Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బది ఐదవ అధ్యాయము - శౌచవిధి

రామః ప్రేత శుద్ధిం సమాచక్ష్వ! సూతికా శుద్ధి మేవ చ | ద్రవ్య శుద్ధిం చ భగవన్‌ ! త్వంహి వేత్సి యధా తథా ||

పుష్కరః - దశాహం శావ మాశౌచం స పిండేషు విధీయతే | జననే చ తణాప్వేవం బ్రాహ్మణానాం భృ గూత్తమ! ||

ద్వాదశాహేన రాజన్యః, పక్షా ద్వైశ్యః విశుధ్యతి | మాసేన శుద్ధి మాప్నోతి తథా శూద్రోపి భార్గవ! ||

ఆనులోమ్యేన పత్నీనాం దాసీనాం చ భృ గూత్తమ! | స్వామి తుల్యం భ##వే చ్చౌచం మృతే స్వామిని యేతు కమ్‌ ||

ష డ్భి స్త్రిభి రధై కేన క్షత్ర విట్‌ శూద్ర యోనిషు || బ్రాహ్మణ శ్శుద్ధి మాప్నోతి నాత్ర కార్యా విచారణా |

విట్‌ శూద్రయో నౌ శు ద్ధి స్స్యాత్‌ క్షత్రియస్య తధైవ చ | ష డ్రా త్రే ణ త్రిరాత్రేణ షడ్భి శూద్రస్తథా విశః ||

అద స్తజాత బాలే తు స ద్య శ్శౌచం విధీయతే | బాలే త్వ కృత చూడే చవి శుద్ధిర్నై శికీ స్మృతా ||

తథాచానుప నీతే తు త్రి రాత్రా శ్ఛు ద్ధి రిష్యతే | త తః పరం దశాహేన శుద్ధేయు స్తస్య బాంధ వా ||

ఊన త్రి వార్షికే శుద్ధే పంచాహా శు ద్ధి రిష్యతే | ద్వాద శాహేన శుద్ది స్స్యా దతీతే వత్సర త్రయే ||

గతై స్సంవత్సరై ష్ష డ్ఫిః శుద్ధి ర్మాసేన కీర్తి తా | స్త్రిణా మకృత చూ డా నాం విశుద్ధిర్నై శి కీ స్మృతా ||

త థా హి కృత చూడానాం త్ర్యహా చ్ఛు ద్య న్తి భాంధ వాః | వివాహితాసు నాశౌచం పితృపక్షే విధీయతే ||

పితృ గృహే ప్రసూతాయాం విశుద్ధి ర్నైశికి స్మృతా | నూతికా దశరాత్రేణ శుద్ధి మా ప్నోతి నాన్యధా ||

వివాహితాపి చేత్కన్యా మ్రియతే పితృ వేశ్మని | తస్యా స్త్రి రాత్రా చ్ఛుధ్యన్తి బాంఢవా నాత్ర సంశయః ||

పితృ వేశ్మని యా కన్యా రజః వవ్య త్యసంస్కృతా | తస్యాం మృతాయాం నాశౌచం కదాచి దపి శామ్యతి ||

సమానం ఖలు శౌచం చ ప్రథమేన సమాపయేత్‌ | అసమానం ద్వితీయేన ధర్మరాజ వచో యథా ||

శా న్తరస్థాః శ్రుత్వా తు కుల్యానం మరణో ద్భవౌ | యచ్ఛేషం దశరాత్రస్య తావదేవా శుచిర్భవేత్‌ ||

అతీతే దశ రాత్రే తు త్రి రాత్ర మశుచి ర్భవేత్‌ | తథా సంవత్సరేతీతే స్నాత ఏవ చ శుద్ధ్యతి ||

మాతామహే తథాతీతే ఆచార్యే చ తథా మృతే | అనౌరసేషు పుత్రేషు భార్యా స్వన్య గతాసు చ ||

పర పూర్వాసు భార్యాసు త్రి రాత్రా చ్ఛుద్ధి రిష్యతే | నివాసె రాజని ప్రేతే మాతులే శ్వశురే తథా ||

ఆచార్య పత్నీ పుత్రేషు శిష్యే సబ్రహ్మ చారిణి | ఏక రాత్ర మశౌచం స్యా దన్నదానే తథా మృతే ||

రాత్రిభి ర్మాస తుల్యాభి ర్గర్భస్న్రావే విశోధనమ్‌ | స పిండే బ్రాహ్మణ వర్ణాం సర్వ ఏ వా విశేషతః ||

దశ రాత్రేణ శుద్ధ్యన్తి ద్వాదశాహే న భూమి పాః | వైశ్యః బ్రాహ్మణ వర్ణాః సర్వ ఏ వా విశేషతః ||

భృగ్వ గ్న్యన శనాంభోభి ర్మృతానా మాత్మ ఘాతినాం | పతితానాం చ నాశౌచం విద్యుచ్ఛస్త్ర హతాశ్చయే ||

సతీ వ్రతీ బ్రహ్మచారీ నృపకారక దీక్షితాః | నాశౌచ భాజః కధితాః రాపకార్య కరా శ్చ యే ||

అనుగమ్యేచ్ఛయా ప్రేతం జ్ఞాతి మజ్ఞాతి మేవ వా | సవాసా జల మాపుత్య ఘృతం ప్రాశ్య విశుద్ధ్యతి ||

మైధునే కట ధూమే చ సద్యః స్నానం విధీయతే ||

జనన మరణమో శ్శుచి ర్దశామేన భవతి శౌచవిధే ర్న విప్రయోజ్యమ్‌ ||

న చ భవతి ప్రతిగ్రహేషు దోషో ద్వి పద చతుష్పద ధాన్య దక్షిణాసు ||

ఇతి శ్రీ విష్ణుధరన్మోత్తరే ద్వితీయ ఖండే శౌచ విధిర్నామ పంచ సప్తతితమోధ్యాయః ||

రాముడు మైలయొక్క పురిటియొక్క యశుద్ధిని ద్రవ్యశుద్ధిని గూర్చి యెఱింగినవాడవు గావు నాకానతిమ్మన పుష్కరుండిట్లనియె. బ్రాహణులలో సపిండులకు జ్ఞాతుల కాశౌచము పదిరోజులు, పురుడు కూడ నంతే. క్షత్రియులకు పండ్రెండు, వైశ్యుల కొక పక్షము (15 రోజులు) చెప్పబడినది. శూద్రుడు నెలకు శుద్ధుడగును. ఇదేవరసలో భార్యలకు దాసీలకును యజమానికివలెనే యెఱుంగ వలెను. బ్రాహ్మణ వైశ్య శూద్రులు వరుసగా నాఱు మూడు నొక్క రోజున శుద్ధి నందుదురు. శూద్రుడు వైశ్య స్త్రీ సంగమంలో నాఱు రోజులకు శుద్ధుడగును. దంతాను రాకపోయినప్పటి కప్పుడే శుద్ధులగుదురు. పుట్టు వెంట్రుకలు తీయని బాలుడు పోయిన నొక రాత్రి మైల. ఉపనయనము లేని వానికి మూడు రోజుల మైల పట్ట వలెను. వాని బాంధవులు పది రోజులకు శుద్దులగుదురు. మూడేండ్ల లోపు వాని కైదు రోజులదాటినతర్వాత శుద్ధి. మూడేండ్లు దాటెనా పండ్రెండు రోజులు మైల పట్టవలెను, ఆరేండ్లు గడచెనా నెల రోజులకు శుద్ధియగును. చూడాకర్మ జరుగని స్త్రీ పోయిన నొక్క రాత్రి. చూడాకర్మ జరిగిన స్త్రీ పోయిన యడల మూడురోజులలో శుద్ధి.

వివాహమైన స్త్రీల యొక్క మైల తండ్రివైపు వారి కుండదు. పుట్టింట బురుడు పోసికొన్నచో తల్లిదండ్రులొక్క రాత్రి పురుడు పట్టవలెను. పురిటాలు పది రోజులు పురుడు పట్టును. వివాహమైన పిల్ల పుట్టింట బోయినచో నామె బంధువులు మూడు రాత్రలు మైల పట్టవలెను. ఆడుపిల్ల పుట్టింట వివాహ సంస్కారాదులు లేకుండ రజస్వల యైనచో నామె పోయిన యెడల నామైల యెన్నటికిని బోదు. దేశాంతరమందున్న జ్ఞాతులు మరణము పుట్టకను విన్న తరువాత పదిరోజులలో శేషించిన రోజులు ఆశౌచము. పదిరోజులు దాటినచో మూడు రోజు లా శౌచము పట్టవలెను. సంవ్సరము గడచెనా స్నాచము చేతనే శుద్ధి. మాతా మహుడు ఆచార్యుడు పోయినపుడు ఔరసులు గాని పుత్రులు (దత్తుడు మొదలయినవాడు) అన్యులం బొందిన భార్యలు (వ్యభిచరించిన భార్యలు) పరపూర్వ బార్యల విషయమునను మూడు రాత్రులు మైల పట్ట వలెను. నివాసమందు రాజు మేనమామ మామగారు ఆచార్యపత్ని, ఆచార్య పుత్రుడు, శిష్యుడు, తత్సదృశుడు, అన్నదాత పోయినచో నొక రాత్రయు మైల. గర్భస్రావమైనచో నది యెన్నవ మాసమో యన్ని రోజులు మైల పట్ట వలెను. జ్ఞాతి యైన బ్రాహ్మణుడు పోయిన యెడల అందరు దశరాత్రమున శుద్ధులగుదురు క్షత్రియుడు పండ్రెండు రోజులకు వైశ్యుడు పదిహేను రోజులకు శూద్రుడు నెలకు శుద్ధులగుదురు.

భృగు పాతమునుండి అగ్నిలో బడి నిరశనమూని నీళ్ళలో పడి పోయినవారు ఆత్మ ఘాతకులు పతితులకు, పిడుగు, శస్త్రము నను వానిచే జచ్చినవారికి మైల బట్టు నవసరము లేదు, పతివ్రత, వ్రతనిష్టుడు, బ్రహ్మచారి, రాచకార్య నిమిగ్నుడు నగు వారికి ఆశౌచ ముండదు. చనిపోయిన జ్ఞాతిని గాని జ్ఞాతి కాని యింకొక నింగాని అనుగమించినవాడు సచేల స్నానము చేసినచో శుద్ధినందును, మైధునమందు శవ ధూపము నందు సద్య స్నానముచే శుద్ధియగును. జనన మరణములందు పదిరోజులలో శుద్ధు డగును. శౌచవిధిలో విడువదగినది లేదు. ద్విపద చతుష్పద ధాన్య దక్షిణల ప్రతి ద్రహణమున దోషములేదు.

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున ఆశౌచవిధియను డెబ్బది యైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters