Sri Devi Bagavatham-2    Chapters   

అథ షడ్వింశోధ్యాయః.

సూతః : తతోథ భూపతిః ప్రాహరీజ్ఞీం స్థిత్వాహ్యుధోముఖః | అత్రోపవిశ్యతాం బాలే పాపస్య పురతో మమ. 1

శిరస్తే చ్ఛేదయిష్యామి హంతుం శక్నోతి చేత్కరః | ఏవ ముక్త్వా సముద్యమ్య ఖడ్గం హంతుం గతో నృపః. 2

న జానాతి నృపః పత్నీం సా న జానాతి భూపతిమ్‌ | అబ్రవీద్బృశదుఃఖార్తా స్వమృత్యు మహికాంక్షతీ. 3

స్త్ర్యువాచ: చాండాల శృణుమే వాక్యం కించిత్త్వం యది మన్యసే | మృత స్తిష్ఠతి మే పుత్రో నాతిదూరే బహిః పురాత్‌. 4

తం దహామి హతం యావ దానయిత్వా తవాంతికమ్‌ | తావత్ర్ప తీక్ష్యతాం పశ్చాదసినా ఘాతయస్వమామ్‌. 5

తేనాథ బాఢ మిత్యుక్త్వా ప్రేషితా బాలకం ప్రతి | స జగామాతి దుఃఖార్తా విలపంతీ సుదారుణమ్‌. 6

భార్యా తస్య నరేంద్యస్య సర్పదష్టం హి బాలకమ్‌ | హా పుత్ర హా వత్సశిశో ఇత్యేవం వదతీ ముహుః. 7

కృశా వినర్ణా మలినా పాంసుధ్వస్త శిరోరుహా | శ్వశానభూమి మాగత్య బాలం స్ధాప్య విశద్బువి. 8

''రాజన్నద్య స్వబాలం తం వశ్యసీహ మహీతలే | రమమాణం స్వసఖిభి ర్దష్టం దుష్టాహినా మృతమ్‌.''

తస్యా విలాపశబ్దం తమాకర్ణ్య స నరాధిపః | శ్వసన్న న్నిధి మాగత్య వస్త్ర మస్యాక్షిప త్తదా. 9

తాం తధా రుదతీం భార్యాం నాభిజానాతి భూమిపః | చిరప్రవాస సంతప్తాం పునర్జాతా మివాబలామ్‌. 10

సా పి తం చారుకేశాంతం పురో దృష్ట్వాజటాకలమ్‌ | నాభ్యజానాన్నృపవరం శుష్కవృక్షత్వచోపమమ్‌. 11

భూమౌ నిపతితం బాలం దృష్ట్వా೭೭శీ విషపీడితమ్‌ | నరేంద్ర లక్షణోపేత మచింతయదసౌ నపః. 12

ఇరునదిఆరవ ఆధ్యాయము - హరిశ్చంద్రోపాఖ్యానము

సూతు డిట్లనెను: అటుపిమ్మట హరిశ్చంద్ర నరపతి తల నేలకు వేసికొని రాణి కిట్లనెను. ఓ బాలా! పాపిష్ఠుడ నైన మామ్రోలగూర్చుండుము. నా చేయి నీ తల నఱకుటకు సిద్ధమైనచో నిన్ను చంపుదునవి రాజు కత్తిచేత బట్టి యామెను చంపబూనెను. రాజు రాణినిగాని రాణి రాజునుగాని గుర్తుపట్టలేకుండిరి. అపు డామె తన చావు కోరుకొనుచు దుఃఖార్తయై యిట్లనెను: ఓ చండాలా! నీ కిష్టమైనచో నామాట కొంచె మాలకించుము. నా కుమారు డీ పురము బయట చచ్చిపడి యున్నాడు. అతిని శవము నీ చెంతకు దెచ్చి దహన క్రియలు జరుపునంతనఱకు తాళుము. పిదప నన్ను కత్తితో చంపుము. రాజు సరేయని పంపగ నామె శోకాతిరేకమున ఘెరముగ నేడ్చుచు బాలునిచెంత కేగెను. ఆమె సర్పదష్టుడగు బాలునిగాంచి అయ్యో కొడుకా! అయ్యో నా చిన్నారీ! యని పలుసారులు రోదించెను. ఆమె తెల్లగ పాలిపోయి కృశించి దుమ్ము కొట్టుకొని తలపై మాసిన వెండ్రుకలతో నుండెను. ఆమె ఆ శనమును శ్మశానమందుంతాను నేల పై గూరుచుండెను. ఆమె యిట్లనెను: ''ఓ రాజా! నీ బాలుని చూడుము. ఇతడుతననెచ్చెలులతో నాడుకొనుచుండగ నొకదుష్టసర్పముచేతదష్టుడై చనిపోయెను.'' అను నామె దీనాలాపములు విని రాజు శవమునుజేరి పైనున్న గుడ్డ తొలగించెను. పెక్కునాళ్లు లెడబాటుచే కుందుటవలన నా యేడ్చుచున్న యువతి తన భార్యయేయని రాజు గుర్తించలేక పోయెను. మునుపు చక్కని కేశపానముతో నలరురాజునేడుజడలు గట్టి మ్రోడువారినచెట్టువలెనుండుటచే నామె యతనిని గుర్తు పట్టనులేదు. పాముచేత కాటు వేయబడి నేలపడియున్న బాలుడు రాజ లక్షణోపేతుడగుటగని రాజిట్లు తలంచెను.

అస్య పూర్ణేం దు వద్వక్త్రం శుభ మున్నసమ వ్రణమ్‌ | దర్పణ ప్రతియోత్తుంగకపోల యుగశోభితమ్‌. 13

నీలాన్కేశా న్కుంచి తాగ్రా న్సాంద్రానీర్ఘాం స్తరంగిణః | రాజీనసదృశే నేత్రే ఓష్ఠౌ బింబఫలోపమౌ. 14

విశాలవృక్షా దీర్ఘబాహూన్నతాం సకః విశాలపాదో గంభీరః సూక్ష్మాంగుల్య వనీధరః. 15

మృణాలపాదో గంభీరనాభి రుద్ధతకంధరః | అహో కష్టం నరేంద్రస్య కస్యాష్యేష కులే శిశుః 16

జాతో నీతః కృతాంతేన కారపాశా ద్దురాత్మనా | సూతః ఏవం దృష్ట్వాథ తం బాలం మాతురంకేప్రసారితమ్‌.

స్మృతి మభ్యాగతో రాజాహాహేత్య శ్రూణ్యపాతయత్‌ | సోప్యువాచ త వత్సో మే దశామేతా ముపాగతః. 18

నీతో యది చ ఘోరేణ కృతాంతే నాత్మనో వశమ్‌ | విచారయిత్వా రాజాసౌ హరిశ్చంద్ర స్తథా స్థితః. 19

తతో రాజ్ఞీ మహాదుఃఖావేశా దిదమభాషత | రాజ్ఞ్యువాచః హా వత్స కస్య పాపస్య త్పపధ్యానా దిదం మహత్‌. 20

దుఃఖ మాపతితం ఘోరం తద్రూపం నోపలభ్యతే | హా నాధ రాజ న్భవతా మా మపాస్య సుదుఃఖితామ్‌ః. 21

కస్మిన్సం స్ధీయతే స్ధానే విశ్రబ్ధం కేన హేతునా | రాజ్యనాశః సుహత్త్యాగో భార్యతనయవిక్రయః. 22

హరిశ్చంద్రస్య రాజర్షేః కిం విధాత కృతం త్వయా | ఇతి తస్యా వచః శ్రుత్వారాజా స్ధానచ్యుతస్తదా. 23

పత్యభిజ్ఞాయ దౌవీం తాంపుత్రం చ విధనం గతమ్‌ | కష్టం మమావ పత్నీయం బాలకశ్చాపి మే సుతః. 24

ఇతని ముఖము వున్నవనాటి చందురు బోలును. ముక్కు పొడవు-నునులే జోకికళ్లు నిగ్గుటద్దముల సాటి వచ్చును. ఇతని మచ్చయు లేదు. ఇతడు పొడవైన నల్లనల్లని ముంగురులవాడు. కమలములబోలు కన్నులవాడు. ఇతని పెదవి పండినదొండపండు. ఇతడు వెడద ఱొమ్ములవాడు. విశాలనేత్రుడు. ఆజానుబాహుడు. ఎగుబుజములవాడు. కాలి చిటికెన వ్రేలు నేలతాకువాడు. గంభీరుడు. ఇతడు పద్మపాదుడు. లోతైన నాభిగలవాడు. ఎత్తుమెడ గలవాడు. అయ్యో! ఈ శిశు వొక రాజకుల సంజాతుడు గావచ్చును. ఇతడు దురాత్ముడగు యముని కాలపాశమునకు బలి యయ్యెనే! సూతు డిట్లనెను: ఇట్టిబాలుడుతన తల్లియొడిలో నుండుట నతడు చూచెను. రాజునకు తనపూర్వస్మృతి గుర్తుకాగా నయ్యో! నా గారాల కొడుకా! నీ కెంతటి దుర్ధశ పట్టెరాయని కన్నులనీరు గార్చుచు వగచెను. తన కొడు కింతటి కఠిన కాలునకు బలియగుట వలన చింతాపరశుడై రాజు క్షణకాల మూరకుండెను. పిమ్మట రాణి దుఃఖమోహావేశముతో నిట్లని వాపోయెను. అయ్యో! కొడుకా! ఏ ఘోరపాపము నా కీ తీరని గుఃఖము గల్గెనో కదా. ఈ ఘోరశోకముయొక్క రూప మెట్టిదో తోచుటలేదు. హా నాధా! రాజా! దుఃఖితురాలనగు నన్నెడబాసితివా! నీ వెచట రహస్యముగ కాలము వెళ్ళబుచ్చున్నావో కదా నీ రాజ్యము పోయెను. మిత్రులు పోయిరి. పెండ్లమునుపిల్లవాని నమ్ముకొంటివి. ఓ దైవమా! ఈ హరిశ్చంద్రరాజర్షి నీ కేమి యపకారము చేసెనని యతని నిట్లేడ్పించున్నావు.'' అను నామె దీనువాక్కులు విని రాజు ధైర్యము గోల్పోయెను. పిమ్మట హరిశ్చంద్రుడు తన భార్యను చచ్చిన కొడుకును గుర్తపట్టి వీరు భార్యాపుత్రులే! అయ్యో! యెట్టి దురవస్ధ వచ్చిపడెనే.

జ్ఞాత్వా పపాత సంతప్తో మూర్ఛా మతిజగామ హ | సా చ తం ర్రచ్యభిజ్ఞాయ తామనస్ధా ముపాగతమ్‌. 25

మూర్ఛితా నిపపాతార్తా నిశ్చేష్టా ధరణీతలే | చేతనాం ప్రాప్య రాజేంద్రో పాజపత్నీ చతౌ సమమ్‌. 26

విలేపతుః సుసంతప్తౌ శోకభా రేణ పీడితౌ | రాజోవాచః హా వత్స సుకుమారం తే వదనం కుంచి తాలకమ్‌. 27

పశ్యతో మే ముఖం దీనం హృదయం కిం న దీర్యతే | తాత తాతేతి మధురం బ్రువాణం స్వయ మాగతమ్‌. 28

ఉపగూహ్య కదా వక్ష్యే వత్సవత్సేతి సౌహృదాత్‌ | కస్య జాను ప్రణీతేన పింగేన క్షితిరేణునా. 29

మమోత్తరీయ ముత్సంగం తధాంగం మలమేష్యతి | న వాలం మమ సంభూతం మనో హృదయనందన. 30

''మయా సి పితృమాన్పిత్రా విక్రీతో యేన వస్తువత్‌'' గతం రాజ్యమశేషం మే సబాంధవధనం మహత్‌.

''హీనదైవానృశంస్యేదృష్టో మే తనయ స్తతః'' | అహం మహాహిదష్టస్య పుతస్యానన పంకజమ్‌. 31

నిరీక్ష న్నద్య ఘోరేణ విషేణాధికృతో ధునా | ఏవ ముక్త్వాతమాదాయ బాలకం బాష్పగద్గదః. 32

పరిష్వజ్య చ నిశ్చేష్టో మూర్ఛయా నిపపాత హ | తత స్తం పతితం దృష్ట్వా శైబ్యాచైవ మచింతయత్‌. 33

అయం స పురుషవ్యాఘ్రః స్వరేణౖనో పలక్ష్యతే | విద్వజ్జన మనశ్చంద్రో హరిశ్చంద్రో న సంశయః. 34

తథాస్య నాసికా తుంగా తిలపుష్పోపమా శుభా | దంతా శ్చ ముకులప్రఖ్యాః ఖ్యాతకీర్తె ర్మహాత్మనః. 35

శ్మశానమాగతః కస్మా ద్యదేవం స నరేశ్వరః | విహాయ పుత్రశోకం సా పశ్యంతీ పతితం పతిమ్‌. 36

ప్రహృషా విస్మితా దీనా భర్తృపుత్రార్తిపీడితా | వీక్షంతీ సా తదాప తన్మూర్ఛయా ధరణీతలే. 37

అని రాజు లోన కుమిలి కుమిలి వగచెను. రాణియుము దురునవస్ధలో నున్న తన భర్తను గుర్తు పట్టెను. ఆమె దీనార్తయైమూర్ఛిల్లి నేలపై బడెను. ఆ పిదప రాణియు రాజు- నిర్వురు నొకెసారి తెలివొందిరి. వారు శోకభారమున పీడితులై బిట్టు పలవించిరి. రాజిట్లనెను: అయ్యో! ముద్దులకొడుకా! నీసుకుమారముఖము ముంగురులతో సొంపైనది. అట్టి నీ దీనముఖమును చూచియు నా హృదయము చెక్కచెక్కులు గాదేమి! నాన్న! నాన్నయని తియ్యగ పల్కుచు చేరరావేమి! నా కొడుకా! కొడుకా! రారమ్మని ప్రేమతో పిలుచుచు నిన్నెన్న డింక కౌగిలించుకొందునో కదా! నీ మోకాళ్లకు నల్లని మట్టి యుంటుకొనును. అదినాయుత్తరీయమును-తొడను-శరీరము-నెన్నడుమురికిగ జేయునో కదా! ఓనంగదమా! హృదయ నందనా! నేను పుత్రసౌఖ్యము పూర్తిగ పడయనైతి గదా! నేను నీ తండ్రి నయ్యు నిన్నొక సామాన్య వస్తువువలె నమ్మివేసి తినే! నా ధనము-రాజ్యము-బంధులు-సర్వస్వ పోయెను. నా కొకకొడుకుండెను. అతడును సర్పగష్టుడయ్యెను. అతని ముఖకమలము నేను జూచుచున్నాను. అయినను నేను సైతము ఘోర సంతాపవిషముచే దగ్ధుడ నైతిని.'' అని కన్నులు తొడి బడ రాజు బాలుని తీసుకొనెను. రాజు తన కొడుకును ఱొమ్మునకు హత్తుకొని చేష్టదక్కి మూర్ఛితుడై పడిపోయెను. అట్లు నేలపడిన భర్తను చూచి శైబ్య యిట్ల తలంతెను. ఇతని మాటలనుబట్టి యిత డా పురుషసింహుడే-ఆ పండిత మానస చంద్రుడే యని నిస్సంశయముగ నాకు దోచుచున్నది. మఱియు నితని ముక్కుసైత మెత్తుగ నటులే నూగుపూవునలె మెత్తగ నున్నది. ఈ ప్రసిద్ధిగాంచిన మహాత్ముని ధంతములు తెల్లగ నున్నవి. ఇతడా నరపతియే యైనచో నీ వల్లకాటి కత డేలవచ్చును. అని తలపోయుచునామెపుత్రశోకముడిగి నేలనమూర్ఛపోయినతనపతినిగనెను. పతి-సుతశోకమున సంతోషము-వింత-దైన్యము ఒక్కుమ్మడిగ నామెలో ముప్పిరిగొన నామె నఱల మూర్చపోయెను.

ప్రాప్య చేతశ్చ శనకైః సా గద్గద మభాషత | ధిక్త్వాం దైవ హ్యకరుణ నిర్మర్యాద జుగుప్సిత. 38

యేనాయ మమరప్రఖ్యో నీతో రాజా శ్పపాకతామ్‌ | రాజ్యనాశం సుహృత్త్యాగం భార్యాతనయ విక్రయమ్‌. 39

ప్రాపయిత్వాపి యేనాద్యచాండాలోయం కృతోనృపః | నాద్య పశ్యామి తే ఛత్రం సింహాసనమథాపివా. 40

చామరవ్యజనే వాపి కొయం విధివిపర్యయః | యస్యాస్య వ్రజతః పూర్వం రాజానో భృత్యాతాంగతాః. 41

స్వాత్తరీయైః ప్రకుర్వంతి విరజస్కం మహీతలమ్‌ | సోయం కపాలసంలగ్నే ఘటీపట నిరంతరే. 42

మృతనిర్మాల్య సూత్రాంతర్లగ్న కేశసుదారుణ | వసా నిష్పంద సంశుష్క మహాపటల మండీతే. 43

భస్మాంగారార్ధ దగ్ధాస్ధి మజ్జా సంఘట్టభీషణ | గృధ్రగోమాయునాదార్తే పుష్టక్షు ద్రవిహంగమే. 44

చింతాధూమా యతపటనీలీకృత దిగంతరే | కుణపాస్వాదనముదా సంప్రకృష్ట నిశాచరే. 45

చరత్యమేధ్యే రాజేంద్రః శ్మశానే దుఃఖపీడితః | ఏవ ముక్త్వాథ సంశ్లిష్య కంఠే రాజ్ఞో నృపాత్మజా. 46

కష్టం శోకసమావిష్టా విలలాపార్తయా గిరా | రాజ న్స్వప్నోథ తథ్యం వాయదేవత న్మన్యతే భవాన్‌. 47

తత్కధ్యతాం మహాభాగ మనోవై ముహ్యతే మమ | యద్యేత దేవం ధర్మజ్ఞ నాస్తి ధర్మే సహాయతా. 48

తధైవ విప్రదేవాది పూజనే సత్య పాలనే | నాస్తి ధర్మః కుతః సత్యం నావర్జవం నానృశంసతా. 49

యత్రత్వం ధర్నపరమః సవరాజ్వా దవరోపితః | సూతః: ఇతి తస్యా వచః శ్రుత్వానిఃశ్వ స్యోష్ణం సగద్గదః. 50

పిమ్మట నామె తెలివి తెచ్చుకొని తోట్రుపాటునందు మాటలతో నిట్లనెను: ఓ దైనమా! నీకుదయలేదు. విచక్షణలేదు. నీవుపనికిమాలినదానవు. ఏలన నీమూలముననేకదా దేవతవంటి రాజుచండాలు డయ్యెను. అతనికి రాజ్యనాశము-మిత్రునికి త్యాగము-భార్యాపుత్రుల విక్రయము- జరిగెను. ఇన్ని గల్గించి దైనము పిదప రాజును చండాలును చేసెను. నేను నేడు రాజు యొక్క ఛత్రము-సింహసనము-చూచుటలేదు. నేడు రాజ చామరములు నేను చూచుటలేదు. ఎంతలో నెంత విధిమార్పు! మున్నే రాజు నడచుచుండగ తక్కిన రాజులు సేనకులవలె మెలగిరి-వారతని పాదాలు క్రింది మట్టిని తమ యుత్తరియములతో తుడిచిరి- అట్టిరాజు నేడు శవసంస్కారములకై కపాల కలశములు చేబూనెను. నేడతడు శవముల పూల మాలల దారాలతో చిక్కు పడిన వెండ్రుకలతో శవముల వసచే నెండిన యుత్తరీయముతో నున్నాడు. సగము కాలిన యెముకలు మజ్జ-మూలుగు-మాంసము-నకు కోరాడుచు నక్కలు-గ్రద్దలు-పక్షులు భీకరరావములు చేయుచున్నవి. చితిమీది దట్టంపు పొగయునువస్త్రముతో నింగి నల్లగిల్లిలటులున్నది. రక్కసులు శవ మాంస మాస్నాదించుచు ముదమందుచు ఇలా రాజేంద్రుడు వల్లకాటిలో దుఃఖ పీడితుడై విహరించుచున్నాడు.'' అని పెక్కురీతుల రోదించుచు రాణి రాజు కంఠమును గట్టిగపెనవేసి కొనెను. ఆమె దీనార్తితో శోకాతిరేకమున మఱియు నిట్లువగచెను: రాజా! ఇదంతయును నీకు కలగదోచు చున్నదా! కాక నిజమా! నాకంతయు తేటపఱచుము. ఇదేదియో నాకు మోహము గల్గించుచున్నది. ఓ ధర్మజ్ఞ! ఇటులంతయు వీపరీతము జరుగుచుండగ ధర్మమేల తోడుపడదు. విప్రదేవాది పూజన మందు సత్య పరీపాలనమునందున సైతమ్‌ నీ ధర్మము నీకుతోడుపలేదేమి! ధర్మమే లేనిచో నికసత్యమెక్కడిది! ఋజు మార్గమేది! దయయేది! నీవు ధర్మప్రవర్తకువైనప్పటికి రాజ్యభ్రంశము నొందితివి. సూతుడిట్లనెను: అను నామె మాటలు విని రాజు వేడిగనిట్టూర్చి డగ్గుత్తికతో నిట్లనెను.

కథయామాస తన్వంగ్యై యథాప్రాప్తః శ్వపాకతామ్‌ | రుదిత్వా సా తు సుచిరం నిఃశ్వస్యోష్ణం సుదుఃఖితా. 51

స్వపుత్రమరణం భీరు ర్యధావత్తం న్యవేదయత్‌ | శ్రుత్వా రాజా తథా వాక్యం నిపపాత మహీతలే 52

మృతపుత్రం సమానీయ జిహ్వయా విలిహన్ముహుః | హరిశ్చంద్ర మథో ప్రాహ శైబ్యా గద్గదయా గిరా. 53

కురుష్య స్వామినః ప్రేష్యం ఛేదయిత్వా శిరో మమ | స్వామిద్రోహో నతేస్త్వద్యమాసత్యోభవ భూపతే. 54

మాసత్యం తవ రాజేంద్ర పరద్రోహస్తు పాతకమ్‌ | ఏవ దాకర్ణ్యం రాజా తు పపాతభువి మూర్ఛితః. 55

క్షణన చేతనాం ప్రాప్య విలలాపాతి దుఃఖితః రాజోవాఛః కధంప్రియే త్వయాప్రోక్తం వచనం త్వతినిష్ఠురమ్‌. 56

యదశక్యం భ##వేద్వక్తుం తత్కర్మ క్రియతే కథమ్‌ | పత్న్యువాచ: మయాచ పూజితా గౌరీదేవానిప్రాస్తథైవచ 57

భవిష్యసి పతిస్త్యం వేహ్యన్యస్మిన్‌ జన్మని ప్రభో | శ్రుత్వా రాజా తదా వాక్యం నిపపాత మహీతలే. 58

మృతస్య పుత్రస్య తదా చుచుంబ దుఃఖితో ముఖమ్‌ | రాజోవాఛ: ప్రియేనరోచతే దీర్ఘం కాల క్లేశం మయాశితుమ్‌. 59

నాత్మాయత్తోహం తన్వంగి పశ్యమే మందభాగ్యతామ్‌ | చాండాలేనాననుజ్ఞాతః ప్రవేక్ష్యే జ్వలనంయది. 60

చాండాల దాసతాం యాస్యే పువరవ్యస్య జన్మని | నరకం చ వరం ప్రాప్య ఖేదం ప్రాప్స్యామి దారుణమ్‌. 61

తాపం ప్రాప్స్యామి సంప్రాప్య మహారౌరన రౌరవే | మగ్నస్య దుఃఖజలధౌ వరం ప్రాణౖ ర్వియోజనమ్‌. 62

ఏకోపి బాలకో యోయ మాసిద్వ వంశకరః సుతః | మమ దై వాసుయోగేన మృతః సోపి బలీయసా. 63

తాను చండాలుడైన విధ మంతయును రాజు తన భార్యకు తెలిపెను. ఆమెయును వగచి నగచి వేడి నిట్టూర్పుల విడిచెను. అమె కుమారుని చావు గుఱించి రాజునకు వెల్లడించెను. రాజు జరిగిన దంతయును విని మరల ముర్ఛిల్లెను. పిమ్మట రాజు తెలివొంది చచ్చిన సుతుని మొగమును పలుసార్లు ముద్దు పెట్టు కొనుచుండగ శైబ్య గద్దద వాక్కులతో హరిశ్చంద్రున కిట్లనెను: ఓ రాజా! నా తలనఱికి నీ స్వామి పంచిన పని నెఱ వేర్చుము. స్వామి ద్రోహము తలపెట్టి యసత్యమునకు పాల్పడకుము. ఓ రాజేంద్రా! నీ క సత్య దోషము పర ద్రోష పాపము తగులకుండుగాక! అను మాటలు విని రాజు మరల నేలపై ముర్చపోయెను. అంతలో తెలివొంది బిట్టు దుఃఖించి రోదించి రాజిడిట్లనెను: ఓ ప్రేయసి! ఏతయింత నిష్ఠురముగ పలుకుచున్నావు! ఏది నోట పలుకనైన పలుకరాదో దానినెట్లు చేయగలవు? రాణి యిట్లనెను: నేను పూర్వము శ్రీగౌరి దేవిని. దేవతలను-విప్రులను-పూజించితిని. ఆ కారణమున నీవు నాకు మఱుజన్మ మందును పతిగా గలవు. అను రాణీ వాక్కులు విని రాజు భూమి పై మరల పడిపోయెను. పిమ్మట రాజు మూర్చబాసి దుఃఖముతో తన దచ్చిన కుమారుని ముఖమును చుంబించెను. రాజిట్లనెను: ఓ ప్రియరాలా! ఎంతయో కాలము క్లేశములను భవించుట నాకిష్టముగలేదు. ఓలలనా! నేనెంచ దౌర్బాగ్యుడనో చూడుము-నామీద నాకే యధికారములేదు. నేనొక వేళ బాధలు పడలేక చండాలు ననుమతి లేక చితి మంటలలో దుముకుదునా. అట్లునేను చేసిన రాబోవు జన్మములోను నేను చండాలునకు దాలసుడను గావలసినదే. ఘోర నరకముందు గూలి దారున దుఃఖమనుభవింప వలసి వచ్చును. కాని యింతటి శోక సాగరములో దరి గానకమునుకలు వేయుచున్న నాకు ప్రాణాలు వదలి మహారౌరవ నరకము లందు గూలుటే మేలుగనున్నది. నాకోక్కడే యొక్క కొడుకు పుట్టి వంశము నిలువ బెట్ట గలిగెను. కాని యేమి లాభము! అతడును దుర్బరమైన విధి వంచనకు బలియై పోయెను.

కథం ప్రాణాన్విముంచామి పరాయత్తో స్మి దుర్గతః | తథాపి దుఃఖబాహుల్యాత్త్యాక్ష్యామినిజాం తనుమ్‌. 64

త్రైలోక్యే నాస్తితద్దుఃఖం నాసిపత్రవనే తథా | పై తరణ్యాం కుత స్తద్వద్యాదృశం పుత్రవిప్లవే. 65

సోహం సుతశరీరేణ దీప్యమానే హుతాశ##నే | నిపతిష్యామి తన్వంగి క్షంతవ్యం తన్మమాధునా. 66

న వక్తవ్యం త్వయా కించిదతః కమలలోచనే | మమ వాక్యం చ తన్వంగి నిభోధా೭೭హతమానసా. 67

అనుజ్ఞాతాథ గచ్ఛ త్వం విప్రవేశ్మ శుచిస్మితే | యది దత్తం యది హుతం గురవో యదితోషితాః. 68

సంగమః పరలోకే మే నిజపుత్రేణ చేత్త్వయా | ఇహలోకే కుతస్త్వేత ద్బవిష్యతి సమీప్సితమ్‌. 69

యన్మయా హసతా కించి ద్రహసి త్వాం శుచిస్మితే | అశేషముక్తం తత్సర్యం క్షంతవ్యం మమ యాస్యతః. 70

రాజపత్నీతి గర్వేణ నావజ్ఞేయః స మే ద్విజః సర్వయత్నేన తోష్యః స్యాత్స్వామీ దైవతవ చ్ఛుబే. 71

రాజ్ఞ్యువాచ అబమప్యత్ర రాజర్షే నిపతిష్యే హుతాశ##నే | దుఃఖభారా సహా దేవ సహ యాస్యామి వైత్వయా. 72

త్వయా సహ మమ శ్రేయో గమనం నాన్యధా భ##వేత్‌ | సహ స్వర్గం చ నరకం త్వయా భోక్ష్యామి మానద. 73

శ్రుత్వా రాజా తదోవాచ ఏవమస్తు పతివ్రతే |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానే షడ్వింశోధ్యాయః.

ఇపుడు నేను పరాధీనుడనే. ఈ దురనస్ధలో నేను ప్రాణాలు సైత మెట్లు వదలగలను! ఐనను కష్టాలమీద కష్టాలు గల్గుటవలన నీ తనువు వదలి వేయగలను. ఈ దుర్బరమైన పుత్రోశోకమున గల్గు బాధ ముజ్జగములందును లేదు. అసిపత్ర వనమందును వైతరణి దాటునపుడు నింత బాధ యుండదు. ఓ ప్రియురాలా! ఈ నా కొడుకుతోబాటు నేను నారని చిత మంటలలో దుముకగలను. నన్ను క్షమించుము. ఓ మగువా! కమలనయనా! నా మాటకు కడ్డురాకుము. నా మాట వినుము. ఓ చారుహాసినీ! ఇపుడు నీవు నా యనుమతి ప్రకారము నీ విప్రు నింటి కరుగుము. నను మున్ను దానహోమము లాచరించితిని. గురువులను సంతోషపఱచితిని. అని నిజమెనచో నేను పరలోకమునందు నిన్ను రోబితుని తప్పక కలిసికోనగలను. ఈ కోరిక యీ లోకాన తీరునది గాదు. ఓ సుహీసినీ! మన జీవితకాలములో నేను నవ్వులాటకైన రహస్యముగనైననిన్నేదేని అనరానిమాట యన్నచో దానిని మఱచిపొమ్ము. నన్ను క్షమించుము. ఓ కల్యాణి! నేనొక రాజపత్నినను గర్వముతో నీవు విప్రు నవమానింపకుము. ప్రతివారు తన స్వామిని దైవముగ సంతోషపెట్టవలయును. రాణి యిట్లనెను: ఓ రాజర్షీ! నేనును నీ వెంట చితిమంటలతో దుముకగలను, ఈ దుఃఖభారము నేను మోయ జాలను. నేను నీతోడనే సహగమించగలను. ఓ మానదా! నాకు నీ వెంటవచ్చుటే మేలుగాని మఱియే విధనమును గాదు. స్వర్గమో-నరకమో అదేదైన నీ వెంట నుండియే యునుభవింపగలను. ఆమె మాటలువిని హరిశ్చంద్రుడో సతీమణీ! నీ యిష్టమెట్లట్లు నడచుకొమ్మనెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున హరిశ్చద్రోపాఖ్యానమున నిరువదియారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters