Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోనపంచాశో7ధ్యాయః.

నారదః కా వా సా సురభిర్దేవీ గోలోకా దాగతా చయా | తజ్జన్మ చరితం బ్రహ్మాన్‌ శ్రోతుమిచ్చామి యత్నతః. 1

నారాయణ ఉవాచ: గవా మధిష్ఠాతృదేవీ గవామాద్యా గవాం ప్రసూః |

గవాం ప్రధానా సురభి ర్గోలోకేసా సముద్బవా. 2

సర్వాది సృష్టేశ్చరితం కథయామి నిశామయ | బభూవ తేన తజ్జన్మ పురాబృందావవే వనే. 3

ఏకదా రాధికానాథో రాధయా సహ కౌతురీ | గోపాంగనా పరివృతః పుణ్యం బృందావనం యయో. 4

సహసా తత్ర రహసి విజహార స కౌతుకాత్‌ | బభూవ క్షీరపానేచ్చా తస్యస్వేచ్చామయస్య చ. 5

ససృజే సురభిం దేవీం లీలయా వామ పార్శ్వతః | వత్సయుక్తాం దుగ్ధవంతీం వత్సోనామ మనోరథః 6

దృష్ట్యా సవత్సాం శ్రీదామా నవభాండే దురదోహ చ |క్షీరం సుధాతిరిక్తం చ జన్మమృత్యు జరాహరమ్‌. 7

తదుత్థం చ వయః స్వాదు పపౌ గోపీపతిః స్వయమ్‌ | సరో బభూవ పయసాం భాండ విస్రంసనేన చ. 8

దీర్ఘం చ విస్తృతంచైవ పరితః శతమోజనమ్‌ | గోలోకే యం ప్రసిద్ధ శ్చ సో7పి క్షీరసరోవరః 9

గోపీకానాం చ రాధాయాః క్రీడావాపీ బభూవ సా | రత్నేం ద్రరఛితా పూర్ణ భూతాచా7పీశ్వరేచ్చయా. 10

బభూవ కామధేనూనాం సహసా లక్షకోటయః | యావంత స్తత్రగోపా శ్చ సురభ్యాలోమ కూపతః. 11

నలువది తొమ్మిదవ అధ్యాయము

సురభివృత్తాంతము

నారదు డిట్లనెను: నారాయణా! ఆ గోలోకమునందుండి యేతెంచిన సురభి యెవరు? ఆమె జన్మవృత్తాంతము విన కుతూహల మగుచున్నది. నారాయణుడిట్లనియెను: సురభి గోవుల కదిష్ఠానదేవి - గోమాత- మొదటిగోవు-గోవులలో ప్రధానురాలు-గోలోకమున నుద్బవించినది. సురభి మొదటి సృష్టి చరిత్ర తెల్పుచున్నాను. సురభి యే కారణనున బృందా వనిలో బుట్టెనో తెలుపును వినుము. పూర్వము రాధికాలోలుడు తన్నుగోపికలు చుట్టుజేరి కొలువగ రాధనుగూడి పుణ్య బృందావనములు గల గోలోకమున కరిగెను. అతడచ్చోట వినోదముగ రహస్యముగ తిరుగుచుండగ నతనికి పాలుత్రాగు కోరిక గల్గెను. అతడు తన యెడమవైపునుండి లీలగ సురభిని సృజించెను. దాని వెంట దూడ గలదు. దాని పేరు మనోరథ. సురభిపుష్కలముగ పాలు గలది. శ్రీదాముడు దూడగల పాడి యావును చూచి క్రొత్త కడవలో పాలు పితికెను. ఆ పాలు జన్మ-మృత్యు-జరా-రోగములు పాపునవి. అమృతము కన్న తియ్యనివి. ఆ యమృత క్షీరములను గోపాలకుడు స్వయముగత్రాగెను. తర్వాత మిగిలిన పాలు గల కడవ పగిలెను. అపుడచట పాల కాసార మేర్పడెను. ఆ క్షీర కాసారము గోలోకమునందు వంద యోజనములు పొడవు వంద యోజనములు వెడల్పుగ నుండెను. ఆ సరోవరము రాధకు కృష్ణునకును క్రీడా సరస్సుగ నలరారెను. ఈశ్వరుని కోర్కె వలన దానికి రతనాల మెట్లు నిర్మించబడెను. శ్రీకృష్ణుని సంకల్పముతో నచట లెక్కలేనన్ని కామధేనువులు లక్షలు కోట్లుగ నుద్బవించెను. వెంటనే సురభిరోమ కూపములనుండియు నందఱు గోపకు లుద్బవించిరి.

తాసాం పుత్రాశ్చ బహవః సంబభూవు రసంఖ్యకాః కథితా చ గవాం సృష్టిస్తయా చ పూరితం జగత్‌. 12

పూజాం చకార భగవాన్‌ సురభ్యా శ్చ పురామునే | తతో బభూవ తత్పూజా త్రిషులోకేషు దుర్లభా. 13

దీపాన్వితా పరదినే శ్రీకృష్ణుస్యాజ్ఞాయా హరేః | బభూవ సురభిఃపూజ్యా ధర్మవక్త్రా దిదంశ్రుతమ్‌. 14

ధ్యానం స్తోత్రం మూల మంత్రం యద్యత్పూజా విధిక్రమమ్‌ | వేదోక్తం చ మహభాగ నిబోధ కథయామితే. 15

ఓం సురభ్యైనమ ఇతి మంత్రస్తస్యాః షడక్షరః | సిద్దో లక్ష జపేనైవ భక్తానాం కల్పపాదపః 16

ధ్యానం యుజుర్వేద గీతం తస్యాః పూజా చ సర్వతః | బుద్దిదా వృద్దిదాచైవ ముక్తిదా సర్వకామదా. 17

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరామ్‌ | గవా మధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్‌. 18

పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదామ్‌ | యయా పూతం సర్వవిశ్వం తాందేవీం సురభిం భ##జే. 19

ఘటేవా ధేనుశిరసి బంధస్తంభే గవామపి | శాలగ్రామే జలగ్నౌవా సురభిం పూజయేద్ద్విజః 20

దీపాన్వితా పరదినే పూర్వాహ్ణే శక్తి సంయుతః | యః పూజయే చ్చ సురభిం సవైపూజ్యో భ##వేద్బువి. 21

ఏకదా త్రిషులోకేషు వారాహే విషుమాయయా | క్షీరం జహార సురభి శ్చింతితాశ్చ సురాదయః 22

లెక్కలేనన్ని యావుదూడలును బుట్టెను. ఆ గోవులమందలచే జగమంతయు నిండిపోయెను. ఇట్లు గోవుల సృష్టిజరిగెను. తొలదొల్త శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ తర్వాత ముల్లోకములందును గోపూజ వ్యాపించెను. దీపావళి మఱునాడు పూర్వాహ్ణమున సురభిని పూజించవలయునని శ్రీకృష్ణు డాజ్ఞాపించెను. ఇదంతయును నేను ధర్మునివలన వింటిని. సురభిమాత యొక్క ధ్యానము స్త్రోత్రము మూలమంత్రము పూజా విధానము వేదోక్తముగ తెల్పుదును. వినుము. ''ఓం సురభ్యై నమః'' అను షడక్షర మంత్రమును లక్ష జపింపవలయును. మంత్రసిద్ధి గల్గును. ఇది భక్తులకు కల్పవృక్షము. యుజుర్వేదమున సురభి ధ్యానము-గీత-పూజాదికము గలదు. సురభి బుద్ది-వృద్దు లొసంగును. సర్వకామములు దీర్చును. ముక్తిని సైత మిచ్చును. లక్ష్మీస్వరూపిణి- పరమ రాధాసహచరి-గోవుల కధిష్ఠానదేవి - గోవులకు మొదటిది - గోవుల గన్న తల్లికి నమస్కారములు. పవిత్రరూప-పూత-భక్తులకామదాయిని-విశ్వమునంత పావనమొనరించునట్టి సురభ దేవికి నమస్కారములు. బ్రాహ్మణు డొక కలశమందుగాని గోవుతలయందుగాని ఆవులను గట్టు స్తంభమందుగాని సాల గ్రామమందుగాని జలమందుగాని సురభి నావాహనము చేసి పూజింపవలయును. దీపావళి మర్నాడు పట్టపగలు గోమాతను పూజించువాడు తప్పక భూమండలమున పూజనీయుడు గాగలడు. మున్ను వరాహకల్పమున విష్ణు మాయవలన ముల్లోకము లందును పాలు లేకుండునట్లు సురభి మాయ గల్పించెను. అపుడు సురాదులు పాలులేక చింతాక్రాంతు లైరి.

తే గత్వా బ్రహ్మలోకేచ బ్రహ్మణాం తుష్టువుస్తదా | తదా జ్ఞయాచ సురభింతుష్టువే పాకశాసనః 23

పురందర ఉవాచ : నమోదేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనముః |

గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే. 24

నమో రాధా ప్రియాయ చ పద్మాంశాయై నమోనమః | నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమోనమః. 25

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే | క్షీరదాయై ధనదాయై బుద్దిదాయై నమోనమః 26

శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః | యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమైనమః 27

స్తోత్ర శ్రవణ మాత్రేణ తుష్టాహృష్టా జగత్ప్రసూః | అవిర్బభూవ తత్త్రెవ బ్రహ్మలోకే సనాతనీ. 28

మహేంద్రాయ వరందత్వా వాంఛితం చాపి దుర్లభమ్‌ | జగామ సాచ గోలోకం యుయుర్దేవాదయో గృహామ్‌. 29

బభూవ విశ్వం సహసా దుగ్దపూర్ణం చ నారద | దుగ్ధం ఘృతం తతో యజ్ఞస్తతః ప్రీతిః సురస్య చ. 30

ఇదం స్తోత్రం మహపుణ్యం భక్తి యుక్తశ్చయః పఠేత్‌ | గోమాంశ్చ ధనవాంశ్చైవ కీర్తిమా న్పుత్ర వాంస్తథా. 31

సస్నాతః సర్వతీర్థేషు సర్వ యజ్జేషు దీక్షితః | ఇహలోకే సుఖం భుక్త్వా యాత్యంతే కృష్ణమందిరే. 32

సుచిరం నివసేత్తత్ర కరోతి కృష్ణసేవనమ్‌ | న పునర్బవనం తత్ర బ్రహ్మపుత్రో భ##వేత్తతః. 33

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ఏకోనపంచాశత్తమో7ధ్యాయంః.

వారపుడు బ్రహ్మలోక మేగి బ్రహ్మను సంస్తుతించిరి. బ్రహ్మ యనుమతితో నింద్రుడు సురభిని సంతోష పఱచెను. మహాదేవి! గోబీజ స్వరూపిణి! జగదంబికా! సురభిమాతా నిన్ను నమస్కరించుచున్నాను. నీవు కృష్ణ ప్రియవు-రాధా ప్రియవు-పద్మాంశవు నగు గోమాతవు. నిన్ముపల్మారు నమస్కరించుచున్నాను. నీ వెల్లవారికి నెల్లవేళల కల్పవృక్షమువంటి దానువు-క్షీరము-సద్బుద్ది-ధనము నొసంగుదానవు. కీర్తిదాయినివి- నీకు పల్మార్లు నమస్కారుము చేయ చున్నాను. శుభాంగివి-సుభద్రపు-గోపప్రదాయినివి-యశము-కీర్తి-ధర్మము నొసంగు దేవివి నీకు నమస్కారుము చేయ చున్నాను. అను స్తోత్రము విన్నంతనే తుష్టితో సంతుష్టితో గోమాత సనాతని యగు సురభిమాత బ్రహ్మలోకమందు నావిర్బవించెను. ఆమె యింద్రునకు దుర్బభములైన కోరిన కోర్కె లీడేర్చితిరిగి గోలోకమేగెను. ఆ పిమ్మట విశ్వమంతయగును గుమ్మపాలతో. నిండిపోయెను. నారదా! అపుడు పాలు-నెయ్యి పుష్కలముగ నుంట యజ్ఞముల విరివిగ సాగెను. సుర లును ప్రీతిజెందిరి. ఈ సురభి వస్తోత్రము మహాపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్దలతో చదువువాడు గో-ధన-సంపదలతో పుత్రకీర్తిమంతుడై విలసిల్లును. సకల తీర్థములందు గ్రుంకిన వాడగును. సర్వయాగదీక్షితుడు నగును. ఈ లోకమును సుఖములనుభవించి చివరకు కృష్ణ మందిరము జేరగలడు. అట చిరకాలము శ్రీకృష్ణుని సంసేవించుచుండును. ఆ తర్వాత పవిత్ర భారతదేశమున బ్రాహ్మణుడై యుద్బవించగలడు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదితొమ్మిదవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters