Sri Devi Bagavatham-2    Chapters   

అథ షోడశోధ్యాయః.

వ్యాసః : గతేథ వరుణ రాజా రోగేణాతీవపీడితః | దుఃఖా ద్దుఃఖం పరం ప్రావ్యధితోభూత్‌భృశంతదా. 1

కుమారోసౌ వనే శ్రుత్వా పితరం రోగపీడితమ్‌ | గమనాయ మతిం రాజం శ్చకార సేహయంత్రితః. 2

సంవత్సరే వ్యతీతేతు పితరం ద్రష్టు మారరాత్‌ | గంతుకామం తు తం జ్ఞాత్వా శక్క స్తత్రాజగామహ. 3

వాసవ స్తు తదా రూపం కృత్వా విప్రస్య సత్వరః | వారయామాస యుక్త్యావై కుమారం గంతుముద్యతమ్‌. 4

ఇంద్రః. రాజపుత్ర న జానాసి రాజనీతిం సుదుర్లభామ్‌ | అతః కరోషి మూఢస్త్వం గమనాయ మతిం వృధా. 5

పితా తవ మహాభాగ బ్రాహ్మణౖ ర్వేదపారగైః | కారయిష్యతి హోమం తే జ్వలితేథ వీభావసౌ. 6

ఆత్మా హి వల్లభ స్తాత సర్వేషాం ప్రాణినాం ఖలు | తదర్ధే వల్లభాః సంతి పుత్రదారధనాదయః. 7

ఆత్మానో దేహరక్షార్దం హత్వా త్వాం వల్లభం సుతమ్‌ | హవనం కారయిత్వాసౌ రోగముక్తో భవిష్యతి. 8

తస్మాత్త్వయా న గంతవ్వం రాజపుత్త్రు పితుర్గృహే | మృతే పితరి గంతవ్వం రాజ్యార్దే సర్వధా పునః. 9

ఏవం నిషేధిత స్తత్ర వాసవేన నృపాత్మజః | వన మధ్యే స్థితః కామం పునః సంవత్సరం నృప. 10

అత్యంతం దుఃఖితం శ్రుత్వా హరిశ్చంద్రం తమాత్మజః. | గమనాయ మతిం చక్రే మరణ కృతినిశ్చయః. 11

తురాషాట్‌ ద్విజరూపేణ తత్రాగత్య చ రోహితమ్‌ | నివారయామాస సుతం యుక్తివాక్యైః. పునః పునః 12

హరిశ్చంద్రోతి దుఃఖార్తో వసిష్ఠ స్వపురో హితమ్‌ | పప్రచ్ఛ రోగనాశాయ తత్రోపాయం సునిశ్ఛితమ్‌. 13

పదునారవ అధ్యాయము

హరిశ్చంద్రోపాఖ్యానము

వ్యాసుడిట్లనెను: వరుణుడు వెళ్ళిన పిదప రాజు మిక్కిలి రోగపీడితుడయ్యెను. అతడు దుర్బర దుఃఖమును నెక్కువ క్లేశముననుభవించెను. తనతండ్రి రోగపీడితుడైన విషయము వనమందున్న రాకుమారుడు వినెను. అతడు పితృ భక్తి గలవాడై తన తండ్రి సన్నిధి కేగదంచెను. ఒక యేడాది గడిచిన పిమ్మటరోహితుడు తన తండ్రిని చూచుటకు వెళ్లదలచుట యెఱిగి యింద్రుడతని చెంతకేగెను. ఇంద్రుడు విప్ర వేషమున వచ్చి తన తండ్రిని జేరబోవుచున్న కుమారు నుపాయముతో నిలిపి వేసెను. ఇంద్రుడిట్లనెను : ఓ రాజపుత్త్రా! నీవు దుర్లభ##మైన రాజనీతి నెఱుగవు. అందులకే నీవు మూఢుడవై నీ తండ్రి చెంతకేగదలచితివి. నీవక్కడకేగినచో నీ తండ్రి వేదపారగులగు విప్రులచేత నిన్ను మండెడు నగ్నిలో హోమము చేయించును. ఎల్ల ప్రాణల కాత్మ ప్రియమైనది గదా! భార్యా-పుత్రులు-ధనము సర్వమాత్మ కొఱకే ప్రియమగుచున్నది. తన రోగ నివారణకు దేహ రక్షణకు నీ తండ్రి ప్రియుసుతుడవగు నిన్ను తప్పక హోమము చేయగలడు. కనుక రాచ పట్టీ! నీ విపుడు నీ తండ్రి చెంతకరుగవలదు. నీ తండ్రి మరణించిన పిమ్మట నపుడు రాజ్యమునకుతప్పక వెళ్ళవచ్చును. ఇట్లులింద్రుడు రాకుమారు నడ్డగింపగ నతడు మఱిమొక యేడువఱ కడవిలోనే యుండెను. ఆ పిదప హరిశ్చంద్రుడు చాల దుఃఖితుడగుట విని రోహీతుడు చావుదీనకు తెగించి తన తండ్రిని జేర నిశ్చయించుకొనెను. ఇంద్రుడు మరల విప్ర వేషమున నేతెంచి చతురోక్తులతో నతనికి వెళ్ళవద్దని పల్మారులు వారించెను. అట హరిశ్చంద్రు డతిశోకార్తుడై తన రోగము పోవునట్టి యుపాయము చెప్పమని పురోహితుడగు వసిష్ఠునడిగెను.

తమాహ బ్రహణః పుత్రో యజ్ఞం కురు నృపోత్తమ | క్రయక్రీతేన పుత్రేణ శాపమోక్షో భవిష్యతి. 14

పుత్రా దశవిధాః ప్రోక్తా బ్రాహ్మణౖ ర్వేదపారగైః | ద్రవ్యేణానీయ తస్మాత్త్వం పుత్రం కురు నృపోత్తమ. 15

వరుణోపి ప్రసన స న్సుఖకారీ భవిష్యతి | లోభాత్కోపి ద్విజః పుత్రం ప్రదాస్యతి స్వరాష్ట్రజః. 16

ఏవం ప్రచోదితో రాజా వసిష్టేన మహాత్మనా | ప్రధానం ప్రేరయామాస తదన్వేషణకామ్యయా. 17

అజీగర్తో ద్విజః కశ్చి ద్విషయే తస్య భూపతేః | తస్యాసం శ్ఛ త్రయః పుత్రా నిర్ధనస్య విశేషతః. 18

ప్రధానేనా ప్యసౌ పృష్టః పుత్రార్ధం దుర్బల ద్విజః | గవాం శతం దదామీతి దేహి పుత్రం మఖాయవై 19

శునః పుచ్ఛః శునః శేఫః శునో లాంగూల ఇత్యమీ | తేషా మేకతమం దేహి దదామి తు గవాం శతమ్‌. 20

అజీగర్త స్తు తద్ఛ్రుత్వా క్షధయా పీడితో భృమ్‌ శ | పుత్రం చ కమతం తేభ్యో విక్రేతుం వై మనోదధే. 21

కార్యాధికారిణం జ్యేష్ఠం మత్వా నాసావదాదముమ్‌ | కనిష్ఠం నాప్యదాన్మాతా మమైష ఇతి వాదినీ. 22

మధ్యయమంచ శునఃశేపం దదౌ గవాంశ##చేన చ | ఆవినాయ పశుం చక్రే నరమేధే నరాధిపః. 23

రుదంతం దుఃఖితం దీనం వేపమానం భృశాతురమ్‌ | యూపే బద్దం నీరీక్ష్యాముం చుక్రుశు ర్మునయ స్తదా. 24

శామిత్రాయ పశుం చక్రే నరమేధే నరాధిపః | శామితా నాదదే శస్త్రం తమాలంభయితుం శిశుమ్‌. 25

నాహం ద్విజసుతం దీనం రుదంతం కరుణంభృశమ్‌ | హనీష్యామి స్వలోభార్ధ మిత్యువాచాప్యసౌ తదా. 26

అంత వసిష్ఠు డిట్లనెను: ''రాజా! డబ్బిచ్చి యొక కుమారుని కొనుము. అతడు కొడుకు వంటివాడు. అతనితో యాగము చేయుము. నీ శాపము తీరిపోవును. పుత్రులు పది విధములని వేదపారగులగు విప్రుందురు. వారిలో క్రీతుడును నొక విధమగు కొడుకే. కనుక రాజా! డబ్బున కమ్ముడుపోయిన వానిని నీ కొడుకుగ జేసికొనుము. నీ దేశములోని యే విప్రుడైన డబ్బున కానపడి తన కొడుకు నమ్ముకొనును. అట్లు చేసినచో వరుణుడు తప్పక ప్రసన్నుడై నీకు మేలు చేకూర్పగలడు.'' అనిన వసిష్ఠుని వచనములచే రాజు చోదితుడై యొక విప్రకుమారుని కొనితెచ్చుటకు మంత్రిని బంపెను. హరిశ్చంద్రుని యేలుబడిలో ఆజీగర్తుడన నొక బీదబ్రాహ్మణుడు గలడు. అతనికి మువ్వురు కొమరులు. మంత్రి బీద బాపనితో నిట్లనెను. మారాజు చేయు యాగమునకై నీకుగల శునః పుచ్చుడు శునః శేపుడు శునోలాంగూలు డను ముగ్గురు కొమరులలో నొక్కని నిమ్ము. మారుగ నూఱావు లీయగలను. అజీగర్తు డాకలిమంటతో నక నక లాడుచుండెను. అతడది విని తన కొడుకు లలో నొక్కని నమ్ముటకు నిశ్చయించుకొనెను. జ్యేష్ఠుడు కర్మాధికారి. కనుక విప్రుడతని నీయలేదు. ముద్దులకొడుకగు చిన్న వానిని తల్లి ఈయననెను. ఇక మిగిలిన నడిమివాడగు శునః శేపుని విప్రుడు నూఱావుల కమ్మెను. రాజతనిని నరయజ్ఞమునకు పశువుగ సిద్ధపరచెను. ఆ బాలుడు యూపస్తంభమునకు కట్టబడి దీనముగ బిగ్గరగ వడకుచు వాపోవుటగని యచటి మునులెల్లురు బాధ పడిరి. ఆ నరపశువును చంపుమని రాజు శామితకు ఆజ్ఞ యీయగ నతడా సుకుమారుని చంపుటకు చేయాడక యాయుధము పట్టనేలేదు. దీనముగ కరుణరసము పెల్లుబుకునట్టు లేడ్చుతున్న బాలుని నేను నా లోభముకొఱకు చంపజాలననీ స్పష్టముగ చెప్పి వేసెను.

ఇత్యుక్త్వా వివరామాసౌ కర్మణో దుషకరా దధ | రాజా సభాసధః ప్రాహ కిం కర్తవ్య మితి ద్విజాః 27

జాతః కిలకిలాశబ్దో జానానాణ క్రోశతాం తదా | క్రందమానే శునః శేపే సభాయాం భృశమద్బుతమ్‌. 28

అజీగర్త స్తదోత్దాయ తమువాచ నృపోత్తమమ్‌ | రాజ న్కార్యం కరిష్యామి తవాహ సుంస్ధి రోభవ. 29

వేతనం ద్విగుణం దేహి హనిష్యామి పశుం కిల | కర్తవ్యం ముఖకార్యం వై మయాతేద్య ధనార్దినా. 30

దుఃఖితస్య ధనార్ధస్య సదాసూయా ప్రసూయతే. |

వ్యాస ఉవాచః తచ్ఛ్రుత్వా వచనం తస్య హరిశ్చంద్రో ముదాన్వితః. 31

తమువా చ దదా మ్యద్య గవాంశత మనుత్తమమ్‌ | తాదాకర్ణ్య పితా తస్య పుత్త్రం హంతుం సముద్యతః. 32

లోభే నా కుల చిత్తోసౌ శామిత్రే కృత నిశ్చయః | సముద్యతం చ తం దృష్ట్వా జనాః సర్వే సభాసదః. 33

చక్రుశు ర్బృశ దుఃఖార్తా హాహేతి జగదు ర్వచః | పిశాచోయం మహాపాపీ క్రూరకరాశి ద్విజాకృతిః. 34

యత్య్వయం స్వసుతం హంతు ముద్యతః కులపాంసనః | ధిక్చండాలకిమేతత్తే పాపకర్మ చికీర్షితమ్‌. 35

హత్యాసుతం ధనం ప్రాప్య కిం సుఖం తే భవిష్యతి | ఆత్మావై జాయతే పుత్ర అంగా ద్వై వేద భాషితమ్‌. 36

తత్కధం పాపబుద్దే త్వ మాత్మానం హంతు మిచ్చసి | ఏవం కోలా హలే తత్రజాతే కుశికనం దనః. 37

ఇట్లతడు చేయరానిపని చేయుటకు నిరాకరించెను. అపుడిక కర్తవ్య మేమని రాజు సభాసదుల నడిగెను. అట్లు శునః శేపుడు పెద్దగ బావురుమీ యేడ్చుచుండగ సభాజనులలో పెద్ద గగ్గోలు బయలుదేరెను. అంతలో అజీగర్తుడు లేచి రాజున కిట్లనెను. రాజా! నీవు నిశ్చింతగ నుండుము. నీ పని నేను నెఱవేర్పగలను. నేను ధనార్ధిని. కాన నిబ్బడి ధనమిమ్ము. నేనితనిని చంపినీ యాగము పూర్తి గావింతును. ధనాశ##చే పీడితుడైన వానికి పుత్రుల యందును ద్వేషబుద్ది పుట్టును. విప్రుని మాటలు విని హరిశ్చంద్రుడు సంతోషించెను. అంత రాజు నీకు మఱియొక నూరావు లిత్తునని పలుకగనే బ్రాహ్మణుడు తన కొడుకును చంపబూనుకొనెను. అట్లు విప్రుడు ధనాశకు లోబడి తనకున్న కొడుకును చంపుటకు తలపడుట సభలో వార్లెల్లరును చూచిరి. వారు మిక్కిలిగ దుఃఖించుచు హాహారవములు మిన్ను ముట్ట విల్లనిరి. ఇతుడు విప్రరూపముదాల్చిన పీశాచమో! పాపి! క్రూరుడు. కులము చెడబుట్టిన తండాలుడా! ఎంతటిపాపకర్మకొడి గట్టితివిరా! నీకన్నకొడుకునే చంపదలతివిరా! పాపాత్ముడా: కన్న కొడుకునే చేతులార చంపుకొని డబ్బుమూట గట్టి యేమి సుకమనుభవింపదలంచితివిరా! నీ యంగాల నుండి నీ యాత్మగ కొడుకుగ పుట్టెనని వేదమనునుగదా! పాపమతీ! నీ కన్నకోడుకు నెట్లు చంపదలంచితివి. ఇట్లు పెద్ద కోలాహలము బయలుదేరగ నంతలో విశ్వామిత్రుడరుగుదెంచెను.

సమీపం నృపతే ర్గత్వా తమువాచ దమాపరః |

విశ్వామిత్ర ఉవాచః రాజ న్నముం శునః శేపం రుదంతం ముంచ దుఃఖితమ్‌. 38

క్రతు స్తే భవితా పూర్ణో రోగనాశ శ్చ సర్వధా | దయా సమం నాస్తి పుణ్యం పాప హింసాసమం నహి. 39

రాగిణాం రోచనార్ధాయ నోదనేయం విచారం | ఆత్మదేహస్య రక్షార్ధం వరదేహ నికృంతనమ్‌. 40

న కర్తవ్యం మహారాజ సర్వతః శుభ మిచ్ఛతా | దయ యా సర్వభూతేషు సంతుష్టో యేన కేన చ. 41

సర్వేం ద్రియో పశాంత్యా తుష్య త్యాశు జగత్పతిః | ఆత్మవత్సర్వ భూతేషు చింతనీయం నృపోత్తమ. 42

జీవితవ్యం ప్రియం నూనం సర్వేషాం సర్వదా కిల | త్వ మిచ్ఛసి సుఖం కర్తుం దేహే హత్వాత్వముం ద్విజమ్‌. 43

కధం నేచ్ఛే దసౌ దేహం రక్షితం స్వసుఖాస్పదమ్‌. | పూర్వజన్న శి కృతం వైరం నానేన సహ్యతే నృప. 44

యేనా ముంహతుకామస్తం ద్విజపుత్రం నిరాగసమ్‌ | యో నియం హంతి వినావైరం స్వకామః సతతం పునః. 45

హంతారం హంతి తం ప్రాప్య జననం జననాంతరే | జనకోస్య సుదుష్టాత్మా యేనాసౌతే సమర్పితః. 46

స్వాత్మజో ఘనలోభేన పాపాచారః సుదుర్మతిః | ఏష్టవ్యా బహవః పుత్రా యద్యేకోపి గయాంవ్రజేత్‌. 47

యజేత చాశ్వ మేధేన నీలంవా వృషముత్సృజేత్‌ | దేశమధ్యే చ యః కశ్చిత్పాపకర్మ సమాచరేత్‌. 48

షష్ఠాంశ స్తస్య పాపస్య రాజాభుం క్తే నసంశయః | నిషేధనీయో రాజ్ఞాసౌ పాపం కర్తుం సముద్యతః. 49

విశ్వామిత్రుడు రాజు తెంతకేగి దయతో నతని కిట్లనెను. రాజా! ఈ శునః శేపుడు మిక్కిలి విలపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యాగము పూర్తియగను. నీ రోగనాశమును జరుగును. దయతో సనునమైన ప్యుణము హింసతో సమమైన పాపము లేదు. తన దేహము గాపాడుకోనుట కితర దేహములను పీడించిహింసించుట పేరాస లోఘము గల వారి కిష్టమైన పనియని యెఱుగుము. రాజా! విశ్వకల్యాణము గోరువాడెవ్వడు నిట్టి నీచమైన పని చేయరాదు. ఏ విధముగనైన నెల్ల భూతములందు దయ బూనవలయును. సకలేంద్రియములు వశములో నుంచుకొనిన వానియెడ భగవంతునకు దయ గల్గును. రాజా! సర్వప్రాణుం లాత్మసములని యెఱుగుము.ఎల్లవారి కెల్లెడల ప్రియము చేకూర్చుచు జీవింపవలయును. ఇక నీ వీ విప్ర బాలుని చంపి నీ దేహసుఖము గోరుకొనుచున్నావు. నీవలె నితడును తన దేహసౌఖ్యము తాను చూచుటకొనును గదా! రాజా! వెనుకటి జన్మములోని పగ మఱుజన్మములో తీర్చబడును. ఏ పాప మెఱుగని యి బాలుని నీ వెట్లు చంపదలచితివో అట్లే అతడును మఱొక జన్మములో నిన్ను చంపదలడు. కొందఱు పగ లేకున్న ను నితరులను తమ మేలునకు హింసితురు చంప బడినవాడు వేరొక జన్మములో తన్ను చంపినవానిని చంపును. ఈ విప్రుడు ధనాశ##చే దుష్టుడై తన కొడుకునే యమ్ముకొనెను. ఇతుడు ధనాశ##చే నింటి పాపాచారి-దుర్మతి-యయ్యెను. పెక్కురు కొడుకులు పుట్టవలయునని కోరుకొనువలయును. ఏలన నొకడైన గయకు వెళ్ళగలడు. వారిలో నొకడైన నశ్వమేధము చేయును. ఆబోతు నచ్చువేయును అని తలంచవలయును. దేశములో నెవడైన పాపము చేయవచ్చును. ఆ పాపములోని యారావపాలుతప్పక రాజనుభవించును. కనుక పాపము చేయ రాదని రాజు పావులను శాసించవలయును.

నినిషిద్ధ స్త్వయా కస్మా త్పుత్రం విక్రేతు ముద్యతః | సూర్యవంశే సముత్పన్న స్త్రిశంకుతనయః శుభః. 50

ఆర్య స్త్వనార్య వత్కర్మ కర్తు మిచ్ఛ సి పార్థివ | మోచనా న్ముని పుత్రస్య కరణా ద్వచనస్య మే. 51

తవ దేహే సుఖం రాజ న్బవిష్యత్యవిచారణాత్‌ | పితాతే శాపయోగేన చాండాలత్వము పాగతః. 52

మయాసౌ తేన దేహేన స్వర్లోకం ప్రాపితః కిల | తేనైవ ప్రీతియోగేన కురుమే వచనం నృప. 53

ముంచైనం బాలకం దీనం రుదంతం భృశమాతురమ్‌ | యాచితోసి మయా నూనం యజ్ఞే స్మిన్రాజసూయకే. 54

ప్రార్థనాభంగజం దోషం కధంత్వం నావబుధ్యసే | ప్రార్థితం సర్వ దేయం యజ్ఞేస్మి న్నృపసత్తమ. 55

అన్యథా పాపమేవస్యా త్తవరాజన్న సంశయః | వ్యాసః ఇతి తస్య వచః శ్రుత్వా కౌశికస్య నృపోత్తమః. 56

ప్రత్యువాచ మహారాజ కౌశిక మునిసత్తమమ్‌ | జలోదరేణ గాధేయ దుఃఖతోహం భృశంమునే. 57

తస్మా న్న మోచయా మ్యేన మన్య త్ర్పార్ధయ కౌశికం | నత్వయా నిగ్రహః కార్యః కార్యేస్మిన్మను సర్వధా.

తచ్చ్రుత్వా వచనం రాజ్ఞో విశ్వామిత్రోతికో పనః | బభూవ దుఃఖసంతప్తో వీక్ష్యదీనం ద్విజాత్మజమ్‌. 59

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే షోడశోధ్యాయః.

విప్రుడు తనకొడుకు నమ్ముకొనుచుండగ నీ వతనిని నివారింపలేదు. నీవు త్రిశం కు తనుయుడు. అంతేకాక సూర్యవంశసంజాతుడవు. రాజా! నీ వార్యుడవు. అనార్యుడు చేయుపని చేయకుము. ఈ విప్రబాలుని నదలుము. నా మాట పాటించుము. నీ శరీరమునకు తప్పక సుఖము గల్గును. మున్ను నీ తండ్రి శాపవశమున చండాలుడయ్యెను. అతడు తన దేహముతో స్వర్గమున కేగెను. దానికి నేనే కారణము. రాజా! అట్టి ప్రేమతో నీవును నా మాట నమ్ముము. ఇచట భోరున నేడ్చుచున్న బాలుని విడిచిపెట్టుము ఈ రాజసూయయాగమున నేను నిన్ను కోరునది దొక్కటే. రాజా! నా యీ విన్నప మాలింపనిచో దానివలన నీకు దోషము తగులును. ఏలన నీ జన్న ముందు యాచుకుని కోర్కి తప్పక తీర్చవలయును గదా. నే చెప్పినట్లు చేయనిచో నీకు పాపము తగలును. అను విశ్వామిత్రుని వాక్కులు రాజు వినెను. అపుడు రాజు మునిసత్తము డగు విశ్వామిత్రునితో నిట్లనెను. ఓ విశ్వామిత్రమునీ! నేను జలోదరవ్యాధిచే మిక్కిలి బాధ పడుచున్నాను. కనుక నేనీ బాలుని వదలను. వేరొకటి కోరుకొనుము. ఈ సమయమన నీ పట్టుదల సడలింపుము. నా పని కడ్డు రాకుము. అను రాజు మాటలువిని విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై దీనాతిదీనుడైన విప్రబాలకునిగనిమిక్కిలి బాధ పడెను.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున పదునారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters