Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వితీయో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : వర్ణానాం శక్తయః కాశ్చ తాః శృణుశ్వ మహామునే |

వామదేవీ ప్రియా సత్యా విశ్వ భద్రా విలాసినీ. 1

ప్రభావతీ జయా శాంతా కాంతా దుర్గా సరస్వతీ | విద్రుమా చ విశాలేశా వ్యాపినీ విమలా తథా. 2

తమో పహారిణీ సూక్ష్మా విశ్వయోని ర్జయా వశా | పద్మాలయా పరా శోభా భద్రా చ త్రిపదాస్మృతా. 3

చతుర్వింశతి వర్ణానాం శక్తయః సముదాహృతాః | అతఃపరం వర్ణవర్ణా న్వ్యాహరామి యథాతథమ్‌. 4

చంపకంచాతసీపుష్పసన్నిభం విద్రుమం తథా | స్పటికాకారకం చైవ పద్మపుష్ప సమప్రభమ్‌. 5

తరుణాదిత్యసంకాశం సంఖకుందేందు సన్నిభమ్‌ | ప్రవాళంపద్మపత్రాభం పద్మరాగసమ ప్రభమ్‌. 6

ఇంద్రనీలమణి ప్రఖ్యం మౌక్తికం కుంకుమప్రభమ్‌ | అంజనాభం చ రక్తం చ వైడూర్యం క్షౌద్రసన్నిభమ్‌. 7

హారిద్రకుందదుగ్ధాభం రవికాంతి సమప్రభమ్‌ | శుకపుచ్ఛనిభం తద్వ చ్ఛతపత్రనిభం తథా. 8

కేతకీపుష్పసంకాశం మల్లికాకుసుమప్రభమ్‌ | కరవీరశ్చ ఇత్యేతే క్రమేణ పరికీర్తితాః. 9

రెండవ అధ్యాయము

గాయత్రీవర్ణ శక్త్యాదికము

శ్రీనారాయణుడు డిట్లనియెను : మునీశా! ఇపుడు గాయత్రి వర్ణముల శక్తులను వరుసగ వినుము. శ్రీవామదేవీ-ప్రియ-సత్య-విశ్వభద్ర-విలాసిని-ప్రభావతి-జయ-శాంత-కాంత-దుర్గ-సరస్వతి - విద్రుమ-విశాలేశ-వ్యాపిని-విమల- తమో పహారిణి - సూక్ష్మ-విశ్వయోని-విజయ -వశ-పద్మాలయ-పరాశోభ - భద్ర - త్రిపద - అను వారిరువదినాల్గు వర్ణముల శక్తు లుగ పేర్కొనబడుదురు. ఇపు డిరువదినాలుగు వర్ణముల వర్ణములు వినుము. సంపంగి - అవిసె - పగడము - స్పటికమణి - పద్మపుష్పము - బాలసూర్యుడు - శంఖకుందేందులు - పగడము - పద్మపత్రము - పద్మరాగము - ఇంద్రనీలమణి - ముత్యము - కుంకుమము - కాటుక - రక్తము వైదూర్యము - తేనె పసుపుకుందము పాలమిశ్రణము సూర్యకాంతము - చిలుకతోక - శత పత్రము - కేతకి - మల్లిక - కరవీరము అను రంగులు వరుసగ నిరువదినాల్గు వర్ణములకు పేర్కొనబడినవి.

వర్ణాః ప్రోక్తా శ్చ వర్ణానాం మహాపాపవిశోధనాః | పృథివ్యాప స్తథా తేజో వాయు రాకాశ ఏవ చ. 10

గంధో రస శ్చ రూపం చ శబ్దః స్పర్శ స్తథైవ చ | ఉపస్థం పాయుపాదం చ పాణీ వాగపి చ క్రమాత్‌. 11

ఘ్రాణం జిహ్వా చ చక్షు శ్చ త్వక్‌ శ్రోత్రం చ తతఃపరమ్‌ |

ప్రాణో7పాన స్తథా వ్యానః సమాన శ్చ తతః పరమ్‌. 12

తత్త్వా న్యేతాని వర్ణానాం క్రమశః కీర్తితాని తు | అతః పరం ప్రవక్ష్యామి వర్ణముద్రాః క్రమేణ తు. 13

సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా | ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా. 14

షణ్ముఖో7ధో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా | శకటం యమపాశం చ గ్రథితం సన్ముఖోన్ముఖమ్‌. 15

విలంబం ముష్టికం చైవ మత్స్యం కూర్మం వరాహకమ్‌ | సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా. 16

త్రిశూలయోనీ సురభి శ్చాక్షమాలా చ లింగకమ్‌ | అంబుజం చ మహాముద్రా స్తుర్యరూపాః ప్రకీర్తితాః. 17

ఇత్యేతాః కీర్తితాముద్రా వర్ణానాం తే మహామునే | మహాపాపక్షయకరాః కీర్తిదాః కాంతిదా మునే. 18

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే ద్వితీయో7ధ్యాయః.

ఈ వర్ణముల వర్ణముల మహాపాతకములను కడిగివేయగలవు. నేల - నీరు - వెలుగు - గాలి - నింగి - గంధము - రసము - రూపము - శబ్ధము - స్పర్శ - ఉపస్థ - పాయువు - పాదపాణి వాక్కులు ముక్కు - నాలుక - కన్ను - చర్మము - చెవి - ప్రాణము - అపానము - వ్యానము - ఉదానము - సమానము అనునవి వరుసగ వర్ణముల యిరువదినాలుగు తత్త్వములు - ఇపుడు వరుసగ వర్ణముల ముద్రలు తెలుపుచున్నాను వినుము. సుముఖము - సంపుటము - వితతము - విస్తృతము - ద్విముఖము - త్రిముఖము - చతుర్మఖము - పంచముఖము - షణ్ముఖము - అధోముఖము - వ్యాపకాంజలికము - శకటము - యమపాశము - గ్రథితము - సన్ముఖోన్ముఖము - ప్రలంబము - ముష్టికము - మత్స్యము - కూర్మము - వరాహకము - సింహాక్రాంతము - మహాక్రాంతము - ముద్గరము - పల్లవము అనున విరువదినాలుగు ముద్రలు. త్రిశూలము - యోని - సురభి - అక్షమాల - లింగము - అంబుజము మహాముద్రఅనునవి తురీయపాద గాయత్రి ముద్రలుగ పేర్కొనబడినవి. మునీ! ఈ ప్రకారముగ నీకు ముద్రలను తెల్పితిని. మునీ! ఇవి మహాపాతకములను ద్రుంచి వేయగలవు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమునందలి రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters