sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వాదశోzద్యాయః - శిరఃపతన విష్ణుకృతగణశ శిరోయోజన శనిశాపాదికథనం

నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను.

దుర్గా తద్వచనం శ్రుత్వా సస్మార హరిమీశ్వరం | ఈశ్వరేచ్ఛా వశీభూతం జగదేవేత్యువాచ హ || 1

సా చ దేవీ దైవవశా శనిం ప్రోవాచ కౌతుకాత్‌ | పశ్య మాం మచ్ఛిశుమితి నిషేకః కేన వార్యతే || 2

పార్వతీదేవి శనియొక్క మాటలు విని శ్రీహరిని మనసులో తలచుకొని ఈ ప్రపంచమంతయు ఈశ్వరునియొక్క అభీష్టముననుసరించి ప్రవర్తించునని పలికి దైవమునకు వశ##మై శనితో నన్ను నాపుత్రుని నీవు చక్కిగా చూడుమని పలికెను.

పార్వత్యా వచనం శ్రుత్వా శనిర్మేనే హృదా స్వయం | పశ్యామి కిం న పశ్యామి పార్వతీసుతమిత్యహో |

యది బాలోమయా దృష్టస్తస్య నిఘ్నో భ##వేత్‌ ధ్రువం || 3

ఇత్యేవ ముక్త్వా ధర్మిష్ఠో ధర్మం కృత్వా తు సాక్షిణం | బాలం ద్రుష్టుం మనశ్చక్రే న తు తన్మాతరం శనిః || 4

విషణ్ణమానసః పూరవం శుష్కకంఠౌష్ఠతాలుకః | సవ్యలోచన కోణన దదర్శ చ శిశోర్ముఖం || 5

పార్వతీదేవి పలికిన పలుకులు విని శనీశ్వరుడు ఇట్లు చింతించెను. నేను పార్వతీదేవి పుత్రుని చూడవలెనా? చూడకూడదా? నేను శిశువును చూచినచో అతనికి తప్పక ఆపదలు కలుగును. శిశువును నేను చూడకపోయినచో పార్వతీదేవి కోపించి శపించునేమో! ఈ రెండింటిలో మొదలు ఆత్మరక్షణ చేసికొనుట చాలామంచిది అని తలపోసి తాను చేయబోవు పనిలో తన తప్పు లేశ##మైన లేదని భావించి దానికి ధర్మదేవతను సాక్ష్యముగా ఉంచి మనస్సు పరితాపము చెందుచుండగా కంఠము, పెదవులు, నాలుక ఎండిపోవుచుండగా పార్వతీదేవిని వదలి ఆమె పుత్రుని మాత్రము చూచెదనని తలపోసి కడకంటిచూపుతో శిశువు ముఖమును వీక్షించెను.

శ##నేశ్చ దృష్టిమాత్రేణ ఛిన్నే వై మస్తకే మునే | చక్షుర్నిమీలయామాస తస్థౌ నమ్రాననః శనిః || 6

తస్థౌ చ పార్వతీక్రోడే తత్సర్వాంగం సలోహితం | వివేశ మస్తకం కృష్ణే గత్వా గోలోకమీప్సితం || 7

మూర్చాం సంప్రాప సాదేవీ విలప్య చ భృశం ముహుః | మృతేవ చ పృథివ్యాం తు కృత్వా వక్షసి బాలకం || 8

విస్మితాస్తే సురాస్సర్వే చిత్రపుత్తలికా యథా | దేవ్యశ్చ శైలగంధర్వాః సర్వే కైలాసవాసినః || 9

శనీశ్వరుని చూపుపడగానే బాలుని శిరస్సు తెగిపోగా శనీశ్వరుడు తలవంచుకొని కండ్లుమూసికొనెను. పార్వతీదేవియొక్క ఒడిలో ఆ శిశువుయొక్క మొండెము రక్తముతో నిండిపోయినది. ఆతని శిరస్సు గోలోకమునకు పోయి అచ్చటనున్న శ్రీకృష్ణునిలో విలీనమైపోయినది.

అప్పుడు పార్వతీదేవి తన పుత్రునికై ఏడ్చి ఏడ్చి ఆతని శరీరమును రోమ్మునకదుముకొని మృతురాలివలె మూర్చనందినది. ఆ దృశ్యమును చూచి కైలాసముననున్న దేవతాస్త్రీలు శైలములు గంధర్వులందరు చిత్తరువులోని బొమ్మలవలె నిశ్చేష్టులైరి.

తాన్‌ సర్వాన్‌ మూర్ఛితాన్‌ దృష్ట్యైవారుహ్య గరుడం హరిః | జగామ పుష్పభద్రాం స చోత్తరస్యాం దిశ స్థితాం || 10

పుష్పభద్రా నదీతీరే హ్యపశ్యత్కాననే స్థితం | గజేంద్రం నిద్రితం తత్రశయానం హస్తినీయుతం || 11

తథోదక్చిరసం రమ్యం మూర్ఛితం సురతశ్రమాత్‌ | పరితః శాపకాన్కృత్వా పరమానందమానసం || 12

శ్రీఘ్రం సుదర్శనేనైవ చిచ్చేదే తచ్చిరో మునే | స్థాపయామాస గరుడే రుధిరాక్తం మనోహరం || 13

గజచ్ఛిన్నాంగవిక్షేత్ర్పబోధం ప్రాప్య హస్తినీ | శావకాన్బోధయామాస చాశుభం వదతీ తదా |

రురోద శావకైస్సార్థం సా విలప్య శుచాతురా || 14

తుష్టావ కమలాకాంతం శాంతం సస్మితమీశ్వరం | శంఖచక్రగదాపద్మధరం పీతాంబరం పరం |

గరుడస్థం జగత్కాంతం భ్రామయంతం సుదర్శనం || 15

నిషేకం ఖండితుం శక్తం నిషేకజనకం విభుం | నిషేక భోగదాతారం భోగనిస్తారకారణం || 16

ప్రభుస్తత్సవనాత్తుష్టస్తసై#్య విప్రవరం దదౌ | ముండాతుండం పృథక్కృత్య యుయుజేzన్యగజస్యచ || 17

జీవయామాస తం తత్ర బ్రహ్మజ్ఞనేన సర్వవిత్‌ | సర్వాంగే యోజయామాస గజస్య చరణాంబుజం || 18

త్వం జీవకల్పపర్యంతం పరివారైః సమం గజ | ఇత్యుక్త్వా చ మనోయాయీ కైలాసం హ్యాజగామ సః || 19

కైలాసముననున్న దేవతాస్త్రీలందరు మూర్చితులై పడియుండుటను గమనించిన శ్రీహరి గరుత్మంతునధిరోహించి ఉత్తరదిక్కులోనున్న పుష్పభద్రానదీతీరమునకు వెళ్ళెను. ఆ పుష్పభద్రానదీతీరముననున్న అడవిలో ఒక గజరాజు తన భార్యతో పిల్లలతో కలసి నిద్రించుచుండెను. ఉత్తరదిశ##వైపు తలపెట్టి నిద్రపోవుచున్న ఆ గజరాజు శిరస్సును శ్రీహరి తన సుదర్శనచక్రముచే వెంటనే ఖండించి ఆ గజరాజు శిరస్సును తీసికొని గరుత్మంతునిపై నుంచుకొనెను.

సుదర్శనచక్రముచే తెగిపడిన అవయవములు ఇటునటు పడిపోవుటను గమనించిన ఆడఏనుగు తనపిల్లలకు తండ్రి చనిపోయిన వృత్తాంతమును చెప్పుచు వాటినన్నిటిని లేపి దుఃఖించుచుండెను. తనకు ఎదురుగా శ్రీమహావిష్ణువు శంఖ చక్ర గదాపద్మములను తన నాలుగు చేతులలో ధరించి పీతాంబర వస్త్రధారియై సుదర్శన చక్రమును తిప్పుచు గరుత్మంతునిపై కనిపించెను. చిరునవ్వుతోనున్న ఆ పరమేశ్వరుని ఆడఏనుగు ఇట్లు స్తుతించినది.

హేభగవాన్‌! నీవు కర్మఫలములను ఖండింపశక్తుడవు. అట్లే కర్మఫలములకు కారణభూతుడవు. కర్మఫలమునివ్వగలిగినవాడవు. ఆ ఫలభోగమునుండి తప్పింప నీవే సమర్థుడవు అని స్తుతింపగా భగవంతుడు సంతోషించి ఆ ఏనుగునకు వరమునిచ్చెను. అతడు ఇంకొక ఏనుగు తలను ఛేదించి ఈ గజరాజు శరీరమునకు బ్రహ్మజ్ఞానముచే అతికించెను. తరువాత ఆ గజరాజును కల్పపర్యంతము తన పరివారముతో సహ జీవించియుండుమని వరమునిచ్చి మనోవేగమున కైలాసపర్వతమును చేరుకొనెను.

ఆహృత్య పార్వతీహస్తాద్బాలం కృత్వా స్వవక్షసి | రుచిరం తచ్ఛిరస్సమ్యగ్యోజయామాస బాలకే || 20

బ్రహ్మస్వరూపో భగవాన్‌ బ్రహ్మజ్ఞానేన లీలయా | జీవయామాస తం శీఘ్రం హుంకారోచ్చారణనచ || 21

పార్వతీం బోధయిత్వా తు కృత్వా క్రోడే చ తం శిశుం | బోధయామాస తాం కృష్ణ ఆధ్యాత్మిక విబోధనైః || 22

శ్రీమహావిష్ణువు గజశిరస్సును తీసికొనివచ్చి, పార్వతీదేవియొక్క చేతిలోనున్న మృతుడైన శిశువును చేతిలోనికి తీసికొని, ఆ శిశువును తన రొమ్మునకు హత్తుకొని, తన దగ్గరునున్న గజశిరస్సును బాలకునకు చక్కగా అమర్చెను. పరబ్రహ్మస్వరూపడు భగవంతుడునైన శ్రీహరి బ్రహ్మజ్ఞానముచే హుంకారోచ్చారణమాత్రమున ఆ శిశువునకు ప్రాణము పోసెను. అట్లే ఆ శిశువును తన ఒడిలోనుంచుకొని మూర్ఛపడియున్న పార్వతిని తట్టిలేపి ఆధ్యాత్మికబోధనలచే ఆమెను ఓదార్చెను.

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను.

బ్రహ్మాదికీటపర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణః | జగద్బుద్దిస్వరూపాzసి త్వం న జానాసి కిం శివ || 23

కల్పకోటి శతం భోగీ జీవినాం తత్స్వకర్మణా | ఉపస్థితో భ##వేన్నిత్యం ప్రతియోనౌ శుభాశుభైః || 24

ఇంద్రః స్వకర్మణా కీటయోనౌ జన్మ లభేత్సతి | కీటశ్చాపి భ##వేదింద్రః పూర్వకర్మఫలేన వై || 25

సింహోzపి మక్షికాం హంతుమక్షమః ప్రాక్తనం వినా | మశకో హస్తినం హంతుం క్షమః స్వప్రాక్తనేన చ || 26

సుఖం దుఃఖం భయం శోకమానందం కర్మణః ఫలం | సుకర్మణః సుఖం హర్షమితరే పాపకర్మణః || 27

ఇహైవ కర్మణో భోగః పరత్ర చ శుభాశుభైః | కర్మోపార్జనయోగ్యం చ పుణ్యక్షేత్రం చ భారతం || 28

కర్మణః ఫలదాతా చ విధాత చ విధేరపి | మృత్యోర్మృత్యుః కాలకాలో నిషేకస్య నిషేకకృత్‌ || 29

సంహర్తురపి సంహర్తా పాతుః పాతా పరాత్పరః | గోలోకనాథః శ్రీకృష్ణః పరిపూర్ణతమః స్వయం || 30

వయం యస్య కళాః పుంసో బ్రహ్మ విష్ణుమహేశ్వరాః | మహావిరాడ్యదంశశ్చ యల్లోమవివరే జగత్‌ || 31

కళాంశా ః కేzపి తద్దర్మే కళాంశాంశాశ్చ కేచన | చరాచరం జగత్సర్వం తత్ర తస్థౌ వినాయకః || 32

ఓపార్వతీ! బ్రహ్మమొదలుకొని కీటకమువరకున్న ఈ ప్రాణులన్నియు తాము చేసికొన్న ఫలముననుభవించుచున్నవి. అవి తాము చేసికొన్న శుభాశుభఫలముల ననుసరించి ఆయా యోనులయందు పుట్టుచున్నవి. ఇంద్రునివంటివాడు కీటముగా జన్మనెత్తవచ్చును. అట్లే పూర్వజన్మలో చేసికొన్న కర్మననుసరించి కీటకమైనను ఇంద్రుడు కావచ్చును. తాను పూర్వము చేసికొన్న కర్మననుసరించి దోమకూడ ఏనుగును చంపగలుగుచున్నది. అట్లే సింహము ఈగనుకూడ చంపలేకపోవచ్చును. సుఖము, దుఃఖము, భయము, శోకము ఆనందము మొదలగునవన్నియు ప్రాణులు తాము చేసికొన్న కర్మవలననే జరుగుచున్నవి. ప్రాణి సత్కర్మనాచరించినచో, సుఖము, సంతోషము కలుగుచున్నవి. దుష్కార్యములనాచరించినచో దుఃఖము, భయము, శోకము మొదలగునవి ఏర్పడును.

సుకృత దుష్కృతములయొక్క ఫలితమును ఈజన్మలోను తరువాతి జన్మయందును తప్పక అనుభవించి తీరవలెను. పుణ్యక్షేత్రమైన ఈ భారతదేశము సత్కర్మాచరణకు అనుకూలమైనది. అందువలన ఇచట సత్కర్మ తప్పక చేయవలెను. ఓ పార్వతీ! నీవు బుద్దిస్వరూపవు. అందువలన నీకు తెలియని దేదియులేదు.

ప్రాణులు చేయు కర్మలకన్నిటికి ఫలితమునిచ్చువాడు సృష్టికర్తకే కారణభూతుడు, మృత్యువునకే మృత్యువైనవాడు. కాలునకే కాలుడనదగిన శ్రీకృష్ణుడు పరాత్పరుడు. అతడు గోలోకముననుండును. బ్రహ్మవిష్ణుశివాదులమగు మేము ఆ గోలోకనాథునియొక్క అంశస్వరూపులము. ఈ బ్రహ్మాండములన్నిటిని తన రోమకూపములందుంచుకొనిన మహావిరాట్స్వరూపుడు కూడ ఆ పరిపూర్ణతముని అంశస్వరూపమే. మిగిలినవన్నియు ఆ పరమపురుషునియొక్క అంశాంశలు లేక కళాంశాంశలు. అట్టి పరాత్పరుని అంశగా వినాయకుడున్నాడనెను.

శ్రీవిష్ణోర్వచనం శ్రుత్వా పరితుష్టా చ పార్వతీ | స్తనం దదౌ చ శిశ##వే తం ప్రణమ్య గదాధరం || 33

తుష్టావ పార్వతీతుష్టా ప్రేరితా శంకరేణ చ | కృతాంజలిపుటా భక్త్యా విష్ణుం తం కమలాపతిం || 34

ఆశిషం యుయుజే విష్ణుః శిశుం చ శిశుమాతరం | దదౌ గళే బాలకస్య కౌస్తుభం చ స్వభూషణం || 35

బ్రహ్మా దదౌ స్వమకుటం ధర్మో వై రత్నభూషణం | క్రమేణ దేవ్యో రత్నాని దదుః సర్వే యథోచితం || 36

పార్వతీదేవి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలు విని ఓదార్పు చెందినదై శ్రీమన్నారాయణనకు నమస్కరించి తన శిశువునకు స్తన్యమునిచ్చినది. ఇంకను శంకరుడు బోధింపగా నామె భక్తితో శ్రీమహావిష్ణువును స్తుతించి నమస్కరించినది.

అప్పుడు శ్రీమన్నారాయణుడు పార్వతిని, ఆమె పుత్రుని ఆశీర్వదించి తన మెడలోనున్న కౌస్తుభరత్నమును శిశువు మెడలో వేసెను. తరువాత బ్రహ్మదేవుడా శిశువునకు తన కిరీటమునీయగా ధర్మదేవత తన రత్న భూషణములనొసగెను. అట్లే దేవతాస్త్రీలందరు యథోచితముగా రత్నహారములను కానుకాగా నిచ్చిరి.

తుష్టావ తం మహాదేవశ్చాత్యంతం హృష్టమానసః | దేవాశ్చ మునయః శైలాః గంధర్వాః సర్వయోషితః || 37

దృష్ట్యా శివో శివాచైవ బాలకం మృతజీవితం | బ్రాహ్మణభ్యో దదౌ తత్ర బాలకే మృతజీవితే || 38

అశ్వానాం చ గజానాం చ సహస్రాణి శతాని చ | బందిభ్యః ప్రదదౌ తత్ర బాలకే మృతజీవితే || 39

హిమాలయశ్చ సంతుష్టో హృష్టా దేవాశ్చ తత్ర వై | దదుర్దానాని విప్రేభ్యో బందిభ్యః సర్వయోషితః || 40

బ్రహ్మణాన్బోజయామాస కారయామాస మంగళం | వేదాంశ్చ పాఠయామాస పురాణాని రమాపతిః || 41

తన పుత్రునకు పునర్జన్మనిచ్చిన శ్రీమహావిష్ణువునకు శంకరుడు మిక్కిలి సంతోషముతో స్తుతించెను. అట్లే దేవతలు, మునులు, శైలములు, గంధర్వులు, అచ్చటనున్న సమస్త స్త్రీలందరు శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

తమ పుత్రుడు తిరిగి బ్రతికినందువలన పార్వతీపరమేశ్వరులు చాలా సంతోషించి బ్రాహ్మణులకు కోటిరత్నములను దానము చేసిరి. అట్లే భట్టుమూర్తులకు అనేక గజములను, గుఱ్ఱములను దానము చేసిరి.

పార్వతీదేవి తండ్రియగు హిమవంతుడు, దేవతలు సంతోషముతో బ్రాహ్మణులకు, భట్రాజులకు అనేక దానములు చేసిరి. శ్రీహరి ఆ సమయమున బ్రాహ్మణులకు మృష్టాన్నభోజనమునొసగి పుణ్యాహమును చేసెను. అట్లే బ్రాహ్మణులచే వేదములను పూరాణములను చదివించెను.

శనిం సంలజ్జితం దృష్ట్వా పార్వతీ కోపశాలినీ | శశాప చ సభామధ్యేzప్యంగహీనో భ##వేతి చ || 42

దృష్ట్వా శప్తం శనిం సూర్యః కశ్యపశ్చ యమస్తథా | తేzతిరుష్టాః సముత్తస్థుః గాముకాః శంకరాలయాత్‌ || 43

రక్తాక్షాస్తే రక్తముఖాః కోపప్రస్ఫురితాధరాః | తం ధర్మం సాక్షిణం కృత్వా విష్ణుం సంశప్తుముద్యతాః || 44

బ్రహ్మా తాన్బోధయామాస విష్ణునా ప్రేరితః సురైః | రక్తాస్యాం పార్వతీం చైవ కోపప్రస్ఫురితాధరాం || 45

బ్రహ్మాణమూచుస్తే తత్ర క్రమేణ సమయోచితం | భీరవో దేవతాః సర్వే మునయః పర్వతాస్తథా || 46

ఆ సమయమున దీనికంతయు తానే కారకుడనైతినన్నట్లు శని సిగ్గుపడుచు తలవంచుకొనగా చూచి పార్వతీదేవి కోపమును పట్టలేక ఆ సభయందే అతనిని అంగహీనుడవు కమ్మని శపించినది.

పార్వతీదేవి శ##నైశ్చరుని శపింపగా చూచి అచ్చటనున్న సూర్యుడు, కశ్యపుడు, యముడు, కోపముతో కైలాసమునుండి వెళ్ళిపోవలెనని లేచినిలబడిరి. కోపముతో ఎఱ్ఱబడిన ముఖములతో పెదవులు వణకుచుండగా వారు ధర్మదేవతను సాక్షిగా చేసి శ##నైశ్చరుని పార్వతీమందిరమునకు పొమ్మని ప్రేరేపించిన విష్ణుమూర్తిని శపించుటకై యత్నించిరి.

అప్పుడు విష్ణువు, దేవతలు ప్రేరేపింపగా బ్రహ్మదేవుడు కోపముతో ఊగిపోవుచున్న సూర్యాదులను, పార్వతీదేవిని ఓదార్పసాగెను. దేవతలు, మునులు, శైలములు భయపడిపోయి మిన్నకుండిరి.

ఆసమయమున కశ్యపుడు మొదలగువారు వరుసగా బ్రహ్మదేవునితో ఇట్లనిరి.

కశ్యప ఉవాచ - కశ్యపప్రజాపతి ఇట్లు పలికెను.

దుర్దృష్టోzయం ప్రాక్తనేన పత్నీశాపేన సర్వదా | బాలం దదర్శ యత్నేన తస్య వై మాతురాజ్ఞయా || 47

శ##నైశ్చరుడు పూర్వము తన భార్యపెట్టిన శాపమువలననే దుష్టమైన చూపుకలవాడయ్యెను. ఐనను బాలుని తల్లియగు పార్వతీదేవి యొక్క ఆజ్ఞననుసరించియే ఆతడు బాలుని ముఖమును ప్రయత్నపూర్వకముగా చూచెను. కావున శనియొక్క తప్పు ఇందేమి కలదన్నట్లు పలికెను.

శ్రీసూర్య ఉవాచ - సూర్యుడిట్లు పలికెను.

తం ధర్మం సాక్షిణం కృత్వా సూనోర్వై మాతురాజ్ఞయా | యత్పుత్రోzప్రయత్నేన హ్యపశ్యత్పార్వతీసుతం || 48

యథా నిరపరాధేన మత్పుత్రం సా శశాప హ | తత్పుత్రస్యాంభంగశ్చ భవిష్యతి న సంశయః || 49

నా పుత్రుడగు శని, ధర్మదేవతాసాక్షిగ తల్లియైన పార్వతీదేవియొక్క ఆజ్ఞననుసరించియే ఆమె పుత్రుని అతి ప్రయత్నముతో చూచెను. అతనిలో తప్పేమిలేకున్నను పార్వతీదేవి నా పుత్రుని అంగహీనుడవు కమ్మని శాపమిచ్చినది. నా పుత్రుడేవిధముగా అంగహీనుడగునో పార్వతీదేవి పుత్రుడుకూడ అవయవరహితుడు కాగలడనెను.

యమ ఉవాచ - యమధర్మరాజిట్లనెను.

ప్రదాయ స్వయమాజ్ఞాం చ శశాపేయం స్వయం కథం | వయం శపామః కోzధర్మో జిఘాంసోశ్చ విహింసనే || 50

పార్వతీదేవి తాను స్వయముగా తన పుత్రుని చూడవచ్చునని ఆజ్ఞనిచ్చి తనకు చెడు జరిగినదని తానే శపించుట న్యాయమేనా? చంపదలచినవానిని హింసించుటలో తప్పులేనట్లే మేమందరము ఈమెను శపించెదనెను.

బ్రహ్మోzవాచ - బ్రహ్మదేవు డిట్లనెను.

శశాప పార్వతీ రుష్టా స్త్రీస్వభావాచ్చ చాపలాత్‌ | సర్వేషాం వచనేనైవ క్షంతుమర్హంతు సాధవః || 51

దుర్గే దత్వా త్వమాజ్ఞాం చ పుత్రదర్శనహేతవే | కథం శపసి నిర్దోషమతిథిం త్వ ద్గృహzగతం || 52

ఇత్యుక్త్వా శనిమాదాయ బోధయిత్వా చ పార్వతీం | తాం తం సమర్పణం చక్రే శాపమోచనహేతవే || 53

ఓ కశ్యపాదులారా! పార్వతీదేవి తన స్త్రీ స్వభావమువలన తొందరగా కోపించి శనిని శపించినదేకాని వేరుకాదు. పూజ్యులైన మీరు మా అందరిప్రార్థనపై ఆమెను క్షమింపుడు.

ఓ దుర్గాదేవీ! నీవుకూడ నీ పుత్రుని చూచుటకై ఆజ్ఞనొసగి తరువాత నీకు చెడు కలిగినదని శ##నైశ్చరుని శపించితివి. అతని తప్పేమియులేదు పైగా అతడు నీకు అతిథిగా నీఇంటికి వచ్చెను. అట్టివ్యక్తిని శపించుట న్యాయమేనా?అని బ్రహ్మదేవుడు పార్వతికి నచ్చజెప్పి శనియొక్క శాపనివృత్తి చేయుమని అతనిని పార్వతికి సమర్పించెను.

బభూవ పార్వతీ తుష్టా బ్రహ్మణో వచనాన్మునే | శాంతా బభూవుస్తే తత్ర దినేశ యమ కశ్యపాః || 54

ఉవాచ పార్వతీతత్ర సంతుష్టా తం శ##నైశ్చరం | ప్రసాదితా శివేనైవ బ్రహ్మణా పరిసేవితా || 55

బ్రహ్మదేవుడు పలికిన మాటలకు పార్వతీదేవి సంతోషపడినది. అట్లే సూర్య, యమ, కశ్యపులు కూడ శాంతించిరి. అప్పుడు పార్వతీదేవిని శంకరుడుకూడ శాంతింపచేసెను. అందువలన సంతోషించిన దుర్గాదేవి శనీశ్వరునితోనిట్లనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

గ్రహరాజో భవ శ##నే మద్వరేణ హరిప్రియః | చిరజీవీ చ యోగీంద్రో హరిభక్తస్య కా కథా || 56

అద్యప్రభృతి నిర్విఘ్నా హరౌ భక్తిః దృఢాzస్తు తే | శాపోzమోఘస్తతో మేzద్య కించిత్ఖంజో భవిష్యతి || 57

ఇత్యుక్త్వా పార్వతీ తుష్టా బాలం ధృత్వా చవక్షసి | ఉవాస యోషితాం మధ్యే తసై#్మ దత్వా శుభాశిషః || 58

శనిర్జగామ దేవానాం సమీపం హృష్టమానసః | ప్రణమ్య భక్త్యా తాం బ్రహ్మన్నంబికాం జగదంబికాం || 59

ఓ శనీశ్వరా!నావరప్రభావము వలన నీవు గ్రహములన్నిటికి ఆధిపత్యము వహింతువు. అట్లే శ్రీహరికి అత్యంతమిష్టమైనవాడవగుదువు. ఇంకను చిరంజీవివి, యోగీంద్రుడవు కూడ అగుదువు. నేటినుండి నీకు శ్రీహరిపై భక్తి ఇంకను దృఢముకాగలదు. అని వరములిచ్చి నాశాపమమోఘము కావున నీవు సర్వాంగహీనుడవు కాక కొద్దిగా కుంటివాడవగుదువని శనితో పలికి అతనికి ఆశీస్సులొసగి తనపుత్రుని ఎత్తుకొని స్త్రీలమధ్య ఉండిపోయెను.

శనీశ్వరుడుకూడ జగన్మాతయగు పార్వతికి భక్తితో నమస్కరించి సంతోషముతో దేవతల దగ్గరకు పోయెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే శనికృతగణశ దర్శన తజ్జాత గణశ శిరఃపతన విష్ణుకృతగణశ శిరోయోజన శనిశాపాదికథనం నామద్వాదశోzధ్యాయః |

శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణ సంవాదమయమున పేర్కొనబడిన శని వృత్తాంతమమను

పన్నెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters