sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

దశమోధ్యాయః - గంగోపాఖ్యానము

నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లు పలికెను -

శ్రుతం పృథివ్యుపాఖ్యానం అతీవ సుమనోహరం | గంగోపాఖ్యానమధునా వద వేదవిదాం వర|| 1

భారతం భారతీశాపాత్‌ ఆజగామ సురేశ్వరీ | విష్ణు స్వరూపా పరమా స్వయం విష్ణుపదీ సతీ || 2

కథం కత్ర యుగే కేన ప్రార్థితా ప్రేరితా పురా | తత్ర్కమం శ్రోతుమిచ్చామి పాపఘ్నం పుణ్యదం శుభః || 3

శ్రీమన్నారాయణమూర్తీ! నీ అనుగ్రహమువలన మనోజ్ఞమైన పృథివీ ఉపాఖ్యానమును వింటిని. ప్రస్తుతము మీరు నాకు గంగోపాఖ్యానమును వివరింపుడు. భారతీదేవియొక్క శాపమువలన సురేశ్వరియైన గంగాదేవి విష్ణుస్వరూపయైనను భారతక్షేత్రమునకు వచ్చెనని తెలిపితిరి. విష్ణుపదియైన ఆ గంగాదేవిని భూమిపైకి ఎవరు ఏయుగమున తీసుకొనివచ్చిరి. పాపములను తొలగించునది పుణ్యములు కలిగించునది యగు ఆ వృత్తాంతమునంతయు నాకు వివరించి చెప్పగలరు.

నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు పలికెను -

రాజరాజేశ్వరః శ్రీమాన్‌ సగరః సూర్యవంశజః | తస్య భార్యా చ వైదర్భీ శైబ్యాచ ద్వే మనోహరే || 4

సత్యస్వరూపః సత్యేష్టః సత్యవాక్‌ సత్యభావనః | సత్య ధర్మ విచారజ్ఞః పరం సత్యయుగోద్భవ || 5

ఏకకన్యశ్చైకపుత్రో బభూవ సుమనోహరః | అసమంజఇతిఖ్యాతః శైబ్యాయాం కులవర్ధనః || 6

అన్యా చారాధయామాస శంకరం పుత్రకాముకీ | బభూవ గర్భః తస్యాశ్చ శివస్య తు వరేణ చ || 7

గతే శతాబ్దే పూర్ణేచ మాంసపిండం సుషావ సా | తద్దృష్ట్వా చ శివం ధ్యాత్వా రురోదోచ్చైః పునః పునః || 8

శంభుర్భ్రాహ్మణ రూపేణ తత్సమీపం జగామ హ | చకార సంవిభ##జ్యైతత్‌ పిండం షష్టి సహస్రధా || 9

సర్వే బభూవుః పుత్రాశ్చ మహాబలపరాక్రమాః | గ్రీష్మమధ్యాహ్న మార్తండ ప్రభాజుష్ట కళేబరాః || 10

కపిలర్షేః కోపదృష్ట్యా బభూవుర్భస్మసాచ్చతే | రాజా రురోద తచ్ఛృత్వా జగామ మరణం శుచా || 11

నారదా! సూర్యవంశములో సగరుడను చక్రవర్తి కలడు. అతనికి వైదర్భీ, శైబ్యా అను ఇద్దరు భార్యలు కలరు. సత్యమునే మాట్లాడు స్వభావము, సత్యమైన విషయములనే భావించువాడు,సత్యయుగమున పుట్టిన ఆ చక్రవర్తికి శైబ్యయను భార్యయందు వంశవర్ధనుడైన అసమంజసుడను పుత్రుడు కలిగెను. అందువలన సంతానములేని వైదర్భి పుత్రసంతానము కావలెనని శంకరుని ఆరాధించినది. శివునియొక్క వరమువలన ఆమె గర్భము ధరించినది. కాని నూరు సంవత్సరములవరకు ఆమె గర్భమట్లే ఉండెను. చివరకు నూరు సంవత్సరములు నిండిన తరువాత ఆమె ఒక మాంసము ముద్దకు జన్మనిచ్చినందువలన ఆమె శివుని ధ్యానించుచు పెద్దగా ఏడ్వసాగెను. అప్పుడు శివుడు బ్రాహ్మణ వేషధారియై అచ్చటకు వచ్చి ఆ పిండమును అరువదివేల తునకలుగా చేసి వాటికి జీవమును ప్రసాదించెను. ఆ అరువదివేల పుత్రులు మహాబలపరాక్రములు, మధ్యాహ్న సూర్యుని వంటి కాంతిగలవారు. కాని ఒకప్పుడు కపిలమహర్షిని అవమానించి అతని కోపాగ్నివలన అందరు బూడిదగా మారిరి. సగరుడు అతని పుత్రులు చనిపోయిన వృత్తాంతమును విని శోకముచే మరణమును పొందెను.

తపశ్చకారాసమంజో గంగానయకారణాత్‌ | తపః కృత్వా లక్షవర్షం మ్రియతే కాలయోగతః || 12

దిలీపస్తస్య తనయో గంగానయనకారణాత్‌ | తపః కృత్వా లక్షవర్షం య¸°లోకాంతరం నృపః | 13

అంశుమాంస్తస్య పుత్రశ్చ గంగానయనకారణాత్‌ | తపః కృత్వా లక్షవర్షం మృతశ్చ కాలయోగతః || 14

గంగానదిని భూమికి తెచ్చి తన తమ్ములను పాపవిముక్తులుగా చేయవలెనని అసమంజసుడు లక్షసంవత్సరములు తపస్సుచేసి కాలవశాత్తు చనిపోయెను. అతని పుత్రుడైన దిలీపుడు కూడా లక్షసంవత్సరములు గంగకొరకు తపస్సు చేసి లోకాంతరగతుడయ్యెను. తరువాత అంశుమంతుడనే దిలీపరాజు పుత్రుడు కూడా గంగకొరకు లక్ష సంవత్సరములు తపస్సుచేసి కాలమునిండి చనిపోయెను.

భగీరథస్తస్య పుత్రో మహాభాగవతః సుధీః | వైష్ణవో విష్ణుభక్తశ్చ గుణవానజరామరః || 15

తపః కృత్వా లక్షవర్షం గంగానయనకారణాత్‌ | దదర్శ కృష్ణం హృష్టాస్యం సూర్యకోటి సమప్రభం || 16

ద్విభుజం మురళీహస్తం కిశోరం గోపవేషకం | పరమాత్మానమీశం చ భక్తానుగ్రహ విగ్రహం || 17

స్వేచ్ఛామయం పరం బ్రహ్మ పరిపూర్ణతమం విభుం | బ్రహ్మ విష్ణుశివాద్యైశ్చ స్తుతం మునిగణౖర్యుతం || 18

నిర్లిప్తం సాక్షిరూపం చ నిర్గుణం ప్రకృతేః పరం | ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం || 19

వహ్నిశుద్ధాంశుకాధానం రత్నభూషణ భూషితం | తుష్ఠాన దృష్ట్వా నృపతిః ప్రణమ్య చ పునః పునః || 20

లీలయా చ వరం ప్రాప వాంఛితం వంశతారకం | తత్రాజగామ గంగా సా స్మరణాత్పరమాత్మనః || 21

తం ప్రణమ్య ప్రతస్థౌచ తత్పురః సంపుటాంజలిః | ఉవాచ భగవాంస్తత్ర తాం దృష్ట్వా సుమనోహరాం || 22

కుర్వతీం స్తవనం దివ్యం పులకాంచిత విగ్రహాం |

దిలీప మహారాజు పుత్రుడు భగీరథుడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఆ భగీరథుడు గంగను భూమికి తీసికొని రావలెనని లక్షవర్షములు తపస్సు చేయగా కోటి సూర్యులకాంతి కలవాడు, రెండు భుజములు కలవాడు, చేతిలో మురళిని ధరించినవాడు గొల్లవాని వేషమున నున్న కిశోరమూర్తి పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మాది దేవతలచే సేవింపబడినవాడు, భక్తులననుగ్రహించువాడు, బంగారువన్నెగల వస్త్రము ధరించినవాడు, రత్న భూషణములు ధరించినవాడగు శ్రీకృష్ణుడు దర్శనమొసగెను.

ఆ పరాత్పరుని చూచి మహాభాగవతుడైన భగీరథుడు పునఃపునః నమస్కారములొనర్చి తన పూర్వీకులకు తరింపజేయువరమును పొందెను.

ఆపరమాత్ముని స్మరించగానే గంగాదేవి అచ్చటకు వచ్చిచేతులు జోడించి నమస్కరించి నిలుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు తనను స్తోత్రము చేయుచు పులకించిపోయిన గంగాదేవిని చూచి ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను -

భారతం భారతీ శాపాత్‌ గచ్ఛ శీఘ్రం సరేశ్వరి || 23

సగరస్య సుతాన్‌ సర్వాన్‌ పూతాన్‌ కురు మామాజ్జయా | త్వత్‌స్పర్శవాయునా పూతా యాస్యంతి మమ మందిరం || 24

బిభ్రతో దివ్యమూర్తిం తే దివ్యస్యందన గామినః | మత్పార్షదా భవిష్యంతి సర్వకాలం నిరామయాః || 25

కర్మభోగం సముచ్ఛిద్య కృతం జన్మని జన్మని | నానావిధం మహాత్స్వల్పం పాపం స్యాత్‌ భారతే నృభిః || 26

గంగాయాః స్పర్శవాతేన నశ్యతీతి శ్రుతౌ శ్రుతం | స్పర్శనం దర్శనాద్దేవ్యాః పుణ్యం దశగుణం తతః || 27

మౌసలస్నాన మాత్రేణ సామాన్య దివసే నృణాం | కోటగి జన్మార్జితం పాపం నశ్యతీతి శ్రుతౌ శ్రుతం || 28

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | నానా జన్మార్జితాన్యేవ కామతోzపి కృతాని చ || 29

తాని సర్వాణి నశ్యంతి మౌసల స్నానతో నృణాం | పుణ్యాహస్నానజం పుణ్యం వేదానైన వదంతి చ || 30

ఓ గంగాదేవి ! సరస్వతీ దేవి యొక్క శాపముననుసరించి నీవు భారత క్షేత్రమునకు వెంటనే వెళ్ళి సాగరుని యొక్క పుత్రులనందరను పవిత్రము చేయుమ. వారందరు నీ స్పర్శవలన నీ వాయువు వలన పవిత్రులై దివ్యములైన శరీరముల ధరించి దివ్యవస్కందనములనధిరోహించి నాలోకమునకు వచ్చి ఎల్లప్పుడు నాకు అ నుచరులుగానుందరు.

గంగయొక్క స్పర్శవలన గాలివలన భారతభూమిలోనున్న ప్రజలు తమ పూర్వ పూర్వజన్మలలో చేసికొన్న కర్మభోగమును పోగొట్టుకొని పాపములనన్నిటిని విడనాడుదురని వేదములలో చెప్పబడినది.

గంగాదేవి దర్శనముకంటే స్పర్శనము (స్నానంచేయుట) పదిరెట్లు ఎక్కువ పుణ్యము నిచ్చును. సామాన్య దినమున మౌసలస్నానము చేసినచో (రోకలివలె మునిగినను) కోటిజన్మలలో చేసికొన్న పాపము నశించునని వేదములందు చెప్పబడినది. నానాజన్మలలో చేసికొన్న బ్రహ్మహత్యాది పాపాములన్నియు మౌసల స్నానమువలన నశించును. ఇక పుణ్యదినమున గంగలో స్నానము చేసినచో కలుగు ఫలితమును వేదములు కూడ చెప్పలేవు.

బిభ్రతీం కబరీభారం మాలతీ మాల్య సంయుతాం | సిందూరబిందులలితాం సార్ధం చందన బిందుభిః || 100

కస్తూరీ పత్రకం గండే నానాచిత్ర సమన్వితం | పక్వ బింబ సమానైక చార్పోష్ఠపుటముత్తమం || 101

ముక్తాపంక్తి ప్రభాజుష్ట దంతపంక్తి మనోహరం | సుచారు వక్త్రనయనాం సకటాక్ష మనోరమాం || 102

కఠినం శ్రీఫలాకారం స్తనయుగ్మం చ బిభ్రతీం | బృహచ్ఛ్రోణీం సుకఠినాం రంభాస్తంభపరిష్కృతాం || 103

స్థలపద్మ ప్రభాజుష్ట పాదపద్మయుగం ధరాం | రత్నాభరణ సంయుక్తాం కుంకుమాక్తాం సయావకాం || 104

దేవేంద్రమౌళిమందార మకరందకణారుణాం | సురసిద్ధమునీంద్రాది దత్తర్ఘ్యే సంయుతాం సదా || 105

తపస్విమౌళి నికర భ్రమరశ్రేణి సంయుతాం | ముక్తిం ప్రదాం ముముక్షూణం కామినాం స్వర్గభోగదాం || 106

వరాం వరేణ్యాం వరదాం భక్తానుగ్రహ కాతరాం | |శ్రీవిష్ణోః పదదాత్రీం చ భ##జే విష్ణుపదీం సతీం || 107

గంగాదేవి తెల్లని చంపక పుష్పమువంటి కాంతికలది. పాపములను పోగొట్టునది. శ్రీకృష్ణుని నుండి జన్మించినది. బంగారువన్నెగల వస్త్రమును ధరించునది. రత్నభూషణములు కలది. పూర్ణచంద్రునివలె తెల్లనైనది. నారాయణునకు ఇష్షురాలు. సత్పౌభాగ్యసమన్విత. మాలతీ మాలగల కొప్పుగలది. చందనపుచుక్కలతో నున్న సిందూర బిందువులతో అలంకృత. చెక్కిలి ప్రదేశమనున అనేక చిత్రములు కల కస్తూరి పత్రములు కలది. దొండపండు వంటి పెదవులు, ముత్యాలవంటి దంతములు కలది. అందమైన ముఖము, బృహత్‌శ్రోణి, పద్మములవంటి పాదములు కలది. ఆ పాదములు రత్నాభరణములు కలవి. దేవేంద్రాది దేవతలు నమస్కరించుచున్నందువలన వారి శిరస్సులందున్న మందార పుష్పముల మకరందంముతో ఎఱ్ఱనైనది. ఆ గంగాదేవిని మునీంద్రులెల్లప్పుడు సేవించుచుందురు. ఆమె మోక్షమును కోరువారికి మోక్షమును, కాములకును స్వర్గమునిచ్చును. భక్తులననుగ్రహించునది, వైకుంఠమునిచ్చునది అగు గంగాదేవిని నమస్కరింతును.

ఇతిధ్యానేన చానేన ధ్యాత్వా త్రిపథగాం శుభాం | దత్వా సంపూజయే ద్బ్రహ్మన్‌ ఉపచారాంశ్చ షోడష || 108

ఆసనం పాద్యమర్ఘ్యంచ స్నానీయం చానులేపనం | ధూపం దీపంచ నైవేద్యం తాంబూలం శీతలం జలం || 109

వసనం బూషణం మాల్యం గంధమాచమనీయకం | మనోహరం సుతల్పం చ దేయాన్యేతాని షోడశ || 110

దత్వా భక్త్యా సంప్రణమేత్‌ స్తుత్వా తాం సంపుటాంజలిః | సంపూజ్యైవం ప్రకారణ సోzశ్వమేధఫలం లభేత్‌ || 111

ఇటువంటి ధ్యానపద్ధతితో గంగాదేవిని ధ్యానించి షోడశోపచారములతో ఆమెను పూజించవలెను. ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, అనులేపనం, వస్త్రం, భూషణం, మాల్యం గంధం, ధూపం, దీపం నైవేద్యం శీతలజలం, తాంబూలం, శయ్య అనునవి షోడశోపచారములు. షోడశోపచార పూజ చేసి చేతులు జోడించుకొని నమస్కరించినచో అశ్వమేధ ఫలము లభించగలదు.

స్తోత్రం వై కౌథుమోక్తం చ సంవాదం విష్ణువేధసోః | శ్రుణు నారద వక్ష్యామి పాపఘ్నంచ సుపుణ్యదం || 112

నారద! పాపములను తొలగించునది పుణ్యములనిచ్చునది అగు బ్రహ్మ విష్ణుల సంవాదమును, కౌథుమోక్తస్తోత్రమును ఇప్పుడు వినుము.

శ్రీ బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను -

శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత నమః ప్రభో | విష్ణో విష్ణుదీస్తోత్రం పాపఘ్నం పుణ్యకారణం || 113

ఓ మహావిష్ణూ! నిన్ను నమస్కరింతును. పాపములను తొలగించి పుణ్యములను కలిగించు గంగాదేవి స్తోత్రమును వినదల్చితినని బ్రహ్మదేవుడు పలికెను.

శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లు చెప్పెను-

శివసంగీత సంముగ్ధ శ్రీ కృష్ణాంగద్రవోద్భవాం | రాధాంగద్రవసంభూతాం తాం గంగాం ప్రణమామ్యహం || 114

యాజన్మ సృష్టేరాదౌచ గోలోకే రాసమండలే | సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం || 115

గోపైర్గోపీభిరాకీర్ణే శుభేరాధామహోత్సవే | కార్తీకీ పూర్ణిమా జాతాం తాం గంగాం ప్రణమామ్యహం || 116

కోటి యోజన విస్తీర్ణా దైర్ఘ్యే లక్షగుణా తతః | సమావృతా యాగోలోకం తాం గంగాం ప్రణమామ్యహం || 117

షష్టిలక్షైర్యోజనైర్యా తతో దైర్ఘ్యే చతుర్గుణా | సమావృతా యా వైకుంఠం తాం గంగాం ప్రణమామ్యహం || 118

వింశల్లక్షైర్యోజనైర్యా తతో దైర్ఘ్యే చతుర్గుణా | ఆవృతా బ్రహ్మలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం || 119

త్రింశల్లక్షై ర్యోజనైర్యా దైర్ఘ్యే పంచగుణా తతః | ఆవృతా శివలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం || 120

షడ్యోజన సువిస్తీర్ణా దైర్ఘ్యే దశాగుణా తతః | మందాకినీ యేంద్రలోకే తాం గంగాం ప్రణమామ్యహం || 121

లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే సప్తగుణా తతః | ఆవృతా ధ్రువలోక యా తాం గంగాం ప్రణమ్యామహం || 122

లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే షడ్గుణితా తతః | ఆవృతా చంద్రలోకం యా తాం గంగా ప్రణమామ్యహం ||1 23

యోజనైష్షష్టి సాహసై#్రః దైర్ఘ్యే దశగుణా తతః || ఆవృతా సూర్యలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం || 124

లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే షడ్గుణితా తతః | ఆవృతా సత్యలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం || 125

దశలక్ష్యైజనైర్యా దైర్ఘ్యే పంచగుణా తతః | ఆవృతా యాతపోలోకం తాం గంగాం ప్రణమామ్యహం || 126

సహస్రయోజనాయాచ దైర్ఘ్యే సప్తగుణా తతః | ఆవృతా జనలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం || 127

సహస్రయోజనాzయామే దైర్ఘ్యే సప్తగుణా తతః | అవృతా యా చ కైలాసం తాం గంగాం ప్రణమామ్యహం || 128

గంగాదేవి శివుని సంగీతమునకు ముగ్ధుడైన శ్రీకృష్ణుని శరీరము నుండి, రాధాదేవి యొక్క శరీరము నుండి ఉద్భవించినది. సృష్టికి పూర్వము గోలోకమున రాసమండలమున ఉన్న శంకరుని సమీపమున ఉండినది. ఆమె కార్తీక పౌర్ణమినాడు పుట్టినది. ఆ గంగ గోలోకమున కోటి యోజనముల విస్తీర్ణముతో లక్షకోట్ల యోజనముల దూరము ప్రవహించుచున్నది. వైకుంఠలోకమున అరువై లక్షల యోజనముల వైశాల్యముతో దానికి నాల్గురెట్లున్న దైర్ఘ్యముతో నున్నది. ఆ గంగానదియే బ్రహ్మలోకమున ఇరవై లక్షల యోజనముల వైశాల్యముతో దానికి నాలుగురెట్లు పొడవుతో నున్నది. శివలోకమున ఆ గంగానది ముపై#్పలక్షల యోజనముల వైశాల్యముతో వైశాల్యానికి ఐదురెట్లు పొడవై ప్రవహించుచున్నది. ఇంద్రలోకమున ఆరుయోజనముల విస్తీర్ణముతో దానికి పదిరెట్లెక్కువ పొడవుతో ప్రవహించుచున్నది. అట్లే ఆ నది ధ్రువలోకమున లక్షయోజనముల విస్తీర్ణముతో దానికి ఏడురెట్లు ఎక్కువగా ఉన్న పొడవుతో నున్నది. చంద్రలోకమున లక్షయోజనముల విస్తీర్ణమై దానికి ఆరురెట్లున్న దైర్ఘ్యముతో కనిపించును. సూర్యలోకమున అరవై వేల యోజనముల వైశాల్యముతో దానికి పదిరెట్లెక్కువున్న దైర్ఘ్యముతో కనిపించును. ఆదే విధముగా సత్యలోకమున లక్షయోజనముల విస్తీర్ణముతో ఆరులక్షల పొడవుతో ప్రవహించుచున్నది. అట్లేకైలాసమున ఒక వేయి యోజనముల విస్తీర్ణముతో ఏడువేల యోజనముల పొడవుతో కన్పించును.

పాతాళే యా భోగవతీ విస్తీర్ణా దశయోజనే | తతో దశగుణా దైర్ఘ్యేతాం గంగాం ప్రణమామ్యహం || 129

క్రోశక మాత్ర విస్తీర్ణా తతః క్షీణా నకుత్రచిత్‌ | క్షితౌ చాలకనందా యా తాం గంగాం ప్రణమామ్యహం || 130

సత్యే యాక్షీరవర్ణా త్రేతాయామిందు సన్నిభా | ద్వాపరే చందనాభా చ తాం గంగాం ప్రణమామ్యహం || 131

జలప్రభా కలౌ యా చ నాన్యత్ర పృథివీతలే | స్వర్గే చ నిత్యం క్షీరాభా చ తాం గంగాం ప్రణమామ్యహం || 132

యస్యాః ప్రభావ అతులః పురాణ చ శ్రుతౌ శ్రుతః | యా పుణ్యదా పాపహర్త్రీ తాం గంగా ప్రణమామ్యహం || 133

ఈ గంగానది పాతాళ లోకమున భోగవతి యను పేరుతో కనిపించును. అచ్చట పది యోజనముల వైశాల్యము వందయోజనముల పొడవుతో ప్రవహించుచున్నది. భూమిపై నున్న గంగను అలకనంద యని పిలుతురు. ఒక క్రోసు వైశాల్యముతో అంతే ఉన్నదైర్ఘ్యముతో భూమిపై కనిపించును.

ఈగంగానది సత్యలోకమున పాలవలె తెల్లగానుండును. త్రేతాయుగమున పూర్ణచంద్రుని వలె తెల్లగా ఉండును. ద్వాపరయుగమున చందనపు కాంతితో కలియుగమున నీటి కాంతితో నున్నది.

ఆమె యొక్క ప్రభావము గురించి వేదములలో పురాణములలో కన్పించును. పవిత్రమైనది, పాపములను తొలగించునది ఐన గంగా దేవిని నమస్కరింతును.

యత్తోయ కణికా స్పర్శః పాపినాం చ పితామహ | బ్రహ్మహత్యాదికం పాపం కోటి జన్మార్జితం దహేత్‌ || 134

ఇత్యేవం కథితం బ్రహ్మన్‌ గంగా పద్యైక వింశతిం | స్తోత్రరూపం చ పరమం పాపఘ్నం పుణ్యబీజకం || 135

నిత్యం యోహి పఠేద్భక్త్యా సంపూజ్య చ సురేశ్వరీం | అశ్వమేధఫలం నిత్యం లభ##తే నాత్ర సంశయః || 136

అపుత్రో లభ##తే పుత్రం భార్యాహీనో లభేత్‌ ప్రియాం | రోగాన్ముచ్యేత రోగీచ బద్ధోముచ్యేత బంధనాత్‌ || 137

ఆస్పష్టకీర్తిః సుయశా మూర్ఖో భవతి పండితః | యః పఠేత్‌ ప్రాతరుత్థాయ గంగాస్తోత్రమిదం శుభం || 138

శుభం భ##వేత్తు దుఃస్వప్నం గంగాస్నానఫలం లభేత్‌ || 139

ఓ బ్రహ్మదేవుడా! గంగానది యొక్క నీటి తుంపరలే కోటి జన్మలలో చేసిన బ్రహ్మహత్యాది పాపములనన్నిటిని హరించును. ఇరువది యొక్క పద్యములలో నున్న గంగాస్తోత్రము పాపములనన్నిటిని హరించి పుణ్యమును కలిగించును.

ఈస్తోత్రమును ప్రతిదినము గంగాదేవిని పూజించి ఎవడు చదువునో అతడు అశ్వమేధ యాగఫలితముననుభవించును. ఈ స్తోత్రమును ప్రతిదినము ఉదయముననే లేచి చదివినచో పుత్రులు లేని వాడికి పుత్రలు లభింతురు. భార్యాహీనునకు భార్య లభించును. రోగి రోగమునుండి ముక్తిని పొందును. కారాగృహబద్ధుడు కూడా ముక్తిని పొందును. కీర్తి కావలెననుకొనినచో చక్కని కీర్తి లభించును. మూర్ఖుడైనా పండితుడై కీర్తిని పొందును. అతని దుఃస్వప్నములన్ని నశించి శుభము జరుగును. గంగాస్నానము వల్ల కలుగు ఫలితములన్నింటిని పొందును.

నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు పలికెను -

భగీరథోzనయా స్తుత్యా స్తుత్వాం గంగాం చ నారద | జగామ తాం గృహీత్వా చ యత్ర నష్ఠాశ్చ సాగరాః || 140

వైకుంఠం తే యుయుస్తూర్ణం గంగాయాః స్పర్శవాయునా | భగీరథేన సాzనీతా తేన భాగీరథి స్మృతా || 141

ఇత్యేవం కథితం సర్వం గంగోపాఖ్యానముత్తమం | పుణ్యదం మోక్షదంసారం కింభూయః శ్రోతుమిచ్ఛసి || 142

భగీరథ చక్రవర్తి ఈ స్తోత్రముచే గంగాదేవిని సంతోషపెట్టి ఆనదిని వెంట తీసికొని తన పూర్వీకులైన సాగరులు నశించిన స్థలమునకు తీసికొని వెళ్ళెను. ఆ సగరపుత్రులు గంగానది యొక్క వాయుస్పర్శచేతనే వైకుంఠమునకు వెళ్ళిరి. భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తెచ్చినందువలన ఆమెకు ''భాగీరథీ'' యనుపేరు వచ్చినది.

నారద! ఈ విధముగా నీకు గంగోపాఖ్యానము నంతయు తెలిపినాను. ఇంకను నీవు తెలిసికొనవలెనన్న విషయములు గలవేని అడుగుమని నారాయణుడనెను.

నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లనెను -

శివసంగీత సంముగ్ధే శ్రీకృష్ణే ద్రవతాం గతే | ద్రవతాం చ గతాయాం చ రాధాయం కిం బభూవ హ || 143

తత్రస్థాశ్చ జనాయేయే తే చ కిం చక్రురుద్యమం | ఏతత్సర్వం సువీస్తీర్ణం ప్రభో వక్తుమహిర్హసి || 144

శ్రీకృష్ణపరమాత్మ. రాధాదేవి శివసంగీతమునకు ముగ్ధులై ద్రవమైనప్పుడు ఏమి జరిగినది. అచట నున్నవారు ఏమి చేసిరి మొదలగు విషయములను వివరించి చెప్పుడు.

నారాయణ ఉవాచ - నారాయణుడు ఇట్లు చెప్పెను-

కార్తికీపూర్ణిమాయాం చ రాధాయాః సుమహోత్సవే | కృష్ణః సంపూజ్య తాం రాధామవసద్రాస మండలే || 145

కృష్ణేన పూజితాం తాంతు సంపూజ్యాదృత మానసాః | ఊచుః బ్రహ్మాదయః సర్వే ఋషయః సనకాదయః || 146

ఏతస్మిన్నంతరే కృష్ణసంగీతం చ సరస్వతీ | జగౌ సుందర తానేన వీణయా చ మనోహరం || 147

తుష్టో బ్రహ్మా దదౌ తసై#్య మహారత్నాఢ్యమాలికాం | శిరోమనీంద్రసారం చ సర్వబ్రహ్మాండ దుర్లభం || 148

కృష్ణః కౌస్తుభ రత్నం చ సర్వరత్నాత్పరం వరం | అమూల్య రత్నఖచితం హారసారం చ రాధికా || 149

నారాయణశ్చ భగవాన్‌ వనమాలాం మనోహరాం | అమూల్య రత్నకలతం లక్ష్మీర్మకర కుండలం || 150

విష్ణుమాయా భగవతీ మూలప్రకృతిరీశ్వరీ | దుర్గా నారాయణీశానీ విష్ణుభక్తిం సుదుర్లభాం || 151

ధర్మబుద్ధిం చ ధర్మస్తు యశశ్చ విపులం భ##వే | వహ్నిశుద్ధాంశుకం వహ్నిః వాయుశ్చ మణి నూపురం || 152

కార్తిక పౌర్ణమినాడు రాధ ఒక మహోత్సమును జరిపినది. ఆఉత్పవకాలమున రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మ రాధాదేవిని ఆదరించి అచ్చట కూర్చుండెను. శ్రీకృష్ణునిచే ఆదరింపబడిన రాధాదేవిని బ్రహ్మాది దేవతలు ఋషులందరు గౌరవించి స్తుతించిరి.

ఆసమయమున సరస్వతీ దేవి శ్రీకృష్ణుని గూర్చిన పాటలను మనోహరముగా పాడినది. ఆమె పాటకు బ్రహ్మదేవుడు సంతోషపడి మహారత్నముల మాలికను, చూడామణిని ఆమెకు ఇచ్చెను. శ్రీకృష్ణుడు అన్నిరత్నముల కంటెను మిన్నయైన కౌస్తుభరత్నమును, రాధాదేవి రత్నముల హారమును, నారాయణుడు మనోహరమైన వనమాలను, లక్ష్మీదేవి అమూల్యమైన మకర కుండలములను, దుర్గాదేవి సుదుర్లభ##మైన విష్ణుభక్తిని ధర్ముడు ధర్మబుద్దిని, కీర్తిని, అగ్ని బంగారు వన్నెగల వస్త్రమును, వాయువు మణి నూపురముల నిచ్చెను.

ఏతస్మిన్నంతరే శంభుః బ్రహ్మణా ప్రేరితా ముహుః | జగౌ శ్రీకృష్ణ సంగీతం రాసోల్లాస

సమన్వితం || 153

మూర్ఛాం ప్రాపుః సురాః సర్వే చిత్రపుత్తలికా యథా | క్షణన చేతసాం ప్రాప్య దదృశూ రాసమండలం || 154

స్థలం సర్వం జలాకీర్ణం హీనరాధాహరిం తథా | అత్యుచ్చైరురుదుః సర్వే గోపాగోప్యః సురా ద్విజః || 155

ధ్యానేన ధాతా బుబుధే సర్వమేతభీప్సితం | గతశ్చ రాధయా సార్థం శ్రీకృష్ణో ద్రవతామితి || 156

తతో బ్రహ్మాదయః సర్వే తుష్ణువుః పరమేశ్వరం | స్వమూర్తిం దర్శయ విభో వాంఛితం పరమేవ నః || 157

ఏతస్మిన్నంతరే తత్ర వాగ్భభూవాశరీరణీ | తామేవ శుశ్రువుః సర్వే సువ్యక్తాం మధురాం శుభాం || 158

సర్మాత్మాహమియం శక్తిః భక్తానుగ్రహ విగ్రహా | మామాప్యస్యాశ్చ హే దేవా దేహేన చ కిమావయోః || 159

మనవో మానవాః సర్వే మునయశ్చైవ వైష్ణవాః | మన్మంత్రపూతా మాం ద్రష్టుమాగమిష్యంతి మత్పదం || 160

మూర్తిం ద్రష్టుంచ సువ్యగ్రా యూయం యది సురేశ్వరా | కరోతి శంభుస్తత్రైవ మదీయం వాక్యపాలనం || 161

స్వయం విధాతా త్వం బ్రహ్మన్‌ఆజ్ఞాం కురుజగద్గురోః | కర్తుం శాస్త్రవిశేషం చ వేదాంగం సుమనోహరం || 162

అపూర్వమంత్రనికరైః సర్వాభీష్ఠ ఫలప్రదైః | స్తోత్రైశ్చ కవచైః ధ్యానైః యుతం పూజావిధి క్రమైః || 163

మన్మంత్రం కవచం స్తోత్రం కృత్వా యత్నేన గోపయ | భవంతి విముఖాయేన జనానాం యత్కరిష్యతి || 164

ఆసమయమున శంకరుడు బ్రహ్మదేవునిచే ప్రేరితుడై శ్రీకృష్ణుని గురించి పాటలు పాడెను. అతని పాటలు విని దేవతలందరు చిత్రములోని బొమ్మలవలె నిశ్చేష్టులైరి. కొంత కాలమునకు స్మృతిని పొంది చూడగా ఆ స్థలమంతయు జలముతో నిండినట్లు, శ్రీహరి రాధాదేవి అక్కడలేనట్లు కనుగొనిరి. భగవంతుడు రాధాదేవితో జలమైనందువలన అచ్చటనున్న దేవతలు, ఋషులు, గోపికలు, గొల్లలు అందరు ఏడ్చిరి.

అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమువలన శ్రీకృష్ణుడు రాధతో కలిసి ద్రవభూతుడైనాడని అది అతని అభీప్సితమని గుర్తించెను. అందువలన దేవతలందరు పరమేశ్వరుని స్తుతించి నీస్వరూపమును మాకు తిరగి చూపించుమని, అదియే మా అందరి కోరికయని తెల్పిరి.

అప్పుడు వారికి అశరీరవాణి స్పష్టము, మధురమైన మాటలతో ఇట్లనినది. నేను సర్వాత్మ స్వరూపుడను. ఈ రాధాదేవి భక్తుల ననుగ్రహించుటకు రూపము ధరించిన శక్తి స్వరూపిణి. మాకు దేహముయొక్క అవసరముండదు. మనువులు, మానవులు, మునులందరు, వైష్ణవులు నామంత్రమును జపించి పవిత్రులై నన్ను చూచుటకు నాలోకమునకు వత్తురు. మీకందరకు నా రూపమును చూడవలెనని యున్నచో పరమశివుడు నా ఆజ్ఞను పరిపాలించును. అట్లే బ్రహ్మదేవుడు నా ఆజ్ఞననుసరించి వేదాంగములను శాస్త్రములను, అన్ని కోరికలు తీర్చు అపూర్వమంత్రములు గల స్తోత్రములను,కవచములను, ధ్యానములు గల పూజావిధిని చేసి జాగ్రత్తగా రక్షించును.

కేచిద్వదంతి తే దేవి ఫలమేవం యథాగమం | బ్రహ్మ విష్ణుశివాద్యాశ్చ సర్వేనైవ విదంతి చ || 31

సామాన్య దివసస్నాన సంకల్పం శ్రుణుసుందరి | పుణ్యం దశగుణం చైవ మౌసల స్నానతః పరం || 32

తతస్త్రింశద్గుణం పుణ్యం రవి సంక్రమణ దినే | అమాయాంచాపి తత్తుల్యం ద్విగుణం దక్షిణాయనే || 33

తతో దశగుణం పుణ్యం నరాణాముత్తరాయణ | చాతుర్మాస్యాం పౌర్ణమాస్యామనంతం పుణ్యమేవచ || 34

అక్షయాయాం చ తత్తుల్యం నైతద్వేదే నిరూపితం | అసంఖ్యపుణ్యఫలదమేతేషు స్నానదానకం || 35

సామాన్య దివసే స్నానం ధ్యానాచ్ఛత గుణం ఫలం | మన్వంతరేషు దేవిశి యుగాదిషు తథైవ చ || 36

మాఘస్య సితసప్తమ్యాం భీష్మాష్టమ్యాం తథైవ చ | తథాzశోకాష్టమీ తిథ్యాం నవమ్యాం చ తథాహరేః || 37

తతోzపి ద్విగుణం పుణ్యం నందాయాం తవదుర్లభం | దశపాపమరాయాంతు దశమ్యాం సుమహత్ఫలం || 38

నందాసమం చ వారుణ్యాం మహాత్పూర్వం చతుర్గుణం | తతశ్చతుర్గుణం పుణ్యం ద్విమహత్పూర్వకే సతి || 39

పుణ్యం కోటిగుణం చైవ సామాన్య స్నానతో భ##వేత్‌ | చంద్రసూర్యోపరాగేషుస్మృతం దశగుణం తతః || 40

పుణ్యzప్యర్ధోదయే కాలే తతః శతగుణం ఫలం | సర్వేషామేవ సంకల్పో వైష్ణవానాం విపర్యయః || 41

కొందరు నీయందు స్నానము చేసిన ఫలతమీవిధముగా నుండునని చెప్పుచున్నారు. కాని బ్రహ్మాది దేవతలు సహితము నీస్నానఫలమును తెలియజాలరు.

ఓ సుందరి! సామాన్య దినములలో చేయు స్నానఫలమీవిధముగా నున్నది. సామాన్య దివసములందు స్నానము చేసిన మౌసల స్నానము కంటె పదిరెట్లు ఎక్కువ ఫలితము కలుగును. సూర్య సంక్రమణమున స్నానము చేసినచో సామాన్యదివస స్నానము కంటె ముప్పదిరెట్లెక్కువ ఫలితము చేకూరును. అమావాస్యనాడు చేసిన స్నానము సూర్యసంక్రమణంస్నానమువంటి ఫలితమునొసగును. దక్షిణాయన పుణ్యకాలమున స్నానము చేసినచో సూర్యసంక్రమణ స్నానఫలము కంటె రెట్టింపు ఫలితమును పొందుదురు. ఉత్తరాయణ కాలమున స్నానము చేసినచో దక్షిణాయన పుణ్యకాల ఫలితము కంటె పదిరెట్లు ఎక్కువ ఫలితమును పొందుదురు. చాతుర్మాస్యకాలమందలిపూర్ణిమనాడు గంగాస్నానము చేసినచో అనంతపుణ్యము కలుగును. అక్షతదియనాడు గంగాస్నానము చేసినచో కలుగు ఫలితమెంతటిదో వేదములు సైతం చెప్పలేకపోయినవి. మన్వంతర కాలమున, సంవత్సరాది సమయమున చేసిన స్నానము వందరెట్లెక్కువ ఫలితమునిచ్చును. మాఘశుద్దసప్తమినాడు, భీష్మాష్టమినాడు, అశోకాష్టమినాడు, శ్రీరామనవమినాడు గంగాస్నానము చేసినచో గొప్ప ఫలితమునిచ్చును. 'నందా' నాడు చేసిన గంగాస్నానము పైవాటికంటె రెండు రెట్లెక్కువ ఫలమునిచ్చును. దశపాపహరమైన విజయదశమినాడు గంగాస్నానము చేసినచో చాలా గొప్పఫలము లభించును. చంద్రసూర్యగ్రహణ కాలమున, అర్ధోదయ కాలమున గంగాస్నానముచేసిన అనంతఫలము లభించును.

కాని విష్ణుభక్తులగు వైష్ణవులు మాత్రము ఈ ఫలితము నాశించరు.

ఫలసంధాన రహితా జీవన్ముక్తాశ్చ వైష్ణవాః | మత్ప్రీతి భక్తి కామాస్తే సర్వదా సర్వకర్మసు || 42

గురువక్త్రాద్విష్ణుమంత్రో యస్య కర్ణే విశేత్పరః | జీవన్ముక్తం వేష్ణవం తం వేదాః సర్వే వదంతి చ || 43

పురుషాణాం శతం పూర్వం పైతృకం చ పరం శతం | మాతామహస్య చ శతం మాతరం మాతృమాతరం || 44

భగినీం భ్రాతరం చైవ భాగినేయం చ మాతులం | శ్వశ్రూంచ శ్వశురం చైవ గురుపత్నీం గురోః సుతం || 45

గురుం చ జ్ఞానదాతారం మిత్రం చ సహచారిణం | భృత్యం శిష్యం తథాచేటీం ప్రజాః స్వాశ్రమసన్నిధౌ || 46

ఉద్ధరేదాత్మనా సారం మంత్రగ్రహణ మాత్రతః | మంత్రగ్రహణ మాత్రేణ జీవన్ముక్తో భ##వేన్నరః || 47

శ్రీవైష్ణవులు ఏ ఫలితము నాశించరు. వారు చేయు క్మర్మలన్నియు నీ ప్రీతికై చేయుదురు. వారు నా భక్తిని మాత్రమాశింతురు. అట్టి వైష్ణవులు జీవన్ముక్తులు. గురుముఖమునుండి విష్ణుమంత్రము ఎవరి చెవినబడునో ఆ వైష్ణవుని జీవన్ముక్తుడని వేదములు ఘోషించుచున్నవి. అతడు తనకంటే నూరు తరములు పూర్వులను, నూరు తరములు తరువాతి వారిని, అట్లే తల్లి పక్షమువారిని, తల్లిని, అమ్మమ్మను, చెల్లెలిని, సోదరుని, మేనల్లుని, మేనమామను, జ్ఞానమిచ్చు గురువును, స్నేహితుని, అతని పరివారమునంతయు విష్ణుమంత్రమును గ్రహించినంతమాత్రమున ఉద్ధరించును. అతడు జీవన్ముక్తుడు కూడ అగును.

తస్య సంస్సర్వనాత్పూతం తీర్థం చ భువి భారతే | తసై#్యవ పాదరజసా సద్యః పూతా వసుంధరా || 48

పాదోదకస్థానమిదం తీర్థమేవ భ##వేత్‌ ధ్రువం | అన్నం విష్ఠా జలం మూత్రం యద్విష్టోరనివేదితం || 49

ఖాదంతి నో వైష్ణవాశ్చ సదానైవేద్యభోజినః | విష్ణోర్నివేదితాన్నం చ నిత్యం యే భుంజతే నరాః || 50

పూతాని సర్వతీర్థాని తేషాం చ స్సర్శనాదహో | విష్ణోః పాదోదకం పుణ్యం నిత్యం యే భుంజతే నరాః || 51

తత్పాపాని పలాయంతే వైనతేయా దివోరగాః | తేషాంచ దర్శనమాత్రేణ పూతం చ భువన త్రయం || 52

శ్రీవైష్ణవుల యొక్క స్పర్శవలన ఈ భూమి పవిత్రమగుచున్నది. వారి పాదధూళి సైతము ఈ భూమిని పవిత్రము చేయుచున్నది. వారి పాదోదకము కూడ ఈ భూమిని తీర్థస్థానముగా చేయుచున్నది. విష్ణుమూర్తికి నివేదించిన అన్నము మలమువంటిది నీరు మూత్రము వంటిది. అందువలన వైష్ణవులు అనివేదాతాన్నమునెప్పుడు భుజింపరు. విష్ణుమూర్తి యొక్క పాదోదకమును స్వీకరించినచో వారి పాపములన్నియు గరుత్మంతుని చూచిన సర్పము వలె పరుగెత్తిపోవును. ఆ విష్ణుభక్తులు దర్శనము వల్లనే ఈ లోకములన్నియు పవిత్రమగుచున్నవి.

విష్ణోః సుదర్శనం చక్రం సంతతం తాంశ్చ రక్షతి | మద్గుణవ్రవణాద్యైశ్చ పులకాంకిత విగ్రహాః || 53

గద్గదాః సాశ్రునేత్రాశ్చ నరాస్తే వైష్ణవోత్తమాః | పుత్రాదపి పరః స్నేహో మయి యేషాం నిరంతరం ||

గృహాద్యాశ్చ మయిన్యస్తాస్తే నరా వైష్ణవోత్తమాః || 55

ఆబ్రహ్మస్తంభపర్యంతం మత్తః సర్వ చరాచరం | సర్వేషామహమేవేశ ఇతిజ్ఞా వైష్ణవోత్తమాః || 56

అసంఖ్య కోటి బ్రహ్మాండం బ్రహ్మవిష్ణు శివాదయః | ప్రళ##యే మయి లీయంతే చేతిజ్ఞా వైష్ణవోత్తమాః || 57

తేజః స్వరూపం పరమం భక్తానుగ్రహ విగ్రహం | స్వేచ్ఛామయం నిర్గుణం చ నిరీహం ప్రకృతేః పరం || 58

సర్వే ప్రాకృతికా మత్త ఆవిర్భూతాస్తిరోహితాః | ఇతి జానంతి యే దేవి తే నరా వైష్ణవోత్తమాః || 57

శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము వారినెప్పుడు రక్షించును. నాగుణములను వినుటవలన గగుర్పొడిచిన శరీరము కలవారై, గద్గద కంఠముతో కన్నీళ్లు స్రవించుచు ఉన్న మానవులు వైష్ణవోత్తములు. వారికి నాపై మిక్కుటమైన ప్రేమయుండును. వారి సర్వస్వమును నాకర్పించి భక్తి భావనతో ఉందురు. అట్లే ఈ సమస్త ప్రపంచము నావలననే సృష్టింపబడినదనియు, తిరిగి నాలోనే విలీనమగుననియు భావింతురు.

ఇత్యేవముక్త్వా దేవేవో విరరామ తయోః పురః | ఉవాచ తం త్రిపథగా భక్తినమ్రాత్మకంధరా || 59

ఈ విధముగా శ్రీమన్నారాయణుడు గంగాదేవితో చెప్పగా ఆమె భక్తిచే వంగిన శిరస్సు కలదే ఇట్లు పలికెను.

యామి చేద్భారతం నాథ భారతీశాపతః పురా | తవాజ్ఞాయ చ రాజేంద్రతపసా చైవ సాంప్రతం || 60

యాని కాని చ పాపాని మహ్యం దాస్యంతి పాపినః | తాని మే కేన నశ్యంతి తదుపాయం వదో ప్రభో || 61

కతికాలం పరిమితం స్థితిర్మే తత్ర భారతే | కదా యాస్యామి సర్వేశ్య తపవిష్ణోః పరం పరం ||62

మమాన్వద్వాంఛితం యద్యత్సర్వం జానాపి సర్వవిత్‌ | సర్వాంతరాత్మన్‌ సర్వజ్ఞ తదుపాయం వదప్రభో || 63

జగన్నాథ ! భారతీదేవి శాపమును, నీ ఆజ్ఞను, ఈ భగీరథుని తపస్సుననుసరించి భారతభూమికి వెళ్ళుదును. కాని పాపాత్ములు నా నీటిలో మునిగి తమపాపములను పొగొట్టుకొని నాకు వదలివేసినచో ఆ పాపములను నేనెట్లు పోగొట్టుకొందును. ఈ భారత భూమిలో ఎంతకాలము నేనుండవలెను. ఎప్పుడు నీ లోకమునకు తిరిగివత్తును? సర్వజ్ఞుడా! నీవు అందరి మనోవాంఛితములను తెలుసుకొందువు. అందువలన వీటిని నాకువివరించి చెప్పుడు.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణదేవు డిట్లనెను-

జానామి వాంఛితం గంతే తన సర్వం సురేశ్వరి | పతిస్తే రుద్రరూపోయం లవణోదో భవిష్యతి || 64

మమైవాంశః సముద్రశ్చ త్వం చ లక్ష్మీ స్వరూపిణీ | విదగ్ధాయ విదగ్ధేన సంగమో గుణవాన్భువి || 65

యావత్యః సంతి సదృశ్చ భారత్యాద్యాశ్చ భారతే | సౌభాగ్యం తవ తాస్వేవ లవణోదస్య సౌరతే || 66

అద్య ప్రభృతి దేవేశి కలేః పంచ సహస్రకం | వర్షం స్థితిస్తే భారత్యా భువి శాపేన భారతే || 67

నిత్యం వారిధినా సార్థం కరిష్యసి రహో రతిం | త్వమేన రసికాదేవీ రసికేంద్రేణ సంయుతా || 68

త్వాం తోషయంతి స్తోత్రేణ భగీరథకృతేన చ | భారతస్థాః జనాః సర్వే పూజయిష్యంతి భక్తితః || 69

ధ్యానేన కౌథుమోక్తేన ధ్యాత్వాం త్వాం పూజయిష్యతి | యః స్తౌతి ప్రణమేన్నిత్యం సోzశ్వమేధఫలం లభేత్‌ || 70

ఓగంగాదేవి! నీ మనోవాంఛితము నాకు తెలియును. ఇక రుద్రరూపుడు. నాఅంశ స్వరూపుడగు సముద్రుడు నీకు భర్త యగును సరస్వతి మొదలగు నదులకంటె సముద్రుడు నిన్నే ఎక్కువగా ప్రేమించును. నీపు నేటినుండి కలియుగమున ఐదువేల సంవత్సరముల వరకు సరస్వతీ నదితో కలిసి భారతదేశమున ఉందువు. అంతవరకు నీవెల్లప్పుడు సముద్రునితో సంగమించుచుందువు.

భారతీయులు నిన్నెప్పుడు భగీరథుడొనర్చిన స్తోత్రముచే నిన్ను సంతోషపెట్టుదురు. వారు 'కౌథుమ' మహర్షిచే చెప్పబడిన ధ్యానము స్తోత్రములచే నిన్ను ప్రతిదినము స్తుతింతురు. దానివలన వారు కఅశ్వమేధయాగము చేసినంత ఫలమును పొందుదురు. గంగా గంగేతి యో బ్రూయత్‌ యోజనానాం శ##తైరపి | ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి || 71

సహస్రపాపినాం స్నానాత్‌ యత్పాపం తే భవిష్యతి | మద్భక్తదర్శనే తావత్‌ తదైవహి వినశ్యతి || 72

పాపినాంతు సహస్రాణాం శతస్పర్శేన యత్తవ | మన్మంత్రోపాసక స్నానాత్‌ తదఘంచ వినశ్యతి || 73

యత్రయత్రభ##వేదంగే మన్నామ గుణకీర్తనం || తత్త్రెవ త్వమధిష్ఠానం కరిష్యస్యఘమోచనాత్‌ | 74

సార్థం సరిద్భిః శ్రేష్ఠాభిః సరస్వత్యాదిభిః శుభే | తత్తు తీర్థ భ##వేత్సద్యో యత్రమద్గుణ కీర్తనం|| 75

యద్రేణుస్పర్శమాత్రేణ పూతో భవతి పాతకీ | రేణుప్రమాణం వర్షం చ స వైకుంఠే వసేత్‌ ధ్రువం || 76

జ్ఞానేన త్వయి మే భక్త్యా మన్నామ స్మృతి పూర్వకం | సముత్సృజంతి ప్రాణాంశ్చ తే గచ్ఛంతి హరేః పదం|| 77

పార్షద ప్రవరాస్తే చ భవిష్యంతి హరేశ్చిరం | అసంఖ్యకం ప్రాకృతికం లయం ద్రక్ష్యంతి తే నారాః || 78

మృతస్య బహు పుణ్యన తచ్ఛవం త్వయి విన్యసేత్‌ | ప్రయాతి సచ వైకుంఠం యావదస్థ్నాం స్థితిస్త్వయి |. 79

కాయవ్యూహం తతః కృత్వాభోజయిత్వా స్వకర్మకం | తసై#్మ దదామి సారూప్యం తం కరోమి చ పార్షదం || 80

గంగా, గంగా యని వందయోజనముల దూరమునుండి నిన్ను పిల్చినను అతిని సర్వపాపములు తొలగి విష్ణులోకమును పొందును. వేలకొద్ది పాపాత్ములు నీ నీటిలో స్నానము చేసినచో కలుగుపాపము నాభక్తులను చూడగానే నశించిపోవును. వేలకొలది పాపాత్ముల శవములు నీ నీటిలో వేసినందువలన కలుగుపాపము నామంత్రమును ఉపాసించు భక్తులు స్నానము చేసినందువల తొలగిపోవును. ఎక్కడైతే నా నామగుణ సంకీర్తన జరుగునో అచ్చట పాపరహితవై నీవుండగలవు. ఆ ప్రదేశము పుణ్యక్షేత్రమగును

నా భక్తుల పాదరేణుస్పర్శతో పాపి పవిత్రుడగును. అంతమాత్రమే కాక వైకుంఠమున కొంతకాలముండును. ఎవరు జ్ఞానము కలిగి నా పదభక్తితో నా నామస్పరణ చేయుట ప్రాణములు వదులుదురో, వారు వైకుంఠమునకు తప్పక వెళ్ళుదురు. అట్లే వారు నాకు అనుచరులై అసంఖ్యాకమైన ప్రాకృతిక లయములు చూతురు. అధికమైన పుణ్యమువలన చనిపోయిన అతని శవమును నీ నీటిలో వేసినచో అతని ఎముకలు నీ నీటిలో ఉండునంతవరకు అతడు వైకుంఠమున ఉండును. అతని కుర్మలనన్నిటిని తీర్చి అతని సారూప్యమునిచ్చి నాసహచురునిగా ఉంచుకొందును.

అజ్ఞానీ త్వజ్జలస్పర్శాద్యది ప్రాణాన్‌ సముత్సృజేత్‌ | తసై#్మ దదామి సారూప్యం తం కరోమి చ పార్షదం || 81

అన్యత్ర నా త్యజేత్ప్రాణాన్‌ త్వన్నామస్మృతి పూర్వకం | తసై#్మ దదామి సాలోక్యమసంఖ్య ప్రళయాలయం || 82

అన్యత్ర వా త్యజేత్‌ ప్రాణాన్‌ మన్నామస్మృతి పూర్వకం | తసై#్మ దదామి సలోక్య యావద్వై బ్రహ్మణో వయః || 83

తీర్థేzప్యతీర్థే మరణ విశేషో నాస్తి కశ్చన | మన్మంత్రోపాసకానాం చ నిత్యం నైవేద్యభోజినాం || 84

పూతం కర్తుం స శక్తో హి లీలయా భువన త్రయం | రత్నేంద్రసార యానేన గోలోకం స ప్రయాతి చ || 85

మద్భక్త బాంధవా యేయే తేతే పుణ్యధియః శుబే | తేయాంతి రత్నయానేన గోలోకం చ సుదుర్లభం ||. 86

యత్ర తత్రమృతా యే చ జ్ఞానాజ్ఞనేన వా సతి | జీవన్ముక్తాశ్చ తే పూతా భక్తసన్నిధి మాత్రతః || 87

అజ్ఞానియైనను నీ జలమును స్పృశించి ప్రాణములు వదలినచో అతనికి సారూప్యమోక్షమునిచ్చి నా అనుచరుడుగా ఉంచుకొందును. నీ పేరు తలచుకొని బయట ఎక్కడైన ప్రాణములను వదిలినచో అతనికి చాలాకాలము సాలోక్యమను మోక్షమును ప్రసాదింతును. నాపేరును స్మరించుచు నీ నీటిలో కాక బయట ఎక్కడైనను ప్రాణములు వదిలినయెడల అతనికి బ్రహ్మకాలమువరకు సాలోక్యమోక్షమును ప్రసాదింతును.

ఎల్లప్పుడు నామంత్రమును స్మరించుచు నాకు పెట్టిన నైవేద్యమును భుజించువారు పుణ్యతీర్థములో చనిపోయినను, ఇతర ప్రదేశములందు చనిపోయినను విశేషమేమియు ఉండదు. వారు ముల్లోకములను పవిత్రము చేయజాలుదురు. అట్లే రత్నవిమానమునెక్కి వారు, వారి బంధువులు సుదుర్లభ##మైన గోలోకము చేరుదురు.

భక్తులయొక్క సన్నిధి వలన తెలిసి, తెలియక ఎక్కడ చనిపోయినను వారు పవిత్రులై జీవన్ముక్తులగుదురు.

ఇత్యుక్త్వా శ్రీహరిస్తాం చ తమువాచ భగీరథం | స్తుహి గంగామిమాం భక్త్యా పూజాం కురు చ సాంప్రతం || 88

భగీరథస్తాం తుష్టావ పూజయామాస భక్తితః | ధ్యానేన కౌథుమోక్తేన స్తోత్రేణ చ పునః పునః || 89

శ్రీకృష్ణం ప్రణనామాథ పరమాత్మానమీశ్వరం | భగీరథశ్చ గంగాంచ సోzంతర్ధాయ గతో హరిః || 90

శ్రీమన్నారాయణుడు గంగాదేవితో ఆమె మహాత్మ్యమును, శ్రీహరిపాదభక్తుల గొప్పతనమును తెలిపి భగీరథునితో గంగను భక్తితో పూజించి, నీ కోరికలు తీర్చుకొమ్మనెను. అందువలన భగీరథుడు గంగా దేవిని "కౌథుమ" మహర్షి చెప్పిన ధ్యాన స్తోత్రములచే పూజించి, పరమాత్మ, ఈ శ్వరుడైన, శ్రీకృష్ణునకు నమస్కరించెను.

భగీరథుని నమస్కారములందుకొనిన శ్రీహరి అప్పుడు అంతర్ధానము చెందెను.

నారద ఉవాచ-నారదు డిట్లనెను-

స్తోత్రేణ కేన ధ్యానేన కేన పూజాక్రమేణ చ | పూజాం చకార నృపతిః వద వేదవిదాం వర||. 91

ఓ స్వామీ! భగీరథుడు గంగా దేవిని పూజించిన ధ్యాన, స్తోత్ర పూజాక్రమములను నాకు వివరించి చెప్పుడు.

శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

స్నాత్వా నిత్య క్రియాం కృత్వా ధృత్వా ధౌతే చ వాససీ | పదౌ ప్రక్షాళ్య చాచమ్య సంయతో భక్తిపూర్వకం ||. 92

గణశం చ దినేశం చ వహ్ని విష్ణు శివం శివం | సంపూజయేన్నరః శుద్ధః సోzధికారీచ పూజనే || 93

గణశం విఘ్ననాశాయ నిష్పాపాయ దివాకరం | వహ్నిం స్వశుద్ధయే విష్ణుం ముక్తయే పూజయేన్నరః || 94

శివం జ్ఞాన వివృద్ధ్యెచ శివాం బుద్ధివివృద్ధయే | సంపూజ్యైతత్‌ లభేత్‌ ప్రాజ్ఞో విపరీతమతోzన్యధా || 95

దధ్యావనేన తధ్యానం శ్రుణు నారద తత్వతః | ధ్యానం చ కౌథపుమోక్తం వై సర్వపాపప్రణశనం || 96

ఉదయమే లేచి నిత్యకృత్యములన్నియు తీర్చుకొని స్నానము చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పాదములు కడుగుకొని, ఆచమనము చేసి భక్తితో పూజకు కుర్చొనవలయును. తొలుత వినాయకుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని పూజించిన వాడే ఈపూజచేయుటకు అర్హుడు.

విఘ్నములు తొలగుటకు వినాయకుని, పాపములు పోవుటకు సూర్యుని, తాను పరిశుద్ధుడగుటకు అగ్నిని, ముక్తికై విష్ణువును, బుద్ధి, జ్ఞానములకై దుర్గను శివుని పూజించవలెను. ఆతరువాత ఈ పూజకై ఉపక్రమింపవలెను.

సమస్త పాపములను తొలగించు కౌథుమోక్తమైన ధ్యానాదికమును నీవు వినుము.

శ్వేత చంపకవర్ణాభాం గంగాం పాపప్రణాశినీం | కృష్ణవిగ్రహ సంభూతాం కృష్ణతుల్యాం పరాం సతీం |. 97

వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణ భూషితాం | శరత్పూర్ణేందు శతక ప్రభాజుష్ట కళేబరాం || 98

ఈషద్ధాస ప్రసన్యాస్యాం శశ్వత్‌ సుస్థిర ¸°వనాం | నారాయణ ప్రియాం శాంతాం సత్సౌభాగ్యసమన్వితాం ||. 99

సహస్రేషు శ##తేష్వకో మన్మంత్రోపాసకో భ##వేత్‌ | తేతే జనా మంత్రపూతాశ్చగమిష్యంతి మత్పదం ||. 165

అన్యథా చ భవిష్యంతి సర్వే గోలోకవాసినః | నిష్ఫలం భవితా సర్వం బ్రహ్మాండ చైవ వేధసః || 166

జనాః పంచ ప్రకారాశ్చ యుక్తాః స్రష్టుర్భవే భ##వే | పృథివీవాసినః కేచిత్‌ కేచిత్‌ స్వర్గనివాసినః || 167

అధోనివాసినః కేచిత్‌ బ్రహ్మలోక నివాసినః | కేచిద్వా వైష్ణవాః కేచిత్‌ మమలోక నివాసినః || 168

ఇదం కర్తుం మహాదేవః కరోతు సురసంసది | ప్రతిజ్ఞాం సుదృఢాం సద్యః తతో మూర్తించ పశ్యసి |. 169

ఇత్యేవ ముక్త్వా గగనే విరరామ సనాతనః | తత్‌ దృష్ట్వా చ జగన్నాథస్తమువాచ శివం ముదా || 170

వేలు, వందల జనులలో ఒకడు నామంత్రోపాసకుడగును. అట్టివారే నా మంత్రముచే పవిత్రమైన నాలోకమునకు వత్తురు. లేనిచో అందరు గోలోకముననే ఉందురు. నామంత్రమును ఉపాసించినచో ఈజగమే నిష్ఫలమగును. విధాతయొక్క సృష్టిలోని జనులు కొందురు భూమిపై నివసించగా, మరికొందరు స్వర్గములో నివసింతురు. మరి కొందరు పాతాళలోకమున నుండగా ఇంకను కొందరు బ్రహ్మలోకమున నుందురు. కొందరు వైష్ణవులు నాలోకమున నివసింతురు. ఈ విధముగా శాస్త్రరచన చేయుదునని పరమ శివుడు ఈ దేవతలమధ్య ప్రతిజ్ఞచేసినచో నా రూపును మీరు చూడగలరు. అని ఆకాశవాణి దేవతలతో పల్కెను.

బ్రహ్మణో వచనం శ్రుత్వా జ్ఞానేశో జ్ఞానినాం వరః | గంగాతోయం కరేదృత్వా స్వీచకార వచస్తు సః || 171

సంయుక్తం విష్ణుమాయద్యైః శాస్త్రముత్తమం | వేదసారం కరిష్యామి కృష్ణాజ్ఞా పాలనాయ చ ||. 172

గంగాతోయముపస్పృశ్య మిథ్యా యది వదేజ్జనః | స యాతి కాలసూత్రం చ యావద్వై బ్రహ్మణోవయః || 173

ఇత్యుక్తే శంకరే బ్రహ్మన్‌ గోలోకే సురసంసది | ఆవిర్బభూవ శ్రీకృష్ణో రాధయా సహ తత్పరః || 174

ఆకాశవాణి మాటలు విని జ్ఞానేశుడై పరమశివుడు గంగనీటిని చేతిలో పట్టుకొని విష్ణుమాయకు సంబంధించిన మంత్రములతో వేదసారమగు శాస్త్రమును చేయుదునని ప్రతిజ్ఞ చేసెను. ఈ గంగనీరును పట్టుకొని ప్రతిజ్ఞచేసి తద్భిన్నముగా ప్రవర్తించిన మానవుడు బ్రహ్మ బ్రతికియున్నంతవరకు నకరకమున ఉండునని దేవతలందరి ముందు ప్రతిజ్ఞచేయగనే శ్రీకృష్ణపరమాత్మ రాధాదేవితో అక్కడ ఆవిర్భవించెను.

తేతం దృష్ట్వా చ సంహృష్టాః సంస్తూయ పురుషోత్తమం | పరమానందపూర్ణాశ్చ చక్రుచ్ఛ పునరుత్సవం || 175

కాలేన శంభుర్భగవాన్‌ శాస్త్రదీపం చకార సః | ఇత్యేవం కథితం సర్వం సుగోప్యం చ సదుర్లభం || 176

సా చైవ ద్రవరూపా యా గంగా గోలోక సంభవా | రాధా కృష్ణాంగ సంభూతా భక్తిముక్తి ఫలప్రదా || 177

స్థానే స్థానే స్థాపితా సా కృష్ణేన పరమాత్మనా | కృష్ణస్వరూపా పరమా సర్వబ్రహ్మాండ పూజితా || 178

దేవతలందరు రాధాదేవితో నున్న శ్రీకృష్ణుని చూచి మహనందముతో తిరిగి ఉత్సవమును చేసికొనిరి. ఆ తరువాత శంకరుడు వేదసారమగు శాస్త్ర రచన చేసెను. ఈ విధముగా గంగాదేవి గోలోకమును రాధాకృష్ణులనుండి పుట్టినది. ఆమె భక్తి ముక్తిని కలిగించునది. శ్రీకృష్ణ స్వరూపియైన ఆ గంగా దేవి సమస్త జనులచే పూజలనందుకొన్నది.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ నారద నారాయణ సంవాదే ద్వితీయే ప్రకృతిఖండే గంగోపాఖ్యానం నామ దశమోzధ్యాయః |

శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములోని నారద నారాయణ సంవాదములో గంగోపాఖ్యానమనే

పదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters