Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోవింశోధ్యాయః

వ్యాస ఉవాచ : తమేవ ముక్త్వా రాజానం నిర్ఘృణం నిష్ఠురం వచః | తదాదాయ ధనం పూర్ణం కుపితః కౌశికో య¸°. 1

విశ్వామిత్రే గతే రాజా తతః శోక ముపాగతః | శ్వాసో చ్చ్వాసం ముహుః కృత్వా ప్రోవాచోచ్చైరధోముఖః. 2

విత్త క్రీతేన యస్యార్తి ర్మయా ప్రేతేన గచ్ఛతి | స బ్రవీతు త్వరాయుక్తో యామే తిష్ఠతి భాస్కరః. 3

అథా జగామ త్వరితో ధర్మ శ్చాండాలరూపధృక్‌ | దుర్గంధో వికృతోరస్కః శ్మశ్రులో దంతురోఘృణి. 4

కృష్ణో లంబోదరః స్నిగ్దః కరాల పురుషాధమః | హస్త జర్జర యష్టి శ్చ శవమాల్యై రలంకృతః. 5

చాండాల ఉవాచ : అహం గృహ్ణామి దాసత్వే భృత్యార్థః సుమహాన్మమ |

క్షిప్ర మాచక్ష్వ మౌల్యం కి మేత త్తే సంప్రదీయతే. 6

వ్యాసః ఉవాచ : తం తా దృశ మథాలక్ష్య క్రూరదృష్టిం సునిర్ఘృణమ్‌ |

వదంత మతి దుఃశీల కస్త్వమిత్వాహ పార్థివః. 7

చాండాల ఉవాచ : చాండాలోహ మిహ ఖ్యాతః ప్రవీరేతి నృపోత్తమ |

శాసనే సర్వదా తిష్ఠ మృతచైలాపహారకః. 8

ఏవ ముక్త స్తదా రాజా వచనం చేదమబ్రవీత్‌ |

బ్రాహ్మణః క్షత్రియో వాపి గృహ్ణా త్వితి మతిర్మమ. 9

ఉత్తమ స్యోత్తమో ధర్మో మధ్యమస్య చ మధ్యమః | అధమ స్యాధమశ్చైవ ఇతి ప్రాహుర్మనీషిణః. 10

చాండాలః : ఏవ మేవ త్వయా ధర్మః కథితో నృపసత్తమ | అవిచార్య త్వయా రాజ న్నథునోక్తం మమాగ్రతః. 11

విచారయిత్వా యో బ్రూతే సోభీష్టం లభ##తే నరః | సామాన్య మేవ తత్ప్రోక్త మవిచార్య త్వయానఘ. 12

యది సత్యం ప్రమాణం తే గృహీతోసి న సంశయః |

హరిశ్చంద్రః : అసత్యా న్నరకే గచ్ఛే త్సద్యః క్రూరే నరాధమః. 13

ఇరువది మూడవ అధ్యాయము - హరిశ్చంద్రోపాఖ్యానము

వ్యాసుడిట్లనెను : విశ్వామిత్రుడు ఇట్లు దయమాలి నిష్ఠురముగ రాజుతో బలికి యాధన మంతయునుగొని కోపముతో వెడలిపోయెను. విశ్వామిత్రుడు వెళ్ళిన పిదప హరిశ్చంద్రుడు మాటి మాటికి వేడి నిట్టూర్పులు వదలుచు తల నేలకు వేసి శోక సంతప్తుడై భోరన నేడ్చుచిట్లనెను. నేను కష్టాలు పడుట వలన ప్రేతము వలె నున్నాను. నేడు ప్రొద్దుగ్రుంకు లోపల నన్నెవడైనను కొనువాడున్నచో వెంటనే నా వెల నిర్ణయింపవచ్చును. అనునంతలో ధర్మదేవత చండాల రూపమున నేతెంచెను. అతడు నిర్దయుడు-వికృతాకారుడు-మేన దుర్గంధము వెడలువాడు - పొడవైన మీసలు పొట్టగలాడు - నల్లనివాడు-లంబో దరుడు. భీకరుడు. చేత వెదురుకర్ర దాల్చినవాడు-వెడల్పు ఱొమ్ము గలాడు. ఎముకల మాల లలంకరించుకొన్నవాడు. చండా లుడిట్లనెను: నాకొక దాసుడు కావలెను. నేను నిన్ను దాసునిగ తీసికొందురు. నీ కెంత ధన మీయవలయునో వేగమే తెలియజేయుము. క్రూరదృష్టి దుశ్శీలము గల్గి దయమాలిన చండాలుని రూపుగని నీవెవ్వడవని రాజు డిగెను. చండాలుడిట్ల నెను : రాజా! నేనొక చండాలుడను. ప్రవీరుడని పేరొందితిని. నా శాసనము పాలించుము. నీవు శవముల మీద వస్త్రము తీసికొనుచుండుము. అని పలుకగ రాజతని కిట్లనెను. నన్నొక బ్రాహ్మణుడు గాని క్షత్రియడు గాని గ్రహించ వలయునని నేను కోరుచున్నాను. ఉత్తముని ధర్మ ముత్తమముగ మధ్యముని ధర్మము మధ్యమముగ అధముని ధర్మమధమముగ నుండు నని తెలిసినవారందరు. చండాలుడిట్లనెను : రాజా! నీ వాలోచించుకొనక యెవడైన నన్నిపుడు గ్రహింపవచ్చునని యేల వెల్లడిచేసితివి! చక్కగ నాలోచించి పల్కినవాడు తప్పక తన అభీష్టమును పొందును. కాని నీవు మాత్ర మాలోచింపక సామాన్యముగ బలికితివి. నీకు సత్యము మీద నమ్మక మున్నచో నేను నిన్ను గ్రహించితిని. హరిశ్చంద్రుడిట్లనెను : అసత్యము పలుకు నరాధముడు తప్పక వెంటనే నరకమున గూలును అసత్యము కంటె నాకు చండాలత్వమే మంచిది.

తత శ్చాండాలతా సాధ్వీ న వరా మే హ్యసత్యతా | వ్యాసః : తసై#్యవం వదతః ప్రాప్తో విశ్వామిత్ర స్తపోనిధిః. 14

క్రోధమర్ష వివృత్తాక్షః ప్రాహచేదం నరాధిపమ్‌ | చండాలోయం మనః స్థంతే దాతుం విత్తముపస్థితః. 15

కస్మా న్న దీయతే మహ్య మశేషా యజ్ఞదక్షిణా | రాజోవాచ : భగవ న్సూర్యవంశోత్థ మాత్మానం వేద్మి కౌశిక. 16

కథం చాండాలదాసత్వం గమిష్యే విత్తకామతః | విశ్వామిత్రః : యది చాండాలవిత్తం త్వమాత్మవిక్రయజం మమ. 17

నప్రదాస్యసి చేత్తర్హి శప్స్యామి త్వామసంశయమ్‌ | చాండాలా దథవా విప్రా ద్దేహి మే దక్షిణా ధనమ్‌. 18

వినా చాండాల మధునా నాన్యః కశ్చిద్ధన ప్రదః | ధనేనాహం వినా రాజ న్న యాస్యామి న సంశయః. 19

ఇదానీమేవ మే విత్తం న ప్రదాస్యి చేన్నృప | దినేర్థ ఘటికాశేషే తత్త్వాం శాపాగ్నినా దహే. 20

వ్యాసః : హరిశ్చంద్రః స్తరాజా మృతవచ్ఛ్రిత జీవితః | ప్రసీదేతి వదన్ఫాదౌ ఋషేర్జగ్రాహ విహ్వలః 21

హరిశ్చంద్రః : దాసోస్మ్యార్తోస్మి దీనో స్మి త్వద్బక్తశ్చ విశేతః |

ప్రసాదం కురు విప్రర్షే కష్ట శ్చాండాల సంకరః. 22

భ##వేయం విత్తశేషేణ తవ కర్మకరో వశు | తవైవ మునిశార్దూలా ప్రేష్య శ్చి త్తానువర్తకః. 23

విశ్వామిత్రః : ఏవమస్తు మహారాజ మమైవ భవ కింకరః | కింతు మద్వచనం కార్యం సర్వదైవ నరాధిప. 24

వ్యాసః : ఏవ ముకే థ వచనే రాజా హర్షసమన్వితః | అమన్యత పునర్జాత మాత్మానం ప్రాహ కౌశికమ్‌. 25

తవాదేశం కరిష్యామి సదైవాహం న సంశయః | ఆదేశయ ద్విజ శ్రేష్ఠ కిం కరోమి తవానఘ. 26

విశ్వామిత్రః : చాండాలగచ్ఛ మద్దాస మౌల్యం కిం మే ప్రయచ్ఛసి |

గృహాణ దాసం మౌల్యేన మయాదత్త తవాధునా. 27

నాస్తి దాసేన మే కార్యం విత్తాశా వర్తతే మమ | వ్యాసః : ఏవ ముక్తే తదా తేన శ్వపచో హృష్టమానసః. 28

వ్యాసుడిట్లనెను: ఇట్లు పలుకుచున్నంతలో తపోనిధియగు విశ్వామిత్రు డచటి కేతెంచెను. అతడు కన్నుల నుండి మంట లెగయుచుండ రాజుతో నిట్లనెను: ఇతడు చండాలుడు. నీకు ధన మీయవచ్చినాడు. కనుక నా కీయవలసిన మొత్తము యజ్ఞ దక్షిణ యేల చెల్లింపవు? రాజిట్లనెను: ఓ విశ్వామిత్రా! భగవానుడా ! నన్ను సూర్య వంశజునిగ నెఱుంగుము. నేను ధనాశకు లోబడి యెట్లు చండాల దాసుడను గాగలను? విశ్వామిత్రు డిట్లనెను : నిన్ను చండాలుడు కొని యిచ్చిన ధనము నా కీయవలయును. అట్టి ధనము నా కీయకున్నచో నేను నిన్ను తప్పక శపించగలను. చండాలుని నుండి కాని విప్రుని నుండి కాని గ్రహించిన దక్షిణా ధనము నా కిచ్చివేయుము. ఇపుడు చండాలుడు తక్క మరెవ్వడును ధన మిచ్చు వాడులేడు. రాజా! నేనును ధనము తీసికొనక యెట్టిపరిస్థితులలోను వెళ్ళను. నా ధనము నా కిప్పుడే అరగడియ ప్రొద్దుండు లోపల నీయకున్న నా శాపాగ్నిచే నిన్ను కాల్తును. అంత హరిశ్చంద్రుడిట్లనెను; నే నార్తుడను. నీ దాసుడను. విశేషించి నీ భక్తుడను. దీనుడను. ఓ విప్రర్షీ! దయబూనుము. ఈ చండాల సహవాసము నాకు తొలగింపుము. ఓ మునివర్యా! మిగిలిన ధనము చెల్లించుటకు నేను నీకే సేవలు చేయగలను. నీ మనసునకు వచ్చినట్లే మసలుకొనగలను. విశ్వామిత్రుడిట్లనెను. మహారాజా! నరపతీ! సరే. అట్లే కానిమ్ము. నాకే దాసుడవు గమ్ము. నా చెప్పిన మాట జవదాటకుము. అని ముని పలుకగ రాజు హర్ష మొంది తాను మరల జన్మము నందినట్లు తలచి విశ్వామిత్రున కిట్లనెను. ద్విజవర్యా! అనఘా! నేనెల్ల వేళల నీ యా దేశ##మే పాటింపగలను. నన్నాజ్ఞాపింపకుము. నేను నీ కేమి సేవ చేయవలయును? విశ్వామిత్రుడిట్లనెను. ఓ చండాలా! రమ్ము. ఇతడు నా దాసుడు. ఇతనిని నీ కమ్ముచున్నాను. ఇతనిని గ్రహించి నీ వితని కెంత మూల్య మిత్తువో తెల్పుము. నాకు దాసునితో పనిలేదు. నాకు ధనాశ మొండుగ నున్నది. అని ముని పలుకగనే చండాలుడు పరమానంద మొందెను.

ఆగత్య సన్నిధౌ తూర్ణం విశ్వమిత్ర మభాషత | చాండాలః : దశయోజనవిస్తీర్ణం ప్రయాగస్య చ మండలే. 29

భూమిం రత్నమాయీం కృత్వా దాస్యే తేహంద్విజోత్తమ అస్య విక్రయణనేయ మార్తిశ్చ ప్రహతా త్వయా. 30

వ్యాసః : తతో రత్నసహస్రాణి సువర్ణమణిమౌక్తికైః | చాండాలేన ప్రదతాని జగ్రాహ ద్విజసత్తమః. 31

హరిశ్చంద్ర స్తథా రాజా నిర్వికారముఖో భవత్‌ | అమన్యత తథా దైర్యా ద్విశ్వామిత్రో హి మే పతిః. 32

తత్త దేవ మయా కార్యం యదయం కారయిష్యతి | అథాం తరిక్షే సహసా వాగువాచాశరీరిణీ. 33

అనృణోసి మహాభాగ దత్తా సా దక్షిణా త్వయాత్రతో దివః పుష్ప వృష్టిః పపాత నృపమూర్ధని. 34

సాధు సాధ్వితి తం దేవాః ప్రోచుః సేంద్రా మహౌజసః | హర్షేణ మహతా೭೭విష్టో రాజా కౌశిక మబ్రవీత్‌. 35

రాజోవాచ : త్వం హి మాతా పితా చైవత్వం హి బంధుర్మహామతే |

తదర్థం మోహితోహంతే క్షణా చ్చైవానృణీకృతః. 36

కిం కరోమి మహాబాహో శ్రేయో మే వచనం తవ | ఏవ ముక్తే తు వచనే నృపం ముని రభాషత. 37

విశ్వామిత్రః : చాండాలవచనం కార్య మద్యప్రభృతి తే నృప! స్వస్తి తేస్త్వితి తంప్రోచ్య తదాదాయధనంయ¸°.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానే త్రయోవింశోధ్యాయః.

అతడు విశ్వామిత్రుని ముందటి కేతెంచి యతనితో నిట్లు పలికెను. ప్రయాగ మండలమున పది యోజనముల వెడల్పు గల నేల; అది రతనాలగడ్డ. ఓ ద్విజోత్తమా! దానిని నేను నీకు సమర్పించుచున్నాను. ఇతనిని నాకిచ్చి నీవు నా కష్టములు గట్టెంక్కించితివి. ఆ పిదప చండాలుడు మునికి వేయి మంచి ముత్తెములు వేయి బంగారు నాణము లీయగ ముని వాని నెల్ల గైకొనెను. ఏమి జరిగినను హరిశ్చంద్రుని ముఖము నిర్వికారముగ నొప్పెను. రాజు ధైర్యము బూని విశ్వామిత్రుడే తన స్వామియని భావించెను. అతడే పని చేయించిన నే నా పని చేయగలనని రాజు తలచెను. అంతలో వెంటనే యాకాశవాణి యిట్లు పలికెను. ఓ మహనీయా! నీ వీయవలసిన దక్షిణా ధన మిచ్చితివి. ఋణ విముక్తడ వైతివి. ఈ మాట వినిపించగనే దివి నుండి రాజు తలపై పూలజల్లు కురిసెను. అపు డింద్రాదులెల్లరును మేలు మేలని రాజును ప్రశంసించిరి. అంత హరిశ్చంద్రుడు హర్షముతో విశ్వామిత్రున కిట్లనెను. ఓ మహామతీ! నీవే నా తల్లివి; తండ్రివి; బంధువవు; ధనము కొఱకు మోహితు డనగు నన్ను క్షణములో ఋణ విముక్తుని జేసితివి. ఓ హిరణ్య బాహూ ! నీ మాట నాకు మేలు వెల్గుల మూట యైనది. నేనిపు డేమి చేయవలయునో తెల్పుము. అని రాజనగా ముని యతని కిట్లనెను. రాజా! నేటి నుండి నీవు చండాలుని మాట ప్రకారము నడచుకొమ్ము. నీకు వేయి శుభములగుత మని పలికి ధనముగొని ముని వెడలిపోయెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున హరిశ్చంద్రోపాఖ్యానమున నిరువది మూడవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters