Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోనవింశో7ద్యాయః.

నారాయణ ఉవాచ : అథాతః శ్రూయతాం బ్రహ్మన్‌ సంధ్యాం మాధ్యాహ్నికీం శుభామ్‌ | యదనుష్ఠానతో7పూర్వం జాయతే7త్యుత్తమం ఫలమ్‌. 1

సావిత్రీం యువతీ శ్వేతవర్ణాం చైవ త్రిలోచనామ్‌ | వరదాం చాక్షమాలాఢ్యాం త్రిశూలాభయహస్తకమ్‌. 2

వృషారూఢాం యుజర్వేద సంహితాం రుద్రదేవతామ్‌ | తతో గుణయుతాం చైవ భువర్లోకవ్యవస్తితామ్‌. 3

ఆదిత్యమార్గసంచారకర్త్రీం మాయాం నమామ్యహమ్‌ | ఆదిదేవీ మథ ధ్యాత్వా77చమనాది చ పూర్వవత్‌. 4

అథ చార్ఘ్యప్రకరణం పుష్పాణి చినుయాత్తతః | తదలాభే బిల్వపత్రం తోయేనామిశ్రయే త్తతః. 5

ఊర్ధ్వం చ సూర్యాభిముఖం క్షిప్త్వా7ర్ఘ్యం ప్రతిపాదయేత్‌ |

ప్రాతః సంధ్యాదివత్సర్వ ముపసంహార పూర్వకమ్‌. 6

మధ్యాహ్నే కేచిదిచ్ఛంతి సావిత్రీం తు తదిత్యృచమ్‌ | అసంప్రదాయం తత్కర్మ కార్యహానిస్తు జాయతే. 7

కారణం సంధ్యయో శ్చాత్ర మందేహా నామరాక్షసాః | భక్షితుం సూర్య మిచ్ఛంతి కారణం శ్రుతిచోదితమ్‌. 8

అత స్తు కారణా ద్విప్రః సంధ్యాం కుర్యాత్ర్పయత్నతః |

సంధ్యయో రుభయోర్నిత్యం గాయత్ర్యా ప్రణవేనచ. 9

అంభస్తు ప్రక్షిపేత్తేన నాన్యథా శ్రుతిఘాతుకః | ఆకృష్ణే నేతి మంత్రేణ పుషై#్పర్వాంబు విమిశ్రితమ్‌. 10

అలాభే బిల్వ దూర్వాదిపత్రేణోక్తేన పూర్వకమ్‌ | అర్ఘ్యం దద్యాత్ర్పయత్నేన సాంగం సంధ్యాఫలంలభేత్‌. 11

అత్రైవ తర్పణం వక్ష్యే శృణు దేవర్షిసత్తమ | భువః పునః పూరుషం తు తర్పయామి నమోనమః. 12

పందొమ్మిదవ అధ్యాయము

మాధ్యాహ్నిక సంధ్యావందనము

శ్రీనారాయణు డిట్లనెను : ఇపుడు మాధ్యాహ్నిక సంధ్యావందనము వినుము. దాని నాచరించుట వలన నుత్తమ ఫలితములు గల్గును. మధ్యాహ్న సమయమున సావిత్రీదేవి తెల్లని వర్ణము గలది. త్రిలోచన వరదాయిని అక్షమాలాధర త్రిశూలాఅభయ హస్త వృషభారూఢ యుజుర్వేద ముచ్చరించునది. రుద్రోపాస్య తమోగుణయుత భువర్లోక నివాసిని ఆదిత్య మార్గమున సంచరించునదియగు మాయాదేవిని నమస్కరించుచున్నాను. అని యాదిదేవిని ధ్యానించి మునుపటివలెనే యాచమించి సంకల్పించవలయును. ఆర్ఘ్యమునకు పూవు లేర్చి కూర్చవలయును. పూలు దొరుకనిచో మారేడు దళములు జలములు తీసికొని సూర్యున కెదురుగనుండి పై వైపున కర్ఘ్య మీ యవలయును. తక్కిన విధమంతయును ప్రాతఃకాల సంధ్యావందన విధానముననే యాచరించవలయును. కొందరికి మధ్యాహ్నమున నర్ఘ్య మొసగు సంప్రదాయము లేదు. చేసిన కార్యహాని గల్గునందురు. ఏలన రెండు సంధ్యలందును మందేహులను రాక్షసులు సూర్యుని భక్షింతురని వేదములందు గలదు. ఆ కారణ మున రెండు సంధ్యలందు మాత్రమే యర్ఘ్య మీయవలయును. తర్వాత ప్రణవముతో గాయత్రిని జపించవలయును. కనుక మరల నర్ఘ్య మిచ్చినచో శ్రుతిఘాతుక మగును. "ఆకృష్ణేన" "హగ్‌ంసశ్శుచి" మంత్రములు జదివి పూలు జలము కలిపి యర్ఘ్య మీయవలయును. పూలు లేనిచో బిల్వము-గఱికలతో నర్ఘ్య మీయవలయును. ఇట్లు చేసిన సంధ్యాఫలము సాంగముగ లభించును. దేవమునీశా! ఇపుడు తర్పణ విధానము వినుము. ఓం భువః పురుషం తర్పయామి నమో నమః.

యజుర్వేదం తర్పయామి మండలం తర్పయామి చ | హిరణ్యగర్భం చ తథా70తరాత్మానం తథైవ చ. 13

సావిత్రీం చ తతో దేవమాతరం సాంకృతిం తథా | సంధ్యాం తథైవ యువతిం రుద్రాణీం నిమృజాం తథా. 14

సర్వార్థానాం సిద్దికరీం సర్వమంత్రార్థ సిద్దిదామ్‌ | భూర్బువః స్వఃపురుషం తు ఇతి మధ్యాహ్నతర్పణమ్‌. 15

ఉదుత్య మితి సూక్తేన సూర్యోపస్థాన మేవ చ | చిత్రం దేవానా మితి చ సూర్యోపస్థాన మాచరేత్‌. 16

తతో జపం ప్రకుర్వీత మంత్రసాధన తత్పరః | జపస్యా పి ప్రకారం తు వక్ష్యామి శృణు నారద. 17

కృత్వోత్తానౌ కరౌ ప్రాతః సాయం చా7ధః కరౌ తథా | మధ్యాహ్నే హృదయస్థౌ తుకృత్వా జప ముదీరయేత్‌. 18

పూర్వద్వయ మనామిక్యాః కనిష్ఠాదిక్రమేణ తు | తర్జనీ మూలపర్యంతం కరమాలా ప్రకీర్తితా. 19

గోఘ్నః పితృఘ్నెమాతృఘ్నో భ్రూణహా గురుతల్పగః | బ్రహ్మస్వక్షేత్రహారీ చ యశ్చ విప్రః సురాం పిబేత్‌. 20

స గాయత్ర్యాః సహస్రేణ పూతో భవతి మానవః | మానసం వాచికం పాపం విషయేంద్రియసంగజమ్‌. 21

తత్కిల్బిషం నాశయతి త్రీణి జన్మాని మానవః | గాయత్రీం యో న జానాతి వృథా తస్య పరిశ్రమః. 22

పఠేచ్చ చతురో వేదాన్‌ గాయత్రీం చైకతో జపేతం | వేదానాం చావృతే స్తద్వద్గాయత్రీజప ఉత్తమః. 23

ఇతి మధ్యాహ్న సంధ్యాయాః ప్రకారః కీర్తితో మయా | అతః పరం ప్రవక్ష్యామి బ్రహ్మయజ్ఞ విధిక్రమమ్‌. 24

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ఏకోనవింశో7ధ్యాయః.

ఓం యజుర్వేదం తర్పయామి-ఓం మండలం తర్పయామి-ఓం హిరణ్య గర్భం తర్పయామి-ఓం అంతరాత్మానం తర్పయామి-ఓం సావిత్రీం తర్పయామి-ఓం వేదమాతరం తర్పయామి-ఓం సాంకృతిం త్రపయామి-ఓం సంధ్యాం తర్పయామి-ఓం యువతిం తర్పయామి-ఓం రుద్రాణీం తర్పయామ-ఓం నిమృజాం తర్పయామి-ఓం సర్వార్థ సిద్ధికరీం తర్ప యామి-ఓం సర్వమంత్రార్థ సిద్దిదాం తర్పయామి-ఓం భూర్భువస్స్వఃపురుషం తర్పయామి-ఇది మధ్యాహ్న తర్పణ విధి. ఓం ఉదుత్యమను సూక్తము "చిత్రం దేవానాం" సూక్తమును చదివి సూర్యోపస్థానము చేయవలయును. ఆ పిదప మంత్రసాధన తత్పరుడైన గాయత్రీ జపము చేయవలయును. నారదా ! ఇక జప విధానము తెల్పుదును వినుము. ఉదయమున చేతులు పైకెత్తియును సాయంతనమున క్రిందివై పుంచియును మధ్యాహ్నమున చేతులు హృదయమున కానించుకొనియును జపము చేయవలయును. ఉంగరము వ్రేలి నృడిమి మొదటి పర్వములు-చిటికెన వ్రేలి మూడు పర్వములును-పిదప చూపుడు వ్రేలి మూలపర్వము పఱకు నొక్క కరమాల యందురు. గోహత్య- -పితృహత్య-మాతృహత్య-భ్రూణహత్య-గురుతల్ప గమనము-విప్రధన హరణము-సురాపానము-ఈ పాపములన్నియును సహస్ర గాయత్రిని జపించుట వలన తొలగును. మనసు-వాక్కు-కర్మవిషయేంద్రియముల వలన గల్గిన పాపమంతయును మూడు జన్మలనుండి వెంటాడు పాపసంచయ మంతమును గాయత్రి జపమున నశించును. గాయత్రి నెఱుగనివాని శ్రమ మంతయును వ్యర్థ మగును. నాల్గు వేదములు చదువవలయును-గాయత్రి జపించవలయును అను ఈ రెంటిలో వేదాధ్యయనము కన్న గాయత్రి జపమే యుత్తమము. ఇట్లు మాధ్యాహ్నిక సంధ్యా విధానము తెలుపబడినది. ఇక మీదట బ్రహ్మ యజ్ఞ విధానము తెలుపుచున్నాను. శ్రద్ధగ వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమున పందొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters