Sri Devi Bagavatham-2    Chapters   

అథదశమోధ్యాయః.

శ్రీనారాయణః : హిరణ్మయే నామవర్షే భగవాన్కూర్మరూపధృక్‌!  ఆస్తే యోగపతిఃసోయమర్యవ్ణూ పూజ్యఈడ్యతే. 13

ఆర్యమోవాచ: ఓ నమోభగవతే ఆకూపారాయ సర్వసత్త్వగుణ విశేషణాయ నోపలక్షిత స్థానాయ నమోవర్ష్మణ నమో భూమ్నే నమోవ స్థానాయ నమస్తే.

యద్రూప మేతన్ని జమాయయార్పిత మర్థస్వరూపం బహురూపరూపితమ్‌ |

సంఖ్యా నయస్యాస్త్య యథోపలం భనాత్తసై#్మ నమస్తేవ్య పదేశ్యరూపిణ. 2

జరాయుజం స్వేదజ మండజోద్బిదం చరాచరం దేవర్షిపితృ భూతమైంద్రియమ్‌ |

ద్యౌఃఖంక్షితిఃశైలసరిత్స ముద్రం ద్వీపగ్రహ ర్షేత్యభిదేయ ఏకః. 3

యస్మిన్న సంఖ్యేయ విశేషనామరూపాకృతౌ కవిభిః కల్పితేయమ్‌ |

సంఖ్యా యయా తత్త్వదృశాపనీయతే తసై#్మనమఃసాంఖ్యనిదర్శనాయతే. 4

ఏవం స్తువతి దేవేశమర్యమా సహ వర్షపైః | గీయతేచాపి భజతే సర్వభూతభవం ప్రభుమ్‌ 5

తతోత్తరేషు కురుషు భగవా న్యజ్ఞ పూరుషః | ఆదివారాహరూపోసౌ ధరణ్యా పూజ్యతే సదా 6

సంపూజ్య విధివద్దేవం తద్బక్తా೭೭ర్ద్రా೭೭ర్ద్రహృత్కజా | భూమిః స్తౌతి హరిం యజ్ఞవారాహందైత్యమర్దనమ్‌.

భూర్వక్తి : ఓం నమో భగవతే మంత్రతత్త్వలింగాయ యజ్ఞక్రతవే |

మహాధ్వరావయవాయ మహావరాహాయ నమః కర్మశుక్షాయ త్రియుగాయ నమస్తే. 8

యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణషుదారుష్వివజాత వేదసమ్‌ |

మథ్నంతి మథ్నా మనసా దిదృక్షవో గూఢం క్రియార్థైర్నమ ఈరితాత్మనే. 9

ద్రవ్యక్రియా హేత్వయనేశకర్తృభిర్మాయాగుణౖర్వ స్తు భిరీక్షితాత్మనే |

అన్వీక్షయాంగాతిశయాత్మ బుద్దిభిర్నిరస్తమాయాకృతయే నమోస్తుతే. 10

పదవ అధ్యాయము

భువన వ్యవస్థ

ఈనారాయణు డిట్లనెను: ఇంక హిరణ్మయవర్షమున యోగపతియగు కూర్మ భగవానుడు విరాజిల్లును. అతని నర్యముడీ విధముగ పూజించి సంస్తుతించును.

సర్వసత్త్వగుణ విశిష్టుడును గుర్తింపరాని జలనివాసము గలవాడును సుఖములు గురియువాడును సర్వగతుడును సర్వాధారుడునునగు భగవానునకు నమస్కారములు. ఈ దృశ్యమంతటిని తన మాయచేతసృజించినవాడు అనంతరూపుడు నిరూపించి లెక్కింపరాని యువతారములు గలవాడు నగు దేవునకు నమస్కారములు. ఈ యండ-పిండ-స్వేదజనులును ఉద్బిదములును దేవ-ఋషి-పితృ-భూతములును సకల చరాచరములును నింగి-దివి-భువి-గిరులు-వనులు-సత్తులు-సాగరములు-దీవులు-గ్రహతారకలును ఇంద్రియములు మున్నగునవన్నియును నీవే కదా! సాంఖ్యు లెవనియందు విశేషనామరూపములుగల యిరవదినాల్గు తత్త్వములుగలవనిరో తత్త్వదృష్టితో చూడ నెవనియం దిట్టి సంఖ్యకు తావులేదో యట్టి సాంఖ్య నిదర్శనుడగు వానికి చేయెత్తి మ్రొక్కుదును ఈ విధముగ నర్యము డా వర్షమందున్న భగవానుని సర్వభూతకారకుడగు ప్రభుని గానము చేయుచు సంస్తుతించును. ఆ వర్షమునకు నుత్తరమున నుత్తర కురుప్రదేశమున యజ్ఞపురుషుడగు నాది వరాహ భగవానుడు భూదేవిచేత నిత్యపూజలందుకొనును ఆ దైత్యమర్దనుడగు యజ్ఞవరాహమూర్తిని యథావిధిగ భక్తిరసార్దృ హృదయయై భూదేవి యిట్లు ప్రస్తుతించును. మంత్రతత్త్వమున నెఱుంగదగిన మహాయజ్ఞస్వరూపుడు యజ్ఞానుష్ఠానము చేయించువాడు యజ్ఞక్రతువు యుగత్రయరూపుడు శుభకరుడగు వరాహభగవానునకు నమస్కారము. రెండు కట్టెలను మథించుటవలన నగ్నిని బడయవచ్చును. అటులే రసహృదయులగు పండితులు గుణవివేకములను మథించి నిన్ను బబడయుదురు నీవు కర్మఫలములచే నెఱుగబడవు. నిన్ను గనగోరువారు జ్ఞానమున గందురు. అట్టి నీకు నమస్కారములు. ద్రవ్య-క్రియా-దేవతా-దేహ-కాలములు మున్నగు మాయావస్తు గుణములచేత తెలియబడు రూపము. గలవాడును యమనియమాదుల నాత్మవిచారణచేయు స్థిత ప్రజ్ఞులచే మాయారహితుడుగ తెలియబడువాడు నగు దేవునకు నమస్కారములు.

కరోతి విశ్వ స్థితి సంయమోదయం యస్యేప్సితంనేప్సితు మీక్షితుర్గుణౖః |

మాయా యథా7యో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణో నమస్తే గుణకర్మసాక్షిణ. 11

వ్రమథ్య దైత్యం ప్రతివారణం మృథేయోమాం రసాయా జగదా దిసూకరః |

కృత్వా7గ్రదంష్ట్రే నిరగాదుదన్వతః క్రీడన్నివేభః ప్రణతో7స్మితం విభుమ్‌. 12

కిం పురుషే వర్షే7స్మి-న్బగవంతం దాశరథించ సర్వేశమ్‌ | సీతారామం దేవం శ్రీహనుమానాది పూరుషంస్తౌతి.

హనుమానువాచ : ఓం నమోభగవతే ఉత్తమశ్లోకాయ నమ ఇతిః ఆర్యలక్షణ శీలవ్రతాయ నమః ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయనమః సాధువాదనికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహాభాగాయ నమఇతి యత్తద్విశుద్ధాను భావత్మమేకం స్వతేజసా ధ్వస్తగుణవ్యవస్థమ్‌ | 13

యత్తద్విశుద్ధాను భావత్మమేకం స్వతేజసా ధ్వస్తగుణవ్యవస్థమ్‌ |

ప్రత్యక్ప్రశాంతం సుధియోపలంభనం హ్యనామరూపంనిరహం ప్రపద్యే. 14

మర్త్యావతార స్త్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో |

కుతో7న్యథా స్యా ద్రమతః స్వ ఆత్మనః సీతా కృతాని వ్యసనానీశ్వరస్య. 15

నవైస ఆత్మా77త్మవతాం సుహృత్తమః సక్త స్త్రి లోక్యాంభగవాన్వాసుదేవః |

న స్త్రీకృతం కశ్మల మశ్నువీత న లక్ష్మణం చాపి విహాతు మర్హతి. 16

న జన్మ నూనం మహతో న సౌభగం న వాజ్న బుద్ధి ర్నాకృత స్తో షహేతుః |

తైర్య ద్విసృష్టా న పి నౌ వనోక స శ్చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః. 17

సురో7 సురో వా7ప్యథవా నరో7నరః సర్వాత్మనా యః సుకృతజ్ఞ ముత్తమమ్‌ |

భ##జేతరామం మనుజాకృతిం హరిం య ఉత్తరానన యత్కోసలా న్దివమ్‌. 18

నారాయణః : ఏవం కిం పురుషే వర్షే సత్యసంధం దృఢవ్రతమ్‌ |

రామం రాజీవపత్రాక్షం హనుమాన్వా నరోత్తమః. 19

స్తౌతి గాయతి భక్త్వా చ సపూజయతి సర్వశః | య ఏత చ్చృణుయా చ్చిత్రం రామచంద్రకథానకమ్‌. 20

సర్వపాపవిశుద్ధాత్మా యాతిరామసలోకతామ్‌ |

ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ అష్టమస్కంధే దశమో7ధ్యాయః.

ఇను మయస్కాంత సన్నిధిచే నాకర్షింపబడును. అట్లే యాత్మసన్నిధిచేత మాయ పరిభ్రమించును. ఈ మాయ సృష్టిస్థితిప్రళయములు గల్గించును. వీనియందు నీ కెట్టి కామమును లేదు. గుణకర్మలకు సాక్షిభూతుడవైన నీకు నమస్కారములు. తన్నెదుర్కొన్న దైత్యుని పోరాటమున దునుమాడి సాగరమందుండి నన్నుద్ధరించి తన కోరలపై నన్నొక యాటవస్తువుగ ధరింపగల్గిన యాదివరాహ విభునకు నమస్కారములు. కింపురుషవర్షమందు సర్వేశ్వరుడు ఆదిపురుషుడు దాశరథియగు సీతారాముని శ్రీహనుమానుడు నిరంతర మిట్లు సంస్తుతించును.

ఆర్య లక్షణములు శీలవ్రతములు గలవాడు నుత్తమశ్లోకుడు నిగృహీతాత్ముడు-సాధువాదదక్షుడు-బ్రహ్మణ్యదేవుడు-మహాపురుషుడు-మహాభాగ్యుడు-విశుద్ధానుభవముగలవాడు- తన మహాతేజముచే నితర గుణవ్యవస్థను తిరస్కరించు వాడును-మహాప్రశాంతుడు-స్థితప్రజ్ఞులచే తెలియబడువాడు-నామరూపాహంకారములు లేనివాడును-నగు శ్రీరామ ప్రభువును శరణు పొందుచున్నాను. నీ వీ మానవాకారము దాల్చుట మానవులకు మార్గము చూపుటకే కాని కేవలము రక్కసుల నుక్కడగించుటకు గాదు. అట్లు గాదేని యాత్మారాముడవైన నీకు సీతా కారణమున విరహబాధ గట్లుటేమి? స్త్రీసంగవిరహ బాధ సహింపరానిదని తెల్పుటకే నీ వట్లు చేసితివి గదా ! ఆ వాసుదేవ భగవానుడు జ్ఞానులపాలిటి సుహృత్తముడు. ముల్లోకము లందును దేనియందును నాసక్తిలేనివాడు. అతనికి స్త్రీ సంబంధమగు దోష మేమాత్రమంటలేదు. దుర్వాసుడు వచ్చినపుడు లక్ష్మణుడునిగూడ వదలిపెట్టడు. శ్రీరామచంద్రునకు కేవలము పరభక్తి-లోకారాధన ప్రియమైనది. అంతేకాని జనుల గొప్పలు సౌభాగ్యమువాక్చాతురి బుద్ధికుశలత అందము ప్రియములు గావు. శ్రీరాముడీ సుగుణములులేని కోతిమూకతో నెయ్యము నెఱపెను గదా ! అమరుడు-రాక్షసుడు-నరుడు-నారి యెవరైనను సర్వాత్మభావమున మానవాకృతి దాల్చిన సుకృతజ్ఞుడు మర్యాదా పురుషోత్తముడు నగు శ్రీరామభద్రుని గొల్చిన ముక్తి చెందును. రాము డుత్తర కోసలవాసుల నెల్లరను దివికి గొంపోవుటే నిదర్శనము. ఇట్లు కింపురుషవర్షమందు రాజీవలోచనుడు సత్యపరాక్రముడు దృఢసంకల్పుడు నగు శ్రీరాముని వానరోత్తముడగు హనుమంతుడు సన్నుతించును. గానము చేయును. పరభక్తితో నెల్లవిధముల బూజించును. ఇట్టి శ్రీరామచంద్రుని దివ్యచిత్ర కథామృతమును చెవులారగ గ్రోలవలయును. అట్టి రామభక్తులు పాపముక్తులై శుద్ధచిత్తులై శ్రీరఘునాథుని సాలోక్య మందగలరు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమునందు దశమాధ్యయము.

Sri Devi Bagavatham-2    Chapters