Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచమోధ్యాయః.

ఈశ్వర ఉవాచ : లక్షణం జపమాలాయాః శృణు వక్షామి షణ్ముఖ |దుద్రాక్షస్య ముఖం బ్రహ్మా బిందూ రుద్ర ఇతీరితః 1

విష్ణుః పుచ్చం భ##వేచ్చైవ భోగమోక్షఫల ప్రదమ్‌ | పంచవింశతిభీశ్చాక్షైః పంచవక్త్రెః సకంటకైః 2

రక్తవర్ణెః సిత్తెర్మిశ్త్రెః కృతరంధ్ర విదర్బిత్తెః | అక్షసూత్రం ప్రకర్తవ్యం గోపుచ్చవలయాకృతి. 3

వక్త్రం వక్త్రేణ సంయోజ్య పుచ్చంపుచ్చేనయోజయేత్‌ | మేరు మూర్ద్వముఖం కుర్యాత్తదూర్ద్వం నాగపాశకమ్‌.

ఏవం సంగ్రథితాం మాలాం మంత్రసిద్ది ప్రదాయినీమ్‌ | ప్రక్షాళ్య గంధతోయేన పంచగవ్యేన చోపరి. 5

తతః శివాంభసా೭೭క్షాళ్య తతో మంత్ర గణాన్న్యసేత్‌ | స్పృష్వా శివాస్త్ర మంత్రేణ కవచేనావగుంఠయేత్‌. 6

మూలమంత్రం న్య సే త్పశ్చా త్పూర్వవత్కారయేత్తథా | సద్యోజాతాదిభిః ప్రోక్ష్యయావదష్టోత్తరం శతమ్‌. 7

మూలమంత్రం సముచ్చార్య శుద్ధభూమౌ నిధాయ చ | తస్యోపరి న్యసేత్సాంబం శివాం పరమకారణమ్‌. 8

ప్రతిష్ఠతా భ##వేన్మాలా సర్వ కామఫల ప్రదా | యస్య దేవస్య యో మంత్ర స్తంతేనై వాభి పూజయేత్‌ 9

మూర్ద్ని కంఠే థవా కర్ణే న్య సేద్వా జపమాలికామ్‌ | రుద్రాక్షమాలయా చైవం జప్తవ్యం నియతాత్మనా. 10

కంఠే మూర్ద్ని హృది ప్రాంతే కంఠే బాహుయుగే ధవా | రుద్రాక్షధారణం నిత్యం భక్త్యా పరమయాయుతః. 11

కిమత్ర బహునోక్తేన వర్ణనేన పునఃపునః | రుద్రాక్షధారణం నిత్యం యస్మాదేతత్ప్ర శస్యతే. 12

ఐదవ అధ్యాయము

జపమాలా లక్షణ నిరూపణము

ఈశ్వరు డిట్లనెను: షణ్ముఖా! జపమాలికా లక్షణము తెల్పుచున్నాను వినుము. రుద్రాక్ష ముఖము-బ్రహ్మ; పైభాగము రుద్రుడను నేను; తోక-భోగమోక్షము లొసంగు విష్ణువు; ముండ్లుగల పంచముఖ రుద్రాక్షలు ఇరువదైదుతెచ్చి మాలగూర్చిన దానిని పంచముఖి కంటకమాల యందురు. ఇవి ఎఱుపుగ-తెలుపుగ- మిశ్రమముగ నెటులైన నుండవచ్చును. ఆవుతోకవలె ననగా మీది భాగము వెడల్పుగ క్రింది భాగము తోకవలె మాల గూర్చవలయును. మాల గూర్చునపుడొకరుద్రాక్ష మొగముతో మరొకదాని ముఖమును దాని తోకతో మరొకదాని తొకను జతచేర్చి గూర్చవలయును. మేరుపూస ముఖముపైవైపున నుండవలయును. దానిపైని వాగపాశము (ముడి) యుండవలయును. ఇట్లు గూర్చిన మాల మంత్రసిద్ది గలగించును. దాని మొదట గంధజలములో తర్వాత పంచగవ్యములో శుద్ది చేయవలయును. తరువాత శుద్ద జలముతో శుద్దిచేసి మంత్రన్యాసము చేయవలయును. శివ షడంగమంత్రముతో తాకి "హం" కవచమంత్రముతో గూర్చవలయును. తర్వాత మూలమంత్రముతో న్యాసము పూర్వమువలె చేయవలయును. తర్వాత సద్యోజాతాది మంత్రములతో ప్రోక్షించవలయును. తర్వాత నూట యెనిమిదిమార్లు మూలమంత్రము జపించి దానిని నేలపై నుంచవలయును. దానిపై సాంబసదా శివుని న్యాసము చేయవలయును. ఇట్లు మాలప్రతిష్ఠ చేసినచో నది సకల కామములుతీర్చును. ఏ దేవత కే మంత్రముగలదో దానితోనే మాలా శుద్ది చేయవలయును. ఈ జపమాల తలపైగాని కంఠమందుగాని చెవియందుగాని ధరించవలయును. ఇట్టి మాలతో జపము చేసినపుడు మనస్సు నదుపులో నుంచుకొనవలయును. కంఠము-తల-హృదయము-బాహువులు-చెవులు వీనిలో నెచ్చటనైన నిత్యము బాయక భక్తితో రుద్రాక్ష ధారణము చేయవలయును. ఇన్ని మాట లేల? ప్రతి నిత్యమును రుద్రాక్షలు దాల్చినవాని కీర్తిప్రతిష్ఠలు మూడు పూవు లారు కాయలు.

స్నానే దానే జపేహోమే వైశ్వదేవే సురార్చనే | ప్రాయశ్చిత్తే తథాశ్రాద్దే దీక్షాకాలే విశేషతః 13

అరుద్రాక్షధరో భూత్వా యత్కించిత్కర్మవైదికమ్‌ | కుర్వ న్విప్రస్తు మోహేన నరకే పతతి ద్రువమ్‌. 14

రుద్రాక్షం ధారయే న్మూర్ద్ని కంఠే సూత్రే కరేథవా | సువర్ణమణి సంభిన్నం శుద్ధం నాన్యై ర్దృతంశివమ్‌. 15

నాశుచిర్దారయే దక్షం సదాభ##క్యైవ ధారయేత్‌ | రుపద్రాక్షతరు సంభూత వాతో ద్బూత తృణాన్యపి. 16

పుణ్యలోకం గమిష్యంతి పునరావృత్తి దుర్లభమ్‌ | రుద్రాక్షం ధారయన్పాపం కుర్వన్నపి చ మానవః 17

సర్వం తరతి పాప్మానం జాబాల శ్రుతి రాహ హి | పశవో హి చ రుద్రాక్ష ధారణా ద్యాంతి రుద్రతామ్‌. 18

కిము యే ధారయంతి స్మ నరా దుద్రాక్షమాలికామ్‌ | రుద్రాక్షః శిరసా హ్యేకో ధార్యో రుద్ర పర్తెః సదా. 19

ధ్వంసనం సర్వ దుఃఖానాం సర్వపాపవిమోచనమ్‌ | వ్యాహరంతి చ నామాని యే శంభోః పరమాత్మనః. 20

రుద్రాక్షాలం కృతా యే చ తేవై భాగవతోత్తమాః | రుద్రాక్షధారణం కార్యం సర్వశ్రేయో ర్థిబిర్నృభిః. 21

కర్ణపాశే శిఖాయాం చ కంఠే హస్తే తథోదరే | మహాదేవ శ్చ విష్ణుశ్చ బ్రహ్మాతేషాం విభూతయః. 22

దేవాశ్చాన్యే తథా భక్త్యాఖలు రుద్రాక్ష ధారిణః | గోత్రర్షయశ్చ సర్వేషాం కూటస్థా మూలరూపిణః. 23

తేషాం వంశప్రసూతా శ్చ మునయః సకలా అపి | శ్రౌత ధర్మపరాః శుద్దాః ఖలు రుద్రాక్ష ధారిణః. 24

స్నానము-దానము-జపము-హోమము-వైశ్వదేవము-దేవతార్చనము-ప్రాయశ్చిత్తము-శ్రాద్దము-దీక్షాకాలము వీనిలో దేనియందైనను రుద్రాక్ష ధరింపక మోహమున వైదిక కర్మ చేసినవాడు కచ్చితముగా నరకమున గూలును. కనుక మెడ-శిరము-జన్నిదము-చేయి-యెచటనైన బంగారము పోత పోసిన రుద్రాక్ష తప్పక దాల్చవలయును. ఇతరము దల్చరాదు. అశుచిగ రుద్రాక్ష దాల్చరాదు. నిశ్చలభక్తితో దాల్చవలయును. రుద్రాక్ష చెట్టుమీది గాలి తాకుట వలన గడ్డిపోచగూడ పుణ్యలోకములు చేరగలదు. దానికి మరల పుట్టుక గల్గదు. రుద్రాక్ష దాలిచి పాపము చేసిన వానికి ఆ పాప మంటదు. అని జాబాలి మహర్షిచెప్పెను. ఇంతెందుకు! రుద్రాక్ష దాల్చి పశవు సైతము రుద్రత్వ మందును సుమా. ఇంక రుద్రాక్షమాలికమే తాల్చిన వారిని గూర్చి చెప్పవలసిన దేమున్నది! రుద్ర పరాయణుడై యొక రుద్రాక్షనైన తలపై దాల్చినవాడు సర్వపాపములనుండి ముక్తు డగును. సర్వదుఃఖముల కతీతు డగును. ఎవరు పరమాత్ముడగు శివుని నామ సంకీర్తనము చేయుదురోఎవరు రుద్రాక్ష లలంకరించుకొనియుందురో వారు పరమ భాగవత శిఖామణులు. కావున సర్వశుభములు గోరు కొనువాడు నిత్యము రుద్రాక్షలు దాల్చవలయును. రుద్రాక్షలు దాల్చినవాని కంఠము-శిఖ-చెవులు-చేతులు-పొట్టవీనియందు బ్రహ్మ-విష్ణు-శివుల నిత్యవిభూతులు తిరముగనుండును. ఇతర దేవతలును శివభక్తులై రుద్రాక్షలు దాల్తురు. అందఱి గోత్రములలోని ఋషులు-కూటస్థులు-మూల పురుషులు వారి వారి వంశములందు పుట్టిన మునులందఱును శ్రౌత ధర్మ పరులై రుద్రాక్షలు దాల్తురు.

శ్రద్దా న జాయతే సాక్షా ద్వేదసిద్దే విముక్తిదే | బహునాం జన్మనా మంతే మహాదేవ ప్రసాదతః 25

రుద్రాక్ష ధారణ వాంఛా స్వభావా దేవజాయతే | రుద్రాక్షస్యతు మహాత్మ్యం జాబాలై రాదరేణతు. 26

పఠ్యతే మునిభిః సర్త్వెర్మయా పుత్ర తథైవ చ | రుద్రాక్ష స్య ఫలం చైవ త్రిషు లోకేషు విశ్రుతమ్‌. 27

ఫలస్య దర్సనే పుణ్యం స్పర్శాత్కోటి గుణం భ##వేత్‌ | శతకోటి గుణం పుణ్య ధారణా ల్లభ##తే నరః 28

లక్షకోటి సహస్రాణి లక్షకోటిశతాని చ | జపాచ్చ లభ##తే నిత్యం నాత్రకార్య విచారణా. 29

హస్తే చోరసి కంఠే చ కర్ణయోర్మస్తకే తథా | రుద్రాక్షం ధారయే ద్యస్తు స రుద్రో నాత్ర సంశయః. 30

అవధ్యః సర్వభూతానాం రుద్రవద్ది చరేద్బువి | సురాణా మసురాణాం చ వందనీయో యథాశివః . 31

రుద్రాక్షధారీ సతతం వందనీయస్తథా నరైః | ఉచ్చిష్టోవా వికర్మస్థో యుక్తోవా సర్వపాతకైః 32

ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రాక్షస్యతు ధారణాత్‌ | కంఠే రుద్రాక్ష మాబద్య శ్వాపివామ్రియతే యది. 33

సోపి ముక్తి మనాప్నోతి కింపున ర్మానుషోపినః | జపధ్యాన విహీనోపి రుద్రాక్షం యది ధారయేత్‌. 34

సర్వపాపవినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్‌ | ఏకం వాపిహి రుద్రాక్షం కృత్వా యత్నేన ధారయేత్‌. 35

ఏకవింశతి ముద్ధృత్య రుద్రలోకే మహీయతే | అతః పరం ప్రవక్ష్యామి రుద్రాక్షస్య పునర్విధిమ్‌. 36

ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే పంచమోధ్యాయః.

వేదప్రసిద్దమై ముక్తిప్రదమైన రుద్రాక్ష ధారణమం దొకేసారి మనసు నిలువదు. ఎన్నో కోట్ల జన్మల తర్వాత గాని మహాదేవుని యనుగ్రహమున గాని రుద్రాక్ష ధారణమందు మనసు సహజముగతగుల్కొనదు. అట్టి రుద్రాక్ష మహిమమును గూర్చి జాబాలి శ్రుతి గలదు. పుత్రా!దాని నెల్ల మునుసులు చదువుదురు. నేనును చదువుదును. రుద్రాక్షఫలితము ముల్లోకములందును ప్రసిద్దిగాంచినది. రుద్రాక్షను చూచినంతనే పుణ్యము గల్గును. తాకిన కోటిరెట్లు పుణ్యము. ధరించిన నూరుకోట్లు రెట్లు పున్నెము గల్గును. రుద్రాక్షమాలతో జపించినచో లక్షకోటి వేల-లక్షలకోటి నూర్ల రెట్లుగపుణ్యఫలబాగ్యము నిత్యము గల్గుచుండును. ఇందు సందేహము లేదు. తల-మెడ-చెవి-చేయి పొట్ట వీనియందు రుద్రాక్షలు దాల్చువాడు కేవలము రుద్రుడేకాని సామాన్యుడు గాడు. అత డెల్ల భూతములచేతను వధింబడదు. రుద్రులతో నెల్లెడలసంచరించగలడు. శివుడువలె సురాసురులచేత నమస్కరింపబడును. రుద్రాక్షధారి యెల్లరికి వందనీయు డగును. అత డుచ్చిష్ట ప్రదేశమున నున్నను-వికర్మలు చేసినను-సర్వపాప పంకిలత్వమందున్న రుద్రాక్షధారియైనచో నతడు సర్వపాపముక్తుడు గాగలడు. తన మెడలో రుద్రాక్ష దాల్చి చచ్చిన కుక్క సైతము ముక్తిని బొందును. ఇక మానవుని సంగతి చెప్పవలయునా? జపధ్యానములు చేయనివాడును రుద్రాక్ష దాల్చినచో అతడు సర్వ పారముక్తుడై యుత్తమ లోకములు చేరును. కావున ప్రతివాడు నొక్క రుద్రాక్షనైన ప్రయత్వించి తెచ్చుకొని తాల్చుట మంచిది. అట్టివాడు తన యిరువ దొక్క తరములు వారిని తరింపచేసి పిదప రుద్రలోకమున ప్రితిష్ఠ గాంచును. ఇట్టి రుద్రాక్ష విధానము గూర్చి యింకను దెల్పుదును వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమున పంచమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters