 31

సింహాలశ్చైవ లంకే తి ఉపద్వీపాష్టకం స్మృతమ్‌ | జంబుద్వీపస్య మానం హి కీర్తితం విస్తరేణ చ. 32

అతఃపరం ప్రవక్ష్యామి ప్లక్షాదిద్వీప షట్కకమ్‌.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ అష్టమస్కంధే ఏకాదశో7ధ్యాయః.

తీరని యింద్రభోగముల మాటున మా శ్రీ నారాయణుని పాదకమలచింతన మఱుగుపడెను గదా! ఇక దుష్కర తపోదానత్రములవలన స్వర్గప్రాప్తివలన మా కేమి లాభము? కల్పాయువుతో స్వర్గమం దుండుటకంటె నల్పాయువుతో భారతమున జన్మించుట లెస్స. ఇచట ప్రజ్ఞావంతులు క్షణకాలమున సర్వమును త్యాగముచేసి యభయమైన హారిచరణకమలము నాశ్రయింతురు. వైకుంఠ కథాసుధారసము భాగవత - సాధుల-సత్సంగతి యజ్ఞేశుని యాగ మహోత్సవములను లేని యింద్రలోక మేనాటికిని చేరగూడదు. ఇంతటి మహిమగల భారతమునందు మానవులుగ జన్మించి జ్ఞాన-క్రియా-ద్రవ్య సంపద గల్గియును ఎవరు పునర్జన్మము లేకుండుటకు యత్నింపరో వారు మరల జంతువులలె బంధింపబడుదురు. దర్బలచేత పవిత్ర మై నవస్తువులను మంత్రపూతముగ నాయా దేవతల పేర్లు చెప్పి యెవరు వేల్తురో వారిచ్చిన వస్తువులను హరి ప్రీతితో స్వీకరించును. సత్య మేమనగ భగవానుడు కోరినవారి కోర్కెలు దీర్చును. కాని పరమార్థము మాత్రమీయడు. ఎవ్వాని కర్థించు స్వభావములేదో యెవడు నిష్కామముగ హరిని సేవించునోయట్టివాని కోర్కెలను భగవాను డీడేర్చును. వానికి తన శ్రీ పాదకమలము లొసంగును. మాకు స్వర్గసుఖ మేదైన మిగిలియున్నను మా వెనుకటి యిష్టాపూర్తములు మంచి స్థితిలో నున్న యెడల మాకు కమలనాభుని సంస్మరణ గల్గించు బంగరు భూమియగు భారతవర్షమున జన్మముగల్గి, సుఖసంపదలు గల్గుగాత. అని స్వర్గమందలి యెల్ల దేవతలును సిద్ధ-ఋషులును శ్రీమంతమైన భారతవర్ష మహాత్మ్యము గానముచేయుచు అభివర్ణింతురు. ఈ బంజూద్వీపమునకు సమీపమున మఱి యెనిమిది యుపద్వీపములు గలవు. వీనిని సాగర పుత్రులుపాయముతో నేర్పఱచిరి. స్వర్ణప్రస్థ-చంద్రశుక్ర-ఆవర్తన-రమణక-మందర-హరిణ-పాంచజన్య-సింహళ-లంక-యను నెనిమిది యుపద్వీపములు. ఈ విధముగ జంబూద్వీపపు ప్రమాణ మంతయును విపులముగ చెప్పబడెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యెనిమిదవ స్కంధమునందు పదునొకండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters