Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదిమూడవ అధ్యాయము -భోజనవిధి

పుష్కర ఉవాచ||చంద్రస్య యదివాభానోర్యస్మిన్నహని భార్గవ | గ్రహణం తు భ##వేత త్తత్ర న పూర్వం భోజనక్రియా||

నాచరే త్సగ్రహే తస్మింస్త థై వాస్తముపాగతే| యావత్స్యా దుదయం తస్య నాశ్నీ యాత్తావ దేవ తు ||

గోబ్రాహ్మణోపరాగే చ న చాశ్నీయాత్ప్రయత్నతః | నరాజ్ఞో విప్లవే7శ్నీయ త్సురార్చా విప్లవే తధా ||

నహుత్వాన చ దత్వా చ నశౌచేన చ గర్హితం | నాపధ్యం నచ బాలానం తధా బార్గవ పశ్యతాం ||

ప్రార్థితం బాలకానాం చ దాతవ్య స్యా త్ప్రయత్నతః | బాలానాం ప్రార్థితం దత్వా నాకలోకే మహీయతే ||

బాలకా లాలనీయాశ్చ ధర్మకామైః సదా నర్తెః | తేషాం భోజ్యప్రదానేన గోదానఫల మాప్నుయాత్‌ ||

తేషాం క్రీడనకం దత్వామోదతే నందచే చిరం | ఆహ్లాదయాన్తి సతతం యస్మి న్దృష్ట్వేతు బాలకాః ||

సౌభాగ్యం మహదాప్నోతి యత్ర యత్రాభిజాయతే | తస్మాత్సర్వ ప్రయత్నేన బాలానగ్రేతు భోజయేత్‌ ||

అభుక్తవత్సు బాలేషు న చాశ్నీ యాత్కథంచన | యోనపద్యాన్న చాశ్నీ యాత్కదాచిదపి తన్మయమ్‌||

యఏకో మిష్టమాశ్నాతిన తతో7న్యో7స్తి పాతకీ | నైకవాసాస్థథా శ్నీయాద్భిన్న భాండే న మానవః ||

భిన్నాసనోపవిష్టశ్చ శయనీయగత స్తథా | అనార్ద్రపాణి పాదాన్త స్తథా చైవార్థ్ర మస్తకః ||

నోత్సంగే భక్షయే ద్భక్ష్యాన్న పాణౌ లవణం తథా | సకృద్దానం పృథక్పానం మాంసేన పయసా నిశి ||

దన్త చ్ఛేదనముష్ణం చ సప్తకన్తు సువర్ఞమేత్‌ | దధి రాత్రౌ న చాశ్నీ యాజ్ఞలనాంజలినా పిచేత్‌ ||

సర్వం తైల సమృద్ధం చ నాద్యా దస్తమితే రవ్‌ | వర్జనీయా దివా ధానాఃకోవిదారః సదైవ తు |

దివా థానః స్వరం హన్తి రాత్రౌ చ దధి సక్తుషు | అలక్ష్మీః కోవిదారేషు నిత్యమేవ కృతాలయా||

నిశ్శేషకృత్తథా రామ న స్యాదన్యత్రమాక్షికాత్‌ | క్షీరస్య రామ సక్తూనాం పాయసస్యో రకస్య చ ||

శేషం తు కార్యమన్యస్య నతు నిః శేషకృద్భవేత్‌ | శూత్రాయ దద్యాన్నోచ్ఛిష్టం నోచ్ఛిష్టశ్చ ఘృతం స్పృళేత్‌ ||

మూర్థానం న స్పృశేద్రామ న స్పృశే చ్చ హుతాశనమ్‌ | నామకుత్సా చ కర్తవ్యా సముమనాస్తన్మనాస్తథావ ||

భుంజీత ప్రయతో భూత్వా దిశ శ్చా నవలోకయన్‌ | వామహస్తేన పానీయం పీతోచ్చిష్టం తథైవచ ||

న పిబేన్న తథాశ్నీయా త్కృత్వా పర్యస్తికం నరః | పాదప్రసారణంకృత్వా నచ వేష్టిత మస్తకః ||

అచమ్యతు తతః కార్యం దన్తకాష్ఠస్య భక్షణమ్‌ | భూయో7ప్యాచమ్య కర్తవ్యం తతస్తాంబూల ధారణమ్‌||

శ్రవణం చేతిహాసస్య తతః కుర్యాత్సుమాహితః || శాస్త్రాన్వేషా చ కర్తవ్యా తతః సమ్యగ్భృగూత్తమ ||

శాస్త్రాన్వవేక్షణం కృత్వా కృత్యా చంక్రమణం తతః | ఉపాస్య పశ్చిమాం సంధ్యాం తిష్టేత్ప్రయత మానసః ||

పూర్వాం సంద్యాం జపంస్తిష్ఠేదుపవిష్ట శ్చ పశ్చిమామ్‌ | అర్కస్యోదయనా త్తావద్యా వద్భాస్కర దర్సనమ్‌||

పూర్వా ంసధ్యాం జపేత్‌స్నాతః పశ్చిమాం సతి భాస్కరే | ఉపవిష్టో జపేత్తావద్యావత్తారక దర్శనమ్‌||

సంపూజనం దేవవరస్య కృత్వా తత శ్చ కుర్యాత్‌కలు వైశ్వదేవమ్‌ |

భుక్త్వాతతో7న్నం లగుయచ్చ హృద్యం తతః స్వపేద్భార్గవ వంశముఖ్య ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరేద్వితీయఖండే మా.సం. రామంప్రతి పుష్కరోపాఖ్యానే భోజన విధిర్నామత్రినవతి తయోధ్యాయః ||

పుష్కరుడనియె :- సూర్యచంద్ర గ్రహణములు వచ్చిననాడు గ్రహణము ముందుగా గ్రహణము పట్టి విడువు జరుగకుండ సూర్య చంద్రులస్తమించినపుడు సూర్యచంద్రుల వుదయపర్యంతము భోజనము సేయరాదు. డ్రహణము క్తియయి వారుదయించినపుడు వారింజూచి భోజనము సేయవలెను. గో బ్రాహ్మణులకుఉపరాగము=కష్టము రాజ విప్లవము దేవతార్చనకు జిక్కుగల్గినపుడు అగ్ని హోత్రము సేయకుండ అతిథ్యభ్యాగతాదులకు భోజనము పెట్టకుండ యేదేని దానిమీయకుండ. మైల వచ్చిన తరిని, నింద్యము అపథ్యమైన యన్నమును, బాలురు చూచుచుండగను (అసగా బాల వృద్ధ గురువులు భోజనము సేయకుండనన్నమాట) భోజనము సేయరాదు. బాలురడిగినది పెట్టవలెను. బాలురు కోరినదానిని వారికి పెట్టువాడు స్వర్గముం బొందును. ధర్మము నభిలషించు జనులు బాలురను లాలింపవలెను. వారికి భోజనము పెట్టునతడు గోదాన ఫలమందును, వారికాటవస్తువులోసంగునాతడు నందన వనమందు (స్వర్గలోకోద్యానమందు) చిరకాలము విహరించును. ఎవ్వనిం జూడగనే పిల్లలానంద భరితులౌదురో అతడెక్కడ జన్మించిన నక్కడ సౌభాగ్యమును బొందును. అందువలన సర్వ విధములను పిల్లలకు ముందుబెట్టి గృహనాధుడు తాను దినవలెను. రుచియైన యాహారమును తానొక్కడ కుడుచు వానికంటె పాపాత్ముడు లేడు. ఏక వస్త్రుడై భుజింపరాదు. భిన్న ఖాండాన్నము భుజింపరాదు. విరిగిన పీటమీద మంచము మీదను గూర్చుండి చేతులు కాళ్ళుతడియారి గాని తడి తలతోగాని భుజింపరాదు. (1) ఒడిలో పెట్టుకోని భక్ష్యములను తినుట (2) ఉప్పును జేతనిడుకొనితినుట. (3) ఎప్పుడో యొక మాటుదానముచేయుట (4) ఒక పాత్రలోని జలమును వేఱు వేఱుగ త్రావుట (5) రాత్రియందు పాలుద్రావుట మాసంము తినుట. (6) దంతచ్ఛేదనము. (7) వేడియాహారము తినుట అను నేడురకములయిన వానిని సేయరాదు. రాత్రి పెరుగుపోసికొనరాదు. దోసిలితో నీరు త్రాగరాదు. తైలము (నువ్వులనూనె) మిక్కిలిగా నున్న పదార్థమును సూర్యడస్తమించిన తర్వాద దినరాదు. పగలు ధానాలు (పేలాలు) కోవిదారము=రక్తకాంచన మెప్పడును తినరాదు. పగలు ధానాలు=బొరగులు, రాత్రి పేలపిండి పెరుగు కలిపి తిన్నను కంఠస్వరముం జెరుచును, కోవిదారములందు అలక్ష్మీ=దరిద్రదేవత యెల్లపుడు వసించును. ఒక్కతేనె తప్ప పాలు పేలపిండి పరమాన్నము మంచినీళ్ళునను వానినింకొకనికి మిగులునట్లుంచి తాను దినవలెను. నిశ్శేషముగా తానొక్కడే తినగూడదు. ఎంగిలిని శూద్రునికి బెట్టరాదు. ఎంగిలివడి నేతిని నడినెత్తిని అగ్నిని చేతం దాకరాదు. భోజన పదార్థమును నేవగింపరాదు. మ ం చి మనస్సుతోనాతినెడి పదార్థముపై మనస్సు నిలిపి సావధానముగ నట్టిట్టు దిక్కులు చూడకుండ భోజనము సేయవలెను. ఎడమచేతితోమంచినీళ్ళు ద్రవరాదు. త్రావగ మిగిలినవియు త్రావరాదు. యోగపట్టము ధరించి నీరు త్రాగరాదు, ఆహారము తినరాదు. కాళ్ళు సాచికొని, తలకు గుడ్డ కట్టుకొని గాని (పాగచుట్టకొనిగాని) భోజనముచేయరాదు, భోజనముచేసి చేతులు కాళ్లు కడిగిగొని అచమనము సేయవలెను. పిమ్మటదంత శోధన చేయవలెను. అచమించి తాంబూలము వేసి కొనవలెను. ఇతిహాసాది శ్రవణము అటుపై శాస్త్ర పరిశీలను నొసరించి అట్టిటు తిరిగి (షికారుచేసి) సాయం సంధ్యోపాసనముచేసి పవిత్రమునస్కుడై యుండవలెను. ప్రాతస్సంధ్యాజపము నిలువబడి సూర్యోదయముదాక సాయం సంధ్యా జపము కూర్చుండి నక్షత్ర దర్శనము దాకను జెయవలెను. అటుపై దేవతార్చన సేసి వైశ్వ దేవముగావించి చక్కగా జీర్ణమగునదియు రుచికరమానదియునగు భోజనము సేసి అమీద నిద్రపోవలెను. 26

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున భోజననవిధియను తొంబదిమూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters