sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చతుర్వింశతితమోధ్యాయః -జమదగ్ని, కార్తవీర్యుల చరిత్ర

నారద ఉవాచ - నారదమహర్షి నారాయణమునితో ఇట్లు పలికెను.

నారాయణ మహాభాగ హరేరంశ సముద్భవ | సర్వం శ్రుతం త్వత్ప్రసాదాద్గణశ చరితం శుభం || 1

దంతద్వయయుక్తం వక్త్రం గజరాజస్య బాలకే | విష్ణునా యోజితం బ్రహ్మన్నేకదంతః కథం శిశుః || 2

కుతో గతోZ స్య దంతోZ న్యస్తద్భవాన్‌ వక్తుమర్హతి | సర్వేశ్వరస్త్వం సర్వజ్ఞః కృపావాన్భక్తవత్సలః || 3

శ్రీహరి అంశవలన ఉద్భవించిన నారాయణమునీ! నీయొక్క అనుగ్రహమువలన శుభంకరమైన గణపతిచరిత్రనంతయు వింటిని. కాని విష్ణుమూర్తి బాలకుడగు గణపతికి రెండు దంతములున్న ఏనుగు ముఖమును సమకూర్చగా అతడు ఏకదంతుడెట్లయ్యెను. అతని రెండవ దంతము ఎచ్చటికి పోయినది? ఈ విషయమునంతయు సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు దయామతివైన మీరు నాకెరిగించగలరని కోరెను.

సూత ఉవాచ - సూతమహర్షి (సౌతి?) ఇట్లు పలికెను.

నారదస్యవచః శ్రుత్వా స్మేరాసన సరోరుహః | ఏకదంతస్య చరితం ప్రవక్తుముపచక్రమే || 4

ఓ శౌనకమునీ! నారదుని ప్రశ్న విన్న నారాయణముని చిరునవ్వుతో ఏకదంతుని చరిత్ర చెప్పుటకిట్లు మొదలిడెను.

నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను.

శ్రుణు నారద వక్ష్యేZహమితిహాసం పురాతనం | ఏకదంతస్య చరితం సర్వమంగళమంగళం || 5

ఏకదా కార్తవీర్యశ్చ జగామ మృగయా మునే | మృగాన్నిహత్య బహుళాన్పరిశ్రాంతో బభూవ సః || 6

నిశాముఖే దినాతీతే తత్ర తస్థౌ వనే నృపః | జమదగ్న్యాశ్రమాభ్యాశే చోపోష్యానీకసంయుతః || 7

ప్రాతస్సరోవరే రాజా స్నాతః శుచిరలంకృతః | తదాZత్రేయేణ దత్తం చ హ్యజపద్భక్తితో మనుం || 8

మునిర్దదర్శ రాజానం శుష్కకంఠౌష్ఠ తాలుకం | ప్రీత్యాZదరేణ మృదులం పప్రచ్ఛ కుశలం మునిః || 9

ఓ నారదా! సమస్త మంగళములకు మంగళప్రదమైన ఏకదంతుని చరిత్రను నీకు వినిపించెదును. అది చాలా పురాతనమైన ఇతిహాసము.

ఒకప్పుడు కార్తవీర్యుడను రాజు వేటాడుటకు బయలుదేరి వేటలో అనేక మృగములను సంహరించి మిక్కిలి ఆయాసమునొందెను. ఆ అడవిలో నున్నప్పుడు సాయంకాలము కాగా ఆ రాత్రి అచ్చటనే తన సైన్యముతో తిండిలేకయుండెను. ఆ మహారాజు ఉన్నచోటికి సమీపముననే జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమము ఉండెను. తెల్లవారిన పిదప ఆ రాజు సమీపముననున్న సరస్సులోస్నానముచేసి అలంకరించుకొని ఆత్రేయమహర్షి తనకు ఉపదేశించిన మంత్రమును నిష్ఠతో జపించుచుండెను. ఆ సమయమున ఎండిన గొంతుతోనున్న రాజును జమదగ్నిముని చూచి ఆదరముతో మృదువైన మాటలతో అతని యోగక్షేమములను అడిగెను.

ననామ సంభ్రమాద్రాజా మునిం సూర్యసమప్రభం | స చ తసై#్మ దదౌ ప్రీత్యా ప్రణతాయ శుభాశిషః || 10

వృత్తాంతం కథయామాస రాజా చనశనాదికం | సంభ్రమేణౖవ మునినా త్రస్తో రాజా ముదాన్వితః || 11

విజ్ఞాప్య తం మునిశ్రేష్ఠః ప్రయ¸° స్వాలయం ముదా | ఏతద్వృత్తం కామధేనుం కథయామాస భీతవత్‌ || 12

ఉవాచ సా మునిం భీతం భయం కిం తే మయి స్థితౌ | జగద్భోజయితుం శక్తస్వం మయా కో నృపో మునే || 13

రాజభోజన యోగ్యార్హం యద్యద్ధ్రవ్యం ప్రయాచసే | సర్వం తుభ్యం ప్రదాస్వామి త్రిషు లోకేషు దుర్లభం || 14

సౌవర్ణాని చ రౌప్యాణి పాత్రాణి వివిధాని చ | భోజనార్హాణ్యసంఖ్యాని పాకపాత్రాణి యాని చ || 15

పాత్రాణి స్వాధుపూర్ణాని ప్రదదౌ మునయే చ సా | నానావిధాని స్వాదూని పరిపక్వఫలాని చ || 16

పనసామ్రశ్రీఫలాని నారికేళాదికాని చ | రాశీభూతాన్యసంఖ్యాని స్వాదులడ్డుక రాశయః || 17

యవగోధూమచూర్ణానాం భక్ష్యాణి వివిధాని చ | పక్వాన్నానాం పర్వతాంశ్చ పరమాన్నస్య కందరాన్‌ || 18

దుగ్ధానాం చ ఘృతానాం చ నదీర్దధ్నాం దదౌ ముదా | శర్కరాణాం తథా రాశిం మోదకానాం చ పర్వతాన్‌ || 19

పృథుకానాం సుశాలీనా పర్వతాన్‌ ప్రదదౌ ముదా | తాంబూలం చ దదౌ పూర్ణం కర్పూరాది సువాసితం || 20

నృపయోగ్యం కౌతుకాచ్చ సుందరం వస్త్రభూషణం | మునిః సంభృతనంభారో దత్వా ద్రవ్యం మనోహరం || 21

భోజయామాస రాజానం ససైన్యమపి లీలయా | యద్యత్సుదుర్లభం వస్తు పరిపూర్ణం నృపేశ్వరః |

జగామ విస్మయం రాజా దృష్ట్యా పాత్రాణ్యువాచ హ || 22

కార్తవీర్యార్జునుడు తనకెదురుగా సూర్యనివంటి కాంతితో ప్రకాశించుచున్న జమదగ్నిమునిని చూచి సంభ్రమముతో లేచి నమస్కరింపగా జమదగ్ని ఆ మహారాజును ఆశీర్వదించెను. అప్పుడారాజు ముందురోజు తాను తనసైన్యము ఆహారమును తినని విషయమును మునీశ్వరునకు తెలిపెను. జమదగ్ని మహర్షి రాజుయొక్క అనుజ్ఞగైకొని ఇంటికిపోయి కామధేనువుతో రాజు, అతని పరివారము భోజనము లేకుండా ఉన్న విషయమును భయపడుచు చెప్పెను.

అప్పుడా కామధేనువు జమదగ్నివ మహర్షితో నేను నీదగ్గర ఉండగా భయము చెందవలసిన పరిస్థితిలేదు. నా సహాయమున నీవిప్పుడు ప్రపంచముననున్నవారికంతయు భోజనము పెట్టగలవనినచో ఒక్కరాజు సంగతియేల? రాజు భుజించుటకు యోగ్యమైన వస్తువులనన్నిటిని నీకోరికపైనీకిత్తును అని అనెను. బంగారుపాత్రలు, వెండిపాత్రలు, ఇంకను భోజనమునకు అవసరమైన సంఖ్యాకమైన పాత్రలు, అట్లే రుచిగల వస్తువులతో నిండిన అనేకపాత్రలను కామధేనువు మహర్షికిచ్చినది ఇంకను అనేకవిధములైన పనస, మామిడి మొదలగు పండ్లరాశులను, రుచికరమైన లడ్డూలయొక్క రాశులను, యవలు, గోధుమపిండితో చేయబడిన వివిధ భక్ష్యములును, పక్వాన్నములను, రాశులుగా నిచ్చినది. పరమాన్నముయొక్క కుప్పలను, పాలు, పెరుగు, నేయి వీటి ప్రవాహములుగా, శర్కరయొక్క రాశిని, లడ్డూలయొక్క పర్వతములను, అటుకులు, మంచిబియ్యపన్నముయొక్క రాశులను కామధేనువు మహర్షికొసగినది. అట్లే కర్పూరాది సుగంధద్రవ్యములతో నున్న తాంబూలము నిచ్చినది. ఇంకను రాజులు ధరించు మిక్కిలి వెలగల వస్త్రములను ఇచ్చినది.

జమదగ్ని ముని కామధేనువొసగిన పదార్థములను సమకూర్చుకొని రాజునకు అతని సైన్యమునకు అవలీలగా భోజనము పెట్టెను. ఆ భోజనమున మిక్కిలి దుర్లభ##మైన వస్తువులు సహితము పరిపూర్ణముగా సమకూరినవి. వాటినన్నిటిని చూచి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యము చెందెను.

రాజోవాచ - కార్తవీర్యుడిట్లు పలికెను.

ద్రవ్యాణ్యతాని సచివ దుర్లభాన్యశ్రుతాని చ - మమాసాధ్యాని సహసా క్వాగతాన్యవలోకయ || 23

నృపాజ్ఞయా చ సచివః సర్వం దృష్ట్యా మునేర్గృహే - రాజానం కథయామాస వృత్తాంతం మహదద్భుతం || 24

ఓ మంత్రీ! జమదగ్ని మనకు భోజనమున సమకూర్చిన ద్రవ్యములపూర్వమైనవి. వీటి పేర్లనైన నేను వినలేదు. వీటిని మహారాజునగు నేనుకూడ సమకూర్చలేను. అందువలన ఇవి ఇతనికి ఎక్కడినుంచి వచ్చినను విషయమును నీవు తెలిసికొని చెప్పుమనెను.

కార్తవీర్యార్జునుని మంత్రి రాజుయొక్క ఆజ్ఞననుసరించి వెళ్ళి మహర్షి ఇంటిలోనున్న ఈ పదార్థములన్నిటిని చూచి మహాద్భుతమైన విషయమునిట్లు రాజుతో చెప్పెను.

సచివ ఉవాచ - సచివుడిట్లు పలికెను.

దృష్టం సర్వం మహారాజ నిబోధ మునిమందిరం | వహ్నికుండం యజ్ఞకాష్ఠకుశపుష్పఫలాన్వితం || 25

కృష్ణచర్మసృవసృగ్భిః శిష్యసంఘైశ్చ సంకులం | తైజసాధారసస్యాదిసర్వసంపద్వివర్జితం || 26

వృక్షచర్మపరీధానా దృష్టాః సర్వే జటాధరాః | గృహైకదేశే దృష్టా సా కపిలైకా మనోహరా || 27

చార్వంగీ చంద్రవర్ణాభా రక్తపంకజలోచనా | జ్వలంతీ తేజసా తత్ర పూర్ణచంద్రసమప్రభా || 28

సర్వసంపద్గుణాధారా సాక్షాదివ హరిప్రియా | ఇత్యేవం బోధితో రాజా దుర్భుద్ధిః సచివేన చ || 29

ఓ రాజా మీ ఆజ్ఞననుసరించి మునియొక్క ఆశ్రమమునంతయు పరిశీలించితిని. అచ్చట యజ్ఞకుండము, యజ్ఞమునకుపయోగించు సమిధలు, దర్భలు, పూవులు, పండ్లు ఉన్నవి. అదేవిధముగా కూర్చొనుటకుపయోగపడు జింకచర్మము, స్పక్‌, సృవములు, శిష్యులు మాత్రము కనిపించరి కాని బంగారము మొదలగు వస్తువులు, సమస్త సస్యములు మొదలగునవి మాత్రమెచ్చట కనిపించలేదు. అచ్చటనున్న మునులందరూ వృక్షవల్కములను మాత్రము ధరించియున్నారు. కాని ఆ మహర్షియొక్క ఆశ్రమమున ఒకప్రక్క చంద్రునివలె తెల్లనైన కాంతిగలది, ఎఱుపెక్కిన కండ్లు కలది, గొప్పనైన తేజస్సుకలది, పూర్ణమించంద్రునివల తెల్లనైనది. సమస్త శుభగుణములు కలది లక్ష్మీదేవివంటి కామధేనువు మాత్రము కనిపించినదనెను.

మంత్రి చెప్పిన మాటలు విన్న కార్తవీర్యునకు ఒక చెడ్డ ఆలోచన ఏర్పడినది

మునిం యయాచే తాం ధేనుం నిబద్ధః కాలపాశతః | కిం వా పుణ్యం చ కాబుద్ధిః కః కాలః సర్వతో బలీ || 30

పుణ్యవాన్భుద్ధిమాన్‌ దైవాద్రాజేంద్రోZయాచత ద్విజం | పుణ్యాత్ప్రజాయతే కర్మ పుణ్యరూపం చ భారతే || 31

పాపాత్ప్రజాయతే కర్మ పాపరూపం భయావహం | పుణ్యాత్కృత్వా స్వర్గభోగం జన్మ పుణ్యస్థలే నృణాం || 32

పాపాద్భుక్త్వా చ నరకం కుత్సితం జన్మజీవినాం | జీవినాం నిష్కృతిర్నాస్తి స్థితే కర్మణినారద ||33

తేన కుర్వంతి సంతశ్చ సంతతం కర్మణః క్షయం | సా విద్యా తత్తపో జ్ఞానం స గురుః స చ బాంధవః || 34

సా మాతా స పితా పుత్రస్తత్‌క్షయం కారయేత్తు యః | జీవినాం దారుణో రోగః కర్మభోగః శుభాశుభః || 35

భక్తవైద్యస్తం నిహంతి కృష్ణభక్తి రసాయనాత్‌ | మాయా దదాతి తాం భక్తిం ప్రతిజన్మని సేవితా || 36

పరితుష్టా జగద్ధాత్రీ భ##క్తేభ్యో బుద్ధిదాయినీ | పరా పరమభక్తాయ మా యా యసై#్మ దదాతి చ || 37

మాయా తసై#్మ మోహయితుం న వివేకం కదాచన | మాయావిమోహితో రాజా మునిమానీయ త్నతః || 38

ఉవాచ వినయాద్భక్త్యా కృతాంజలిపుటో ముదా || 39

రాజైన కార్తవీర్యుడు కాలపాశబద్ధుడై మునితో తనకు కామధేనువునిమ్మని యాచించెను. పుణ్యముకంటెను, బుద్ధికంటెను కాలము మిక్కిలి బలమైనది. పుణ్యము, సద్బుద్ధికల కార్తవీర్యుడు అతని దురదృష్టమువలన మునిని యాచించెను. భారతభూమిపై పుణ్యమువలన శుభ##మైన పణ్యకర్మచేయుటకు ఆలోచన కలుగును. అట్లే పాపమువలన భయంకరమైన పాపకర్మలాచరించు ఆలోచన కలుగును. ఈ పుణ్యభూమిపై మానవులు పుణ్యముచేసి స్వర్గాదిభోగములననుభవింతురు. అట్లే పాపమువలన నరకముననుభవింతురు కర్మశేషమున్న మానవులకు నిష్కృతి యనునది ఉండదు. అందువలన సత్సురుషులు కర్మక్షయమునకై ఎల్లప్పుడు ప్రయత్నింతురు. కర్మక్షయమును చేయగలుగునదే విద్య, తపస్సు, జ్ఞానము, కర్మక్షయముచేయుటకు సహకరించువారే గురువు, బంధువులు, తల్లిదండ్రులు, పుత్రులు మొదలగువారు. శుభాశుభకర్మభోగమనునది జీవులకు గల గొప్పరోగము, దానిని శ్రీహరిభక్తడను వైద్యులు కృష్ణభక్తియను ఔషధముచే పోగొట్టును.

ప్రతిజన్మయందు మాయను సేవించినచో ఆ మాయ సంతోషించి వారికి కృష్ణభక్తిని కలిగించును. లేనిచో ఆ మాయయే తనని మోహపరవశుని చేసి వివేకభ్రష్టుని కావించును. అందువలన మాయామోహితుడైన కార్తవీర్యుడు మునిని పిలిపించి వినయముతో చేతులు గట్టుకొని ఇట్లు పలికెను.

రాజోవాచ - రాజు ఇట్లు పలికెను.

దేహి భిక్షాం కల్పతరో కామధేనుం చ కామదం | మహ్యం భక్తాయ భ##క్తేశ భక్తానుగ్రహకారక || 40

యిష్మద్విధానాం దాతౄణామదేయం నాస్తి భారతే | దధీచిర్దేవతాభ్యశ్చ దదౌ స్వాస్థి పురా శ్రుతం || 41

భ్రూభంగలీలామాత్రేణ తపోరాశే తపోధన | సమూహం కామధేనూనాం స్రష్టుం శక్తోZసి భారతే || 42

కల్పవృక్షమువంటి జమదగ్నిమునీ! కోరికలను తీర్చు ఈ కామధేనువును నాకిమ్ము. మీవంటి దాతలకు ఇవ్వలేని వస్తువనునది లేదు. దధీచిముని దేవతల కొరకు తన ఎముకనే దానముచేసెనని పూర్వము చెప్పబడినది. తపోధనుడవగు నీవు నీభ్రూభంగముతోనే అనేక కామధేనువులను సృష్టింపగలవని పలికెను.

మునిరువాచ - జమదగ్ని ముని ఇట్లు పలికెను.

అహోవ్యతిక్రమం రాజన్‌ బ్రవీషి శఠ వంచక | దానం దాస్యామి విప్రోZహం క్షత్రియాయకథం నృప || 43

కృష్ణేన దత్తా గోలోకే బ్రహ్మణ పరమాత్మనా | కామధేనురియం యజ్ఞే న దేయా ప్రాణతః ప్రియా || 44

బ్రహ్మణా భృగవే దత్తా ప్రియపుత్రాయ భూమిప | మహ్యం దత్తా చ భృగుణా కపిలా పైతృకీ మమ || 4 5

గోలోకజా కామధేనుర్దుర్లభా భువనత్రయే | లీలామాత్రాత్కథమహం కపిలాం స్రష్టుమీశ్వరః || 46

నాహం రే హాలికో మూఢస్తుత్యా నోత్థాపితో బుధః | క్షణన భస్మసాత్కర్తుం క్షమోZహమతిథిం వినా || 47

గృహం గచ్ఛ గృహం గచ్ఛ మే కోపం నైవ వర్ధయ | పుత్రదారాదికం పశ్య దైవబాధిత పామర || 48

వంచకుడైన ఓరాజా! నీవు తలక్రిందులుగా మాటాడుచున్నావు. క్షత్రియులకు బ్రాహ్మణులు దానమిచ్చుట ఎచ్చటను కనిపింపదు. మరి క్షత్రియుడవైన నీవు బ్రాహ్మణుడనగు నన్ను దానమునిమ్మని డుగుచున్నావు. ఇది వింతకదా !

గోలోకమున యజ్ఞము జరగు సమయమున పరమాత్మయగు శ్రీకృష్ణుడు తన ప్రాణములకన్న ప్రియమైన ఈ కామధేనువును బ్రహ్మదేవునకిచ్చెను. ఆ బ్రహ్మదేవుడు తనకు ప్రియపుత్రుడగు భృగుమహర్షికి దీనినిచ్చెను. నాతండ్రియగు భృగుమహర్షి దీనిని నాకిచ్చెను. ఈ విధముగా ఈ కామధేనువు మావంశమునకు సంబంధించినది. గోలోకమునందు పుట్టిన ఈ గోవు ముల్లోకములందును అపూర్వమైనది. ఇట్టి కామధేనువును నేనేవిధముగా సృష్టింతును.

నీమాటలు విని ఉబ్బిపోవుటకు నేనేమి అమాయకుడనుకాదు. నేను అతిథిని తప్ప ఈ లోకమునంతయు క్షణములో భస్మము చేయసమర్థుడను. అందువలన నీవు నీ ఇంటికి వెంటనే తిరిగిపొమ్ము. నాకోపమును వృద్ధి చేయకుము. ఓ దురదృష్టవంతుడా! నీవు ఇంటికిపోయి నీ భార్యాపిల్లల యోగక్షేమముల చూచుకొనుమని పలికెను.

మునేస్తద్వచనం శ్రుత్వా చుకోప స నరాధిపః | నత్వా మునిం సైన్యమధ్యం ప్రయ¸° విధిబాధితః || 49

గత్వా సైన్యసకాశం స కోపప్రస్ఫురితాధరః | కింకరాన్‌ ప్రేషయామాస ధేనుమానయితుం బలాత్‌ || 50

కపిలాసన్నిధిం గత్వా రురోద మనిపుంగవః | కథయామాస వృత్తాంతం శోకేన హతచేతనః || 51

రుదంతం బ్రాహ్మణం దృష్ట్యా సురభిస్తమువాచ హ | సాక్షాల్లక్ష్మీస్వరూపా సా భక్తానుగ్రహకారికా || 52

జమదగ్నిముని మాటలు విన్న కార్తవీర్యుడు మనసులో కోపగించినను, పైకి మునికి నమస్కరామును చేసి తనసైన్యమున్న స్థలమునకు పోయెను. అదృష్టములేని ఆ మహారాజు కోపముచే వణకిపోవుచు బలాత్కారముగానైనను కామధేనువును తీసికొనిరమ్మని తన అనుచరులను పంపించెను. అప్పుడాముని కామధేనువు దగ్గరకుపోయి శోకముతో జరిగిన వృత్తాంతమును కామధేనువునకు నివేదించెను. ఏడ్చుచున్న జమదగ్నితో లక్ష్మీస్వరూపురాలు, భక్తులననుగ్రహించునదియగు కామధేనువు ఇట్లు పలికెను.

సురభిరువాచ - కామధేనువిట్లు పలికెను.

ఇంద్రో వా హలికో వాపి వస్తు స్వం దాతుమీశ్వరః | శాస్త్రా పాలయితా దాతా స్వవస్తూనాం చ సంతతం || 53

స్వేచ్ఛయా చేన్నృపేంద్రాయ మాం దదాసి తపోధన | తేన సార్థం గమిష్యామి స్వేచ్ఛయా చ తవాజ్ఞయా || 54

అథవా న దదాసి త్వం న గమిష్యామి తే గృహాత్‌ | ముత్తో దత్తేన సైన్యేన దూరీకురు నృపం ద్విషం || 55

కథం రోదిషి సర్వజ్ఞ మాయామోహితచేతనః | సంయోగశ్చ వియోగశ్చ కాలసాధ్యో న చాత్మనః || 56

త్వం వా కో మే తవాహం కా సంబంధః కాలయోజితః | యావదేవ హి సంబంధో మమత్వం తావదేవ హి || 57

మనో జానాతి యద్ద్రవ్యమాత్మీయం చేతి కేవలం | దుఃఖం చ తస్య విచ్ఛేదాద్యావత్సత్వం చ తత్ర వై || 58

ఓ మునీ! ఇంద్రుడైనను, పామరుడైనను తన వస్తువును తాను దానము చేసికొనవచ్చును. తన వస్తువులను రక్షించుకొనుటకు, దానమిచ్చుటకు అతనికెల్లప్పుడు అధికారము కలదు. అందువలన నీవు నీ ఇష్టముతో మహారాజునకు నన్ను దానముచేసినచో అతనివెంట తప్పక పోయె దదను. కానిచో నేను నీఇంటిని దాటిపోను. నీవు నేనిచ్చిన సైన్యముతో నిన్ను ద్వేషించుచున్న మహారాజును జయింపుము. సర్వజ్ఞుడవగు ఓ మహామునీ! మాయచే మోహితుడవై ఎందులకేడ్చుచున్నావు. బంధము, బంధరాహిత్యమనునవి కాలమువల్ల జరుగుచున్నవేకాని వీటికి ఆత్మసంబంధములేదు. నీవెవరో నేనెవరో మన ఇద్దరిమధ్య సంబంధము కాలమువలననే ఏర్పడినది. ఆ సంబంధముండువరకే మమత్వమనునదియుండును. ఇది నాది అను భావము మనస్సుకు సంబంధించిది. ఆత్మీయతాభావము తొలగిపోయినచో మనస్సునకు దుఃఖము కలుగును. కాని సత్వభావము అప్పడే ఏర్పడునని అనెను

ఇత్యుక్త్వా కామధేనుశ్చ సుషావ వివిధాని చ | శస్త్రాణ్యస్త్రాణి సైన్యాని సూర్యతుల్యప్రభాణి చ || 59

నిర్గతాః కపిలా వక్త్రాత్త్రికోట్యః ఖడ్గధారిణాం | వినిస్సృతా నాసికాయాః శూలినః పంచకోటయః || 60

వినిస్సృతా లోచనాభ్యాం శతకోటిధనుర్ధరాః | కపాలాన్నిస్సృతా వీరాస్త్రికోట్యో దండధారిణాం || 61

వక్షస్థలాన్నిస్సృతాశ్చ త్రికోట్యశ్శక్తిధారిణాం | శతకోట్యో గదాహస్తాః పృష్ఠదేశాద్వినిర్గతాః || 62

వినిస్సృతాః పాదతలాద్వాద్యభాండాః సహస్రశః | జంఘాదేశాన్ని స్సృతాశ్చ త్రికోట్యా రాజపుత్రకాః || 63

వినిర్గతా గుహ్యదేశాత్రికోటివ్లుెచ్ఛజాతయః | దత్వా సైన్యాని కపిలా మునయే చాభయం దదౌ |

యుద్ధం కుర్వంతు సైన్యాని త్వం నయాహీత్యువాచ హ || 64

మునిః సంభృత సంభూరైర్హర్షయుక్తో బభూవ హ | నృపేన ప్రేరితో భృత్యో నృపం సర్వమువాచ హ || 65

కపిలాసైన్యవృత్తాంతమాత్మవర్గపరాజయం | తచ్ఛ్రుత్వా నృపశార్దూలస్త్రస్తః కాతరమానసః |

దూతాన్‌ సంప్రేష్యసైన్యాని చాజహార స్వదేశతః || 66

కామధేనువు జమదగ్ని మహర్షితోనిట్లని సూర్యనివంటి కాంతిగల అనేకవిధములైన శస్త్రములను, అస్త్రములను, సైన్యములను సృష్టించెను.

కామధేనువుయొక్క ముఖమునుండి మూడుకోట్ల ఖడ్గము ధరించువారు పుట్టిరి. ముక్కునుండి శూలపాణులు ఐదుకోట్లమంది పుట్టిరి. కండ్లనుండి నూరుకోట్ల ధనుర్థరులు పుట్టిరి. కపాలము నుండి దండధారులైన సైనికులు మూడుకోట్ల మంది పుట్టిరి. అట్లే వక్షస్థలమునుండి శక్తియను ఆయుధమును ధరించిన సైనికులు మూడుకోట్లమంది పుట్టిరి. వెనకభాగమునుండి గదాధరులైన సైనికులు నూరుకోట్లమంది పుట్టిరి. పాదభాగమునుండి మూడుకోట్ల వాద్యములు ధరించుసైనికులు ఉద్భవించిరి. పిక్కలనుంచి మూడుకోట్ల రాజపుత్రులుద్భవించిరి. మర్మదేశమునుండి మూడుకోట్ల వ్లుెచ్ఛజాతిపురుషులు పుట్టిరి. ఇట్టి సైన్యమును కామధేనువు మహర్షికొసగి అభయమునిచ్చెను. ఈ సైన్యము శత్రుమూకతో యుద్ధముచేయును. నీవచ్చటకు వెళ్ళవలసిన పనిలేదని పలికెను.

జమదగ్నిముని కామధేనువొసగిన సైన్యముతో శత్రుసైన్యమును జయించి సంతోషపడెను.

యుద్ధవృత్తాంతమును తెలిసికొనుటకు మహారాజు పంపిన సేవకుడు రాజుతో కామధేనువు సైన్యసృష్టి చేసిన విషయమును, యుద్ధమున అతని సైన్యము పరాజయమునకు గు రియైన విధమునంతయు నివేదించెను. తన సేవకుని మాటలు విని కార్తవీర్యార్జునుడు భయపడి తన రాజ్యమునుండి సైన్యమును పంపుమని సేవకులనచ్చటికి పంపించెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతేయే గణపతిఖండే నారదనారాయణసంవాదే ఏకదంతత్వ ప్రశ్న ప్రసంగే జమదగ్ని కార్తవీర్యయుద్ధారంభవర్ణనం నామ చతుర్వింZశోధ్యయః |

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారదనారాయణమునుల సంవాదమున గణపతికి ఏకదంతత్వ ప్రశ్న సందర్భమున తెల్పబడిన జమదగ్ని కార్తవీర్యార్జునులు యుద్ధారంభవర్ణనమను

ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters