Sri Devi Bagavatham-2    Chapters   

అథనవమోధ్యాయః

నారాయణ ఉవాచః ఆధాతః శ్రూయతాం చిత్రం దేవీమాహాత్మ్య ముత్తమమ్‌| అంగపుత్రేణ మనునా యథా೭೭ప్తం రాజ్య ముత్తమమ్‌. 1

అంగస్య రాజ్ఞః పుత్రోభూ చ్చాక్షుషో మనురుత్తమః | షష్ఠః సుపులహంనామ బ్రహ్మర్షిం శరణం గతః. 2

బ్రహ్మార్హే త్వామహం ప్రాప్తః శరణం ప్రణతార్తిహన్‌ | శాధి మాం కింకరం స్వామ్న్‌ యేనాహం ప్రాప్నుయాం శ్రియమ్‌. 3

మేదిన్యా శ్చాధిపత్యం మే స్యాద్యథావ దఖండతమ్‌ | అవ్యాహతం భుజబలం శస్త్రాస్త్రనిపుణం క్షణమ్‌. 4

సంతతి శ్చిరకాలీనాప్యఖండం వయ ఉత్తమమ్‌ | అంతేపవర్గాభశ్చ స్యాత్తథోపాదిశాద్యమే. 5

ఇత్యేవం వచనం తస్య మనో ఃకర్ణపథే7భవత్‌ | ప్రత్యువాచ మునిః శ్రీమాన్దేవ్యాః సంరాధనం పరమ్‌. 6

రాజ న్నాకర్ణయ వచో మమ శ్రోత్రసుఖం మహత్‌ | శివా మారాధయాద్య త్వం తత్ర్పసాదా దిదం భ##వేత్‌. 7

చాక్షుష ఉవాచః కీదృగారాధనం దేవ్యా స్తస్యాః పరమ పావనమ్‌ | కేనాకారేణ కర్తవ్యం కారుణ్యా ద్వక్తు మర్హసి. 8

మునిరువాచః రాజ న్నాకర్ణ్యతాం దేవ్యాః పూజనం పర మవ్యయమ్‌ | వాగ్బవం బీజ మవ్యక్తం సంజప్య మనిశం తథా. 9

త్రికాలం సంజప న్మర్త్యో భుక్తిముక్తీ లభేత్తు హి | న బీజం వాగ్బవా దన్య దస్తి రాజన్యనందన 10

జపా త్సిద్ధికరం వీర్య బలవృద్ధికరం పరమ్‌ | ఏతస్యజాపా త్పాద్మోపి సృష్టికర్తా మహాబలః 11

విష్ణు ర్యజ్జపతః సృష్టిపాలకః పరికీర్తితః | మహేశ్వరోపి సంహర్తా యజ్జపా దభవన్నృప. 12

లోకపాలా స్తథాన్యేపి నిగ్రహానుగ్రహక్షమాః | యదాశ్రయా దభూవంస్తే బలవీర్యమదోద్ధతాః 13

ఏవం త్వమపి రజన్య మహేశీం జగదంబికామ్‌ | సమారధ్య మహర్ధించ లప్స్యసేచిరకాలతః 14

ఏవం సమునివర్యేణ పులహేన ప్రబోధితః | అంగపుత్త్ర స్తప్తుం జగామ విరజాం నదిమ్‌. 15

తొమ్మిదవ అధ్యాయము

మన్వంతరవృత్తాంతము-శ్రీదేవీ మహాత్మ్యము

శ్రీనారాయణుడిట్లు పలికెను. ః ఇపుడు దివ్యమైన దేవీ మహత్త్వ విచిత్ర చరిత్రము మఱియు వినుము. అంగపుత్రుడు మనువై యుత్తమ రాజ్యమెట్లు పడసెనో యాలకింపుము. అంగారాజ కుమారుడు చాక్షుష మనువయ్యెను. ఇతడారవ మనువు. ఇతడు పులహుడను బ్రహ్మర్షిని శరణు వేడెను. బ్రహ్మర్షీ! దిక్కు లేనివారయార్తి బాపువాడా ! నిన్ను శరణు వేడుచున్నాను. నీ దాసుడను. నాకు సంపదలు గలుగు మార్గము చూపుము. నన్ను శాసించుము. నే నీ భూమండలమున కధిపతి నగునట్లును చిరంజీవులగుపుత్రపౌత్ర సంతానము సంపూర్ణాయువు తుదకు ముక్తియు గల్గునట్లు నన్నను గ్రహించుము. అనురాజు మాటలు విని ముని యిట్లనెను. శ్రీమంతుడా!నీవు శ్రీపరాభట్టారికా దేవి నారాధింపుము. తెవుల కమృతమువంటి నా పలుకులు వినుము. నీవు పరమ శివయగు మంగళ గౌరీ నారాధింపుము. ఆమె దయవలన నీ కోర్కెలన్నియును పండును. అనగా చాక్షుషు డిట్లనెనుః మునీ! ఆ లోక జనని యొక్క పరమపావనమైన యారాధన విశేషమెట్టిది? అదెట్లు చేయవలయును. అంతయు నాకు దయతో వివరింపుము. దీనికి నీవే తగుదువు. ముని యిట్లు పలికెను.ః పరమము శాశ్వతమునైన శ్రీదేవీ పూజా విధ మాలించుము. దివ్యమైన శ్రీమహా సర్వతీ బీజము నిరంతరము జపము చేయుము. దానిని మూడు వేళలందును. జపించువాడు భుక్తి ముక్తులందగలడు. అవాగ్బవ బీజమును మించినది లేనేలేదు. ఈ జపమున సాధకునకు బలవీర్య వృద్ధి-సిద్ధి గల్గును. దీనిని జపించుట వలననే బ్రహ్మ సృష్టి చేయ శక్తుడయ్యెను. విష్ణువు దీనిని జపించి సృష్టిపాలన చేయుటలో పేరు గాంచెను. రాజా! శివుడు నీ జపము చేసి సంహారము చేయజాలెను. దీనిని జపించియే లోంకపాలకులు నితరులను నిగ్రహానుగ్రహసమర్థులై బలవవీర్య మదోద్ధతులై ప్రసిద్ధి గాంచిరి. కనుక నీవును సరస్వతీ బీజము జపించి జగదంబికను మహేశిని గొలిచి కొలది కాలములోనే మహాసంపదల బడయగలవు. ఇట్లు పులహాముని వరుడు ప్రబోధించగ అంగపుత్రుడు తపము చేయుటకు విరజా నదీతీర మేగెను.

సచ తేపే తప స్తీవ్రం వాగ్బవస్య జపే రతః | బీజస్యపృథివీపాలః శీర్ణపర్ణాశనో విభుః. 16

ప్రథమేబ్దే పల్లవాశో ద్వితీయే తోయభక్షణః | తృతీయేబ్దే పవనభు క్తస్థా స్థాణు రివాచలః. 17

ఏవం ద్వాదశవర్షాణి త్యక్తాహారస్య భూభుజః | వాగ్బవం జపతో నిత్యం మతి రాసీ చ్చుభాన్వితా. 18

తథా చ దేవ్యాః పరమం మంత్రం సంజపతో రహః | ప్రాదురాసీ జ్జగాన్మాతా సాక్షా చ్చ్రీపరమేశ్వరీ. 19

తేజోమయీ దురాధర్షా సర్వదేవమయాశ్వరీ | ఉవాచాంగతనూజం తం ప్రసన్నా లలీతాక్షరమ్‌. 20

దేవ్యువాచః పృథివీపాల తే యత్స్యా చ్చింతితం పరమం వరమ్‌ | తద్బ్రూహి సంప్రదాస్యామి తపసా తే సుతోషితా. 21

చాక్షుష ఉవాచ ః జానాసి దేవదేవేశి యత్ప్రార్థ్యం మనసేప్సితమ్‌ | అంతర్యామి స్వరూపేణ తత్సర్వం దేవపూజితే. 22

తథా పిమమ భాగ్యేన జాతం యత్తవ దర్శనమ్‌ | బ్రవీమి దేవి మే దేహి రాజ్యం మనెవంతరాశ్రితమ్‌. 23

శ్రీ దేవ్యువాచః దత్తం మన్వంతరస్యా స్య రాజ్యం రజన్యసత్తమ | పుతా మహాబలాస్తే చ భవిశ్యంతి గుణాధికాః. 24

రాజ్యం నిష్కంటకం భావి మోక్షోంతే చాపి నిశ్చితః | ఏవం దత్వా వరం దేవీ మనవే వరముత్తమమ్‌. 25

జగామాదర్శనం సద్యస్తేన భక్త్యా చ సంస్తుతా | సోపి రాజా మనుః షష్టః ప్రసాదాత్తు తదాశ్రయాత్‌. 26

బభూవ మనుమాన్యోసౌ సార్వభౌమసుఖై ర్వృతః | పుత్రాస్తస్య బలోద్యుక్తాః కార్యభారసహాదృతాః. 27

దేవీభక్తాశ్చ శూరాశ్చ మహాబలపరాక్రమాః | అన్యత్ర మాననీయాశ్చ మహారాజ్యసుఖాస్పదాః 28

ఏవం చ చాక్షుషమను ర్దేవ్యారాధనతః ప్రభుః | బభూవ మనువర్యోసౌ జగామాంతే శివాపదమ్‌. 29

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కధే దేవీ చరిత్రే నవమోధ్యాయః

అతడచట వాగ్బవబీజము నియమముగ జపించుచు పండుటాకు లలములు తినుచు తీవ్రము తపమాచరించెను. ఆ రాజు తొలి యేడు చిగురాకులు దినుచు రెండవ యేడు నీరుత్రాగుచు మూడవ యేడు గాలిమాత్రము భుజించుచు స్థాణువు వలె కదలకుండెను. ఇట్లు పండ్రెండు సంవత్సరములు వాగ్బవ బీజము జపించుచు నాహారముమానుట వలన నంగరాజపుత్రునకు మంచి బుద్ధి కలిగెను. ఇట్లు లేకాంతమున దేవి పరమ మంత్రము జపించచుండగ శ్రీపరమేశ్వరి జగన్మాత తనంతతా ప్రత్యక్షమయ్యెను. ఆ సర్వదేవమయు-దివ్య జ్యోతిర్మయి-మహేశ్వరి-దురాధర్శ- సుప్రసన్నయై లలిత మధుర వచనములతో నంగరాజసుతుని తో నిట్లు పలికెను. పుడమిఱడా! నీ మదిలోనికోరిక తెలుపుము. నీ తపమునకు సంతసించితిని శుభవరములు గురుయుదును. చాక్షుషుడిట్లనెయెను. సురపూజితురాలవగు దేవదేవేశీ! నీ వంతర్యామివై సూక్ష రూపమున నెల్లెడల వెల్గుచున్నావు.-నా మదిలోని కోరికయును నీవెరుగుదువు. నా భాగ్యమున నీ దివ్వ సందర్శన మబ్బినది. కనుక నేనొక మన్వంతరము దనుక రాజ్యమేలునట్లు వరమిమ్మని నిన్ను వేడుచున్నాను. శ్రీదేవి యిట్లనెను ః రాజా ! నీకు మన్వంతరమంతకాలము సుస్థిర రాజ్యమిచ్చితిని. నీకు బలవిక్రములు- సుగుణశాలురు నగుపుత్రులు దయింపగలరు. నీ రాజ్యమున నీ కెదురులేదు. తుదకు నిక్కముగ నీకుముక్తిఫలము చేకూరును. అని దేవి రాజపుత్రునకు వరమొసంగెను. అతని పరభక్తికి సంతసిల్లి యాతల్లి యంతర్థానమొందెను. అతడు భగవతి దయవలన నారవ మనువయ్యెను. అతడు మను సార్వభౌముడై-మాన్యుడై సర్వసుఖములు పడసెను అతని కుమారులు బలవీర్యయుతులు-కార్యభార సమర్థులునై వన్నె కెక్కిరి. దేవీభక్తులు-శూరులు-పరాక్రములు- మానవీయులు- మహారాజ్య సుఖవంతులునై వాసి గించిరి. ఈ విధముగ చాక్షుష మనువు శ్రీదేవి నారాధించుట వలన మనువర్యుడై తుదకు దేవీ పరమ ధామము చేరెను.

ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి పదవ స్కంధమున తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters