sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏకత్రింశత్తమోZధ్యాయః - పరశురామాయ శ్రీకృష్ణ కవచప్రదానం

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో నిట్లనెను.

భగవంచ్ఛ్రోతు మిచ్ఛామి కిం మంత్రం భగవాన్‌ హరః | కృపయాZదాత్పరశురామాయ స్తోత్రమేవ చ వర్మ చ || 1

కోవాZస్యమంత్రస్యారాధ్యః కిం ఫలం కవచస్య చ | స్తవనస్య ఫలం కిం వా తద్భవాన్వక్తుమర్హసి || 2

ఓ నారాయణమునీ!పరమశివుడు పరశురామునకు ఉపదేశించిన స్తోత్రము, మంత్రము, కవచము ఎట్టివి? ఆ మంత్రము ఎవరికి సంబంధించినది ? స్తోత్రము కవచముల యొక్క ఫలమేమి ? విషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుమని అడిగెను.

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను-

మంత్రారాధ్యో హి భగవాన్‌ పరిపూర్ణతమఋ స్వయం | గోలోకనాథః శ్రీకృష్ణో గోపగోపీశ్వరః భుః || 3

త్రైలోక్యవిజయం నామ కవచం పరమాద్భుతం | స్తవరాజం మహాపుణ్యం భూతి యోగ సముద్భవం || 4

మంత్రం కల్పతరుం నామ సర్వకామ ఫలప్రదం | దదౌ పరశురామాయ రత్న పర్వత సన్నిధౌ || 5

స్వయం ప్రభానదీతీరే పారిజాత వనాంతరే | ఆశ్రమే లోక దేవస్య మాధవస్య చ సన్నిధౌ || 6

పరమ శివుడు పరశురామునకుపదేశించిన మంత్రమునకు ఆరాధ్యదైవము పరిపూర్ణుడు గోపగోపికానాథుడగు శ్రీకృష్ణుడే. శంకరుడుపదేశించిన త్రైలోక్యవిజయమను కవచము చాలా అద్బుతమైనది. అట్లే అతడు పదేశించిన స్తోత్రమువలన గొప్ప సంపద మరియు యోగము కలుగును. అతడుపదేశించిన కల్పతరువను మంత్రము సమస్తమైనకోరికలను తీర్చును. వీటిని పరమశివుడు రత్నపర్వత సమీపమున, స్వయంప్రభానదీ తీరముననున్న పారిజాత వనములోని పరమేశ్వరుని ఆశ్రమమున మాధవుని యొక్క సమీపమున ఉపదేశించెను.

మహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-

వత్సాగచ్ఛ మహాభాగ భృగువంశ సముద్భవ | పుత్రాధికోZసి ప్రేవ్ణూ మే కవచ గ్రహణం కురు || 7

శ్రుణు రామ ప్రవక్ష్యామి బ్రహ్మాండే పరమాద్భుతం | త్రైలోక్య విజయం నామ శ్రీకృష్ణస్య జయావహం || 8

శ్రీకృష్ణేన పురాదత్తం గోలోకే రాధికాశ్రమే | రాసమండలమధ్యే చ మహ్యం బృందావనే వనే || 9

అతిగుహ్యతరం తత్వం సర్వమంత్రౌఘ విగ్రహం | పుణ్యాత్పుణ్యతరం చైవ పరం స్నేహాద్వదామి తే || 10

యద్ధృత్వా పఠనాద్దేవీ మూలప్రకృతిరీశ్వరీ | శుంభం నిశు భం మహిషం రక్తబీజం జఘాన హ || 11

యద్ధృత్వా Zహం చ జగతాం సంహర్తా సర్వతత్వవిత్‌ | అవధ్యం త్రిపురం పూర్వం దురంతమపి లీలయా || 12

యద్ధృత్వా పఠనాద్బ్రహ్మా ససృజే సృష్టిముత్తమాం | యద్ధృత్వా భగవాంఛేషో విధత్తే విశ్వమేవ చ || 13

యద్ధృత్వా కూర్మరాజశ్చ శేషం ధత్తే హి లీలయా | యద్ధృత్వా భగవాన్వాయుర్విశ్వాధారో విభుః స్వయం || 14

యద్ధృత్వా వరుణః సిద్ధః కుబేరశ్చ ధనేశ్వరః | యద్ధృత్వా పఠనాదింద్రో దేవానామధిపః స్వయం || 15

యద్ధృత్వా భాతి భువనే తేజోరాశిః స్వయం రవిః | యద్ధృత్వా పఠనాచ్చంద్రో మహాబలపరాక్రమః || 16

అగస్త్యః సాగరాన్సప్త యద్ధృత్వా పఠనాత్పపౌ | చకార తేజసా జీర్ణం దైత్యం వాతాపి సంజ్ఞకం || 17

యద్ధృత్వా జగతాం సాక్షీ ధర్మో ధర్మభృతాం వరః | సర్వవిద్యాధిదేవీ సా యచ్చ ధృత్వా సరస్వతీ || 19

యద్ధృత్వా జగతాం లక్ష్మీరన్నదాత్రీ పరాత్పరా | యద్ధృత్వా పఠనాద్వేదాన్‌ సావిత్రీ సా సుషావ చ || 20

వేదాశ్చ ధర్మవక్తారో యద్ధృత్వా పఠనాత్‌ భృగో | యద్ధృత్వా పఠనాచ్ఛద్దస్తేజస్వీ హవ్యవాహనః ||

సనత్కుమారో భగవాన్‌ యద్ధృత్వా జ్ఞానినాం వరః || 21

దాతవ్యం కృష్ణభక్తాయ సాధవే చ మహాత్మనే | శఠాయ పరిశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్‌ || 22

భృగువంశమున పుట్టిన భార్గవరామా!నిన్ను నాపుత్రుని కంటె మిన్నగా ప్రేమించుచున్నాను. అందువలన త్రైలోక్య విజయమను ఈకవచమును స్వీకరింపుము. శ్రీకృష్ణునకు చెందిన ఈ త్రైలోక్యవిజయమను కవచము అత్యద్భుతమైనది. సమస్త జయములను కలిగించును.

ఈ కవచమును శ్రీకృష్ణుడు గోలోకమున బృందావనములోని రాసమండలమున నున్న రాధికాశ్రమమున నాకు ఉపదేశించెను. ఇది మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారరూపమైనది. మిక్కిలి పుణ్యమైన దీనిని నీపై నున్న ప్రేమతో నీకు ఉపదేశించుచున్నాను.

ఈ కవచమును శరీరమున ధరించి, పఠించి మూల ప్రకృతి యగు దుర్గాదేవి శంభు నిశుంభులను మహిషాసురుని, రక్తబీజుని చంపగలిగినది. అట్లే నేను సర్వతత్వములను తెలిసికొని జగత్సంహార కారకుడనైతిని. అట్లే జయింపరాని త్రిపురములను అవలీలగా జయించితిని. దీనిని ధరించినందువలననే బ్రహ్మదేవుడు సృష్టిని చేయగలిగెను. శేషుడు అనంత విశ్వమును, ఆశేషునిసిద్ధినందినాడు. కుబేరుడు ధనాధిపతియైనాడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి కాగలిగెను. సూర్యుడు తేజోరాశియైనాడు. చంద్రుడు మహాబలపరాక్రమవంతుడయ్యెను. అగస్త్య మహాముని సప్త సాగరములను త్రాగగలిగెను. అట్లే వాతాపియను రాక్షసుని జీర్ణము చేసికోగలిగెను.ఈ కవచమును ధరించి పఠించినందులననే భూమి అన్నిటికి ఆధారము కాగలిగినది. గంగ జగములన్నిటిని పవిత్రము చేయగలిగినది. ధర్మదేవత ధర్మవిదులలో శ్రేష్ఠురడు కాగలిగెను. సరస్వతీదేవి సమస్త విద్యలకు అధిదేవియైనది. జగన్మాతయగు అన్నపూర్ణాదేవి పరాత్పర కాగలిగినది. అగ్ని దేవుడు పరమశుద్దుడు, తేజోవంతుడు కాగలిగెను. సనత్కుమారుడు జ్ఞానవంతులలో శ్రేష్ఠుడు కాగలిగెను.

ఇట్టి త్రైలోక్య విజయమను ఈ కవచమును మహాత్ముడు, సాధువు అగు శ్రీకృష్ణభక్తునకే ఉపదేశింపవలెను గాని మూర్ఖుడు ఇతరదేవతా భక్తుడగువానికి ఉపదేశింపగూడదు. అట్లు ఉపదేశించినచో ఉపదేశము చేసినవాడు వెంటనే మృత్యువుపాలగును అని అనెను.

త్రైలోక్య విజయస్యాస్య కవచస్య ప్రజాపతిః |ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవో రాసేశ్వరః స్వయం || 23

త్రైలోక్య విజయప్రాప్తౌ వినియోగః ప్రకీర్తితః | పరాత్పరం చ కవచం త్రిషు లోకేషు దుర్లభం || 24

ప్రణవో మే శిరః పాతు శ్రీకృష్ణాయనమః సదా | పాయాత్కపాలం కృష్ణాయ స్వాహా పంచాక్షరః స్మృతః || 25

కృష్ణేతి పాతు నేత్రే చ కృష్ణ స్వాహేతి తారకం | హరయే నమ ఇత్యేవం భ్రూలతాం పాతు మే సదా || 26

ఓం గోవిందాయ స్వాహేతి నాసికాం పాతు సంతతం | గోపాలాయనమో గండౌ పాతు మే సర్వతః సదా || 27

ఓం నమో గోపాంగనేశాయ కర్ణౌ పాతు సదామమ | ఓం కృష్ణాయ నమః శశ్వత్వాతు మేZధర యుగ్మకం || 28

ఓం గోవిందాయ స్వాహేతి దంతౌఘం మే సదాZవతు | పాతు కృష్ణాయ దంతాధో దంతోర్ధ్వం క్లీం సదాZవతు || 29

ఓం శ్రీకృష్ణాయ స్వాహేతి జిహ్వికాం పాతుమే సదా | రాసేశ్వరాయ స్వాహేతి తాలుకం పాతుమే సదా || 30

రాధికేశాయ స్వాహేతి కంఠం పాతు సదా మమ | నమో గోపాంగనేశాయ వక్షః పాతు రసదామమ || 31

ఓం గోపేశాయస్వాహేతి స్కంధం పాతు సదా మమ | నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం సదాZవతు || 32

ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమః సదా | ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహేతి కరౌపాతు సదామమ || 33

ఓం విష్ణవే నమో బాహుయుగ్మం పాతు సదా మమ | ఓం హ్రీం భగవతే స్వాహా నఖరం పాతు మే సదా || 34

ఓం నమోనారాయణాయేతి నఖరంధ్రం సదాZవతు | ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ నాభిం పాతు సదామమ || 35

ఓం సర్వేశాయ స్వాహేతి కంకాళం పాతుమే సదా | ఓం గోపీరమణాయ స్వాహా నితంబం పాతుమే సదా || 36

ఓం గోపీరమణనాథాయ పాదౌపాతు సదామమ | ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహా సర్వం సదాZవతు || 37

ఓం కేశవాయస్వాహేతి మమ కేశాన్‌ సదాZవతు | నమః కృష్ణాయ స్వాహేతి బ్రహ్మరంధ్రం సదాZవతు || 38

ఓం మాధవాయస్వాహేతి మేలోమాని సదాZవతు | ఓం హ్రీం శ్రీం రాసికేశాయ స్వాహా సర్వం సదాZవతు || 39

పరిపూర్ణతమః కృష్ణః ప్రాచ్యాం మాం సర్వదాZవతు | స్వయం గోలోకనాథో మామాగ్నేయ్యాం దిశి రక్షతు || 40

పూర్ణ బ్రహ్మస్వరూపశ్చ దక్షిణ మాం సదాZవతు | నైఋత్యాం పాతుమే కృష్ణః పశ్చిమే పాతు మాం హరిః || 41

గోవిందః పాతుమాం శశ్వద్వాయవ్యాం దిశి నిత్యశః | ఉత్తరే మాం సదా పాతు రసికానాం శిరోమణిః || 42

ఐశాన్యాం మాం సదాపాతు బృందావన విహార కృత్‌ | బృందావనీ ప్రాణనాథః పాతు మామూర్ధ్యదేశతః || 43

సదైవ మాధవః పాతు బలిహారీ మహాబలః | జలేస్థలే చాంతరిక్షే నృసింహః పాతు మాం సదా || 44

స్వప్నే జాగరణ శశ్వత్పాతు మాం మాధవః సదా | సర్వాంతరాత్మా నిర్లిప్తః పాతు మాం సర్వతో విభుః || 45

త్రైలోక్య విజయమను నీకవచమునకి ఋషిబ్రహ్మదేవుడు. ఛందస్సు గాయత్రీ ఛందస్సు. దేవత రాసేశ్వరుడగు శ్రీకృష్ణపరమాత్మయే. మూడు లోకములందు జయము లభించుటకై దీనిని వినియోగింపవలెను. పరాత్పరమగు ఈ కవచము మూడు లోకములందును లభింపదు.

ఓం శ్రీకృష్ణాయ నమః అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక. కృష్ణాయస్వాహా అను పంచాక్షర మంత్రము నా కపాలమునురక్షించుగాక. కృష్ణా అనునది నాకండ్లను, కృష్ణస్వాహా అనునది నా తారకలను రక్షించుగాక. హరయేనమః అనుమంత్రము నాకనుబొమలను రక్షించుగాక. ఓం గోవిందాయస్వాహా అనునది నానాసికను రక్షించుగాక. గోపాలాయనమః అనుమంత్రము నా చెక్కిళ్ళను రక్షించుగాక. ఓం నమో గోపాంగనేశాయ అనునది నాచెవులను రక్షించుగాక. ఓం కృష్ణాయ నమః అనుమంత్రము నా పెదవులను రక్షించుగాక, ఓం గోవిందాయస్వాహా అనునది నా దంతములను రక్షించుగాక, కృష్ణాయ అనునది క్రింది చిగుళ్ళను, క్లీం అనునది పై చిగుళ్ళను, ఓంశ్రీకృష్ణాయ స్వాహా అను మంత్రము నానాలుకను, రాసేశ్వరాయ స్వాహా అనునది నా తాలువులను, రాధికేశాయ స్వాహా అను మంత్రము నాకంఠమును, నమోగోపాంగనేశాయ అనునది నావక్షస్థలమును, ఓం గోపేశాయస్వాహా అనునది నా భుజములను, నమఃకిశోర వేషాయ స్వాహా అనునది నాపృష్ఠ భాగమును, ముకుందాయనమః అనునది నా ఉదరమును, ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహా అనునది నాకరములను, ఓం విష్ణవే నమః అనునది నా బాహువులను, ఓం హ్రీం భగవతే స్వాహా అనుమంత్రము నా నఖములను, ఓం నమో నారాయణాయ అనునది గోళ్ళ వెనక భాగమును, ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ అనునది నాభిని, ఓం సర్వేశాయ స్వాహా అనునది నా ఎముకల గూడును, ఓం గోపీరమణాయ స్వాహా అనునది నానితంబములను, ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహా అనునది నా సర్వాంగములను రక్షించుగాక! అట్లే ఓం కేనవాయస్వాహా అనునది నాయొక్క వెంట్రుకలను, ఓం మాధవాయస్వాహా అనుమంత్రము రోమములను, ఓం హ్రీం శ్రీం రాసికేశాయస్వాహా అనునది నా సమస్తావయములను రక్షించుగాక !

పరిపూర్ణతముడగు కృష్ణుడు నా తూర్పుదిశను, గోలోకనాథుడు నా ఆగ్నేయభాగమును, పూర్ణబ్రహ్మస్వరూపుడు నాదక్షిణ భాగమును, కృష్ణుడు నా నైఋతి భాగమును, శ్రీహరి నా పశ్చిమ భాగమును, గోవిందుడు నా వాయవ్యభాగమును, రసిక శిరోమణి నా ఉత్తర భాగమును, బృందావన విహారి నా ఈశాన్య భాగమును, బృందావనీ ప్రాణనాథుడు నా ఊర్ధ్వభాగమును, మహాబలుడగు బలిహారి, మాధవుడు, నృసింహుడు భూభాగమున, జలభాగమున ఆకాశభాగమున నన్నెల్లప్పుడు రక్షింతురుగాక, మాధవుడు స్వప్నావస్థయందును, జాగ్రదవస్థయందును నన్నెల్లప్పుడు రక్షించుగాక. సర్వాంతరాత్మస్వరూపి, నిర్లిప్తుడగు శ్రీకృష్ణుడు నన్నెల్లప్పుడు అన్ని దిక్కులనుండి రక్షించుగాక.

ఇతితే కథితం వత్స సర్వ మంత్రౌఘ విగ్రహం | త్రైలోక్య విజయం నామ కవచం పరమాద్భుతం || 46

మయా శ్రుతం కృష్ణవక్త్రాత్‌ ప్రవక్తవ్యం న కస్యచిత్‌ | గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేత్తు యః || 47

కంఠే వా దక్షిణ బాహౌ సోZపి విష్ణుర్ణసంశయః | స చ భక్తో భ##వేద్యత్ర లక్ష్మీర్వాణీ వసేత్తతః || 48

యది స్యాత్సిద్ధకవచో జీవన్ముక్తో భ##వేత్తు సః | నిశ్చితం కోటి వర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్‌ || 49

రాజసూయ సహస్రాణి వాజపేయ శతాని చ | అశ్వమేధాయుతాన్యేవ నరమేధాయుతాని చ || 50

మహాదానాని యాన్యేన ప్రాదక్షిణ్యం భువస్తథా | త్రైవోక్య విజయాస్యాస్య కళాం నార్హంతి షోడశీం || 51

వ్రతోపవాసనియమం స్వాధ్యాయాధ్యయనం తపః | స్నానం చ సర్వతీర్థేషు నాస్యార్హంతి కళామపి || 52

సిద్ధత్వ మమరత్వం చ దాసత్వం శ్రీహరేరపి | యదిస్యాత్సిద్ధకవచః సర్వం ప్రాప్నోతి నిశ్చితం || 53

స భ##వేత్సిద్ధకవచో దశలక్షం జపేత్తు యః | యోభ##వేత్సిద్ధ కవచః సర్వజ్ఞః స భ##వేత్‌ ధ్రువం || 54

ఇదం కవచ మజ్ఞాత్వా భ##జేత్కృష్ణం సమందధీః | కోటి కల్పం ప్రజప్తోZపి నమంత్రః సిద్ధిదాయకః || 55

గృహీత్వా కవచం వత్స మహీం నిఃక్షత్రియం కురు | త్రిస్సప్తకృత్వో నిశ్శంకః సదానందో హి లీలయా || 56

రాజ్యం దేయం శిరోదేయం ప్రాణాదేయాశ్చ పుత్రక | ఏవం భూతం చ కవచం న దేయం ప్రాణసంకటే || 57

భార్గవరామా! సమస్తమంత్రసారమైన త్రైలోక్య విజయమను కవచమును నీకు చెప్పితిని. దీనిని శ్రీకృష్ణుని వలన ఉపదేశము పొందితిని. దీనిని అర్హత లేనివారికి ఉపదేశింపకూడదు. గురువును శాస్త్రపద్ధతిలో పూజించి ఈ కవచమును తల కంఠమందుగాని దక్షిణ బాహువున గాని దీనిని కట్టుకొనవలెను. ఆ విధముగా చేసినచో అతడు విష్ణుతుల్యుడగును. అతడు శ్రీహరి భక్తుడగును. అందువలన అతని దగ్గర విద్య, ధనము, రెండును ఉండును.

కవచము సిద్ధించినచో అతడు జీవన్ముక్తుడగును. అతడు కోటి సంవత్సరములు శ్రీహరి పూజించిన ఫలితమును పొందును. వేయి రాజసూయ యాగములు, నూరు వాజపేయయాగములు, పదివేల అశ్వమేధములు, నరమేధములు, గొప్పదానములు, భూమి ప్రదక్షిణము ఇవన్నియు త్రైలోక్య విజయము యొక్క పదునారవ అంశ##యైన కాజాలవు. అట్లే వ్రతములు ఉపవాసనియమములు, వేదాధ్యయనము, తపస్సు, సమస్త పుణ్య తీర్థస్నానము ఇవన్నియు ఈ కవచమునకు పదునారవవంతైనను కాజాలవు. సిద్ధకవచుడు సిద్ధత్వమును, దేవతాత్వమును, శ్రీహరి దాస్యమును అన్నిటిని తప్పక పొందును.

ఈ కవచమును పదిలక్షల మార్లు జపించినచో అతడు సిద్ధకవచుడగును. సిద్ధకవచుడు సర్వజ్ఞుడు కూడ కాగలడు. ఈ కవచమును వదలిపెట్టి అనేక కోట్లు శ్రీహరి మంత్రమును పఠించినను ఆ మంత్రము సిద్ధికాదు. అందువలన ఈ కవచము యొక్క సహాయమువలన ఈ భూమిపై రాజులు లేకుండ ఇరువది యొక్కమార్లు తిరిగి, సంహారము చేయగలవు.

రాజ్యము నివ్వవచ్చును చివరకు తన తలనైన ఈయవచ్చును. ప్రాణము లివ్వవచ్చును. కాని ప్రాణాపాయ పరిస్థితిలోనైనను. ఈకవచమును అనర్హునకు ఉపదేశింపరాదు. అని పరమశివుడు భార్గవరామునితోననెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే పరశురామాయ శ్రీకృష్ణ కవచ ప్రదానం నామ ఏకత్రిశత్తమోzధ్యాయః||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన పరశురామునకు శ్రీకృష్ణకవచ ప్రదానమను

ముప్పది యొక్కటవ అధ్యాయముసమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters