Sri Devi Bagavatham-2    Chapters   

అథ నవమో7ధ్యాయః.

వ్యాస ఉవాచ : కదాచి తథ కాలేతు దశపంచసమా విభో | ప్రాణినాం కర్మవశతో న వవర్ష శతక్రతుః. 1

అనవృష్ట్యా తిదుర్బిక్ష మభవత్షయ కారకమ్‌ | గృహే గృహే శవానాంతు సంఖ్యా కర్తుంన శక్యతే. 2

కేచిదశ్వాన్వరాహాన్వా భక్షయంతి క్షుధార్దితాః | శవాని చ మనుష్యాణాం భక్షయం త్వపరే జనాః. 3

బాలకం బాలజననీ స్త్రీయం పురుష ఏవచ | భిక్షతుం చలితాః సర్వే క్షుధయా పీడితా నరాః. 4

బ్రాహ్మణా బహవస్తత్ర విచారం చక్రురుత్తమమ్‌ | తపోధనో గౌతమో7స్తి సనః ఖేదం హరిష్యతి. 5

సర్వై ర్మిళిత్వా గంతవ్యం గౌతముస్యాశ్రమే ధునా | గాయత్రీ జపసంసక్త గౌతమస్యాశ్రమే7ధునా. 6

సుభిక్షం శ్రూయతే తత్ర ప్రాణినోబహవోగతాః | ఏవం విమృశ్య భూదేవాః సాగ్నిహోత్రాః కుటుంబినః. 7

సగోధనాః సదాసాశ్చ గౌతమస్యా77శ్రమం యయుః | పూర్వదేశాద్యయుః కేచిత్కేచిద్దక్షిణ దేశతః. 8

పాశ్చాత్యా ఔత్తరాహాశ్చనానాదిగ్బ్యః సమాయయుః | దృష్ట్వా సమాజం విప్రాణాం ప్రణనామ స గౌతమః. 9

ఆసనా ద్యుపచారై శ్చ పూజయామాసబాడబా | చకార కుశల ప్రశ్నం తతశ్చాగమ కారణమ్‌. 10

తే సర్వే స్వస్వ వృత్తాంతం కథయామాసురుత్స్మయాః | దృష్ట్వాతా న్దుఃఖితా న్విప్రా నభయం దత్తవాన్మునిః.

యుష్మాక మేతత్సదనం భవద్దాసో7స్మి సర్వథా | కా చింతా భవతాం విప్రా మయిదాసే విరాజతి. 12

తొమ్మిదవ అధ్యాయము

గాయత్రీ మహిమము.

వ్యాసు డిట్లనియెను : రాజా! మున్నొకప్పుడు ప్రాణుల చెడు కర్మలవశమున పదునైదేండ్లు వానలుపడలేదు. ఆయనా వృష్టివలన సర్వనాశనమయ్యెను. కరవు కాటకము లెక్కువయ్యెను. ఇంటింట పీనుగుల సంఖ్య లెక్క పెట్ట వీలు లేకుండెను. కొందఱాకలి బాధను తట్టుకొనలేక గుఱ్ఱములను పందులను తినిరి. మఱికొందరు మనుజుల పీనుగులను పీకికొని తినిరి. ఆ యాకలి బాధచేత తల్లి బిడ్డను పురుషుడు స్త్రీని చంపి తినెను. అపుడు బ్రాహ్మణులందఱును కలిసి యిట్లాలోచించిరి. ఈ సమయమున మహాతపస్వియైన గౌతముడొక్కడే మన బాధలను మానుప జాలినవాడు. కనుక మన మందఱమును కలిసి యిపుడా గౌతమునాశ్రమము చేరుదము. అతడు తన యాశ్రమమున గాయత్రీ జపతత్పరుడైయుండును. అచట సుభిక్షముగ నున్నది. అచ్చొట పెక్కుమంది బ్రదుకుచున్నారు. అని తలంచి సాగ్నిహోత్రులు-గృహస్థులునైన విప్రులు తమ తమ యాలమందలతో దాసదాసీ జనముతో గౌతము నాశ్రమము చేరిరి. వారిలో కొందఱు దక్షిణము నుండియును కొందఱు పడమటి నుండియు నింక కొందఱుత్తరము నుండియును ఇట్లు పెక్కు దిశలనుండి వచ్చిరి. ఆ బ్రాహ్మణుల నెల్లరినిగాంచి గౌతముడు వారికి నమస్కరించెను. ఆ వచ్చిన వారికి తగిన యాసనములొసంగి పూజించి కుశల ప్రశ్నలతో సత్కరించి వారిరాకకు కారణమడిగెను. వారందఱును గౌతమునితో తమతమ కష్టములు తెలుపుకొనిరి. దుఃఖితులగు బ్రాహ్మణులను జూచి గౌతమ ముని వారి కభయమొసంగి యిట్లనియెను. ''ఇది మీయిల్లు; నేను మీదాసుడను. ఓ విప్రులారా! మీదాసుడుండగా మీకీ విచారమేల.

ధన్యో7హమస్మిన్సమయే యూయంసర్వేతపోధనాః | యేషాం దర్శన మాత్రేణ దుష్కృతం సుకృతాయతే. 13

తే సర్వే పాదరజసా పావయంతి గృహం మమ | కోమదన్యో భ##వేద్ధన్యో భవతాం సమనుగ్రహాత్‌. 14

స్థేయం సర్వైః సుఖేనైవ సంధ్యాజపపరాయణౖః |

వ్యాస ఉవాచ : ఇతి సర్వా న్సమాశ్వాస్య గౌతమో మునిరాట్తతః. 15

గాయత్రీం ప్రార్థయామాస భక్తి సన్నత కంధరః | నమోదేవీ మహావిద్యే వేదమాతః పరాత్పరే. 16

వ్యాహృత్యాదిమహా మంత్రరూపే ప్రణవరూపిణి | సామ్యావస్థాత్మికే మాత ర్నమో హ్రీంకారరూపిణి. 17

స్వాహా స్వధా స్వరూపే త్వాం నమామి సకలార్థదామ్‌ | భక్తకల్పలతాం దేవీ మవస్థాత్రయసాక్షిణీమ్‌. 18

తుర్యాతీతస్వరూపాంచ సచ్చిదానందరూపిణీమ్‌ | సర్వవేదాంతసంవేద్యాం సూర్యమండలవాసినీమ్‌.19

ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరామ్‌ |

సాయాహ్నే కృష్ణవర్ణాంతాం వృద్ధాం నిత్యం నమామ్యహమ్‌. 20

సర్వభూతారణ దేవీ పరమేశ్వరి | ఇతి స్తుతా జగన్మాతా ప్రత్యక్షం దర్శనం దదౌ. 21

పూర్ణపాత్రం దదౌ తసై#్మ యేనస్యా త్సర్వపోషణమ్‌ | ఉవాచ ముని మంబా సా యంయం కామం త్వమిచ్చసి. 22

తస్య పూర్తికరం పాత్రం మయాదత్తం భవిష్యతి | ఇత్యుక్త్వా7ంతర్దధే దేవీ గాయత్రీపరమా కళా. 23

అన్నానాం రాశయ స్తస్మా న్నిర్గతాః పర్వతోపమాః | షడ్రసా వివిధా రాజం స్తృణాని వివిధాని చ. 24

తపోధనులగు మీయందఱి దర్శన భాగ్యమువలన చెడుసైతము మంచిగ మారగలదు. మీ యందఱ పాదధూళిచే నా గృహముసావనమైనది. మీ యందఱ యను గ్రహమునకు పాత్రుడనైన నాకన్న ధన్యు డిం కెవడు గలడు? మీరందఱును సంధ్యాజప పరాయణులై యిట సుఖముగనుండును. అని గౌతమ మునివర్యుడు వారందఱ నూరడించెను. గౌతముడుపర భక్తితో వినయముగ తలవంచి గాయత్రీ దేవి నిట్లు ప్రార్థించెను. వేదమాతా ! పరాత్పరా ! మహావిద్యా ! వ్యాహృ త్యాది మంత్రరూపిణీ ! ప్రణవ స్వరూపిణీ ! సామ్యావస్థాత్మికా ! హ్రీంకారరూపిణీ ! స్వాహాస్వధా స్వరూపిణీ ! సకలార్థ ప్రదాయినీ ! భక్త కల్పలతికా ! అవస్థా త్రయసాక్షిణీ ! నీకు కోటి నమస్సులు, తురీయా ! విశ్వరూపిణీ ! సచ్చిదానంద స్వరూపిణీ ! సర్వవేదాంత వేద్యా ! సూర్యమండలవాసినీ ! నీవుదయమున రక్తవర్ణవు - బాలవు; మధ్యాహ్నమున నవయువతివి; సాయంకాలమున కృష్ణవర్ణవు - వృద్ధవు; నిత్యము నీకు కోటి నమస్సులు. సకల ప్రాణులను తరింపజేయు పరమేశ్వరీ నా యపరాధములను క్షమించుము అను సంస్తుతి విని గాయత్రీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమె గౌతమునకొక పూర్ణపాత్ర మొసంగెను. ఆపాత్ర మెందఱినైన పోషించగలదు. మునీ ! నీవు కోరిన దానిని ఈపాత్ర నీకీయగలదు. అట్టిపాత్ర నీకొసంగితిని'' అని పలికి పరమకళయగు గాయత్రి అదృశ్య అయ్యెను. అపుడాపాత్ర నుండి యన్నము పదార్థములు రాసులు రాసులుగ వెలువడెను. అందుండి షడ్రసములైన మధురపదార్థములు - పలువిధములైన గడ్డిపెక్కు విధముల పాత్రలు వస్త్రములు - సొమ్ములును యజ్ఞసాధన ములు విరివిగ వెల్వడెను.

భూషణాని చ దివ్యాని క్షౌమానివసనాని చ | యజ్ఞానాం చ సమారంభాః పాత్రాణి వివిధాని చ. 25

యద్యదిష్టమభూద్రాజ న్మునేస్తస్య మహాత్మనః | తత్సర్వం నిర్గతం తస్మాద్గాయత్రీ పూర్ణపాత్రతః. 26

తథా77హూయ మునీ న్సర్వాన్మునిరాడ్గౌతమస్తదా | ధనం ధాన్యం భూషణాని వసనాని దదౌమునే. 27

గోమహిష్యాదిపశవో నిర్గతాః పూర్ణపాత్రతః | నిర్గతా న్యజ్ఞసంభారాన్‌ స్రు క్ర్సువ ప్రభృతీన్ద దౌ. 28

తే సర్వే మిళితా యజ్ఞాం శ్చ క్రిరేముని వాక్యతః | స్థానం తదేవ భూయిష్ఠ మభవత్స్వర్గ సన్నిభమ్‌. 29

యత్కించి త్త్రిషులోకేషు సుందరం వస్తు దృశ్యతే | తత్సర్వం తత్ర నిష్పన్నం గాయత్రీ దత్త పాత్రతః.

దేవాంగనాసమా దారాః శోభంతే భూషణాదిభిః | మునయో దేవసదృశా వస్త్రచందనభూషణౖః. 31

నిత్యోత్సవః ప్రవవృతే మునేశ్రమమండలే | నరోగాదిభయం కిచిన్నచ దైత్యభయం క్వచిత్‌. 32

స మునే రాశ్రమో జాతః సమంతాచ్ఛతయోజనః | అన్యే చ ప్రాణినో యే పి తే పి తత్ర సమాగతాః. 33

తాం శ్చ సర్వాన్సు పోసా యం దత్త్వా7భయ మథాత్మవాన్‌ | నానావిధైర్మహా యజ్ఞై ర్విధివైకల్పితైః సురాః. 34

సంతోషం పరమం ప్రాపు ర్మునేశ్చైవ జగుర్యశః | సభాయాం వృత్రహా భూయో జగౌ శ్లోకం మహాయశాః. 35

అహోఅయంనః కిల కల్పపాదపో మనోరథాన్పూరయతి ప్రతిష్ఠితః |

నోచేదకాండే క్వహవిర్వపా వా సుదుర్లభాయత్రతతు జీవనాశా. 36

ఆ మునిరాజనకేది యిష్టమైన నదెల్ల పూర్ణపాత్రమునుండి వెలువడసాగెను. అంత గౌతమి మహర్షి బ్రాహ్మణ - మునులనెల్లరిని పిలిచి వారికి ధన ధాన్యములు వస్త్రములు సొమ్ములు ప్రదానము చేసెను. వేయేల ! ఆ పూర్ణపాత్రలోనుండి గోవు బఱ్ఱమున్నగు పశువులును యజ్ఞపరికరములును స్రుక్‌ స్రువములును వెలసినవి. గౌతముని మాట చొప్పున వారందఱును కలిసి యజ్ఞమారంభించిరి. ఆ ప్రదేశమపుడు స్వర్గసీమయో యన విలసిల్లెను. ముల్లోకములందెచ్చటెచ్చట నేయే నుందర వస్తువులు గలవోయవెల్ల ఆ పూర్ణపాత్రనుండి వెలువడుచుండెను. స్త్రీలు దివ్యభూషలుదాల్చి దేవ స్త్రీలవలె విరాజిల్లిరి. మునులు వస్త్రములు సొమ్ములు - చందనము దాల్చి దేవతలవలె విరాజిల్లిరి. ఇట్లు గౌతము నాశ్రమమున నిత్యోత్సవములు సాగుచుండెను. అచట రోగభయము దైత్యభయము మచ్చునకైన లేదు. గౌతమాశ్రమము నూఱామడల వఱకు వ్యాపించెను. ఇట్లెందరో ప్రాణులచటికివచ్చి బ్రదుకుచుండిరి. ఆత్మవంతుడగు గౌతమాశ్రమము నూఱామడల వఱకు వ్యాపించెను. వారు పలువిధములై మహాయజ్ఞములు జరిపిరి. దేవతలు సంతోషించిరి. అందఱును గౌతము కీరితి వేనోళ్ల బొగడిరి. ఇంద్ర సభలో నింద్రుడును స్వయముగ గౌతమునిటుల ప్రశంసించెను. ''ఆహా ! ఇపుడు గౌతముడు మాకు కల్పవృక్షము వంటివాడయ్యె ! అతడు కీర్తిమంతుడై మా కోరికలు తీర్చుచున్నాడు. లేనిచో నీ కరవు రోజులలో మాకీ హవిర్బాగములెక్కడి నుండి వచ్చును?

ఇత్థం ద్వాదశవర్షాణి పుపోష మునిపుంగవః | పుత్రవన్మునిరాడ్గర్వగంధేన పరివర్జితః. 37

గాయత్ర్యాః పరమం స్థానం చకార మునిసత్తమః | యత్ర సర్వై ర్మునివరైః పూజ్యతే జగదంబికా. 38

త్రికాలం పరయా భక్త్యా పురశ్చరణకర్మభిః | అద్యాపి తత్ర దేవీ సా ప్రాతర్బాలా తుదృశ్యతే. 39

మధ్యాహ్నే యువతీ వృద్ధా సాయంకాలే తు దృశ్యతే | తత్రైకదా సమాయాతో నారదో మునిసత్తమః. 40

రణయన్మహతీం గాయన్గాయత్ర్యాః పరమాన్గుణామ్‌ | నిషసాద సభామధ్యే మునీనాం భావితాత్మనామ్‌. 41

గౌతమాదిభి రత్యుచ్చైః పూజితః శాంతమాన సః | కథా శ్చకారవివిధా యశసోగౌతమస్య చ. 42

బ్రహ్మర్షే దేవసదసి దేవరాట్తవ యద్యశః | జగౌ బహువిధం స్వచ్ఛం మునిపోషణజం పరమ్‌. 43

శ్రుత్వా శచీపతే ర్వాణీం త్వాం ద్రష్టుమహమాగతః | ధన్యో7సి త్వం మునిశ్రేష్ఠ జగదంబాప్రసాదతః. 44

ఇత్యుక్త్వా మునివర్యం తం గాయత్రీసదనంయ¸° | దదర్శ జగదంబాం తాంప్రేమోత్పుల్లవిలోచనః. 45

తుష్టావ విధివద్దేవీం జగామ త్రిదివం పునః | అథ తత్ర స్థితా యేతే బ్రాహ్మణా ముని పోషితాః. 46

ఉత్కర్షం తు మునేః శ్రుత్వా7సూయయా ఖేదమాగతాః |

యథా7స్య న యశోభూయాత్కర్తవ్యం సర్వథైవ హి. 47

కాలే సమాగతే పశ్చాదితి సర్వైస్తు నిశ్చితమ్‌ | తతః కాలేన కియతా7ప్యభూ ద్వృష్టి ర్ధరాతలే. 48

ఈ విధముగ గౌతము డెల్లవారిని కన్నబిడ్లవలె పోషించెను. గౌతముడు తన యాశ్రమమును గాయత్రీపీఠముగ నొనరించెను. అప్పటి నుండి మునిజనులెల్లరును గాయత్రిని పూజించుచుండిరి. అచట మూడు వేళలయందు పరమనిష్ఠతో గాయత్రీ పురశ్చరణలు సాగుచుండెను. ఆచట నేటికిని గాయత్రీదేవి యుదయమున బాలారూపమున పట్టపగలు యువతిగను సాయంకాలమున వృద్ధగను గోచరించును. ఇట్లుండగ నొకనాడచటికి నారదమహర్షి యరుదెంచెను. నారదుడు తన మహతి వీణియ మీటుచు గాయత్రి దివ్య గుణములు గానము చేయుచుండెను. గౌతముడు మొదలగువారి పూజలందుకొని నారదుడు శాంతచిత్తుడయ్యెను. నారదుడును పలు తెఱంగుల గౌతమునిట్లు ప్రశంసించెను. బ్రహ్మర్షీ! యింద్రుడును దేవసభలో ''గౌత ముడు మునులను పోషించి చిరకీర్తి గడించె'' నని నిన్ము పొగడెను. ఇంద్రుని మాటలు విని నేను నిన్ను చూడవచ్చితిని. మునీశా! శ్రీగాయత్రీ వరప్రసాదమున నీవు కడుంగడు ధన్యాద్ముడవైతివి. అని నారదుడు గౌతమునితో బలికి గాయత్రియున్న చోటి కేగి ప్రేమభక్తి పెల్లుబికిన హృదయముతో ఆ దేవిని సందర్శించెను. అట నారదుడు గాయత్రిని పలురీతుల సంస్తుత్తంచి తిరిగి స్వర్గమేగెను. ఆవిధముగ బ్రాహ్మణులెల్లరును గౌతమునిచేతపోషింపబడిరి. గౌతమునికీర్తిప్రతిష్ఠలు గొప్పదనము విని విని యసూయ చెంది మును లతని కీరితి వమ్మగునట్లు చేయదలంచిరి. సమయము వచ్చినపుడు చూచుకొందమని యందఱ తలంచిరి. కొంత కాలమునకు వానలు కురిసెను.

సుభిక్షమభవత్సర్వందేశేషు సృపసత్తమl శ్రుత్వావార్తాం సుభిక్షస్య మిళితాః సర్వబాడవాః. 49

గౌతమంశప్తుముద్యోగం మహారాజ న్ప్ర చ క్రిరే l ధన్యౌతేషాం చపితరౌ యయోరుత్పత్తిదృశీ. 50

కాలస్యమపిపామా రాజన్వక్తుం కేన హి శక్యతే l గౌర్నిర్మితా మాయయైకా ముమూర్షు ర్జరతీనృప. 51

జగామ సాచ శాలాయాం హోమకాలే మునేస్తదాlహుం హుంశ##బ్దై ర్వారితా సాప్రాణాం స్తత్యాజ తత్షణ. 52

గౌర్హతా7నేన దుష్టేనేత్యేవంతే చుక్రుశుర్ద్విజాః l హోమంసమాప్య మునిరా డ్విస్మయం పరమంగతః 53

సమాధిమీలితాక్షః సం శ్చింతయామాసకారణమ్‌ l కృతం సర్వం ద్విజై రేత దితిజ్ఞాత్వా తదైవసః. 54

దధారకోపం పరమం ప్రళ##యే రుద్రకోపవత్‌ lశశాప చ ఋషీన్సర్వా న్కోపసంరక్తలోచనః 55

వేదమాతరి గాయత్ర్యాం తద్ద్యానేతన్మనోర్జపే lభవతా7నున్ముఖా యూయం సర్వథా బ్రాహ్మణాధమాః 56

వేదేవేదోక్త యజ్ఞేషు తద్వార్తాసు తథైవ చl భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః 57

శివేశివసగ మంత్రే శివశాస్త్రే తథైవచl భవతా7నున్ముఖా యాయం సర్వదా బ్రాహ్మణాధమాః. 58

మూలప్రకృత్యాం శ్రీదేవ్యాం తద్ధ్యానేతత్కథాసు చ lభవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 59

దేవీమంత్రే తథా దేవ్యాః స్థానే నుష్ఠాన కర్మణి l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణా ధమాః. 60

దేవ్యుత్సవ దిదృక్షాయాం దేవీనామానుకీర్తనే l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 61

రాజా! అపుడన్ని దేశములును పైరుపచ్చలతో-పాడిపంటలతో కళకళతాడెను. అదివిని బ్రాహ్మణులందఱు నొక చోట గుమిగూడిరి. వారందఱును తమ కన్నముపెట్టిపెంచిన గౌతమునకు శాపమీయ బూను కొనిరి. ఇట్టకొడుకులనుగన్న తల్లిదండ్రులనేమనవలయును. కాలమహిమ మిట్టదని తెల్పుట కెవనికి శక్యమగును? వారందఱును కలిసి చావ సిద్ధమైన యొకముసలి యావును కల్పించిరి. గౌతముడు హోమము చేయు వేళనది యాగశాలలోనికి వచ్చెను. అపుడు గౌతముడు దానిని గని హుంకారము చేసినంతనే యదిప్రాణములు వదలెను.''అయ్యె! ఈ దుష్టుడు గోవును చంపెను'' యనివారెల్లరును గౌత ముని నిందంపసాగిరి. గౌతముడపుడచ్చెరవొంది హోమముచాలించెను. అతడు సమాధిలో మునింగి దీనికారణము తెలిసికొనెను. ఇదంతయును బ్రాహ్మణులపన్నిన పన్నాగమేయని యతడెఱింగెను. ఆసమయమున గౌతమ మహర్షి ప్రళయరుద్రుని పగిది కన్నులెఱ్ఱజేసి బ్రాహ్మణులనందఱినీవిధముగ శపించెను. బ్రాహ్మణాధములారా! మీరు వేదమాతయగు గాయత్రి ధ్యానము జపము మానివేతురుగాక! గాయత్రీ మాతను వదలుటవలన మీరు తప్పక బ్రాహ్మణాధములుగురుగాక! వేదము లందును-యజ్ఞములందును-వేదవార్తలందును మీరు విముఖులగుదురుగాత! శివునందును శివ మంత్రమందును-శివ శాస్త్రములందును విముఖులై యుందురుగాక! మీరు మూలప్రకృతియైన శ్రీదేవి ధాన్యమందు- కథలందును విముఖులై యుందుయగాక! శ్రీదేవీ మంత్రము- అనుష్ఠానమను వదిలి మీరు బ్రాహ్మణాధములగుదురుగకా! శ్రీదేవీ మహోత్సవములు చూచుటకును శ్రీదేవీ దివ్యనామము కీర్తించుటకును మీరు నోచకుందురుగాక!

దేవీ భక్తస్య సాన్నిధ్యే దేవీ భక్తార్చనే తథా l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః.62

శివోత్సవదిదృక్షాయాం శివభక్తస్య పూజనే l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణా ధమాః. 63

రుద్రాక్షబిల్వపత్రే చ తథా శుద్ధే చధస్మనిl భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 64

శ్రౌతస్మార్తసదాచారజ్ఞాన మార్గే తథైవచ l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణా ధమాః. 65

అద్వైతజ్ఞాన విష్ఠాయాం శాంతి సత్యాది సాధనే l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 66

నిత్యకర్మాద్యను ష్ఠానే7ప్య గ్నిహోత్రాదిసాధనే l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 67

స్వాధ్యాయాధ్యయనైశ్చెవ తథా ప్రవచనేన చ l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 68

గోదానాదిషు దానేషు పితృశ్రాద్దేషు చైవ హి l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః 69

కృచ్ఛ్ర చాంద్రాయణ చైవ ప్రాయశ్చిత్తే తథైవ చ l భవతా7నున్ముఖా యూయం సర్వదా బ్రాహ్మణాధమాః. 70

శ్రీదేవీభిన్న దేవేషు శ్రద్ధాభక్తి సమన్వితాః l శంఖచక్రా ద్యంకితా శ్చ భవత బ్రాహ్మణాధమా. 71

కాపాలికమతాసక్తా బౌద్ధశాస్త్రరతాః సదా l పాఖంకడాచారనిరతా భవత బ్రాహ్మణాధమాః. 72

పితృమాతృసుతా భ్రాతృ కన్యా విక్రయిణ స్తథా l భార్యా విక్రయిణ స్త ద్వ ద్బవత బ్రాహ్మమాధమాః. 73

వేదవిక్రయణ స్తద్వత్తీర్థ విక్రయిణస్తథా l ధర్మ విక్రయిణ స్త ద్వ ద్బవత బ్రాహ్మణాధమాః. 74

మీరు దేవీభక్తిని దేవీపూజలను నిందించువారగుదురుగాక! శివమహోత్సవములు దర్శించు వేడుకయును శివభక్తులను సత్కరించు కొరికయును మీకు గలుగకుండుగాత! రుద్రాక్షలు- మారేడు-భస్మము వీనియందుమీకు ప్రీతిగలుగకుండగాత! శ్రుతిస్మృతు లందలి సదా చారమును జ్ఞానమార్గమును వదలివేసి తియగుబోతులై బ్రాహ్మణులలో నీచులైమీరు వర్తింతురు. అద్వైత మార్గమందును- జ్ఞానమందును- శాంతిదాంతులందును నిష్ఠలేని నికృష్ట జీవనులగు బ్రాహ్మణ భ్రష్టులై మీరు తిరుగుదురుగాక! నిత్య కర్మానుష్ఠానము-అగ్నికార్యమును జరుపుటయందు మీరు పెడ మొగముగల బ్రహ్మభ్రష్టులగుదురుగాక. వేదపఠనము-స్వాధ్యాయము- ప్రవచనము- లందును విముఖులై మీరు కర్మభ్రష్టులగుదురుగాక. గోదానములు- పితృశ్రాద్ధములు- చేయుట కిష్టపడని నికృష్టజీవనులగు బ్రాహ్మణాధములై మీరుందురుగాక. కృచ్చ్రము-చాంద్రాయణము-ప్రాయశ్చిత్తమును చేయని దురాచారులై మీరు బ్రహ్మణాధములైయుందురుగాక. గాయత్రీ మాతను వదలిపెట్టి యితర దేవతలను గొలిచి శంఖ చక్రములదాల్చు బ్రాహ్మణాధములై మీరు చెడుదురుగాక! కాపాలిక-బౌద్ధ-పాషండమతములందాసక్తిగలబ్రహ్మణాధములగుదురుగాక! తల్లిదండ్రులను-కన్నబిడ్డలను-సోదరులను-భార్యను అమ్ముకొని బ్రదుకు బ్రాహ్మణా ధములగుదురుగాక! వేదమును-తీర్దమును-ధర్మమును-నామసంకీర్తనమును విక్రయించునట్టి బ్రాహ్మణాధములగుదురుగాక!

పాంచరాత్రే కామశాస్త్ర తథా కాపాలికే మతే | బౌద్దే శ్రదాధయుతా యూయం భవత బ్రాహ్మణాధమాః. 75

మాతృకన్యా గా మినశ్చ భగినీ గా మిన స్తథా | పరస్త్రీలంపటాః సర్వే భవత బ్రహ్మణాధమాః. 76

యుష్మా కం వంశజాతా శ్చ స్త్రియ శ్చ పురుషాస్తథా | మద్దత్త శాపదగ్ధాస్తే భవిష్యంతి భవత్సమాః. 77

కిం మయా బహునోక్తేన మూలప్రకృతిరీశ్వరీ | గాయత్రీ పతరమా భూయా ద్యుష్మాసు ఖలుకోపితా. 78

పాంచరాత్రము-కామశాస్త్రము-బౌద్దము-కాపాలికము మున్నగు మతములం దాసక్తిగలబ్రహ్మణాధములగదురుగాక! తల్లి-కన్య-సోదరి మొదలగువారితో వావివరుసలు లేక కలియనట్టినీచ బ్రాహ్మణుదురుగాక! పరస్త్రీ లంపటులగుదురు గాక!మీరేకాక మీమీ వంశములందలి స్త్రీ-పురుషులును నా శాపాగ్నికి దగ్ధులగుదురుగాక! నేనింతగ చెప్పనేల! అమూల ప్రకృతి- మహేశ్వరియైన గాయత్రి దేవియును మిమ్ము కోపించియుండును. మీరంధ కూపము మున్నగు నరకకుండములందు పతితులగుదురుగాక!

అంధకూపాదికుంఢేషు యుశ్మాకం స్యాత్సదా స్థితిః l వ్యాస ఉవాచః వాగ్దండ మీదృశం కృత్వా ప్యుపస్పృశ్య జలం తతః. 79

éజగామ దర్శనార్థం చ గాయత్య్రాః పరమోత్సకఃl ప్రణానామ మహాదేవీం సా7పిదేవీ పరాత్పరా.80

బ్రాహ్మణానాం కృతిం దృష్ట్వా కస్మయంచిత్తే చాకారహ l అద్యాపి తస్యావదనం స్మయయక్తం చ దృశ్యతే . 81

ఉవాచ మునివర్యం తం స్మయమాన ముఖాంబుజా lభుజంగా యార్పితం దుబ్ధం విశాయైవో పజాయతే .82

శాంతిం పకురు మహాభాగ కర్మణో గతిరీదృశీ l ఇతి పదేవీం ప్రణమ్యాధ తతో7గాత్స్వా శ్రమంప్రతి. 83

తతో విపై#్రః శాపదగ్దేర్వి స్మృతా వేదరాశయః l గాయత్రి నిస్మృతా సర్వైస్తదుద్బుత మివా7భవత్‌. 84

తే సర్వే ధమిళిత్వాతు పశ్చాత్తాపయతా స్తథా l ప్రణముర్ముని వర్యం తం దండవత్పతితాభువి. 85

నోచుఃకించన వాక్యం తు లజ్జయా7ధోముఖాః స్థితాః l ప్రసీదేతి ప్రసీదేతి ప్రసీదేతి పునఃపునః. 86

ప్రార్థయామాసు చరభితః పరివార్య మునీశ్వరమ్‌ l కరుణా పూర్ణహృదయో మునిస్తా న్సమువాచ చ. 87

కృష్ణావతార పర్యంతం కుంభీపాకే భ##వేత్థ్సితిః l నమేవాక్యం మృషాభూయాదితి జానీధ సర్వథా. 88

తతః పరం కలియుగే భవిజన్మ భ##వేద్ధి వామ్‌ l మదుక్తం సర్వమేతత్తు భ##వేదేవనచాన్యథా . 89

మచ్ఛాపస్య విమోక్షార్దం యుష్మాకం స్యాద్య దీక్షణా l తర్హసేవ్యం సదా సర్వైర్గాయత్రి పద పంకజమ్‌. 90

వ్యాస ఉవాచః ఇతి సర్వాన్విసృజ్యాథ గౌతమె%ా మునిసత్తమః l ప్రారబ్ధమితి మత్వాతు చిత్తేశాంతిం జగామహ. 91

ఏతస్మాత్కరణా ద్రాజన్గతే కృష్ణే తు ధామని l కతౌ యుగే ప్రవృత్తేతుకుంభీపాకాత్తునిర్గతాః. 92

భువిజాతా బ్రహ్మణా శ్చ శాపదగ్దాః పూరాతుయే l సంధ్యా త్రువిహీనా శచ గారుత్రీభక్తి వర్జితాః. 93

వేదభక్తి విహీనా శచ పాఖండమత గామినః l అగ్విహోత్రాదిస త్కర్మ స్వధాస్వాహావివర్జితాః. 94

మూల ప్రకృతి మవ్యక్తాం నైవజానంతి కర్హచిత్‌ l తప్తముద్రాంకితాః కేచిత్కా మాచారరతాఃపరే. 95

కాపాలికాః కౌలికా శ్చ బౌద్ధా జైనాస్తథాపరే l పండితా అపి తే సర్వే దురాచారప్రవర్తకాః. 96

లంపటా పరదారేషు దురాచారపరాయణాఃl కుంభీపాకం పునః సర్వే యాస్మంతి నిజకర్మభీః. 97

తస్మాత్సర్వాత్మనా రాజన్సం సేవ్యా పరమేశ్వరి l న విష్ణూపాసనా నిత్యా న శివోపాసనా తథా. 98

నిత్మా చోపాసనా శ##క్తేర్యాం వినాతు పతత్యధాః l సర్వ ముక్త్‌ సమాసేన యత్స్రష్టం తత్త్వయా7నఘ. 99

అతఃపరం మణిద్వీపవ్ణనం శృణు సుందరమ్‌ lయత్పరస్థాన మాద్యాయా భువనేశ్యా భవారణః. 100

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టాదశసాహస్య్రాం సంహితాయాం ద్వాదశస్కంధే

నవమో7ధ్యాయః.

ఈ విధముగ గౌతమముని వారికి శాపమిచ్చి నీటిని తాకెను. పిదపర గౌతముడు పరమ సంతోషముచో శ్రీగాయత్రీ దర్శనమునకు బయలుచదేరెను. మహాదేవిని దర్శించి గౌతముడు ప్రణమిల్లెను. పరాత్పరయుగు దేవియను బ్రహ్మణులు చేసిన దూరాచారమునకు స్మయమొందెను. ఇంతవఱకును గాయత్రీదేవి ముఖ మట్లే ఉండెను. ఇపుడామె మఖకమల మందు చిర్నగవులు చిందులాడగ నామె మునివర్మునితో నిట్లు పలికెను. ''పామునకు పాలు పోసిన విషమగును. మహాను భావా!నీవిపుడు శాంతిగనుము. కర్మగతి యిటుతే యుండును.'' దేవి వాక్కులు విని గౌతముడు దేవికి నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అంత విప్రు లెల్లరును శాపదగ్ధు లగుట వలన వేదములు మరచిరి. వారికి గాయత్రీ మంత్రమును స్పురించుట లేదు. ఇదంతయు చూడగ నెంతయో వింతగ నుండెను. శాపగ్రస్తులైన బ్రాహ్మణులందరును పశ్చాత్తాప మొందిరి. వారు గౌతమ మునికి సాగిలపడి మ్రెక్కిరి. వారు సిగ్గుచే వంచిన తల యెత్త లేకుండిరి. ప్రసన్నుడవు గమ్ము. ప్రసన్నుడవు గమ్మని వారు మునిని పలుసార్లు ప్రార్దించిరి. ఇట్లు వారందఱును గౌతముని చుట్టు జేరి వేడుకొనసాగిరి. తుట్టతుగకు ముని గుండె కరగెను. అతడు దయతో వారితో నిట్లనెను. మీరెల్లరును శ్రీకృష్ణావతారము వఱకును కుంభీపాక నరకమున నుందురు. మీరు మరల కలియుగమున జన్మించగలరు. అపుడు మీకు నే నిచ్చన శాపములన్నియును జర్గి తీరగలవు. ఇది నిజము-నమ్ముడు- నా మాటకు తిరుగులేదు. కాని నా పశాపమునుండి విముక్తిని పొందదలచినచో మీరు గాయత్రీదేవి పదకమలమలు సేవింపుడు. ఈ విధముగా గౌతమమునిపలికి వారిని వదలి యంతయను పారబ్దకర్మఫలమని తలచి శాంతచిత్తుడయ్యెను. ఆకారణమున కృష్ణుడవతారము చాలించగనే కలియుగము ప్రారంభమయ్యెను. అపుడు వారందఱును కుంభీపాకమునుండి బరుటికి వచచిరి. అపుడు మునిశాపమునకు దగ్దులైనవారే యిపుడు త్రికాల సంద్యావందము-గాయత్రీ జపరతిలేని యధమాధములైన బ్రాహ్మణులుగ బుట్టిరి. వారు వేద-భక్తిరహితులు పాషండమతస్ధులు అగ్నిహోత్రాది కర్మరహితులు స్వాహా స్వధావిరహితులు నైరి. వారిలో నొకడైనను వ్యక్తమైన మూలప్రకృతి స్వరూపమెఱింగినవాడు లేడు. వారిలో కొందఱు తప్తముద్రలు వేయించుకొనిరి. కొందఱుకామాచారపరులైరి. వారు మహాపండితు లైనను కాపాలికులు కౌలికులు బౌద్దులు జైనులు దురాచారవర్తనులునై యుండిరి. వారు పరదారల వంపుసొంపులందుదగుల్కొన్న చిత్తము గలవారును దురాచారవర్తనులు నైరి. కనుక వారు మరల తమ తమ చెడు కర్మల పరిపాకము వలన కుంభీపాకమునందుగూలుదురు. నీవు మాత్రము సర్వాత్మాభావముతో శ్రీపరమేశ్వరీనే సంసేవింపుము. విష్ణూపాసన- శివోపాసనలు నిత్యములు గావు. శ్రీగాయత్రీ మహాదేవి నుపాసించుటే నిత్యోపాసనయనబడును. గాయత్రి నుపాసించని నరుడు తప్పక పతితుడు గాగలడు. అనఘా! నీ వడిగిన దంతయును సంక్షేపముగ తెలిపితిని . ఇకమీదట మణిద్వీపవర్ణన వినుము. అది యీరేడు లోకాలకు మూలకారణమైన శ్రీత్రిభువనేశ్వరీదేవి నివసించు పరమధామము.

ఇదిశ్రీదేవి భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters