Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టమో7ధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : భూతశుద్ధి ప్రకారం చ కథయామి మహామునే | మూలాధారా త్సముత్థాయ కుండలీం పరదేవతామ్‌. 1

సుషుమ్నామార్గ మాశ్రిత్య బ్రహ్మరంధ్రగతాం స్మరేత్‌ | జీవం బ్రహ్మణి సంయోజ్య హంసమంత్రేణ సాధకః. 2

పాదాదిజాను పర్యంతం చతుష్కోణం సవజ్రకమ్‌ | లం బీజాఢ్యం స్వర్ణవర్ణం స్మరేదవని మండలమ్‌. 3

జాన్వాద్యానాభి చంద్రార్దనిభం పద్మద్వయాంకితమ్‌ | వం బీజయుక్తం శ్వేతాభ మంభసో మండలం స్మరేత్‌. 4

నాభేర్హృదయ పర్యంతం త్రికోణం స్వస్తికాన్వితమ్‌ | రంబీజేన యుతం రక్తం స్మరేత్పావక మండలమ్‌. 5

హృదో భ్రమధ్య పర్యంతం వృత్తం షడ్బిందులాంఛితమ్‌ | యంబీజయుక్తం ధూమ్రాభం నభస్వన్మండలం స్మరేత్‌.

ఆబ్రహ్మరంధ్రం భ్రూమధ్యా ద్వృత్తం స్వచ్చం మనోహరమ్‌ | హంబీజయుక్త మాకాశ మండలం చ విచింతయేత్‌.

ఏవం భూతాని సంచింత్య ప్రత్యేకం సంవిలాపయేత్‌ | భువం జలే జలం వహ్నౌవహ్నింవా¸° నభస్యముమ్‌. 8

విలాప్య ఖమహంకారే మహత్తత్వే7ప్యహం కృతిమ్‌ | మహాంతం ప్రకృతౌ మాయా మాత్మని ప్రవిలాపయేత్‌. 9

శుద్దసంవిన్మయో భూత్వా చింతయేత్పాప పూరుషమ్‌ | వామకుక్షి స్థితం కృష్ణ మంగుష్ఠపరిమాణకమ్‌. 10

ఎనిమిదవ అధ్యాయము

భూతశుద్ధి విధానము

శ్రీనారాయణుడిట్లనెను : నారదా! ఇపుడు భూతశుద్ధి విధానము తెల్పుచున్నాను వినుము. శ్రీపరదేవత- కుండలినీ శక్తి. ఆమె మూలాధారమునుండి లేచి సుషుమ్నా మార్గముద్వారా బ్రహ్మరంధ్రమును చేరినదని సాధకుడు తలంచవలయును. మఱియును హంసమంత్రముచే జీవబ్రహ్మల కైక్యము భావింపవలయును. సాధకుడు తన పాదములనుండి మోకాళ్ల వఱకును చతుష్కోణముగ బంగారు వర్ణముతో నొప్పుచున్న భూమండలమును "లం" బీజముగ తలవంచవలయును. మోకాళ్లనుండి బొడ్డువఱకు నర్ధచంద్రాకరముతో రెండు పద్మములతో నలరారు జలమండలమును "వం" బీజము స్మరింపవలయును. బొడ్డునుండి హృదయము వఱకును త్రికోణముగ కోణాగ్రములందు స్వస్తికాన్వితముగ "రం" బీజరూపమగు అగ్నిమండలం మును స్మరింపవలయును. హృదయమునుండి భ్రూమధ్యము వఱకును గుండ్రముగ ఆరుబిందువులతో ''యం'' బీజముగభూమ్ర వర్ణముతో నలరారు వాయు మండముగ భావించవలయును. భ్రూమధ్యమం దుండి బ్రహ్మరంధ్రము వఱకు గుండ్రముగ స్వచ్చముగ సుమనోహరముగ ''హం'' బీజముతో విలసిల్లు గగనమును సంస్మరించవలయును. ఈ విధముగ పంచభూతములను స్మరించిమరల ప్రతిదానిని లయింపచేయవలయును. భూమిని జలములో జలము నగ్నిలోఅగ్నిని వాయువులో వాయువు నాకాశమునందున లయ మొనరించవలయును. ఆకాశము నహంకారములో అహంకృతిని మహత్తత్వములో మహత్తును ప్రకృతిలో ప్రకృతి నాత్మలో లయ మొనరింపవలయును. అపుడు సాధకుడు శుద్ధ సంవిత్స్వరూపుడై తన కెడమ వైపున నల్లగ అంగుష్ఠమంతగ నున్న పాపపురుషుని తలంచవలయును.

బ్రహ్మహత్యా శిరోయుక్తం కనకస్తేయబాహుకమ్‌ | మదిరాపాన హృదయం గురుతల్పకటీయుతమ్‌. 11

తత్సంసర్గి పద ద్వంద్వముప పాతక ముస్తకమ్‌ | ఖడ్గచర్మధరం కృష్ణమధోవక్త్రం సుదుఃసహమ్‌. 12

తత్సంసర్గి స్మరన్వాయం సంపూర్యైనం విశోషయేత్‌ | స్వసరీరయుతం మంత్రీ వహ్నిబీజేన నిర్దహేత్‌. 13

కుంభ##కే పరిజప్తేన తతః పాపనరోద్బవమ్‌ | బహిర్బస్మ సముత్సార్య వాయుబీజేన రేచయేత్‌. 14

సుధాబీజేన దేహోత్తం భస్మ సంప్లాపయేత్సుధీః | భూబీజేన ఘనీకృత్య భస్మ తత్కనకాండవత్‌. 15

విశుద్దముకురాకరాం జపబీజం విహాయసః | మూర్దాదిపాద పర్యంతాన్యంగాని రచయేత్సుధీః. 16

ఆకాశాదీని భూతాని పునరుత్పాదయేచ్చితః |సో7హం మంత్రేణ చాత్మానమాన యేద్దృ దయాంబుజే. 17

కుండలీ జీవమాదాయ పరసంగా త్సుధామయాత్‌ | సంస్థాప్య హృదయాంభోజే మూలాధారగతాంస్మరేత్‌. 18

రక్తాంబోదిస్థపోతోల్లసదరుణసరోజాధిరూడా కరాజ్జై ః |

శూలం కోదండమిక్షూకూద్బవ మణిగుణ మప్యంకుశం పంచబణాన్‌ |

బిభ్రాణా సృక్కపాలం త్రిణయనలసితాపీనవక్షోరుహాఢ్యా |

దేవీబాలార్క వర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః 19

ఏవం ధ్యాత్వా ప్రాణశక్తిం పరమాత్మ స్వరూపిణీమ్‌ | విభూతే ర్దారణం కార్యం సర్వాధికృతి సిద్దయే. 20

విభూతే ర్విస్తరం వక్ష్యే ధారణ చ మహాఫలమ్‌ | శ్రుతిస్మృతి పురాణోక్తం భస్మధారణ ముత్తమమ్‌. 21

పాపపురుషుడు బ్రహ్మహత్య అను శిరస్సుతో బంగారము దొంగలించుట అను బాహువులతో మదిరాపానమను హృదయముతో గురుతల్పమనమను నడుముతో తత్సంసర్గమనెడు రెండు పాదములతో ఉపపాతక మనెడు చేతులతో కత్తి- కవచము దాల్చి నల్లగ దుస్సహముగ తన మొగము నేలకు వాస్చుకొని యుండును. పిదప వాయుబీజమును స్మరించుచు వాయువును లోన పూరించుచు పాపపురుషుని శుష్కింప చేయవలయును. తర్వాత ''రం'' బీజముతో తన శరీరమందలి పాపిని కాల్చి బూడిది చేయవలయును. కుంభకమున ''రం'' బీజముతో కాలిన బూడిరను మరల వాయుబీజముతో బైటికి రెడించి పారవేయవలయును. పిదప సాధకుడు తననుండి బైటికి వచ్చిన బూడిదను ''వం'' బీజముతో తడుపవలయును. తర్వాత దానిని ''లం'' బీజముతో బంగారు గ్రడ్డువలె గట్టిగ చేయవలయును. తర్వాత ''హం'' బీజముతో బంగారు గ్రడు%్‌డ అద్దముగ మారి నట్టు లూహించవలయును. దానిలో నఖశిఖ పర్యంత మాకారము కల్పించుకొనవలయును. పిదప బ్రహ్మనుండి ఆకాశము-గాలి- అగ్ని- నీరు- భూమి వీనిని వరుసగ నుత్పన్నము చేయవలయును. అపుడు మరల''సోహం'' మంత్రముతో జీవాత్మను పరమాత్మనుండి వేరు చేసి హృదయపద్మములో జీవాత్మను స్థాపించవలయును. మొదట జీవాత్మ కుండలిని నుండి బ్రహ్మలో గలిసినట్లు భావించవలెను. ఇపుడు కుండలిని-పరాత్మతో నమృత జీవనము బొంది మరల హృదయకమలమునుండి మూలాధారము చేరినట్లు సాధకుడు భావించవలయును. ఇంకయ ప్రాణప్రతిష్ఠను తెలుపుదును వినుము. ఎఱ్ఱని రక్తసాగరములో నొకనావ. అందొక యెఱ్ఱనిపద్మము. అందు ప్రాణశక్తి కూర్చొని నట్లు తంచి యిట్లు ప్రార్ధించవలయును. ప్రాణశక్తీ! నీకు ఆరు చేతులు గలవు. వానిలో త్రిశూలము- చెఱకు విల్లు-పాశము- అంకుశము-పంచబాణములు-నెత్తుటి కపాపపాత్ర గలవు. నీకు మూడు నేత్రములు-ఎత్తైన స్తనములు గలవు. నీ శరీరలావలణ్యము ఉదయించు సూర్యునివలె నెఱ్ఱగ గలదు. ప్రాణశక్తీ మాకు సుఖమిమ్ము. అని పరాత్మ స్వరూపిణియైన ప్రాణశక్తిని ధ్యానించి సర్వాధికారసిద్ధికి విభూతి ధారణ మొనరింపవలయును. భస్మధారణ ముత్తమము-ఫలదాయకము-శ్రుతిస్మృతులందును వర్ణింపబడినది. దీనివిషయము వివరింతును వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశస్కంధమున అష్టమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters