sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రయోవింశతితమోధ్యాయ: - బ్రహ్మనారదుల సంవాదము

స్రష్టా సృష్టివిధానేన నియోజ్య సర్వబాలకాన్‌ | నారదం ప్రేరయామాస సృష్టిం కర్తుం చ శౌనక || 1

హితం సత్యం వేదసారం పరిణామసుఖావహం | ఉవాచ నారదం బ్రహ్మా వేదవేదాంగ పారగం || 2

బ్రహ్మదేవుడు తన పుత్రులనందరిని సృష్టికార్యములో నియోగించుచు నారదుని కూడ సృష్టికార్యమును చేయుమని ప్రేరేపించెను.

బ్రహ్మదేవుడు వేద వేదాంగ పారగుడైన నారదునితో హితమును, సత్యమైనదియు, వేదసారమని చెప్పదగిన మాటను చెప్పెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను -

ఏహివత్స కులశ్రేష్ఠ నార ప్రాణవల్లభ | జ్ఞానదీపశిఖాజ్ఞానతిమిరక్షయకారక || 3

సర్వేషామపివంద్యానాం జనకః పరమో గురుః | విద్యాదాతా మంత్రదాతా ద్వౌ సమౌ చ పితుః పరౌ || 4

తవాహం జనకః పుత్ర విద్యాదాతా చ పాలకః | మమాజ్ఞయా చ మత్ర్పీత్యా కురు దారపరిగ్రహం || 5

స చ శిష్యః సోపి పుత్రో యశ్చాజ్ఞాం పాలయేద్గురోః | న క్షేమం తస్య మూఢస్య యో గురోరవచస్కరః || 6

స పండితః సచ జ్ఞనీ స క్షేమి సచ పుణ్యవాన్‌ | గురోర్వచస్కరో యోహి క్షేమం తస్య పదే పదే || 7

సర్వేషామాశ్రమానాం చ ప్రధానాః పుణ్యవాన్‌ | గృహీ | స్త్రీపుత్రపౌత్ర యుక్తం చ మందిరం తపసః ఫలం || 8

పితరః పూర్వకాలే చ తిథికాలే చ దేవతాః | సర్వే గృహస్థమాయాంతి నిపానమివ ధేనవః || 9

నిత్యం నైమిత్తికం కామ్యం కుర్వంతి గృహిణః సదా | ఇహ ఏతత్సుఖం పుణ్యం స్వర్గభోగః పరత్ర చ || 10

జీవన్ముక్తో గృహస్థశ్చ స్వధర్మపరిపాలకః | యశస్వీ పుణ్యవాంశ్చైవ కీర్తిమాన్‌ నో హి జీవన్నపి మృతోహి సః || 11

బ్రహ్మణో వచనం శ్రుత్వా నారదో మునిసత్తమః | ఉవాచ వినయం భీతః శుష్కకంఠౌష్ఠతాలుకః || 13

ఓ నారదా! ఇటురమ్ము. నమస్కరించదగిన వారందరిలో తండ్రి చాలా గొప్పవాడు. విద్యనేర్పినవాడు మంత్రమును నేర్పినవారు తండ్రితో సమానులు మాత్రమే. నేను నీకు తండ్రిని, విద్యాబుద్ధులు నేర్పినవాడను, పోషించినవాడను కూడ. అందువలన నామాటననుసరించి, నాకు సంతోషము కలిగించుటకై నీవు వివాహము చేసికొనవలెను.

గురువుయోక్క లేక పెద్దవానియొక్క ఆజ్ఞను పరిపాలించువాడే శిష్యుడు లేక పుత్రుడు. గురువు లేక తండ్రి మాటను జవదాటు మూఢునకు క్షేమము కలుగదు. గురువుయొక్క మాటను వినువాడే పండితుడు, జ్ఞానవంతుడు, పుణ్యవంతుడు, క్షేమముగానుండువాడు. అన్ని ఆశ్రమములలో గృహస్థాశ్రమము శ్రేష్ఠమైనది. గృహస్థాశ్రమమున నున్నవాడు పుణ్యవంతుడు. అతడు చేసిన తపస్సుకు ఫలితమన్నట్లు అతని ఇల్లు స్త్రీలతో పుత్రులతో, మనుమలతో నుండగలదు. శ్రాధ్ధకాలమున పితృదేవతలు పూజాది సమయములలో ఇతర దేవతలు అతని ఇంటికి, మడుగును చూచి దప్పిగొన్న ఆవులు పోయినట్లు పోదురు.

అతడు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు ఎల్లప్పుడు చేయుచుండెను. అవి అతనికి ఇహలోక సుఖమును, పుణ్యమును పరలోకమున స్వర్గభోగములను కలిగించును. తన ధర్మమును పరిపాలించు గృహస్థుడు జీవన్ముక్తుడగును. అతనికి పుణ్యము, కీర్తి, ధనము, సుఖము లభించును. కీర్తి ఉన్నవాడు చచ్చిపోయినను బ్రతియు యున్నవాడే. అట్లే కీర్తిలేనివాడు బ్రతికి యున్నను చచ్చిపోయిన వానితో సమానుడు.

తన తండ్రియగు బ్రహ్మదేవుని పై మాటలు విని పెదవులు, నాలుక, గొంతు ఎండిపోగా భయపడుచు వినయముతో నారదుడిట్లనెను.

నారద ఉవాచ - నారదుడిట్లనెను.

ఏకదావాగ్విరోధేన చోభయోస్తాతపుత్రయోః | హానిర్బభూవ దైవేన మహతీవాయశస్కరీ || 14

మయా ప్రాప్తం చ త్వచ్ఛాపాద్గాంధర్వం శౌద్రమేవ చ | జన్మకర్మ చ మచ్ఛాపాత్త్వమపూజ్యోభ##వే భవః || 15

బభూవ శాపో ముక్తో మే కాలే తే భవితా విధే | దోషాయ కల్పతే శశ్వద్విరాధో న గుణాయ చ || 16

స పితా స గురుర్బంధుః స పుత్రస్సమధీశ్వరః | యః శ్రీకృష్ణపాదపద్మే దృఢాం భక్తిం చ కారయేత్‌ || 17

అసద్వర్త్మని చాజ్ఞానాత్‌ గచ్ఛంతి యది బాలకాః | నివర్తియతి తానేవ స పితా కరుణానిధిః || 18

కారయిత్వా కృష్ణపాదే భక్తిత్యాగం చ యః పితా | అన్యస్మిన్‌ విషయే పుత్రం స కిం హంతుం ప్రవర్తయేత్‌ || 19

దారగ్రహో హి దుఃఖాయ కేవలం న సుఖాయ చ | తపః స్వర్గ భక్తి ముక్తి కర్మణాం వ్యవధాయకః || 20

ఓతండ్రీ ఒకప్పుడు ఇటువంటి జగడము వలననే తండ్రి కొడుకులమైన మన ఇద్దరకు దురదృష్టమువలన చాలా చెడు పేరు తెచ్చే హాని జరిగింది. నాకు నీ శాపమువలన గంధర్వ జన్మ, శూద్ర జన్మ కలిగినవి. నా శాపమువలన నీకు పూజలు లేకుండా పోయినవి. ప్రస్తుతము నేను శాపవిముక్తడనైతిని. అట్లే నీవును కొంత కాలమునకు శాపవిముక్తిని పొందగలవు.

శాశ్వతవిరోధమెవ్వరికిని మంచి కల్గించదు. పైగా అది కీడును చేయును. అందువల్ల మన మధ్య విరోధము మంచిదికాదు. అట్లే శ్రీకృష్ణుని పద పద్మములపై దృఢమైన భక్తిని కలిగించనవాడే నిజమైన తండ్రి, గురువు, బంధువు, నాయకుడు. తండ్రియైన వాడు తన పుత్రులు దుష్టమార్గములో నున్నప్పుడు వారిని ఆ దారినుండి మరల్చి సన్మార్గమున ప్రవర్తించునట్లు చేయవలెను. శ్రీకృష్ణుని పదభక్తిని కల్పించి అన్యమార్గమునుండి తప్పించు తండ్రి తనపుత్రుని తానే చెడుత్రోవకీడ్చి అతనిని నాశనము చేయుటకు ఎప్పుడైనను ప్రవర్తించునా?

వివాహమనునది సంపూర్ణముగా దుఃఖమును కలిగించునే కాని సుఖమునెంత మాత్రమును కలిగించదు. పైగా అది పురుషుడు చేయు తపస్సునకు భక్తి, ముక్తి కలిగించు పనులకు అడ్డంకిగా మారగలదు.

యోషతస్త్రివిధా బ్రహ్మన్‌ గృహిణాం మూఢ చేతసాం | సాధ్వీ భోగ్యా చ కులటాస్తాః సర్వస్వార్థతత్పరాః || 21

పరలోకభియా సాధ్వీ తథేహ యశసాత్మనః | కామస్నేహాచ్చ కురుతే భర్తుః సేవాం చ సంతతం || 22

భోగ్యా భోగార్థినీ శశ్వత్కామస్నేహేన కేవలం | కురుతే కాంతసేవాం చ నచ భోగాదృతే క్షణం || 23

వస్త్రాలంకార సంభోగ సుస్నిగ్ధాహారముత్తమం | యావపత్రాప్నోతి సా భోగ్యా తావచ్చ వశగా ప్రియా || 24

కులాంగారసమా నారీ కులటా కులనాశినీ | కపటాత్కురుతే సేవాం స్వామినో న చ భక్తితః || 25

సదా పుంయోగమాశంసుర్మనసా మదనాతురా | ఆహారాదధికం జారం ప్రార్థయంతీ నవం నవం || 26

జారార్థే స్వపతిం తాత హంతు మిచ్ఛతి పుంశ్చలీ | తస్యాం యో విశ్వసేన్మూఢో జీవనం తస్య నిష్ఫలం || 27

తెలివి తక్కువగల గృహస్థుల భార్యలు మూడు విధములుగా కన్పింతురు. వారు సాధ్వి, భోగ్యా, కులట అనేవారు. వీరు ముగ్గురు కూడా స్వార్థపరులే.

వీరిలో సాధ్వి పరలోకమందు ఏమో జరుగునన్న భయముతో, లేనిచో చెడు పేరు వచ్చునను భయముతో భర్తతో కలిసియుండును.

తన భర్తవలన గొప్పనైన వస్త్రములు, అలంకారములు, నగలు, సంభోగము, చక్కని భోజనము దొరకునంతవరకు, అతనికి వశ##మై అతని మనసెరిగి ప్రేమతో భర్తకుసేవచేయునది భోగ్య.

మూడవదైన కులట భర్త కులమునకు నిప్పువంటిది. ఆతని కులమునకు నాశనము చేయును. సదా కామాతురయై భర్తృసేవను కపటబుద్ధితో చేయుచు క్రొత్తక్రొత్త జారులపై బుద్ధి కలిగియుండును. ఆమె తన జారుని కొరకు భర్తను చంపుటకైనను వెనుదీయదు. అట్టి కులటను ఏమూఢుడు విశ్వసించునో అతని జీవితమే వ్యర్థము కాగలదు.

కథితా యోషితాః సర్వా ఉత్తమాధమ మధ్యమాః | స్వాత్మారామా విజానంతి మనస్తాసాం న పండితా: || 28

హృదయం క్షురధారాభం శరత్పద్మోత్సవం ముఖం | సుధాసమం సుమధురం వచనం స్వార్థసిద్ధయే || 29

ప్రకోపే విషతుల్యం చ విశ్వాసే సర్వనాశనం | దుర్జేఞయం తదభిప్రాయం నిగూఢం కర్మ కేవలం || 30

సదా తాసామవినయః ప్రబలం సాహసం పరం | దోషోత్కర్షచ్ఛలోత్కర్షః శశ్వన్మాయా దురత్యయా || 31

పుంసశ్చాష్టగుణః కామః శశ్వత్కామో జగద్గురో | ఆహారో ద్విగుణో నిత్యం నైష్ఠుర్యం చ చతుర్గుణం || 32

కోపః పుంసః షడ్గుణశ్చ వ్యవసాయశ్చ నిశ్చితం | యత్రేమే దోషనివహాః కాస్థా తత్ర పితామహ || 33

పై విధముగా స్త్రీలు ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులకు చెందినవారైయున్నారు. పరమయోగులు పండితులైనవారు సహితము ఆస్త్రీల మనోభావములను గుర్తించలేరు.

స్త్రీలయొక్క హృదయము కత్తియొక్క అంచువలె చాలా పదునైనది. ముఖము మాత్రము శరత్కాలమందలి పద్మమువలె మనోహరముగా ఉండును. వారి కోరికలను నెరవేర్చుకొనుటకు వారు అమృతమువలె తియ్యగా మాటలాడుదురు. వారికి కోపము కల్గిన విషముతో సమానముగా ప్రవర్తింతురు. వారిని సంపూర్ణముగా విశ్వసించినచో సర్వనాశనము జరుగగలదు. వారి మనస్సులోని అభిప్రాయముల నెవ్వరును తెలిసికొనలేరు. వారు చేయు పనులు చాలా నిగూఢముగా ఉండును. వారెల్లప్పడు అవినయముతోనే ఉందురు. వారికి సాహసము చాలా అధికముగానుండును. మిక్కిలి దోషములు కలిగియుందురు. వారి మాయను ఎవ్వరు తప్పించుకొనలేరు. వారికి పురుషునకంటె ఎనిమిదిరెట్లు కామముండును. కామము ఎల్లప్పుడు ఉండునన్నను తప్పులేదు. అట్లే వారి ఆహారము పురుషులకంటే రెండురెట్లు అధికముగా ఉండును. నిష్ఠూరమైన మాటలు నాల్గురెట్లు ఎక్కువగానుండును. కోపము ఆరురెట్లు అధికముగానుండును. వారి ప్రయత్నము స్థిరముగానుండును.

ఓ తండ్రీ! ఇన్ని దోషములకు నిలయమైన స్త్రీలకు కోరిక ఎందుకు ఉండవలెను.

కా క్రీడా కిం సుఖం పుంసాం విణ్మూత్రములవేశ్మని | తేజః ప్రనష్టం సంభోగే దివాలపే యశఃక్షయః || 34

ధనక్షయోత్రిప్రీతౌ చాత్యాసక్తౌ వపుఃక్షయః | సాహిత్యే పౌరుషం నష్టం కలహో మాన నాశనం |

సర్వనాశశ్చ విశ్వాసే బ్రహ్మన్నరీషు కిం సుఖం || 35

యావద్దనీ చ తేజస్వీ సశ్రీకో యోగ్యతాపరః | పుమాన్నారీం వశీకర్తుం సమర్ధస్తావదేవ హి || 36

రోగిణం నిర్ధనం వృద్ధం యోషిద్వై ప్రేక్షతేప్రియం | లోకాచారభయాత్తసై#్మ దదాత్యాహారమల్పకం || 37

మూత్రమలములకు నియమైన స్త్రీ సంభోగమున సుఖమేమున్నది? స్త్రీసంభోగమున పురుషుని తేజస్సు నశించుచున్నది. దివాలాపము చేయుచుండిన అతని కీర్తికి హాని కలుగును. స్త్రీని అతిగా ప్రేమించినచో ధనము నశించిపోవును. లేక అత్యాసక్తిని కనబరిచిన శరీరము నశించిపోవును. అతిగా కలిసియున్న పురుషుని పౌరుషము నశించును. కలహము పెట్టుకొననిచో అభిమానము నశించును. అతిగా విశ్వసించినచో సర్వనాశము జరుగును. అట్టి స్త్రీల వలన పురుషులకు కలుగు సుఖమేముండును?

పురుషుడు మంచి ధనవంతుడు తేజస్వి యైనప్పుడు మాత్రమే స్త్రీని వశపరచుకోనగలడు. తన భర్త రోగియైనా, ధనహీనుడైనా, వృద్ధుడైనా అతనిని స్త్రీ ప్రేమతో చూచుకొనదు. కానిచోలోకాపవాదమునకు భయపడి అతనికి కొద్దిగ తిండిమాత్రము పెట్టును.

ఇత్యేవం కథితం సర్వం బ్రహ్మన్మాత్మాగమో యథా | సర్వం జానాపి సర్వజ్ఞ స్వాత్మారామేశ్వరో భవాన్‌ ||38

అనుగ్రహం కురు విభో విదాయం దేహి సంప్రతం | కృష్ణభక్తిం ప్రార్థయామి త్వయి కల్పతరోః పరే || 39

ఇత్యుక్త్వా నారదస్తత్ర ధృత్వా తాత పదాంబుజం | ఆ జ్ఞాం యయాచే పితరం గంతుం తపసి మంగళ || 40

కృతాంజలిపుటో భూత్వా భక్తినమ్రాత్మకంధరః | కృత్వా ప్రదక్షిణం నత్వా బ్రహ్మాణం గంతుముద్యతః || 41

ఓ తండ్రీ నీకు ఈ విషయమునంతయు విన్నవించితిని. నీవు సర్వజ్ఞుడవు. పరమయోగులలో శ్రేష్ఠుడవు. ఆత్మనుగురించి తెలుసుకొనినవానివలె నీవు సమస్తమును తెలుసుకొనగలిగిన వాడవు.

కల్పవృక్షము కన్న గొప్పనైన నీవు నేను కోరుకొనుచున్న శ్రీకృష్ణభక్తిని తప్పక అనుగ్రహింపగలవు. ఈ విధముగా నారదుడు తండ్రితో పలికి, అతని పాదములకు మ్రొక్కి, చేతులు మొగిడ్చి, భక్తితో తలను వంచుకొని, అతనికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి తపస్సు చేసికొనటకై అనుజ్ఞనువేడెను.

గచ్ఛంతం తనయం దృష్ట్వా విధాతా జగతాం మునే | రురోచోచ్చైర్ముక్తకంఠం మహాసాంసారికో యథా || 42

కరే ధృత్వా సమాలింగ్య చుచుంబ చ పునః పునః | చిరం వక్షసి కృత్వా చ వాసయామాస జానుని || 43

స్వాత్మారామేశ్వరో బ్రహ్మా యోగీంద్రాణాం గురోర్గురః | ఖేదం సోఢుం న శక్తిభూద్విచ్ఛేదో దుస్సహోనృణాం || 44

కాతరః పుత్రఖేదేన మోహితో విష్ణుమాయమా | శోకార్తో వక్తుమారేబే సుతం సంబోధ్య శౌనక || 45

తపస్సు చేసికొనటకై వెళ్ళుచున్న పుత్రుని చూచి ప్రపంచములను సృష్టించు బ్రహ్మదేవుడు సామాన్యమానవునివలె పెద్దగా ఏడ్చెను. పుత్రడగు నారదుని చేతిలోనికి తీసికొని కౌగిలించుకొని, మాటిమాటికి ముద్దుపెట్టకొని, చాలాకాలము ఒడిలోనుంచుకొనెను.

పరమయోగీంద్రులలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు విష్ణువుయొక్క మాయకు లోనై పుత్రవియోగమును భరించలేక దుఃశించుచు కొడుకైన నారదునితో ఇట్లనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాలణ బ్రహ్మఖండే బ్రహ్మనారదసంవాదే త్రయోవింశతిమోధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తమను పురాణమున బ్రహ్మఖండమున బ్రహ్మనారదసంవాదముగల

ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters