sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చతుర్వింశతితమోధ్యాయ: - బ్రహ్మనారదోక్త సంసారసుఖాసుఖ వర్ణనం

శ్రీ బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను -

త్వం గచ్ఛ తపసే వత్స కిం మే సంసారకర్మణి | అహం యాస్యామి గోలోకం విజ్ఞాతుం కృష్ణమీశ్వరం || 1

సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః | సనత్కుమారో నీరాగశ్చతుర్థః పుత్ర ఏవ చ || 2

యతీ హంసశ్చారుణిశ్చ వోఢుః పంచశిఖస్తథా | పుత్రాస్తపస్వినః సర్వే కిం మే సంసారకర్మణి || 3

వచస్కరో మరీచిర్మే అంగిరాశ్చ భృగుస్తథా | రుచిరత్రిః కర్దమశ్చ ప్రచేతాశ్చ క్రతుర్మనుః || 4

వసిష్ఠో వశగః శశ్వత్సర్వేషు చ సుతేషు చ | అన్యేవివేకినోసాధ్యాః కిం మే సంసారకర్మణి || 5

నిబోధ వత్స వక్ష్యామి వేదొక్తం వచనం శుభం | పారంపర్యక్రమపరం చతుర్వర్గఫలప్రదం || 6

నారదా! నీవు తపస్సుచేసికొనుటకు అడవికి వెళ్ళుము. నాకుకూడా ఈ సంసారముతో పనియేమి? నేనుకూడా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని సేవించుకొనుటకు గోలోకమునకు పోవుదును.

సనకుడు, సనందుడు, మూడవ వాడైన సనాతనుడు, సనత్కుమారుడు, యతి, హంసుడు, అరుణి, వోఢుడు, పంచశిఖుడు, మొదలైన తపస్వినులైన పుత్రులుండగా నేను సంసారము చేయవలసిన పనియేమి?

అట్లే వచస్కరుడు, మరీచి, అంగిరసుడు, భృగువు, రుచి , అత్రిమహర్షి, కర్దముడు, ప్రచేతసుడు, క్రతువు, మనువు, వసిష్ఠుడు మొదలైన మహర్షులైన పుత్రులు, ఇంకను వివేకహీనులు, నామాటను లక్ష్యపెట్టని ఇతర పుత్రులు ఉండగా నేను సంసారము చేయవలసిన పనియేమి?

ఐనను పంరపరగా వచ్చుచున్నదియు, ధర్మార్థకామమోక్షములచే చతుర్వర్గమలు ఫలమునిచ్చునదియు శుభ##మైన వేదోక్త వచనమును జాగ్రత్తగా వినుము.

ధర్మార్థకామమోక్షాంశ్చ సర్వే వాంఛంతి పండితాః | వేదప్రణిహితానేతాన్‌ సభాసు మునిశంసితాన్‌ || 7

వేదప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః | ఆదౌ విప్రో యజ్ఞసూత్రం పరిధాయ సుఖీం సుఖీ || 8

సమధీత్యం తతో వేదాన్‌ దదాతి గురుదక్షిణాం | తతః ప్రకృష్టకులజాం సువినీతాం సముద్వహేత్‌ || 9

సా సాధ్వీ కులజా యా చ పతిసేవాసు తత్సరా | సద్వంశే దుర్వినీతా చ సంభ##వేన్న కదాచన |

ఆకరే పద్మరాగాణం జన్మ కాచమణః కుతః || 10

అసద్వంశప్రసూతా యా పిత్రోర్దోషేణ నారద | దుర్వినీతా చ సా దుష్టా స్వతంత్రా సర్వకర్మసు || 11

న వత్స దుష్టాః సర్వాశ్చ యోషితః కమలాకళాః | సర్వేశ్యాంశాశ్చ కులటాః అసంద్వంశసముద్భవాః || 12

విజ్ఞలైన వారందరు వేదములందున్నట్టి, సభలలో మహర్షులు తెలిపినట్టి ధర్మార్ధ కామమోక్షములనే చతుర్వర్గములను కోరుకొందురు.

ధర్మము వేదమున చెప్పబడినది. అధర్మమనగా ధర్మమునకు భిన్నమైనది. బ్రాహ్మణుని ధర్మమేమనగా అతడు తొలుత ఉపనయనము చేసికొని, యజ్ఞోపవీతమును ధరించి వేదములను అధ్యయనము చేయవలెను. గురువునొద్ద విద్యాభ్యాసము పూర్తియైన తర్వాత తన గురువునకు యథాశక్తి గురుదక్షిణనొసంగి ఉన్నతవంశములో పుట్టిన వినయ సంపన్నురాలిని వివాహము చేసికొనవలెను.

ఉన్నత వంశములో పుట్టిన స్త్రీ, భర్తృ సేవపరాయణయైన పతివ్రత కాగలదు. మంచి వంశములో దుష్ట స్త్రీలు పుట్టుట అసంభవము. ఎట్లనగా పద్మరాగమణులు పుట్టుచోట గాజురాయి పుట్టునా?

తల్లిదండ్రులయొక్క దోషమువలన చెడిపోయిన కులములో పుట్టిన స్త్రీ వినయము లేక సమస్త కర్మలను తానే స్వతంత్రించి చేయుచు దుష్టురాలు కాగలదు.

వత్స! నారదా! స్త్రీలందరు చెడ్డవారుకారు. పైగా వారందరు లక్ష్మీదేవియొక్క అంశ వలన పుట్టినవారు. చెడు వంశములో పుట్టిన కులటలు దేవవేశ్యలైన అప్సరసల యొక్క పుట్టినవారు.

నిర్గుణం స్వామినం సాధ్వి సేవతే చ ప్రశంసతి |శ న సేవతే చ కులటా ప్రియం నిందతి సద్గుణం || 13

సాధుః సద్వంశజాం కన్యాం ప్రయత్నేన పరిగ్రహేత్‌ | తస్యాం పుత్రాన్‌ సముత్పాద్య వృద్ధస్తు తపసే వ్రజేత్‌ || 14

వరం హుతవహే వాసః సర్పవక్త్రే చ కంటకే | ఏతేభ్యోఒ దుఃఖదో వాసః స్త్రియా దుర్ముఖయా సహ || 15

పతివ్రతయైన స్త్రీ తన భర్త సుగుణవంతుడు కాకపోయినను అతనిని సేవించుచు తన భర్తను గూర్చి నలుగురిలో పొగడుచుండును. అట్లే కులట తన భర్త గుణవంతుడైనను అతనిని చీటికి మాటికి తిట్టుచుండును.

అందువలన మంచివాడు ఉన్నత వంశములో పుట్టిన కన్యను వెదకి వెదకి పెండ్లి చేసికొనవలెను. ఆమెయందు సంతానమును పడసి ముసలితనము రాగానే తపస్సునకై బయలుదేరవలెను.

మాటిమాటికి కలహములు పెట్టుకొనుచు భర్త మనస్సునకశాంతి కలిగించు స్త్రీ దగ్గర ఉండుటకన్న నిప్పులోనైనా, సర్పముయొక్క ముఖములోనైనా, ముళ్ళ పొదరింటిలోనైనను ఉండుట మేలు.

మత్తోధీతఃత్వయా వేదో మహ్యం చ గురుదక్షిణాం | పుత్ర దేహీదమేవేహ కురు దార పరిగ్రహం || 16

వత్స త్వం కులజాతాం చ పూర్వపత్నీం చ మాలతీం | వివాహం కురు కల్యాణకల్యాణ చ దినే నఘ || 17

మునువంశోద్భవస్యేహ సృంజయస్య గృహే సతీ | త్వత్కృతే జన్మ లబ్ధ్వా చ కురుతే భారతే తపః || 18

గృహ్ణీష్వ పరమాం రత్నమాలాం చ కమలాకళాం | భారతే న భ##వేత్‌ వ్యర్థం జనానాం తపసః ఫలం || 19

నారదా! నీవు నావద్ద వేదములను చదువుకొనినందువలన నాకు గురుదక్షిణను ఇవ్వవలసియున్నది. ఆ గురుదక్షిణగా నీవు వివాహమును తప్పక చేసికొనవలెను.

నీవు ఉన్నత వంశములో పుట్టిన నీ పూర్వజన్మమందలి భార్యను మాలావతిని మంచి దినమున వివాహము చేసికొనుము. ఆమె మనువంశమున పుట్టిన సృంజయునింట పుట్టి, నీకొరకు భారతదేశమున తపస్సు చేయున్నది. ఈ జన్మమున ఆమెపేరు రత్నమాల. లక్ష్మీదేవియొక్క అంశతో పుట్టిన ఆ రత్నమాలను నీవు వివాహము చేసికొనవలెను. ఈ భారతదేశమున చేసిన తపస్సు ఎప్పడును వ్యర్థము కాడు. కావున నీవామెను వివాహము చేసికొనుము.

ఆదౌ భ##వేద్గృహీ లోకో వానప్రస్థస్తతః పరం | తతస్తపస్వీ మోక్షాయ క్రమ ఏష శ్రుతౌ శ్రుతః || 20

వేష్ణవానాం హరేర్చా తపస్యా చ శ్రుతౌ శ్రుతా || 21

వైష్టవ త్వం గృహే తిష్ఠ కురు కృష్ణపదార్చనం అంతర్బాహ్యే హరిర్యస్య తస్య కిం తపసా సుత || 22

నాంతర్బాహ్యే హరిర్యస్య తస్య కిం తపసానఘ | తపసా హరిరారాధ్యో నాన్యః కశ్చన విద్యతే || 23

యత్ర తత్ర కృతం కృష్ణసేవనం పరమం తపః | వత్స మద్వచనేనైవ గృహే స్థిత్వా హరిం భజ || 24

గృహీ భవ మునిశ్రేష్ఠ గృహిణాం సర్వదా సుఖం | కామిన్యాం సుఖసంభోగః స్వర్గభోగస

మో మతః || 25

తద్దర్శనముపస్పర్శం వాంఛంత్యేవ మముక్షవః | సర్వస్పర్శసుఖాత్‌ స్త్రీణాముపస్పర్శ సుఖం పరం || 26

మానవుడు మొదట వివాహము చేసికొని గృహస్థుడై, అటు పిమ్మట వాన ప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. అటుపిమ్మట మోక్షమునకై సన్యాసాశ్రమమును స్వీకరించవలెనని వేదములందు చెప్పబడినది.

అట్లే వైష్ణవులు శ్రీహరిపూజను, తపస్సును చేయవలెనని వేదములలో చెప్పబడినది. అందువలన వైష్ణవుడైన నీవు ఇంటిలోనే ఉండి శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదములను అర్చింపుము.

ఎవ్వరి మనస్సులో, బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండునో ఆ పుణ్యపురుషునకు తపస్సులేకపోయినను ఏమికాదు. అట్లే ఎవ్వరి మనసులో, బాహ్యమైన వాక్కులో సదా శ్రీహరి ఉండడో అతను ఎంత తపస్సు చేసినను లాభము లేదు. శ్రీహరిని తపస్సుచేతే ఆరాధింపవలెను. అతనిని ఆరాధించుటకు ఇతరోపాయములేవియును కన్పించవు. శ్రీకృష్ణుని సేవయే గొప్పదైన తపస్సు.

అందువలన నామాటననుసరించి ఇంటిలోనుండియే శ్రీకృష్ణుని భజింపుము. నీవు పెండ్లిచేసికొని గృహస్థుడవు కమ్ము. గృహస్థులకు ఎల్లప్పుడు సుఖమే ఉండును. తాను కోరుకున్న స్త్రీతో చేసిన సంభోగము స్వర్గభోగములతో సమానమైనదందురు. మోక్షము వర్ణించువారు సహితము ఆమెయొక్క దర్శనమును, స్పర్శను కోరుకొందురు. సమస్తమైన స్పర్శసుఖములకన్న స్త్రీ స్మర్శసుఖము చాలమిన్న.

తతః సుఖతమం పుత్రదర్శనం స్వర్శనం మునే | సర్వేభ్యః ప్రేయసీ కాంతా ప్రియా తేన ప్రకీర్తితా || 27

పుత్రప్రయోజనా కాంతా శతకాంతాప్రియః సుతః | నాస్తి పుత్రాత్పరో బంధుః నాస్తి పుత్రాత్పరః ప్రియః || 28

సర్వేభ్యో యజమన్విచ్ఛేత్‌ పుత్రాదేకాత్పరాజయం | న చాత్మని ప్రియోర్ధశ్చ తస్మాదపి సుతః ప్రియః || 29

అతః ప్రియతమే పుత్రే న్యసేదాత్మపరం ధనం | ఇత్యేవముక్త్వా స బ్రహ్మా విరరామ చ శౌనక || 30

ఉవాచ వచనం తాతం నారదో జ్ఞానినాం వరః |

స్త్రీ దర్శన, స్పర్శసుఖములకంటె పుత్ర దర్శనము పుత్రస్పర్శనము చాలా గొప్పనివి. స్త్రీ అందరికన్న ప్రియమైనది. కావుననే ఆమెను ప్రేయసి అని పిలిచిరి.

స్త్రీకి ప్రయోజనము పుత్రుని గనుట. అందువలన వందమంది స్త్రీలకంటెను పుత్రుడు చాలా ఇష్టమైనవాడు. ఈ లోకమున పుత్రుని మించిన బంధువులేడు. అట్టే పుత్రునకన్న ప్రియమైన వాడెవరు ఈ లోకమున కన్పించరు. తండ్రి అందరినుండి జయమును కోరుకున్నను పుత్రునినుండి మాత్రము ఓటమిని కోరుకొనవలెను. తనకు ప్రియతరమైనది ధనముమాత్రము కాదు. ఏలన పుత్రుని ఆ ధనముకంటె మిన్నగా మనము చూచుకొందుము.

అందువలన తాను సంపాదించిన ధనమునంతయు తండ్రి తనకు చాలా ఇష్టమైన పుత్రునకు అప్పగించవలయును.

ఈవిధముగా బ్రహ్మదేవుడు తనకుమారుడైన నారదునితో చెప్పగా పరమజ్ఞానియైన నారదుడు తండ్రికి ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను.

నారద ఉవాచ - నారదుడిట్లనెను-

స్వయం విజ్ఞాయ సర్వార్థం స్వపుత్రం వేదదర్శనే | ప్రవర్తయత్యసన్మార్గే స దయాలుః కథం పితా || 31

జలబుద్బుదవత్సర్వం సంసారమతినశ్వరం | జలరేఖా యథామిథ్యా తథా బ్రహ్మన్‌ జగత్త్రయం || 32

విహాయ హరిదాస్యం చ విషయే యన్మనశ్చలం | దుర్లభం మానవం జన్మ మాభూత్తన్నిష్ఫలం క్వచిత్‌ || 33

కావా కస్య ప్రియా పుత్రో బంధుః కో వా భవార్ణవే | కర్మోర్మిభిర్యోజనా చ తదపాయో వియోజనా || 34

సుకర్మ కారయేద్యో హి తన్మిత్రం స పితా గురుః | దుర్బుద్దిం జనయేద్యో హి స రిపుః స్కాత్కథం పితా || 35

ఇత్యేవం కథితం తాత వేదిబీజం యథాగమం | ధ్రువం తథాపి కర్తవ్యం తవాజ్ఞా పరిపాలనం || 36

ఆదౌ యస్యామి భగవన్నరనారాయణాశ్రమం | నారాయణకథాం శ్రుత్వా కరిష్యేదారసంగ్రహం || 37

ఇత్యేవముక్త్వా స మునిర్విరరామ పితుః పురః | పుష్పవృష్టిస్తదుపరి తత్‌క్షణన బభూవ హ || 38

క్షణం పితుః పురః స్థిత్వా నారదో మునిసత్తమః | ఉవాచ చ పునర్వేదం వచనం మంగళప్రదం || 39

వేదములు, శాస్త్రములయొక్క అర్థమును స్వయముగా తెలిసికొని, పుత్రునకు వాటిని తెలిపి చెడుమార్గమున వెళ్ళుమని అనెడువాడు దయగల తండ్రి ఎట్లు కాగలడు.

ఈ సంసారమంతయు నీటి బుడగవలె అశాశ్వతమైనది. నీటిపై గీచిన గీతవలె ఈ ముల్లోకములు మిథ్యయైనవి.

ఈ మానవజన్మ దుర్లభ##మైనది. ఇట్టి మానవజన్మను హరిధ్యానము లేక మనస్సును విషయాసక్తము చేయుచు నిష్ఫలము చేయుట తగనిది.

ఇచ్చట ఎవరు ప్రియురాలు, ఎవరు పుత్రుడు? అందరు తమతమ కర్మలనెడు అలలచే కలిసిపోవుచున్నారు. అవి నశించిపోవగా విడిపోవుచున్నారు.

మంచి పనులను చేయించువాడే తండ్రి లేక గురువు లేక స్నేహితుడు. చెడుబుద్ధిని కలిగించువాడు శత్రువు గాక తండ్రి యెట్లగును?

ఓ తండ్రీ! నేను శాస్త్రప్రమాణములననుసరించి వేదతత్వమును నీకు తెలిపితిని. ఐనను పుత్రునిగా నీయొక్క ఆజ్ఞను తప్పక పరిపాలింతును. నేను మొదలు నర, నారాయణ ఋషులు నివసించు బదరికాశ్రమమునకు పోయి, అక్కడ నారాయణుని కథను విని నీవు చెప్పినట్లుగా వివాహమును చేసికొందును.

నారదుడిట్లు తండ్రితో పలికి యూరకుండగా అతనిపై వెంటనే పుష్పవర్షము కురిసినది. అతడు క్షణకాలమాగి మరల తండ్రితో ఇట్లనెను.

శ్రీనారద ఉవాచ - నారదడిట్లు పలికెను -

దేహి మే కృష్ణమంత్రం చ యన్మనోవాంఛితం మమ | తత్సంబంధి చ యత్‌ జ్ఞానం యత్ర తద్గుణ వర్ణనం || 40

తతః పశ్చాత్కరిష్యామి త్వత్ప్రీత్యా దారసంగ్రహం | మానసే పరిపూర్ఱే చ కార్యం కర్తుం పుమాన్‌ సుఖీ || 41

నారదస్య వచః శ్రుత్వా ప్రహృష్టః కమలోద్భవః | ఉవాచ పునరేవేదం పుత్రం జ్ఞానవిదాం పరః || 42

ఓతండ్రీ నాకు ఇష్టమైన శ్రీకృష్ణమంత్రమును, దానికి సంబంధించిన జ్ఞానమును, ఆతని గుణగణ వర్ణన కలదానిని నాకు ఇమ్ము. నీకు నాకు మంత్రోపదేశము చేసిన తరువాత నీవు కోరినట్లు నేను వివాహము చేసికొందును. తన కోరిక తీరిన తరువాత పనిచేయు మానవుడు సుఖముగా ఉండును.

పై నారదుని మాటగలు విని బ్రహ్మదేవుడు చాలా సంతోషించి జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైన నారదునితో ఇట్లనెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను -

పత్యుర్మంత్రం పితుర్మంత్రం న గృహ్ణీయాద్విచక్షణః | వివిక్తాశ్రమిణాం చైవ న మంత్రః సుఖదాకః || 43

నిషేకాల్లభ్యతే మంత్రో గురుర్భర్తా చా కామినీ | విద్యాసుఖం భయం దుఃఖం పురుషైః స్వేచ్ఛయా న చ || 44

మహేశ్వరస్తవగురుః ప్రాక్తనో నః పురాతనః | గచ్ఛ వత్స శివం శాంతం శివదం జ్ఞానినాం గురుం || 45

తత ఏవ భవాన్మంత్రం జ్ఞానం లబ్ధ్వా పురాతనాత్‌ | నారాయణకథాం శ్రుత్వా శీఘ్రమాగచ్ఛ మద్గృహం || 46

ఇత్యుక్త్వా జగతాం ధాతా విరరామా చ శౌనక | ప్రణమ్య పితరం భక్త్వా శిలోకం య¸° మునిః || 47

జ్ఞానవంతులు భర్తనుండి, తండ్రినుండి మంత్రమును స్వీకరించరాదు. అట్లే వివిక్తాశ్రమమున నున్న సన్యాసి, బ్రహ్మచారులనుండి నేర్చుకొను మంత్రము సుఖమునివ్వదు.

మానవులకు, గురువు, భర్త లేక భార్య, విద్య సుఖము, భయము, దుఃఖము అనునవి వారి పూర్వజన్మ సంస్కారము అదృష్టముననుసరించి దొరకును. కాని వారికి ఈ విషయమున స్వేచ్ఛ అనునది లేదు.

నీకు మహేశ్వరుడే గురువు. శాంతుడు మంగళప్రదుడు జ్ఞానులకు సహితము గురువైన ఆ శంకరుని దగ్గరకు వెళ్ళి ఆయనవల్ల శ్రీకృష్ణమంత్రమును, ఆ మంత్రమునకు సంబంధించిన జ్ఞానమును, నారాయణుని కథను నీవు పొందగలవు. ఆ తరువాత తిరిగి నా దగ్గరకు వెంటనే తిరిగి రాగలవు.

ఇట్లు బ్రహ్మదేవుడు నారదునితో చెప్పగా అతడు తండ్రికి భక్తిపూర్వకముగా నమస్కరించి కైలాసమునకు వెళ్ళెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతిశౌనక సంవాదే బ్రహ్మనారదోక్త సంసారసుఖాసుఖవర్ణనం నామ చతుర్వింశతితమోధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనకుల సంవాదరూపమైన బ్రహ్మఖండమున బ్రహ్మదేవుడు నారదులచే చెప్పబడిన సంసారసుఖవర్ణనమను

ఇరువదినాలుగవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters