Sri Devi Bagavatham-2    Chapters   

వ్యాస ఉవాచ: ఇతి తస్యవచః శ్రుత్వా భూపతేః కౌశికో మునిః | ప్రహస్య ప్రత్యువాచేదం హరిశ్చంద్రం తదా నృప. 1

రాజం స్తీర్థమిదం పుణ్యం పావనం పాపనాశనమ్‌ | స్నానం కురు మహాభాగ పితౄణాం తర్పణం తథా. 2

కాలః శుభతమోస్తీహ తీర్థే స్నాత్వా విశాంపతే | దానం దదస్వ శక్త్యాత్ర పుణ్యతీర్థేతి పావనే. 3

ప్రాప్య తీర్థం మహాపుణ్య మస్నాత్వా యస్తు గచ్ఛతి | స భ##వే దాత్మ హా భూయ ఇతి స్వాయంభువోబ్రవీత్‌. 4

తస్మా త్తీర్థవరే రాజ న్కురు పుణ్యం స్తశక్తితః | దర్శయిష్యామి మార్గం తే గంతాసి నగరం తతః. 5

ఆగమిష్యా మ్యహం మార్గదర్శనార్థం తవానఘ | త్వయా సహాద్య కాకుత్థ్స తవ దానేన తోషితః. 6

తచ్ఛ్రుత్వా వచనం రాజా మునేః కపటమండితమ్‌ | వాసాం స్యుత్తార్య విధివ త్స్నాతు మభ్యాయ¸° నదీమ్‌. 7

బంధయిత్వా హయం వృక్షే మునివాక్యేన మోహితః | అవశ్యంభావియోగేన తద్వశ స్తు తదాభవత్‌. 8

రాజా స్నానవిధిం కృత్వా సంతర్ప్య పితృదేవతాః | విశ్వామిత్ర మువాచేదం స్వామి న్దానం దదామితే. 9

యదిచ్ఛసి మహాభాగ తత్తే దాస్యామి సాంప్రతమ్‌ | గావో భువి హిరణ్యం చ గజాశ్వరథవాహనమ్‌. 10

నాదేయం మే కిమప్యస్తి కృత మేత ద్ర్వతం పురా | రాజసూయే మఖశ్రేష్ఠే మునీనాం సన్నిధా వపి. 11

తస్మాత్త్వ మిహ సంప్రాప్త స్తీర్థేస్మి న్ర్పవరే మునే | యతే స్తి వాంఛితం బ్రూహి దదామి తవ వాంఛితమ్‌. 12

పందొమ్మిదవ యధ్యాయము

హరిశ్చంద్రోపాఖ్యానము

హరిశ్చంద్రుని మాటలువిని నవ్వి విశ్వామిత్రు డతని కిట్లనెను. రాజా! మహాశయా! ఇది పాపనాశకమగు పావనపుణ్యతీర్థము. ఇచట స్నానముచేసి పితృతర్పణము చేయుము. నేడు పర్వదినము. ఇది పవిత్రమైన పుణ్యతీర్థము. ఇందు స్నానముచేసి నీ శక్తి యున్నంతగ దానము చేయుము. ఏదైన పుణ్యతీర్థమున కేగిన వాడందు స్నానము చేయక వెళ్ళినచో నత డాత్మఘాతుకుడగునని మనువు వాక్క్రుచ్చెను. కనుక రాజా! ఈ శ్రేష్ఠమైన తీర్థ రాజమున నీ శక్తి కొలదిగ పుణ్యము చేసికొనుము. నీకు తరువాత మార్గము చూపింతును. నగరమునకు వెళ్లవచ్చును. కాకుత్థ్సా! అనఘా! నీ దానమునకు సంతోషించి నేను నీకు బాట చూపించుటకు నీవెంట రాగలను. కపట మండితమగు ముని వాక్కులువిని రాజు తనపై నున్న వస్త్రములు విడిచి యథావిధిగ స్నాన మాడుటకు నదిని జేరెను. ముని వాక్యములకు మోహితుడై అతనికి వశుడైన రాజు చెట్టునకు గుఱ్ఱమును కట్టివేసి రాగలదైన యోగమును తప్పించుకొనలేకున్నందున చక్కగ స్నాన విధి నెఱవేర్చుకొని పితృదేవతలకు తర్పణము విడిచి విశ్వామిత్రునితో నిట్లనెను: స్వామి! నీకు దాన మొసంగుదును. మహాత్మా! నీ విపుడేది కోరిన దాని నిత్తును. ఆవులో! భూమియో! బంగారమో! గజాశ్వరథవాహనములో! కోరుకొనుము. రాజసూయయాగ మపుడు మునుల సమక్షమున దానవ్రతము పట్టితిని. కనుక నే నీయజాలని వస్తువేదియును లేదు. మునీశా! నీ వా పుణ్యతీర్థరాజమున కనబడితివి. నీ కోర్కి యేదియో తెలుపుము. దానిని తప్పక తీర్పగలను.

విశ్వామిత్ర ఉవాచ : మయా పూర్వం స్మృతా రాజన్కీర్తిస్తే విపులా భువి |

వసిష్ఠేన చ సంప్రోక్తా దాతా నాస్తి మహీతలే. 13

హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః | తాదృశో నృపతి ర్దాతా న భూతో న భవిష్యతి. 14

పృథివ్యాం పరమోదార స్త్రీశంకుతనయో యథా | అతస్త్వాం ప్రార్థయామ్యద్య వివాహో మేస్తి పార్థివ. 15

పుత్రస్య చ మహాభాగ తదర్థం దేహి మే ధనమ్‌ | రాజోవాచ : వివాహం కురు విప్రేంద్ర దదామి ప్రార్థితం తవ యదిచ్చసి ధనం కామం దాతా తస్యాస్మి నిశ్చితమ్‌ |

వ్యాస ఉవాచ : ఇత్యుక్తః కౌశిక స్తేన వంచనాతత్పరో మునిః. 17

ఉద్బావ్య మాయాం గాంధర్వీం పార్థివాయాప్యదర్శయత్‌ | కుమారః సుకుమారశ్చ కన్యా చ దశవార్షికీ. 18

ఏతయోః కార్య మప్యద్య కర్తవ్యం నృపసత్తమ | రాజసూయాధికం పుణ్యం గృహస్థస్య వివాహతః. 19

భవిష్యతి తవాద్యైవ విప్రపుత్ర వివాహతః | తచ్చృత్వా వచనం రాజా మాయయా తస్య మోహితః. 20

తథేతి చ ప్రతిజ్ఞాయ నోవాచాల్పం స్తథా | తేన దర్శితమార్గోసౌ నగరం ప్రతిజగ్మివాన్‌. 21

విశ్వామిత్రో పి రాజానం వంచయిత్వా೭೭శ్రమం య¸° |

కృతో ద్వాహవిధి స్తావ ద్విశ్వామిత్రోబ్రహీన్నృపమ్‌. 22

వేదీమధ్యే నృపాద్య త్వం దేహి దానం యథేప్సితమ్‌ |

రాజోవాచ : కిం తేభిష్టం ద్విజ బ్రూహి దదామి వాంఛితం కిల. 23

అదేయమపి సంసారే యశః కామోస్మి సాంప్రతమ్‌ | వ్యర్థం హి జీవితం తస్య విభవం ప్రాప్య యేనవై. 24

విశ్వామిత్రు డిట్లనెను : ''రాజా! మున్నొ కప్పుడు నేను వసిష్ఠునివలన నిన్ను గూర్చి వింటిని. ఈ భూమండలమున హరిశ్చంద్రునిబోలు దాత-కీర్తిశాలి-లేనేలేడు. హరిశ్చంద్రుడు సూర్యవంశమందలి మహారాజు. ఆ రాజునుబోలు దాత మున్ను లేదు. ముందుండబోడు. అతడు త్రిశంకు కుమారుడు. పరమోదారుడు. అని అతడనెను. అట్టి నిన్ను ప్రార్థించుచున్నాను. రాజా : నేనొక వివాహము జరుపవలయును. మహానుభావా! నా కొడుకు పెండ్లి. కనుక ధనమిమ్ము. రాజిట్లనెను : విప్ర వర్యా! వివాహము జరిపించుకొనుము. నీవు కోరిన దిత్తును. నీవెంత ధనము కోరుదువో యంతధనము నీ కీయగలను. విశ్వామిత్రుడు రాజును వంచింపదలచెను. ముని గాంధర్వమాయ పన్ని యొక సుకుమార కుమారుని పదియేండ్ల కన్నియును రాజునకు చూపి రాజా! వీరిర్వురికి పెండ్లి జరుపవలయును. పెండ్లి చేయుటచే రాజసూయ యజ్ఞముకంటె గొప్పపుణ్యము. పెండ్లిచేసి యిల్లు నిలువబెట్టుట మంచిది గదా! ఇపు డీ విప్రకుమారుని పెండ్లివలన నీకు పున్నెము గల్గును. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. ఆతడు సరేయని మాట యిచ్చెను. కాని మునికి విరుద్ధముగ మాటాడలేదు. పిదప ముని త్రోవ జూపగ రాజు తన నగర మేగెను. విశ్వామిత్రుడును రాజును వంచించి తన యాశ్రమ మేగును. వివాహ విధి జరిపిన పిమ్మట విశ్వామిత్రుడు రాజుతో నిట్లనెను : ఓ రాజా! ఈ యజ్ఞవేదికపై నేను కోరిన దానమిమ్ము. రాజిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీ కోరిక యేమి తెల్పుము. తప్పక తీర్తును. నేను కీర్తికాముడను. ఈ ప్రపంచమం దసాధ్యమైనదైన తప్పక యీయగలను. ఎంత ధనమున్నను కీర్తిలేనిచో వ్యర్థమే గదా ! కనుక పరలోకసుఖము గల్గించు యశము సంపాదింపనిచో వ్యర్థమే.

నోపార్జితం యశః శుద్ధం పరలోకసుఖప్రదమ్‌ | విశ్వామిత్రః : రాజ్యం దేహి మహారాజ వరాయ సపరిచ్ఛదమ్‌. 25

గజాశ్వరథరత్నాఢ్యం వేదీమధ్యేతి పావనే | మోహితో మాయయా తస్య శ్రుత్వావాక్యం మునేర్నృపః. 26

దత్తమిత్యుక్తవాన్రాజ్య మవిచార్య యదృచ్ఛయా | గృహీత మితి తం ప్రాహ విశ్వామిత్రోతినిష్టురః. 27

దక్షిణాం దేహి రాజేంద్ర దానయోగ్యాం మహామతే | దక్షిణారహితం దానం నిష్పలం మను రబ్రవీత్‌. 28

తస్మా ద్దనఫలాయ త్వం యథోక్తాం దేహి దక్షిణామ్‌ | ఇత్యుక్త స్తు తదా రాజా తమువాచాతి విస్మితః. 29

బ్రూహి కిం యద్ధనం తుభ్యం దేయంస్వామిన్మయాధునా | దక్షిణానిష్ర్కయం సాధోవదయాత్పృమాణకమ్‌ 30

దానపూర్త్యై ప్రదాస్యామి స్వస్థోభవ తపోధన | విశ్వామిత్ర స్తు తచ్ఛ్రుత్వా తమాహ మేదినీ పతిమ్‌. 31

హేమభారద్వయం సార్దం దక్షిణాం దేహి సాంప్రతమ్‌ | దాస్యామీతి ప్రతిశ్రుత్య తసై#్మ రాజాతివిస్మితః. 32

తదైవ సైనికా స్తస్య వీక్షమాణాః సమాగతాః | దృష్ట్వా మహీపతిం వ్యగ్రం తుష్టువుస్తే ముదాన్వితాః. 33

వ్యాసః : శ్రుత్వా తేషాం వచో రాజా నోక్త్వా కించిచ్ఛుభాశుభమ్‌ |

చింతయ న్స్వకృతం కర్మం యయావంతఃపురే తతః. 34

కిం మయా స్వీకృతం దానం సర్వస్వం యత్సమర్పితమ్‌ | వంచితోహం దివజేనాత్ర వనే పాటచ్చరై రివ. 35

రాజ్యం సోపస్కరం తసై#్మ మయా సర్వం ప్రతిశ్రుతమ్‌ | భారద్వయం సువర్ణస్య సార్దం చ దక్షిణా పునః. 36

కిం కరోమి మతర్బృష్టా న జ్ఞాతం కపటం మునేః | ప్రతారితోహం సహసా బ్రాహ్మణన తపస్వినా. 37

న జానే దైవకార్యం వై హా దైవ కిం భవిష్యతి | ఇతి చింతాపరో రాజా గృహం ప్రాప్తోతి విహ్వలః. 38

విశ్వామిత్రు డిట్లనెను : ఓ మహారాజా! మీ సర్వస్వమును నీ రాజ్యమంతయును దానమిమ్ము. ఈ పవిత్రవేదిక సమీపమున గజాశ్వరథరత్నములన్నియు దానమిమ్ము. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. రాజు ముందువెనుక లాలోచింపకయే స్వేచ్ఛగ దానమిచ్చితి ననెను. విశ్వామిత్రుడు పుచ్చుకొంటిననుచు నిష్ఠురముగ నిట్లు పలికెను. రాజేంద్రా! మహామనీషీ! దానమునకు యోగ్యమగు దక్షిణనిమ్ము. దక్షిణలేని దానము వ్యర్థమైనదని మనువు పలికెను. కనుక నీవు దానమునకు తగినంత దక్షిణ నిమ్ము. అను ముని వాక్కులకు విస్మయమంది రాజు ముని కిట్లనెను. స్వామీ! సాధూ! ఇపుడు నన్ను దక్షిణ నీయగలను. నిశ్చితంగ నుండుము. అది విని ముని రాజున కిట్లనెను. ఇప్పుడు నాకు రెండున్నర బరువుల బంగార మిమ్ము. అనగనే రాజు విస్మయమంది యిచ్చితినని మునికి మాట యిచ్చెను. అదే సమయ మున సైనికులు రాజును వెదుకుచు వచ్చి చూచి సంతోషించిరి. వారు చింతాతురుడగు రాజునుగాంచి పొగడిరి. వారి మాటలు విని రాజు మంచిచెడ్డ లేమియు బలుకక తన చేసిన పనికి చింతించుచు తన యంతిపురము జేరెను. నేనెంత పని చేసితిని! నా సర్వస్వమును దానము చేసితిని. ముని దొంగవానివలె నన్ను వంచించెను. మునికి నా సకల రాజ్యమును రెండున్నర బరువుల బంగారమును దాన మిచ్చెదనని ప్రతిన బూనితిని. నా మతి చలించినది. ముని కపటనాటక మెఱుగనైతిని. తబిసి-బాపడు-నగు మునిచే మోసపోతిని. ఇపు డేమి చేతును. దైవయాగ మెఱుగలేకపోతిని. హా! దైవమా! ఇంకేమి జరుగునో! అని విచారించుచు వికలచిత్తముతో రాజు తన యింటి కేగెను.

చింతాపరం పతిం దృష్ట్వా రాజ్ఞీ పప్రచ్ఛ కారణమ్‌ | కిం ప్రభో విమనా భాసి కా చింతా బ్రూహిసాంప్రతమ్‌. 39

వనా త్పుత్రః సమాయాతో రాజసూయః కృతః పురా | కస్మా చ్చోచసి రాజేంద్ర శోకస్య కారణం వద. 40

నారాతి ర్విద్యతే క్వాపి బలవా న్దుర్బలోపి వా | వరుణోపి సుసంతుష్టః కృతకృత్యోసి భూతలే. 41

చింతయా క్షీయతే దేహో నాస్తిచింతాసమామృతిః | త్యజ్యతాం నృపశార్దూల స్వస్థో భవ విచక్షణ. 42

తన్నిశమ్య ప్రియావాక్యం ప్రీతిపూర్వం నరాధిపః | ప్రోవాచ కించిచ్చింతాయాః కారణం చ శుభాశుభమ్‌. 43

భోజనం న చకారాసౌ చింతావిష్ట స్తథా నృపః | సుప్త్వా పి శయనే శుభ్రే లేభే నిద్రాం న భూమిపః. 44

ప్రాతరుత్థాయ చింతార్తో యావత్సంధ్యాదికాః క్రియాః | కరోతి నృపతి స్తాన ద్విశ్వామిత్రః సమాగతః. 45

క్షత్రా నివేదితో రాజ్ఞే మునిః సర్వస్వహారకః | ఆగత్యోవాచ రాజానం ప్రణమంతం పునః పునః. 46

విశ్వామిత్ర ఉవాచ : రాజం స్త్యజస్వ రాజ్యం మే దేహి వాచా ప్రతిశ్రుతమ్‌ |

సువర్ణం స్పృశ రాజేంద్ర సత్యవాగ్బవ సాంప్రతమ్‌. 47

హరిశ్చంద్ర ఉవాచ : స్వామి న్రాజ్యం తవేదం మే మయా దత్తం కిలాధునా |

త్యక్త్వాన్యత్ర గహిష్యామి మాచింతాం కురు కౌశిక. 48

సర్వస్వం మమ తే బ్రహ్మ న్గృహీతం విధివ ద్విభో | సువర్ణ దక్షిణాం దాతుమశక్తో హ్యధునా ద్విజ. 49

దానం దదామి తే తావ ద్యావన్మేస్యా ద్ధనాగమః | పుణశ్చేత్కాలయోగేన తదా దాస్యామి దక్షిణామ్‌. 50

తన పతి చింతాపరుడగుటగని రాణి కారణ మడిగెను. ఏమి ఫ్రభూ! విచారముగ నున్నారేం? దిగులేల? నా కిపుడు తెలుపుము. ఆ నాడు వరుణుని వలన భయముచే వనములకేగిన మన కుమారుడు వనమునుండి తిరిగి వచ్చెను. మీరు రాజసూయ మొనరించితిరి గదా! రాజేంద్రా! ఇక శోకకారణ మేమి? వంతయేలోకో తెల్పుము. నీకు బలశీలిగాని దుర్బలుడు గాని యగు శత్రువులేడు. వరుణుడును నీయెడ ప్రసన్నుడయ్యెను. నీవీ భూతలమున ధన్యభాగుడవు. ఇక దిగులువదలుము. నరవరా! చింతచే శరీరము క్షీణించును. చింత చావువంటిది. కనుక చింత వదలుము. వివేకముతో నిశ్చింతగ నుండుము. అను తన ప్రియురాలి మాటలువిని రాజు తన చింతయొక్క మంచిచెడుల కారణము తెలిపెను. రాజు చింతాపరవశుడగుట వలన నతనికి భోజనము రుచించుటలేదు. మెత్తని సెజ్జపై పరుండినను కంటినిండ నిద్దుర పట్టుట లేదు. మరునాడు వేకువనే రాజు లేచి సంధ్యావందనాదులు నిర్విర్తించుకొనుచున్నంతలో నచటికి విశ్వామిత్రుడేతెంచెను. సర్వము హరించిన మునితన రాక రాజునకు తెలిపెను. రాజు వచ్చి మాటిమాటికి మునికి మ్రొక్కెను. అపుడు ముని రాజున కిట్లనెను. రాజా! నీ రాజ్యము వదలుము. నీవు మాట యిచ్చినది నాకిమ్ము. రాజేంద్రా! బంగారము నొసంగుము. సత్యశీలివిగమ్ము. హరిశ్చంద్రు డిట్లనెను : విశ్వామిత్ర మునీ! స్వామి! నా రాజ్యమంతయును నీకు దానము చేసితిని గదా! దిగులొందకుము. ఇది వదలి మఱొకచోటి కేగుదును. బ్రాహ్మణుడా! విభూ! నా సర్వస్వమును నీవు గ్రహించితివి. ఇపుడు నేను బంగారమును దక్షి ణగ నిచ్చు కశక్తుడను. నాకు దైవయోగమున ధనము లభించినచో నీకు తప్పక దక్షిణ చెల్లింపగలను.

ఇత్త్యుక్త్వా నృపతిః ప్రాహ పుత్రం భార్యాం చ మాధవీమ్‌ | రాజ్య మసై#్మ ప్రదత్తంవై మయా వేద్యాం సువి స్తరే. 51

హస్త్యశ్వ రథసంయుక్తం రత్న హేమ సమన్వితమ్‌ | త్యక్త్వా త్రీణి శరీరాణి సర్వంచాసై#్మ సమర్పితమ్‌. 52

త్యక్త్వాయోధ్యాం గహిష్యామి కుత్రచిద్వన గహ్వరే | గృహ్ణాత్విదం మునిః సమ్య గ్రాజ్యం సర్వసమృద్ధిమత్‌. 53

ఇత్యాభాష్య సుతం భార్యాం హరిశ్చంద్రః స్వమందిరాత్‌ | వినిర్గతః సుధర్మాత్మామానయం స్తం ద్విజో త్తమమ్‌. 54

ప్రజంతం భూపతిం వీక్ష్య భార్యాపుత్రా వుభావపి | చింతాతురౌ సుదీనాస్యౌ జగ్మతుః పృష్ఠత స్తదా. 55

హాహాకారో మహానాసీ న్నగరే వీక్ష్య తాం స్తథా | చుక్రుశుః ప్రాణినః సర్వే సాకేతుపురవాసినః. 56

హా రాజన్కిం కృతం కర్మ కుత క్లేశః సమాగతః | వంచితోసి మహారాజ విధినాపండితేనహ. 57

సర్వే వర్ణాస్తదా దుఃఖ మాప్నుయు స్తం మహీపతిమ్‌ | విలోక్య భార్యయా సార్థం పుత్రేణ చ మహాత్మనా. 58

నినిందు ర్బ్రాహ్మణం తం తు దురాచారం పురౌకసః | ధూర్తోయ మితి భాషంతో దుఃఖార్తా బ్రాహ్మణాదాయః.

నిర్గత్య నగరా త్తస్మా ద్విశ్వామిత్రః క్షితీశ్వరమ్‌ | గచ్చంతం తమువాచేదం సమేత్య నిష్ఠురం వచః. 60

దక్షిణాయాః సువర్ణం మే దత్వా గచ్ఛ నాధిప | నాహం దాస్యామి వా బ్రూహి మయాత్యక్తం సువర్ణకమ్‌. 61

రాజ్యం గృహాణ వా సర్వం లోభ##శ్చేద్ధృది వర్తతే | దత్తం చే న్మన్యసే రాజ న్దేహి యత్తత్పృతి శ్రుతమ్‌. 62

ఏవం బ్రువంతం గాధేయం హరిశ్చంద్రో మహీపతిః | ప్రణిపత్య సుదీనాత్మా కృతాంజలి పుటో బ్రవీత్‌. 63

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే ఏకోనవింశోధ్యాయః

మరియు రాజు మాధవి యను తన భార్యతో తన కొడుకుతో నిట్లనెను. నేనీ మునికి యజ్ఞవేదిక యందు నా రాజ్యము దానము చేసితిని. నా రథ-గజ-తురగములు-బంగారము-రత్నములు సర్వమును సమర్పించితిని. కాని మన మూడు శరీరము లతని కీయలేదు. కనుక మన మిపు డీ యయోధ్యవదలి యడవు లందలి గుహలకు వెళ్ళుదుము. ముని సకల సమృద్ధమగు రాజ్యమును గ్రహించుగాక. అని హరిశ్చంద్రుడు తన భార్యాపుత్రులతో బలికి తన భవనము వదిలి ధర్మబుద్ధితో మునిని గౌరవించుచు బయలువెడలెను. అట్లు రాజు వెడలుటగని యతని భార్యాపుత్రులును చింతాతురులై దీన ముఖములతో రాజు వెంట నడచిరి. వారట్లు వెడలుట గనిన పౌరులు హాహాకారములు చేసిరి. సాకేతపురవాసు లందఱును గొల్లున విలపించిరి. ఓ రాజా! ఎంత పని జరిగినది! నీకెక్కడి యాపద దాపురించెను! మంచిచెడు లెఱుగని దైవమే నిన్ను వంచించినది గదా! ఇట్లు రాజును నతని భార్యను మహాశయుడగు రాజపుత్రుని చూచిన యన్ని జాతులవారు కడు దుఃఖించిరి. పురము లోని బ్రాహ్మణులు మున్నగువారు దుఃఖార్తులై ముని దురాచారుడు మోసగాడు అని నిందించిరి. నగరు వెడలి వెళ్ళుచున్న రాజును వెంబడించి విశ్వామిత్రు డతనిష్ఠురముగ నిట్లనెను: ఓయి నరపతీ! నాకు దక్షిణక్రింద బంగారమిచ్చి కదలుము. లేదా నాకు చేతకాదని యనుము. నిన్ను వదిలిపెట్టుదును. నీ గుండెలో లోభమున్నచో నీ రాజ్యము తిలిగి నీవే తీసికొనుము. నిజముగ నిచ్చితినని తలంచినచో నీ మాట నిలువబెట్టుకొనుము. ఇట్లు విశ్వామిత్రుడు పలుకుచుండగ హరిశ్చంద్రుడు కడు దీనముగ జోడించి నమస్కరించి ముని కిట్లనెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమందు పందొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters