Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచశోధ్యాయః

ప్రవృత్తే సదనే తస్య రాజ్ఞః పుత్ర మహోత్స వే | ఆజగామ తదా పాశీ విప్రవేషధరః శుభః. 1

స్వస్తీ త్యుక్త్వా నృపం ప్రాహ వరుణోహం నిశామయ | పుత్రో జాత స్తవా ధీశ యజానేన నృపాశు మామ్‌. 2

సత్యం కురు వచో రాజ న్యత్రోక్తం భవతా పురా | వంధ్యత్వం తు గతం తేద్య పరదానేన మే కిల. 3

ఇతి తస్య వచః శ్రుత్వా రాజా చింతాం చకారాహ | కథం హన్మి సుతం జాతం జలజేన సమాననమ్‌. 4

లోకపాలః సమాయాతో విప్రవేషేణ వీర్యవాన్‌ | న దేవహేలనం కార్యం సర్వథా శుభమిచ్చ తా. 5

పుత్రస్నేహః సుదుశ్ఛేద్యః సర్వథా ప్రాణిభిః సదా | కిం కరోమి కథం మే స్యా త్సుకం సంతతి సంభవమ్‌. 6

ధైర్య మాలంబ్య భూపాల స్తం సత్వా ప్రతిపుజ్య చ | ఉవాచ వచనం శ్ల క్ష్నం యుక్తం వినయ పూర్వకమ్‌. 7

దేవ దేవ తవాను జ్ఞాం కరోమి కరుణా నిధే | వేదోక్తేన విధానేన మఖం త బహుదక్షిణమ్‌. 8

పుత్రే జాతే దశాహేన కర్మయోగ్యో భ##వేత్పితా | మాసేన శుధ్ద్యే జ్జననీ దంపతి తత్ర కారణమ్‌. 9

సర్వజ్ఞోసి ప్రచేత స్త్వం ధర్మం జానాసి శాశ్వతమ్‌ | కృపాం కురు త్వం వారీర క్షమస్వ పరమేశ్వర. 10

ఇత్యుక్త స్తు ప్రచేచా స్తం ప్రత్యువాచ జనాధిపమ్‌ | స్వస్తి తేస్తు గమిష్యామి కురు కార్యాణి పార్ధవ. 11

ఆగమిష్యామి మాసాంతే యష్టవ్యం సర్వధా త్వయా | కృత్వౌ త్ధానిక మాచారం పుత్రస్య నృప సత్తమ. 12

ఇత్యుక్త్వా శ్లక్ష్నయా వాచా రాజానం యాదసాం పతిః | హరిశ్చంద్రో ముదం ప్రాప గతే పాశిని పార్దివ. 13

కోటిశః ప్రదదౌ గాస్తా ఘటోధ్నీ హేమపూరితాః | విప్రేభ్యో వేదవి ద్బ్య శ్చ క తధైతిలపర్వతాన్‌. 14

రాజాపుత్ర ముఖం దృష్ట్వా సుఖ మాప మహత్తరమ్‌ | నామాస్య రోహిత శ్చేతి చకార విధి పూర్వకమ్‌. 15

పదునైదవ అధ్యాయము

హరిశ్చంద్రోపాఖ్యానము

అట్లు రాజభవనమున పుత్ర మహోత్సవము జరుగుతుండగ వరుణుడు బ్రాహ్మణ వేషమున నేతెంచెను. రాజా! నేను వరుణుడను. నీకు మేలు గల్గుగాక! నీ కిపుడు కొడుకు గల్గెను గదా! అతనినో నాయజ్ఞము వేగ మొనరింపుము. నా వరప్రభావమున నీ వంధ్యత్వము తొలగినది గదా! ఇపుడు నీవు మునుపు నా కిచ్చినమాట నిలబెట్టుకొనుమని వరుణు డనెను. వరుణుని పల్కులు విని హరిశ్చంద్రు డిట్లు తనలో తలపోసెను. కమలమువంటి ఈ నా సుకుమార కుమారు నెట్లు చంపగలను? మహశక్తిగల నరుణుడు విప్రవేషమున వచ్చియున్నాడు. మేలుగోరుకొను వాడెవ్వడును దేవత లను పరిహసించి నిందింపరాదు. ఎల్ల ప్రాణులకు పుత్ర వాత్సల్యము ఛేదింపంరాని-తెలియని-యనుబంధము. ఇపుడేమి చేతును? నాకు సంతానసౌఖ్య మెట్లు గల్గును? అని రాజు తలంచుకొని ధైర్యము తెచ్చుకొని వరుణునకు నమస్కరించి పూజించి సవినయముగ తీయగ నిట్టు లనియెను: దేవదేవా! దయానిధీ! నీ యనుజ్ఞ పాటింపగలను. వేదోక్త విధానముగ యజ్ఞ మొనర్చి దానదక్షిణ లొనరింపగలను. కొడుకు పుట్టిన పదినాళ్లకు తండ్రికి శుద్ధి యగును. తల్లికి నెల నాళ్లకు శుద్ధి యగును. దీనికి దంపతులు కారణము. వరుణదేవా! పరమేశ్వరా! నీవు ధర్మజ్ఞుడువు. కనుక నాయెడ దయయుంచి యొక్క నెలవఱకు క్షమించుము. అనగనే వరుణుడు రాజుతో నిట్లనెను: రాజా! నీకు మేలు గల్గుగాక! నేను వెళ్ళుచున్నాను. నీ పనులు చక్కబెట్టుకొనుము. నేను మరల నొకనెలకు రాగలను. అపుడు తప్పక హోమము చేయవలయును. రాజా! అప్పటి వఱకు జాతకార్మాది విధు లొనరింపుము. అని వరుణుడు రాజుతో తీయగ పలికి వెళ్ళగ హరిశ్చంద్రుడు ప్రమోద మొందెను. అటు పిమ్మట రాజు బంగరుతో నలకరించినవియు కుండలంతపోదుగులుగలవియు అగు కోట్ల యావులను తిలపర్వతములను దానమొసంగెను. రాజు తన కుమారుని మన ముఖలక్షణములు వీక్షించి పరమానందమంది యతనికి యధావిధిగ రోహితుడను పేరు పెట్టేను.

పూర్ణే మాసే తతః పాశీ విప్రవేషణ భూషతే | ఆజగామ గృహే సద్యో యజస్వేతి బ్రువన్ముహుః. 16

వీక్ష తం నృపతి ర్ధేవం నిమగ్నః శోకసాగరే | ప్రణివత్వ కృతాతిధ్యం తమువాచ కృతాంజలిః. 17

దిష్ట్యాదేవ త్వ మాయాతో గృహం మే పావితం ప్రభో | మఖం కరోమి వారీశ విధివ ద్వాంఛితం తవ. 18

అదంతో న పశుః శ్లాఘ్య ఇత్యాహుర్వేదవాదినః | తస్మా ద్దంతోద్బవే తేహం కరిష్యామి మహాముఖమ్‌. 19

ఇత్యుక్త స్తేన వరుణ స్తధేత్యుక్క్వా యయావధ | హరిశ్చంద్రో ముదం ప్రాప్య విజహార గృహాశ్రమే. 20

పున ర్దంతోద్బవం జ్ఞాత్వా ప్రచేతా ద్విజరూపవాన్‌ | ఆజగామ గృహే తస్య కురు కార్య మితి బ్రువన్‌. 21

భూపాలోపి జలాధీశం వీక్ష్యప్రాప్తం ద్వీజాకృతిమ్‌ | ప్రణమ్యాసనసమ్మానై : పూజయామాస సాదరమ్‌. 22

స్తుత్వాప్రోవాచ వచనం వినయానతకంధరః | కరోమి విధివత్కామం మఖం ప్రబలదక్షిణమ్‌. 23

బాలోప్యకృత చౌలోయం గర్బకేశో న సమ్మతః | యజ్ఞార్దే పశుకరణ మయా వృద్ధముఖా చ్ఛ్రు తమ్‌. 24

తావత్షమస్వ వారీశ విధిం జానాసి శాశ్వతమ్‌ | కర్తవ్యః సర్వధా యజ్ఞో ముండనాంతే శిశోః కిల. 25

తస్యేతి వచనం శ్రుత్వా ప్రచేతాః ప్రాహ తం పునః | ప్రతారయసి మాం రాజ న్పునః పునరిదం బ్రువన్‌. 26

అపి తే సర్వసామగ్రీ వర్తతే నృపతేధునా | పుత్రస్నేహనిబద్ధ స్త్వం వంచయస్వేవ సాంప్రతమ్‌. 27

క్షౌరకర్మ విధిం కృత్వా న కర్తాసి మఖం యది | తదాహం దారుణం శాపం దాస్యే కోపసమన్వితః. 28

అద్య గచ్ఛామి రాజేంద్ర వచనాత్తవ మానద | న మృషా వచనం కార్యం త్వయేక్ష్వాకుకులోద్బవ. 29

ఇత్యాభాష్య యయావాశు ప్రచేతా నృపతే ర్గృహాత్‌ | రాజా పరమసంతుష్టో ననంద భవనే తదా. 30

ఒక నెల గడిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజభవనమునకు వచ్చి యిపుడే యజ్ఞ మొనర్పుమని పల్మారు లనెను. రాజు వరుణుని జూచి శోకసాగరమున మునిగి యతని కాతిధ్య మొసంగి దోసిలొగ్గి యిట్లనెను. జలాధి పతీ! నా యదృష్టముననే నీవు వచ్చితివి. గృహము పావనమైనది. నీ యిష్టానుసారముగ యజ్ఞ మొవర్తును. నోటిపండ్లు రానిది యాగవశవుగ నుండరాదని వేదవిదు లంచురు. కనుక నా కొడుకునకు పండ్లు వచ్చిన పిమ్మట నీ యజ్ఞ మొనర్తును. అని రాజు పలుకగ వరుణుడు సరేయని వెళ్ళిపోయెను. హరిశ్చంద్రుడు తన యింట సంసారసుఖము లనుభవించుచుండెను. రాకుమారునకు దంతములు మొలిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజు నింటికి వచ్చి తన పని నెఱవేర్పుమని యడిగెను. రాజు విప్రరూపమున నున్న వరుణునిగాంచి నమస్కరించి సగౌరవముగ నాసన మొసంగి సమ్మానించి పూజించెను: ఆ పిదప వినయముగ తలవంచి నుతించి రాజిట్లనెను! ''దేవా! తప్పక భూరిదక్షిణలతో నీ యజ్ఞ మొనరింపగలను. నా బాలున కింకను చూడాకరణము చేయలేదు. పుట్టువెండ్రుకలున్నవాడు యజ్ఞపశువుగ తగడని పెద్దలందరు. ఓ జలాధి నాధా! నీవు శాశ్వతవిధి నెఱగిన వాడవు. కాన నంతవఱకు క్షమించుము. నా శిశువునకు వెండ్రుకలు తీసిన మీదట నీయాగ మొనర్పగలను.'' అను రాజు మాటలువిని వరుణు డతని కిట్లనెను: ''రాజా! ఏమేమో చెప్పి నన్ను మాటిమాటికి మోస గించుచున్నావు. ఇపుడు నీకడ యజ్ఞసామగ్రి యంతయును గలదు గదా! కేవలము పుత్రవాత్సల్యమున జిక్కుకొని నన్నిట్లు మోసగించుచున్నావు. నీవు క్షౌరకర్మమున్నగు విధులైన పిదపనైన యాగము చేయుకున్నచో కోపముతో నిన్ను దారుణ ముగ శపింపగలను. రాజా! మానదా! ఇప్పటికి నీ మాట మీద వెళ్ళుచున్నాను. నీ విక్ష్వాకు వంశజుడవు. నీ మాట వమొనపరింపకుము.'' అని పలికి వరుణుడు రాజ గృహము వెడలి చనెను. రాజు తన భవనమున సుఖముగ నుండెను.

చూడాకరణ కాలేతు ప్రవృత్తే పరమోత్సవే | సంజప్రాప్త స్తరసా పాశీ భవనం నృపతేః పునః. 31

యదాంకే సుత మాదాయ రాజ్ఞీ నృపతి సన్నిధౌ | ఉపవిష్టా క్రియాకాలే తదైవ వరుణోభ్యగాత్‌. 32

కురు కర్మేతి విస్పష్ట వచనం కధయ న్నృపమ్‌ | విప్రరూపధరః శ్రీమాన్‌ ప్రత్యక్ష ఇవ పావకః. 33

నృవతి స్తం సమాలోక్య బభూవాతీవ విహ్వలః | నమ శ్చకార తం భీత్యా కృతాంజలిపుటః పురః. 34

విధివ త్పూజయిత్వాతం రాజోవాచ వినీతవాన్‌ | స్యామి న్కార్యం తకోమ్యద్య మఖస్య విధిపూర్వకమ్‌. 35

వక్తవ్వ మస్తి తత్రాపి శృణుషై#్వకమనా విభో | యుక్తం చే న్మన్యసే స్వామిం స్త ద్ర్బవీమి తవాగ్రతః. 36

బ్రాహ్మణః క్షత్రియో వైశ్య స్త్రయోవర్ణాద్వీజాతయః | సంస్కృతా శ్చాన్యధా శూద్రా ఏవం వేదవిదో విదుః. 37

తస్మాదయం సుతో మేద్య శూద్రవ ద్వర్తతే శిశుః | ఉపనీతః క్రీయార్హః స్యాదితి వేదేఘ నిర్ణయః 38

రాజ్ఞా మేకాదశే వర్షే సదోపనయనం స్మృతమ్‌ | అష్టమే బ్రాహ్మణానాం చ వైశ్యానాం ద్వాదశే కిల. 39

దయసే యది దేవేశ దీనం మాం సేవకం తవ | తదోపనీయ కర్తాస్మి పశునా యజ్ఞ ముత్తమమ్‌. 40

లోకపాలోసి ధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద | మన్యసే యద్వచః సత్యం తద్గచ్ఛ భవనం విభో. 41

ఇతి తస్య వచః శ్రుత్వా దయావాన్యాదసాం పతిః | ఓమిత్యుక్త్వా యయావాశు ప్రసన్న వదనో నృపః. 42

గతేథ వరుణ రాజా బభూవాతి ముదా న్వితః | సుఖం ప్రాప్య సుతసై#్వవం రాజా ముదమవాపహ. 43

చకార రాజకార్యాణి హరిశ్ఛంద్ర స్తదా నృప | కాలేన వ్రజతా పుత్రో బభూవ దశవార్షికః. 44

అటు పిమ్మట పుట్టువెండ్రుకలు తీయు మహోత్సవమున వరుణుడు మరల రాజప్రాసాదమున కేతెంచెను. ఆ మహోత్సవమున రాణి తన కుమారుని తన తొడపై నిడుకొని రాజు ప్రక్కనుండెను. అంతలో వరుణు డేగుదెంచెను. వరుణుడగ్ని హోత్రుడు ప్రత్యక్షమైనట్లు విప్ర వేషమున వెలుగుచుండెను. అతడు రాజుతో తన పని నెఱవేర్పుమని కచ్చితముగ నడిగెను. ఆపుడు రాజు వరుణుని గాంచి వ్యాకుల చిత్తముతో గడగడలాడుచు చేతులు జోడించి నమస్కరించెను. ఆ పిదప సవినయనుగ రాజు చక్కగా వరుణుని పూజించి యతని కిట్లనెను. ఓ స్వామీ! నీ కార్యము యధావిధిగా నొనరింపగలను. నీతోనొక మాట చెప్పదలచుకొంటిని. నీవు నన్ను మన్నించి చెప్ప వచ్చునన్న చెప్పగలను. నిశ్చలముగ వినుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను మువ్వురను ద్విజులందురు. వీరికి సంస్కారము లావశ్యకములు. తక్కిన వారిని శూద్రులని వేదవాదులందురు. కనుక నా కొడుకిపుడు శూద్రునివలె నున్నాడు. వడుగైనవాడు కర్మకు యోగ్యుడగునని వేదములు నిర్ణియించినవి గదా! విప్రుల కెనిమిదవయేట రాజులకు పదునొకండవయేట వైశ్యులకు పండ్రెండవయేట నుపనయనము చేయవలయును గదా! దేవేశా! నేను దీనుడను. నీ సేవకుడను. నా యెడ దయ బూనినచో నా కొడుకును వడుగు చేసిన పిదప నతనిని యాగ పశువుగా నొనరింపగలను. నీవు లోకపాలకుడవు. ధర్మజ్ఞుడవు. సర్వ శాస్త్రవిశారదుడవు. నా మాటమీద నీకునమ్మకమున్నచో నీవు నీ యింటి కెగుము అను రాజు మాటలు విని వరుణుడు దయతలచి యొప్పకొని వెడలిపోయెను. రాజును సంతోషించెను. వరుణుడు వెళ్ళిన మీదట రాజు పుత్రోత్సాహముతో సుఖముగ కాలము గడుపుతుండెను. ఈ విధముగా హరిశ్చంద్రచక్రవర్తి రాజ కార్యములు చక్క పెట్టుచుండగనే యతని కొడుకు పదేండ్ల వాడయ్యెను.

తస్యోపవీత సామగ్రీం విభూతిసదృశీం నృపః | చకార బ్రాహ్మణౖః శిష్టైరన్వితః సచివై స్తధా. 45

ఏకాదశే సుతస్యాబ్దే వ్రతబంధవిధౌ నృపః | విదధే విధివ త్కార్యం చిత్తే చింతాతురః పునః. 46

వర్తమానేతధా కార్యే ఉపనీతే కుమారకే | ఆజగామాధ వరుణో విప్రవేషధర స్తదా. 47

తం వీక్ష్య నృపతి స్తూర్ణం ప్రణమ్య పురతః స్దితః | కృతాంజలిపుటః ప్రీతః ప్రత్యువాచ సురోత్తమమ్‌. 48

దేవదత్తో పవీతోయం పశుయోగ్యోస్తి మే సుతః | ప్రసాదా త్తవ మే శోకో గతో వంధ్యాపవాదజః. 49

కర్తుమీచ్చామ్యహం యజ్ఞం ప్రభూతవరదక్షిణమ్‌ | సమయే శృణు ధర్మజ్ఞ సత్యమద్య బ్రమీమ్యహమ్‌. 50

సమావర్తన కర్మాంతే కరిష్యామి తవే ప్సితమ్‌ | మమోపరి దయాం కృత్వాతావత్త్వం క్షంతు మర్హసి. 51

వరుణః : ప్రతారయసి మాం రాజ న్పుత్రప్రేమాకులో భృశమ్‌ |

ముహు ర్ముహు ర్మతిం కృత్వా యుక్తి యుక్తాం మహామతే. 52

గచ్ఛా మ్యద్య మహారాజ వచసా తవ నోదితః | ఆగమిష్యామి సమయే సమావర్తన కర్మణి. 53

ఇత్యుక్త్వా ప్రయ¸° పాశీ తమాపృచ్చ్య విశాంపతే | రాజా ప్రముదితో కార్యం చకార చ యధోత్తరమ్‌. 54

ఆగతం దరుణం దృష్ట్వా కుమారో తి విచక్షణః | యజ్ఞస సమయం జ్ఞాత్వా తదా నింతాతుతరోభవత్‌. 55

శోకస్య కారణం రాజ్ఞః పర్యపృచ్ఛ దిత స్తతః | జ్ఞాత్వా೭೭త్మపధ మాయుష్మ న్గమనాయ మతిం దధౌ. 56

నిశ్చయం పరమం కృత్వా సమ్మంత్ర్య సచివాత్మ జైః | ప్రయ¸° నగరా త్తస్మా న్నిర్గత్య వనమప్యసౌ. 57

అపుడు శాంతులగు విప్రులు మంత్రులు ననుమతింపగ రాజు తన శక్తికి తగినటు లుపనయన సామాగ్రి సమకూర్చెను. తన తనయునకు పదుకొకండవ యేడు వచ్చిన వెంటనే యధావిధిగ నపనయన సంస్కార మొనరింతెను. కాని మదిలో చింతాతురుడై యుండెను. రాకుమారునకుపనయన సంస్కారము జరుగుచున్న సమయమునందు వరుణుడు బ్రహ్మణ వేషమున మరల నచటికి వచ్చెను. అంత రాజు తన యెట్టయెదుట నున్న వరుణువి జూచి వెంటనే కైమోడ్చి నమస్కరించి ప్రీతితో నతిని కిట్లనెను. దేవా! వడుగైన పిదప నా కొడుకు యాగపశువుగ తగినవాడగును. నీ దయవలననే నా వంధ్యత్వదోషము పాసెను. ధర్మజ్ఞా! సమయము వచ్చినప్పుడు గొప్పగ దక్షిణలిచ్చి నీ జన్నము పూర్తి చేయగలను. ఇప్పుడు నేను నిజముగ బలుకుచున్నాను. నా కొడుకునకు సమావర్తనము జరిగిన పిమ్మట నీ కోరిక నెఱవేర్పగలను. నా యెడ దయయుంచి యంతదనుక తాళుము. వరుణు డిట్లనెను: ఓ మహామతీ! రాజా! నీవు పుత్రవాత్సల్యమున వ్యాకులుడవై మోహితుడై యుక్తియుక్తముగ నేర్పుతో నన్ను మోసగించుచున్నావు. మహారాజా! ఇపుడుకూడ నీయిష్ట ప్రకారముగ వెళ్ళుచున్నాను. సమావర్తనమ్మునాటికి తిరిగి రాగలను. అనిపలికిరాజును వీడ్కొని వరుణు డేగెను. రాజు సంతోషముతో తన కార్యములు తానొనరించుచుండెను. వరుణు డిట్లు మాటిమాటికి వచ్చుట గని తెలివిగల రాకొమరుడు యాగసమయము దాపగు టెఱిగి చింతాక్రాంతుడయ్యెను. రాజకుమారుడు తన తండ్రి శోక కారణము వారి-వీరి- వలన నెఱింగి తనకు చావు మూడుట తెలుసుకొని యచ్చోటు వదలిపెట్ట నిశ్చయించుకొనెను. అతడు తన తోడి మంత్రికుమారులతోడ చక్కగ నాలోచించి వెళ్ళుటకు నిర్ణయించుకొని నగరు వెదలి వనముల కేగెను.

గతే పుత్రే నృపః కామం దుఃఖితోభూత్‌ భృశం తదా |

ప్రేరయామాస దూతాన్‌ స్వాం స్తస్వాన్వేషణ కామ్యయా. 58

ఏవం గతేథ కాలేసౌ వరుణ స్త ద్గృహం గతః | రాజానం శోకసంతప్తం కురు యజ్ఞ మితి బ్రువన్‌. 59

రాజా ప్రణమ్య తం ప్రాహ దేవదేవ కరోమి కిమ్‌ | న జానే క్వాపి పుత్రోమే గత స్త్వద్య భయాకులః. 60

సర్వత్ర గిరిదుర్గేఘ మునీనా మాశ్రమేఘచ | అన్వేషితో మే దూతై స్తు న ప్రాప్తో యాదసాం పతే. 61

ఆజ్ఞాపయ మహారాజ కిం కరోమి గతే సుతే | న మే దోషోత్ర సర్వజ్ఞ భాగ్యదోషస్తు సర్వధా. 62

ఇతి భూపవచః శ్రుత్వా ప్రచేతాః కుపితో భృశమ్‌ | శశాప చ నృపం క్రో.ధా ద్వంచితస్తు పునః పునః. 63

నృపతేహం త్వయా యస్మాద్వచసా చ ప్రవంచితః | తస్మా జ్జలోదరో వ్యాధి స్త్వాం తుదత్వతిదారుణః 64

వ్యాసః : ఇతి శప్తో మహీపాలః కుపితేన ప్రచేతసా | పీడితోభూ త్తదా రాజా వ్యాధినా దుఃఖదేన తు. 65

ఏవం శప్త్వా నృపం పాశీ జగామ నిజ మా స్పదమ్‌ | రాజా ప్రాప్య మహావ్యాధిం బభూవాతీవ దుఃఖతః. 66

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్తంధే పంచశోధ్యాయః.

అట్లు రాకొమరుడు వెళ్లుటవలన రాజు దుఃఖితుడై తనకొడుకును వెదుకదలచి భటుల నంపెను. కొంతకాలము గడిచిన మీదట వరుణుడు మరల రాజభవనమునకు వచ్చి శోకతప్తుడగు రాజుతో యాగము చేయుమనెను. అంత రాజతనికి మ్రొక్కి యిట్లనెను: ఓ దేవదేవా! నా కుమారుడు భయాకులుడై యెచటికో పారిపోయెను. పోయినజాడ తెలియుటలేదు. ఇపు డేమి చేతును? వరుణదేవా! అంతట గిరిదుర్గములందు నా దూతల నంపి వెదకించితిని. కాని నా కొడుకు కనబడలేదు. మహారాజా! సర్వజ్ఞా! నా కొడుకు వెళ్ళిపోయెను. ఇపుడు నేనేమి చేయవలయునో న్నాజ్ఞాపింపుము. అంతయు నా దురదృష్టము. రాజు మాటలువిని వరుణుడు మహాకోపముతో నన్ను నీ వెన్నియోసారులు వంచించి తివి. రాజా! నీవు మాట నిలువబెట్టుకొనలేక నన్ను మోసగింతివి. కనుక నీకు జలోదరమను దారుణవ్యాధి సంక్రమించు గాక! అని శపించెను. వరుణుడు రాజును శపింపగ రాజపుడు దుఃఖము గలిగించు వ్యాధిచే నెంతయో పీడితుడయ్యెను. ఇట్లు వరుణుడు రాజును శపించి తన చోటి కేగెను. రాజు మహారోగ పీడితుడై మిక్కిలి దుఃఖించెను.

ఇతి శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమస్కంధమున పదునైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters