sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రింశత్తమోzధ్యాయః - పాపులు పొందు నరక కుండములు

యమ ఉవాచ- యమధర్మరాజు సావిత్రితో ఇట్లనెను-

హరిసేవారతః శుద్దో యోగీ శుద్దో వ్రతీ సతి | తపస్వీ బ్రహ్మచారీ చ న యాతి నరకం యతిః || 1

కటువాచా బంధవాంశ్చ బలత్వేన చ యో నరః | దగ్ధాన్‌ కరోతి బలవాన్‌ వహ్నికుండం ప్రయాతి సః || 2

గాత్ర లోమప్రమాణఆబ్దం తత్ర స్ధిత్వాహుతాశ##నే | పశుయోనిమవాప్నోతి రౌద్రే దగ్దస్త్రిజన్మని || 3

శ్రీహరి పాదాబ్జములను సంతతము కొల్చువాడు, యోగి, వ్రతములు చేయువాడు, తపస్సు చేయువాడు, బ్రహ్మచారి వీరందరు పరిశుద్దమైన వారు. కావున వారు నరకమునకు ఎన్నడును వెళ్ళరు.

దుష్టుడై బంధువులను కటువైన మాటలతో బాధపెట్టువాడు వహ్నికుండమను నరకమునకు పోవును. అచ్చట తనకు వెంట్రుకలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు బాధపడి మూడుసార్లు పశుజన్మనెత్తును.

బ్రాహ్మణం తృషితం క్షుబ్ధం ప్రతప్తం గృహమాగతం | న భోజయతియో మూఢస్తప్తకుండం ప్రయాతిసః || 4

తత్ర లోమ ప్రమాణాబ్దం స్ధిత్వా తత్ర చ దుఃఖితః | తప్తస్థలే వహ్నికుండే పక్షీ చసప్తజన్మసు || 5

ఎండలో తిరిగినందువలన బాధపడుచు దప్పిగొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు చల్లని నీరిచ్చి భోజనము పెట్టనిచో అతడు తప్తకుండమను నరకమునకు పోవును. అచ్చట తన శరీరముపై ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు బాధలు పడుచు తరువాత ఏడు జన్మల వరకు పక్షిగా జన్మించును.

రవి వారార్క సంక్రాత్యమమాయాం శ్రాద్ధవాసరే | వస్త్రాణాం క్షారసంయోగం కరోతి యోహి మానవః || 6

స యాతి క్షారకుండం చ సూత్రమానాబ్దమేవచ | స వ్రజేద్రాజ కీం యోనిం సప్త జన్మసు భారతే || 7

ఆదివారమున, సూర్యసంక్రమణ దినమున, అమావాస్యనాడు, శ్రాధ్ధము పెట్టు దినమున బట్టలను చవుడు వేసి (లేక సబ్బు పెట్టి ?) ఉతికినచో అతడు తానుతికిన బట్టలలో ఎన్నిదారములున్నవో అన్ని సంవత్సరములు క్షరాకుండమనే నరకమున నుండును. తరువాత ఏడు జన్మలవరకు రజకుడై పుట్టును.

స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః | షష్టి వర్ష సహస్రాణి విట్కుండం చ ప్రయాతి సః || 8

షష్టి వర్ష సహస్రాణి విడ్భోజీ తత్ర తిష్ఠతి | షష్టి వర్ష సహస్రాణి విట్కృమిశ్చ పునర్భువి || 9

తాను దానమిచ్చినది లేక ఇతరులు దానమిచ్చిన బ్రాహ్మణ వృత్తిని ఎవరు హరింతురో వారు అరవై వేల సంవత్సరములు మలకుండమను నరకముననుండి మలమును భుజించుచుందురు. ఆ తరువాత అరవై వేల సంవత్సరముల వరకు మలమును భుజించు క్రిమిగా పుట్టుదురు.

పరకీయ తడాగే చ తడాగం యః కరోతి చ | ఉత్సృజేద్దైవ దోషేణ మూత్రకుండం ప్రయాతి సః || 10

తద్రేణు మానవర్షం చ తద్భోజీ తత్ర తిష్ఠతి | భారతే గోధికా చైవ స భ##వేత్సప్త జన్మసు || 11

ఇతరులు తవ్వించిన చెరువును తనదిగా ప్రకటించుకొనిన వాడు. చెరువులో మూత్రమును వదలినవాడు, తాను విడిచిన మూత్రమును ఎన్ని తుంపరలున్నవో అన్ని సంవత్సరములు మూత్రకుండమను నరకమునకు పోవును. అచ్చట మూత్రమునే ఆహారముగా స్వీకరించును. తరువాత ఏడు జన్మలవరకు ఉడుముగా పుట్టును.

ఏకాకీ మృష్టమశ్నాతి శ్లేష్మకుండం ప్రయాతి సః | పూర్ణమబ్దశతం చైవ తద్భోజీ తత్ర తిష్ఠతి || 12

పూర్ణమబ్ద శతం చైవ సప్రేతో భారతే భ##వేత్‌ | శ్లేష్మ మూత్ర గరం చైవ పూయం భుంక్తే తతః శుచిః || 13

ఒంటరిగా మృష్టాన్నమును తినినచో నూరు సంవత్సరములు శ్లేష్మకుండమను నరకముననుండి శ్లేష్మమును తినుచుండును. తరువాత నూరు సంవత్సరములు ప్రేతగానుండి శ్లేషమును, మూత్రమును, రసిని తినుచుండును.

పితరం మాతరం చైవ గురుం భార్యాం సుతం సుతాం | యోన పుష్ణాత్యనాథంచ గరకుండం ప్రయాతి సః || 14

పూర్ణమబద్దసహస్రం చ తద్భోజీ తత్రతిష్టతి | తతో వ్రజేద్భూత యోనిం శతవర్షం తతః శుచిః || 15

తల్లి దండ్రులను, గురువులను, భార్యను, తన సంతానమును, అనాథలను పోషింపనివాడు గరళకుండమను నరకమునకు వెళ్ళును. అచ్చట వేయి సంవత్సరములుండి తిరిగి జన్మనెత్తినను భూతమై నూరు సంవత్సరములుండును. ఆ తరువాత ఇతర జన్మల పొందును.

దృష్ట్యాతిథిం వక్రచక్షః కరోతి యోహి మానవః | పితృదేవాస్తస్య జలం న గృహ్ణంతి చ పాపినః || 16

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | ఇహైవ లభ##తే చాంతే దూషికా కుండమావ్రజేత్‌ || 17

పూర్ణమబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి | తతో నరో భ##వేద్భూమౌ దరిద్రః సప్తజన్మసు|| 18

ఇంటికి అతిథిరాగా అతనిని నిరాదరణ చేసిన పాపి చేసిన పితృతర్పణమును, పితృదేవతలు స్వీకరింపరు. పైగా అతనికి బ్రహ్మహత్యాది పాపములు చుట్టుకొనును. అతడు చనిపోయిన తరువాత దూషికాకుండమను నరకమును నూరు సంవత్సరములుండి తిరిగి మానవుడై పుట్టినను దరిద్రుడగును. ఇట్లు ఏడు జన్మలవరకు దరిద్రముననుభవించుచుండును.

దత్వా ద్రవ్యం చ విప్రాయ చాన్యసై#్మ దీయతే యది | స తిష్ఠతి వసాకుండే తద్భోజీ శతవత్సరం || 19

తతో భ##వేత్స చండాల స్త్రిజన్మని తతః శుచిః | కృకలాసో భ##వేత్సోzపి భారతే సప్తజన్మసు || 20

బ్రహ్మణునకు దానము చేసిన ధనమును తిరిగి తీసికొని ఇతరులకిచ్చినచో అతడు నసాకుండమను నరకమును నూరు సంవత్సరములుండును. తరువాత మూడు జన్మల వరకు రచండాలుడై పుట్టి ఆ తర్వాత ఏడు జన్మల వరకు తొండయై పుట్టును.

పుమాంసం కామినీవాపి కామినీం వా పుమానథ | యః శుక్రం పాయయత్యేవ శుక్రకుండం ప్రయాతి సః || 21

పూర్ణమబ్దశతం చైవ తద్భోజీ తత్ర తిష్ఠతి | యోనికృమిః శతాబ్దం చ భ##వేద్భువి తతః శుచిః || 22

స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధమున్నచో వారిద్దరు శుక్రకుండమను నరకమునకు పోయి, అచ్చట నూరు సంవత్సరములు బాధపడి, భూమిపై యోని క్రిమిగా నూరుసంవత్సరములవరకుందురు.

సం తాడ్య గురుం విప్రం రక్తపాతం చ కారయేత్‌ | స చ తిష్ఠత్యసృక్కుండే తద్భోజీ శతవత్సరం || 23

తతో భ##వేత్‌ వ్యాధజన్మ సప్తజన్మసు భారతే | తతః శుద్ధి మవాప్నోతి మానవశ్చ క్రమేణ చ || 24

బ్రహ్మడగు గురువును రక్తము కారునట్లు కొట్టినవాడు రక్తకుండమను నరకమున నూరు సంవత్సరములు బాధపడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు వ్యాధుడై పుట్టును.

అశ్రు స్రవంతం గాయంతం భక్తం దృష్ట్యా చ గద్గదం | శ్రీ కృష్ణ గుణ సంగీతే హసత్యేవ హి యో నరః || 25

స వసేదశ్రు కుండే చ తద్భోజీ శతవత్సరం | తతో భ##వేత్స చండాలస్త్రిజన్మని తతః శుచిః || 26

శ్రీకృష్ణుని గుణ కీర్తనమును గద్గదకంఠముతో, ఆనందబాష్పములతో చేయుచున్న భక్తుని చూచి నవ్వినచో (వెక్కిరించినచో) అతడు నూరు సంవత్సరములు అశ్రుకుండమను నరకమునకు పోవును. తరువాత మూడు జన్మలవరకు చండాలుడై పుట్టును.

కరోతి ఖలతాం శశ్వదశుద్ధహృదయో నరః | కుండం గాత్రమాలానాం చ సచ యాతి దశాబ్దకం || 27

తతః స గర్దభీయోనిమవాప్నోతి త్రిజన్మని | త్రిజన్మనిచ శార్గాలీం తతః శుద్దోభ##వేద్ద్రువం || 28

చెడు భావనతో ఇతరులపట్ల దురుసుగా ప్రవర్తించువాడు పదిసంవత్సరములు గాత్ర మలకుండమున నివసించును. ఆ తరువాత మూడు జన్మలు గాడిదగా, మూడు జన్మలు నక్కగా పుట్టును.

బధిరం యో హసత్యేవ నిందత్యేవహి మానవః | స వసేత్కర్ణవిట్కుండే తద్భోజీ శతవత్సరం || 29

తతో భ##వేత్సబధిరో దరిద్రః సప్తజన్మసు | సప్తజన్మస్వంగహీనస్తతః శుద్దిం లభేత్‌ ధ్రువం || 30

చెవిటి వానిని చూచి వెక్కి%ించినచో, అతడు నూరు సంవత్సరములు కర్ణమల నరకమున నుండును తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడై చెవిటివాడుగా పుట్టును. ఆ తరువాత ఏడు జన్మలవరకు అంగహీనుడై జన్మించును.

లోభాత్‌ స్వపాలనార్ధాయ జీవనం హంతి యో నరః | మజ్జాకుండే వసేత్సోzపి తద్భోజీ లక్షవర్షకం || 31

తతో భ##వేత్సశశకో మీనశ్చ సప్త జన్మసు | ఏణాదయశ్చ కర్మభ్యః తతః శుద్దిం లభేత్‌ ధ్రువం || 32

ఆశ వలననో , తన కడుపుకొరకో ఇంకొక ప్రాణిని చంపినచో అతడు "మజ్జాకుండ' మను నరకమున లక్ష సంవత్సరములుండును. అటు పిమ్మట ఏడేడు జన్మల వరకు కుందేలుగా, చేపగా, లేడిగా జన్మించుచుండును.

స్వకన్యా పాలనం కృత్వా విక్రీణాతి హియోనరః | అర్ధలోభాన్మహామూఢో మాంసకుండం ప్రయాతి సః || 33

కన్యాలోమ ప్రమాణాబ్దం తద్భోజీ తత్ర తిష్ఠతి | తం చ కుండే ప్రహారం చ కరోతి యమకింకరః || 34

కూతురును కని, పెంచి కన్యాశుల్కమును తీసికొని వివాహము చేయువాడు మాంసకుండమను నరకమునకు పోవును. అచ్చట తాను శుల్కము తీసికొన్న కన్య శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో, అన్ని సంవత్సరములు యమకింకరులచే బాధలనందుచుండును.

మాంసభారం మూర్ధ్ని కృత్వా రక్తధారాం లిహేత్‌క్షుధా | తతో హి భారతే పాపీ కన్యావిట్సు క్రిమిర్భవేత్‌ || 35

షష్టివర్ష సహస్రాణి వ్యాధశ్చ సప్తజన్మసు | త్రిజన్మని వరాహశ్చ కుక్కురః సప్తజన్మసు || 36

సప్తజన్మసు మండూకోజలౌకాః సప్తజన్మసు | సప్తజన్మసు కాకశ్చ తతః శుద్ధిం లభేత్‌ ధ్రువం || 37

తలపై మాంసమును పెట్టుకొని మోసికొని పోవుచున్నప్పుడు ఆకలివల్లనైనా ఆ మాంసమునందలి రక్తమును నాకినచో ఆపాపి అరవై వేల సంవత్సరములు అశుద్దములో క్రిమిగా నుండును. ఆ తరువాత ఏడు జన్మలు వ్యాధుడు కాగా మూడు జన్మలు పందిగను, ఏడుజన్మలు కుక్కగను, ఏడుజన్మలు కప్పగను. ఏడు జన్మలు జలగగను, ఏడు జన్మలు కాకిగను పుట్టి ఆ తరువాత పరిశుద్దుడగును.

వ్రతానాముపవాసానాం శ్రాద్ధాదీనాం చ సంయమే | న కరోతి క్షౌరకర్మ సోZశుచిః సర్వకర్మసు || 38

సచ తిష్ఠతి కుండేషు నఖాదీనాం చ సుందరి | తదేవ దినమానాబ్దం తద్భోజీ దండ తాడితః|| 39

వ్రతదినములలో, ఉపవాస దినములలో, శ్రాద్దాది దినములలో నియముగా ఉండవలసిన దినములలో క్షౌరము చేసికొనినచో అతడు అన్ని సంవత్సరములు నఖకుండమను నరకమున యమభటులు దండించుచుండగానుండును.

సకేశం పార్ధివం లింగం యోవాZర్చయతి భారతే | సతిష్ఠతి కేశకుండే మృద్రేణుమానవర్షకం || 40

తదంతే యావనీం యోనిం ప్రయాతి హర కోపతః | శతాబ్దాత్‌ శుద్దిమప్నోతి స్వకులం లభ##తే ధ్రువం || 41

పార్ధివ లింగముపై కేశము పడినను గమనించక పూజ చేయువాడు కేశకుండమను నరకమున ఆ పార్ధివ లింగమున నెన్నిరేణువులున్నవో అన్ని సంవత్సరములు ఉండును. ఆ తరువాత పరమ శివుని కోపమువలన నూరు సంవత్సరములు యవనుడుగా పుట్టును.

పితృణాం యో విష్ణుపదే పిండం నైవ దదాతి చ | స తిష్ఠత్యస్ధికుండే చ స్వలోమాబ్దం మహోల్బణ || 42

తతః స్వయోనిం సంప్ర్ప్య ఖంజః సప్తమ జన్మసు | భ##వేన్మహాదరిద్రశ్చ తతః శుద్దో హి దండతః || 43

విష్ణుస్ధానమైన గయా క్షేత్రమున పితృదేవతలకు పిండము పెట్టనివాడు తన శరీరమున ఎన్ని వెంట్రుకలున్నచో అన్ని సంవత్సరములు అస్ధికుండమున యమ బాధలు పడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు కాటుక పిట్టగా జన్మించును. తరువాత మానవ జన్మనెత్తినను దరిద్రుడగును.

యః సేవతే మహామూడో గుర్విణీం చ స్వకామినీం | ప్రతప్త తామ్రకుండే చ శతవర్షం స తిష్ఠతి || 44

గర్భవతియగు తన భార్యతో సంభోగము చేయువాడు సలసలమరుగుచున్న తామ్ర కుండమను నరకమున నూరు సంవత్సరములుండును.

అవీరాన్నం చ యో భుంక్తే ఋతుస్నాతాన్నమేవచ | లౌహ కుండే శతాబ్దం చ సచ తిష్ఠతి తప్తకే || 45

సవ్రజేద్రాజకీం యోనిం కర్మకారీం చ సప్తసు | మహావ్రణీ దరిద్రశ్చ తతః శుద్దో భ##వేన్నరః || 46

సంతానము లేక విధవయైన స్త్రీ (అవీర) లేక ఋతుస్నాతయైన స్త్రీ చేతి అన్నమును తిన్నచో సలసలమరుగుచున్న లోహకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. ఆతరువాత ఏడు జన్మలు రజకుడుగా, ఏడు జన్మలు కమ్మరిగా పుట్టును. ఆ జన్మలలో అతడు అనేక వ్రణములతో బాధపడుచు దరిద్రుడగును.

యో హి ఘర్మాక్త హస్తేన దేవద్రవ్యముపస్పృశేత్‌ | శతవర్ష ప్రమాణం చ ఘర్మకుండే స తిష్ఠతి ||47

చెమటపట్టిన చేతులతో దేవ పూజా ద్రవ్యములను ముట్టుకొనినచో నూరు సంవత్సరముల వరకు ఘర్మకుండమను నరకమున ఉండును.

యఃశూద్రేణాZభ్యనుజ్ఞాతో భుంక్తే శూద్రాన్నమేవ చ | స చ తప్తసురాకుండే శతాబ్దం తిష్ఠతి ద్విజః || 48

తతో భ##వేత్‌ శూద్రయాజీ బ్రహ్మణః సప్తజన్మసు | శూద్ర శ్రాద్ధాన్నభోజీ చ తతః శుద్ధో భ##వేత్‌ ధ్రువం || 49

బ్రాహ్మణుడు శూద్రుని ఇంటిలో భోజనము చేసినచో అతడు తప్త సురాకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. తరువాత ఏడు జన్మలవరకు అతడు శూద్రుల ఇండ్లలో పూజా పునస్కారములు చేయుచు శూద్రుల ఇండ్లలో శ్రాద్ధాన్నమును ఏడు జన్మలవరకు తినును.

వాగ్దుష్టా కటువాచా యా తాడయేత్‌ స్వామినం సదా | తీక్ష కంటక కుండే సా తబ్భోజీ తత్ర తిష్ఠతి || 50

తాడితా యమదూతేన దండేన చ చతుర్యుగం | తత ఉచ్చైః శ్రవాః సప్త జన్మస్వేవ తతః శుచిః || 51

కటువుగా మాటాడుచు భర్తను ఎల్లప్పుడు పీడించు స్త్రీ తీక్షణకంటకకుండమను నరకమున నాల్గు యుగములవరకు యమదూతలచే బాధలు పెట్టబడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు గుఱ్ఱముగా పుట్టుచుండును.

విషేణ జీవనం హంతి నిర్దయో యో హి పామరః | విషకుండే చ తద్భోజీ సహస్రాబ్దం చ తిష్ఠతి || 52

తతో భ##వేన్నృఘూతీ చ వ్రణీ ప్యా త్సప్త జన్మసు | సప్త జన్మసు కుష్ఠీచ తతః శుద్దో భ##వేత్‌ ధ్రువం || 53

దయారహితుడై విషము పెట్టి చంపిన వాడువేయి సంవత్సరములు విషకుండమను నరకమున విషమును తినుచుండును. తరువాత మానవ జన్మనెత్తినను, మానవులను బాధపెట్టుచు, ఏడు జన్మలవరకు మహావ్రణములతోను, ఏడు జన్మలవరకు కుష్ఠురోగముతోను బాధపడును.

దండేన తాడయేద్యోహి వృషం చ వృషవాహకః | భృత్యద్వారా స్వతంత్రోవా పుణ్యక్షేత్రే చ భారతే || 54

ప్రతప్త తైలకుండే చ సతిష్ఠితి చతుర్యుగం | గవాం లోమ ప్రమాణాబ్దం వృషోభవతి తత్పరం || 55

భారతవర్షమునందలి పుణ్యక్షేత్రములలో ఎడ్లనెక్కిపోవువాడు తాను కాని అతని సేవకులు గాని ఎడ్లను కొట్టరాదు. అట్లు చేసినచో అతడు ప్రతప్త తైలకుండమున నాలుగు యుగములుండును. ఆ తర్వాత అతడు ఎద్దుగా జన్మనెత్తును.

కుంతేన హంతి జీవం యో లౌహేన బడిశేన వా | కుంతకుండే వసేత్సోZపి వర్షాణామయుతం సతి || 56

తతః స్వయోనిం సంప్రాప్య చోదరవ్యాధి సంయుతః | క్లిష్టేన జన్మనైకేన తతః శుద్ధో భ##వేన్నరః || 57

ప్రాణులను లోహముచే చేయబడిన వస్తువులచే హింసించువాడు పదివేల సంవత్సరములు కుంతకుండమను నరకమున నివసించును. తిరిగి మానవ జన్మనెత్తినను జీవితాంతము కడుపు నొప్పిచే బాధపడుచుండును.

యో భుంక్తే చ వృధా మాంసం మత్స్యభోజీ చ బ్రాహ్మణః | హరేరనైవేద్యభోజీ కృమికుండం ప్రయాతి సః || 58

స్వలోమమానవర్షం చ తద్భోజీ తత్ర తిష్ఠతి | తతో భ##వేన్ల్మేచ్ఛ జాతిః త్రిజన్మని తతో ద్విజః || 59

మాంసమును, శ్రీమన్నారాయణునకు నివేదింపని పదార్ధమును తిను బ్రాహ్మణుడు క్రిమి కుండమను నరకమునకేగును. అతని శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు అచ్చట బాధపడి తిరిగి భూలోకమున మానవుడై జన్మించినపుడు మూడు జన్మలవరకు వ్లుెచ్ఛుడై పుట్టును.

బ్రాహ్మణః శూద్రయాజీ యః శూద్రశ్రాద్ధాన్నభోజకః | శూద్రాణాం శవదాహీ చ పూయకుండం వ్రజేత్‌ ధ్రువం || 60

యావల్లోమ ప్రమాణాబ్దం యజమానస్య సువ్రతే | తాడితో యమదూతేన తద్భోజీ తత్ర తిష్ఠతి || 61

తతో భారతమాగత్య స శూద్రః సప్తజన్మసు | మహాశూలీ దరిద్రశ్చ తతః శుద్ధః పునర్ధ్విజః || 62

శూద్రులచే పూజలు చేయించువాడు, లేక శూద్రుల శ్రాద్ధాన్నమును భుజించువాడు లేక శూద్రుల శవములను దహించు బ్రాహ్మణులు పూయకుండమను నరకమునకు వెళ్ళుదురు. ఆ నరకములో ఆ శూద్రుని శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు యమదూతలచే బాధలనందుచు, రసిని భక్షించుచుందురు. ఆ తరువాత భారత వర్షమున ఏడు జన్మలవరకు శూద్రులై పుట్టుదురు. అప్పుడు కూడ మహాదరిద్రులై శరీమమునందంతట శూలబాధననుభవించుచుందురు.

లఘుం క్రూరం మహాంతం వా సర్పం హంతి చ యోనరః | స్వాత్మలోమ ప్రమాణాబ్దం సర్పకుండం ప్రయాతి సః || 63

సర్పేణ భక్షితః సోZపి యమదూతేన తాడితః వసేచ్చ సర్పవిట్‌ జీవీ తతః సర్పో భ##వేత్‌ ధ్రువం || 64

తతో భ##వేన్మనవశ్చప్యల్పాయుః దద్రు సంయుతః | మహాక్లేశేన తన్మృత్యుః సర్పేణ చ భ##వేత్‌ ధ్రువం || 65

చిన్నదైనను, పెద్దదైనను, మిక్కిలి క్రూరమైనదైనను సర్పమును చంపినచో తన శరీరము ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు సర్పకుండమను నరకమున సర్పములు కరచుచుండగా, యమదూతలు బాధ పెట్టగా సర్పమలమును భక్షించుచుండును. తరువాత అతడు సర్పజన్మమునే ఎత్తును. తరువాత మానవ జన్మనెత్తినను దద్దురులతో బాధపడుచు అల్పాయుష్కుడై సర్పముచేతనే మరణమునొందును.

విధిం ప్రకల్ప్య జీవంశ్చ క్షుద్ర జంతూంశ్చ హంతి యః స దంశ మశ##కేకుండే జన్మమానదినాబ్దికం || 66

దివాZనిశం భక్షితసైః అనాహార్శశ్చ శబ్దకృత్‌| బద్ధ హస్త పదాదిశ్చ యమదూతేన తాడితః || 67

తతో భ##వేత్‌ క్షుద్రజంతుః జాతిర్వై యావతీ స్మృతా | తతో భ##వేన్మానవశ్చ సోZంగహీనస్తతః శుచిః || 68

ఒక ఉపాయమును పన్ని క్షుద్రజంతువులను చంపువాడు దంశమశక కుండమను నరకమున ఆహారములేక, ఆ జంతువులు రాత్రింబగళ్ళు తినుచుండగా యమదూతలు బాధపెట్టగా నరక యాతనలనుభవించును. తరువాత క్షుద్రజంతువుగా పుట్టి అటు పిమ్మట అంగహీనుడై బాధలు చెందగలడు.

యో మూఢో మధుగృహ్ణాతి హత్వా చ మధుమాక్షికాః | స ఏవ గరళే కుండే జీవమాన దినాబ్దికం || 69

భక్షితో గరళైర్దగ్దో యమదూతేన తాడితః | తతో హి మక్షికాజాతిః సతతః శుద్దో భ##వేన్నరః || 70

తేనేటీగలను చంపి తేనెను సంగ్రహించువాడు గరళకుండమను నరకమునకు పోవును. అచ్చట అతడు యమదూతలు బాధలు పెట్టుచుండగా విషమును తినుచు జీవించును. నరకయాతనలనుభవించి భూలోకమున తిరిగి జన్మించినప్పుడు తాను కూడా తేనేటీగగా జన్మించి బాధలననుభవించును.

దండం కరోత్యదండ్యే చ విప్రే దండం కరోతి చ | సకుండం వజ్రదంష్ట్రాణాం కీటానాం వై ప్రయాతి చ || 71

తల్లోమమాన వర్షం చ తత్ర తిష్ఠత్యహర్నిశం | శబ్దకృద్భక్షితసై#్తశ్చ తతః శుద్దో భ##వేన్నరః || 72

తప్పు చేయని బ్రాహ్మణుని దండించినవాడు వజ్రదంష్ట్ర కీటకుండమను నరకమునకు పోవును. అచ్చట ఆ పురుగులు చప్పుడు చేయుచు అతనిని తినుచుండును.

అర్ధలోభేన యోభూపః ప్రజాదండం కరోతి చ | వృశ్చికానాం చ కుండేషు తల్లోమాబ్దం వసేత్‌ ధ్రువం || 73

తతో వృశ్చిక జాతిశ్చ సప్తజన్మసు జాయతే | తతో నరశ్చాంగహీనో వ్యాధియుక్తో భ##వేత్‌ ధ్రువం || 74

పరిపాలకుడు ధనము నాశించి ప్రజలను దండించినచో అతడు వృశ్చిక కుండమునకు పోవును. తరువాత ఏడు జన్మలవరకు వృశ్చికమై పుట్టి తరువాత జన్మలో మానవుడై పుట్టినను అవయవహీనుడై రోగములతో బాధలు పడును.

బ్రాహ్మణః శస్త్రధారీ యోహ్యన్యేషాం ధావకో భ##వేత్‌ | సంధ్యా హీనశ్చ మూఢశ్చ హరిభక్తి విహీనకః || 75

స తిష్ఠతి స్వలోమాబ్దం కుండాదిషు శరాదిషు | విద్ధః శరాదిభిః శశ్వత్తతః శుద్దో భ##వేన్నరః || 76

శస్త్రాస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకృత్యములను, హరిభక్తిని వదులుకున్న బ్రాహ్మణుడు, అతని శరీరమున ఎన్ని రోమములున్నవో అన్ని సంవత్సరములు శరకుండమను నరకమున నివసించును. అచట బాణములచే బాధలు పడును.

కారాగారే సాంధకారే నిబధ్నాతి ప్రజాశ్చ యః | ప్రమత్తః స్వల్ప దోషేణం గోలకుండం ప్రయాతి సః || 77

తత్కుండం తప్తతోయాక్తం సాంధకారం భయంకరం | తీక్షదం ష్టైశ్చ కీటైశ్చ సంయుక్తం గోళకుండకం || 78

కీటైర్విద్దో వసేత్తత్ర ప్రజాలోమాబ్దమేవచ | తతో భ##వేన్నీచ భృత్యస్తతః శుద్ధో నరో భువి || 79

చిన్న తప్పుకై ప్రజలను అంధకారబంధురమైన కారగారమున వేసి బాధించు నాయకుడు గోళకుండమను నరకమునకు పోవును. ఆ గోళకుండము సలసల కాగుచున్న నీటితో, చిమ్మ చీకటితో మహాభయంకరమై యుండును. అచ్చట వాడియైన కోరలు గల కీటకములనేకముండును.

ఆ గోళకుండమున భయంకరమైన కీటకములచే బాధలననుభవించి మానవ జన్మనెత్తినను సాధారణ భృత్యుడై పుట్టును.

సరోవరాదుత్థితాంశ్చ నక్రాదీన్‌ హంతి యః సతి | నక్రకంటక మానాబ్దం నక్రకుండం ప్రయాతి సః || 80

తతో నక్రాది జాతిశ్చ భ##వేన్నద్యాషు ధ్రువం | తతః సద్యో విశుద్దో హి దండేనైవ నరః పునః || 81

చెరువులలో, నదులలో నున్న మొసళ్ళు మొదలగు జలజంతువులను చంపువాడు ఆ జలజంతువులకున్న ముళ్ళ సంఖ్య గల సంవత్సరములు నక్రకుండమను నరకమునకు పోయి బాధననుభవించి తరువాత జన్మలో తాను కూడ నదులు మొదలగు స్ధలములందు మొసలి మొదలగు జాతులలో పుట్టి తిరిగి బాధలననుభవించును.

వక్షఃశ్రోణ్‌%ీస్తనాస్యం చ యః పశ్యతి పరస్త్రియాః | కామేన కాముకో యో హి పుణ్యక్షేత్రే చ భారతే || 82

స వసేత్కాక కుండం చ కాకైశ్చ క్షణ్ణలోచనః | తతః స్వలోమమానాబ్దం తతశ్చాంధ స్త్రిజన్మని || 83

సప్త జన్మ దరిద్రశ్చ మహాక్రూరశ్చ పాతకీ | భారతే స్వర్ణకార్శ్చ స చ స్వర్ణవణిక్తతః || 84

పుణ్యక్షేత్ర సందర్శనము చేయుచున్నప్పుడు అచ్చటకు వచ్చు పరస్త్రీల అందచందములను చూచి మోహపరవశుడై పోవువాడు కాకుండమను నరకమునకు పోవును. అచ్చట కాకులు కండ్లను పొడుచుచుండగా బాధలుపడుచుండును. తరువాత మూడు జన్మల వరకు గుడ్డివాడుగా పుట్టును. తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడుగను, మిక్కిలి క్రూరుడుగను పాపాత్ముడగను పుట్టును. ఆ తరువాత స్వర్ణకారుడగను. అటుపిమ్మట బంగారువర్తకము చేయువాడుగాను పుట్టును.

యో భారతే తామ్రచోరో లోహచోర్శ్చ సుందరి | స స్వలోమప్రమాణాబ్దం వజ్రకుండం ప్రయాతి వై || 85

తత్త్రెవ వజ్రవిడ్భోజీ వజ్రైశ్చ క్షణ్ణలోచనః | తాడితో యమదూతేన తతః శుద్ధో భ##వేన్నరః || 86

ఈ భారత దేశమున తామ్ర (రాగి) మొదలగు లోహములను దొంగిలించువాడు వజ్రకుండమను నరకమునకు పోవును. అచ్చట యమదూతల బాధలననుభవించి తిరిగి భూలోకమున జన్మించును.

భారతే దేవచోరశ్చ దేవద్రవ్యాదిహార : | సుదుష్రరే వజ్రకుండే స్వలోమాబ్దం వసేతే ధ్రువం || 87

దేహదగ్ధో హి తద్వజ్రైరనాహారశ్చ శబ్దకృత్‌ | తాడితో యమదూతేన తతః శుద్దో భ##వేన్నరః || 88

భారత దేశమున దేవతా విగ్రహములను దేవతా ద్రవ్యములను అపహరించువాడు వజ్రకుండనరకమున వజ్రముల రాపిడిచే శరీరమంతయు కాలగా, ఆహారములేక, యమదూతలు బాధలు పెట్టుచుండగా హాహాకారములు చేయుచుండును.

రౌప్య గవ్యాంశుకానాం చ యశ్చోరః సురవిప్రయోః | తప్తపాషాణ కుండే చ స్వలోమాబ్దం వసేత్‌ ధ్రువం || 89

త్రిజన్మని బకః సోZపి శ్వేతహంసస్త్రిజన్మని | జన్మైకం శంఖచిల్లశ్చ తతోZన్యే శ్వేత పక్షిణః || 90

తతో రక్త వికారీ చ శూలీవై మానవో భ##వేత్‌ | సప్త జన్మసు చాల్సాయుః తతః శుద్దో భ##వేన్నరః || 91

దేవతలయొక్క బ్రాహ్మణుల యోక్క ధనమును, ఆవులను వాటికి చెందినవానిని, బట్టలను దొంగిలించినవాడు తప్త పాషాణకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత మూడు జన్మలవరకు కొంగగాను, మూడు జన్మలవరకు హంసగాను, ఒక జన్మ తెల్లగద్దగాను, ఇంకొక జన్మలో తెల్లని ఇతర పక్షిగా జన్మనెత్తును. ఆటుపిమ్మట మానవ జన్మనెత్తినప్పుడు ఏడు జన్మలవరకు కడుపునొప్పితో అల్పాయుష్కుడై పుట్టును.

రైత్యకాంస్యాది పాత్రం చ యోహరేత్సురవిప్రయోః | తీక్ష పాషాణ కుండే చ స్వలోమాబ్దం వసేత్‌ ధ్రువం || 92

స భ##వేదశ్వ జాతిశ్చ భారతే సప్తజన్మసు | తతోZధికాంగయుక్తశ్చ పాదరోగీ తతః శుచిః || 93

దేవ బ్రాహ్మణుల యొక్క పాత్రాది ద్రవ్యమును అపహరించువాడు తీక్షణ పాశాణకుండమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత ఏడుజన్మలవరకు గుఱ్ఱముగా పుట్టును. అటు పిమ్మట మానవుడై పుట్టినను పొడవైన అవయవములతో, పాదములకు వచ్చిన రోగముతో బాధలు చెందును.

పుంశ్చల్యన్నం చ యోభుంక్తే పుంశ్చలీ జీవ్య జీవనః | స్వలోమ మానవర్షం చ లాలా కుండే వసేత్‌ ద్రువం || 94

తాడితో యమదూతేన తద్భోజీ తత్ర తిష్ఠతి | తతశ్చక్షుశ్శూలరోగీ తతః శుద్ధః క్రమేణ సః || 95

వ్యభిచరించు స్త్రీ పెట్టిన అన్నమును భుజించువాడు, ఆ స్త్రీ వలన జీవించువారిని ఆశ్రయించుకొన్నవాడు లాలకుండమనునరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. తరువాత మానవుడై జన్మించినను కంటిరోగము, శూలరోగమువంటి రోగములచే బాధలు పడును.

వ్లుెచ్ఛసేవీ మషీజీవీ యో విప్రోభారతేభువి | స చ తప్త మషీకుండే స్వలోమాబ్దం వసేత్‌ ధ్రువం || 96

తాడితో యమదూతేన తద్భోజీ తత్ర తిష్టతి | తతస్త్రిజన్మని భ##వేత్‌ కృష్ణవర్ణః పశుః సతి || 97

త్రిజన్మని భ##వేచ్ఛాగః కృష్ణ సర్పస్త్రిజన్మని | తతశ్చ తాళవృక్షశ్చ తతః శుద్దో భ##వేన్నరః || 98

వ్లుెచ్ఛులను (అభారతీయులను) సేవించువాడు, లేఖనముద్వారా బ్రతుకు బ్రాహ్మణుడు తప్తమషీకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలనొందుచుండును. ఆ తర్వాత మూడు జన్మలవరకు నల్లని రంగుగల పశువుగా మారును. తరువాత మూడు జన్మల వరకు గొఱ్ఱగా పుట్టును. ఆ పైన మూడు జన్మల వరకు నల్లని త్రాచై పుట్టును. అటు పిమ్మట తాటిచెట్టుగా పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తును.

ధాన్యాది సస్యం తాంబూలం యోహరేత్సుర విప్రయోః | ఆసనం చ తథా తల్పం చూర్ణ కుండం ప్రయాతి సః || 99

శతాబ్దం తత్ర నివసేద్యమ దూతేన తాడిత| తతో భ##వేన్మేషజాతిః కుక్కుటశ్చ త్రిజన్మని || 100

తతో భ##వేన్మానవశ్చ కాసవ్యాధియుతో భువి | వంశహీనో దరిద్రశ్చాప్యల్పాయుశ్చ తతః శుచిః || 101

దేవతలయొక్క బ్రాహ్మణుల యొక్క ధాన్యము మొదలగు వానిని, ఆసనమును, శయ్యను అహరించినవాడు చూర్ణకుండమను నరకమునకు పోవును. అచ్చట వందలకొలది సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. అటుపిమ్మట మూడు జన్మలవలకు మేకగాను, తరువాత మూడు జన్మలవరకు కోడిగాను జన్మించును. అటుపిమ్మట మానవుడై పుట్టినను శ్వాసకోశవ్యాధితో బాధపడుచు దరిద్రుడై అల్పాయుష్కుడై వంశహీనుడగును.

చక్రం కరోతి విప్రాణాం హృత్వా ద్రవ్యం చ యోనరః | స వసేచ్చక్ర కుండే చ శతాబ్దం దండతాడితః || 102

తతో భ##వేన్మానవశ్చ తైలకార స్త్రిజన్మని | వ్యాధి యుక్తో భ##వేద్రోగీ వంశహీనస్తతః శుచిః || 103

బ్రహ్మణుల ధనమునపహరించి చక్రము చేయించుకొనువాడు నూరు సంవత్సరముల వరకు చక్ర కుండమను నరకమున యమభటులచే దండింపబడును. తరువాత మూడు జన్మలవరకు తైలకారు (గానుగవారు) డుగా జన్మించును. అప్పుడు రోగములచే బాధలు పడుచు సంతానము లేని వాడగను.

బాంధవేషు చ విప్రేషు కురుతే వక్రతాం నరః | ప్రయాతి వజ్రకుండం చ వసేత్తత్ర యుగం సతి || 104

తతో భ##వేత్స వక్రాంగో హీనాంగః సప్తజన్మసు | దరిద్రో వంశహీనశ్చ భార్యాహీనస్తతః శుచిః || 105

బంధువులు లేక బ్రాహ్మణులు ఇంటికి రాగా వారిని చిన్న చూపుతో చూచువాడు వజ్రకుండమనే నరకములో ఒక యుగకాలముండును. తరువాత అతడు మానవుడై పుట్టినను ఏడు జన్మల వరకు కురూపిగను, అవయవ హీనుడుగను, దరిద్రుడుగను, సంతానరహితుడుగను, భార్యాహీనుడుగను ఉండును.

శయనే కూర్మ మాంసం చ బ్రాహ్మణో యో హి భక్షతి | కూర్మకుండే వసేత్సోZపి శతాబ్దం కూర్మ భక్షితః || 106

తతో భ##వేత్కూర్మజన్మ త్రిజన్మని చ సూకరః | త్రిజన్మని బిడాలశ్చ మయూరశ్చ త్రి జన్మని || 107

బ్రాహ్మణుడు తాబేటి మాంసమును తినినచో నూరు సంవత్సరముల వరకు కూర్మకుండమను నరకమునుకు పోవును. అచ్చట ప్రతిదినము తాబేళ్ళు అతని శరీరమును భక్షించుచుండును. తరువాత భూలోకమున మూడు జన్మలవరకు తాబేలుగను, మూడు జన్మలవరకు పందిగను, మూడు జన్మలవరకు పిల్లిగను, అటుపిమ్మట మూడు జన్మల వరకు నెమలిగను జన్మించును.

ఘృత తైలాదికం చైవ యోహరేత్సుర విప్రయోః | జ్వాలకుండం స వైయాతి భస్మకుండం చ పాతకీ || 108

తత్రస్థిత్వా శతాబ్దం చ సభ##వేత్తైల పాయికః | సప్తజన్మసు మస్స్యఃస్యాత్‌ మూషకశ్చ తతః శుచిః || 109

దేవ బ్రాహ్మణులకు చెందిన నేతిని, నూనెను అపహరించినవాడు జ్వాలాకుండము, భస్మకుండమను నరకములకు పోవును. అచ్చట నూరు సంవత్సరములవరకు యమభటులచే బాధలననుభవించును. ఆతరువాత బొద్దింకగా, చేపగా, ఎలుకగా ఏడేడు జన్మలనందును.

సుగంధితైలం ధాత్రీం చ గంధ ద్రవ్యం తథైవ వా | భారతే పుణ్య వర్షేచ యోహరేత్సుర విప్రయేః|| 110

వసేద్దుర్గంధ కుండే చ దుర్గంధం చ లభేత్సదా | స్వలోమమానవర్షం చ తతో దుర్గంధికో భ##వేత్‌ || 111

దుర్గంధికః సప్తజనౌ మృగనాభిస్త్రిజన్మని | సప్తజన్మ సుగంధిశ్చ తతో వై మానవో భ##వేత్‌ || 112

పవిత్రమైన ఈ భారతవర్షమున దేవ బ్రాహ్మణులకు సంబంధించిన సుగంధి వేరునుండి తీసిన నూనెను, భూమిని, సుగంధ ద్రవ్యమును అపహరించువాడు, దుర్గంధ కుండములో చాలా సంవత్సరములు దుర్గంధమును అనుభవించుచుండును. అటు తరువాత ఏడు జన్మల వరకు దుర్గంధమునిచ్చు వస్తువుగను, మూడు జన్మలు కస్తూరిగను, ఏడు జన్మలవరకు సుగంధిపాల వేరుగను జన్మనెత్తి తరువాత మానవుడగను.

బలేనైవ ఖలత్వేన హింసా రూపేణ వా సతి | బలీ చ యో హరేద్భూమిం భరతే పర సైతృకీం || 113

స వసేత్తప్త శూలే చ భ##వేత్తప్తో దివాZనిశం | తప్తతైలే యథా జీవో దగ్ధో భ్రమతి సంతతం || 114

భస్మసాన్నభవత్యేవ భోగ దేహో న నశ్యతి | సప్త మన్వంతరం పాపీ సంతప్తస్తత్ర విష్ఠతి || 115

శబ్దం కరోత్యనాహారో యమదూతేన తాడిః | షష్టి వర్ష సహస్రాణి విట్‌ క్రిమిర్భారతే తతః || 116

తతో భ##వేద్భూమిహీనో దరిద్రశ్చ తతః శుచిః | తతః స్వయోనిం సంప్రాప్య శుభకర్మా భ##వేత్పునః || 117

బలవంతుడైనవాడు ఇతరులకు చెందిన భూమిని బలవంతముగనో, హింసించియో, ఇంకను ఇతర దుష్టపద్దతులననుసరించియో, అపహరించినచో అతడు తప్త శూలమను నరకమున రాత్రింబగళ్ళు మరుగుచున్న నూనెలో పడిన జీవివలె బాధలు పడును. ఆ పాపి ఏడు మన్వంతరములవరకు తప్తశూల నరకమున బాధలు పడుచున్నను అతని భోగదేహము మాత్రము నశింపదు. ఆ నరకమున యమదూతలు పెట్టు బాధలకు తాళ##లేక, ఆహారము లేక ఏడ్చుచుండును.

అటుపిమ్మట అరవై వేల సంవత్సరములు అశుద్ధమున తిరుగు క్రిమియై పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తినను భూమిలేని వాడై దరిద్రుడగను.

ఛినత్తి జీవినం ఖడ్గైర్దయాహీనః సుదారుణః | నరఘాతీ హంతి, నరమర్ధలోభేన భారతే || 118

అసిపత్రే చ స వసేద్యావదింద్రాశ్చతుర్దశ | తేషు చేత్‌ బ్రాహ్మణాన్‌ హంతి శతమన్వంతరం తదా || 119

ఛిన్నాంగశ్ఛ భ##వేత్పాపీ ఖడ్గధారేణ సంతతం | అనాహారః శబ్దకృచ్చ యమ దూతేన తాడితః || 120

చండాలః శతజన్మాని భారతే సూకరో భ##వేత్‌ | కుక్కురః శతజన్మాని సృగాలః సప్త జన్మసు || 121

వ్యాఘ్రశ్చ సప్త జన్మాని వృకశ్చైవ త్రి జన్మని | జన్మ సప్తసు గండీస్యాత్‌ మహిషశ్చ త్రి జన్మని || 122

దయలేక అతిభయంకరముగా మరొక జీవిని డబ్బుకు ఆశపడి కత్తులచేత చంపినవాడు అసిపత్రమను నరకమున పదునల్గురు ఇంద్రులు గడచువరకుండును. అదే బ్రాహ్మణుని ఆ విధముగా నిర్దయతో చంపినచో నూరు మన్వంతరములవరకు అసిపత్రనరకమున నుండును. అచ్చట యమభటులు అవయవములను ఛేదించుచుండగా ఆహారములేక హాహాకారము చేయుచుండును. తరువాత నూరు జన్మలు చండాలునిగను, మరొక నూరు జన్మలు పందిగను, తరువాత నూరు జన్మలు కుక్కగను, ఏడు జన్మలు నక్కగను, ఏడజన్మలు పులిగను, మూడు జన్మలు తోడేలుగను, ఏడు జన్మలు గండిగను ఆ తరువాత మూడు జన్మలు మహిషముగను జన్మించును.

గ్రామం వా నగరం వాZపి దాహనం యః కరోతి చ | క్షురధారే వసేత్సోZపి ఛిన్నాంగస్త్రియుగం సతి || 123

తతః ప్రేతో భ##వేత్సద్యో వహ్నివక్త్రో భ్రమేన్మహీం | సప్త జన్మమేధ్యభోజీ ఖద్యోతః సప్తజన్మసు || 124

తతో భ##వేన్మహాశూలీ మానవః సప్త జన్మసు | సప్త జన్మ గలత్కుష్ఠీ తతః శుద్దో భ##వేన్నరః || 125

ఊరునో, పట్టణమునో తగలబెట్టువాడు అసిపత్రమను నరకమున మూడు యుగముల వరకు యమభటులు కత్తులచే శరీరమును కోయుచుండగా బాధపడుచుండును. తరువాత అతని ముఖము నుండి అగ్నిజ్వాలలు చెలరేగుచుండగా ప్రేతగా మారి భూమిపై తిరుగుచుండును. అటుపిమ్మట ఏడు జన్మలవరకు అమేధ్యమును తిను క్రిమిగా జన్మించును. తరువాత ఏడు జన్మలు మిణుగురు పురుగుగా జన్మించును. అటుతరువాత ఏడు జన్మలవరకు మితిమీరిన శూలరోగముతో బాధపడును. తరువాత ఏడు జన్మలవరకు కుష్ఠురోగముతో బాధపడుచుండును.

పరకర్ణోపజాసేన పరనిందాం కరోతి యః | పరదేషే మహాతోషీ దేవబ్రాహ్మణ నిందకః ||126

సూచిముఖీ స చ వసేత్సూచీవిద్ధో యుగత్రయం | తతో భ##వేత్‌ వృశ్చికశ్చ సర్పః స్యాత్‌ సప్తజన్మసు || 127

వజ్రకీటః సప్తజనౌ భస్మకీటస్తతః పరం | తతో భ##వేన్మానవశ్చ మహావ్యాధిస్తతః శుచిః || 128

ఇతరుల చెవిలో గుసగుసలు పెట్టుచు ఇతరులను నిందించుటతోనే తాను సంతోషపడువాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు సూచీముఖమను నరకమున సూదులచే పొడవబడుచు మూడు యుగముల వరకు బాధపడుచుండను. తరువాత ఏడు జన్మలు తేలుగాను, ఏడుజన్మలు సర్పముగాను, ఏడుజన్మలు వజ్రకీటకముగాను, (సాలగ్రామశిలలోనుండి ఆశిలను తొలుచు పురుగు) తరువాత ఏడు జన్మలు భస్మకీటకముగాను తరువాత మహారోగి యైన మానవుడుగా జన్మించును.

గృహిణాం చ గృహం భిత్వా వస్తుస్తేయం కరోతి యః | గాశ్చ భాగాంశ్చ మేషాంశ్చ యాతి గోధాముఖం చ సః || 129

తతో భ##వేత్సప్తజనౌ గోజాతిర్వ్యాధి సంయుతః | త్రిజన్మ మేష జాతిశ్చ ఛాగ జాతి స్త్రిజన్మని || 130

తతో భ##వేన్మానవశ్చ నిత్యరోగీ దరిద్రకః | భార్యా హీనో బంధుహీనః సంతాపీ చ తతః శుచిః || 131

ఇతరుల ఇండ్లను తవ్వి వస్తువులను, గోవులను, గొఱ్ఱలను, మేకలను అపహరించువాడు తరువాత ఏడు జన్మల వరకు రోగముగల గోవుగా, తరువాత మూడు జన్మల వరకు మేకగా, గొఱ్ఱగా జన్మించి బాధలు పడును. ఆ తరువాత మానవుడై పుట్టినను ఎల్లప్పుడు రోగముతో, దరిద్రుడై , భార్యను కోల్పోయి, బంధువులందరిని కోల్పోయి బాధలు పడును. సామాన్య ద్రవ్యచోరశ్చ యాతి నక్రముఖం యుగం | తతో భ##వేన్మనవశ్చ మహారోగీ తతః శుచిః || 132

చిన్న చిన్న దొంగతనములు చేయువాడు నక్రముఖమను నరకమున ఒక యుగము వరకు మొసళ్ళచే బాధలు పడుచుండును. తరువాత మానవుడుగా జన్మించినను నిరంతరము రోగములచే బాధపడుచుండును.

హంతి గాశ్చ గజాంశ్చైవ తురగాంశ్చ నరాంస్తథా | స యాతా గజదంశం చ మహాపాపీ యుగత్రయం || 133

తాడితో యమదూతేన గజదంతేన సంతతం | స భ##వేద్గజ జాతిశ్చ తురగశ్చ త్రిజన్మని ||

గోజాతి వ్లుెచ్ఛ జాతిశ్చ తతః శుద్దో భ##వేన్నరః || 134

గోవులను, ఏనుగులను, గుఱ్ఱములను, మానవులను చంపువాడు గజదంశమను నరకమున కేగి అచ్చట అతనిని యమదూతలు ఏనుగు దంతములచే పొడుచుండగా మూడు యుగములవరకు ఉండును. తరువాత మూడు జన్మలవరకు గజముగాను, మరొక మూడు జన్మలు గుఱ్ఱముగాను, ఆ తరువాత మూడు జన్మలు గోవుగాను, అటు పిమ్మట మూడు జన్మలు వ్లుెచ్ఛుడుగను పుట్టును.

జలం పిబంతీం తృషితాం గాం వారయతి యోనరః | తచ్ఛుశ్రూషా విహీనశ్చ గోముఖం యాతి మానవః || 135

నరకం గోముఖాకారం కృమి తప్తోదకాన్వితం | తత్ర తిష్ఠతి సంతప్తో యావన్మన్వంతరావధి || 136

తతో నరోZపి గోహీనో మహోరోగీ దరిద్రకః | సప్త జన్మన్యంత్యజాతిః తతః శుద్దో భ##వేన్నరః || 137

దప్పికతో నీరు తాగుచున్న గోవును ఎవడు వారించునో అతడు వెంటనే ప్రాణములను కోల్పోయి గోముఖమను నరకమునకు వెళ్ళును. ఆ నరకము గోముఖాకారమున నుండును. క్రిములు, సలసలమఱగు నీరు ఉండును. అచ్చట ఆ ఏడుజన్మలు అంత్యజాతివాడుగా జన్మించుటచే అవమానముల పాలై బాధలు పడును.

గోహత్యాం బ్రహ్మహత్యాం చ యః కరోత్యతిదేశికీం | యో హి గచ్ఛేదగమ్యాం చ సంధ్యాహీనోZప్యదీక్షితః || 138

ప్రతిగ్రాహీ చ తేర్ధేషు గ్రామయాజీ చ దేవలః | శూద్రాణాం సూపకారశ్చ ప్రమత్తో వృషలీపతిః ||139

గోహత్యాం బ్రహ్మహత్యాం చ స్త్రీ హత్యాం చ కరోతియః | మిత్రహత్యీం భ్రూణహత్యాం మహాపాపీ చ భారతే || 140

కుంభీపాకే స వసేత్‌ యావదింద్రాశ్చతుర్ధశ | తాడితో యమదూతేన చూర్ణ్యమానశ్చ సంతతం || 141

క్షణం పతతి వహ్నౌ చ క్షణం పతతి కంటకే | క్షణం చ తప్తతైలేషు తప్తతోయేషు చ క్షణం || 142

క్షణం చ తప్తపాషాణ తప్తలోహే క్షణం తతః | గృధ్రకోటిసహస్రాణి శతజన్మాని సూకరః || 143

కాకశ్చ సప్తజన్మాని సర్పః స్యాత్‌ సప్తజన్మసు | షష్టి వర్ష సహస్రాణి తతోవై విట్‌ క్రిమిర్భవేత్‌ || 144

తతో భ##వేత్స వృషలో గలత్కుష్ఠీ దరిద్రకః | యక్ష్మగ్రస్తో వంశహీనో భార్యాహీనస్తతః శుచిః || 145

అగమ్యాగమనము చేయువాడు, సంధ్యావందనమాచరింపని వాడు, యాగదీక్ష తీసికొననివాడు పూణ్యతీర్ధములలో దానములను స్వీకరించువాడు, పూజలు చేయించువాడు (డబ్బు తీసుకొని,) , దేవతార్చన చేసి పొట్టబోసుకొనువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేయువాడు, అతిగా మదించినవాడు, శూద్రస్త్రీని పెండ్లిచేసుకొన్న బ్రాహ్మణుడు, గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీహత్య, మిత్రహత్య, శిశుహత్య చేయువాడు కుంభీపాకమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకుండును. అచ్చట యమ దూతలు కొట్టుచుండగా ఆతని దేహమంతయు చూర్ణమగుచుండను. యమదూతలతనిని కొంతసేపు నిప్పులోవేతురు. మరికొంతసేపు ముండ్లలో వేతురు. ఇంక కొంతసేపు మరిగే నూనేలోకి తోయుదురు. మరికొంతసేపు సలసలమరిగే నీటిలో ఉంచెదరు. కొంతసేపు మండుచున్న రాతిపై నిలబెట్టుదురు. ఇంకను కొంతసేపు మండుతున్న లోహముపై నిలబెట్టుదురు. ఈ విధముగా నరకయాతనలనన్నిటిని అనుభవించి భూమిపై జన్మించినపుడు అనేక కోట్ల జన్మలు గద్దగను, నూరుజన్మలు పందిగాను, ఏడుజన్మలు కాకిగను, ఏడు జన్మలు సర్పముగను, అరవై వేల సంవత్సరములు అశుద్దమునందు ఉండు క్రిమిగా, ఆ తరువాత శూద్రుడుగా జన్మించును. ఆ జన్మలో అతడు కుష్ఠురోగముచే బాధలు పడుచు, దరిద్రుడై, క్షయవ్యాధిచే బాధలు పడుచు సంతానములేక, భార్యలేక అనేక దుఃఖములను అనుభవించును.

సావిత్ర్యువాచ- సావిత్రి యమధర్మరాజుతో నిట్లనెను-

బ్రహ్మహత్యా చ గోహత్యా కింవిధా వాZతిదేశికీ | కావా నృణా మగమ్యావా కోవా సంధ్యా విహీనకః || 146

అదీక్షితః పూమాన్‌ కోవా కోవా తీర్ధే ప్రతిగ్రహీ | ద్విజః కోవా గ్రామయాజీ ద్విజః కోవా విప్రశ్చ దేవలః || 147

శూద్రాణాం సూపకారః కః ప్రమత్తో వృషలీ పతిః | ఏతేషాం లక్షణం సర్వం వద వేదవిదాం వర || 148

ఓ యమధర్మరాజా ! బ్రహ్మహత్య, గోహత్య అతిదేశికి ఏ విధముగా నుండును. అగమ్య అనగా నెవరు ? సంధ్యావందనము లేనివాడెవరు ? అదీక్షితుడు, పుణ్యతీర్ధములందు దానము స్వీకరించువాడెట్లుండును. అట్లే గ్రామయాజి, దేవలుడు, శూద్రసూపకారుడు, వృషలీపతి యనగా ఎట్లుండును. వేదములు వేదార్ధములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవైన యమధర్మరాజా! వీరి లక్షణములన్నిటిని వివరముగా నాకు తెలపుము.

యమ ఉవాచ- యమ ధర్మరాజిట్లనెను-

శ్రీకృష్ణే చ తదర్చాయాం మృన్మయ్యాం ప్రకృతౌ తథా | శివే చ శివలింగేవా సూర్యే సూర్యమణౌ తథా || 149

గణశే వ తదర్చాయామేవం సర్వత్ర సుందరి | కరోతి భేదబుద్దిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః || 150

స్వగురౌ స్వేష్టదేవే వా జన్మదాతరి మాతరి | కరోతి భేదబుద్దిం యో బ్రహ్మహత్యాం లభేత్తు సః || 151

వైష్ణవేష్వన్య భ##క్తేషు బ్రాహ్మణష్వితరేషు చ | కరోతి సమతాం యోహి బ్రహ్మహ7త్యాం లభేత్తు సః || 152

శ్రీకృష్ణునకు, అతని అర్చావిగ్రహమునకు, శివునకు శివలింగమునకు సూర్యునకు, సూర్యమణికి, గణపతికి అతని విగ్రహమునకు మధ్య ఈ విధముగా ఇతరత్ర భేద భావన చేయువాడు బ్రహ్మహత్యా పాపామును పొందును.

అట్లే తన గురువును, తన ఇష్టదేవతను, తన తల్లిని నిరాదరించువాడు బ్రహ్మహత్యా పాపముననుభవించును.

వైష్ణవులను, ఇతర దేవతా భక్తులను, బ్రాహ్మణులను, బ్రామణతరులను సమానముగా చూచువాడు బ్రహ్మహత్యా పాపమునుభవించును.

యో మూఢో విష్ణునైవేద్యే చాన్యనైవేద్యకే తథా | హరేః పాదోదకేష్వన్య దేవ పాదోదకే తథా |

కరోతి సమతాం యోహి బ్రహ్మహత్యాం లభేత్తు సః || 153

విష్ణుమూర్తికి సమర్పించిన నైవేద్యమును, ఇతర దేవతలకు ఇవ్వబడిన నైవేద్యమును, శీహరి పాదోదకమును, ఇతర దేవతల పాదోదకమును సమానముగా చూచువాడు బ్రహ్మ హత్యా పాపమును అనుభవించును.

సర్వేశ్వరేశ్వరే కృష్ణే సర్వకారణ కారణ | సర్వాద్యే సర్వదేవానాం సేవ్యే సర్వాంతరాత్మని || 154

మాయయాZనేక రూపే వాZప్యేక ఏవహి నిర్గుణ | కరోత్యన్యేన సమతాం బ్రహ్మహత్యాం లభేత్తు సః || 155

సమస్త సృష్టికి మూలపురుషుడు, ఆదిపురుషుడు, సర్వదేవతలచే సేవితుడు, తనమాయవలన అనేక రూపములతో కనపడుచున్నను అద్వితీయుడును, సర్వేశ్వరేశ్వ రుడైన శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానముగా భావించువాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

పితృదేవార్చనాం పౌర్వాపరాం వేద వినిర్మితాం | యః కరోతి నిషేధం చ బ్రహ్మహత్యాం లభేత్తు సః || 156

వేదమంత్రములు కలది, పూర్వకర్మ అపరకర్మ అనే పేర్లుతో ప్రసిద్ధమైన దేవతార్చనను పితృదేవతార్చనను చేయనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

యే నిందంతి హృషీకేశం తన్మంత్రోపాసకం తథా | పవిత్రాణాం పవిత్రం చ బ్రహ్మహత్యాం లభంతి తే || 157

పరమ పవిత్రుడగు శ్రీమన్నారాయణుని, శ్రీమన్నారాయణ మంత్రోపాసకుని నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుచున్నారు.

శివం శివస్వరూపం చ కృష్ణ ప్రాణాధికం ప్రియం | పవిత్రాణాం చ జ్ఞానానందం సనాతనం || 158

ప్రధానం వైష్ణవానాం చ దేవానాం సవ్యమీశ్వరం | యేనార్చయంతి నిందంతి బ్రహ్మహత్యాం లభంతి తే || 159

మంగళ స్వరూపుడు, శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటె మిన్నయైనవాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానందస్వరూపుడు, సనాతనుడు, విష్ణుభక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడగు శివుని పూజించని వారు, నిందించువారు, బ్రహ్మహత్యాపాపమును పొందుదురు.

యే విష్ణుమాయాం నిందంతి విష్ణుభక్తి ప్రదాం సతీం | సర్వశ్తకి స్వరూపాం చ ప్రకృతి సర్వమాతరం || 160

సర్వదేవీ స్వరూపాం చ సర్వాద్యాం సర్వవందితాం | సర్వ కారణ రూపాం చ బ్రహ్మ హత్యాం లభంతి తే || 161

శ్రీమన్నారాయణునిపై భక్తి భావనను కలిగించునది, సమస్త శక్తి స్వరూపిణి , అందరికి మాతృస్వరూపిణి, సర్వదేవీ, స్వరూప, అందరిచే సమస్కారములనందుకొనుచున్నది, సమస్త సృష్టికి కారణమైనది ఐన విష్ణుమాయను నిందించువారు బ్రహ్మహత్యా ఫలమును పొందుదురు.

కృష్ణజన్మాష్టమీం రామనవమీం పుణ్యదాం పరాం |శివరాత్రిం తథా చైకాదశీం వారం రవేస్తథా || 162

పంచ పర్వాణి పుణ్యాని యే న కుర్వంతి మానవాః | లభంతే బ్రహ్మ హత్యాం తే చాండాలాధిక పాపినః || 163

అంబువీచ్యంబు ఖననే జలే శౌచాదికంచ యే | కుర్వంతి భారతే వత్స బ్రహ్మహత్యాం లభంతి తే || 164

పవిత్రమైన పంచపర్వములను (అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య , సూర్యసంక్రమణమను ఐదు పర్వములు ) శ్రీకృష్టామి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, ఆదివారము ఐదుపర్వములను ఆచరించనివారు బ్రహ్మ హత్యా దోషమును పొందుదురు.

అట్లే నదులలో, దిగుడుబావులలో మాత్ర పురీషములను విసర్జించువారు బ్రహ్మహత్యాపాపమునొందుదురు.

గురుం చ మాతరం తాతం సాధ్వీం భార్యాం సుతం సుతాం | అనాథాన్‌ యో న పుష్ణాతి బ్రహ్మహత్యాం లభేత్తు సః || 165

గురువును తల్లి దండ్రులను, పతివ్రతయగు భార్యను, సంతానమును అట్లే అనాథలైన వారిని పోషింపనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

వివాహో యస్య న భ##వేన్నపశ్యతి సుతం చ యః | హరి భక్తి విహీనో యో బ్రహ్మహత్యాం లభేత్తు సః || 166

పుత్ర సంతానము లేనివాడు, వివాహము చేసికొననివాడు, శ్రీ హరి భక్తి లేనివాడు బ్రహ్మ హత్యా ఫలమును పొందును.

హరేరనైవేద్యభోజీ నిత్యం విష్ణుం న పూజయేత్‌ | పుణ్యం పార్థివలింగం వా బ్రహ్మహత్యాం లబేత్తు సః ||167

శ్రీమన్నారాయణునకు సమర్పించిన నైవేద్యమును తిననివాడు. ప్రతి దినము శ్రీహరి పూజ చేయనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించని వాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

పైవన్నియు అతిదేశికములైన బ్రహ్మహత్యలు.

ఆహారం కుర్వతీం గాంచ పిబంతీం యోనివారయేత్‌ | యాతి గో విప్రయోర్మధ్యే గోహత్యాం చ లభేత్తు సః || 168

మేత మేయుచున్న ఆవును, నీరు త్రాగుచున్న ఆవును అదలించి నీరు తాగకుండ, మేతమేయకుండా చేయువాడు గోవును చంపిన ఫలమును పొందును.

దండైర్గాస్తాడయేన్మూర్ఖో యోవిప్రో వృషవాహకః | దినే దినే గవాం హత్యాం లభేత్‌ నాZత్ర సంశయః || 169

దదాతి గోభ్య ఉచ్ఛిష్టం యోజయేద్వృష వాహకం | బోజయేత్‌ వృషవాహాన్నం సగోహత్యాం లభేత్‌ ధ్రువం || 170

వృషలీపతిం యాజయేద్యో భుంక్తేZన్నం తస్య యో నరః గోహత్యా శతకం సోZపి లభేత్‌ నాZత్ర సంశయః || 171

పాదం దదాతి వహ్నౌ చ గాశ్చ పాదేన తాడయేత్‌ | గృహం విశేదధౌతాంఘ్రిః స్నాత్వా గోవధమాప్నుయాత్‌ || 172

యోభుంక్తేస్నిగ్ధపాదేన శేతే స్నిగ్ధాంఘ్రి రేవ చ | సూర్యోదయే చ ద్విర్భోజీ సగోహత్యాం లభేత్‌ ధ్రువం || 173

అవీరాన్నం చ యో భుంక్తే యోనిజీవీ చ యో ద్విజః | యః త్రిసంధ్యావిహీనశ్చ స గోహత్యాం లభేత్‌ ధ్రువం || 174

పితౄంశ్చ పర్వకాలే చ తిథికాలే చ దేవతాం | న సేవతే Zతిథిం యోహి గోహత్యాం లభేత్‌ ధ్రువం || 175

స్వభర్తరి చ కృష్ణే చ భేదబుద్ధిం కరోతి యా | కటూక్త్యా తాడయేత్కాంతం సా గోహత్యాం లభేత్‌ ధ్రువం || 176

గోమార్గం ఖననం కృత్వా వపతే సస్యమేవ చ | తడాగే వా తదూర్ఢ్వం వా సగోహత్యాం లభేత్‌ ధ్రువం || 177

ప్రాయశ్చిత్తం గోవధస్య యః కరోతి వ్యతిక్రమం | అర్థలోభాదథాజ్ఞానాత్‌ స గోహత్యాం లభేత్‌ ధ్రువం || 178

రాజకే దైవకే యత్నాత్‌ గోస్వామీ గాం న పాతయేత్‌ | దుఃఖం దదాతి యో మూఢో గోహత్యాం స లభేత్‌ ధ్రువం || 179

ప్రాణినం లంఘయేద్యోహి దేవార్చాయాం రతం జలం | నైవేద్యం పుష్పమన్నం చ స గోహత్యాం లభేద్ధ్రువం || 180

శశ్వనానాస్తీతి వాదీ యో మిథ్యావాదీ ప్రతారకః| దేవద్వేషీ గురుద్వేషీ సగోహత్యాం లభేద్ధ్రువం || 181

దేవతా ప్రతిమాం దృష్ట్వా గురుం వా బ్రాహ్మణం సతి| సంభ్రమాన్ననమేద్యోహి స గోహత్యాం లభేద్ధ్రువం || 182

న దదాత్యాశిషం కోపాత్ప్రణతాయ చ యో ద్విజః | విద్యార్థినే చ విద్యాం వై సగోహత్యాం లభేద్ధ్రువం || 183

గోహత్యా బ్రహ్మహత్యా చ కథితా చాతిదేశీకీ | యథా శ్రుతం సూర్య వక్త్రాత్‌ కింభూయః శ్రోతు మిచ్ఛసి || 184

ఆవులను కఱ్ఱతో కొట్టువాడు, ఎద్దులపై బరువులు మోపువాడు లేక గోవుపై కూర్చొనియుండువాడు ప్రతిదినము గోహత్య తేసిన వానితో సమానుడు. ఆవులకు తిని పారేసిన ఎంగిళ్ళను పెట్టువాడు, ఎద్దులను బండికి కట్టువాడు, అతని ఇంట భుజించువాడు గోహత్యాపాపమును పొందును. అట్లే తన పాదములను నిప్పుకెదురుగా ఉంచి కాచుకొనువాడు, గోవులను కాలితో తన్నువాడు, నదిలోనో బావిలోనో స్నానము చేసి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుగుకొనక ఇంటిలోపలికి వెళ్ళువాడు, తడిగల కాళ్ళతో భోజనము చేయువాడు, తడి కాళ్ళతోనే నిద్రపోవువాడు, సూర్యోదయకాలమున రెండుమార్లు తినువాడు గోహత్యాఫలితమును పొందును. సంతానములేని విధవ పెట్టిన అన్నము తినువాడు, తన భార్యను ఇతరులకు తార్చి బ్రతుకువాడు, మూడు సంధ్యలలో సంధ్యావందన మాచరింపని బ్రాహ్మణుడు, సర్వకాలములందు పితృదేవతార్చనము , తిథికాలమున దేవతార్చనను చేయనివాడు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయనివాడు, గోహత్య ఫలితమును పొందును.

అట్లే శ్రీకృష్ణుని తన భర్తను భేదభావములో చూచు స్త్రీ, భర్తను, తిట్టుచు, కొట్టుచుండు స్వభ్వముగల స్త్రీ గోహత్యా ఫలితమును పొందును.

గోవులు నడుచు త్రోవను చెడగొట్టి వ్యవసాయమునకు ఉపయోగించుకొనువాడు, చెరువులోను, చెరువుపైభాగమున వ్యవసాయము చేయువాడు (తన స్వార్థమునకై చెరువులోను, దాని పై భాగమున నీరు రాకుండ చేసి వ్యవసాయము చేసి కొనువాడు ) గోహత్యా ఫలితమును పొందును . పిసినారితనమువలననో, అజ్ఞానమువలననో గోవధ ప్రాయశ్చిత్తమును విధి విహితముగా చేయని వానికి గోహత్యాపాపమంటును.

రాజుకు సంబంధించినవి లేక దైవమునకు సంబంధించిన అనావృష్ట్యాది ఉపద్రవములందు తనకు చెందిన గోవులను రక్షింపనివాడు, ఆసమయములలో ఆవులకు కష్టమును కలిగించివాడు గోహత్యా ఫలితమును పొందును, ఏ ప్రాణినైనా, దేవతార్చన సమయమున ఉపయోగించిన జలమును, దైవమునకు సమర్పించిన నైవేద్యమును, పుష్పము మొదలగువాటిని దాటినచో అతనికి గోహత్యా ఫలితము దొరకును.

ఎప్పుడును లేదు లేదు అని అబద్ధములాడువాడు అట్లే ప్రతారణ చేయువాడు, దేవతలను, గురువును ద్వేషించువాడు గోహత్యాఫలితమును పొందును. అట్లే దేవతయొక్క అర్చామూర్తిని, గురువును బ్రహ్మణుని చూచి వెంటనే నమస్కారము చేయనివాడు, తనకు వినయముతో నమస్కరించినను కోపముతో ఆశీర్వదించని బ్రాహ్మణుడు, వినయముతో తనను విద్య చెప్పమని అడిగినప్పుడు మదముతో విద్యాభోద చేయని బ్రాహ్మణుడు గోహత్యా ఫలితమును పొందును.

సావిత్రీ! నీవడినట్లు అతిదేశీకములైన గోహత్య, బ్రాహ్మణహత్యలెట్లుండునో తెలిపితిని. ఈ విషయములనన్నిటిని మా తండ్రి యగు సూర్యుని వలన తెలిసికొంటిని . ఇంకను నీకేమైన తెలుసుకొనవలసిన విషయములున్నచో అడుగుము.

సావిత్య్రవాచ- సావిత్రి యమునితో ఇట్లు పలికెను.

వాస్తవేచాZ తిదేశేచ సంబంధే పుణ్య పాపయోః న్యూనాధికే చ కో భేదః తన్మాం వ్యాఖ్యాతు మర్హసి || 185

యమధర్మరాజా! వాస్తవమైన పుణ్యమునకు అతిదేశ##మైన పుణ్యమునకు, వాస్తవమైన పాపములకు అతిదేశ##మైన పాపమునకు మధ్య గల భేదమును నాకు వివరింపుము.

యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను -

కుత్రాZపి వాస్తవః శ్రేష్ఠః న్యూనోZతిదేశికః సదా | కుత్రాZతిదేశికః శ్రేష్ఠః వాస్తవో న్యూన ఏవచ || 186

కుత్ర వా సమతా సాధ్వి తయోర్వేద ప్రమాణ తః | కరోతి తత్రనాZస్థాం యో గురుహత్యాం లబేత్తు సః ||187

పాప పుణ్యములందెచ్చటనైనను వాస్తవ పుణ్యపాపములు చాలా గొప్పవి. అట్లే అతి దేశిక పుణ్యపాపములు ఎచ్చటనైనను వాస్తమైన వాటికంటె తక్కువైనవి.

ఎట్టి అతిదేశిక పుణ్యపాపములు శ్రేష్ఠమైనవి, ఎటువంటి వాస్తవ పుణ్యపాపములు తక్కువైనవి, ఎటువంటి సమానమైనవి అను విషయమును వేద ప్రమాణముననుసరించి నిశ్చయింపవలెను. ఈ విషయమును పట్టించుకొననివాడు గురువును చంపిన పాపమును పొందును.

పురా పరిచితే విప్రే విద్యామంత్రప్రదాతరి |గురౌ పితృత్వమారోపాత్‌ వస్తుతః శ్రేష్ఠ ఉచ్యతే ||188

పూర్వ పరిచయముగల బ్రాహ్మణుడు, విద్యను, మంత్రమును ఉపదేశించిన గురువునందు పితృత్వమారోపించబడును. అందువలన అతడు శ్రేష్ఠుడగును.

పితుః శతగుణా మాతా మాతుఃశతగుణస్తథా | విద్యామంత్రప్రదాతా చ గురుః పూజ్యః శ్రుతేర్మతః ||189

గురుతో గురుపత్నీ చ గౌరవే చ గరీయసీ | యథేష్టం దేవపత్నీ చ పూజ్యా చాభీష్టదేవతా || 190

తండ్రికంటె తల్లి నూరురెట్లు గొప్పది . తల్లికంటె విద్యను, మంత్రమునుపదేశించిన గురువు నూరురెట్లు గొప్పవాడు గురువు కన్న గురు భార్యను ఎక్కువ గౌరవింపవలెను. దేవపత్ని ఇష్టదేవత కూడ గౌరవించదగినవారు.

విప్రః శివసమో యశ్చ విష్ణుతుల్య పరాక్రమః | రాజాZతిదేశికాత్‌ శ్రేష్ఠో వాస్తవో గుణ లక్షతః || 191

విష్ణుమూర్తితో సమానమైన లక్షణములు గల బ్రాహ్మణుడు శివునితో సమానమైనవాడు . రాజువంటివానికంటె రాజు లక్షరెట్లు గొప్పవాడు.

సర్వం గంగాసమం తోయం సర్వే వ్యాస సమా ద్విజాః | గ్రహణ సూర్య శశినోశ్చాత్రైవ సమతా తయోః || 192

అతిదేశిక హత్యాయాః వాస్తవశ్చ చతుర్గుణః | సమ్మతః సర్వవేదానామిత్యాహ కమలోద్భవః || 193

సూర్యచంద్రుల గ్రహణకాలమున అన్ని నదులలోని నీరు గంగానదితో సమానమైనది. అప్పుడు బ్రాహ్మణులందరు వ్యాసమహర్షితో సమానమైనవారు. ఈ సమయమున మాత్రమే ఈ రెంటియందు సమానత్వముకనిపించును.

హత్యవంటి దాని కన్న వాస్తవమైన హత్య నాల్గురెట్లు గొప్పనిది. ఇది సమస్త వేదములకు సమ్మతమైనదని బ్రహ్మదేవుడు చెప్పెను.

ఆతిదేశిక హత్యాయాః భేదశ్చ కథితః సతి| యా యాZగమ్యా నృణామేవ నిబోధ కథయామి తే || 194

ఓ సావిత్రి ! అతిదేశిక హత్యకు వాస్తహత్యకు గల భేదమును నీకు తెలిపితిని. ఇక మానవులకు అగమ్యలైన స్త్రీల గురించి వివరింతును.

స్వస్త్రీ గమ్యాత సర్వేషామితివేదే నిరూపితా | అగమ్యాచ్చ తదన్యా యా నిబోధ కథయామి తే || 195

సామాన్యం కథితం సర్వం విశేషం శ్రుణు సుందరి | అత్యగమ్యాశ్చ యాయావై నిబోధ కథయామి తే || 196

అందరకు తన భార్య గమ్యయగును. తన భార్య కంటె భిన్నమైన స్త్రీ అగమ్య యని వేదశాస్త్రార్థకోవిదులుచెప్పుదురు. కాని ఇది సామాన్యమైన విషయము. విశేషాంశమునిప్పుడు వినుము. అత్యగమ్యలగు స్త్రీల గురించి చెప్పుదును వినుము.

శూద్రాణాం విప్రపత్నీ చ విప్రాణాం శూద్రకామినీ | అత్యగమ్యాZతినింద్యాచ లోకే వేదే పతివ్రతే || 197

శూద్రశ్చేద్బ్రాహ్మణీం గచ్ఛేత్‌ బ్రహ్మహత్యాశతం లభేత్‌ | తత్సమం బ్రాహ్మణ చాపి కుంభీపాకం వ్రజేత్‌ ధ్రువం || 198

యది శూద్రూం వ్రజేగ్విప్రో వృషలీపతి రేవ సః | సభ్రష్టో విప్రజాతేశ్చ చండాలాత్సోZ ధమః

స్మృతః ||199

విష్ఠా సమశ్చ తత్పిండో మూత్రతుల్యం చ తర్పణం | తత్పితౄణాం సురాణాం చ పూజనే తత్సమం సతి || 200

కోటిజన్నార్జితం పుణ్యం సంధ్యార్చా తపసార్జితం | ద్విజస్య వృషలీభోగాన్నశ్యత్యేవ న సంశయః ||201

బ్రాహ్మణశ్చ సురాపీతీ విట్‌భోజీ వృషలీపతిః | హరివాసర భోజీ చ కుంభీపాకం వ్రజేత్‌ ధ్రువం ||202

గురుపత్నీం రాజరత్నీం సపత్నీమాతరం ప్రసూం | సుతాం పుత్రవధూం శ్వశ్రూం సగర్భాం భగీనీం సతి || 203

సోదర భ్రాతృజాయాం చ మాతులానీం పితృప్రసూం | మాతుః ప్రసూం తత్స్వసారం భగినీం భ్రాతృకన్యకాం || 204

శిష్యాం చ శిష్యపత్నీం చ భగినేయస్య కామినీం | భ్రాతుః పుత్రప్రియాం చైవాZప్యగమ్యామాహ పద్మజః || 205

శూద్రులు బ్రాహ్మణ స్త్రీతోనో, బ్రాహ్మణుడు శూద్రుని భార్యతోను సంగమించకూడదు. వీరు పూర్తిగా అగమ్యలు. ఈ సంబంధము మిక్కిలి నిందించ తగినది.

శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో సంగమము చేసినచో అతడు నూరుగురు బ్రాహ్మణులను హత్య చేసిన పాపమును పొందును. అట్లే శూద్రునితో పోవు బ్రాహ్మణస్త్రీ కూడా బ్రహ్మహత్యాపాపమును పొందును. ఇంకను కుంభీపాకమను నరకమునకు తప్పకపోవును.

బ్రాహ్మణుడు శూద్రుస్త్రీ వెంట పోయినచో అతడు వృషలీపతియని పిలువబడును. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ జాతి భ్రష్టుడై చండాలునికన్నను అధముడగును. అతడు పితృదేవతలకు సమర్పించిన పిండము మలమువంటిదగును. అతడు విడిచిన పితృతర్పణజలము మాత్రముతో సమానమగును. అతడు చేయు దేవ పితృపూజలు వ్యర్థములగును.

బ్రాహ్మణుడు శూద్రస్త్రీ సంగమము చేసినచో అతడు కోటి జన్మలనుండి చేయుచున్న పుణ్యము అతని సంధ్యా, తపస్సు, దేవతార్చనల వలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించిపోవును. అతడు కల్లును తాగిన పాపమును, ఏకాదశినాడు భోజనము చేసిన పాపమును పొందును. పైగా కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

గురువు భార్య, రాజు భార్య, సవతి తల్లి, ఆమె కూతురు, తనకూతురు, కోడలు, అత్తగారు, గర్భవతి యైన స్త్రీ చెల్లెలు, వదిన, మరదళ్ళు (తమ్ముని భార్య) మేనమామ భార్య, మేనత్త తమ్ముని కూతురు, శిష్యురాలు, శిష్యుని భార్య, మేనల్లుని భార్య, అన్న, అమ్ముల కోడళ్లు వీరందరు అగమ్యలని బ్రహ్మదేవుడు తెలిపెను.

ఏతాస్వేకాం అనేకాం వా యో వ్రజేన్మానవోZధమః | స్వమాతృగామీ వేదేషు బ్రహ్మహత్యాశతం వ్రజేత్‌ || 206

అకర్మార్హోZపి సోZస్పృశ్యః లోకే వేదే Zతినిందితః | స యాతి కుంభిపాకం చ మహాపాపీ సుదుస్తరం || 207

కరోత్యశుద్ధాం సంధ్యాం చ సంధ్యాం వా నకరోతి యః | త్రిసంధ్యాం వర్జయేద్యో వా సంధ్యాహీనశ్చ సద్విజః || 208

పైన చెప్పబడిన వారిలో ఒక స్త్రీతోనో అనేక స్త్రీలతోనో వ్యభిచరించువాడు తన తల్లితో సంగమించువానితో సమానమైన పాపమును పొందును. అట్లే నూరు బ్రహ్మహత్యల ఫలితమును పొందును అతడు పుణ్యకర్మలు చేయుటకు తగడు. అతడు అస్పృశ్యుడగును. అట్లే మహాపాపియగును అతడు కుంభీపాకనరకమునకు తప్పక పోవును.

సంధ్యావందనమును సరిగా చేయనివాడు, అసలు సంధ్యనే చేయనివాడు లేక ఒకటి లేక రెండు సంధ్యలు చేసి తక్కిన వానిని చేయని ద్విజుడు సంధ్యాహీనుడని చెప్పబడును.

వైష్ణవం చ తథా సౌరం శాక్తం శైవం చ గాణపం | యోZహం కారాన్నగృహ్ణాతి మంత్రం సో Zదీక్షితః స్మృతః || 209

విష్ణువునకు, సూర్యునకు, శక్తికి, శివునకు, గణపతికి సంబంధించిన మంత్రములలో దేనినైనను అహంకారముతో స్వీకరింపనివానిని అదీక్షితుడని యందురు.

ప్రవాహమవధిం కృత్వా యావద్ధస్త చతుష్టయం | తత్ర నారాయణః స్వామీ గంగా గర్భాంతరే వరే || 210

తత్ర నారాయణ క్షేత్రే కురుక్షేత్రే హరేః పదే | వారాణస్యాం బదర్యాం చ గంగా సాగర సంగమే || 211

పుష్కరే భాస్కర క్షేత్రే ప్రభాసే రాస మండలే | హరిద్వారే చ కేదారే సోమే బదరపావనే || 212

సరస్వతీ నదీ తీరే పుణ్య బృందావనే వనే | గోదావర్యాం చ కౌశిక్యాం త్రివేణ్యాం చ హిమాలయే || 213

ఏష్వన్యత్ర చ యోదానం ప్రతిగృహ్ణాతి కామతః | స చ తీర్థ ప్రతిగ్రాహీ కుంభీపాకం ప్రయాతి చ || 214

నదీ తీరమునకు నాలుగు హస్తముల దూరమున నీటిలో శ్రీమన్నారాయణుడు నివసించును. దానిని నారాయణ క్షేత్రమందురు. అచ్చట, కురుక్షేత్రమున, కాశీయందు, బదరక్షేత్రమున గంగా సాగర సంగమ స్థలమున, పుష్కరక్షేత్రమున, ప్రభాసక్షేత్రమున, హరి ద్వారమున, కేదారేశ్వరమున, సోమక్షేత్రమున , సరస్వతీ నదీ తీరమున , పవిత్రమైన బృందావనమున, గోదావరి నదీతీరమున, కౌశికీ నదీ తీరమున, త్రివేణీ సంగమమున, హిమాలయ పర్వతములందు ఇతరత్ర ధనముపై ఆశవలన దానము స్వీకరించువానిని తీర్థ ప్రతి గ్రాహి యందురు. అతడు కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

శూద్రాతి రిక్త యాజీ యో గ్రామ యాజీ చ కీర్తితః | తథా దేవోపజీవి యో దేవలః పరికీర్తితః || 215

శూద్ర పాకోపజీవీ యః సూపకార ఇతిస్మృతః | సంధ్యా పూజా విహీనశ్చ ప్రమత్తః పతితః స్మృతః || 216

శూద్రులు తప్ప తక్కిన ద్విజులచే యాదములు చేయించువానిని గ్రామయాజి యని పిలుతురు. అట్లే దేవాలయమున ఇతరుల ఇండ్లలో దేవతార్చనము చేసి బ్రతుకు వానిని దేవలుడని అందురు. శూద్రుల ఇండ్లలో వంటచేసి జీవనము సాగించువానిని సూరకారుడని పిల్చెదరు. సంధ్యావందనము, పూజాదికము లేక జీవించువానిని ప్రమత్తుడని , పతితుడని పిల్చెదరు.

ఉక్తం పూర్వ ప్రకరణ లక్షణం వృషలీ పతేః | ఏతే మహాపాతకినః కుంబీపాకం ప్రయాంతితే || 217

కుండాన్యన్యాని తే యాంతి నిబోధ కథయామి తే || 218

వృషలీపతి యొక్క లక్షణమును ఇంతకు ముందే వివరించితిని. మహాపాతకులైన వీరందరు కుంభీపాకమను నరకమునకు ఇతర నరకకుండములకు సహితము పోదురు. వాటి నన్నిటిని నీకు ముందు చెప్పుదును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృత ఖండే నారద నారాయణ సంవాదే సావిత్య్రుపాఖ్యానే యమ సావిత్రీ సంవాదే కర్మ విపాకే పాపి నరకనిరూపణం శివప్రాశస్త్యం బ్రహ్మహత్యాది పదార్థ పరిభాషా నిరూపణం నామ

త్రింశక్తమో Zధ్యాయః ||

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన సావిత్య్రుపాఖ్యానములో పాపుల నరకనిరూపణము, శివుని గొప్పదనము, బ్రహ్మహత్యాది

విషయముల నిరూపణమనే

ముప్పదియవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters