sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

7. సప్తమోzధ్యాయః - బ్రహ్మదేవుడొనర్చిన సృష్టిక్రమము

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు పలికెను-

తథా బ్రహ్మా తపః కృత్వా సిద్ధిం ప్రాప్య యథేప్సితాం | ససృజే పృథివీ మాదౌ మధుకైటభ##మేదసా || 1

ససృజే పర్వతా నష్టౌ ప్రధానాన్‌ సుమనోహరాన్‌ | క్షుద్రానసంఖ్యాన్‌ కిం బ్రూమః ప్రధానాఖ్యాం నిశామయ || 2

సుమేరుం చైవ కైలాసం మలయం చ హిమాలయం | ఉదయం చ తథాzస్తం చ సువేలం గంధమాదనం || 3

సముద్రాన్‌ ససృజే సప్త నదాన్‌ కతివిధా నదీః | వృక్షాంశ్చ గ్రామనగరం సముద్రాఖ్యా నిశామయ || 4

లవణక్షు సురాసర్పిర్దధి దుగ్థ జలార్ణవాన్‌ | లక్షయోజనమానేన ద్విగుణాంశ్చ పరాత్పరాన్‌ || 5

సప్త ద్వీపాంశ్చ తద్భూమిమండలే కమలాకృతే | ఉప ద్వీపాంస్తథా సప్త సీమా శైలాంశ్చ సప్త చ || 6

నిబోధ విప్ర ద్వీపాఖ్యాం పురా యా విధినా కృతా | జంబూ శాక కుశ ప్లక్ష క్రౌంచ న్యగ్రోధ పౌష్కరాన్‌ || 7

బ్రహ్మదేవుడు తపస్సు చేసి తాను కోరుకున్న సిద్ధిని పొంది తొలుత మధుకైటభులనే రాక్షసుల మేధస్సుతో పృథివిని సృష్టించెను. తరువాత ప్రధానమైన పర్వతాలనెనిమిదిటిని, అసంఖ్యాకమైన ఇతర పర్వతాలను కూడ సృష్టిచేసెను. ప్రధానమైన పర్వతాలపేర్లు ఇవి. 1. సుమేరు, 2. కైలాసము, 3. మలయ పర్వతము, 4. హిమాలయపర్వతము, 5. ఉదయగిరి, 6. అస్తాచలము, 7. సువేలాచలము, 8. గంధమాదన పర్వతము. అదేవిధముగా సప్త సముద్రములను, తూర్పునుండి పడమరవైపు ప్రవహించు నదములను, పశ్చిమమునుండి తూర్పునకు ప్రవహించు నదులను అసంఖ్యాకములుగా సృష్టించెను. సప్తసముద్రముల పేర్లివి. 1. లవణసముద్రము, 2. ఇక్షుసముద్రము, 3. సురాసముద్రము, 4. సర్పిస్సముద్రము, 5. దధి సముద్రము, 6. క్షీర సముద్రము, 7. జలసముద్రము అనునవి. ఇవికాక అనేక విధములైన వృక్షములను, పల్లెలను, నగరములను సృష్టి చేసెను. కమలాకారముగా ఉన్న ఈ భూమిపై ఏడు ద్వీపములను సప్తకుల పర్వతములను సృష్టించెను. బ్రహ్మదేవుడు సృష్టించిన ఏడు ద్వీపముల పేర్లివి. 1. జంబూద్వీపము, 2. శాకద్వీపము, 3. కుశద్వీపము, 4. ప్లక్షద్వీపము, 5. క్రౌంచద్వీపము, 6. న్యగ్రోధ ద్వీపము, 7. పౌష్కరద్వీపము అనునవి.

మేరోరష్టసు శృంగేషు ససృజేzష్టౌ పురీః ప్రభుః | అష్టానాం లోకపాలానాం విహారాయ మనోహరాః || 8

మూలేzనంతస్య నగరీం నిర్మాయ జగతాంపతిః | ఊర్ధ్వే స్వర్గాంశ్చ సపై#్తన తేషామాఖ్యా నిశామయ || 9

భూర్లోకం భువర్లోకం స్వర్లోకం సుమనోహరం | జనోలోకం తపోలోకం సత్యలోకం చ శౌనక || 10

శృంగమూర్ధ్ని బ్రహ్మలోకం జరాదిపరివర్జితం | తదూర్ధ్వే ధ్రువలోకం చ సర్వతః సుమనోహరం || 11

తదధః సప్తపాతాళాన్నిర్మమే జగదీశ్వరః | స్వర్గాzతి రిక్త భోగాఢ్యాన్‌ అధోzధః క్రమతోమునే || 12

అతలం వితలం చైవ సుతలం చ తలాతలం | మహాతలం చ పాతాలం రసాతల మధస్తతః || 13

సప్తద్వీపైః సప్తనాకైః సప్తపాతాళ సంజ్ఞకైః | ఏభిర్లోకైశ్చ బ్రహ్మాండం బ్రహ్మాధికృతమేవ చ || 14

మేరు పర్వతముయొక్క ఎనిమిది శిఖరములయందు అష్టదిక్పాలకుల విహారార్థము అందమైన ఎనిమిది పట్టణములను బ్రహ్మదేవుడు సృష్టించెను. మేరు పర్వత మూలమున ఆదిశేషుని పట్టణమైన పాతాళమును నిర్మించెను. మేరు పర్వతముయొక్క పై భాగమున ఏడు స్వర్గముల సృష్టించెను. ఇవి 1. భూర్లోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. జనోలోకము, 5. తపోలోకము, 6. సత్యలోకము, 7. అన్ని శిఖరముల పైభాగముననున్న బ్రహ్మలోకము. ఈ ఏడు లోకములపైన ధ్రువలోకమున్నది.

అట్లే మేరు పర్వతముయొక్క క్రిందిభాగమున ఏడు పాతాళములున్నవి. అవి 1. అతలము, 2. వితలము, 3. సుతలము, 4. తలాతలము, 5. మహాతలము, 6. పాతాళము, 7. అన్నింటికంటె క్రిందనున్న రసాతలము.

ఏడు ద్వీపములు, ఏడు స్వర్గములు, ఏడు పాతాళములు. ఈ లోకాలన్నీ బ్రహ్మదేవుని ఆధిపత్యముననున్న బ్రహ్మాండములోనివి.

ఏవం చాzసంఖ్యబ్రహ్మాండం సర్వం కృత్రిమమేవ చ | మహావిష్ణోశ్చ లోమ్నాం చ వివరేషు చ శౌనక || 15

ప్రతివిశ్వేషు దిక్పాలాః బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | సురా నరాదయః సర్వే సంతి కృష్ణస్య మాయయా || 16

బ్రహ్మాండగణనాం కర్తుం న క్షమో జగతాం పతిః | న శంకరో న ధర్మశ్చ న చ విష్ణుశ్చ కే సురాః || 17

సంఖ్యాతుమీశ్వరః శక్తో న సంఖ్యాతుం తథాz పి సః | విశ్వాకాశ దిశాంచైవ సర్వతో యద్యపి క్షమః || 18

కృత్రిమాణి చ విశ్వాని విశ్వస్థాని చ యాని చ | అనిత్యాని చ విప్రేంద్ర స్వప్నవన్నశ్వరాణి చ || 19

వైకుంఠః శివలోకశ్చ గోలోకశ్చ తయోః పరః | నిత్యో విశ్వబహిర్భూ శ్చాత్మాzకాశ దిశో యథా || 20

ఈవిధముగా నున్న అసంఖ్యాకమైన బ్రహ్మాండములు సమస్తము కృత్రిమమైనవి. ఇవి అన్ని శ్రీ మహావిష్ణువు యొక్క రోమకూపములలో ఉన్నవి. ప్రతి విశ్వమునకు ప్రత్యేకముగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు, మానవులు మొదలగువారున్నారు. బ్రహ్మాండముల యొక్క సంఖ్యను లెక్కించుటకు జగత్పతియైన బ్రహ్మదేవునికి, శంకరునికి ధర్మదేవతకు, విష్ణుమూర్తికి సాధ్యంకాదు. మరి దేవతలకు సాధ్యమవుతుందా? కొంతవరకు ఈశ్వరుడు వీటిని లెక్కపెట్టగలడు. ఐనను విశ్వము, ఆకాశము దిక్కులతోనున్న ఈ బ్రహ్మాండములను లెక్కించుటకు అతనికి కూడ సాధ్యంకాదు. ఈ విశ్వములందున్న దేవతలు అందరూ సృష్టించబడినవారు. వీరంతా కలవలె నశింతురు. వైకుంఠము, శివలోకము, ఈ రెండు లోకాల పైభాగాన నున్న గోలోకము ఈ ప్రపంచానికి వెలుపలనున్న ఆత్మ, ఆకాశము, దిక్కులవలె నిత్యమైనవి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి, శౌనక సంవాదే బ్రహ్మఖండే సృష్టినిరూపణం నామ - సప్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి, శౌనక, సంవాద రూపమైన బ్రహ్మఖండమున సృష్టి నిరూపణమనే

ఏడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters