Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచమోధ్యాయః

శ్రీ నారాయణః దేవర్షే శృణు విస్తారం ద్వీపవర్ష విభేదతః | భూమండలస్య సర్వస్య యధా దేవప్రకల్పితమ్‌. 1

సమాసా త్సంప్రవక్ష్యామి నాలం విస్తర్తః క్వచిత్‌ | జంబు ద్వీపః ప్రథమతః ప్రమాణ లక్షయోజనః. 2

విశాలో వర్తులాకారో యథాబ్జస్య చ కర్ణికా | నవ వర్షాణి యస్మింశ్చ నవసాహస్రయోజనైః. 3

ఆయామైః పరిసంఖ్యాని గిరిభిః పరితః శ్రితైః | అష్ఠభి ర్దీర్ఘరూపై శ్చ సువిభక్తాని సర్వతః. 4

ధనుర్వత్సంస్థితే జ్ఞేయే ద్వే వర్షే దక్షిణోత్తరే | దీర్ఘాణి తత్ర చత్వారి చతురశ్రమిలా వృతమ్‌. 5

ఇలావృతం మధ్యవర్షం యమ్మాభ్యాం సుప్రతిష్ఠితః | సౌవర్ణో గిరిరాజోయం లక్షయోజనముచ్ర్చితః. 6

కర్ణికారూప ఏవా యం భూగోలకమలస్య చ | మూర్ద్ని ద్వాత్రింశ త్సహస్రయోజనైర్వతత స్త్వయమ్‌. 7

మూలే షోడశసాహస్ర స్తావతాన్తర్గతః క్షితౌ | ఇలావృత స్యోత్తరతో నీలః శ్వేతశ్చశృంగవాన్‌. 8

త్రయో వైగిరియః ప్రోక్తా మర్యాదావధయ స్త్రీషు | రమ్యకా ఖ్యే తథా వర్షే ద్వితీయే చ హిరణ్మయే. 9

కురువర్షే తృతీయే మర్యాదాం వ్యజయంతి యే | ప్రాగాయతా ఉభయతః క్షారోదావధయస్తథా. 10

ఐదవ అధ్యాయము

భువన వ్యవస్థ

నారాయణు డిట్లనెను: ఓ నారదమునీ! దేవతలు నిర్ణయించిన ప్రకారము నీ మొత్తము భూమండలము వైశాల్యమును ద్వీప-దేశ-భేదములతో తెల్పుదును. వినుము. మిక్కిలి విపులముగ గాక సంక్షేపముగ జెప్పగలను. మొదటిది జం బూద్వీపము. దాని ప్రమాణము లక్ష యోజనములు. ఆది కమలమందలి మొగ్గవలె విశాలముగ గుండ్రముగ గలదు. అందు తొమ్మిదివేల యోజనములతో తొమ్మది దేశములు గలవు. అది తొమ్మదివేల యోజనముల వెడల్పుగల యెనిమిది పర్వతములతో పొడవుగ చుట్టుకొనబడియున్నది. రెండు దేశములు దక్షిణోత్తరములందు ధనురాకారముగనున్నవి. మఱి నాలుగు పొడవుగ నున్నవి. వీని మధ్య 'ఇలావృతము' గలదు. ఇలావృతము నడిబొడ్డువలె నడుమను గలదు. దీనియందు లక్ష యోజనముల యొత్తుగల సువర్ణ పర్వతము గలదు. ఈ భూగోళము కమలములోని మొగ్గవలె నున్నది. దీనిపై భాగము ముప్పదిరెండు వేల యోజనములు గలిగియున్నది. ఈ పర్వతమునకు క్రింది భాగము పదునారు వేల యోజనములవఱకు వ్యాపించినది. ఇలావృతమునకు నుత్తరమున నీలశ్వేతగిరులు పెద్ద శిఖరములతో నొప్పుచున్నవి. ఈ మూడు గిరులు తమ అవధులలో తాముండును. ఈ పర్వతములు రమ్యక-హిరణ్మయ దేశములందును. మూడవదగు కురువర్షమునందు తూర్పు నుండి క్షారసముద్రము వఱకును పొడవుగ వ్యాపించియున్నవి.

ద్విసహస్ర పృథుతరాస్తతో ఏకైకశః క్రమాత్‌ | పూర్వాత్పూర్వా చ్చోత్తరస్యాం దశాంశాదధికాంశతః. 11

ధైర్ఘ్య ఏవ హ్రసంతీమే నానానదనదీయుతాః | ఇలావృతాద్దక్షిణతో నిషధోహేమకూటకః. 12

త్రయో హిమాలయ శ్చేతి ప్రాగ్వి స్తీర్ణాః సుశోభనాః | ఈయుతోత్సేధ భాజస్తే యోజనైః పరికీర్తితాః 13

హరివర్షం కిం పురుషం భారతం చ యధాతధమ్‌ | విభాగాత్క థయంత్యేతే మర్యాదాగిరి యస్త్రయః. 14

ఇతావృతాత్పశ్చి మతో మాల్యవాన్మామ పర్వతః | పూర్వేణ చ తతః శ్రీ మాన్గంధమాదన పర్వతః. 15

ఈ నీలనిషదం త్వేతౌచాయతౌ ద్వి సహ స్రతః | యోజనైః పృథుతాం యాతౌ మర్యాదా కారకౌ గిరీ. 16

కేతుమాలాఖ్య భద్రాశ్వ వర్షయోః ప్రథితౌ చతౌ | మందరశ్చ తథామేరు మందరశ్చ సుపార్శ్వకః. 17

కుమునుదశ్చేతి విఖ్యాతా గిరయో మేరుపాదకాః | యోజనాయుత విస్తారో న్నా హా మేరో శ్చతుర్దిశమ్‌ 18

అవష్టంభ కరాస్తేతు సర్వతోభి విరాజితాః | ఏ తేఘ గిరిషు ప్రాప్తాః పాద పా శ్చూతంజబునీ. 19

కదంబ న్యగ్రోధ ఇతి చత్వారః పర్వతాస్థితాః | కేతవో గిరిగా జేషు ఏకాదశశతో చ్ఛ్రయాః. 20

ఇవి తూర్పనుండి యుత్తరమువఱకు రెండువేల యోజనముల పోడవున గలవు. ఇవి తూర్పనుండి యుత్తరమునకు దశాంశభాగము కన్న నెక్కువగ వ్యాపించియున్నవి. ఈ పర్వతముల నుండి యెన్నియో పెద్ద నదీనదము పుట్టుచున్నవి. ఇలా వృతమునకు దక్షిణమున హేమకూటము-నిషదము- హిమాలయము-నను మూడు గిరులు తూర్పుదెసకు చక్కగ వ్యాపించయున్నవి. ఈ గిరులు పదివేల యోజనముల యెత్తున తనరారుచున్నవి. ఈ మూడు పర్వతములును హరివర్షము-కింపురుషము-భారతవర్షము- నను మూడు దేశముల కెల్లలుగ నొప్పుచున్నవి. ఇలా వృతమునకు పడమట మాల్య వంతమును తూర్పున దంధమాదనము నను గిరులు రెండలరు చున్నవి. ఇవి నీల- నిషధగిరులవరకు రెండువేల యోజనముల మేరకు వ్యాపించియున్నవి. మఱి కేతుమాల భద్రాశ్వదేశములందు మందరము మేరు మందరము సుపార్శ్వము కుముధము నను పర్వతములు గలవు. ఇవి మేరు పాదములని ప్రసిద్ధగాంచినవి. ఆయుత యోజనముల ప్రమాణముననివి మేరువునకు నలుదెసల వ్యాపించియున్నవి. ఇవి మేరుగిరి నడ్డగించుచు దానికి నలువైపుల నొప్పుచున్నవి. ఈ గీరులపూ మామాడి-జామ-కడిమి-మఱ్ఱి-యను నాల్గువిధముల చెట్లుండును. ఇవి పదునొంకడు వందల యోజనముల యెత్తున గిరికి టెక్కెములవలె చక్కదనముతో నున్నవి.

తావద్విటవ విస్తారాః శతాఖ్య పరిణాహినః చత్వారశ్చ | హ్రదాస్తేషు పయోమధ్విక్షు సజ్జలాః. 21

యదుపస్పర్శినో దేవా యోగైశ్వర్యాణి విందతే | దేవోద్యానాని చత్వారి భవంతి లలనా సుఖాః. 22

నందనం చైత్రరధకం వైభ్రాజం సర్వభద్రకమ్‌ | యేషు స్థిత్వామరగణా లలనాయూథ. సంయుతాః. 23

ఉపదేవగణౖర్గీత మహిమానో మహాశయాః | విహరంతి స్వతంత్రాస్తే యథాకామం యథాసుఖమ్‌. 24

మందరోత్సంగ సంస్ధస్య దేవచూతస్య మస్తకాత్‌ | ఏకా ధశశతో చ్ర్చాయా త్పలన్యమృతభాంజి చ. 25

గిరికూట ప్రమానాని సుస్వాదూని మృదూని చ | తేషాం విశీర్యమాణానాం ఫలానాం సురసేన చ. 26

అరుణోదయవర్ణేన అరుణోదా ప్రవర్తతే | న దీరమ్యజలా దేవదైత్యరాజ ప్రపూజితా. 27

అరుణాఖ్యా మహారాజ వర్తతే పాపహారిణీ | పూజయంతి చ తాందేవీం సర్వకామఫల ప్రదామ్‌. 28

నానోపహారబలిభిః కల్మషఘ్న్య భయప్రదామ్‌ | తస్యాః కృపావలోకేన క్షేమారోగ్యం ప్రజంతి తే. 29

ఆద్యా మాయా తులానంతా పుష్టిరీశ్వరా మాలినీ | దుష్టనాశకరీ కాంతిదాయినీతి స్మృతా భువి. 30

అస్యాః పూజా ప్రభావేణా జాంబూనద ముదావహత్‌ |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణష్ట మస్కంధే భువనవర్ణనం నామ పంతమోధ్యాయః.

అ గిరిపై నంతియే సంఖ్యగల పెద్దచెట్లు గలవు. ఈ గిరులపై పాలు -పెరుగు- చెఱకు- నీటి సరస్సులు గలవు. వానిని తాకినంతనే దేవతలు యోగైశ్వర్యములు పొందుదురు. అందు స్త్రీలకు సుఖసంతోషములు గల్గించునట్టి నాల్గు దేవోద్యాన ములు గలవు. ఈ యుద్యానవనములకు నందనము -చైత్రరథము-వైభ్రాజము-సర్వభద్రకమును పేర్లు గలవు. అం దమరులు దేవాంగనలంగూడి యుందురు. వారుపదేవగణములకు తన గొప్పలు చెప్పుకొనుచు కోరిక తీరికలెత్తయథేచ్చగసై#్వరవిహారము చేతురు. ఆ మందరగిరిపై పదునొకండు వందల యోజనముల యెత్తున మామిడిచెట్లు గలవు. వానినుండి ఫలములమృతరసభరితములై క్రిందపడుచుండును. గిరిశిఖరమంత ప్రమాణము గల్గి తీయతీయగ మెత్తగ నున్న మామిడిపండ్ల నుండి మధురరసము జారును. ఈ రస మెఱ్ఱగ నుంట నట ''నరుణోద'' యనుబడు మంచి నది ప్రహించుచున్నది. ఆది దేవదానవులచేత పూజింపబడును. ఓ రాజా! అచ్చోట ''అరుణాఖ్య''యను దేవి పాపహారిణియైయెల్ల కోర్కెలు దీర్చుచుండును. పూజ లందుకొనుచుండును. అట్టి పాపాలను బాపి యభయ మొసగు తల్లికి పెక్కుకానుకలు బలులు నిత్తురు. అమె దయగల తల్లియగుటవలననే ప్రజలు క్షేమారోగ్యము లందుదురు. అమె ''అదిమాయ-అనంత-అతుల-పుష్టి-ఈశ్వరమాలిని- కాంతిదాయిని-దుష్టవినాశకారిణి- యని ధరపై ప్రసిద్దివహించినది. ఈ దేవిని పూజించుటతే నామె దయా ప్రభావమున వట జంబూనది ప్రవహించుచుండును.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున భువనలోక వర్ణనమను పంచమాధ్యాయము.

పంచమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters