Sri Devi Bagavatham-2    Chapters   

అథ నవమోధ్యాయః.

శ్రీనారాయణః : హరి వర్షే చ భగవాన్నృహరిః పాపనాశనః | వర్తతే యోగయుక్తాత్మా భక్తానుగ్రహ కారకః. |

తస్య తద్దయితం రూపం మహాభాగవతో సురః | పశ్య న్బక్తి సమాయుక్తఃస్తౌతి తద్గుణతత్త్వవిత్‌. 2

ప్రహ్లాదః : ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్బవ వజ్రదంష్ట్ర కర్మాశయాన్‌

రంధయరంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయం మమాత్మని భూయిష్టాః. ||ఓంక్ష్రౌం||

స్వస్త్యస్తు విశ్వస్య ఖలః వ్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోధియా |

మనశ్చ భద్రం భజతా దధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ. 3

మా గారదా రాత్మజవిత్త బంధుషుసంగో యదిస్యా ద్బగవ త్ప్రియేషునః |

యః ప్రాణవృత్త్యా పరితుష్ట ఆత్మవా న్సిద్ద్యత్యదూరాన్న తథేంద్రియ ప్రియః. 4

యత్సంగలబ్దం నిజవీర్యవైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసమ్‌ |

హరత్యజోంతః శ్రుతిభిర్గతోగజం కోవైన సేవేత ముకుంద విక్రమమ్‌. 5

యస్యాస్తి భక్తి ర్బగవత్యకించనా సర్వైర్గణౖ స్తత్ర సమాసతే సురాః |

హరా వభక్తస్య కుతో మహద్గుణా మనోరథే నాసతి ధావతో బహిః. 6

హరిర్హి సాక్షాద్బగవాన్‌ శరీరిణా మాత్మా ఝుషాణా మివ తోయ మీప్సితమ్‌ |

హిత్వా మహాం స్తంయది సజ్జతేగృహే తదా మహత్త్వం వయసా దంపతీనామ్‌. 7

తస్మాద్రజోరాగ విషాద మన్యుమానస్పృహభయదైన్యాధి మూలమ్‌ |

హిత్వా గృహం సంసృతి చక్రవాలం నృసింహ పాదం భజతాం కుతో భయమ్‌. 8

ఏవం దైత్యపతిః సోపిభక్త్యానుదిన మీడతే | నృహరిం పాపమాతంగం హరిం హృత్పద్మవాసినమ్‌. 9

కేతుమాలే చ వర్షేహి భగవాన్‌ స్మరరూపధృక్‌ | ఆస్తే తద్వర్షనాథానాం పూజనీయ శ్చ సర్వదా. 10

ఏతేనోపాసతే స్తోత్రజాలేన చ రమాబ్దిజా | తద్వర్షనాధా సతతం మహతాం మానదాయికా. 11

రమోవాచ : ఓం హ్రీం హ్రీం హూంఓం నమోభగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషై ర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చ్చందో మయా యాన్మమయా

యామృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్‌.

స్త్రీయోవ్రత్తె స్త్వాం హృషీకేశ్వరం స్వతోహ్యోరాధ్య లోకే పతి మాశా సతేన్యమ్‌!

తాసాం నతేవై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయూంషి యతో స్వతంత్రాః. 12

తొమ్మిదవ అధ్యాయము

భువన వ్యవస్థ

శ్రీనారాయణు డిట్లనెను: ఇక హరివర్షమునందు యోగయుక్తుడు భక్తానుగ్రహకారకుడు పాపనాశనుడు నగు లక్ష్మీనరసింహ భగవానుడు నెలకొని యుండును. అచటి ఆ నరసింహస్వామి దివ్యరూపము సందర్శించి విష్ణుగుణతత్త్వ మెఱింగిన యసురుడగు ప్రహ్లాదభాగవతోత్తముడు భక్తితత్పరత నిట్లు సంస్తుతించును. ప్రహ్లాదు డిట్లనును : నరసింహ భగవానునకు నమస్కారము. తేజస్సునకును తేజస్సగు దేవునకు నమస్కారము. అతిప్రకటుడవు గమ్ము. ఓ వజ్రదంష్ట్రా! మా వాసనలు నిర్దహించుము. మాయజ్ఞానమును మ్రింగుము మ్రింగుము. నాయం దభయము నెలకొనుగాత: సర్వ విశ్వమునకు మేలగుత! దుష్టుడు శిష్టుడగు గాక ! ఎల్ల భూతములు సహయోగముతో శుభమును ధ్యానించు గాత ! మనస్సు భద్రము గోరుత ! అధోక్షజునందు నా నిర్హేతుకమైన మతి తగుల్కొనుతః నాకు భార్యా-గృహ-పుత్ర-ధన-బంధులందు సంగము లేకుండుత! ఏ ప్రొద్దును పరమ భాగవతోత్తముల సత్సాంగత్యము గల్గుత ! ఆత్మవంతుడు తన ప్రియ ప్రాణములను హరియందే నిల్పి యత్యానందమున రసమోదమొందును. ఇంద్రియ విషయలోలు డాత్మసుఖమునకు నోచుకొనడు. పుణ్యతీర్థములందు మాటిమాటికి గ్రుంకినచో నొడలి మురికిపోవును. హరిభక్తుల సత్సంగతియను దివ్యతీర్థసంగమున హరికీర్తనలు చెవులకు సోకినంతనే మనస్సులోని వాసనలనెడు మురికి తొలగును. అట్టి పుణ్యతీర్థుడగు హరి నెవడు సేవింపకుండును ! ఎవ్వానికి భగవానునందకించన (నిర్వ్యాజ) భక్తిపాదుకొనునో యట్టి మహనీయుని సురగణములును భుజించుచుండును. సువిమలతీర్థుడగు విష్ణునందు నిర్మలభక్తిలేనివానికి సుగుణములబ్బవు. అట్టివాడు బయటి విషయ మనో రథములను వెంటాడును. శ్రీహరియే సాక్షాత్తుగ భగవంతుడు. చేపలకు నీరువలె నారాయణుడెల్ల ప్రాణులకు జీవనాధారము-జగదీశుడు-ప్రభువు. అంతటి మహాత్ముని వదలి గృహములందు తగుల్కొన్న దంపతుల బ్రదుకు నిరర్థకము. కనుక రజో రాగములు-విషాద భయములు-కోపమానములు-దైన్యము-స్పృహ-మున్నగువానికి నెలవగు నీ సంసారచక్రవాళమగు నింటిని వదలి శ్రీనరహరి దేవపదనులు గొల్చువారికి భయమెక్కడిది? ఇట్లు ప్రహ్లాదుడు.

భక్తుడు పాపగజహరియును హృదయకమల విహారియునగు శ్రీహరిని పరమభక్తితో రేయింబవళ్ళు సంస్తుతించును. ఇంక కేతుమాలవర్షమున శ్రీహరి మన్మథరూపమున చెన్నొందుచుండును. అతడా వర్షమందలి భక్తులచేత నిత్య పూజలందుకొనును. కడలిరా పట్టియగు లక్ష్మీదేవి యచటి భక్తుల కోర్కులు దీర్చుచు శ్రీహరి నిట్లు సంస్తుతించుచు నుపాసించుచుండును.

(రమ యిట్లనును :) హృషీకేశ భగవానునకు-సుగుణ లక్షణలక్షితుడగు సర్వాత్మునకు క్రియాజ్ఞానసంకల్ప విశేష ణముల కధిపతికి -షోడశకళాత్మునకు-ఛందోమయునకు-అన్నమయునకు-అమృతమయునకు-సర్వమయున కోజోమయునకు-బలకాంతి కామయుతునకు-భగవానునకు నమస్కారములు. లోకమందు స్త్రీలు వ్రత నియమములతో విశ్వపతి హృషీకేశుడు నగు హరి నారాధించియు నితరుని గొలిచినచో నట్టి స్త్రీలను వారి భర్తలుగాని సంతతిగాని గాపాడజాలరు. ఏలన వారు ధన సంపాదనమున నాయువున స్వతంత్రత లేనివారు.

సవై పతిఃస్యా దకుతోభయఃస్వతఃసమంతతఃపాతిభయాతురంజనమ్‌ |

స ఏక ఏవేతరథామిథో భయం నైవాత్మలాభా దధిమన్యతే పరమ్‌. 13

యా తస్య తే పాదసరోరుహార్హణాం న కామయేత్సాఖిల కామలంపటా |

తదేవరాసీప్సితమీప్సితోర్చితో యద్బగ్నయాచ్నా భగవ న్ప్రతప్యతే. 14

మత్ప్రాప్తయే జే శసురా సురాదయస్త ప్యంత ఉగ్రం తప ఐంద్రియేధియః |

ఋతే భవత్పాద పరాయణాన్న మాం విందంత్యహం త్వద్దృదయా యతోజిత.15

సత్యం మమాప్యచ్యుత శీర్షవందితం కరాంబుజం యత్త్వద దాయి సాత్వతామ్‌ !

భిభర్షిమాం లక్ష్మ వరేణ్య మాయయాక ఈశ్వరస్యేహిత మూహి తుంవిభుః. 16

ఏవం కామం స్తువంత్యేవలోకబంధు స్వరూపిణి! ప్రజాపతిముఖా వర్షనాథాఃకామస్య సిద్ధయే. 17

రమ్యకే నామవర్షే చ మూర్తిం భగవతఃపరామ్‌! మాత్స్యాం దేవాసురైర్వంద్యాం మనుఃస్తౌతి నిరంతరమ్‌. 18

మనురువాచ: ఓం నమో ముఖ్యతమాయ నమఃసత్త్వాయ ప్రాణా¸° జసే బలాయ మహామత్స్యాయనమః. !

అంతర్బహి శ్చాఖిలలోకపాలకైరదృష్టరూసో విచరస్యురు స్వనః |

స ఈశ్వరస్త్వం య ఇదంవశేనయన్నామ్నా యథా దాత్రమయీం నరః స్త్రీయమ్‌. 19

యం లోకపాలాః కిల మత్సరజ్వరా హిత్వా యతంతోపి పృథక్‌ సమేత్యచ |

పాతుం నశేకుర్ద్విపద శ్చతుష్పదః సరీసృపంస్థాణు యదత్రదృశ్యతే. 20

భవాన్యుగాంతార్ణవ ఊర్మిమాలిని క్షోణీనిమా మోషది వీరుధాంనిధిమ్‌ |

మయా సహోరుక్రమ తేజ ఓజసా తసై#్మ జగత్ప్రాణ గణాత్మనేనమః. 21

ఏవం స్తౌతిచ దేవేశం మనుఃపార్థివ సత్తమః | మత్స్యావతారం దేవేశం సంశయచ్చేదకారణమ్‌. 22

ధ్యానయోగేన దేవస్య నిర్దూతాశేషకల్మషః | ఆస్తే పరిచర న్బక్త్యా మహాభాగవతోత్తమః. 23

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ అష్టమస్కంధే భువనకోశవర్ణనే నవమోధ్యాయః.

స్వయముగ భయము లేనివాడును ఇతరుల భయము బాపువాడును నిజమైన పతి యనబడును. భగవానుడొక్కడే నిజమైన పతి. ఇతరులు స్వార్థము తప్ప వేరు తలంపరు. స్త్రీలు నీ పాదకమలములను నిష్కామముగసేవింతురు. అంతే కానివారు విషయలంపటలే నిన్ను గొల్వరు. వారు ఫలమాశించి నిన్ను సేవించినచో ఫలబోగము తర్వాత భగ్నకాములై మరల బాధలు పడుదురు. నా దయకొఱకు బ్రహ్మ-శివుడు-సురాసురులు-విషయకామరతితో ఘోరముగతపింతురు. కాని అజితా! నేను నీహృదయకమలమందు నెలకొనియుండుటవలన నీ దివ్యపదపద్మ పరాయణులుగాని వారికి నేను లభింపను. ఓ యచ్యుతా ! సర్వపతీ! నీవు భక్తులచేత నుతింపబడి వరదాయకమగు నీకరకమలము వారికి చేయూతగా నందింతువు. అట్టిచేయి నాపై నుంచుము. నన్ను నీ వక్షఃస్థలమున ధరింతువు గదా ! ఈశ్వరుడవగు నీ మాయాచేష్టలెవడెఱుగ గలడు! ఇట్లు త్త్రైలోక్యకుటుంబినియగు లచ్చి వరేణ్యుడగు హరిని సంస్తుతి సేయుచుండును. అట్లే యావర్షమందలి వారును కోర్కులు తీరుటకు శ్రీహరిని సన్నుతిజేయుదురు.

ఇక రమ్యకవర్షమునందున్న మత్స్యమూర్తి దేవాసురులచేత పూజింపబడుచుండును. అచటి యర్చామూర్తిని మను వీరీతిగ నిరంతరను పూజించుచుండును.

విశ్వాగ్రణి-మహాసత్త్వడు-ఓజస్వి-మహోజ్జ్వలుడు-ప్రాణబలుడు-నగు మత్స్యభగవానునకు నమస్కారములు. ఏ దేవుడు లోన బయటనే లోకపాలురకు సైతము కానరాక మహావిక్రమముతో విహరించునో యట్టి యీశ్వరుడవు నీవు. నీ వీ విశ్వమును జంత్రగాని చేతి కీలుబొమ్మవలె నాడింతువు. లోకపాలు రహంకారరోగపీడితులై నిన్ను వదలినచో వారికి గతి లేదు. వారందఱొక్కటిగ కలిసియును ద్విపాత్‌-చతుష్పాత్తులను సరీసృపములను కనబడు స్థావర జంగమములనెల్లను రక్షింపజాలరు. యుగాంతమైనప్పు డువ్వెత్తుగలేచు సంద్రము కెరటాలపైని నీవు విహరింతువు. ఈ సకలౌషధులు తీగలు గల భూమిని నన్నును మహాపరాక్రమముతో దాల్చితివి. అంతటి విశ్వ ప్రాణాత్మకుడవగు నీకు నాప్రణామములు. ఈ విధ ముగ సంశయనివారకుడు దేవేశుడు మత్స్యావతారుడునగు శ్రీహరిని నరదేవుడగు మనువు సంస్తుతించును. ఈ ప్రకారముగమహాభాగవతోత్తముడగు మనువు శ్రీహరిధ్యానమున కల్మషములు పాసి పరమభక్తితో శ్రీపతిని సేవించుచు కాలము గడపుచుండును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున భువనకోశవర్ణనంబున నవమాధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters