Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచదశో 7 ధ్యాయః.

శ్రీ నారాయణ ఉవాచ : అగ్నిరిత్యాది భిర్మంత్త్రెర్బస్మ సంశోధ్య సాదరమ్‌ | ధారణీలయం లలాటాదౌ త్రిపుండ్రం కేవలం ద్విజః. 1

బ్రహ్మక్షత్రియవైవ్యా శ్చ ఏతే సర్వే ద్విజాః స్మృతాః | తస్మాద్ద్విజైః ప్రయత్నేన త్రిపుండ్రం ధార్యమన్వహమ్‌. 2

యస్యోపనయనం బ్రహ్మాన్‌ స ఏవ ద్విజ ఉచ్యతే | తస్మా చ్చాతం ద్విజైః కరా%్‌యం త్రిపుండ్రస్య చ ధారణమ్‌. 3

విభూతి ధారణం త్యక్త్వా యః సత్కర్మ సమాచరేత్‌ | తత్కృతం చా 7 కృత ప్రాయం బవత్యేవ న సంశయః. 4

న గాయత్ర్యుపదేశో 7 పి భస్మనో ధారణం వినా | తతో దృత్త్వెవ భస్మాంగే గాయత్రీజప మాచరేత్‌. 5

గాయత్రీం మూలమే వాహుర్బ్రాహ్మణ్య మునిపుంగవ | సా భస్మధారణాభావే న కేనాప్యుపదిశ్యతే. 6

న తావదధికారో 7 స్తి గాయత్రీ గ్రహణ మునే | యావన్న భస్మబాలాదౌ ధృతమగ్ని సముద్బవమ్‌. 7

భస్మహీనలలాటత్వం న బ్రాహ్మణ్యానుమాపకమ్‌ | ఏవమేవ మయా బ్రహ్మనేతు రుక్తః సుపుణ్యదః. 8

మంత్రపూతం సితం బస్మలలాటే పరివర్తతే | స ఏవ బ్రాహ్మణో విద్యాన్సత్యం సత్యం మయోచ్యతే. 9

యస్యాస్తి సహజా ప్రీతి ర్మణివ ద్బస్మ సంగ్రహే | స ఏవ బ్రాహ్మణో బ్రహ్మన్సత్యం సత్యం మయెచ్యతే. 10

న యస్య సహజా ప్రీతి ర్మణివద్బస్మ సంగ్రహే | స చాండాల ఇతి జ్ఞేయో జన్మ జన్మాంతరే ధ్రువమ్‌. 11

న యస్య సహజా ప్రీతి స్త్రీం పుండ్రోద్దూలనాదిషు | స చాండాల ఇతి జ్ఞేయః సత్యం సత్యం మయోచ్యతే. 12

పదునైదవ అధ్యాయము

భస్మధారణ విధానము

శ్రీనారాయణు డిట్లనెను : '' అగ్నిరితి'' మున్నగు మంత్రములతో భస్మమును సగౌదవముగ శోధించి నొసలు మున్నగు చోట్ల ద్విజుడు బస్మధాదణము చేయవలయును. బ్రహ్మ-క్షత్రియ-వైశ్యులు ద్విజులనబరగుదురు. కనుక ద్విజులు యత్నముతో త్రిపుండ్రములు ధరించవలయును. బ్రాహ్మణోత్తమా! ఎవని కుపనయన మయ్యెనో యతనినే ద్విజుడందురు. కనుక శ్రౌ బ్రాహ్మణులు తప్పక త్రిపుండ్ర ధారణము చేయవలయును. విభూతి ధారణము చేయక సత్కర్మ మనుష్టించు వాడు చేసిన పని చేయనట్లే యగునను. సందేహము లేదు. భస్మధారణము చేయక గాయత్రి నుపదేశించరాదు. భస్మధారణచేసిన పిమ్మటనే గాయత్రి జపము చేయవలయును. మునీ! గాయత్రియే బ్రహ్మణత్వమునకు మూలము. అట్టి గాయత్రిని భస్మధారణము చేయ కెవ్వనికి నునపదేశింపరాదు. మునీ ! ఆగ్ని నుండి సిద్దమైన భస్మము నొసట గాల్చిన చాలు. వాడు గాయత్రిని తీసుకొనుట కధికారి యగును. భస్మములేని నొసలు బ్రాహ్మణత్వమును దెలుపదు. కనకనే నేను దీనిని సకారణముగపుణ్యప్రదమైనదని చెప్పితిని. మంత్రపూతమైన తెల్లని భస్మమెవని నొసట శోభిల్లునో యతడే బ్రాహ్మణుడు- విద్వాంసుడు నగునని నేను నిజము పలుకుచున్నాను. మునీ ! నరుడు మణిని భద్రపఱచుటలో నెట్లు ప్రీతి గల్గియుండునో అట్లు భస్మమును జాగ్రత్తపఱచుటలో ప్రీతిగలవాడే నిజమైన బ్రాహ్మణుడని నేను నిజము పలుకుచున్నాను. మణిని భద్రపఱచినట్టు లెవనికి భస్మమును భద్రపఱచుటలో సంగ్రహించుటలో సాజమైన ప్రీతి గల్గదో యతడు జన్మ-జన్మలకును చండాలుడేయని నేను నిజము పలుకుచున్నాను. ఎవనికి త్రిపుండ్రములు-భస్మము ధరించుటలో సహజమైన మక్కువ లేదో వానిని చండాలునిగ నెఱగవలయునిని నేను నిజము పలుకుచున్నాను.

యే భస్మధారణం త్యక్త్వా భుంజతే చ ఫలాదికమ్‌ | తే సర్వే నరకం ఘోరం ప్రాప్నువంతి న సంశయః. 13

'' విభూతి ధారణం త్యక్త్వా యః శివం పూజయిష్యతి | స దుర్బగః శివద్వేష్టా స ద్వేషో నరక ప్రదః.

సర్వకర్మ బహిర్బూతో భస్మదారణ వర్జితః ''

విభూతి ధారణం త్యక్త్వా కుర్వన్‌ మేతులామపి | నతత్పల మవాప్నోతి పతితో హి బవేద్ది సః. 14

యథోపవీతరహతైః సంద్యా న క్రియతే ద్విజైః | తథా సంధ్యా న కర్తవ్యా విభూతిరహితై రపి. 15

గతోపవీతైః సంద్యాయాం కార్యః ప్రతినిధిః క్వచిత్‌ | జపాదికం తు సావిత్ర్య స్తథైవోపోషణాదికమ్‌. 16

విభూతి ధారణ త్వన్యో నాస్తి ప్రతినిధిః క్వచిత్‌ | విభూతిధారణం త్యక్త్వా యది సంధ్యాం కరోతి యః. 17

ప్రత్యవైత్యేవ యేనాసౌ నాదికారీ తదా ద్విజః | యథా శ్రుత్వాంత్యజో వేదా న్ప్రత్యవైతి తథా ద్విజః. 18

ప్రత్యవైతి న సందేహః సంద్యాకృద్బస్మ వర్జితః | సంపాదనీయం యత్నేన శ్రౌతం భస్మ సదా ద్విజైః. 19

స్మార్తం వా తదభావేతు లౌకికంవా సమాహితైః | యాదృశం తాదృశం వా 7 స్తు పవిత్రం భస్మ సంతతమ్‌. 20

ధారణీయం ప్రయత్నేన ద్విజైః సంధ్యాది కర్మసు | న సంవిశంతి పాపాని భస్మనిష్ఠే తతః సదా. 21

కర్తవ్య మపి యత్నేన బ్రాహ్మణౖ ర్బస్మధారణమ్‌ | మధ్యాంగుళి త్రయేణౖవ స్వ దక్షిణ కరస్య తు. 22

షడంగులాయతం మానమపి చాధికమానకమ్‌ | నేత్రయుగ్మ ప్రమాణన భాలే దీప్తం త్రిపుండ్రకమ్‌. 23

కదాచి త్బస్మనా కుర్యాత్స రుద్రో నత్ర సంశయః | అకారోనామికా ప్రోక్త ఉకారో మధ్యమాంగుళిః. 24

భస్మధారణము చేయక ఫలాదులుతిను వారందఱు నిక్కముగ ఘోర నరకముల పాలగుదురు. విభూతి ధారణముచేయక శివుని పూజించువాడు దురదృష్టవంతుడు-శివద్వేషియగును. ఆ ద్వేష మతనిని నరకమున గూల్చును. భస్మధారణము చేయనివా డేపనికిని తగడు. భస్మధారణ లేక బంగారముతో తులాభాదము తూగిదానిని దానము చేసినను దాని ఫలమతనికి లభింపనికి. ఉపవీతము లేనివాడు సంధ్య నుసాసింపదగనట్లు భస్మధారణ చేయనివాడు సంధ్య నుపాసింపదగడు. ఉపవీతము లేనివానికి కొన్నిచోట్ల సంధ్యోపాసనలో ప్రతినిధి ఉండవచ్చును. ఎట్లనగ గాయత్రికి జపాదులు-ఉపోషణుదులు నుండును. కాని భస్మధారణమునకు ప్రతినిధిలేదు. ఎందు కనగ విభూతి ధారణము చేయక సంధ్యోపాసనము చేసినవానికి ప్రత్యవాయము గల్గును. భస్మధారణ లేనిచో నతడు గాయత్రికి యోగ్యుడే కాడు. ఎట్లన చండాలుడు వేదములు వినిన నతనికి ప్రత్యవాయము గల్గును. భస్మధారణ చేయక సంధ్యావందనము చేసినవాడు తప్పక ప్రాయశ్చిత్తము చేసికొనవలెను కనుక ద్విజులు తప్పక శ్రౌత భస్మమును జాగ్రత్త పఱచుకొనవలయును. స్మార్తమో లౌకికమో యేది దొరకినను అట్టి భస్మము ధరించి చేసిన కర్మ మపవిత్ర మగును. సంధ్యాది కర్మలలో ద్విజుడు తప్పక యథావిధిగ భస్మధారణ చేయవలయును. భస్మనిష్టుడైన వానిని పాపము తాకనైన తాకజాలదు. బ్రహ్మణులు ప్రయత్నించి తప్పనిసరిగ కుడిచేతి నడిమి మూడు వ్రేళ్లతో భస్మధారణము చేయవలయును. ఆరంగుళములుగాని-యంత కెక్కువగాని పొడవుగ త్రిపుండ్రములు ధరించవచ్చును. నొసట నేత్రములు చివరలవఱకు త్రిపుండ్రములు భస్మముతో ధరించువాడు రుద్రుడే. ఇందు సంశయము లేదు. ఉంగరము వ్రేలు-అకారము; నడిమి వ్రేలు-ఉకారము.

మకారస్తర్జనీ తస్మా త్త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్‌ | త్రిపుండ్రం మధ్యమాతర్జన్యనామభిరనులో మతః. 25

అత్ర తే కథయామ్యేన మితిహాసం పురాతనమ్‌ | కదాచితథ దుర్వాసాః పితృలోకం గతో భ##వేత్‌. 26

భస్మ సందిగ్ద సర్వాంగో రుద్రాక్షాభరణాన్వితః | శివ శంకర సర్వాత్మన్‌ శ్రీమాతర్జగదంబికే. 27

నామానీతి గృణన్నుచ్త్చె స్తాపసానాం శిఖామణి | కవ్యవాడాదయ స్తేతు ప్నత్యుత్థానాభివాదనైః. 28

ఆసనాద్యుపచారై శ్చ సంమానం బహు చక్రిరే | నానాకథాభి రన్నో న్య సంభాషాం చక్కిరే తదా. 29

తస్మిం స్తు సమయే కుంభీపాకస్థానాం తు పాపినామ్‌ | ఘోరః సమభవచ్చబ్దో హాహతాఃస్మేతి వాదినామ్‌. 30

మృతాః స్మేతి వదంత్యేకే దగ్దాః స్మేతి పరే జగు | ఛిన్నాః స్మేతి విభిన్నాః స్మేత్యేవం రోదనకారిణః. 31

శ్రుత్వా తం కరుణం శబ్దం దుఃఖితో మునిరాట్‌హృది | పప్రచ్చ పితృనాథాం స్తా న్కేషాం శబ్దో7 య మిత్యతి. 32

తే సమూచు ర్మునే త్త్రెవ పురీ సంయమనీ పరా | వర్తతే యమరాడత్ర పాపినాం భోగదాయకః. 33

నానాదూతైః కాలరూపైః కృష్ణవర్ణైర్బయంకరైః | సహితో 7 త్త్రెవ తత్పుర్యా నాయకో విద్య తే 7 నఘ. 34

తత్ర కుండాన్యనేకాని పాపినాం భోగదాని చ | షడవీతి ర్ఘోరరూపై ర్దూతైః పరివృతాని చ. 35

తత్ర ముఖ్యతమం కుండం కుంభీ పాకాభిధం మహత్‌ | వర్తతే తద్గతానాం చ యాతనానాం తు వర్ణనమ్‌. 36

చూపుడు వ్రేలు-మకారము; కనుక త్రిపుండ్రములు-త్రిగుణాత్మకములు ; త్రిపుండ్రములు - నడిమి వ్రేలు-చూపుడు-ఉంగరము వ్రేళుల యనులోమముతోను ధరించవచ్చును. దీనిని గూర్చి నీ కొక పురాతనమైన ఇతిహాసము తెల్పుదును వినుము. ఒకానొకప్పుడు దుర్వాసోమహర్షి పితృలోకమున కేగెను. అత డొంటి నిండుగ భస్మము పూసికొని మెడలో రుద్రాక్షలు దాల్చెను. శివ శంకర ! సర్వాతక! శ్రీమాత! జగదంబిక ! అను దివ్య నామములు కుక్తకంఠముతో తాపసుల చూడామణి గానము చేయుచుండెను. అత్తణి కవ్యవాహనాదులు లేచి యెదు రేగిమునికి నమస్కరించిరి. వారాముని కుంభీపాకమునందు నారకుల ఘోరమైన హాహాకారములు చెలరేగెను. వారిలో కొందఱు చచ్చితిమి చచ్చితిమనియును కొందఱు కాలితిమి కాలితమనియును ఛిన్నుభిన్నులమైతి మనియు బిట్టు వాపోయిరి. వారి యేడుపులు పెడబొబ్బలు వినగనేముని రాజు హృదయము ద్రవించెను. అతడు పితలోక వాసులతో నీ యేడ్పు లెవరివని యడిగెను. అంత వారిట్లనిరి: మునీశా ! ఇది యమపురి. పాపులకు కష్టములు గల్గించుట కిట యమరాజు కొలువై యుండును. అనఘ ! ఈ పురియందు కాలరూపులు-భీకరులు-క్రూరులు నగు యమభటులను గూడి నరక లోకాధిపతి నివసించును. ఇచట పాపు లను భవించుటకు పెక్కు నరక కుండములు గలవు. ఘోరరూపులైన యెనుబది నల్గురు భటులు కుండములను గాపాడుచుందురు. కుండములలో ఘోరమైనది కుంభీపాక నరకము. ఎవ్వడేని నందున్న వారి యాతనలను నూఱండ్లకును వర్ణింపజాలడు.

కుర్తుం న శక్యతేకై శ్చి దపి వర్షశ##తైరపి | యే శివద్రోహిణః సంతి తథా దేవీవినిందకాః. 37

యే విష్ణుద్రోహిణః సంతి పతంత్య త్త్రెవతే మునే | యే వేదనిందకాఃసంతి సూర్యస్య చ గణశితుః. 38

బ్రాహ్మణానాం ద్రోహిణో యే పతంత్యత్త్రెవతే మునే | కామాచారాశ్చ యేసంతి తప్తముద్రాంకితాశ్చయే. 39

త్రిశూల దారిణో యే చ పతంత్యత్త్రెవతే మునే | మాతృపితృగురుజ్యేష్ట పురాణ స్మృతి నిందకాః.

40

యే ధర్మదూషకా ః సంతి పతంత్యత్త్రెవతే మునే | తేషా మయం మహాఘోరః శబ్దఃశ్రవణదారణః. 41

శ్రూయతే 7 స్మాభి రనిశంవైరాగ్యం యచ్చ్రుతేర్బవేత్‌ | ఇతి తేషా వచః శ్రూత్వా మునిరాట్తాద్ది దృక్షయా. 42

ఉత్థాయ చలిత స్తూర్ణం య ¸° కుండసమీపతః | అవాజ్ముఖో దదర్శా 7 ధస్తస్మిన్నేవ క్షణ మునే. 43

తత్రత్యానాం పాపినాంతు స్వర్గాధికమభూత్సుఖమ్‌ | హసంతి కేచి ద్గాయంతి నృత్యంతిచ తథా పరే. 44

పరస్సరం రమంతే తే 7 ప్యున్మత్తాః సుఖవర్దనాత | మృదంగమురజావీణా ఢక్కా దుందుభీ నిఃస్వనాః. 45

సముద్బూతా స్తు మధురాఃపంచమస్వర భూషితాః | వసంతనల్లీ పుష్పాణాం సుగంధి మరుతో వపుః. 46

ముని స్తు చకితో దృష్ట్వా యమదూతాశ్చ విస్మితాః | శీఘ్రం తే కథయామాసు ర్దర్మరాజాయ వేదినే. 47

మహారాజ మహాశ్చర్య మధునైవాభవ ద్విభో | స్వర్గాదప్యధికం సౌఖ్యం కుంభీపాకస్దపాపినామ్‌. 48

శివద్రోహులు-దేవీమిందకులు విష్ణుద్రోహులు దీనిలో గూలుదురు. మునీశా!వేద నిందకులునున సూర్యుని-గణపతిని నిందిచువారును బ్రాహ్మణ ద్వేషులును దీనిలో గూలుదురు. తమ మనస్సునకు దోచినట్లు ప్రవర్తించువారును శంఖచక్రముద్రాకింతులును త్రిశూలాంకితులు నిందు గూలుదురు. ఏలన నీ చిహ్నములు వేదసమ్మతములు గావు; తల్లిదండ్రులను-గురుని-జ్యేష్ఠుని-పురాణస్మృతులను నిందించువారును ధర్మదూషకులు నీ కుంభీపాకమున గూలుదురు. దారుణమైన చెవులకు చిల్లులు పడవేయు రోదనము లందలి పాపాత్ములవి. ఈ రోదన ధ్వని మేము రాత్రింబవళ్ళు వినుచుందుము. దానిని వినుట వలన మాకు వైరాగ్య ముదయించును. అను పీతృనాథుల వాక్కులను ముని రాజు విని వారిని చూచులకు లేచెను. మునివరుడు నరకకుండము సమీపమున కేగెను. ముని యదే సమయమున కుండము లోనికి తలవంచి చూచెను. అపు డందలి పాపులకు స్వర్గాధికమైన సుఖము గలిగెను. వారిలో కొందఱు నవ్విరి. కొందఱు పాడిరి. మఱికొందఱు నర్తించిరి. వారు తమకు గల్గిన సుఖసంతోషముల గూర్చి తమలోతాము ముచ్చటించుకొనునచుండిరి. మృదంగము-మురజము-వీణ-ఢక్క - దుందుబినాదములు-తియ్య తియ్యగ పంచమ స్వరములతో నందుడి చేవుల కమృతపు సోనలు కురియుచుండెను. మధుమాసపులతల-పూలవాసనల కెరటాల ఘమఘమ్మనుచుండెను. ముని యబ్బురపడెను. యమదూతలు విస్తుపోయిరి. వారు వేగిరమే ధర్మరాజుతో నంతయు నిట్లు నివేదించిరి. మహారాజా! విభూ! ఇపుడొక విచిత్రము జరిగినది. కుంబీపాక వాసులకు స్వర్గము కన్న మిక్కిలి సుఖము గల్గినది.

నిమిత్తం నైవ జానీమః కస్మాదిదమభూద్విభో | చకితాః స్మ వయం సర్వే ప్రాప్తా దేవ త్వదంతికమ్‌. 49

నిశమ్య దూతవాణీం తాం ధర్మరాట్‌ శీఘ్ర ముత్థితః | మహామహిషమారుఢో య¸° చే యత్ర పాపినః. 50

తాం వార్తాం ప్పేషయామాస దూతద్వారా 7 మరావతీమ్‌ | శ్రుత్వా తాం దేవరాజో 7 పిప్రప్తో దేవగణౖః సహ.

బ్రహ్మలోకా త్పద్మజో 7 పి వైకుంఠా ద్విష్టరశ్రవాః | త్తల్లోకాచ్చ దిక్పాలాః సమాజగ్ము ర్గణౖః సహ. 51

పరివార్య స్థిత్యాః సర్వే కుంభీపాక మితస్తతః | అపశ్యంస్త ద్గతాన్‌ రీ&ువాన్‌ స్వర్గాధిక సుఖాన్యితాన్‌. 53

చకితా ఏవ తే సర్వే న విదు స్తస్య కారణమ్‌ | అహో పోపస్య భోగార్థం కుండ మేతద్వినిర్మితమ్‌. 54

తత్ర సౌఖ్యం యదా జాతం తదా పాపాత్తు కి భయమ్‌ | ఉచ్చిన్నా వేదమర్యాదా పరమేశకృతా కథమ్‌. 55

భగవా న్స్వస్య సంకల్పం వితథం కృతవా న్కథమ్‌ | అశ్చర్య మేత దాశ్చర్య మేత దిత్యేవ భాషిణః. 56

తటస్దా అభవస్సర్వే న విదు స్తత్రకారణమ్‌ | ఏతస్మి న్నంతరే శౌరిఃసంమంత్ర్య విబుదాదిభిః. 57

య¸° కైశ్చి త్సురగణౖః సహితః శంకరాలయమ్‌ | పార్వత్యా సహితం దేవం కోటి కందర్ప సుందరమ్‌. 58

రమణీయతమాంగం తం లావణ్యఖని మద్బుతమ్‌ | సదా షోడశవర్షీయం నానాలంకార భూషితమ్‌. 59

నానాగ ణౖః పరివృతం లాలయంతం పరం శివామ్‌ | దదర్శ చంద్రమౌళిం స చతుర్వేదం ననామ హ. 60

ప్రభూ! దీనికి కారణమేమో మాకు దోచుటలేదు. మేము చకితులమై నీ చెంత కేగుదెంచితిమి. అను భటుల మాటలు విని ధర్మరాజు వెంటనే లేచి మహిషము నెక్కి యా సాపు లుంటుచోటికేగెను. యముడా వార్త నింద్రున కంపెను. అది విని సురమౌలియు నచ్చెరు వొంది సులను గూడి వచ్చెను. బ్రహ్మలోకమునుండి బ్రహ్మయునను వైకుంఠమందుండి విష్ణుడును ఆయా లోకాలనుడి దిక్పతులునున తమ తమ గణములతో నెతెంచిరి. వారందఱును కుంభీపాక నరకము చుట్టు మూగి యందున్న వారు స్వర్గాధిక సుఖములందుట కనులార గాంచిరి. ఎల్లరు నబ్బురపడిరి. కాని కారణమెరుగలేకుండిరి. ఈ కుంభీపాకము పాపులనను భవించుటకే నిర్మింపబడినది గదా!ఇం దెల్లెడల సుఖశాంతులు నెలకొన్నచో నింక పాపభయ మెట్లు గల్గును? పరమేశు డేర్పఱచిన వేదమర్యాద తలక్రిందు లెట్లయ్యేను? భగవానుడు తన సంకల్పమును తానే యేల వమ్ము చేయును? ఇదంతయు నేదో వింతగ నున్నదని యేల్లరు ననుకొనుచుండిరి. అదంఱునంతగ దగ్గఱగ నున్న నందులో నే యొక్కనికిని దాని కారణము తెలియలేదు. ఇపుడు శ్రీహారి విబుధులను కొంతమంది దేవతలను వెంటబెట్టుకొని కైలాసమేగెను. అచట శివుడు-పార్వతీసహితుడు-అందాలు విరజిమ్ము కోటి మదనసుందరుడు. రమణీయ-కమనీయదివ్య శరీరుడు-పరమ లావణ్యనిధి-నిత్యము పదారెండ్ల-దివ్యదత్న భూషణభూషితుడు. పెక్కు రుద్రగణములను గూడి శోభిల్లువాడు - ప్రియను పరమశివను లాలించువాడు - చంద్రమౌళియైన శివుని శ్రీహరి నాల్గు వేదమలతో సన్నతించి నమస్కరించెను.

వృత్తాంతం కథయామాస చమత్కృతమతిస్పుటమ్‌ | ఏతస్యకారణం దేవ న జానీమః కథం చన. 61

వద తత్కారణం దేవ సర్వజ్ఞో 7 సి యతః ప్రభో | విష్ణువాక్యం తదా శ్రత్వా ప్రసన్నముఖపంకజః. 62

ఉవాచ మధురం వాక్యం మేఘ గంభీరయా గిరా | శృణు విష్ణో తన్నిమిత్తం నాశ్చర్యం త్వత్ర విద్యతే. 63

భస్మనో మహిమైవాయం భస్మనా కిం భ##వేన్నహి | కుంభీపాకం గతో ద్రష్టుం దుర్వాసాః శైవసమ్మతః. 64

అవాజ్ముఖో దదర్శా7 ధ స్తదా వాయువశాద్ధరే | భాలభస్మకణా స్తత్ర పతితా దైవయోగతః. 65

తేన జాత మిదం సర్వం భస్మనో మహిమాత్వయమ్‌ | ఇతః వరం తు తత్తీర్ధం పితృలోకనివాసనామ్‌. 66

భవిష్యతి న సందేహో యత్ర స్నాత్వా సుఖీ భ##వేత్‌ | పితృతీర్థం తు తన్నామ్నా7 ప్యత ఊర్ధ్వం భవిష్యతి. 67

మల్లింగస్ధాపనం తత్ర కార్యం దేవ్యా శ్చ సత్తమ | పూజయిష్యంతి తే తత్ర పితృలోక నివాసనః. 68

త్రైలోక్యే యాని తీర్ధాని తత్రశ్రేష్ఠమిదం భ##వేత్‌ | పిత్రీశ్వరీపూజయా తు త్రైలోక్యం పూజితం భ##వేత్‌. 69

శ్రీనారాయణ ఉవాచ: ఇతి దేవవచః శ్రుత్వా దేవం మూర్ధ్నా ప్రణమ్యచ |

తదనుజ్ఞాం సమాదాయ య¸° దేవాంతికం హరిః 70

తత్సర్వం కథ యామాస కారణం శంకరోదితమ్‌ | సాధుసాధ్వితి తే ప్రోచు రమరా మౌళిచాలనైః. 71

శశంసు రభస్మమాహాత్మ్యం హరి బ్రహ్మాదయః సురాః | పితరశ్చైవ సంతుష్టా స్తీర్థలాబా త్పరంతప. 72

పిదప హరి విచిత్రమైన వృత్తాంత మంతయును వినిపించెను. ''దేవదేవా! దీని కారణము మా కెవ్వరికిని తెలియుట లేదు. ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ఆ కారణ మేమో తెలుపుము'' అను విష్ణు వాక్యములను విని శివుడు ప్రసన్ను డయ్యెను. శివు డంత మేఘగంభీర వాక్కులతో తియ్యతియ్యగ నిట్లు పలికెను : విష్ణూ! దాని కారణణు వినుము. దాని కబ్బురపడవలసిన పనిలేదు. అదంతయును భస్మమహిమమే సుమా! విబూకి కసాధ్యమైన దేదియును లేదు. శైవాచరియైన దుర్వాసోమహర్షి కుంభీపాకము చూడ నరిగెను. తడు తలవంచి క్రిందికి చూడగ వ్యాముస్పరశమున దైవయోగమున నుదుటి భస్మరేణువులు కుండమున బడెను. ఈ వింతయంతయును దానివలనన జరిగివది. అంతయు భస్మమహిమమే సుమా! నేటినుండి కుభీపాక నరకము పితృలోక వాసులకు పుణ్యతీర్ధముగా మారును. ఇందావంతయును సందియయము లేదు. అందు మునిగినచో పరమ సుఖము గల్గును. ఇకనుండి యా కుండము పితృతీర్ధ మన వాసి గాంచును. ఆచ్చోటనా దివ్యలింగమును దేవీ సహితముగ ప్రతిష్ఠంచవలయును. పితృలోకవాసులు నన్నభిషేకింటి పూజించి తరింతురు. ముల్లోకమందలి తీర్ధముల కెల్ల నిది శ్రేష్ఠమైన పుణ్యతీర్థ రాజ మగును. అచట నున్న పిత్రీశ్వరిని పూజించుటచే ముల్లోకములు పూజింపబడును. శ్రీనారాయణమునిఇట్లనెను: అను పరమశివుని వాక్కులు విని తలవంచి నవస్కరించి శివాజ్ఞ గొని శ్రీహరి మరల దేవతల కేతెంచెన. శంకరుడు పల్కిన దంతయును వారికి హరి వినిపించెను. అమరులు మేలు మేలని తలలూచిరి. అపుడుహరి - బ్రహ్మ మొదలగువారు భస్మమహిమమును వేనోళ్ల గొనయాడిరి. పరంతపా! పుణ్యతీర్ధ లాభమున పితరులును సంతోషించిరి.

తత్తీర్థతీరే లింగం చ దేవ్యామూర్తిం యధావిధి | స్ధాపయామాసు రమరాం పూజయామ న రన్వహమ్‌. 73

తత్ర యే ప్రాణినో7భూవన్పాభోగార్ధ మాస్ధితాః | తే విమానం సమారుహ్య గతాః కైలాసమండలమ్‌. 74

నామ్నా భద్రగణా స్తేతు వసంత్యద్యాపి తత్ర హి | పునశ్చ దూరదేశే తు కుంభీపాకో వినిర్మితః. 75

నిరుద్ధం శైవగమనం దేవైస్తత్ర తు తద్దినాత్‌ | ఇతి తే సర్వమాఖ్యాతం భస్మమాహాత్మ్య ముత్తమమ్‌. 76

నాతః పరతరం కించి దధికం విద్యతే మునే | ఊర్ధ్వం పుండ్రవిధిం చైవాప్యధికారి విభేదతః. 77

ప్రవక్ష్యే మునిశార్దూల వైష్ణవాగమలోకనాత్‌ | ఉర్ధ్వపుండ్రప్రమాణాని దివ్యాన్యంగుళి భేదతః. 78

వర్ణాభి మంత్ర దేవాంశ్చప్రవక్ష్యామి ఫలాని చ | పర్వతాగ్రే నదీతీరే శివక్షేత్రే విశేషతః. 79

సింధుతీరే చ వల్మీకే తులసీమూల మాశ్రితే | మృద ఏతా స్తు సంగ్రాహ్య వర్జయే దన్య మృత్తికా. 80

శ్యామం శాంతికరం ప్రోక్తం రక్తంవశ్యకరం భ##వేత్‌ | శ్రీకరం పీత మిత్యాహుర్ధర్మదం శ్వేతముచ్యతే. 81

అంగుష్ఠః పుష్టిదః ప్రోక్తో మధ్యమాయుష్కరం భ##వేత్‌ | అనామికాన్నదా నిత్యంముక్తిదా చ ప్రదేశినీ. 82

ఏతై రంగుళి భేదైస్తు కారయేన్ననఖైః స్పృశేత్‌ | వర్తి దీపావళికృతిం వేణుపత్రాకృతిం తధా. 83

పద్మస్య ముకులాకారం తధా కుర్యాత్ర్పయత్నతః | మత్స్యకూర్మాకృతిం వాపి శంఖాకారం తతః పరమ్‌. 84

ఆ తీర్థమందు పితరులు శివలింగమును - దేవీ విగ్రహము ప్రతిష్ఠించి ప్రతీదినమును పూజింపసాగిరి. కుంభీపాక మందు పాప మనుభవించు వారెల్లరును దివ్య విమాన మెక్కి కైలాసమున కరిగిరి. వారు కైలాసమందు భద్రగణములను పేరున నిప్పటికిని ప్రసిద్ధి గాంచుచున్నారు. ఆ తీర్థమునకు దూరముగ మరల కుంభీపాకము క్రొత్తగ నిర్మింతబడియెను. ఆనాటి నుండియును దేవతలు - శివభక్తులను కుంభీపాకమునకు వెళ్ళుట నడ్డగించిరి. ఈ విధముగ నీకు భస్మ మాహాత్మ్య మంతయును తెలిపితిని. మునీ! ఈ భస్మ ధారణమును మించిన దేదియును లేదు. ఇకపై సూర్ధ్వ పుండ్రవిధిని - దానికి తగిన వారిని గూర్చి తెల్పుదును. మునివా ! వైష్ణవాగమమం దూర్ధ్వపుండ్రములు వాని ప్రమాణము దాని యంగుళి భేదములు వర్ణములు - మంత్రములు - దేవతలు వాని ఫలితములు గలవనితెల్పుదును. గిరిశిఖరము - నదీతీరము - శివక్షేత్రము - సముద్రతీరము - తులసీమూలము - పుట్ట ఈ చోటులందెందేని మట్టి తీసికొనవలయును. వేరేచోటుల మట్టి పనికిరాదు. నల్లనిమట్టి శాంతికరము - ఎఱ్ఱనిది వశ్యకరము - పచ్చనిది శ్రీకరము - తెల్లనిది ధర్మప్రదము నని పెద్దలు తెలుపుదురు. అంగుష్ఠము - పుష్టికారము; నడిమి వ్రేలు - అయుష్కరము; ఉంగరము వ్రేలు - అన్నదము; చూపుడు వ్రేలు ముక్తిదాయకమని చెప్పబడును. ఈ యంగుళి భేదములతో తిలకముధరించవలయును. గోళ్లతో తాకరాదు. వెలుగుచున్న దీపశిఖవలె గాని గాని - వెదురాకువలె గాని - తమ్మి మొగ్గవలె గాని - ప్రయత్తించి నొసట నూర్ధ్వపుండ్రము ధరించవలయును. చేప - తాబేలు - శంకము వీనలోనే యాకారమునగాని -

ధశాంగుళి ప్రమాణం తు ఉత్తమోత్త మముచ్యతే | నవాంగుళం మధ్యమం స్యా దష్టాంగుళమతః పరమ్‌. 85

సప్త షట్పంచభిః పుండ్రం మధ్యమంత్రి విధం స్మృతమ్‌ |

చతుస్త్రి ద్వ్యంగుళైః పుండ్రం కనిష్ఠం త్రివిధం భ##వేత్‌. 86

లలాటే కేశవం విద్యాన్నారాయణ మథో దరే | మాధవం హృది విన్యస్య గోవిందం కంఠకూపకే. 87

ఉదరే దక్షిణ పార్శ్వే విష్ణు రిత్యభిధీయతే | తత్పార్శ్వ బాహుమధ్యే చ మధుసూదన మేవచ. 88

త్రివిక్రమం కర్ణదేశే వామకుక్షౌతు వామనమ్‌ | శ్రీధరం బాముకే వామే హృశీకేశం తు కర్ణకే. 89

పృష్ఠే చ పద్మనాభం తు కకుద్ధామోదరం స్మరేత్‌ | ద్వాదశైతానినామాని వాసుదేవేతి మూర్ధని. 90

పూజాకాలే చ హోమే చ సాయంప్రాతః సమాహితః | నామాన్యుచ్చార్య విధినా ధారయే దూర్ధ్వపుండ్రకమ్‌. 91

ఆశుచిర్వాప్యనాచరో మనసా పాపమాచరేత్‌ | శుచిరేవ భ##వేన్విత్యం మూర్ధ్వి పుండ్రాంకితో నరః. 92

ఊర్ద్వపుండ్రధరో మర్త్యో మ్రియతే యత్ర కుత్ర చిత్‌ | శ్వపాకో పి విమానస్థో మమ లోకే మహీయతే. 93

ఏకాంతినో మహాభాగా మత్స్వరూపావిదో7మలాః | సాంతరాలా న్ర్పకుర్వంతి పుండ్రాన్విష్ణుపదాకృతీన్‌. 94

పరమైకాంతినో7ప్యేవం మాత్పాదైక పరాయణాః | హరిద్రాచూర్ణ సంయుక్కాన్‌ శూలాకారాంస్తు వా7మలాన్‌. 95

అన్యేతు వైష్ణవాః పుండ్రానచ్ఛిద్రానపి భక్తితః | ప్రకుర్వీర న్దీపపద్మవేశు పత్రోపమాకృతీన్‌. 96

ధరించవచ్చును. పదంగుళముల ప్రమాణముగల తిలక ముత్తమోత్తమము. తొమ్మి దంగుళములది శ్రేష్ఠములో మధ్యమము. ఎనిమి దంగుళములి శ్రేష్ఠములో సాధారణమే. ఏడంగుళముల యూర్ధ్వపుండ్రము మధ్యమము. ఆరంగుళము లదిమధ్యమములో మధ్యమము. అయిదంగుళములది మధ్యమములో సాధారణము. నాలుగంగుళముల దధమము. మూడంగుళముల దధమమలో మధ్యమము. అంతకు చిన్న ధదమములో సాధారణము. నొసటి యూర్ధ్వపుండ్రము కేశపుడనియు ఉదరమందలి యూర్ధ్వపుండ్రము నారాయణుడనియు గుండెమీదిది మాధపుడనియు కంఠమునీదియూర్ధ్వపుండ్రము గోవిందు డనియు పొట్టకు కుడివైపున నున్నది విష్ణువనియును ఎడమవెపునన్నుది మదుసూదనుడనియును కుడి చెవిమీదిది త్రివిక్రముడనియు ఎడమ చెవి మీదిది వామనుడనియు ఎడమభుజము మీదిది శ్రీధరుడనియు కుడిభుడముమీది హృషీ కేశుడనియును వీపు మీదిది పద్మనాభుడనియును మూపునందలిది దామోదరుడనియును బ్రహ్మ రంధ్రమందలిది వాసుదేవుడనియు నీపండ్రేండు నామములుగ నూర్ధ్వపుండ్రములను భావించవలయును. ఉదయసాయం సంధ్యలందును పూజలందును హోమమందును నియత ముగనీ నామము లుచ్చరించి యూర్ధ్వపుండ్రముల దరింపవలయును. నిత్యము నెన్నొసట నూర్ధ్వపుండ్రములు ధరించినవాడెంతటి నాచారియైనను యశుఛియైనను పాపచింతనుడై నను శుచియే యగును. ఊర్ధ్వపుండ్రములు దాల్చినవా డెట్టిచోటులలో చచ్చినప్పరటికిని చండాలుడైనప్పటికినతడు దివ్య విమాన మెక్కి సాలోక్య మొందును. పరమైకాంముగ నుండు పవిత్రులు నా దివ్యస్వరూప మెఱిగినవారు. మధ్యశూన్యమై రెండు రేఖలుగ నున్న యూర్ధ్వపుండ్రములు విష్ణుపదమువలె శోభిల్లును అట్టి పరమైకాంతిక భక్తులు నా పదపద్మములే దిక్కని నమ్ముదురు. పసుపుపొడితో శూలాకారముగ ధరించువారురు నిశ్చలభక్కితో దీపము - కమలము - వెదురాకువలె ధరించువారు -

అచ్చిద్రానపి సచ్చిద్రాన్కుర్యుః కేవల వైష్ణవాః | అచ్ఛిద్రకరేణ తేషాం ప్రత్యవాయో న విద్యతే. 97

ఏకాంతినాం ప్రపన్నానాం పరమైకాంతినా మపి | అచ్ఛిద్రపుండ్రకరణ ప్రత్యవాయో మహాన్బవేత్‌. 98

ఊర్ధ్వపుండ్రంతు యః కుర్యాద్ధడాకారంతు శోభనమ్‌ | మధ్యేచ్ఛిద్రం వైష్ణవాశ్చ నమో7ంతైః కేశవాదిభిః. 99

విమలా న్యూర్ధ్వ పుండ్రాణి సంతరాలాని యోనరః | కరోతి విపులం తత్ర మందిరం మేకరోతి సః. 100

ఊర్ధ్వ పుండ్రస్య మధ్యేతు విశాలే సుమనోహరే | లక్ష్మ్యాసాకం సహాసినో రమతే విష్ణు రవ్యయః. 101

నిరంతరాలంయః కుర్యా దూర్ధ్వ పుండ్రం ద్విజాధమః | స హి తత్ర స్థితం విష్ణుం శ్రియంచైవ వ్యపోహతి. 102

అచ్ఛిద్ర మూర్ధ్వ పుండ్రం తు యః కరోతి విమూఢధీః | స పర్యాయేణ తా నేతి నరకానేక వింశతిమ్‌. 103

ఋజాని స్ఫుచపార్శ్వాని సాంతరాలాని విన్య సేత్‌ | ఊర్వ్వపుండ్రాణిదండాబ్జ దీపమత్స్యనిభాని చ. 104

శిఖోపవీతవ ద్ధార్యమూర్ధ్వ పుండ్రం ద్విజేన చ | వి నాకృతాశ్చే ద్విఫలాః క్రియాః సర్వామహామునే. 105

తస్మాత్సర్వేషు కార్యేశు కార్యం వివ్య ధీమతః | ఊర్ధ్వ పుండ్రం త్రిశూలం చ వర్తులం చతురస్రకమ్‌. 106

అర్ధ చంద్రాదికం లింగం వేదనిష్ఠో న ధారయేత్‌ | జన్మనా లబ్ధజాతి స్తు వేదపంథాన మాశ్రితః. 107

పుండ్రాంతరం భ్రమాద్వా7పి లలాటేనైవ ధారయేత్‌ | ఖ్యాతికాత్యాది సిద్యర్థం చాపి విష్ణ్వాగమాదిషు. 108

అచ్ఛిద్రముగ గాని సచ్ఛిద్రముగ గాని యూర్ధ్వపుండ్రములు ధరించువారును స్వచ్ఛమైన వైష్ణవులు. అచ్ఛిద్రముగ ధరించినవారి కెట్టి ప్రత్యవాయుములును గలుగవు. పరమైకాంతిక్తు - ప్రసన్నులు - వీర వైష్ణవులు - సచ్ఛిద్రములు గ పుండ్రములు దాల్చిన వారికి మిక్కిలిగ ప్రత్యవాయములు గల్గును. కేశవాయనమః మున్నగు నామములతో మధ్యశూన్యముగల్గి చక్కగ దండాకారముగ నుండు రెండూర్ధ్వపుండ్రములు వైష్ణవులు దాల్తురు. ఇట్లు సాంతరముగ నూర్ధ్వపుండ్రములు చక్కగ ధరించువాడు నా మందిరము నిర్మంచినవా డగును. ఊర్ధ్వపుండ్రముల నడుమ నందముగ విశాలమైనచోట నవ్యయుడై విష్ణువు లక్ష్మితో క్రీడించుచుండును. నడుమచొ టుంచక నూర్ధ్వపుండ్రములు దాల్తినవ ద్విజాధము డచ్చట నున్న శ్రీవిష్ణువును పారద్రోలినవా డగును. కనుక మధ్యను చోటుంచ కూర్ధ్వపుండ్రములు దాల్చిన మూఢమతి వరుసగ పదునొకండగు నరకములందు గూలును. ఊర్ధ్వపుండ్రములను చక్కగ - స్ధూలముగ - సాంతరముగ - దండమువలె - పద్మమునలె - దీపమువలె - చేపవలె ధరించవలయును. మహామునీ! ద్విజు డెట్లు జట్లు - జందెమును తప్పక ధరించునో యూర్ధ్వపుండ్రములు నట్ల ధరించ వలయును. కనుక విజ్ఞానియైన ద్విజు డన్ని పనులందును త్రిశూలమువలెనో - గుండ్రముగ - చతురస్రముగనో యూర్ధ్వపుండ్రములు ధరించవలయును. వేదనిష్ఠుడైనా డర్ధచంద్రాకారముగ ధరించరాదు. బ్రహ్మాణజాతి చెంది వేదమార్గ మనుష్టించువాడు భ్రమపడియైనను నొసట వేరు విధముగ నూర్ధ్వపుండ్రములు దాల్చరాదు. ఇట్లు వైష్ణవాగమములందు కీర్తి - కాంతి మున్నగునవి గల్గుట కూర్ధ్వపుండ్రములు విధించి చెప్పబడినవి.

స్ధితం పుండ్రాంతరం నైవ ధారయేద్వైదికో జనః | తిర్యక్త్రి పుండ్రం సంత్యజ్య శ్రోతం కథమపిభ్రమాత్‌. 109

లలాటే భస్మనా తిర్యక్త్రి పుండ్రస్య చ ధారణమ్‌ | వినా పుండ్రాంతరం మోహాద్ధారయన్నారకీ భ##వేత్‌. 110

వేదమార్గైకనిష్ఠస్తు మోహేనా ప్యంకితో యది | పతత్యేవ న సందేహ స్తథా పుండ్రాతరాదపి. 111

నాంకనం విగ్రహే కుర్యా ద్వేదమార్గం సమాశ్రితః | శ్రౌతధార్మైక నిష్ఠానం లింగం తు శ్రౌతుమేవ హి. 112

ఆశ్రౌత ధర్మ నిష్ఠానామశ్రౌతం లింగ మీరితమ్‌ | దేవతా వేద సిద్ధా యాస్తాసాం లిగంతు వైదికమ్‌. 113

అశ్రౌతతంత్రనిష్ఠాయాస్త సా మశ్రౌతమేవహి | వేదసిధ్ధో మహాదేవః సాక్షాత్సం సారమోచకః. 114

భక్కానా ముపకారయ శ్రౌతం లింగం దధాతి చ | వేదసిద్ధస్య విష్ణోశ్చ శ్రౌతం లింగం న చేతరత్‌. 115

ప్రాదుర్బావ విశేషాణా మపి తస్య తదేవ హి | శ్రౌతం లింగం తు విజ్డేయం త్రిపుండ్రోద్ధూలనాదికమ్‌. 116

ఆశ్రౌత మూర్ధ్వపుండ్రాదినైవ తిర్యక్త్రిపుండ్రకమ్‌ | వేదమార్గైకనిష్ఠానాం వేదో క్తేనైవ వర్త్మనా. 117

లలాటే భస్మనా తిర్య క్త్రిపుండ్రం ధార్యమేవహి | యస్తు నారాయణం దేవం ప్రసన్నః పరమం పదమ్‌. 118

ధారయే త్సర్వదా శూలం లలాటే గంధావారిణా. 119

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకా దశ స్కంధే పంచశో7ధ్యాయః.

వైదిక పురుషుడు వేరైన పుండ్రములు ధరింరాదు. వైదికు డడ్డముగ త్రిపుండ్రములు వదలి యెప్పుడైనను భ్రమపడిగాని యితరములు దాల్చరాదు. అతడు నొసట భస్మముతో త్రిపుండ్రములు ధరించక వేరైన పుండ్రములు మోహవశమువ దాల్చినచో నారకు డగును. వేదనమార్గనిష్ఠుడు ప్రమాదమున మోహావశుడైనను వేరు విధముగ త్రిపుండ్రములు దాల్చినను పతితు డగును, వేదమార్గమున సంచరించువారు శరీరమును ముద్రాంకితముగ చేసికొనరాదు. శ్రౌతధర్మ మాచరించువారికి శ్రౌతచిహ్నమే శ్రుతిధర్మము బాటించనివారికి వేదబహ్యామైన చిహ్నము చెప్పబడినది. వేదసిద్ధులైన దేవతలకు వైదిక చిహ్నమే చెప్బడినది. శ్రౌతకర్మ మాచరించని తాంత్రిక నిష్ఠులకు వేదబాహ్యమైన చిహ్నమే తగును. వేదసిద్ధుడైన మహాదేవుడు ప్రత్యక్షముగ సంసారమునుండి ముక్కి గల్గించును. పరమభక్తులు తమ యుపకారము కొరకే శ్రోత లింగము (భస్మధారణచిహ్నము) ధరించవలయును. వేదనిష్ఠుడైన వైష్ణవుడు సైతము శ్రౌతలింగమునే ధరించవలయును గాని యితరముగాదు. శ్రీరాముడు - కృష్ణుడు మొదలగు నవతార పురుషులను భస్మధారణము శ్రౌతలింగముగనే సమాచరించిరని తెలియవలయును. శ్రుతికర్మలు చేయనివా డూర్ధ్వపూండ్రములు దాల్చును. భస్మధారణముచేయడు. కాని వేదమార్గనిష్ఠులు వేదమార్గము ననుసరింటి నొసట నడ్డముగ భసముతో త్రిపుండ్రములు ధరించవలయును. శ్రీనారాయణునికి ప్రసన్నుడై పరమపదము గోరువాడు నొసట గంధజలములతో త్రిశూలము ధరించవలయును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకదాశ స్కంధమున పదునైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters