Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదియెనిమిదవ అధ్యాయము - భేదవిధానము

పుష్కరః- పరస్పరం తుయేదుష్టాః క్రుద్దా భీతావమానితాః | తేషాం భేదం ప్రయుంజీత భేదసాధ్యాహి తేమతాః || 1

యేతుయేనైవ దోషేణ పరస్మాద్రామ! బిభ్యతి| తేతు తద్దోషపాలేన భేదనీయా భృశం తతః ||

ఆత్మీయా ద్దర్శయే దాశాం పరస్మా ద్దర్యయే ద్భయమ్‌ | ఏవంహి భేదయే ద్భిన్నాన్‌ యథావ ద్వశమానయేత్‌ ||

సంహితాహి వినాభేదం శ##క్రేణాపి సుదుస్సహాః | భేదమేవ ప్రశంసన్తి తస్మాన్నయ విశారదాః ||

స్వముఖేనాథ యద్భేదం భేదం పరముఖేనచ | పరీక్ష్యసాధు మన్యేహం భేదం పరముఖా చ్ఛ్రుతమ్‌ ||

భేద్యా స్వకార్య ముద్దిశ్య కుశ##లై ర్యేహి భేదితాః | భేదితాస్తే వినిర్దిష్టాః నైవ రాజార్థవాదిభిః ||

అంతఃకోప బహిఃకోపౌ యత్ర స్యాతాం మహీక్షితామ్‌ | అంతఃకోపో మహాంస్తత్రనాశనః పృధివీక్షితామ్‌ ||

సామన్తకోపో బాహ్యస్తు కోపః ప్రోక్తో మనీషిభిః | మహిషీయువరాజాభ్యాం తథా సేనాపతే ర్ద్విజ! ||

ఆలమాత్యాత్‌ మంత్రి పుత్రాచ్చ రాజపుత్రా త్తథైవచ | అంతఃకోపో వినిర్దష్ఠః దారుణః పృథివీక్షితామ్‌ ||

బహిః కోపే సముత్పన్నే సుమహత్యపి పార్థివః | శుద్ధాంతస్తు మహాభాగ! శీఘ్రమేవ జయేదరీన్‌ || 10

పుష్కరుడనియె:- ఒండొరు లెవ్వరు కుపితులు దుష్టులునై యుందురో జడుపు అవమానమునకు గురి ¸°దురో వారి యెడ రాజు భేదోపాయము ప్రయోగింపవలెను. వారు దానివలన సాధ్యు లగుదురు. ఎవ్వరు ఏదోషముచే శతృవు వలన భయపడుచుందరురో యాదోషము నామోదించుచునే వారు భేదోపాయమున లోబరుచుకొన నీగుదురు. ఆత్మీయులనుండి యా శతృవులనుండి భయమను దర్శింప జేయుచు భేదము పెట్టవలెను. ఆ విధముగా భేదము పడిన వారిని తమ వశము చేసికొనవలెను. భేదోపాయము లేకుండ నింద్రుడేని శతృవులను గూడ కట్టుకొనుట సాధ్యము గాదు. నీతి నిపుణులందుచేత భేదోపాయమును, ప్రశం శింతురు. తన మూలమున నగు భేదమును, శథృముఖమున నగు భేదమును, నీ రెండు తెరంగుల భేదోపాయములను బరీక్షించి, నేను శతృమూలమున నగు భేదమునే ఉత్తమమని తలంచుచున్నాను. నీతికుశలురై నీవారు తమకార్యము నుద్దేశించి పొఱుపులు పెట్టి విడదీయబడినవారే అసలైన భేదితులు. భేదోపాయముచే లొంగదీసి కొనబడినవారు గాని, రాజుయొక్క ప్రయోజనమునుద్దేశించి పొఱుపులు పెట్టి విడదీయ బడినవారును బేదితులు గారు. రాజులకు అంతఃకోపము బహిఃకోపమునను రెండురకాల యిరకాటమేర్పడు చుండును. వానిలో, అంతఃకోపము రాజులకు మిక్కలి ప్రమాదకరము. నాశకరము. బాహ్యకోప మనగా సామంత రాజులు, రాజమహిషి, యువరాజు సేనాపతి, అమాత్యులు, అమాత్య పుత్రులు, రాజపుత్రుడు ననువారితో వచ్చిన కోపము, అంతః కోపమన బడును. అది రాజుల మనుగడకు కారుణమైన ముప్పు. బహిఃకోప మెంత తీవ్రమయినదితగా బుట్టినను శుద్ధాంతఃకరణము వలన రాజు శత్రువులను సత్వరము జయింప గల్గును.

అపిశక్రసమోరాజా కోపే నాన్త ర్వినశ్యతి | స్వాంతఃకోపం ప్రయత్నేన తస్మా ద్యత్నాత్‌ పరీక్షతా | ||

పరా న్తఃకోప ముత్పాద్య భేదేన విజగీషుణా | రక్ష్యశ్చైవ ప్రయత్నేన జ్ఞాతిభేద స్తథాత్మనః ||

జ్ఞాతయః పరితస్యన్తే సతతం యద్యపిశ్రియా | తథాపి తేషాం కర్తవ్యం సుగంభీరేణ చేతసా ||

గ్రాహణం దాన మానాభ్యాం భేదస్తేభ్యో భయంకరః | నాజ్ఞాతి రనుగృహ్ణాతి నాజ్ఞాతిః స్నేహ మిచ్ఛతి||

జ్ఞాతిభి ర్భేదనీయాస్తు రిపవస్తేన పార్థివైః ||

భిన్నాహి శక్యారిపవః ప్రభూతాః | స్వల్పేన సైన్యేన నిహన్తుమాజౌ ||

సుసంహితేనాథ తతస్తు భేదః | కార్యో రిపూణాం నయశాస్త్రవిద్భిః ||

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే - ద్వితీయఖండే భేద విధానం నామ అష్టషష్టితమోధ్యాయః ||

ఇంద్రునంత వాడైనను నంతఃకోప మేర్పడెనేని నశించును. అందుచే స్వాతఃకోప మున్నదా, లేదా యని లెస్సగ పరీక్షించి, శతృవుల కంతఃకలహము పుట్టించి, జయాకాంక్ష గలవాడై తన జ్ఞాతులలోని భేదము (పొరపొచ్చము) పుట్టకుండ ప్రయత్న పూర్వకముగా రక్షణ సేసి కొనవలెను. జ్ఞాతులు తన కలిమిం గని యసూయతో నేవేళ దహించు చుందురు. అయినను రాజు గంభీరమైన (లోతైన) మనస్సుతో దాన మానముల మూలమున వారిని గూడ గట్టుకొన వలెను. వారి వలన నగు భేదము చాల భయంకరముగా నుండును. జ్ఞాతి కాని వాడు అనుగ్రహము సూపడు. జ్ఞాతి కాని వాడు స్నేహమును గోరడు. అందుచేత రాజులు జ్ఞాతులచే శత్రువులను భేదింపవలయును. భేద తంత్రము వలననే శతృవులను భేదితులం గావింపవలెను. భేదోపాయముచే విడదీయబడిన శతృ వెంత బలము గలవాడైనను రణమందు స్వల్పసైన్యముచే గూల్ప శక్యమగుదురు. లెస్సగ కట్టుదిట్టముగా ప్రయోగింపబడిన భేదోపాయమును తాను సుసంహితుడై (అందఱను కూడ గట్టుకున్న వాడై) ఎదిరివాని యెడ (శతృవునెడ) ప్రయోగింపవలయును. ఇది నీతి శాస్త్ర కోవిదులగు వారు చేయవలసిన భేద విధానము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున భేద విధానమను నఱువది యెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters