Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తవిశోధ్యాయః.

సూతః : తతః: కృత్వా చితాం రాజా ఆరోప్య తనయం స్వకమ్‌ | భార్యయా సహితో రాజా బద్ధాంఒజలిపుట స్తదా. 1

చింతయ న్పరశానీం శతాక్షీం జగదీశ్వరప్‌ | పంచకోశాంతరగతాం పుచ్ఛబ్రహ్మ సరూపిణీమ్‌. 2

రక్తాంబర పరీధానాం కరుణారససాగరామ్‌ | నానాయుధధరా మంబాం జగత్పాలనతత్పరామ్‌. 3

తస్య చింతయమానస్య సర్వే దేవాః సవాసవాః ధర్మం ప్రముఖతః కృత్వా సమాజగ్ముస్త్వ రాన్వీతాః. 4

ఆగత్య సర్వే ప్రోచుస్తే రాజన్‌ శృణు మహాప్రభో | అహం పితామహః సాక్షా ద్ధర్మశ్చ భగవాన్స్వయమ్‌. 5

సాధ్యాః సవిశ్వే మరుతో లోకపాలాః సచారణాః | నాగాః సిద్ధాః సగంధారా రుద్రాశ్చైవ తధాశ్వినౌ. 6

ఏతే చాన్యేథ బహవో విశ్వామిత్ర స్తథైవచ | విశ్వమిత్రయేణ యో మైత్రీం కర్తుమిచ్ఛతి ధర్మతః. 7

విశ్వామిత్రః సతేభీష్టమాహర్తుణ సమ్యగిచ్ఛతి | ధర్మంః: మారాజన్సాహసం కార్షీర్ధర్మోహం త్వాముపాగతః. 8

తీతీక్షాగమ సత్త్వాద్యై స్త ద్గుణౖ ః పరీతోషీతః ఇంద్రః హరిశ్చంద్ర మహాభాగప్రాప్తః శక్రోస్మితేంతికమ్‌. 9

త్వయాద్య (స) భార్యపుత్రేణ జితాలోకాస్సనాతనాః | ఆరోహ త్రిదివం రాజ న్బార్యా పుత్ర సమన్వితః. 10

సుదుష్రా పం నరైరన్యైర్జిత మాత్మీయ కర్మభిః | సూతః: తతోమృతమయం వర్ష మపమృత్యువినాశనమ్‌. 11

ఇంద్రః ప్రాసృజదాకాశాచ్చి దతామధ్య గతే శిశౌ | పుష్పవృష్టిశ్చ మహతీ దుందుభిస్వన ఏవ చ. 12

సముతస్ధౌ మృతః పుత్రో రాజ్ఞ స్తస్యమహాత్మనః | సుకుమారతనుః స్వస్ధః ప్రసన్నః ప్రీతమానసః. 13

తతో రాజా హరిశ్చంద్రః పరిష్వజ్య సుతం తదా | స్వభార్యః స్వశ్రియా యుక్తో దివ్యమాల్యాంబరావృతః. 14

ఇరువదిఏడవ అధ్యాయయము-హరిశ్చంద్రోపాఖ్యానము

సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు నుంచి తన భార్యతోకూడ తాను దోయిలించి విసుచుండెను. అతడు పరమేశాని!ః శతాక్షి-త్రిభువనేశ్వరి-పంచకోశాంతరస్ధిత-మూలాధారనిలయ-బ్రహ్మస్వరూపిణి- రక్తాంబరధర-దయారససాగర-నానాయుధధర-జగత్పాలన తత్పర-జగదంబ-అగు దేవిని హృదయమున సంస్మరింపగ ధర్మ దేవతను మున్నిడుకొని యింద్రాది దేనతలు నచ్చోటి కరుగదేంచిరు. వారు వచ్చి ధర్మదేవత నోటితో రాజుతో నిట్లనిరి: ఓ మహాప్రభూ: రాజా! అవధరింపుము. నేను (ధర్మదేవుడు) బ్రహ్మా-నారాయణుడు-సిద్ధసాద్యులు-గంధర్వులు-విశ్వే దేవతాలు-మరుద్గణము-చారణులు-లోకపాలకులు-నాగులు-రుద్రులశ్వినులు-ఇంకనుతక్కిన దేవతలును విశ్వామిత్రుడు-ముల్లోకములకు ధర్మానుసారము మేలుగోరువాడును విశ్వామిత్రుడును అందరమును నీకు మేలు చేయగోరి వచ్చియున్నాము. అంత ధర్మదేవత యిట్లనెను: రాజా! ఇక దుస్సాహసము వలదు. నేను ధర్మదేవతను. నీ చెంత కేగుదెంచితిని. నీ యింతటి దమము-ఓరిమి-సత్వము మున్నగు సుగుణములకు సుప్రసన్నుడనైతిని. ఇంద్రుడిట్లనెను: ఓ హరిశ్చంద్ర మహాశయా! నీ నింద్రుడను. నీ సమీపమునకు వచ్చితిని. నీవు నీ భార్యపుత్రులతో గలిసి సనాతన లోకములు గెల్చితివి. రాజా! నీ విక నీ భార్యాపుత్రులనుగూడి స్వర్గ మలకరింపుము. ఇతరుల కలవిగాని స్వర్గసీమ నీ సత్యకర్మలవలన బజసితివి. సూతుడిట్లనియెను: పిదప నపమృత్యువును తొలగించు సమృతవర్షము గురిసెను. ఇంద్రుడమృతవృష్టి నాకాశమునుండి చితిమీది శిశువుపై గురిసెను. అంతలో పూలజల్లుట గురిసెను. దేవదుందుభులు మ్రోగెను. పిదప హరిశ్చంద్రుని చచ్చిన బాలుడు లేచి వెనుకటి మాదిరిగ సుకుమారుడుగ-ప్రసన్నుడుగ-ఆరోగ్యవంతుడుగ-ప్రేమమూర్తిగ నొప్పెసగెను. హరిశ్చంద్ర రాజంత తన కొడుకును కౌగిలించుకొనెను. అతడు తన భార్యాపుత్రులతో సంపదలతోగూడి దివ్యమాల్యాంబరములు దాల్చెను.

స్వస్ధః సంపూర్ణ హృదయో ముదా పరమయావృతః | బభూవ | తత్‌క్షణా దింద్రో భూపం చై వమభాషత. 15

సభార్యస్త్వం సపుత్రశ్చ స్వర్లోకం సద్గతిం పరామ్‌ | సమారోహ మహాభాగ నిజానాం కర్మణాం ఫలమ్‌. 16

హరిశ్చంద్రః: దేవరాజా ననుజ్ఞాతః స్వామినా శ్వపచేనహి | అకృత్వానిష్కృతిం తస్యనారోక్ష్యేవైసురాలయమ్‌. 17

ధర్మః: తవైవం భావిసం క్లేశమనగమ్యా೭೭త్మ మాయయా | ఆత్మాశ్వవచతాం నీతోదర్శితం తచ్చపక్కణమ్‌. 18

ఇంద్రః: ప్రార్ధ్యతే యత్పరం స్ధానం సమసై#్తర్మను జైర్బు వి | తాదారోహహరిశ్చంద్ర! స్ధానం పుణ్యకృతాంనృణామ్‌. 19

హరిశ్చంద్రః! దేవరాజ సమస్తుభ్యం వెక్యం చేదం నిబోధమే | మచ్చోకమగ్నమనసః కోసలే నగరే నరాః. 20

తిష్ఠంతి తా నపాసై#్యపం కథం యాస్యామ్యహందివమ్‌ | బ్రహ్మహత్యా సురాపానం గోవధః స్త్రీవధ స్తథా. 21

తుల్య మేభి ర్మహత్పాపం భక్తత్యాగాదుదాహృతమ్‌ | భజంతం భక్త మత్యాజ్యం త్యజతః స్యాత్కథం సుఖమ్‌. 22

తైర్వినా స ప్రయాస్యామి తస్మాచ్ఛక్రః దివం ప్రజ | యది తే నహితాః స్వర్గం మయా యాంతి సురేశ్వర. 23

తతోహమపి యాస్యామి నరకం వాపి తైః సహ | ఇంద్ర బహూని పుణ్యపాపాని తేషాం భిన్నానివైనృప. 24

కదం సంఘాతభోజ్యం త్వంభూప! స్వర్గమభీప్ససి | హరిశ్చంద్రః: భుంక్తే శక్ర నృపో రాజ్యం భావాత్ర్ప కృతే ర్ధ్రువమ్‌. 25

యజతే తమ మయజ్ఞైః కర్మపూర్తం కరోతి చ | తచ్చ తేషాం ప్రభావేణ మయా సర్వ మనుష్ఠితమ్‌. 26

ఉపదానా న్న సంత్యక్ష్యే తానహం నవర్గలిప్సయా | తస్మాద్య న్మమ దేవేశః కించిదస్తి సుచేష్టతమ్‌. 27

దత్త మిష్ట మధో జప్తం సామాన్యం తై స్తదస్తు నః | బహూకాలోపభోజ్యం చ ఫలం యన్మమ కర్మగమ్‌. 28

ప్రమోదభరితుడై నిశ్చింతుడై యుండెను. వెంటనే ఇంద్రుడు రాజుతో నిట్లు పలికెను. ఓ మహాత్మా! నీవు నీ పుణ్య సత్కర్మముల ఫలితముగ భార్యాపుత్రులతో సుఖదామమగు స్వర్గసీమ కరుగుదెమ్ము. హరిశ్చంద్రు డిట్లనెను: ఓ దేవ రాజా! నా చంణడాలస్వామి యనుమతిబడయక యతని యప్పు తీర్చక నేను స్వర్గమునకు రాజాలను, ఘర్ము డిట్లనెను: నీకు రాబోవు కష్టములు నేను ముందుగ తెలిసికొని నామాయతో నేను చండాలరూపమున నీ కీ పక్కణమును చూపితిని. ఇంద్రు డిట్లనెను: రాజా! ఏ పరమస్ధానమును భూమిమీది ప్రజలు గోరుకొందురో యట్టి పుణ్యపురుషులకు నిలయమగు స్వర్గధామమును బొందుము. హరిశ్చంద్రు డిట్టనెను: ఓ దేవరాజా! నీకు నమస్కారము. నా మాటయును కొంచెము వినుము. కోసలనగర ప్రజలు నా వియోగ దుఃఖమున నమునిగియున్నారు. అట్టివారివి విడనాడిన నేనెట్టుల స్వర్గమునకు రాగలను? బ్రహ్మాహత్య-సురా పానము-గోవధ-స్త్రీవధ-ఇవన్నియును తన్ను గొల్చు భక్తుని విడనాడికత వాని పాపమునకు సమాన మగును. కనుక తన్ను నమ్మి కొల్చువానిని విడువరాదు. వదలినవానికి సుఖ మెక్కడిది? నా ప్రజలు రాక నేను కలదనునింద్రా! నీ స్వర్గమునకు నీవే వెళ్ళుము. సురనరా! నేను స్వర్గములకు వెళ్ళినను మఱినరక మేగినను వారితోడనే వెళ్లగలను. ఇంద్రు డిట్ల నెను: ''రాజా! ఒక్కొక్కకని పుణ్యముపాపములు పెక్కురీతులుగ వేర్వేరుగ నుండును. అట్టి వారందఱితో నొక్కుమ్మడిగ నీవు స్వర్గసుఖ మెట్ల గోరుచున్నావు?'' హరిశ్చంద్రు డిట్లనెను: ఇంద్రా! రాజు తన ప్రజల బలముచేతనే రాజ్య మనుభవించును. రాజు వారి మూలముననే మహాయజ్ఞములు చేయును. వారీకూపములు నిర్మించును. నేను నా ప్రజల మూలముననేయన్ని మునుష్ఠించితిని. వారంనఱన వదలి నే నొక్కడనే స్వర్గ మేగవలయుదని నే నుపదానాల నీయలేదు. దేవేశ్వరా! కనుక నే నేదైన పున్నెము చేసినచో జన్న మొనరించినచో జపము చేసినచో నా కర్మఫలము పెక్కేండ్లను భవింపనలసియున్నచో-

తదస్తు దిన మప్యేకం తైఃసమం త్వత్ప్రసాదతః | సూతః ఏవం భవిష్యతీత్యుక్త్వాశక్ర స్త్రి భువనేశ్వ వరః. 29

ప్రసన్నచేతా ధర్మశ్చ విశ్వామిత్రశ్చ గాధిజః | గత్వా తు నగరం సర్వే చాతుర్వర్ణ్వ సమాకులమ్‌. 30

హరిశ్చంద్రస్య నికటే ప్రోవాచా విబుధాధిపః | ఆగచ్ఛంతు జానాః శీఘ్రం స్వర్గలోకం సుదుర్లభమ్‌. 31

ధర్మప్రసాదా త్సం ప్రాప్తం సర్వైర్యుష్మాభిరేవతు | హరిశ్చంద్రోపి తాన్సర్వాన్‌ జనాన్నగరవాసినః. 32

ప్రాప్య రాజా ధర్మపరో దివమారుహ్యాతా మితి | సూతః: తదింద్రస్య వచః శ్రుత్వా ప్రీతా స్తస్య చ భూపతేః. 33

యే సంసారేఘ నిర్విణ్ణాస్తే ధురం స్వసుతేఘ వై | కృత్వా ప్రహృష్టమనసో దివమారురుహుర్జనాః. 34

విమానవరమారుఢాః సర్వే భాస్వరవిగ్రహాః | తదా సంభూతహర్షాస్తే హరిశ్చంద్రశ్చ పార్ధివః. 35

రాజ్యేభిషిచ్య తనయం రోహితాఖ్యం మహామనాః. | అయోధ్యాఖ్యే పురే రమ్యే హృష్టపుష్టజనా న్వితే. 36

తనయం సుహృదశ్చాపి ప్రతిపూజ్యాభినంద్య చ | పుణ్యన లభ్యాం విపులాం దేవాదీనాం సుదుర్లభామ్‌. 37

సంప్రాప్య కీర్తి మతులాం విమానే స మహీపతిః | ఆసాం చక్రే కామగమే గ్రఘంటావిరాజితే. 38

తతస్తర్హి సమాలోక్య శ్లోకమంత్ర తగా జగౌ | దైత్యాచాం మహాభాగః సర్వశాస్త్రర్ధ త్త్వ విత్‌. 39

శుక్రః: ఆహో తితిక్షా మహాత్మ్య మహోదాన ఫలం మహాత్‌ | యదాగతోహరిశ్చంద్రో మహేంద్రోమహేంద్రస్యసలోకతామ్‌. 40

సూతః: ఏత్తతే మాఖ్యాతం హరిశ్చంద్రస్య చేష్టితమ్‌ | యః శృణోతి చ దుఃఖార్తః స సుఖం లభ##తేన్వహమ్‌. 41

స్వర్గార్దీ ప్రాప్నుయాత్స్వర్గం సుతార్ధీ సుతమాప్పుయాత్‌ | భార్యార్ధీ ప్రాప్నుయా ద్చార్యాం రాజ్యర్థీ రాజ్య మాప్నుయాత్‌. 42

ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ సప్తమస్తంధే హరిశ్చంద్రోపాఖ్యానే సప్తవింశోధ్యాయః.

అదంతయును నా ప్రజలనుగూడి యొక్కనా డనుభవించిన నా కంతయు చాలును. సూతు డిట్లనెను: సరే అట్లే కానిమ్మని త్రిలోకపతి యనెను. పిమ్మట ధర్మదేవత-ఇంద్రుడు-కౌశికుడు-నెల్లరును ప్రసన్న మనస్సులతో నాల్గు వర్ణముల ప్రజలు వసించు కోసలపురి కరిగిరి. అపుడు దేవేంద్రు డిట్లనెను: ఓ మహాజనులారా! మీ రిపుడు దుర్లభ##మైన స్వర్గలోకమునకు వెళ్ళుటకు హరిశ్చంద్రుని సమీపమునకు రండు. హరిశ్చంద్రుడు తన ధర్మబలముతో స్వర్గమును జయించెను. అనగా వారు రాజును చేరిరి. హరిశ్చంద్రు వారిని చూచెను. మీరు నా వెంట స్వర్గమునకు రండని రాజనెను. ప్రజలు దేవేంద్రుని వాక్కులు రాజు వాక్కులు విని ప్రమోద మందిరి. వారిలో సంసారముమీద విరక్తి జెందిన కొందఱు తమ సుతులపై కుటుంబభారముంచి స్వర్గ మేగిరి. వారు పరమానందముతో జ్యోతిర్మయులై దివ్యవిమాన మెక్కిరి. అపుడు హరిశ్చంద్ర రాజు తన రోహిత కుమారునకు రాజ్యాభిషేకముచేసి పెద్దలుగల రమ్యమగు నయోధ్యాపుర మతని కప్పగించెను. పిదప రాజు తన కుమారు నభినందించి మిత్రులను గౌరవించి పుణ్యభాగ్యము దేవ దుర్లభ##మైన కీర్తి బడసెను. అట్లు కీరితిబడసి రాజు కింకిణీరవమున చెన్నారి కామమగమనముగల దేవవిమాన మలంకరించెను. ఆ సమయమునందు సకల శాస్త్రార్ధ తత్త్వ విదుడు-మహాత్ముడు- దైత్యాచార్యుడు-నగు శుక్రుడు రాజునుగాంచి యిట్ల పొగడెను. శుక్రు డిట్లనెను: ఓహో! ఓరిమియొక్క మహత్తః: ఓహో దానఫలమహిమలు! ఏమని చెప్పవచ్చును. వానివలననే హరిశ్చంద్రు డింద్రలోకమున కరుగగల్గెను. ఈ పకారముగ మీకు హరిశ్చంధ్రోపాఖ్యానమంతయును వినిపించితిని. దుఃఖార్తుడీ కధ విన్నచో వాని దుఃఖము తొల గును. ఈ కధవలన స్వర్గకాముడు స్వర్గమును పుత్రార్ధి పుత్రుని భార్యార్ధి భార్యను రాజ్యార్షి రాజ్యమును బడయగలడు.

ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణమందలి సప్తమస్కంధమున హరిశ్చద్రోపాఖ్యానమను నిపువది ఏదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters