Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోన చత్వారింశోధ్యాయః.

నారద ఉవాచ : శ్రీమూల ప్రకృతేర్దేవ్యా గాయత్ర్యాస్తు నిరాకృతేః | సావిత్రీయమసంవాదేశ్రుతంవై నిర్మలం యశః. 1

తద్గుణో త్కీర్తనం సత్యం మంగళానాం చ మంగళమ్‌ | అధునా శ్రోతు మిచ్ఛామి లక్ష్మ్యు పాఖ్యాన మీశ్వర. 2

కేనా77దౌ పూజితాసా7పి కింభూతా కేనవా పురా | తద్గుణో త్కీర్తనం మహ్యం వద వేదవిదాంవర. 3

నారాయణ ఉవాచ : సృష్టేరాదౌ పురాబ్రహ్మ న్కృష్ణస్య పరమాత్మనః | దేవీ వా మాంస సంభూతా బభూవ రాస మండలే. 4

అతీవ సుందరీ శ్యామా న్యగ్రోధ పరి మండితా | తథా ద్వాదశ వర్షీయా శశ్వత్సు స్థిర ¸°వనా. 5

శ్వేత చంపక వర్నా యా సుఖదృశ్యా మనోహరా | శరత్పార్వణ కోటీందు ప్రభాప్రచ్ఛదనాననా. 6

శరన్మ ధ్యాహ్న పద్మానాం శోభామోచన లోచనా | సా దేవీ ద్వివిధాభూతా సహసై వేశ్వరేచ్ఛయా. 7

స్వీయ రూపేణ వర్ణేన తేజసా వయసాత్విషా | యశసా వాససా77కృత్యా భూషణన గుణ న చ. 8

స్మితేన వీక్షణనైవ ప్రేవ్ణూవా7నునయేన చ | తద్వామాంసాన్మహాలక్ష్మీ ర్దక్షిణాంసాచ్చరాధికా. 9

రాధా7దౌ వరయా మాస ద్విభుజం చ పరాత్పరమ్‌ | మహాలక్ష్మీ శ్చ తత్ప శ్చా చ్చకమే కమనీయకమ్‌. 10

కృష్ణస్త ద్గౌరవేణౖవ ద్వి ధారూపో బభూవ హ | దక్షిణాం స శ్చ ద్విభుజో వామాం స శ్చ చతుర్బుజః. 11

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

లక్ష్మీ చరిత్రము

నారదుడిట్లనెను : మూల ప్రకృతి-గాయత్రీ దేవినిగూర్చిన సావిత్రీ యముల సంబాషణము నిర్మల కీర్తిని గల్గించును. దానిని చక్కగ వింటిని. ఈశ! శుభములకు శుభములగు శ్రీదేవి గుణగానము వింటిని. ఇపుడు శ్రీలక్ష్మీ దేవి యెట్టిది? ఆమెను మొట్ట మొదట నెవరు పూజించిరి. ఆ దేవి గుణ మహిమలు నాకు తేటపఱచుము. నారాయణు డిట్టులనియెను. బ్రాహ్మణోత్తమా ! పూర్వము సృష్టికి పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముని యెడమ భాగమునుండి రాసమండలమున లక్ష్మి యావిర్బవించెను. ఆమె యందాల సుందరి-శ్యామ-ఆమెచుట్టు మఱ్ఱిచెట్లు గలవు-పండ్రెండేండ్లు కుమారివలె నున్నది. నిండైన జవ్వనము గలది. ఆమె చూడ్కులలో ప్రేమనిండి యున్నది-మనోహారిణి- కోటి శరత్కాల చంద్రుని నిండైన వెన్నెల లామె ముఖకాంతిని ప్రతిబింబించునట్లున్నవి. ఆమె చూపులందు శరత్కాల మందలి పద్మకాంతులు చోటు చేసికొని నట్లున్నవి. ఆమె యీశ్వరుని ఆజ్ఞచే రెండు రూపములుగ మారెను. ఆ రెండు రూపములును రూపము-వర్ణము-తేజము- వయస్సు-శోభ-యశము-కట్టు-బొట్టు-నగలు-గుణగణములు పనులు నవ్వులు చూపులు-ప్రేమ-అనునయము మున్నగు నన్నిటి యందును సరి సమానముగ గలవు. కుడివైపు రూపము రాధ-ఎడమవైపు రూపము లక్ష్మిగవెలసిరి. మొట్టమొదట రెండు భుజములుగల కృష్ణ పరమాత్ముని రాధ పతిగవరించెను. ఆ తరువాత మహాలక్ష్మియు నా సుందరాంగుని వలచి నది. అంత కృష్ణుడాలోచించి తాను రెండు రూపులు దాల్చెను. కుడి యంశగ రెండు చేతుల కృష్ణుడును ఎడమ యంశగ నాలుగు చేతులుగల విష్ణువు నుద్బవించిరి.

చతుర్బుజాయ ద్విభుజో మహాలక్ష్మీం దదౌ పురా | లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ఠ్యాయయా నిశమ్‌. 12

దేవీభూతా చ మహతీ మహాలక్ష్మీశ్చ సా స్మృతా | రాధాకాంత శ్చ ద్విభుజో లక్ష్మీకాంత శ్చ తుర్బుజః. 13

శుద్ధ సత్త్వ స్వరూపా చ గోపై ర్గోపీభి రావృతా | చతుర్బు జశ్చ వైకుంఠం ప్రయ¸° పద్మయాసహ. 14

సర్వాం శేన సమౌ తౌ ద్వౌ కృష్ణనారాయణౌ పరౌ | మహాలక్ష్మీ శ్చ యోగేన నానారూపా బభూవసా. 15

వైకుంఠే చ మహాలక్ష్మీః పరిపూర్ణతమా రమా | శుద్ధ సత్త్వ స్వరూపా చ సర్వ సౌభాగ్య సంయుతా. 16

ప్రేవ్ణూ సా చ ప్రధానా చ సర్వాసు రమణీషు చ | స్వర్గేషు స్వర్గ లక్ష్మీ శ్చ శక్ర సంపత్స్వరూపిణీ. 17

పాతాళేనాగలక్ష్మీ శ్చ రాజలక్ష్మీ శ్చ రాజసు | గృహలక్ష్మీ ర్గృహే ష్వేవ గృహిణాం చ కళాంశతః. 18

సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళమంగళా | గవాం ప్రసూతిః సురభిర్దక్షిణా యజ్ఞకామినీ. 19

క్షీరోద సింధు కన్యా సా శ్రీరూపా పద్మినీషు చ | శోభా స్వరూపా చంద్రే చ సూర్యమండల మండితా. 20

విభూషణషు రత్నేషు ఫలేషు చ జలేషు చ | నీపేషు నృప పత్నీషు దివ్య స్త్రీషు గృహేషు చ. 21

సర్వ సస్యేషు వస్త్రేషు స్థానేషు సంస్కృతేషు చ | ప్రతిమాసు చ దేవానాం మంగళేషు ఘటేషు చ. 22

రెండు భుజములుగల కృష్ణుడు లక్ష్మిని చతుర్బుజుడగు విష్ణున కొసంగెను. ఈ చరాచర విశ్వమంతయు నా లక్షి తియ్యని కంటివెల్గులచే నందముగ కనిపించును. ఆమె మహాదేవియగుట వల మహాలక్ష్మీ బంగారుతల్లి యని పేరు గాంచెను. రాధారమణుడు కృష్ణుడు లక్ష్మీరమణుడు విష్ణువు. శుద్ధ సత్వస్వరూపిణియగు రాధ గోపగోపికలతో కొలువై యుండును. చతుర్బుజు డపడు లక్ష్మిని వెంటగొని వైకుంఠమున కేగెను. కృష్ణ నారాయణు లిర్వురు నన్ని యంశలలో సరిసమానులు-పరములు. మహాలక్ష్మియును విష్ణుయోగమువలన పెక్కు శృంగార రూపములు దాల్చును. అలవైకుంఠ పురమునందు మహాలక్ష్మి పరిపూర్ణతమ. రమాదేవి శుద్ధ సత్వస్వరూపిణి సకల సౌభాగ్యలక్ష్మి. ఆమె స్త్రీ లందఱలోను ప్రీతిపాత్రురాలు ముఖ్యురాలు. లక్ష్మీదేవియే స్వర్గమందు నింద్రుని సంపత్స్వరూపిణియగు స్వర్గలక్ష్మి. పాతాళమున నాగలక్ష్మి; రాజుల చెంత రాజ్యలక్ష్మి; గృహములందు గృహలక్ష్మియగు గృహిణి. గృహస్థుల చెంత సంపత్స్వరూపిణి-సర్వమంగళదాయిని గోమాతలలో సురభి యజ్ఞములందు యజ్ఞకామినియగు దక్షిణ. క్షీరసాగరుని కూతురు పద్మములందును చంద్రునిలోను శ్రీశోభారూపిణి; సూర్యునిలో ప్రభారూపిణి. అందమైన సొములందును రత్నములందును ఫలములందును నీళ్లలోను రాజులందు రాజపత్నులందు దివ్య స్త్రీలలోను శుభ##మైన యిండ్లలోను అన్ని పచ్చని పంటలందును తెల్లని వస్త్రము లందును పవిత్రస్థానములందును దేవతల విగ్రహములందును మంగళకలశము లందును.

మాణిక్యేషు చ ముక్తాసు మాల్యేషు చ మనోహరా | మణీంద్రేషు చ హీరేషు క్షీరేషు చందనేషు చ. 23

వృక్షశాభాసు రమ్యాసు నవమేఘేషు వస్తుషు | వైకుంఠ పూజితా సా77దౌ దేవీ నారాయణన చ. 24

ద్వితీ యే బ్రహ్మణా భక్త్యా తృతీ యే శంకరేణ చ | విష్ణునా పూజితా సా చ క్షీరోదే భారతే మునే. 25

స్వాయం భువేన మనునా మానవేంద్రైశ్చ సర్వతః | ఋషీంద్రైశ్చ మునీంద్రైశ్చ సద్బి శ్చ గృహిభిర్బవే. 26

గంధర్వైశ్చైవ నాగాద్యైః పాతాళేషు చ పూజితా | శుక్లాష్టమ్యాం భాద్రపదే కృతాపూజా చ బ్రహ్మణా. 27

భక్త్యా చ పక్ష పర్యంతం త్రిషులోకేషు భక్తితః | చైత్రే పౌషే చభాద్రే చ పుణ్య మంగళ వాసరే. 28

విష్ణునా పూజితాసా చ త్రిషులోకేషు భక్తితః | వర్షాంతే పౌషసంక్రాంత్యాం మాఘ్యామావావ్యా మంగళే. 29

మనుస్తాం పూజయామాస సాభూతా భువనత్ర యే | పూజితాసా మహేంద్రేణ మంగళేనైవ మంగళా. 30

కేదారేణౖవ నీతేన సుబలేన నతేన చ | ధ్రువేణోత్తాన పాదేన శుక్రేణ బలినా తథా. 31

కశ్యపేన చ దక్షేణ కర్దమేవ వివస్వతా | ప్రియవ్రతేన చంద్రేణ కుబేరేణౖవ వాయునా. 32

యమేన వహ్నినా చైవ వరుణనైవ పూజితా | ఏవం సర్వత్ర సర్వేషు పూజితా వందితాసదా. 33

సర్వై శ్వర్యాధి దేవీ సా సర్వసంపత్స్వరూపిణీ.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ఏకోన చ త్వారింశో7ధ్యాయః.

విలువైన మాణిక్యములందు జాతిముత్యములందును పూలమాలలోను వజ్రములందు మంచిగంధమందు పాలలోను అందమైన చెట్లకొమ్మలందును తొల్కరి నీలిమేఘాలలోను లక్ష్మి కళ తేజరిల్లుచుండును. లక్ష్మిని మొట్టమొదట వైకుంఠ లోకమునందు శ్రీమన్నారాయణుడు పూజించెను. ఆ తరువాత లక్ష్మిని బ్రహ్మ పూజించెను. పిదప శంకరుడు భక్తితో నామెను పూజించెను. నారదా ! మఱి యొకసారి విష్ణు వామెను పాలకడలితో పూజించెను. అటు తర్వాత మనుజపతియగు స్వాయంభువమనువు రాజులు ఋషులు మునులు సాధులు ఉత్తమ గృహస్థులును లక్ష్మిని పూజించిరి. పిదప గంధర్వులు పాతాళమందలి నాగులును లచ్చిని గొల్చిరి. బ్రహ్మ లక్ష్మిని భాద్రపద శుక్లాష్టమినాడు పూజించెను. నారదా ! ముల్లోకము లందలి వారును లక్ష్మిని భాద్రపద శుద్ధమున పక్షము నాళ్ళు పూజించిరి. చైత్ర-భాద్ర-పుష్యమాసములందలి మంగళ వారములందును లక్ష్మీదేవి మహోత్సవములు జరుపబడెను. విష్ణువు ముల్లోకములందును భక్తితో లక్ష్మీపూజ సాగించెను. ఏడాది చివరలో-పుష్య సంక్రాంతినాడు-మాఘ పూర్ణిమనాడును మంగళకలశమం దావాహనచేసి మనువు మోక్షలక్ష్మిని పూజించెను. సర్వమంగళ మాంగల్యయగు లక్ష్మి నింద్రుడు పూజించెను. ముల్లోకముల వారు నటులే లక్ష్మిని గొల్చిరి. కేదారుడు నీలుడు నలుడు సుబలుడు ధ్రువుడు ఉత్తానపాదుడు శుక్రుడు బలి కశ్యపుడు దక్షుడు కర్దముడు వివస్వంతుడు ప్రియవ్రతుడు చంద్రుడు కుబేరుడు వాయువు యముడు వహ్ని వరుణుడును లక్ష్మీదేవి నారాధించిరి. ఈ విధముగ లక్ష్మీదేవి యెల్లెడల నెల్లరచేత నమస్కరింపబడి పూజ లందుకొనెను. లక్ష్మి సకలైశ్వర్య సంపదలకు ప్రతిరూపము. అధిదేవత.

ఇది శ్రీదేవీ భాగవతమహాపురాణమందలి నవమ స్కంధమున ముప్పది తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters