sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

సప్తదశోzధ్యాయః - విష్ణుమూర్తి ప్రశంస

సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు అనెను -

దృష్ట్వా ద్విజం దేవ సంఘః ప్రత్యుత్థానం చకార చ | పరస్పరం చ సంభాషా బభూవ తత్ర సంసది || 1

మా తం బుబుధిరే దేవాః శ్రీహరిం విప్రరూపిణం | పౌర్వాపర్యం విస్మృతాశ్చ మోహితా విష్ణుమాయయా || 2

సురాన్‌ సంబోధ్య విప్రశ్చ వాచా మధురయా ద్విజ | ఉవాచ సత్యం పరమం ప్రాణినాం యత్‌ శుభావహం || 3

ఆ బ్రహ్మ సభలోనికి వచ్చిన బ్రాహ్మణుని చూచి దేవతలందరు లేచి నిలబడి ఒకరికొకరు గుసగుసలు పోవుచుండిరి. విష్ణుదేవుని మాయవల్ల మోహితులైన దేవతలు విప్రరూపములోనున్న శ్రీహరిని గుర్తుపట్టలేదు. ఐనను ఆ బ్రాహ్మణుడు ప్రాణులకందరకు మేలు చేసే పరమ సత్యమును సమధురమైన వాక్కుతో దేవతలనిట్లు పలుకరించెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-

ఉపబర్హణభార్యేయం కన్యా చిత్రరథస్య చ | యయాచే జీవదానం చ స్వామినః శోకకర్శితా || 4

అధునా కిమనుష్ఠానం అస్య కార్యస్య నిశ్చితం | తన్మాం బ్రూత సురాస్సర్వే నిత్యం యత్సమయోచితం || 5

శప్తుకామా సురాన్సర్వాన్‌ సాధ్వీ తేజస్వినీ వరా | అహం క్షేమాయ యుష్మాకం ఆగతో బోధితా సతీ || 6

స్తుతిః కృతా చ యుష్మాభిః శ్వేతద్వేపే హరేరపి | యుష్మాకమీశో విష్ణుశ్చ కథమేవాత్ర నాగతః || 7

బభూవాకాశవాణీతి పశ్చాద్యాస్యతి కేశవః | విపరీతం కథం భూతం వాణీవాక్యమచంచలం || 8

బ్రాహ్మణస్యవచః శ్రుత్వా స్వయం బ్రహ్మా జగద్గురుః | ఉవాచ వచనం సత్యం హితం పరమమంగళం || 9

ఈమె ఉపబర్హణుడను గంధర్వుని భార్య. చిత్రరథుడను గంధర్వుని కూతురు. భర్త చనిపోవుటచే కలిగిన దుఃఖముచే బాధపడుచు భర్త ప్రాణములను కోరుచున్నది. అందువల్ల ఏమిచేయవలెనో ఏది సమయోచితమో దానిని మీరు తెలుపుడు. మిక్కిలి తేజస్సుగల ఈ పతివ్రత మిమ్ములను శపించ దలచితే నేను మీ క్షేమమును గోరి ఇక్కడకు వచ్చితిని. మీరు కూడ శ్వేత ద్వీపములో శ్రీహరిని స్తోత్రము చేసితిరిగదా! మీకు అధిపతియైన విష్ణుమూర్తి ఇక్కడకు రాలేదా? శ్రీహరి మీవెనక రాగలడని ఆకాశవాణి చెప్పిన మాట తలక్రిందులుగా ఎందుకు జరుగును? అను బ్రాహ్మణుని మాటలు విని జగద్గురువైన బ్రహ్మదేవుడు మిక్కిలి క్షేమంకరమైనది, హితము, సత్యము ఐన పలుకులు పలికెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

మత్ఫుత్రో నారదః శప్తో గంధర్వశ్చోపబర్హణః | యోగేన ప్రాణాంస్తత్యాజ పునశ్శాపాన్మమైవ హి || 10

కాలం లక్షయుగం వ్యాప్య స్థితిరస్య మహీతలే | శూద్రయోనిం తతః ప్రాప్య భవితా మత్సుతః పునః || 11

అస్య కాలావశేషస్య కించిదస్తి ద్విజోత్తమ | తత్తు వర్షసహస్త్రం చైవాయురస్యాకస్తి సాంప్రతం || 12

దాస్యామి జీవదానం చ స్వయం విష్ణోః ప్రసాదతః | యథైనం న స్పృశేచ్ఛాపః తత్కరిష్యామి నిశ్చితం || 13

నాగతో హరి రత్రేతి త్వయా యత్క థితం ద్విజ | హరిః సర్వత్ర సర్వాత్మా విగ్రహః కుత ఆత్మనః || 14

స్వేచ్ఛామయః పరం బ్రహ్మ భక్తానుగ్రహవిగ్రహః | సర్వం పశ్యతి సర్వజ్ఞః సర్వత్రాస్తి సనాతనః || 15

విషిశ్చ వ్యాప్తివచనః నుశ్చసర్వత్రవాచకః | సర్వవ్యాపీ చ సర్వాత్మా తేన విష్ణుః ప్రకీర్తితః || 16

ఓబ్రాహ్మణుడా! నాచే శపింపబడిన నాపుత్రుడగు నారదుడు ఉపబర్హణ గంధర్వుడుగా జన్మించెను. మరల నాశాపము చేతనే యోగమార్గముచేప్రాణములను వదలిపెట్టెను. ఇతడు లక్షయుగములు భూమిపై నివసించవలసి యున్నది. ఇతడు శూద్రుడుగా పుట్టి మరల నా పుత్రుడైన నారదుడు కాగలడు.

ఇతనికి వేయి సంవత్సరముల ఆయువు మాత్రము మిగిలిపోయినది. భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమువలన ఇతనికి నేను స్వయముగా ప్రాణములివ్వగలను, కాని మరల శాపము ఇతనికి తగలకుండ చేయవలసియున్నది.

ఇక మీరు ఇక్కడకు శ్రీహరి రాలేదని అన్నారు. కాని హరి అంతట ఉండువాడు. అందరికి ఆత్మ ఆతడే. అతని శరీరము ఇక్కడ లేనంత మాత్రాన హరిలేనట్లా? స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, భక్తుల ననుగ్రహించువాడు, సర్వజ్ఞుడు, సనాతనుడగు నా శ్రీహరి అన్ని విషయములను చూచుచుండును. విషి అనగా వ్యాప్తికి సంబంధించినది. ''ను'' అనగా సమస్త ప్రదేశము. అంతటా వ్యాపించి యున్నందువలన అతనికి విష్ణువు'' అను పేరు కల్గినది. అని బ్రహ్మదేవుడు పలికెను.

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోzపివా | యః స్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః || 17

కర్మారంభే చ మధ్యే వా శేషే విష్ణుం చ యః స్మరేత్‌ | పరిపూర్ణం తస్య కర్మ వైదికం చ భ##వేద్ద్విజ || 18

అహం స్రష్టా చ జగతాం విధాతా సంహరో హరః | ధర్మశ్చ కర్మణాం సాక్షీ యస్యాజ్ఞాపరిపాలకః || 19

కాలః సంహరతే లోకాన్యమః శాస్తా చ పాపినాం | ఉపైతి మృత్యుః సర్వాంశ్చ భియా యస్యాజ్ఞయా సదా || 20

సర్వేశా యా చ సర్వాద్యా ప్రకృతిః సర్వసూః పురా | సా భీతా యస్య పురతో యస్యాజ్ఞా పరిపాలికా || 21

అపవిత్రుడైనా, పవిత్రుడైనా, ఎట్టి పరిస్థితిలోనున్నను, శ్రీమన్నారాయణుని సేవించినవాడు బాహ్యమున, అంతరంగమున పవిత్రుడగుచున్నాడు. పనులు ప్రారంభించినపుడు, పనుల మధ్య, పనులు పరిసమాప్తమగుచున్నప్పుడు విష్ణుమూర్తిని తలచినచో అతడు చేయుపని పరిపూర్ణమగును. పైగా అది వైదిక కర్మవలె పవిత్రమైనదగును.

ఈ ప్రపంచములను సృష్టించునేను, సంహరించు, కర్మసాక్షియైన ధర్మదేవత, లోకములను సంహరించుకాలుడు, పాపాత్ములను శిక్షించు యముడు, మృత్యుకన్య, సమస్తమునకు ఆదిభూతమైనది, అన్నిటికి కారణమైన ప్రకృతి, ఇవన్నియు ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను సదా పరిపాలించుచున్నవి.

మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను -

పుత్రాణాం బ్రహ్మణస్తేషాం కస్య వంశోద్భవో భవాన్‌ | వేదానధీత్య భవతా జ్ఞాతః కః సారఏవ చ || 22

శిష్యః కస్య మునీంద్రస్య కస్త్వం నామ్నా చ భో ద్విజ | బిభర్త్యర్కాతిరిక్తం చ శిశురూపోzసి సాంప్రతం || 23

విడంబయసి దేవాంశ్చ విష్ణుమస్మాకమీశ్వరం | హృదిస్థం చ న జానాసి పరమాత్మానమీశ్వరం || 24

యస్మిన్‌ గతే పతేద్దేహో దేహినాం పరమాత్మని | ప్రయాంతి సర్వే తత్పశ్చాన్నరా దేవానుగా ఇవ || 25

జీవస్తత్ప్రతిబింబశ్చ మనో జ్ఞానం చ చేతనా | ప్రాణాశ్చేంద్రియవర్గాశ్చ బుద్ధిర్మేధా ధృతిః స్మృతిః || 26

నిద్రా దయా చతంద్రా చ క్షుత్తృష్ణా పుష్టిరేవచ | శ్రద్ధా సంతుష్టిరిచ్ఛా చ క్షమా లజ్జాదికాః స్మృతాః || 27

ప్రయాతి యత్పురః శక్తిః ఈశ్వరే మనోన్ముఖే | ఏతే సర్వేచ శక్తిశ్చ యస్యాజ్ఞా పరిపాలకాః || 28

ఈశ్వరే చ స్థితే దేహీ క్షమశ్చ సర్వకర్మసు | గతేzస్పృశ్యః శవస్త్యాజ్యః కస్తం దేహీ న మన్యతే || 29

స్వయం బ్రహ్మా చ జగతాం విధాతా సర్వకారకః | పాదారవిందమనిశం ధ్యాయతే ద్రష్టుమక్షమః || 30

యుగలక్షం తపస్తప్తం శ్రీకృష్ణస్య చ వేధసా | తదా బభూవ జ్ఞానీ చ జగత్‌ స్రష్టుం క్షమస్తదా || 31

అసంఖ్యకాలం సుచిరం తపస్తప్తం హరేర్మయా | తృప్తిం జగామ న మనః తృప్యతే కేన మంగళే || 32

అధునా పంచవక్త్రేణ యన్నామ గుణ కీర్తనం | గాయన్‌ భ్రమామి సర్వత్ర నిస్పృహః సర్వ కర్మసు || 33

మత్తోయాతి చమృత్యుశ్చ యన్నామగుణ కీర్తనాత్‌ | శశ్వజ్జపంతం తన్నామ దృష్ట్వా మృత్యుః పలాయతే || 34

సర్వబ్రహ్మాండ సంహర్తాzప్యహం మృత్యుంజయాభిధః | సురుచిరం తపసా యస్య గుణ నామానుకీర్తనాత్‌ || 35

కాలే తత్ర విలీనోzహమావిర్భూతస్తతః పునః | న కాలో మమ సంహర్తా న మృత్యుర్యత్ప్రసాదతః || 36

గోలోకే యః స వైకుంఠే శ్వేతద్వేపే సఏవచ | అంశాంశినోర్న భేదశ్చ బ్రహ్మన్‌ మహ్నిస్ఫులింగవత్‌ || 37

మన్వంతరం తు దివ్యానాం యుగానామేక సప్తతిః | అష్టావింశతిమే శ##క్రే గతే చ బ్రహ్మణో దినం || 38

ఏతత్సంఖ్యావిశిష్టస్య శతవర్షాయుషోవిధేః | పాతే లోచనపాతశ్చ యద్విష్ణోః పరమాత్మనః || 39

అహం కళానామృషభః కృష్ణస్య పరమాత్మనః | పరం మహిమ్నః కో గచ్ఛేన్న జానామి చ కించన || 40

ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ చ శౌనక | ధర్మశ్చ వక్తు మారేభే యుః సాక్షీ సర్వకర్మణాం || 41

ఓ బ్రాహ్మణకుమారా! బ్రహ్మదేవుని కుమారులలో ఎవరి వంశమునకు సంబంధించినవాడవు. వేదాలను చదివి నీవు గ్రహించిన సారమేది? నీవు ఏమునీంద్రుని శిష్యుడవు? ఏ పేరేమి ? నీ ప్రకాశము సూర్యుని వలెనున్నది. కాని వయస్సులో చాలా చిన్నగా కన్పించుచున్నావు.?

నీవు మాకందరకు ప్రభువైన విష్ణుమూర్తిని అనుకరించుచున్నావు. అందరి హృదయములలోనుండిన ఆ పరమాత్మ తత్వము నీకు తెలియకున్నది. పరమాత్మ ప్రాణుల శరీరములనుండి వెళ్ళినచో వారి ప్రాణాలే వెళ్ళిపోవును. ఆ పరమాత్మ వెంట అందరు దేవతలననుసరించు మానవులవలె పోదురు. జీవుడు ఆ పరమాత్మకు ప్రతిబింబము.

మనస్సు, జ్ఞానము చేతన, ప్రాణములు, ఇంద్రియములు, బుద్ధి, మేధ, ధృతి, స్మృతి, నిద్రా, దయ, సోమరితనము, ఆకలి, దప్పి, పుష్టి, శ్రద్ధ, సంతుష్టి, కోరిక, సిగ్గు శక్తి మొదలైనవన్నియు ఆ భగవంతుని ఆజ్ఞ పరిపాలించునవి. ఆ పరమేశ్వరుడు బయలుదేరునప్పుడు శక్తి అతని ముందు నడచుచుండును. ఈ విధముగా దేవతలు, అన్యులు అతని ఆజ్ఞను సర్వదా పరిపాలించుచుందురు.

పరమేశ్వరుడు ప్రాణుల దేహములో ఉన్నచో ఆ ప్రాణి సమస్తకర్మలు చేయగలుగును. ఆ పరమేశ్వరుడే శరీరమును వదలిపెట్టినచో ఆ శరీరము అస్పృశ్యమై శవమై పారవేయవలసివచ్చును.

ప్రపంచములనన్నిటిని సృష్టించు బ్రహ్మదేవుడు ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మములను ఎల్లప్పుడు ధ్యానము చేయుచుండును. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని గురించి లక్షయుగములు తపస్సు చేసి ప్రపంచములను సృష్టించు సామర్థ్యమును జ్ఞానమును పొందెను.

నేను చాలాకాలము అధికమైన తపస్సు చేసినను నా మనస్సుకు తృప్తికలుగలేదు. ఇప్పటికీ నేను నా ఐదు ముఖములతో ఆ సర్వేశ్వరుని నామగుణములను కీర్తించుచు సమస్త కర్మలపై నిస్పృహుడనై అంతటా తిరుగుతూ ఉంటాను. ఆ శ్రీమన్నారాయణుని గుణ కీర్తనము చేయుచున్నందువలన మృత్యువు నానుండి దూరముగా పోయినది. ఆ పరమేశ్వరుని నామజపము చేయువానిని చూచి మృత్యు దేవత పరుగెత్తుకొని పోవును. ఆ పరమేశ్వరుని నామగుణములను కీర్తన చేయుటవలననే నేను మృత్యుంజయుడనైతిని. నేను కాలములో విలీనమై మరల ఆ కాలమునుండి ఆవిర్భవించెదను. ఐనను కాని మృత్యువుకాని ఆ దేవదేవుని అనుగ్రహమువలన నన్ను సంహరించలేవు.

ఆ నారాయణుడు గోలోకమున, వైకుంఠమున, శ్వేతద్వీపమున ఉన్నాడు. గోలోకమున నున్న శ్రీకృష్ణునకు వైకుంఠమున, శ్వేతద్వీపమున నున్న నారాయణుడు అంశావతారమైనను నిప్పునకు, మిణుగురుకు భేదము లేనట్లే అంశికి, అంశములకు మధ్య భేదములేదు.

ఇరువదియొక్క దివ్యయుగములైన అది మన్వం తరము. ఇరువది ఎనిమిదవ దేవేంద్రుడు గతించినచో అది బ్రహ్మదేవునకు ఒక్కదినమగును. అట్లే నూట ఇరువది ఎనిమిది సంవత్సరములు బ్రహ్మదేవునకు గతించినచో భగవంతుడైన శ్రీమహావిష్ణువుకు అది ఒక క్షణము.

అందువలన నేనెంత గొప్పవాడనైనను శ్రీకృష్ణ పరమాత్మ మహిమను తెలుసుకొనజాలను. అని చెప్పి శంకరుడు ఊరకుండెను. ఆతరువాత ధర్మదేవత ఇట్లు చెప్పసాగెను.

ధర్మ ఉవాచ- ధర్మదేవత ఇట్లనెను -

యత్పాణిపాదౌ సర్వత్ర చక్షుశ్చ సర్వదర్శనం | సర్వాంతరాత్మా ప్రత్యక్షోzప్రత్యక్షశ్చ దురాత్మనః || 42

అధునాzపి సభాం విష్ణుర్నాయాత ఇతి యద్వచః | త్వయోzక్తం తత్కథా బుధ్యా మునీనాం చ మతిభ్రమః || 43

మహన్నిందా భ##వేద్యత్ర నైవసాధుః శ్రుణోతి తాం | నిందకః శ్రోతృభిస్సార్థం కుంభీపాకం వ్రజేద్యుగం || 44

శ్రుత్వా దైవాన్మహానిందాం శ్రీవిష్ణోః స్మరణాద్బుధః | ముచ్యతే సర్వపాపేభ్యః పుణ్యం ప్రాప్నోతిదుర్లభం || 45

కుంభీపాకే పచతి స యావద్ధి బ్రహ్మణో వయః | స్థలం భ##వేదపూతం చ సురాపాత్రం యథా ద్విజ || 46

కామతోzకామతో వాపి విష్ణునిందాం కరోతి యంః | శ్రుణోతి యో హసతి వా సభామధ్యే నరాధమః||47

ప్రాణీ చ నరకం యాతి శ్రుతం తత్రైవ చేద్ధ్రువం | విష్ణునిందా చ త్రివిధా బ్రహ్మణా కథితా పురా || 48

అప్రత్యక్షం చ కురుతే కిం వా తం చన మన్యతే | దేవాన్యసామ్యం కురుతే జ్ఞానహీనో నరాధమః|| 49

తస్యాత్రత నిష్కృతిర్నాస్తి యావద్వై బ్రహ్మణః శతం | గురోర్నిందాం యః కరోతి పితుర్నిందాం నరాధమః|| 50

విష్ణుర్గుశ్చ సర్వేషాం జనకో జ్ఞానదాయకః | పోష్టా పాతా భయత్రాతా వరదాతా జగత్త్రయే|| 51

ఏషాం చ వచనం శ్రుత్వా త్రయాణాం విప్రపుంగవ | ప్రహస్యోవాచ తాన్‌ దేవాన్‌ వాచా మధురయా పునః|| 52

శ్రీ మహావిష్ణువు పాణిపాదములు సర్వత్ర ఉండును. అతని నేత్రములు సమస్తమును దర్శించును. అతడు అందరిలో అంతరాత్మగా నుండి ప్రత్యక్షమగుచున్నాడు. కాని అతడు చెడ్డవారికి అప్రత్యక్షముగానుండును. అట్లేవిష్ణుమూర్తి గురించి చెప్పుచు అతడింతవరకు సభకు రాలేదని నీవంటివి కదా. సర్వత్ర వ్యాపించియున్నవాడు ఇచ్చట లేడని అనుకొనుట మతిభ్రమించి చెప్పిన మాటలు కాగలవు. మునులు ఈ మాటలన్నను వారికి మతిభ్రమించినదని చెప్పవచ్చును.

పెద్దలను నిందించుచున్నప్పుడు మంచివాడు ఆ మాటలను పట్టించుకొనడు. విననట్లుండును. ఎందువలననగా పెద్దలనిందించువాడు ఆ నిందవాక్యముల విన్నవాడు ఇద్దరు కుంభీపాక నరకమునకు పోదురు. పొరపాటున పెద్దల నిందను విన్నచో విష్ణుమూర్తి స్మరణ చేసికొని ఆ పాపమునుండి తప్పించుకొనవలెను. ఇష్టముగానో అ నిష్టముగానో విష్ణునిందను ఎవరు చేయుదురో, దాని నెవరు విందురో, వెక్కిరింతురో వారు బ్రహ్మదేవుడు బ్రతికి ఉన్నంతవరకు కుంభీపాకనరకమున బాధలు పడుదురు. విష్ణునింద మూడు విధములని బ్రహ్మదేవుడు తెలిపెను. 1. చాటున చేసిన నింద 2. అతనిని ఒప్పుకొనకపోవుట 3. అన్యదేవతలతో సమానముగా భావించుట.

గురునిందను పితృనిందను చేసిన నరాధముడు సూర్య చంద్రులున్నంతవరకు నరకలోకమున ఉండును. విష్ణుమూర్తి గురుతుల్యుడు, జనకునితో సమానుడు. అతడే పోషకుడు, రక్షకుడు, భయము తొలగించువాడు. కోరిన కోరికలను ఇచ్చువాడు. కావున అతనిని ఏ పరిస్థితిలోను నిందించుట తగనిది.

బ్రహ్మదేవుడు, శంకరుడు, ధర్మదేవతపలికిన మాటలు విని బ్రాహ్మణుడు నవ్వి వారితో మధురముగా ఇట్లు పలికెను. బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లనెను. -

కా కృతా విష్ణునిందాzహో హే దేవా ధర్మశాలినః| నాగతో హరిరత్రేతి వ్యర్థాzకాశసరస్వతీ || 53

ఇతి ప్రోక్తం మయా భద్రం బ్రూత ధర్మార్థమీశ్వరాః | సభాయాం పాక్షికాః సంతో ఘ్నంతి స్మ శతపూరుషం||54

యూయం చ భావకా బ్రూత విష్ణుః సర్వత్ర సంతతం | ఇతి చేత్తత్కథం యాతాః శ్వేతద్వీపం వరాయ చ || 55

అంశాంశినోర్న భేదశ్చేదాత్మనశ్చేతి నిశ్చితం | కళాం హిత్వా నిషేవంతే సంతః పూర్ణతమం కథం|| 56

కోటిజన్మదురారాధ్యమసాధ్యమసతామపి | ఆశా బలవతీ పుంసాం కృష్ణం సేవితుమిచ్ఛతి || 57

కిం క్షుద్రాః కిం మహాంతశ్చ వాంఛంతి పరమం పదం | లబ్ధుమిచ్ఛతి చంద్రం చ బాహుభ్యాం వామనో యథా|| 58

యో విష్ణుర్విషయీ విశ్వే శ్వేతద్వీపనివాసకృత్‌ | యూయం బ్రహ్మేశధర్మాశ్చ దిక్పాలాశ్చ దిగీశ్వరా ః || 59

బ్రహ్మ విష్ణు శివాద్యాశ్చ సురలోకాశ్చరాచరాః | ఏవం కతివిధాః సంతి ప్రతివిశ్వేషు సంతతం || 60

విశ్వానాం సురాణాం చ కః సంఖ్యాం కర్తుమీశ్వరః | సర్వేషామీశ్వరః కృష్ణో భక్తానుగ్రహవిగ్రహః || 61

ఊర్ధ్వం చ సర్వబ్రహ్మాండాత్‌ వైకుంఠం సత్యమీప్పితం | తస్మాదూర్ధ్వం చ గోలోకః పంచాశత్కోటి యోజనం || 62

చతుర్భుజశ్చ కైకుంఠే లక్ష్మీకాంతః సనాతనః | సునంద నంద కుముద పార్షదాదిభిరావృత ః || 63

గోలోకే ద్విభుజః కృష్ణో రాధాకాంతః సనాతనః | గోపాంగనాధిభివర్యుక్తో ద్విభుజైర్యోzపపార్షదైః|| 64

పరిపూర్ణతమం బ్రహ్మ స చాత్మా సర్వదేహినాం | స్వేచ్ఛామయశ్చ విహరేద్రాసే బృందావనే వనే || 65

తజ్జ్యోతిర్మండలాకారం సూర్యకోటి సమప్రభం | ద్యాయంతే యోగినః సంతః సంతతం చ నిరామయం|| 66

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము

నవీననీరదశ్యామం ద్వాభుజం పీతవాసనం | కోటికందర్పలావణ్య లీలాదామ మనోహరం || 67

కిశోరనయనం శశ్వత్‌ శాంతం సస్మితమీశ్వరం | ధ్యాయంతే వైష్ణవాః సంతః సేవంతే సత్యవిగ్రహం || 68

యూయం చ వైష్ణవా బ్రూత కస్య వంశోద్భవో భవాన్‌ | శిష్యః కస్య మునీంద్రస్యేత్యేవం మాం చ పునః పనః || 69

యస్యవంశోద్భవోzహం చ యస్య శిష్యశ్చ బాలకః | తస్యేదం వచనం జ్ఞానం దేవసంఘూ నిబోధత || 70

శీఘ్రం జీవయ గాంధర్వం దేవేశ్వర సురేశ్వర | వ్యక్తే విచారే మూర్ఖః కో వాగ్యుద్ధే కిం ప్రయోజనం || 71

ఇత్యుక్త్వా బాలకస్తత్ర వప్రరూపీ జనార్దనః విరరామ సభామధ్యే ప్రజహాస చ శౌనక || 72

ఓ ధర్మ స్వరూపులైన దేవతలారా ! నేనెచ్చట విష్ణునిందను చేసితిని. శ్రీహరి ఇచ్చటకు రానందువలన ఆకాశవాణి పలుకులు వ్యర్థమైనవి అంటిని. పూజ్యులైన మీరు ఇందలి ధర్మార్థమును తెలుపుడు. సభలో పక్షపాతవైఖరితో నున్నవారు వారి పూర్వులను నూరుతరములవరకు నరకమునకు పంపుదురు.

మీరు విష్ణుమూర్తి ఎల్లప్పుడు సమస్తప్రదేశములందుండును అని అంటిరి ఐనచో విష్ణవు దగ్గరకు వరమును కోరి శ్వేత ద్వీపమున కేలపోతిరి? అట్లే అంశమునకు అంశికి భేదములేనిచో మహాత్ములు అంశమును వదలి పరిపూర్ణుడైన భగవంతుని ఎందుకు సేవించుచున్నారు?

మానవులకు ఆశ మిక్కిలి బలీయమైనది. అది కోటి జన్మలెత్తినా ఆరాధించుటకు కష్టమైన వాడును, అసాధువులకైతే అసాధ్యుడు ఐన శ్రీకృష్ణుని సేవింపజేయును. క్షుద్రులైనా మహాత్ములైనా అందరు పరమపదమును పొందవలెనని కోరుకుందురు. పొట్టివాడైనా చంద్రుని తన బాహువులలో నుంచుకొనవలెనని కోరుకున్నట్లుగా వీరూ పరమపదమును కోరుకొందురు.

శ్వేత ద్వీపములో నివాసముంటున్న విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శంకరుడు దిక్పాలకులు, ఇతర దేవతలు, చరాచరసృష్టి ప్రతివిశ్వమున కనిపింతురు. ఈ ప్రపంచముల సంఖ్యను, దేవతల సంఖ్యను లెక్కించుట ఎవరకిని సాధ్యము కాదు.

అందరకు ప్రభువు భక్తుల ననుగ్రహించు శ్రీకృష్ణుడే. సమస్త బ్రహ్మాండములకు పైన వైకుంఠలోకము కలదు. దానిపైన ఏబదికోట్ల యోజనముల విస్తీర్ణమైన గోలోకమున్నది.

వైకుంఠమున లక్ష్మీపతియైన నారాయణుడు చతుర్భుజములతో , సునంద, నంద, కుముదాదిపార్షదులతోనుండును.

గోలోకమున నున్న శ్రీకృష్ణుడు ద్విభుజుడు, రాధా రమణుడు, గోపకాంతలతో, ద్విభుజులైన ఉపపార్షదులతో కలసియుండును. అతడు పరిపూర్ణుడు. సమస్త ప్రాణులకు అతడే అంతరాత్మ. స్వేచ్చామయుడైన ఆ పురుషుడు బృందావనములో రాసవిహారము చేయును. కోటి సూర్య సమప్రభము, మండలాకారములోనున్న ఆ జ్యోతి స్వరూపమును యోగులు సేవింతురు.

నూత్న మేఘమువలే నల్లనివాడు, ద్విభుజుడు, పచ్చని వస్త్రములు ధరించువాడు, కోటి మన్మథుల యొక్క అందము కలవాడు, శాంతుడు, చిరునవ్వు కలవాడు, చంటిపిల్లవాని కళ్ళవలే నిర్మలమైన కళ్ళుగల శ్రీకృష్ణుని వైష్ణవులు సేవింతురు.

మీరందరు వైష్ణవులే కదా. నేను ఏవంశములో పుట్టితినని నాగురువు ఎవరని మీరు అడిగితిరి? దీనిని మీరే చెప్పవలసి యున్నది.

ఓబ్రహ్మదేవుడా! త్వరగా ఈ గంధర్వుని (ఉపబర్హుణుని) బ్రతికింపుము. భావము చాల స్పష్టముగా ఉండగా వాగ్యుద్ధమునకు పోవు మూర్ఖుడెవడుండును. దానివలన ప్రయోజనమేమి?

ఈ విధముగా విప్రుని వేషమున నున్న జనార్ధనుడు పలికి ఆ సభలో నవ్వుతూ కూర్చుండెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే విష్ణుసుర సంఘ సంవాదే విష్ణు ప్రశంసాప్రణయనే సప్తదశోzధ్యాయ ః

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణములో విష్ణువు. దేవతల సంవాదముకల బ్రహ్మఖండమున విష్ణుమూర్తి ప్రశంసకల

పదునేడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters