Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనుబదిమూడవ అద్యాయము - పూర్వాషాఢాస్నానవర్ణనము

రామః- కామ్యం కర్మ సమాచక్ష్వ! వాణిజ్యం యేన శుధ్యతి | కృషిం చ బహులాం చైవ కర్మణా కేన చాశ్నుతే || 1

పుష్కరః- మూలేనోపోషితః కుర్యా దిదం కర్మ పురోహితః | ఉపోషితస్య ధర్మజ్ఞః జయమానస్య నిత్యశః ||

ప్రాప్తాసూ త్తరషాడాసు ప్రా జ్ముఖం స్నాపయే న్నరమ్‌ | యుక్తై ర్వేతసమూవేన శంఖ ముక్తాఫలై స్తథా |

ప్రాణిభిశ్చ యధాలాభం కనకేన తధైవ చ | అకాలమూలైః కలశై శ్చతుర్భి ర్భృగునందన! ||

నవైస్తు పూజయే ద్ధేవం శంఖచక్రగదాధరమ్‌ | పూర్వాషాఢాం తథైవాపో వరుణం చ నిశాకరమ్‌ ||

గంధ మాల్య నమస్కార ధూప దీపాన్న సంపదా | ఏతేషా మేవ జుహుయా త్తధా నామ్నా ఘృతం ద్విజ | ||

నీలవాసా೭೭వృతో భూత్వా క్షిపే దప్సు సమాహితః | నీలాని రామ! వాసాంసి పయాంసి వివిధాని చ ||

తదా మంథం సురాం చైవ మైరేయం వివిఖం తథా శుక్లాని చైవ మాల్యాని ధూపం దద్యాత్తుకంబునా ||

తిమ్యస్థి మకరస్యాదస్థి శంఖముక్తాఫలే తథా | సువర్ణాంతరితం కృత్వా ధారయే చ్చ తథా మణిమ్‌ || 9

కృత్త్వె త త్సిద్ధి మాప్నోతి వాణిజ్యే నాత్ర సంశయః | సముద్రయానే చ తధా కాంతారే న విషీదతి ||

నీలాని రామ! వా సాంసి దక్షీణా చాత్ర శస్యతే | శంఖం సువర్ణం రూప్యం చ తథా ముక్తాఫలాని చ ||

హోత్రే కర్త్రె ద్విజేభ్య శ్చ నర్వమేత ద్విధీయతే | బ్రాహ్మణాన్‌ భోజయే చ్చాత్ర పరమాన్నం తు సంస్కృతమ్‌ ||

అలంఘయన్‌ నిత్య మథాప్య మృక్షం కరోతి కర్త్మెత దతంద్రితాత్మా |

న జాతు లాభా ద్విని వర్తతేసౌ సముద్ర మార్గా దివ నిమ్నగా వై || 13

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే పూర్వాషాఢాస్నాన వర్ణనం నామ త్ర్యశీతితమోధ్యాయః

పరుశురాముడు వాణిజ్యముచేసిన కామ్యకర్మమునుగూర్చి చెప్పుము. కృషి సర్వ సమృద్ధమగుట కేమి చేయవలెనో యదియు నానతిమ్మన పుష్కరుండిట్లనియె. పాపము పోవుటకు చేయనగు ఈకర్మము మూలానక్షత్రమందుపవాసముండి చేయవలెను. దానివలన జయము గల్గును. ఉత్త రాషాఢ వచ్చినతర్వాత తూర్పు మొగముగా గూర్చుండబెట్టి స్నానము చేయింపవలెను. ఆస్నానము వేత సమూలములతో (ప్రబ్బచెట్టు వ్రేళ్ళతో) శంఖముతో ముత్యాలతో గావింపవలెను. లభించినంతదాక ప్రాణులతో బంగారముతోడనుజేయనగును. ఆకాలములయిన దుంపలతో నాల్గుకలశాలో నలము = కిక్కి సగడ్డి వేసి యీ స్నానము చేయింపవలెను. ఆమీద శంఖచక్రగదాధరుని హరి నర్చింపవలెను. నబ్దేవతలను వరుణుని ఇంద్రునింగూడ గంధమాల్య ధూపదీపనైవేద్యములతో నమస్కరములతో అగ్దసంపతో బూజింపవలెను. ఈ దేవతలనుద్దేశించి వారినామములం బేర్కొని యాజ్యహోమము కూడ చేయవలెను. నల్లని వస్త్రము గట్టిణని నల్లనివస్త్రములను వివిధములైనపాలు మంథము = అంబలి సుర = కల్లు మైరేయము చెఱకురసముతో చేసిన కల్లు తెల్లని పూలమాలలు నొసంగవలెను. శంఖముతో ధూ మీయవలెను తిమ్యస్థి = చేపయెముక, మొసలియెముక శంఖము ముత్యాలు కలిపి బంగారముతో పొదిగినమణిని ధరింపవలెను. ఈ లాగునజేసిన వాణిజ్యమందు లాభసిద్ధినందును, సందేహము లేదు, సముద్రయానమందు అడవిలో దీనింజేసినవా డెట్టి విషాదమును బొందడు. నీలమణులు వస్త్రములు శంఖము బంగారము వెండి ముత్యాలును నీయాచరణ మందు ముఖ్యదక్షిణాపదార్థములు - హోతకు కర్తకు ద్విజులకు నీచెప్పిన సర్వము నీయవలెను, సుసంస్కృతము సురుచిరమునైన పరమాన్నముతో బ్రాహ్మణులకు విందుసేయవలెను. ఆప్యనక్షత్రమును అనగా అబ్దేవతాకమయిన పూర్వాషాఢా నక్షత్రమును దాటబెట్టక యెవ్వ డేతొట్రుపాటులేని మనస్సుతో నీవిధానమునా చరించునో నతడు సముద్ర గామినియైన నది వలె లాభమునుండి మరలడు అనగా వ్యాపారమందు లాభసమృద్దు డగుట నిశ్చయ మన్నమాట.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు పూర్వాషాడా స్నానవర్ణనమను నెనుబది మూడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters