Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోదశో7ద్యాయః

ఇతి తే కథితం భూప యద్యత్పృష్టం త్వయా7నఘ | నారాయణన యత్ప్రోక్తం నారదాయ మహాత్మనే . 1

శ్రుత్వైతత్తు మహాదేవ్యాః పురాణం పరమాద్బుతచమ్‌ | కృతకృత్యో భ##వేన్నర్త్యో దేవ్యాః ప్రియతమో హి సః . 2

కురు చాం బామఖం రాజ న్స్వపితు ద్ధరణాయవై | భిన్నో7 సి యేన రాజేంద్ర పితు ర్జాత్వా తు దుర్గతిమ్‌ | 3

గృహాణ త్వ మహాదేవ్యా మంత్రం సర్వోత్తమోత్తమమ్‌ | యథావిధివిధానేన జన్నసాఫల్యదాయకమ్‌ . 4

సూత ఉవాచ: యచ్చ్రత్వా నృపశార్దుల ప్రార్థయిత్వా మునీశ్వరమ్‌ | తస్మా దేవ మహామంత్రం దేవీ ప్రణవ సంజ్ఞకమ్‌. 5

దీక్షావిధివిధానేన జ గాహ నృపసత్తమః | తత ఆహుయ ధౌమ్యాదీ న్నవరాత్రసమాగమే. 6

అంబాయజ్ఞం చకారశు విత్తశాఠ్యవివర్జిత | బ్రహ్మణౖః పాఠయామాస పురాణం త్వేత దుత్తమమ్‌ . 7

శ్రీదేవ్యగ్రే7ంబికా పీత్యై దేవీ భాగవతం పరమ్‌ | బ్రహ్మణా న్బోజయామాసాప్యసంఖ్యాతాన్సువాసినీః . 8

కుమారీర్వయుకాదీం శ్చ దీనానాథాం స్తథైవ చ | ద్రవ్య ప్రదానై స్తాన్సార్వా న్నంతోష్య వసుధాధిపః . 9

సమాప్య యజ్ఞం సంస్థానే సంస్థితో యావదేవ హి | తావదేవ హి చాకాశా న్నారదః సమవాతరత్‌ . 10

రణయన్మహతీం వీణాం జ్వలదగ్ని శిఖోపమః | ససంభ్రమః సముత్ధాయ దృష్ట్వా తం నారదం మునిమ్‌. 11

ఆసనాద్యుపచారైశ్చ పూజయామాస భూమిపః | కృత్వా తు కుశల ప్రశ్నం పప్రచ్ఛాగమకారణమ్‌. 12

పదుమూడవ అధ్యాయము

జనమేయజయుడు శ్రీదేవీ దీక్షను స్వీకరించుట

వ్యాసుడిట్లనియె: ఆనఘడవగు రాజా !ఈ ప్రకారముగ నారాయణుడు మహాత్ముడు నారదుని ప్రశ్నలకన్నిటి కిని సమాధానము లొసంగె ను. అటులే నీ వడగినవన్నియును నీకు తెలిపితిని. పరమాద్బుతమైన దేవీ మహాపురాణమును వినినవాడు ధన్యజీవుడగును. శ్రీదేవికి ప్రీతిపాత్రుడుడగును. నీ తండ్రి దుర్గతి బొందుటవలన నీవు భిన్నడవై యున్నావు. కనుకనీ తండ్రి నుద్ధరించుటకు నీవు దేవీ మహాయాగ మొనరింపుము. నీవి మొదట నుత్తమోత్తమైన మహాదీవి మంత్రము స్వీకరింపుము. దానిని విధివిధానముగ నాచరించిననచో నీ జన్మము ధన్యమగును; సఫలత్వ మొందును. సూతుడిట్లనియెను: వ్యాసుని మాటలు విని జనమేజేయుడు వ్యాస మునీంద్రుని ప్రార్థించి యతనివలన శ్రీదేవీ ప్రణవసం జ్ఞతే నొప్పు శ్రీదేవీ మహా మందము దీక్షా విధానముతో స్వీకరించెను. అటు పిమ్మట దౌమ్ముడు మొదలగు మహర్షులను పిలిపించెను. దేవీ నవరాత్రము లందు జనమేజయుడు డబ్బు లోపముచేయకదేవీ మహాయజ్ఞము కొనసాగించెను. విప్రులవలన శ్రీదేవీ మహాపురాణమును చదివించెను. శ్రీదేవీ ప్రీతి కొఱకపుడు రాజు దేవి సన్నిధిలో చక్కగ శ్రద్ధగ శ్రీదేవీ భాగవతామృతమున తన చెవులను దొన్నెలతో త్రాగెను. ఎందరెందఱో బ్రహ్మణులకు ముతైదువలకు భోజనములు పెట్టించెను. కుమారికలకు- బ్రహ్మచారులకు - దిక్కులేనివారికి- అనాదులకును భోజనములు పెట్టించెను. వారికి విస్తారముగా ద్పవ్యము లొసంగి రాజు వారినెల్లరిని సంతోషపఱచెను. దేవీ యజ్ఞము సమాప్తము చేసి రాజు యాగశాలలో నుండగనే గగన వీథినుండి నారదుడు దిగి వచ్చెను. అగ్ని కాంతుల వెలుగొందు నారదుడు తన మహతి యను వీణియ మీటుచు వచ్చినంతనే రాజు చూచి ససంభ్రముగ లేచి నిలబడెను. రాజు ముని కాసనాదులొసంగి యతనిని పూజిచి కుశలప్రశ్నము లడిగి యతని రాకకు కారణ మడిగెను.

రాజోవాచః కుత ఆగమనం సాధో బ్రూహి కిం కరవాణి తే | సనాథోహం కృతార్థో7 వాం త్వదాగమన కారణాత్‌. 13

ఇతి రాజ్ఞో వచః శ్రుత్వా ప్రోవాచ మునిసత్తమః | అద్యా77శ్చర్యం మయా దృష్టం దేవలోకే నృపో త్తమ 14

తన్నివేదయితుం ప్రాప్తస్త్వత్సకాశే సువిస్మితః | పితాతే దుర్గతిం ప్రాప్తో నిజకర్మవిపర్యయాత్‌ . 15

స ఏవాయం దివ్యరూపవపూర్బూత్వా7 ధునైవ హి | దేవదేవైః స్తుతః సమ్య గప్సరోభిః సమంతతః. 16

విమానవర మారుహ్వ మణిద్వీపం గతో భవత్‌ | దేవీభాగవతస్యాస్య శ్రవణోత్థ ఫలేన చ . 17

అంబామఖఫలేనాపి పితా తే సుగతిం గతః | ధన్యో7సి కృతకృత్యో7సి జీవితం సఫలం తవ. 18

నరకా దుద్ధృత స్తాత స్త్వయాతు కులభూషణ | దేవలోకే స్వీతక్రీర్తి స్తవాద్య విపులా7భవత్‌ . 19

సూత ఉవాచః నారదోక్తం మాకర్ణ్య ప్రేమగద్గితాంతరః | పపాత పాదాంబుజయో ర్వ్యాసస్యాద్బుతకర్మణః. 20

తవానుగ్రహతో దేవకృతోర్థా7హం మహామునే | కిం మయా ఎప్రతికరవ్యం నమస్కారాదృతే తవ. 21

అనుగ్రహ్యః సదైవాహ మేవమేవ త్వయా మునే | ఇతి రాజ్ఞో వచః శ్రుత్వా ప్యాశీభి రభినంద్య చ . 22

రాజిట్లనియె: సాధుసత్తమా! తామెక్కడి నుండి యే తెంచితిరి? నేను నీకేమి ప్రియము గూర్చగలను? మీరాక వలన నేను ధన్యుడను- సనాధుడనైతిని. అనుచరాజు మాటలు విని మునిసత్తము డిట్లనియెను: నరోత్తమా! ఇప్పుడు నేను దేవలోగము నందొక యాశ్చర్యము పొడగంటిని. నేను దాని కబ్బురపడి నీకది విన్నవించుటకు నీ చెత కరుదెంచితిని. నీ తండ్రి తన చెడు కర్మకు ఫలితముగ దుర్గతిబొంది యుండెను. కాని నేడతడే దివ్యరూపము దాల్చి దేవతలచేత ప్రస్తుతులందుకొనుచు నచ్చరలతో సరససల్లాపములాడుచు దివ్య విమానమేక్కి మణి ద్వీపముకేగెను. దీనికంతటికి కారణము నీవు దేవీ భాగవతము ను వినిన ఫలితమే . నీ వంబా యజ్ఞము సమాచరించుట వలన నీ తండ్రి సుగతి బొందెను. నీ జన్మము చరితార్థమైనది. ధన్యమైనది : సఫలమైనది. కులభూషణా! నీవు నీ తేంద్రి నరకకూపమునుండి సముద్ధరించితివి.

ఇపుడు దేవిలోకమందు నీ ప్రసంసలు మిన్ను ముట్టుచున్నవి. సూతుడిట్లనియెను. అనునారదుని వచనము లాలకించి జనమేజయుడు. ప్రేమతో డగ్గుత్తికతో నద్బుతకర్ముడగు వ్యాసుని పదకమలములపై తన తల యుంచెను. మహామునీ! నీ యనుగ్రహమున ధన్యుడనైతిని. ఈ నీ మహోపకారమునకు నమస్కారము చేయుటకన్న ప్రతిఫలమేమి యీయగలను? ఇప్పటివలె నీ దయనాపై నెప్పటికిని నిలచి యుండనిమ్ము." అను రాజు ప్రార్థన విని వ్యాసుడతని నాశీస్సులచే నభినందించెను.

ఉవాచ వచనం శ్లక్‌ష్ణం భగవాన్బారాయణః | రాజన్సర్వం పర్తిత్యజ్య భజ దేవీపదాంబుజమ్‌ . 23

దేవీభాగవతం చైవ పఠ నిత్యం సామాహితంః | అంబామఖం సదాభక్త్యా కురు నిత్య మతంద్రితః. 24

అనాయాసేన తేన త్వం మోక్షస్యే భవబంధనాత్‌ | సంత్యన్యాని పురాణాని హరిరుద్రాముఖాని చ. 25

దేవీ భాగవతస్యాస్య కలాం నార్హంతి షోడశీం | సారమేతత్పురాణానా వేదనాంచైవ సర్వశః. 26

మూలప్రకృతి రేవై షా యత్రుతు ప్రితి పాద్యతే | సమం తేన పురాణం స్యా త్కథ మన్య న్నృపోత్తమ. 27

పాఠే వేదసమం పుణ్యం యస్య స్యా జ్జనమేజయ | పఠితవ్యం ప్యత్నేన తదేవ విబుధోత్తమైః . 28

ఇత్యుక్త్వా నృపవర్యం తం జగామ మునిరాట్తతః | జగ్ముశ్చైవ తథా స్థానం ధౌమ్మాదిమునయో మలాః . 29

దేవీ భాగవతసై#్యవ ప్రశంసాం చక్రు రుత్తమామ్‌ | రాజా శశాస ధరణీం తతః సంతుష్టమానసః . 30

దేవీ భాగవతం చైవ పఠన్‌ శృణ్వ న్నిరంతరం |

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే త్రయోదశో7ధ్యఃయా

మఱియు బాదరాయణుడగు వ్య్సుడు ప్రియ- మృదు వచనములతో నిట్లు రాజా! నీవన్నియు వదలి శ్రీదేవీ పదపద్మములు నిత్యము కొలుచుచుండుము. నీవు ప్రతిదినమును విధేయాత్ముడవై శ్రీదేవీభాగవతమును శ్రద్ధగ చదువుము. అలసత చేయక పరభక్తితో దేవీ యజ్ఞము చేయుచుండుము. అటుల చేయిచుండుట వలన సంసార బంధముల నుడి విడివడి యవలీలగముక్తి నొందగలవు. ఇది కాక శివపురాణము- విష్ణుపురాణము నితర దేవతల పురాణలులు ఎన్నో కలవు. కాని యవన్నియు కలిసినప్పటికిని దేవీ భాగవతములోని పదారవ కళకు సాటిగావు. ఈ దేవీ భాగవత మెల్ల పురాణముల సారము. ఏలన నిందులో శబవ బ్రహ్మరూపిణియైన మూలప్రకృతి ప్రతిపాదించబడినది. ఇది త్రిగుణముల సామ్యావస్థను తెలుపును. ఇతర పురాణముల తెలుపవు. కావున నవి దీనికి సరిగావు. జనమేజయా !దేవీ భాగవతముల చదువుట వలన వేదము చదివినంత ఫలము గల్గును. పుణ్యము గల్గును : ఉత్తమ విద్వాంసులు తప్పక నిత్యము దేవీభాగవతమును చదువుచుండవలయును. అని వ్యాసుడు పలికి జనమేజేయుని విడ్కొని వెళ్ళెను. ధౌమ్యాది మునులును తమ తమ నెలవుల కరిగిరి . వారందఱును దేవిభాగవతమును ప్రశంసింపదొడంగిరి. తర్వాత జనమేజేయుడు సంతోషముతో చక్కగ రాజ్యము చేసెను. మఱియు నతడు శ్రీదేవీ భాగవతమునే వినుచ- చదువుచు తన జీవితము గడపెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి ద్వాదశ స్కంధములో పదుమూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters