Sri Devi Bagavatham-2    Chapters   

శ్రీగణాధిపతయే నమః

శ్రీ మాత్రే నమః

శ్రీదేవీ భాగవతమ్‌

సప్తమస్కంధః - ప్రధమాధ్యాయః

సూత ఉవాచ: శ్రుత్వైతాం తాపసా దివ్యాం కధాం రాజా ముదాన్వితః! వ్యాసం పప్రచ్చ ధర్మాత్మా పరీక్షితసుతః పునః 1

జనమేజయ ఉవాచ: స్వామి స్యూర్యాన్యయానాం చ రాజ్ఞాం వంశస్య విస్తరమ్‌!

తధా సోమావ్యయానాం చ శ్రోతుకామోస్మి సర్వథా. 2

కథయానఘ సర్వజ్ఞ కథాం పాపప్రణాశినామ్‌ ! చరితం భూపతీనాం చ విస్తరా ద్వంశయోర్ద్వయో ః 3

తేహి సర్వే పరాశక్తి భక్తా ఇతి మయా శ్రుతమ్‌ ! దేవీభక్తస్య చరితం శృణ్వ న్కోస్తి విరక్తిభాక్‌. 4

ఇతి రాజర్షిణా పృష్టో వ్యాసః సత్యవతీసుతః ! తమువాచ మునిశ్రేష్ఠః ప్రసన్నవదనో మునిః. 6

వ్యాసః : నీశామయ మహారాజ విస్తరాద్గదతో మమ ! సోమ సూర్యాన్వయానాం చ తథా న్యేషాంసముద్బవమ్‌.

విష్ణో ర్నాభిసరోజాద్వై బ్రహ్మా భూ చ్చతురాననః ! తప స్తప్త్యా సమారాధ్య మహాదేవీం సుదుర్గమామ్‌. 7

తయా దత్తవరో ధాతా జగత్కర్తుం సముద్యతః ! నాశక న్మానుషీం సృష్టింకర్తుం లోకపితామహః. 8

విచింత్య బహుధా చిత్తే సృష్ట్యర్ధం చతురాననః ! న విస్తారం జగామాశు రచితా పి మహాత్మనా. 9

''ససర్జ మానసా స్పుత్త్రాన్సప్త సంఖ్యా న్ర్పజాపతిః ''! మరీచి రంగిరా త్రిశ్చ వసిష్ఠః పులహః క్రతుః

పులస్త్యశ్చేతి విఖ్యాతాం సపై#్తతే మానసాః సుతాః. 10

రుద్రో రోషాత్సముత్పన్నో ప్యుత్సంగాన్నారదో భవత్‌ ! దక్షో ంగుష్ఠాత్తథా న్యే పి మానసాః సనకాదయః.

మావాంగుష్ఠా ద్దక్షపత్నీ జాతా సర్వాంగ సుందరీ ! వీరిణీ నామ విఖ్యాతా పురాణషు మహీపతే. 12

అసిక్నీతి చ నామ్నా స యస్యాం జాతో థ నారదః ! దేవర్షి ప్రవరః కామం బ్రహ్మణో మానసఃసుతః. 13

: శ్రీగణాధిపతయే నమః :

శ్రీదేవీ భాగవతము

సప్తమస్కంధము - ప్రధమాధ్యాయము

దక్ష సృష్టి క్రమము

సూతు డిట్లనెను : ఓ తాపసోత్తములారా ! జనమేజయుడు కడు ధర్మాత్ముడు. అతడు శ్రీ మాతృదేవీ దివ్యకథా సుధారసము చెవెలార గ్రోలి యానందభరితుడై వ్యాసునితో మరల నిట్లనెయెను: ఓ స్వామీ ! నాకు సూర్య చంద్రవంశజులగు రాజుల చరిత్ర సవిస్తరముగ సావధానముగ విన కుతూహలమగుచున్నది. సర్వజ్ఞా! అనఘా! నాకు సూర్యచంద్ర వంశజుల పాపాపహరమగు చరితము తేటతెల్లముగ తేనెలొలుక బలుకుము. సూర్య చంద్ర వంశపు రాజులు శ్రీపరాశక్తి భక్తసిఖామణులని వింటిని. దేవీ భక్తుల పవిత్రచరిత్ర వీనులవిందుచేయుట కెవ్వడును విసుగు జెందడు. అని జనమేజయరాజర్షి యడుగగ వ్యాసముని ప్రసన్నమనస్కుడై యతని కిట్లు దేవీకథారసము వెల్లిగొలుప బలికెను: మహారాజా! సూర్యచంద్రవంశజులు తదితరులునైన రాజుల పుట్టు పూర్వోత్తరములు విపులీకరింతును. సావధానముగనాలకింపుము. పూర్వము శ్రీమన్నారాయణుని బొడ్డుతమ్మినుండి తమ్మిచూలి ప్రాదుర్బవించెను. అతడు తీవ్రతపోనిరతుడై దుర్గమయగు శ్రీమహాదేవి నారాధించెను. అంత శ్రీదేవి సంతుష్టాంతరంగయై బ్రహ్మకు వరమొసంగెను. అపుడు బ్రహ్మ జగములు సృజియింపబూనుకొనెను. కాని లోకపితామహుడు మనుజలోకమును సృజింప శక్తుడు గాకుండెను. అతడు ప్రజాసృష్టికి తన నెమ్మది నెంతయో యాలోచించెను. కాని విశ్వసృష్టి చేయజాలక పోయెను. అతడు ముమ్మెదట నేడుగురు మానసపుత్రులను సృష్టి చేసెను. వారు మరీచి-అంగీ రుడు-ఆత్రి-వసిష్ఠుడు-పులహుడు-పులస్తుడు-క్రతు వను నామములతో సుప్రసిద్దులైరి. ఆ పిదప బ్రహ్మ యొక్కయహం కారమునుండి రుద్రుడు తొడనుండి నారదుడు కుడిబటన వ్రేలినుండి దక్షుడు-సనకాది మానసపుత్రులు సముద్బవించిరి. ఎడమ బొటనవ్రేలినుండి దక్షుని భార్య సర్వాంగసుందరిగ జన్మించెను. ఆమె పురాణములందు వీరిణియను పేర వాసి గాంచెను. ఆమెకే అసిక్ని అనియు పేరు. బ్రహ్మ మానసపుత్రుడు-దేవర్షి-యగు నారదుడు వీరిణి గర్బమందు జన్మించి పేరు గాంచెను.

జనమేజయః : అత్ర మే సంశయో బ్రహ్మన్యదుక్తం భవతా వచః | వీరిణ్యాం నారదో జాతో దక్షాదితి మహాతపాః.

కథం దక్షస్య పత్న్యాం తు వీరిణ్యాం నారదో మునిః | జాతో హి బ్రహ్మణః పుత్రో ధర్మజ్ఞ స్తాపసోత్తమః. 15

విచిత్ర మిద మాఖ్యాతం భవతా నారదస్య చ | దక్షా జ్జన్మాస్య భార్యాయాం తద్వదస్వ సవిస్తరమ్‌. 16

పూర్వదేహః కథం ముక్తః శాపా త్కస్య మహాత్మనా | నారదేన బహుజ్ఞేన కస్మా జ్జన్మ కృతం మునే. 17

వ్యాసః బ్రహ్మణాసౌ సమాదిష్టో దక్షః సృష్ట్యర్ధ మాదితః | ప్రజాః సృజేతి సుభృశం వృద్దిహేతోః స్వయంభువా. 18

తతః పంచసహస్రాం శ్చ జనయామాస వీర్య వాన్‌ | దక్షః ప్రజాపతిః పుత్రా న్వీరిణ్యాం బలవత్తరాన్‌. 19

దృష్ట్యా తాన్నారదః పుత్రాస్సర్వా న్వర్థయిషూన్ర్పజాః | ఉవాచ ప్రహసన్వాచం దేవర్షిః కాలనోదితః 20

భువః ప్రమాణ మజ్ఞాత్వా స్రష్టుకామాః ప్రజాః కథమ్‌ | లోకానాం హాస్యతాం యూయం గమిష్యథ న సంశయః.

పృథివ్యావై ప్రమాణం తు జ్ఞాత్వా కార్యః సముద్యమః | కృతోసా సిద్ది మాయాతి నాన్యథేతి వినిశ్చయః. 22

బాలిశా బత యూయం వై యదజ్ఞాత్వా భువస్తలమ్‌ | సముద్యతాః ప్రజాః కర్తుం కథం సిద్ధిర్బవిష్యతి. 23

వ్యాసః : నారదేనైవ ముక్తాస్తే హర్యశ్వాదైవయోగతః | అన్యోన్య మూచుః సహసా సమ్యగాహ మునిః కిల. 24

జ్ఞాత్వా ప్రమాణ ముర్వ్యాస్తు సుఖంస్రక్ష్యామహే ప్రజాః | ఇతి సంచింత్య తే సర్వే ప్రయాతాః ప్రేక్షితుంభువః. 25

తలం సర్వం పరిజ్ఞాతుం వచనా న్నారదస్య చ | ప్రాచ్యాం కేచిద్గతాః కామం దక్షిణస్యాం తథాపరే. 26

ప్రతీచ్యా ముత్తర స్యాం తు కృతోత్సాహాః సమంతతః | దక్షః పుత్రా న్గతా న్దృష్ట్వా పీడితస్తు శుచా భృశమ్‌. 27

జననేజయు డిట్లనెను : మహాతపస్వియగు నారదుడు దక్షునివలన వీరిణికి జన్మించెనంటివి. ఇది నాకు సందియముగొల్పుచున్నది. నారదుడు బ్రహ్మపుత్రుడు-తాపసుడు-ధర్మజ్ఞుడు గదా! అతడు దక్షుని భార్యయగు వీరిణి గర్బ మందెట్లు జన్మించెను? దక్షునివలన వీరిణికి నారదుడు సంభవించెనను విషయము నాకు విచిత్రముగ నున్నది. ఆ కథ యేమి? నాకు తేటతెల్ల మొనరింపుము. మునీశా! బ్రహ్మజ్ఞుడగు నారదు డేమహత్ముని శాపకారణమున పూర్వదేహము చాలించి మరొక జన్మమెత్తెను? అనగా వ్యాసు డిట్లనెను: 'స్వయంభువగు ప్రజాపతి సృష్టిక్రమము నిరంతరాయుముగ సాగవలయునను తలంపుతో ప్రజాసృష్టి చేయుమని దక్షుని ఆదేశించెను. అంత దక్ష ప్రజాపతి తన వీరిణియందు వీర్యవంతులగు నైదు వేలమంది పుత్రులను కనెను. వారెల్లరును ప్రజాసృష్టి తామరతంపరగ జేయదలచిరి. వారినిగాంచి నారదుడు కాలప్రేరితుడె నవ్వుచు నిట్లు పలికెను: మీరీ భూమి పరిమాణమెంతయో తెలిసికొనకయే ప్రజలను సృజింప పట్టుపట్టితిరి. ఇందుచే ప్రజలకు నిలువ తావుండదు. మీరు లోకమున పరిహాసపాత్రులగుదురు. కనుక మీరు భూపరిమాణ మెఱింగి సృష్టిరచనకు బూను కొన్నచో మీకు సిద్ది గల్గును. లేనిచో గలుగదు. మీరందఱును మూర్ఖులు. ఈ భోగోళచరిత్రము తెలిసికొనకయే ప్రజా రచనకు గడంగుటవలన మీ కెట్లు సిద్ధి చేకూరగలదు? అని నారదుడు పలుక గనే హర్యశ్వుడు మున్నగువారు నారదముని చక్కగా బలికెనని దైవయోగమున తమలో తామిట్లనుకొనిరి. వారు తొలుత భూపరిమాణము తెలిసికొనిన పిదప సృష్టి జేయుదమని తలంచి భూతలమంతయు పరిభ్రమించుటకు బయలుదేరిరి. వారిలో గొందఱు నారదుని మాట చొప్పున భూతలము నెఱుగుటకు తూర్పుగ వెళ్ళిరి. మఱికొందరు దక్షిణ దిశగ తరలిరి. ఇంక కొందరు పశ్చిమముగ వేరింక కొందరు ఉత్తరముగ మహోత్సాహముతో బయలుదేరిరి. అట్లు తన పుత్రు లెల్లరును వెళ్ళుటవలన దక్షుడతి శోకార్తు డయ్యెను.

అన్యానుత్పాదమాస ప్రజార్థం కృతనిశ్చయః | తేపి తత్రో ద్యతాః కర్తుం ప్రజార్థ ముద్యమం సుతాః.

నారదః ప్రాహతానద్దృష్ట్యా పూర్వంయద్వచనం మునిః | బాలిశా బత యూయం వై య దజ్ఞా త్వా భువః కిల.

ప్రమాణం తు ప్రజాః కర్తుం ప్రవృత్తాః కేన హేతునా | శ్రుత్వావాక్యం మునే స్తేపి మత్వా సత్యం విమోహితాః.

జగ్ముఃసర్వే యథాపూర్వం భ్రాతర శ్చలితా స్తథా | తా న్సుతా న్పృ స్థితాన్దృష్ట్వా దక్షః కోపసమ న్వితః. 31

శశాప నారదం రోషా త్పుత్రశోక సముద్బవాత్‌ |

దక్షుఉవాచ : నాశితా మే సుతా యస్మా త్తస్మాన్నాశ మహప్నుహి. 32

పాపే నానేన దుర్బుద్దే గర్బవాసం వ్రజేతి చ | పుత్రో మే భవ కామం త్వం యతో మే భ్రంశితాః సుతాః 33

ఇతి శప్తస్తతో జాతో వీరిణ్యాం నారదో మునిః | షష్టిర్మూయోసృజత్కన్యా వీరణ్యా మితి సః శ్రుతమ్‌. 34

శోకం విహాయ పుత్రాణాం దక్షః పరమధర్మవిత్‌ | తాసాం త్రయోదశ మదా త్కశ్య పాయ మహాత్మనే. 35

దశ ధర్మాయ సోమాయ సప్త వింశతి భూపతే | ద్వే చైవ భృగవే ప్రాదా చ్చత స్రోరిష్టనేమినే. 36

ద్వైచే వాంగిరసే కన్యే తథై వాంగిరసే పునః | తాసాం పుత్రా శ్చ పౌత్రా శ్చ దేవా శ్చ దానవా స్తథా. 37

జాతా బలసమాయుక్తాః పరస్పర విరోధకాః | రాగద్వేషాన్వితాః సర్వే పరస్పర విరోధినః.

సర్వే మోహావృతాః శూరా హ్యభవ న్నాతి మాయినః. 38

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కందే ప్రథమోధ్యాయః

అపుడు దక్షుడు మరల మఱికొందఱిని ప్రజాసృష్టికై పుట్టించెను. వారును ప్రజాసృష్టికి ప్రయత్నశీలురైరి. నారదుడు వారిని జూచి పూర్వమువలె వారి కిట్లనెను. మీ రెంతటి మూఢులు. మీ కీ భూపరిమాణమెంతయో తెలియదు. మీరు ప్రజల నేల సృజింప బూనుకొంటిరి అను ముని మాటలు విని. నిజమే యనుకొని వారును మోహితులైరి. వీరును తమ సోదరులు వెళ్ళిన త్రోవనే వెళ్ళిరి. వీరును వెళ్ళుటవలన దక్షునకు శోకము తీవ్రకోపము గలిగెను. దక్షుడు పుత్ర శోకపీడితుడై రోషావేశముతో నారదు నిట్లు శపించెను. నా కొడుకు లెట్లు నశించిరో నీవు నట్లే నశింతువు గాక. ఓ దుర్బుద్ధీ! ఈ పాప ఫలితముగ నీవు గర్బవాస దుఃఖ మనుభవింతువు గాక. నా సుతులు నష్టులైరి కనుక నీవు నాకు పుత్రుడవై పుట్టుము. ఇట్లు నారదుడు శపింపబడి వీరిణి గర్బమున జన్మించెను. దక్షుడు వీరిణియందరువదిమంది కన్యలను గనెను. దాని మూలమున దక్షునకు పుత్రవియోగశోకము కొంత తగ్గెను. ఆ పిదప ధర్మవిదుడగు దక్షుడు తన పదుముగ్గురు కన్యలను కశ్యప మహాత్మున కిచ్చెను. అతడు మఱి పదిమందిని ధర్మున కిచ్చెను. ఇరువదేడుగురిని చంద్రున కొసంగెను. ఇర్వురిని భృగువున కిచ్చెను. నల్వురి నరిష్టనేమి కొసంగెను. వారి వారికి కొడుకులు మనుమండ్రు గల్గిరి. ఆ పుట్టిన వారే దేవదానవులైరి. దేవదానవులు మిక్కిలి బలశాలురు. రాగద్వేష పరులు. మోహాంధులు శూరులు మాయామయులు. తమలోదాము పగలు పెంచుకొనువారునైరి. ఇది శ్రీదేవీ భాగవతమందలి సప్తమ స్కంధమందు దక్ష సృష్టి క్రమమును ప్రథమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters