Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్ధోధ్యాయః

నారాయణ ఉవాచ: మనోః స్వాయం భువస్యాసీ జ్జ్యేష్ఠః పుత్రః ప్రియవ్రతః | ప్రజాపతే ర్దుహితరం సురూపాం విశ్వకర్మణః 1

ప్రజాపతే ర్దుహితరం సురూపాం విశ్వకర్మణః | బర్హిష్మతీం చోపయేమే సమానాం శిల కర్మభిః. 2

తస్యాం పుత్రాన్ధశ గుణౖరన్వితా న్బావితాత్మనః | జనయామాస కన్యాం చోర్జస్వతీం చ యవీయసీమ్‌. 3

అగ్నీధ్రశ్చేధ్మ జిహ్వశ్చ యజ్ఞ బాహూ స్తృతీయకః | మహా వీరశ్చ తుర్థ స్తు పంచమో రుక్మశుక్రకః. 4

ఘృతపృష్ఠశ్చ సవనో మేథాతిథిరథాష్టమః | వీతిహోత్రః కవిశ్చేతి దశైతే వహ్నీ నామకాః. 5

ఏతేషాం దశపుత్రాణాం త్రయోప్యాసన్విరాగిణః | కవిశ్చ సవనశ్చైవ మహావీర ఇతి త్రయః. 6

ఆత్మవిద్యా పరిష్ణాతాః సర్వేతే హూర్ద్వ రేతసః | ఆశ్రమే పరహం సా ఖ్యే నిఃస్పృహా హ్యభవన్ముదా. 7

ఆపరస్యాం చ జాయాయాం త్రయః పుత్రాశ్చ జిజ్ఞిరే | ఉత్తమస్తామసశ్చైవ రైవతశ్చేతి విశ్రుతాః. 8

మన్వంతరాధిపతయ ఏతే పుత్త్రేమహౌ జనః | ప్రియవ్రతః స రాజేంద్రో బుభుజే జగతీమిమామ్‌. 9

ఏకాదశార్బుదాబ్దానామ వ్యాహత బలేంద్రియః | య దా సూర్యఃపృథివ్యాశ్చ విభాగే ప్రథమేతపత్‌. 10

భాగే ద్వీతీయోతత్రాసీ దంధకారోదయః కిల| ఏవం వ్యతికరం రాజా విలోక్య మనసా చిరమ్‌. 11

ప్రశాస్తిమయ భూమ్యాం చ తమః ప్రాదుర్బ వేత్కథమ్‌ | ఏతన్‌ నివారయిష్యామి భూమౌ యోగబలేన చ. 12

ఏవం వ్యవసితో రాజా పుత్రః స్వాయంభువస్య సః | రథేనా దిత్య వర్ణేన సప్తకృత్వః ప్రకాశయన్‌. 13

తస్యాపి గచ్చతో రాజ్ఞో భూమౌయద్రథనేమయః | పాతితాస్తే సముఖ్ర్యాం భేజిరే లోక హేతవే. 14

చతుర్ధాధ్యాయము

ద్వీపవర్ష సముద్రాది వర్ణనము

నారాయణుడిట్లనెను: స్వాయంభువ మనువు పెద్దకొడుకు ప్రియవ్రతుడు; పితృసేవాపరుడు; నిత్య-సత్య-ధర్మపరాయణుడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కన్యను - బర్హిష్మతి యను సమాన-శీల- వయో- రూపములు గల యందాలరాశిని-చేపట్టెను. ప్రియవ్రతుడు మహాత్ముడామె యందు గుణవంతులగు పదిమంది పుత్రులను ఊర్జస్వతియను కన్నియను గనెను. మొదటివాడు అగ్నీధ్రుడు; రెండవవాడు ఇధ్మజిహ్వుడు; మూడవవాడు యజ్ఞబాహుడు; నాల్గవవాడు - మహావీరుడు; ఐదవ రుక్మశుక్రుడు; ఆరవవాడు ఘృతపృష్ఠుడు; ఎనిమిదవవాడు మేధాతిథి; తొమ్మిదవవాడు వీతిహోత్రుడు; పదవవాడు కవి; ఈపదిమందియు వహ్నినామము గలవారు. ఈ పదిమంది పుత్రులలో కవిసవనుడు మహావీరుడను మువ్వురును విరాగులైరి. వీరు ఆత్మ విద్యా నిష్ణాతులై-ఊర్ద్వ రేతస్కులై వీతరాగులై-పరమహంసాశ్రమంమందానందమున నుండిరి. ప్రియవ్రతునకు వేరొక భార్యయందు 'ఉత్తమ-తామస-రైవతు'లను మువ్వురు ప్రసిద్ద పుత్రు లుద్బవించిరి. వీరు మన్వంతరముల కధిపతులై ప్రసిద్ధి గాంచిరి. వీరు మహావిక్రమవంతులు. ఇట్లు ప్రియవ్రత మహారాజీ భూమి నేలెను. ప్రియవ్రతుడు మొక్కవోని యింద్రియ పటుత్వముతో పదునొకండరర్బుదముల యేండ్లు పరిపాలించెను. సూర్యుడీ భూమిపైనెప్పుడును అర్ధభాముననే వెల్గును. భూమి రెండవ భాగమున కాఱు చీకట్లలముకొనును. ఇట్టి వైపరీత్యము తన యేలుబడిలో నుండుట రాజు మదికి బాధ గలిగించెను. నేనీ సమస్త భూమండలమును నిరాటంకముగ నేలుచుండగ నీ చీకటి యలముటేమి? నీ యోగబలముతో భూమిపై చీకటి తొలగింపగలను. అని స్వాయంభువ పుత్త్రుడు నిశ్చయించుకొని సూర్యప్రభలు చిందించు రథము నిర్మింపజేసి యేడు మారులు భూమిని ప్రదక్షిణించెను. అతని రథము సాగుచుండగ నేమి రేఖలచే భూమిపై నేడు గుర్తలు పడి యవిలోకమున సప్తసముద్రములుగ ప్రసిద్ధిగాంచెను.

జాతాః ప్రదేశాస్తే సప్తద్వీపా భూమౌ విభాగశః | రథనేమి సముత్థాస్తే పరిఖాః సప్తసింధవః 15

యత ఆసంస్తతః సప్త భువో ద్వీపా హితే స్మృతాః | జంబుద్వీపః ప్లక్షద్వీపః శీల్మలీ ద్వీప సంజ్ఞకః. 16

కుశద్వీపః క్రౌంచద్వీపః శాకద్వీపశ్చ పుష్కరః | తేషాం చ పరిమాణం తు ద్విగుణం చోత్తరోత్తరమ్‌. 17

సమంతతశ్చో పక్లప్తం బహిర్బాగక్రమేణ చ | క్షారోదేక్షురసోదౌ చ సురోదశ్చ ఘృతోదకః. 18

క్షిరోదో దధిమం డోదః శుద్ధోదశ్చేతితే స్మృతాః | సప్తేతే ప్రతివిఖ్యాతాః పిధివ్యాం సింధవస్తదా. 19

ప్రథమో జంబుద్వీపాఖ్యోయః క్షారోదేన వేష్టితః | తత్పతిం విదధే రాజా పుత్రమాగ్నీ ధ్రసంజ్ఞకమ్‌. 20

ప్లక్షద్వీపే ద్వితేయే స్మిన్ద్వీపేక్షురస సంప్లు తే | జాతస్త దధీపః పై#్రయ వ్రత ఇధ్మాదిజిహ్వాకః. 21

శాల్మలీద్వీప ఏతస్మిన్సురోదధి పరిప్లుతే | యజ్ఞ బాహుం తదధిపం కరోతిస్మ ప్రియవ్రతః. 22

కుశద్వీపేతి రమ్యే చ ఘృతోదేనోపవేష్టితే | హిరణ్యరేతా రాజాభూత్ర్పియవ్రత తనూజనిః. 23

క్రౌంచద్వీపే పంచమే తు క్షీరోద పరిసంప్లుతే | పై#్రయవ్రతో ఘృతపృష్ణః పతిరాసీ న్మహాబలః. 24

శాకద్వీపే చారుతరే దధిమండో దసంకులే | మేధాతిథిరభూద్రాజా ప్రియవ్రతసుతో వరః. 25

పుష్కరద్వీపకే శుద్దోదక సింధుసమాకులే | వీతిహోత్రో బభూవాసౌ రాజా జనక సమ్మతః. 26

కన్యా మూర్జస్వతీ నామ్నీం దదావుశనసే విభుః | అసీ త్తస్యాం దేవయాని కన్యా కావ్యస్య విశ్రుతా. 27

ఏవం విభజ్య పుత్రేభ్యః సప్తద్వీపా న్ప్రియవ్రతః | వివేకవశగో భూత్వా యోగమార్గా శ్రితోభవత్‌. 28

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ ష్టమస్కంధే భువనకోశే చతుర్థోధ్యాయః.

భూమిపై గుర్తులు పడని భాగములు ద్వీపములుగ పేర్కొనబడెను. ఆ రథపు చక్రపుంటచుల గుర్తులు గల భాషములు పెద్దయగడ్తలై యేడు సంద్రములుగమారెను. వాని మధ్యభూమి యేడు దీవులుగ నయ్యెను. అవి జంభూద్వీపము ప్లక్ష ద్వీపము-శాల్మలీ ద్వీపము-కుశద్వీపము - క్రౌంచద్వీపము శాకద్వీపము పుష్కరద్వీపము; వాని పరిమాణము లుత్తరోత్తములుగ రెండింతులుగ నుండును. వీనికి నలు వైపుల బైట క్రమముగ క్షార-ఇక్షు-సురా-ఘృత క్షీర దధిజలసముద్రములు గలవు. ఈ నేలపై నీ యేడు సముద్రములును ప్రసిద్ధి గాంచినవి. మొదటిదగు జంబూద్వీపము మొదటిదగు క్షారసముద్రముచే చుట్టబడియున్నది. ప్రియవ్రతుడు దానికాగ్నీధ్రుని రాజుగతేసెను. ప్లక్షద్వీపముచుట్టును చెఱకు సంద్రము గలదు. ప్లక్ష ద్వీపమువన కిధ్మజిహ్వు డధిపతిగ చేయబడెను. యజ్ఞబాహుడు సురాసంద్రముచే చుట్టబడిన శాల్మలి దీవికి నాయకుడయ్యెను. రమ్యమగు కుశద్వీపము చుట్టు నేతి సంద్రము గలదు. ఈ దీవిని ప్రియవ్రతపుత్రుడుగు హిరణ్యరేతుడేలెను. ఐదవవాడగు ఘృతపృష్ఠుడు మహాబలశాలి. ఈ ప్రియవ్రత తనయుడు పాలసంద్రముచే చుట్టబడిన క్రౌంచ ద్వీపమునకు రాజుగ చేయబడెను. పెరుగు సంద్రముచేత చుట్టబడిన యందమైన శాకద్వీపమునకు ప్రియవ్రతసుతుడగు మేధాతిథి ధరానాధుడయ్యెను. వీతిహోత్రుడు మంచినీటి సంద్రముచే చుట్టబడిన పుష్కర ద్వీపమునకు తండ్రిసమ్మతితో రాజయ్యెను. ప్రియవ్రతుడు తనయూర్జస్వతి యను కన్యను శుక్రున కీయగ వారికి పేరు గాంచిన దేవయాని యను కన్య జనించెను. ఈ విధముగ ప్రియవ్రతుడు సప్త ద్వీపములను తన కొడుకులకు పంచిపెట్టి యాత్మ వివేకవంతుడై జ్ఞానము బడయుటకు యోగమార్గవలబించెను.

ఇతి శ్రీదేవి భాగవత మహపురాణమందలి భువనకోశమందు నాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters