sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చతుర్దశోzధ్యాయః - వేదవతీ ప్రస్తావనం

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

లక్ష్మీం తౌ చ సమారాధ్య చోగ్రేణ తపసా మునే | ప్రత్యేకం వరమిష్టం చ సంప్రాతు రభీప్పితం || 1

మహాలక్ష్మ్యా వరేణౖవ తౌ పృథ్వీశౌ బభూవతుః | ధనవంతౌ పుత్రవంతౌ ధర్మద్వజ కుశధ్వజౌ || 2

కుశధ్వజస్య పత్నీ చ దేవీ మాలావతీ సతీ | సా సుషావ చ కాలేన కమలాంశాం సుతాం సతీం || 3

సా చ భూతల సంబంధాత్‌ జ్ఞాన యుక్తా బభూవ హ | కృత్వా వేదధ్వనిం స్పష్టం ఉత్తస్థౌ సూతికా గృహే || 4

వేద ధ్వనిం సా చకార జాతమాత్రేణ కన్యకా | తస్మాత్తాంతే వేదవతీం ప్రవదంతి మనీషిణః || 5

జాతమాత్రేణ సుస్నాతా జగామ తపసే వనం | సర్వైర్నిషిద్ధా యత్నేన నారాయణ పరాయణా || 6

ఏకమన్వంతరం చైవ పుష్కరే చ తపస్వినీ | అత్యుగ్రాం వై తపస్యాం తు లీలయా చ చకార సా || 7

తథాzపి పుష్టా న కృశా నవ¸°వన సంయుతా | శుశ్రావ ఖే చ సహసా సా వాచమశరీరిణీం || 8

జన్మాంతరే తే భర్తా చ భవిష్యతి హరిః స్వయం | బ్రహ్మాదిభిర్దురారాధ్యం పతిం లప్స్యసి సుందరి || 9

ఇతి శ్రుత్వా తుసా రుష్టా చకార చ పునస్తపః | అతీవ నిర్జనస్థానే పర్వతే గంధమాదనే || 10

హంసద్వజుని పుత్రులైన ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని గూర్చి గొప్ప తపస్సుచే ఇష్టమైన వరమును పొందిరి. మహాలక్ష్మియొక్క వరమువలన వారు రాజులైరి. వీరిలో కుశధ్వజుని భార్యయగు మాలావతి లక్ష్మీదేవి అంశవలన జన్మించిన కూతురును ప్రసవించెను. ఆ కన్య భూతల సంబంధమున్నప్పటికిని జ్ఞాని యయ్యెను. ఆమె పుట్టగానే సూతికా గృహములోనే వేదములను చదివెను. వేదజ్ఞానమున్నందువలన విద్వాంసులామెను వేదవతి యని పిలిచిరి. ఆమె పుట్టగానే చక్కగా స్నానముచేసి తన బంధువులందరు వద్దన్నను నారణునిపై భక్తితో తపస్సు చేయుటకై అడవికి పోయినది. పుష్కర తీర్థములో ఆమె మన్వంతరకాలము ఉగ్రమైన తపస్సు చేసినది. ఐనను ఆమె కృశించలేదు. ఆ సమయమున అశరీరవాణి ఆమెతో ఇంకొక జన్మలో శ్రీవారి నీకు భర్తయగునని చెప్పినది. ఆమాటలకు వేదవతి కోపగించి గంధమాదన పర్వతమున నిర్జన ప్రాంతమున మరల తపస్సు చేయమొదలిడెను.

తత్రైవ సుచిరం తప్త్వా విశ్వస్య సమువాస సా | దదర్శ పురతస్తత్ర రావణం దుర్నివారణం || 11

దృష్ట్యా సాzతిథి భక్త్యా చ పాద్యం తసై#్మ దదౌ కిల | సుస్వాదు ఫలమూలం చ జలం చాzపి సుశీతలం || 12

తచ్చ భుక్త్వా సపాపిష్ఠ: చావసీత్తత్సమీపత: | చకార ప్రశ్నమితి తాం కా త్వం కళ్యాణి చేతి చ || 13

తాం చ దృష్ట్వా వరారోహాం పీనోన్నతపయోధరాం | శరత్పద్మ నిభాస్యాం చ సస్మితాం సుదతీం సతీం || 14

మూర్ఛామవాప కృపణః కామబాణ ప్రపీడితః | తాం కరేణ సమాకృష్య సంభోగం కర్తుముద్యతః || 15

సా సతీ కోపదృష్ట్యా చ స్తంభితం తం చకారహ | స జడో హస్తపాదైశ్చ కించిద్వక్తుం న చ క్షమః || 16

తుష్టావ మనసా దేవీం పద్మాంశాం పద్మలోచనాం | సా తత్‌స్తవేన ప్రాకృతం తం ముమోచ హ || 17

శశాప చ మదర్థే త్వం వినశ్యసి సబాంధవః | స్పృష్టాz హం చ త్వయా కామాత్‌ విసృజామ్యవలోకయ || 18

ఇత్యుక్త్వా సా చ యోగేన దేహత్యాగం చకారహ | గంగాయాం తాం చ సన్యస్య స్వగృహం రావణో య¸° || 19

ఆ గంధమాదన పర్వతమున చాలాకాలము తపస్సు చేసి కళ్ళు తెరచినప్పుడు ఎదురుగా రావణాసురుడు కన్పించెను. అతనిని చూచి అతిథియను భావముతో అతనికి పాద్యమును, రుచిగల ఫలమూలమును, చల్లని నీటినిచ్చెను. వాటి నన్నిటిని తీసికొని ఆమె సమీపమున కూర్చుండి రావణుడు ఆమెను నీవెవరివని అడిగెను. ఆమె అందమును చూచి మూర్ఛితుడై వేదవతినతడు బలాత్కరింపబోయెను. అప్పుడా వేదవతి కోపముతో చూడగా అతని కాళ్ళు చేతులాడక జడపదార్థమువలెనుండెను. అప్పుడామె లక్ష్మీ దేవిని స్తుతించి రావణునితో నీవు బంధువులందరితో కలిసి నా కారణమున నశింపగలవని శాపమిచ్చి నీవు ముట్టుకొనిన ఈ శరీరమును వదులుచున్నానని యోగబలముతో శరీరమును వదిలిపెట్టినది. రావణుడు గంగానదిలో ఆమె శరీరమును వదలి తన ఇంటికి వెళ్ళెను.

అహోకిమద్భుతం దృష్టం కిం కృతం వా మయాధునా | ఇతి సంచిత్య సంస్మృత్య విలలాప పునః పునః || 20

ఎట్టి అద్భుత కార్యమును చూచితిని; నేను ఎటువంటి పనిచేసితిని అని మాటి మాటికి తాను చేసిన అకృత్యమును స్మరించుకొని రావణుడు దు:ఖించెను.

సాచ కాలాంతరే సాధ్వీ బభూవ జనకాత్మజా | సీతాదేవీతివిఖ్యాతా యదర్థే రావణక్ష హత: || 21

మహాతపస్వినీ సా చ తపసా పూర్వ జన్మన: | లేభే రామం చ భర్తారం పరిపూర్ణతమం హరిం || 22

సంప్రాప్య తపసాzరాధ్యం స్వామినం చ జగత్పతిం | సా రమా సుచిరం రేమే రామేణ సహ సుందరీ || 23

జాతి స్మరాస్మ స్మరతి తపసశ్చక్రమం పురా | సుఖేన తజ్జహౌ సర్వం దుఃఖంచాzపి సుఖం లభేత్‌ || 24

నానా ప్రకారవిభవం చకార సుచిరం సతీ | సంప్రాప్య సుకుమారం తమతీవ నవ¸°వనం || 25

గుణినం రసికం శాంతం కాంతవేషమనుత్తమం | స్త్రీణాం మనోజ్ఞం రుచిరం తథా లేభే యతేప్సితం || 26

పితుర్యచః పాలనార్థం సత్యసంధో రఘూత్తమః | జగామ కాననం పశ్చాత్‌ కాలేన చ బలీయసా || 27

తస్థౌ సముద్రనికటే సీతయా లక్ష్మణన చ దదర్శ తత్ర వహ్నించ విప్రరూపధరం హరిః || 28

తం రామం దుఃఖితం దృష్ట్యా స చ దుఃఖీ బభూవ హ | ఉవాచ కించిత్‌ సత్యేష్టం సత్యం సత్యపరాయణః || 29

వేదవతి తరువాతి కాలమున సీతగా జన్మనెత్తినది. ఆమె కొరకై రావణుడు బంధువులతో నాశనముగావలసి వచ్చెను. మహాతపస్విని యగు జానకి తన పూర్వ జన్మ తపస్సు వలన శ్రీహరి రూపమైన రాముని భర్తగా పొందినది. జగత్సతియైన రాముని భర్తగా పొంది సీత చిరకాలము సుఖముగానుండినది. తండ్రి మాటలను విని సత్యసంధుడైన రాముడు అడవికి వెళ్ళెను. అచ్చట సముద్రతీరమున సీతా లక్ష్మణులతోనున్న రాముని వద్దకు బ్రహ్మణ రూపధారియైన అగ్ని వచ్చెను. రాముని దుఃఖమును చూచి అతడు దుఃఖించి రామునితో ఇట్లనెను.

వహ్నిరువాచ- అగ్ని దేవుడిట్లనెను-

భగవన్‌ శ్రూయతాం వాక్యం కాలేన యదుపస్థితం | సీతాహరణకాలోzయం తవైవ సముపస్థితః || 30

దైవం చ దుర్నివార్యం వై న చ దైవాత్పరం బలం | మత్ర్పసూం మయి సన్యస్య ఛాయాం రక్షాంతికేzధునా || 31

దాస్యామి సీతాం తుభ్యంచ పరీక్షా సమయే పునః | దేవైః ప్రస్థాపితోzహం న చ విప్రో హుతాశనః || 32

భగవన్‌ ఇది సీతాపహరణకాలము. దీనిని దాటలేవు. దైవం అన్నిటికంటె గొప్పది. కావున సీతను నాయందుంచి ఛాయా సీతను నీ దగ్గర ఉంచుకొనుము. నీ సీతను పరీక్షా సమయమున నీకు తిరిగి ఇత్తును. నేను దేవతలు పంపగా ఇచ్చటికి వచ్చితిని. నేను నిజముగా బ్రాహ్మణుడను కాదు అగ్నిదేవతను అనెను.

రామస్తద్వచనం శ్రుత్వా నప్రకాశ్యచ లక్ష్మణం | స్వచ్ఛందం స్వీచకారాసౌ హృదయేన విదూయతా || 33

వహ్నిర్యోగేన సీతవన్మాయాసీతాం చకార హ | తత్తుల్యం గుణరూపాం తాం దదౌ రామాయ నారద || 34

సీతాం గృహీత్వా సమ¸° గోప్యం వక్తుం నిషేధ్య చ | లక్ష్మణో నైవ బుబుధే గోప్యమన్యస్య కా కథా || 35

ఏతస్మిన్నంతరే రామో దదర్శ కనకం మృగం | సీతా తం ప్రేరయామాస తదర్థే యత్నపూర్వకం || 36

సన్యస్య లక్ష్మణం రామో జానక్యా రక్షణ వనే | స్వయం జగామ హంతుం తం వివ్యధే సాయకేన చ || 37

లక్ష్మణతి చ శబ్దం వై కృత్వా మాయా మృగస్తదా | ప్రాణాంస్తత్యాజ సహసా పురో దృష్ట్యా హరిం స్మరన్‌ || 38

మృగరూపం పరిత్యజ్య దివ్యరూపం విధాయచ | రత్న నిర్మిత యానేన వైకుంఠం సజగామ హ || 39

వైకుంఠస్య మహాద్వారే కింకరో ద్వారపాలయోః | జయ విజయోశ్చైవ బలవాంశ్చ జయాభిధః || 40

శాపేన సనకాదీనాం సంప్రాప్తో రాక్షసీం తనుం | పునర్జగామ తద్వారం ఆదౌ స ద్వారపాలకః || 41

రాముడు అగ్నిదేవత మాటలు విని లక్ష్మణునకు తెలియకుండా అగ్నిదేవుడిచ్చిన మాయసీతను స్వీకరించెను. ఆ మాయా సీత అచ్చముగా సీతాదేవివలె నుండినది. ఈ విషయమును రాముడు చాలా రహస్యముగా నుంచెను. ఇది తమ్ముడు, తనవెంటనున్న లక్ష్మణునకే తెలియదన్నచో ఇతరులకేమి తెలియును.

ఆ సమయమున రాముడు బంగారు మృగమును చూచెను. సీతాదేవి దానిని కావలయునని రాముని ప్రేరేపించినది. రాముడప్పుడు సీతాదేవినిలక్ష్మణుని వద్దనుంచి ఆ మృగమును చంపుటకు స్వయముగా వెళ్ళెను. దానిని బాణముతో కొట్టగా ఆ మాయామృగము హరిని స్మరించుచు లక్ష్మణా యని పిలుచుచు చనిపోయెను. మృగ రూపము పోయి ఆ రాక్షసుడు దివ్యరూపమును ధరించి రత్న విమానమున వైకుంఠమునకు వెళ్ళెను.

అతడు వైకుంఠమున నున్న శ్రీహరి ద్వారపాలకులగు జయవిజయులకు కింకరుడు. అందువలన తిరిగి వైకుంఠమును చేరెను.

అథ శబ్దం చ సశ్రుత్వా లక్ష్మణతి చ విక్లవం | సీతా తంప్రేరయామాస లక్ష్మణం రామసన్నిధౌ || 42

గతే చ లక్ష్మణ రామే రావణో దుర్నివారణః | సీతాం గృహీత్వా ప్రయ¸° లంకామేన స్వలీలయా || 43

విషసాద చ రామశ్చ వనే దృష్ట్వా చ లక్ష్మణం | తూర్ణం చ స్వాశ్రమం గత్వా సీతాం నైవ దదర్శ సః || 44

మూర్ఛాం సంప్రాప్య సుచిరం విలలాప భృశం పునః | పునర్బభ్రామ గహనే తదన్వేషణ పూర్వకం || 45

కాలే సంప్రాప్య తద్వార్తాం గృధ్ర ద్వారా నదీతటే | సహాయం వానరం కృత్వా చాబధ్నాత్సాగరం హరిః || 46

లంకాం గత్వా రఘుశ్రేష్ఠశ్చావధీత్సాయకేన చ | సబాంధవం రావణం చ సీతాం సంప్రాప దుఃఖితాం || 47

తాం చ వహ్నిపరీక్షాం వై కారయామాస సత్వరం | హుతాశనస్తత్ర కాలే వాస్తవీం జానకీం దదౌ || 48

ఛాయా చోవాచ వహ్నిం చ రామం చ వినయాన్వితా | కరిష్యామీతి కి మహం తదుపాయం వదస్వమే || 49

లక్ష్మణా యను దీన స్వరమును విని సీతాదేవి లక్ష్మణుని రాముని దగ్గరకు పంపెను. లక్ష్మణుడు, రాముడు లేని సమయమున రావణుడు సీతనెత్తుకొని లంకకు పోయెను. రాముడు తన దగ్గరకు వచ్చుచున్న లక్ష్మణుని చూచి విషాదముతో తన ఆశ్రమమునకు వెళ్ళగా సీతాదేవి అచ్చట కన్పడలేదు. అందువలన రాముడు మూర్ఛపోయి చాలాకాలము విలపించి ఆమెను వెదకుచు అడిలో తిరిగెను. తరువాత కొంతకాలమునకు సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయెనన్న వార్తను జటాయువను గద్దవలన విని వానరులను సహాయము చేసికొని సముద్రమున వంతెన నిర్మించెను. తరువాత తన బాణములతో రావణుని బాంధవసహితముగా వధించి దుఃఖించుచున్న సీతాదేవిని పొందెను. వెంటనే వహ్నిపరీక్ష చేయగా అగ్ని దేవుడు రామునకు నిజమైన సీతాదేవినిచ్చెను. అప్పుడు మాయాసీత రామునితో అగ్నితో నేనిప్పుడేమి చేయలెనని అడిగినది.

వహ్నిరువాచ- అగ్నిదేవుడిట్లు పలికెను-

త్వం గచ్ఛ తపసే దేవి పుష్కరం చ సుపుణ్యదం | కృత్వా తపస్యాం తత్రైవ స్వర్గలక్ష్మీర్భవిష్యసి || 50

సాచ తద్వచనం శ్రుత్వా ప్రతేపే పుష్కరే తపః | దివ్యం త్రిలక్షవర్షంచ స్వర్గే లక్ష్మీర్బభూవ హ || 51

సా చ కాలేన తపసా యజ్ఞకుండ సముద్భవా | కామినీ పాండవానాం చద్రౌపదీ ద్రుపదాత్మజా || 52

కృతేయుగే వేదవతీ కుశధ్వజ సుతాం సతీ | త్రేతాయాం రామపత్నీ చ సీతేతి జనకాత్మజా || 53

తచ్ఛాయా ద్రౌపదీ దేవీ ద్వాపరే ద్రుపదాత్మజా | త్రిహాయణీతి సా ప్రోక్తా విద్యమానా యుగత్రయే || 54

ఓమాయ సీతా! నీవు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి తపస్సు చేసి స్వర్గలక్ష్మివి కమ్ము. అను అగ్నిదేవుని మాటలననుసరించి ఆమె పుష్కర క్షేత్రమున తపస్సుచేసి స్వర్గలక్ష్మియైనది. ఆమెయే తరువాత ద్రుపదపుత్రికగా యజ్ఞకుండమున జన్మించి పాండవులకు భార్యయైనది.

కృతయుగమున వెదవతిగా, త్రేతాయుగమున జనకాత్మజ రాముని భార్యయగు సీతగా, ద్వాపర యుగమున ద్రుపదాత్మజయగు ద్రౌపదిగా అవతరించినది. ఈవిధముగా మూడు యుగములందున్నందువలన ఆమె త్రిహాయణి యను పేరు పొందినది.

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-

ప్రియాః పంచ కథం తస్యా బభూవుర్మునిపుంగవ | ఇతిమే చిత్తసందేహం దూరీకురు మహాప్రభో || 55

ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలెట్లైరి అను నా సందేహమును తీర్పుడని నారాయణుని అడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు బదులు పలినెను-

లంకాయాం వస్తుతః సీతా రామం సంప్రాప నారద | రూప¸°వన సంపన్నా ఛాయా సా బహు విహ్వలా || 56

రామాగ్న్యోరాజ్ఞయా తప్త్వా యయాచే శంకరం వరం | కామాతురా పతి వ్యగ్రా ప్రార్థయం తీ పునః పునః || 57

పతిందేహి పతిందేహి పతిం దేహి త్రిలోచన | పతిం దేహిం పతిం దేహి పంచవారం పతివ్రతా || 58

శివస్తత్ర్పార్థనాం శ్రుత్వా సస్మితో రసికేశ్వరః | ప్రియే తవ ప్రియాః పంచ భవంతీతి వరం దదౌ | 59

తేనాసీత్పాండవానాం చ పంచానాం కామినీ ప్రియా | ఇత్యేవం కథితం సర్వం ప్రస్తుతం శ్రుణు || 60

అగ్ని పరీక్ష సమయమున నిజమైన సీత రాముని చేరినది. కాని మాయసీతకు రూపము ¸°వనము ఉండుటవలన అగ్నియొక్క ఆజ్ఞననుసరించి శంకరుని గురించి తపమాచరించి భర్తను పొందగోరెను. శంకరుడామెకు ప్రత్యక్షమైనప్పుడు భర్తను నాకిమ్మని ఐదుమార్లు శివుని కోరినది. రసికేశ్వరుడైన పరమశివుడు ఆమె కోరికను విని చిరునవ్వుతో నీకు ఐదుగురు భర్తలుందురని చెప్పెను. అందువలననే ద్రౌపదీ దేవి పంచపాండులకు భార్యయైనది. అని నారాయణుడు నారదుని సందేమము తీర్చెను.

అధ సంప్రాప్య లంకాయాం సీతాం రామో మనోహరాం | విభీషణాయ తాం లంకాం దత్వాzయోధ్యాం య¸°పునః || 61

ఏకాదశసహస్రాబ్దం కృత్వారాజ్యం చ భారతే | జగామ సర్వైర్లోకైశ్చ సార్థం వైకుంఠమేవ చ || 62

కమలాంశా వేదవతీ కమలాయాం వివేశ సా | కథితం పుణ్యమాఖ్యానం పుణ్యదం పాపనాశనం || 63

సతతం మూర్తిమంతశ్చ వేదాశ్చత్వార ఏవచ | సంతి యస్యాశ్చ జిహ్వాగ్రే సాచ వేదవతీ స్మృతా || 64

కుశధ్వజ పుతాఖ్యానం ఉక్తం సంక్షేపతస్తవ | ధర్మధ్వజ సుతాఖ్యానం నిబోధ కథయామితే || 65

రాముడు లంకలో తన నిజ సీతను పొంది లంకా రాజ్యమును విభీషణున కొసగి అయోద్యకు వెళ్ళెను. అచ్చట పదకొండు వేల సంవత్సరములు రాజ్యము చేసి అందరితో కలసి వైకుంఠమునకు వెళ్ళెను. నాల్గువేదములు ఎల్లప్పుడు నాలుకపైననే ఉన్నందువలన ఆమె వేదవతి యైనది. వేదవతీ కథ మిక్కిలి పుణ్యమునిచ్చును.

ఇక ధర్మధ్వజుని కూతురు వృత్తాంతమును వినిపింతును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానే వేదవతీ ప్రస్తావనం నామ చతుర్దశోzధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారద నారాయణ సంవాదమున చెప్పబడిన తులస్కుపాఖ్యానములోని వేదవతీ ప్రస్తావనమను

పదునాలుగవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters