Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తత్రింశోధ్యాయః.

ధర్మరాజ ఉవాచ : పూర్ణేందు మండలాకారం సర్వం కుండం చ వర్తులమ్‌ | నిమ్నం పాషాణ భేదైశ్చ పాచితంబహుభిః సతి. 1

నశ్వరం చా೭೭ ప్రలయం నిర్మితం చేశ్వరేచ్ఛయా | క్లేశదం పాతకానాం చ నానారూపం తదాలయమ్‌. 2

జ్వల దంగార రూపం చ శతహస్త శిఖాన్వితమ్‌ | పరితః శ్రీకోశమానం చ మహ్నికుండం ప్రకీర్తితమ్‌. 3

మహాశబ్దం ప్రకుర్వద్బిః పాపిభిః పరిపూరితమ్‌ | రోక్షితం మమ దూతై శ్చ తాడితై శ్చాపి సంతతమ్‌. 4

ప్రతప్తోదక పూర్ణం చ హింస్ర జంతు సమన్వితమ్‌ | మహాఘోరం కాకుశబ్దం ప్రహారేణ దృఢేన చ . 5

క్రోశార్థ మానం తద్దూతై స్తాడితైర్మమ పార్షదైః | తప్తక్షారోదకైః పూర్ణం పునః కాకైశ్చ సంకులమ్‌. 6

సంకులం పాపిభిశ్చైవ క్రోశమానం భయానకమ్‌ | త్రాహీతి శబ్దం కుర్వద్బిర్మమ దూతైశ్చ

తాడితైః. 7

ప్రచలద్బి రనాహారైః శుష్కకంఠోష్ఠతాలుకైః | విడ్బిరేవ కృతం పూర్ణం క్రోశమానంచ కుత్సితమ్‌. 8

అతి దుర్గంధి సంసక్తం వ్యాప్తం పాపిభి రన్వహమ్‌ | తాడితై ర్మమ దూతైశ్చ తదాహారైః

సుదారుణౖః 9

రక్షేతి శబ్దం కుర్వ ద్బి స్తత్కీటై రేవ భక్షితైః | తప్తం మూత్ర ద్రవైః పూర్ణం మూత్ర కీటైశ్చ సంకులమ్‌ . 10

యుక్తం మహాపాతకిభి స్తత్కీటై ర్బక్షితైః సదా | గ వ్యూతిమానం ధ్వాంతాక్తం శ్చబ్దకృద్బిశ్చ సంతతమ్‌. 11

ముప్పదిఏడవ అధ్యాయము

సావిత్రుపాఖ్యానము

ధర్మరాజిట్లనియెను: నరక కుండము లన్నియును పున్నమ చందురుని మండలమువలె గుండ్రముగ నుండును. అందులో దారుణమైన పాషాణమువంటి యగ్ని మంటలు గ్రక్కుచుండును. ఈ కుండము లీశ్వరు నాజ్ఞవలన ప్రళయమువఱకును నశింపకుండును. ఆ యముని నరక కుండములు పెక్కు రూపములతో పాపాత్ములకు యాతనలు గల్గించుచుండును. అగ్ని కుండలమునుండియ భగభగమను మంటలు నూఱు చేత లంత పొదవుగ మిన్నుతాకుచుండును. ఆ నరక కుండ మొక క్రోశము వ్యాసమున వెల్గుచుండును. అది నా భటులచేత దెబ్బలు తినెడు పాపుల యేడ్పుల - పెడ బొబ్బల - తో మార్మోగును. నా కింకరులు కుండములు రక్షించుచుందురు. వేన్నీళ్ళతో సలసలమను తప్త కుండమున పాపి ప్రాణులు బాధలు పడుచుండును. గట్టి దెబ్బలకు తాళ##లేక పాపులు దీనాతిదీనముగ రోదించుచు విలవిల తన్నుకొను చుందురు. అర్దక్రోశము వ్యాసముతో నీ తప్తకుండ ముండును. ఇందలి పాపులను నా దూతలు దండింతురు. సలసలమను క్షారోదకకుండ మొకటి కలదు. ఇది కాకులతో నిండిన కుండము. ఇది పాపులతో నిండి క్రోశము వ్యాసముగ భయంకరముగ నుండును. అందలి పాపులు నా దూతలచేత దండింపబడుచు. ''పాహి పాహి'' యని యేడ్చుచుందురు. అందలి పాపులు తిండిలేక కంఠము-పెదవులు-దౌడ లెండిపోగ శుష్కించి యుందురు. విట్కుండము క్రోశ వ్యాసముతో కంపు గొట్టుచుండును. దాని దుర్వాసన భరింపరానిది. దానినే తినుడని యందలి పాపులను నా భటులు కొట్టుచుందురు. అందున్న పురుగులచేత తినబడుచు పామి పాహి యని పాపులు విలపింతురు. మూత్రకుండ మొకటి. అందలి మూత్రము క్రాగుచుండును. అది మూత్ర కీటకములతో నిండియుండును. మూత్ర కీటకము లందలి పాపులను తినుచుండును. అది క్రోశ వ్యాసమున నుండును. అంధకారమయము. పాపులందు హాహారవములు చేతురు.

మద్దూతై స్తాడితైర్ఘోరైః శుష్కకంఠోష్ఠ తాలుకైః | శ్లేష్మపూర్ణం ప్రశమితం తత్కీటైః పూరితం తదా . 12

తద్బోజిభిః పాపిభిశ్చ వేష్టితం వైష్టితైః సదా | క్రోశార్దం గరకుండంచ గరభోజిభి రన్వితమ్‌. 13

గరకీటైర్బక్షితైశ్చ పాపిభిః పూర్ణమేవ చ | తాడితైర్మమ దూతై శ్చశబ్ద కృద్బిశ్చ కంపితైః 14

సర్పాకారైః ర్వజ్రదంష్ట్రైః శుష్కకంఠైః సుదారుణౖః | నేత్రయోర్మల పూర్ణం చ క్రోశార్దం కీటసంయుతమ్‌. 15

పాపిభిః సంకులం శశ్వ ద్బవద్బిః కీటభక్షితైః | వసారసేన సంపూర్ణం క్రోశత్యుర్యంసు దుస్సహమ్‌. 16

తద్బోజిభిః పాతకిభి ర్మమ దూతైశ్చ తాడితః | శుక్రకుండం క్రోశమితం శుక్ర కీటైశ్చ సంయుతమ్‌. 17

పాపిభిః సంకులం శశ్వ ద్ద్రవద్బిః కీటభక్షితైః | దుర్గంధి రక్త వర్ణంచ వాపీమానం గభీరకమ్‌. 18

తద్బోజిభిః పాపిభిశ్చ సంకులం కీటభక్షితమ్‌ | పూర్ణం నేత్రాశ్రుభి స్తప్తం బహు పాపిభి రన్వితమ్‌. 19

వాపీతుర్య ప్రమాణం చ రుదద్బిః కీటభక్షితైః నృణాం గాత్ర మలై ర్యుక్తం తద్బక్షైః పాపిభిర్యుతమ్‌. 20

తాడితై ర్మమ దూతైశ్చ వ్యగ్రైశ్చ కీటభక్షితైః | కర్ణ విట్పరిపూర్ణం చ తద్బక్షేః పాపిభిర్యుతమ్‌. 21

వాపీతుర్య ప్రమాణం చ బ్రువద్బిః కీటభక్షితైః | మజ్జాపూర్ణం నరాణాం చ మహా దుర్గంధసంయుతమ్‌. 22

నా దూతలు వారిని చితుకబొడుతురు. వారి పెదవులు-దౌడలు-కంఠములు శిష్కించి యుండును. ఇంకొకటి శ్లేష్మకుండము. అది పురుగులతో నిండియుండును. అందలి పాపులందలి శ్లేష్మమునే తినుచుందురు. అది పాపులతో క్కిక్కిరిసియుండును. విషకుండము క్రోశవ్యాస పరిమాణముతో నుండును. అందలి పాపాత్ములు విషము త్రాగుచందురు. విషకీటకము లందలి పాపులను తినుచుండును. భటులు వారిని దెబ్బలతో బాధింతురు. వారుగడగడలాడుచుందురు. సర్పాకారముతో వజ్రపు కోఱలతో దారుణముగ శుష్కించిన కంఠములతో నందలి భటులు భయంకరముగ నుందురు. ఆ కుండము కోసెడులో సగ ముండును. అందలి పురుగులు పాపులను తినుచుండను. పసాకుండము వసతో నిండి నాల్గుక్రోశముల వ్యాసముతో భరింపరాకుండును. అందలి పాపులను పురుగులు తినును. భటులు బాధలు పెట్టుదురు. శుక్రకుండ మొక క్రోశవ్యాస ముగలిగి శుక్ర కీటకములతో నిండియుండును. అది పాపులతో నిండి శుక్రముతో నిండియుండును. కంపు గొట్టు నెత్తుటితో నిండినది రక్తకుండము. అది దిగుడుబావి యంత కొలతలో గంభీరముగ నుండును. అందలి పాపులందలి పురుగులచేత తినబడుచుందురు. ఆ శ్రుకుండ మొకటి గలదు. అది మరుగుచున్న కన్నీటీతోపెక్కురు పాపులతో నిండియుండును. అది దిగుడుబావిలో నాలవవంతు లోతుండును. అందలి పాపులు కీటములచే తినబడును. రోదించుచుందురు. గాత్రమలకుండ మొకటి. అది నరుల శరీర మలముతో నిండియుండును. అందలి పాపులు మలమును తినుచుందురు. పాపులందు పురుగులచే తినబడుచు నా దూతలచేత తన్నులు తినుచు బాధపడుచుందును. కర్ణ విట్కుండ మొకటి గలదు. అది చెవి గుబిలితో నిండియుండును. పాపులు గుబిలి తిందురు. అది పైదిగుడుబావిలో నాలవవం తుండును. అందలి పాపులు పురుగులచే తినబడుదురు. మజ్జాకుండ మొకటి గలదు. అది నరుల మజ్జతో నిండి చెడు వాసన గొట్టుచుండును.

మహా పాతకిభిర్యుక్తం వాపీతుర్య ప్రమాణకమ్‌ | పరిపూర్ణం స్నిగ్దమాంసైర్మమ దూతైశ్చతాడితైః. 23

పాపిభిః సంకులం చైవ వాపీమానం భయానకైః | కన్యావిక్రయిభిశ్చైవ తద్బక్ష్యేః కీట భక్షితైః. 24

పాహీతి శబ్దం కుర్వద్బి స్త్రాసితైశ్చ భయానకైః | వాపీతుర్య ప్రమాణం చ నఖాదిక చతుష్టయమ్‌. 25

పాపిభిః సంయుతం శశ్వ న్మమ దూతైశ్చ తాడితైః | ప్రతప్త తామ్రకుండం చ తామ్రోపర్యు ల్ముకాన్వితమ్‌. 26

తామ్రాణాం ప్రతిమాలక్షైః ప్రతిపై#్త ర్వ్యాపృతం తదా | ప్రత్యేకం ప్రతిమాశ్లిష్టై రుదిద్బిః పాపిభిర్యుతమ్‌. 27

గవ్యూతిమాన విస్తీర్ణం మమ దూతైశ్చతాడి తై ః | ప్రతప్తలోహధారం చ జ్వలధంగార సంయుతమ్‌. 28

లోహానం ప్రతిమాశ్లిష్టై రుదద్బిః పాపిభిర్యుతమ్‌ | ప్రత్యేకం ప్రతిమాశ్లిష్టైః శశ్వ త్రృజ్వ లితైర్బియా. 29

రక్ష రక్షేత శబ్దం చ కుర్వద్బి ర్దూతతాడితైః | మహా పాతకి భిర్యుక్తం ద్విగప్యూతి ప్రమాణకమ్‌. 30

భయానకం ధ్వాంత యుక్తం లోహకుండం ప్రకీర్తితమ్‌ | చర్మకుండం తప్తసురా కుండం వాప్యర్థ మేవచ. 31

తద్బోజి పాపిభిర్వ్యాప్తం మమ దూతైశ్చ తాడితైః | అతః శాల్మలి కుండం చ వృక్ష కంటక శోభితమ్‌. 32

లక్ష పౌరుషమానం చ క్రోశమానం దుఃఖదమ్‌ | ధనుర్మనైః కంటకై శ్చ సుతీక్‌ష్ణె పరివేష్టితమ్‌. 33

ప్రత్యేకం విద్దగాత్రై శ్చ మహాపాతకిభిర్యుతమ్‌ | వృక్షాగ్రాన్ని పతద్బి శ్చ మమ దూతైశ్చ పాతితైః. 34

మదియు ఆదిగుడుబావిలో నాలవవంతుండి పాపులతో నిండి యుండును. అట మొత్తని మాంసకుండ మొకటి. అదిపచ్చి మాంసముతో పాపులతో నిండియుండును. నా దూతలు పాపులను దండింతురు. ఇది పాపులతోనిండి ఆ దిగుడుబావి లోతులో భయం కరముగనుండును. కన్నియనమ్ముకొన్న పాపులు మాంసము తినుచు కీటకములచేతిన బడుచునుందురు. వారు పాహిపాహి యను కేకలు వేతురు. దూతలు భీకరముగ వారిని బెదిరింతురు. నఖాదికుండ మొకటి అది దిగుడుబావిలో నాలవ వంతులోతుగ నుండును. అదిపాపులతో నిండియుండును. నా దూతలు వారిని బాధింతురు. తామ్రకుండ మొకటి. అది మరుగచున్న రాగితో నుండును. అందుక్రాగుచున్న రాగిరేకుల ప్రతిమలుండును. ఇవి లెక్కలేనన్ని యుండును. పాపులకు వీనినంటింతురు. ఆ మంటకు తట్టుకోలేక వారు రోదింతురు. అది రెండు కోసులుండును. అందు భటులు పాపులను దండిం తురు. లోహకుండ మొకటి గలదు. నిప్పు మంటలు గ్రక్కుచున్న లోహములతో అది నిండియుండును. అందు మండు చున్నలోహప్రతిమలు పాపులు శరీరముల కంటింతురు. పాపులు మంటల బొబ్బలకు పెద్దగ నేడ్చుదురు. దూతలు కొట్టుచుండగ పాపులు '' త్రాహి త్రాహి'' యని కేకలు పెట్టుదురు. అది పాపులతో నిండి రెండుకోసు లుండును. అది భయంక రమైన చిమ్మచీకట్లు నిండిన లోహకుండమనిపేరు. గాంచినది. చర్మకుండము తప్తసురాకుండ మనునవి గలవు. అవి పైదిగుడు బావి కొలతలో సగ ముండును. పాపులందలి వస్తువులు తిందురు. భటులు వారిని గొట్టుచుందురు. శాల్మలీకుండ మొకటి గలదు. అది చెట్ల వాడి ముండ్లతో నుండును. ఒక్కొక్క బూరుగుముల్లు నాలుగేసి మూరల పొడవున వాడిగ బాధకరముగ నుండును. కొన్ని ముండ్లు ధనుస్సంత (నాలుగు మూరల) పొడవున నుండును. అందలి పాపులు ముండ్లచే గ్రుచ్ఛ బడుదురు. దూతలు పాపులనుచెట్టు చిట్టచివరినుండి క్రిందికి పడద్రోయుదురు.

జలం దేహేతి శబ్దం చ కుర్వద్బిః శుష్కతాలుకైః | మహాభియా7తి వ్యగ్రైశ్చ దండైః సంభగ్నమస్తకైః. 35

వ్రచలద్బిర్యథా తప్తతైల జీవిభి రేవచ | విషోదైస్తక్షకాణాం చ పూర్వం చ క్రోశమానకమ్‌. 36

తద్బక్షేః పాపిభిర్యుక్తం మమ దూతై శ్చ తాడితైః |ప్రతప్త తైల పూర్ణం చ కీటాది పరివర్జితమ్‌. 37

మహాపాతకి భిర్యుక్తం దగ్దాంగారైశ్చ వేష్టితమ్‌ | కాకుశబ్దం ప్రకుర్వద్బి శ్చలద్బి ర్దూత పీడితైః 38

ధ్వాంతయుక్తం క్రోశమానం క్లేశదం చ భయానకమ్‌ | శూలాకారైః సుతీక్‌ష్ణాగ్రైర్లోహశ##సై#్త్ర శ్చ వేష్టితమ్‌. 39

శస్త్రతల్ప స్వరూపం చ క్రోశతుర్య ప్రమానకమ్‌ | వేష్టితం తత్పాతకిభి ః కుంతవిద్దై శ్చ వేష్టితైః. 40

తాడితై ర్మమ దూతైశ్చ శుష్కకంఠోష్ఠతాలుకైః | కీటైశ్చ శంకు ప్రమితైః సర్పమానై ర్బయంకరైః. 41

తీక్‌ష్ణదంతై శ్చ వికృతైర్వ్యాప్తం ధ్వాంతయుతం సతి | మహాపాతకి భిర్యుక్తం మమదూతై శ్చ తాడితైః. 42

ద్విగప్యూతి ప్రమాణం చ పూయకుండం ప్రచక్షతే | తద్బక్షేః ప్రాణిభిర్యుక్తం మమ దూతైశ్చ తాడితైః. 43

తాలవృక్ష ప్రమాణౖ శ్చ సర్వకోటి భిరావృతమ్‌ | సర్ప వేష్టితగాత్రైశ్చ పాపిభిః సర్ప భక్షితైః. 44

సం కులం శబ్ద కృద్బి శ్చ మమ దూతైశ్చ తాడితైః | కుండత్రయం మశాదీనాం పూర్ణం చ మశకాదిభిః. 45

సర్వం క్రోశార్ద మాసం చ మహాపాతకి భిర్యుతమ్‌ | హస్త పాదాది బద్దై శ్చ క్షత జౌఘేనలోహితైః 46

పాపులు శుష్కించిన దౌడలతో దాహము - దాహ మనుచు విలపింతురు. అపుడు నా కింకరులు వారిని బెదిరించి దండములతో వారి తలలు చితుకబొడుతురు. అందలి పాపుతు క్రాగిన నూనె త్రాగినవారివలె నటునిటు పరుగెత్తుదురు. విషోదకుండము కోసెడు వ్యాసముతో తక్షకాదుల విషముతో నిండియుండును. పాపాత్ములు విషము త్రాగుచుందురు. నా దూతలు వారిని దండింతురు. క్రాగుచున్న నూనెతో నిండి పురుగులు లేకుండునది తప్తతైలకుండము. మహాపాతకులతో నిండి కణకణ మండు నిప్పులతో నుండునది అంగారకుండము. నిప్పుల మంటలకు తాళ##లేక భటుల బాధలు పడలే కందలి పాపులు దిక్కుదోచక పరుగులు తీయుదురు. చిమ్మచీకటితో భయంకరముగ బాదాకరముగ కోసెడు వ్యాసముతో శూలా కారముగనున్న వాడి లోహశస్త్రములతో నిండియుండునది కుంతకుండము.అందు నాల్గు కోసుల మేరకు వాడి బల్లెముల శయ్య యుండును.పాతకులు కుయ్యోమొఱ్ఱో యన్నను భటులు వారికి బల్లెములు గ్రుచ్చుదురు. నా దూతలు పాతకులను దండింపగ వారి పెదవులు-దౌడలు-కంఠములు శుష్కించి యెండిపోవును. పామువలె పొడవు గల్గి భయంకరమైన పురుగు లతో నిండినది కృమికుండము. పురుగులు శంకువు (జేనెడు) ప్రమాణమున నుండును. వాడు దంతములతో భయంకరులైననా భటులు వికృతాకారములు దాల్చి యందలి పెంజీకట్లలో దిక్కుదోచని పాపులను బాధింతురు. పూయకుండ మొకటి గలదు. రెండు కోసుల వ్యాస ప్రమాణమున నుండును. అది చీముతో చీము తిను ప్రాణులతో నిండియుండును. అందలి పాతకులను నా దూతలు బెట్టిదముగ బాధలు పెట్టుచుందురు. తాటి చెట్టంత పొడవుగల క్రూరసర్పములతో నిండియుండునది సర్పకుండము. అందలి పాములు పాపులను తినుచుండును. అవి పాపులను చుట్టుకొనుయుండును. అందలి పాపులను నా దూతలు కొట్టుచుండగ వారేడ్చుచుందురు. మశక-దంశ-గోళ కుండములు మూడును దోమలతో నిండియుండును. ఇవి కోసులో సగము వ్యాసముతో నుండును. మహా పాతకుల కాలు సేతులు కట్టకట్టి యందులో పడవేతురు. ఇది కుశకాదికుండము దోమలు నెత్తురు పీల్చుచుండును.

హాహేతి శబ్దం కుర్వ ద్బి స్తాడితై ర్మమపార్షదైః | వజ్ర వృశ్చికయోః కుండం తాభ్యాం చ పరిపూరితమ్‌. 47

వాప్యర్ధం పాపిభిర్యుక్తం వజ్ర వృశ్చిక దంశితైః | కుండత్రయం శరాదీనాం తైరేవ పరిపూరితమ్‌. 48

తైర్విద్దైః పాపిభిర్యుక్తం వాప్యర్ధం రక్తలోహితైః | తప్తతో యోదకైః పూర్ణం సధ్వాంతంగోల కుండకమ్‌. 49

కీటైః సంకులమానై శ్చ భక్షితైః పాపిభిర్యుతమ్‌ | వాప్యర్దమానం భీతైశ్చ పాపిభిః కీటభక్షితైః. 50

రుదద్బిః క్రోశమానై శ్చ మమ దూతై శ్చ తాడితైః | అతి దుర్గం ధ సంయుక్తం దుఃఖదం పాపినాం సదా. 51

దారుణౖర్వికృతాకారై ర్బక్షితం పాపిభిర్యుతమ్‌ | వాప్యర్దం పరిపూర్ణం చ జల స్థైర్న క్రకోటిభిః. 52

విణ్మూత్ర శ్లేష్మభ##క్షైశ్చ సంయుతం శతకోటిభిః | కాకైశ్చ వికృతా కారై ర్బక్షితైః పాపిభిర్యుతమ్‌. 53

మంథాన కుండం బీజకుండం తాభ్యాం పూర్ణం ధనుఃశతమ్‌ | భక్షితైః పాపిభిర్యుక్తం శబ్దకృద్బిశ్చ సంయుతమ్‌.

ధనుః శతం జీవయుక్తం పాపిభిః సంకులం సదా | శబ్ద కృద్బి ర్వజ్ర దంష్ట్రైః సాంద్ర ధ్వాంత మయం పరమ్‌.

వాపీ ద్వి గుణమానం చ తప్త ప్రస్తర నిర్మితమ్‌ | జ్వల దంగార స దృశం చల ద్బిః పాపిభిర్యుతమ్‌. 56

క్షురధారోపమై స్తీ క్షైః పాషాణౖర్మితంపరమ్‌ | మహాపాతకిభిర్యుక్తం లాలా కుండం చలోహితైః. 57

క్రోశమాత్రం చ గం భీరం మమదూతైశ్చ తాడితైః | తప్తాం జనాచలా కారైః పరిపూర్ణం ధనుఃశతమ్‌. 58

హాహా కారములు చేయుచున్న పాపులను నా భటులందు గొట్టు చుందురు. వజ్ర కుండము వృశ్చిక కుండము నుండును. అవి వజ్రములతో నిండియుండును. అవి బావిలో సగమంత యుండును. వజ్రమువంటి తేళ్ళుపాపులను కుట్టు చుండును. శరాదికుండ మొటకి గలదు. అది శర-శూల-ఖడ్గములతో భయంకరముగ నుండును. అవి దిగుడుబావిలో సగముండును. అవి గ్రుచ్చుకొనగ పాపుల శరీరములనుండి నెత్తురు చిమ్మించి కొట్టుచుండును. గోలకుండము మసలెడు నీటితో ముస రిన చీకట్లతో కండ్లుగనిపించ కుండును. అందుపెక్కు విధములైన పురుగులుపాపులను తినుచుండగ వారు భయపడుదురు అది బావిలో సగముండును. నాదూతలందలి పాపులను కొట్టుచుండుగ వారేడ్చుచుందురు. చెడు వాసనలతోనిండి పాపులకు దుఃఖము గల్గించు నక్రకుండము గలదు అందు దారుణమైన వికృతా కారముగల మొసళ్ళు పాపులను తినుచుండును. అది దిగుడు బావిలో సగముండును. ఆ నీట్లో కోట్ల మొసళ్ళుండును. కాకకుండ మొకటి గలదు. అది మల-మూత్రములతో-శ్లేష్మముతోనిండి వానిని తును పక్షులతో నిండియుండును. అందలి కాకులు వికృతా కారములతోనుండి పాపులను పొడిచి తిను చుండును. మంథాన కండము బీజకుండము నుండును. అవి మంథానములు బీజములను పురుగులతోనిండి యేడ్చుచున్న పాపు లను తినుచుండును. అది నూఱు ధనువులంత విస్తీర్ణముగ నుండును. వజ్రకుండము వజ్రములవంటి కోఱలతో భయంకరముగ నుండు క్రూరజంతువులతో పాపులతోనిండి చీకట్లునిండి యుండును. తప్త పాషాణకుండ మొకటి గలదు. అది రెండు దిగుడు బావులంత లోతుగ కాలుచున్న రాళ్లతో కాలిన బొబ్బలతో పరుగెత్తు పాపులతో పొగలతో మంటలతో నిండి యుండును. తీక్షపాషాణకుండ మింకొకటి. వాడి కత్తులవంటి పదునైన రాళ్లతో నదినిండి యుండును. మహా పాతకులతో నెత్తురు). తెమ డలతో నిండియుండునది లాలా కుండము. అది కోసెడు వ్యాసముతో లోతుగనుండి నా దూతలచేత పీడింపబడు పాతకులతో గూడియుండును. మసీ కుండము కాటుక రాళ్లతో చేయబడి దట్టమైన చిక్కనైన మసితో నల్లగ నూఱు ధనువులంతగ నుండును.

చలద్బిః పాపిభిర్యుక్తం మమ దూతైశ్చ తాడితైః | పూర్ణ చూర్ణ ద్రవైః క్రోశమానం పాపిభిరన్వితమ్‌. 59

తద్బోజిభిః ప్రదగ్దైశ్చ మమ దూతైశ్చ తాడితైః | కుండంకులాల చక్రం ఘూర్ణమానం చ సంతతమ్‌. 60

సుతీక్షం షాడశారం చ చూర్ణితైః పాపిభిర్యుతమ్‌ | అతీవ వక్రం నిమ్నం చద్విగప్యూతి ప్రమాణకమ్‌. 61

కందరాకార నిర్మాణం తప్తోదైశ్చ సమన్వితమ్‌ | మహాపాతకిభిర్యుక్తం భక్షితై ర్జల జంతుభిః. 62

జ్వలద్బిః శబ్దకృద్బిశ్చ ధ్వాంతయుక్తం భయానకమ్‌ | కోటిభి ర్వికృతాకారైః కచ్చపైశ్చ సుదారుణౖః. 63

జలస్థైః సంయుతం తైశ్చ భక్షితైః పాపిభిర్యుతమ్‌ | జ్వాలాకలాపై స్తేజోభి ర్నిర్మితైః క్రోశమానకమ్‌. 64

శబ్దకృద్బిః పాతకిభిః సంయుతం క్లేశదం సదా | క్రోశమానం చ గంభీరం తప్త భస్మభి రన్వితమ్‌. 65

శశ్వజ్జ్వలద్బిః సంయుక్తం పాపిభిర్బస్మ భక్షితైః | తప్తపాషాణ లోహానాం సమూహైః పరిపూరితైః. 66

పాపిభిర్దగ్ధ గాత్రై శ్చ యుక్తం చ శుష్కతాలుకైః | క్రోశమానం ధ్వాంతయుక్తం గంభీరమతి దారుణమ్‌. 67

తాడితైశ్చ ప్రదగ్దైశ్చ దగ్దకుండం ప్రకీర్తితమ్‌ | అతీవోర్మియుతంతోయం ప్రతప్తక్షార సంయుతమ్‌. 68

నానప్రకారై ర్విరుతై ర్జలజంతుభి రన్వితమ్‌ | ద్విగవ్యూతి ప్రమాణం చ గంభీరం ధ్వాంతసంయుతమ్‌. 69

తద్బక్షైః పాపిభిర్యుక్తం దంశితై ర్జల జంతుభిః | జ్వలద్బిః శబ్దకృద్బిశ్చ న పశ్చ ద్బిః పరస్పరమ్‌. 70

అందలి పాపులను నా దూతలు బాధింతురు. పొడిగనున్న వస్తువుల ద్రవముతో కోసుమేర పాపులతో నిండినది చూర్ణకుండము. అందలి పాపులు చూర్ణము దినుచు నా దూతలచేత బాధలు పడుచుందురు. కుమ్మరి సారెవలె నిరంతరముగ దిరుగునది చక్రకుండము. దానికి పదునారు పదునైన యాకులుండును. పని మధ్యలో పాపులు నుగ్గునుగ్గగుదురు. అది వంకర టింకర నాల్గుకోసుల మేర వ్యాపించి యుండును. గుహవలె నుండినది వేన్నీళ్లతో నిండినది. జలజంతువులచేత తినబడుచున్న పాపులు గలది తప్తోదక కుండము. అది భయానకముగ అంధకారమయముగా సెగలు పొగలు లేచుచు రోదించు పాపులతో నుండును. కోట్లకొలది వికృతా కారములుగల తాబేళ్లతో దారుణమైనది కచ్చప కుండము. నీటి జంతువులందలి పాపులను తినుచుండును.పెద్ద మంటలతో భగభగ మనుచు కోసెడు మేరజ్వాలా కుండముండును. అందలి పాపులు బాధలు పడలేక పెద్దగ వాపోవుదురు. భస్మ కుండము కాలుచున్న భస్మముతో కోసెడంత వ్యాసము లోతుగ నుండును. ఇందలి బూడిద కాలుచున్న లోహపాషాణములవలన నేర్పడును. అందలి పాపులు నిరంతరము కాలుచున్న భస్మము తినుచుందురు. పాపాత్ము లను మంటలతో మండించునది దగ్ధకుండము. ఇదికోసెడు మేర కటికి చీకటితో నిండియుండును. పాపుల శరీరములందు దారుణముగ కాలిమండుచుండును. వారి దౌడలు మంటలకెండి పోవును. దగ్ధకుండమున కాలిన దెబ్బలుతిన్న పాపులుందురు; తప్తక్షార కుండమున నువ్వెత్తుగలేచుచున్న మసలుచున్న క్షారజల ముండును. ఇదు పెక్కుజల జంతువుల భయంకర ధ్వనులు మారుమ్రోగు చుండును. ఇది నాల్గుకోసుల మేరలో దట్టమైన చీకట్లలో నలముకొని యుండును. అందలి జంతువులు పాపులను బాదపెట్టును. పాపులొకరి నొకరు చూచుకొనక వెఱ్ఱి కేకలు పెట్టుచు మండుచుందురు.

ప్రతప్త సూచీకండం చ కీర్తితం చ భయానకమ్‌ | అసీవధారాపత్ర్యస్యా ప్యుచ్చై స్తాలతరోరధః. 71

క్రోశార్ధమానం కుండం చ పత త్పత్ర సమన్వితమ్‌ | పాపినాం రక్తపూర్ణం చ వృక్షా గ్రాత్పతతాంధ్రువమ్‌. 72

పరిత్రాహీతి శబ్దం చ కుర్వతా మసతా మపి | గంభీరం ధ్వాంతయుక్తం చ రక్తపీట నమన్వితమ్‌. 73

తదసీపత్రకుండం చ కీర్తితం చ భయానకమ్‌ | ధనుః శతప్రమాణం చ క్షురధారాస్త్ర సంయుతమ్‌. 74

పాపినాం రక్తపూర్ణం చ క్షురధారం భయానకమ్‌ | సూచీముఖాస్త్ర సంయుక్తం పాపిరక్తౌ ఘపూరితమ్‌. 75

పంచాశుద్ధనురాయామం క్లేశదం చ సూచీముఖమ్‌ | కస్య చిజ్జంతు భేదస్య గోకాఖ్యస్య ముఖాకృతిః. 76

కూపరూపం గంభీరం చ ధనుర్వింశ త్ర్పమాణకమ్‌ | మహాపాతకినాం చైవ మహాక్లేశ ప్రదం పరమ్‌. 77

తత్కీట భక్షితానాం చ నమ్రాస్యానాం చ సంతతమ్‌ | కుండం నక్రముఖాకారం ధనుః షోడశమానకమ్‌. 78

గంభీరం కూపరూపం చ పాపినాం సంకులం సదా | ధనుః శతప్రమాణం చ కీర్తితం గజదం శనమ్‌. 79

ధను స్త్రింశత్ర్పమాణం చ కుండం చ గోముఖాకృతి | పాపినాం క్లేశదంశశ్వ ద్గోముఖం పరికీర్తితమ్‌. 80

కాలచక్రేణ సంయుక్తం భ్రమమాణం భయానకమ్‌ | కుంభాకారం ధ్వాంతయుక్తం ద్విగవ్యూతి ప్రమాణకమ్‌. 81

లక్షపౌరుషమానం చ గంభీరం విస్తృతం సతి | కుత్ర చిత్తప్త తైలం చ తామ్రాది కుండ మేవచ. 82

ప్రతప్త సూచీకుండమతి భయంకరమైనదని చెప్పబడును. పదునైన కత్తియంచులవంటి యాకులతో నైత్తైన తాటిచెట్ల క్రింద అసి పత్రకుండ ముండును. ఇది కోసులో సగము వ్యాసముతోనుండును. పాపుల నెత్తైన తాటిచెట్ల కొనలనుండి దీనిలో పడవేయుటవలన వారు నెత్తుట తడిసి పోదురు. పాపులందుండి త్రాహి త్రాహియని కేకలు పెట్టుచుందురు. ఇది ముసరిన చీకట్లతో నెత్తుటి పురుగులతో నిండియుండును. అసిపత్రకుండమతి భయానకముగ నుండునందురు. క్షురాధారా కుండము నూఱు ధనుస్సుల మేర మంగలి కత్తివంటి వాడి యస్త్రములతో వ్యాపించి యుండును. ఇది పాపుల రక్తముతో పదునైన కత్తులతో నుండును. సూది మొనలతో పాపుల నెత్రుటేర్లతో నిండినది సూచీ ముఖకుండము. ఇది యేబది ధనుస్సులమేరలో పాపులకు భయంకరముగ నుండును. గోక యనెడు జంతువు ముఖమువలె నుండునది గోకా ముఖకుండము. ఇది లోతైనబావి వలె నిరువది ధనుస్సులంత పొడవున నుండును. ఇది మహాపాపులకు మహా క్లేశములు గల్గించుచుండును. గోకా ముఖ కీట కములందలి పాపులను తినుచుండగవారు దీనముగ తలలు వంచుకొని యుందురు. నక్రముఖాకార కుండము పదారు ధనుస్సుల మేర వ్యాపించి యుండును. ఇదియును బావివలె చాలలో తుగ పాపులతో నిండియుండును. మదించిన భయంకరమైన యేను గులతో నూఱు ధనుస్సుల పెట్టున గజదంశ కుండముండును. అందు పాపులు సతతముగ విలపింతురు. ఆవు మొగమువలె ముప్పది ధనువుల వైశాల్యముననుండి పాపులకెల్లప్పుడును బాధలు గల్గించునది గోముఖకుండము. కాల చక్రమువలె తిరుగుచు కుంతాకారముగ నాల్గుకోసుల మేవ వ్యాపించి చీకటితో భఃయంకరమైనది కుంభీ పాకనరకము. ఇది లక్షపురుష ప్రమాణమున లోతుగ విశాలముగ నచ్చటచ్చట తప్త తైలముతో తామ్ర కుండములతో నిండియుండును.

పాపినాం చ ప్రధానైశ్చ మూర్చితైః కృమిభిర్యుతమ్‌ | పరస్పరం చ నశ్యద్బిః శబ్ధ కృద్బిశ్చ సంతతమ్‌. 83

తాడితైర్యమ దూతైశ్చ ముసలై ర్ముద్గరైస్తథా | ఘూర్ణమానైః పతద్బిశ్చ మూర్చితైశ్చ క్షణం క్షణమ్‌. 84

పాతితైర్యమ దూతైశ్చ రుదంత్యస్మాత్షణం పునః | యావంతః పాపినాంసంతి సర్వకుండేషు సుందరి. 85

తతశ్చతుర్గుణాః సంతి కుంభీపాకేచ దుఃఖదే | సుచిరం వధ్యమానాస్తే భోగ దేహాన నశ్వరాః. 86

సర్వకుండం ప్రధానం చ కుంభీపాకం ప్రకీర్తితమ్‌ | కాలనిర్మితసూత్రేణ నిబద్ధా యత్ర పాపినః. 87

ఉత్థాపితాశ్చ దూతైశ్చ క్షణమేవ నిమజ్జితాః | నిఃశ్వాసబద్ధాః సుచిరం తథా మోహంగతాః పునః. 88

అతీవక్లేశ సంయుక్తా దేహభోగేన సుందరి | ప్రతప్త తోయయుక్తం చ కాలసూత్రం ప్రకీర్తితమ్‌. 89

అవటః కూపభేదశ్చ మత్స్యోదః స ఉదాహృతః | ప్రతప్తతోయ పూర్ణం చ చతుర్వింశ త్ర్పమాణకమ్‌. 90

వ్యాప్తం మహాపాత కిభిర్వ్యాదగ్ధాంగైశ్చ సంతతమ్‌ | మద్ధూతై స్తాడితైః శశ్వ దవటోదం ప్రకీర్తితమ్‌. 91

యత్రోద స్పర్శమాత్రేణ సర్వవ్యాధిశ్చ పాపినామ్‌ | భ##వేదకస్మాత్పతతాం యస్మి న్కుండే ధనుః శ##తే. 92

అరుంతుదైర్బక్షితైస్తు ప్రాణిభి ర్య చ్చసంకులమ్‌ | హహేతి శబ్దం కుర్వ ద్బి స్తదేవారుంతుదం విదుః. 93

తప్త పాంసుభిరాకీర్ణం జ్వలద్బి స్తు ష దగ్ధకైః | తద్బక్షైః పాపిభిర్యుక్తం పాంసుభోజ ధనుఃశతమ్‌. 94

ఇది కృమికీటమయము. మూర్చితులై నిరంతరము కేకలు వేయుచు నొకరి నొకరు కొట్టుకొనుచు నిందలి పాపులుందరు. నా భటులు పాపులను రోకళ్లతో ముద్గరములతో గట్టిగ కొట్టుచుందురు. అపుడు పాపులు గిరిగిర తిరిగి క్రిందపడి యేడ్చుచుందురు. ఓ సుందరీ! ఇట్లు నా దూతలచేత కొట్టబడి మాటా మాటికి పాతకులు విలపింతురు. ఈ నరక కుండము లన్నిటిలో నెందఱు పాపులుందురో వారికి నాల్గురెట్లు పాపాత్ములీ దుఃఖమయమైన కుంభీపాక నరకమున తమకర్మ ఫలములను భవించుచుందురు. కుంభీపాక నరకమన్ని కుండములలో ప్రధానమైనది కాలసూత్ర కుండమున పాములు కాలసూత్రముచే బద్ధులగుదురు. భటులు కాల సూత్రముతో పాపులను పైకిచేది మరల కుండములో ముంచుదురు. చాలసేపు వఱకూపిరి బిగ బట్టుటవలన వారూపిరాడక గిజగిజ తన్నుకొందురు. ఓ సుందరీ! ఇందు కష్టములనుభవించుట చాల కష్టతరము. ఈ కాల సూత్రమున సలసల క్రాగుచున్న నీరు నిండియుండు నందురు. అవట కుండము మత్స్యోద కుండము రెండు నొక్కటియే. అవటమనెడు బావియుండుటవలన దానికా పేరు వచ్చెను. ఇది వేడినీళ్లతో నలువది ధనుస్సులంత మేర వ్యాపించి యుండును. ఇందు కాలిన శరీరములు గల పాపులేడ్చిన కొలది భటులు వారిని కొట్టి మఱిమఱి యేడ్పింతురు. అందుచే దీని నవటోద కుండ మందురు. అందలి నీటిని తాకినంతనే పాతరోగములు బైటపడును. ఇది నూఱు ధనుస్సులంతవ్యాసమున నుండును. అరుంతుదమనెడు పురుగులు పాపులను నిరంతరముగ తినచుండుటవలన వారయ్యో అయ్యోయని మొఱపెట్టు చుందురు. కనుకదీని కరుంతుదకుండమని పేరు పెట్టబడెను. ఎడతెగక కాలుచున్న దుమ్ముతో నుండునది పాంసు కుండము. అది నూఱు ధనుస్సుల మేర నుండును. పాపులు దుమ్మునేతిందురు.

పాతమాత్రేణ పాపీచ పాశేన వేష్టితో భ##వేత్‌ | క్రోశమాత్రేణ కుంభం చ తత్పాశ వేష్టనం విదుః. 95

పాతమాత్రేణ పాపీ చ శూలేన వేష్టితో భ##వేత్‌ | ధనుర్వింశత్పృమాణం చ శూలప్రోతం ప్రకీర్తితమ్‌. 96

పతతాం పాపినాం యత్ర భ##వేదేవ ప్రకంపనమ్‌ | అతీవ హిమతోయాక్తం క్రోశార్ధం చ ప్రకంపనమ్‌. 97

దదత్యేవ హి మే దూతాయత్రోల్కాః పాపినాం ముఖే | ధనుర్వింశత్ర్పమాణం తదుల్కాభిశ్చ సంకులమ్‌. 98

లక్షపౌరుషమానం చ గంభీరం చ ధనుః శతమ్‌ | నానాప్రకార కృమిభిః సంయుక్తం చ భయానకమ్‌. 99

అత్యంధకార వ్యాప్తం చ కూపాకారం చ వర్తులమ్‌ | తద్బక్షైః పాపిభిర్యుక్తం ప్రణశ్యద్బిః పరస్పరమ్‌. 100

తప్తతోయ ప్రదగ్దైశ్చ జ్వలధ్బిః కీటభక్షితైః | ధ్వాంతేన చక్షుషా చాంధై రంధకూపః ప్రకీర్తితః. 101

నానాప్రకార శాస్త్రౌఘైర్యత్ర విద్ధాశ్చ పాపినః | ధనుర్వింశత్పృమాణం చ వేధనం తత్పృకీర్తితమ్‌. 102

దండేనతాడితా యత్ర మమ దూతైశ్చ పాపినః | ధనుః షోడశమానం చ తత్కుండం దండతాడనమ్‌. 103

నిరుద్ధాశ్చ మహాజాలై ర్యథా మీనాశ్చ పాపినః | ధనుర్వింశత్ర్పమాణం చ జాలరంధ్రం ప్రకీర్తితమ్‌. 104

పతతాం పాపినాం కుండే దేహశ్చూర్ణో భ##వేదిహ | లోహబందీ నిబద్ధానాం కోటిపౌరుషమానకమ్‌. 105

గంభీర ధ్వాంత సంయుక్తం ధనుర్వింశత్ర్పమాణకమ్‌ | మూర్చితానాం జడానాంచ దేహపూర్ణం ప్రకీర్తితమ్‌. 106

పడుటయే తడవుగ పాశములు చుట్టుకొనెడు కుండము పాశ##వేష్టన కుండము. ఇది కేసుమేర నుండును. పడి-పడగనే పాపులను శూలములతో గ్రుచ్చెడి శూలకుండము. ఇదిరువది ధనుస్సులమేర నుండును. ప్రకంపనకుండము సగము కోసు పరిమాణమున మంచు నీటితో నిండియుండును. అందు పాతకులు పడగనే చలికి గడగడ వణకుచుందురు. ఉల్కా ముఖ నరక మిరువది ధనుస్సులంత విస్తీర్ణమున నుండును. అందు పాపులు పడగనే నా భటులు వారి నోళ్లలో మండు నుల్కలు పడవేతురు. లక్షలమంది పురుషుల ప్రమాణము లోతుగ నూఱు ధనుస్సులంత వైశాల్యముగ పెక్కు విధముల పురుగులతో భయంకరమైనది అంధకూప కుండము. అది బావివలె గుండ్రముగ అంధకార బంధురముగ నుందురు. అందలి పురుగులు తినుచుండగ పాపులు బాధలు పడుచుందురు. వేడినీళ్లతో కాలుటవలన కండ్లు కనరాని చీకట్లు వ్యాపించుట వలన దీని నంధకూపకుండ మని యందురు. పలు విధములైన శస్త్రములతో నిరువది ధనుస్సుల మేర వ్యాపించి బాధించుచుండు కుండమును వేధనకుండ మందురు. పదారు ధనుస్సులవ్యాసము గల్గి పాపాత్ములను నా భటులు దండముతో దండించుచుండు నరక కుండమును దండతాడకుండ మందురు. చేపలవలె పాపు లెచట బంధింపబడుదురో ఏది యిరువది ధనువుల ప్రమాణ ముండునో దానిని జాలరంధ్రకుండ మందురు. ఏ కుండమున పడినంతనే పాపుల దేహములు చూర్ణమగునో ఎందు పాపుల నినుప సంకెళ్లతో బంధింతురో ఏది కోటి మంది పురుషులంత వ్యాసముతో వ్యాపించియుండునో ఏది దట్టమైన చీకట్లతో నిండి యిరువది ధనుస్సులంత యుండునో ఎందు సోమ్మసిల్లిన జడమతు లుందురో దానిని దేహచూర్ణకుండమని యందురు.

దళితాః పాపినో యత్ర మమ దూతైశ్చ తాడితాః | ధనుః షోడశమానంచ తత్కుండంం దళనం స్మృతమ్‌. 107

పతనేనైవ పాపీ చ శుష్క కంఠోష్ఠతాలు కః | వాలుకాసు చ తప్తాసు ధను స్త్రింశత్ర్పమాణకమ్‌. 108

శతపౌరుషమానం చ గంభీరం ధ్వాంత సంయుతమ్‌ | శోషణం కుండమేతద్ధి పాపినాం పరదుఃఖదమ్‌. 109

నానాచర్మ కషాయోద పరిపూర్ణం ధనుఃశతమ్‌ | దుర్గంధియుక్తం తదైక్ష్యేః ప్రాణిభిః సంకులంకషమ్‌. 110

శూర్పాకారముఖం కుండం ధనర్ద్వాదశమానకమ్‌ | తప్తలోహం వాలుకాభిః పూర్ణం పాతకి సంయుతమ్‌. 111

దుర్గంధి యుక్తం తద్బక్షైః పాపిభిః సంకులం సతి | శూర్పాకారముఖం కుండం ధనుర్ద్వాదశ మాత్రకమ్‌. 112

ప్రతప్త వాలుకా పూర్ణం మహాపాతకిభిర్యుతమ్‌ | అంతరగ్నిశిఖానాం చ జ్వాలావ్యాప్తముఖం సదా. 113

ధనుర్వింశతి మాత్రం చ ప్రమాణం యస్య సుందరి | జ్వాలాభిర్ద గ్ధగాత్రైశ్చ పాపిభిర్య్వాప్త మేవచ. 114

తన్మహాక్లేశ##దేశశ్వత్కుండే జ్వాలాముఖే స్మృతమ్‌ | పాతమాత్రాద్యత్రపాపీ మూర్చితోవై నరోభ##వేత్‌. 115

తప్తే ష్టకాభ్యంతరితంవాప్యర్ధం జిహ్వకుండకమ్‌ | ధూమ్రాంధకారసంయుక్తం ధూమ్రాంధైః పాపిభిర్యుతమ్‌. 116

ధనుః శతంశ్వస రంద్రైర్దూమ్రాంధం పరికీర్తితమ్‌ | పాతామాత్రాద్యత్రపాసీ నాగైశ్చ వేష్టితో భ##వేత్‌. 117

ధనుః శతం నాగ పూర్ణం తన్నాగైర్వేష్టితం భ##వేత్‌ | షదశీతి చ కుండాని మయోక్తాని నిశామయ.

లక్షణం చాపి తేషాం చకిం భూయః శ్రోతుమిచ్చసి. 118

ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ

సంవాదే సావిత్రు పాఖ్యానే సప్తత్రింశోధ్యాయః.

దళనకుండము పదారు ధనుస్సుల మేర నుండును. అందున్న పాపులను నా దూతలు నలిపి దెబ్బలు కొట్టుదురు. అందుచేత దానిని దళనకుండ మందురు. ఏ నరకమున పడినంతనే పాపుల కంఠములు - పైదవులు - దౌడలు నెండిపోవునో ఎందున్న యిసుక కాలుచుండునో ఏది ముప్పి ధనువులంత మేవ వ్యాపించియుండునో ఏది నూర్గురు పురుషులంత లోతుగ చీకటితో నిండియుండునో ఏది పాతకుల కమితమైన దుఃము గల్గించునో అది శోషణకుండము. ఏది నూఱు ధనుస్సులమేర పెక్కు విధముల తోళ్ల కషాయముతో చెడువాసనలతో నిండియుండునో - పాపులకెందు తోళ్లకషాయము ఆహారముగ నుండునో దానిని కషకుండ మందురు. పండ్రెండు ధనుస్సుల మేర నుండి యందలి పదార్థమును దినుచుండు పాపులతో నిండి యుండునది శూర్పాకారముఖ కుండము. ఏది కాలుచున్న యిసుకతో మహా పాపాత్ములతో నిప్పులవంటి దుమ్ముకణములతో పైకెగవేయుచున్న పెను మంటలతో నుండునో సుందరీ ! ఏది యిరువది ధనుస్సులంత ప్రమాణమున నుండునో మంటలలో శరీరములు కాలిన పాపులెందుందురో ఏది మహాబాధ యెల్లప్పుడు గల్గించుచుండునో దానిని జ్వాలాముఖకుండ మందురు. ఏ నరకమందు పడినంతనే పాపి స్పృహతప్పి పడిపోవునో ఎందు కాలుచున్న యిటుక లుండునో దానిని జిహ్వకుండ మందురు. ఏ కండమందు పొగ దట్టముగ క్రమ్ముకొనుటవలన చిమ్మచీకట్లు వ్యాపించి యుండునో పాపు లా పొగలో కనిపించ కుందురో ఏది నూఱు ధనుస్సుల మేర నుండునో దానిని ధూమ్రాంధకుండ మందురు. ఏ నరకమందు పడినంతనే పాతలకును కోడెనాగుల పెనవేసికొనునో ఏది నూఱు ధనుస్సుల మేర నాగుపాములతో నిండియుండునో దానిని నాగవేష్టిత కుండ మందురు. ఇట్లు నీ కెనుబది యారు నరక కుండముల గూర్చి తెల్పితిని. వాని లక్షణములును విపులముగ తెల్పితిని. ఇపుడిం కేమి వినదలతువో తెలుపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు నారద నారాయణ సంవాదమందు

సావిత్ర్యుపాఖ్యానమున ముప్పదేడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters