Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదిఏడవ యథ్యాయము - సామవిధి

రామః- ఉపాయాం స్త్వం సమాచక్ష్వ ! సామపూర్వాన్‌ మహాద్యుతే | లక్షణం చ తథా తేషాం ప్రయోగం వరుణాత్మజ! || 1

పుష్కరః - సామభేదౌ తథా రామ దండం చ మనుజోత్తమ! | ఉపేక్షా చ తథా మాయా ఇంద్రజాలం చ భార్గవ ! ||

ప్రయోగాః కథితాః సప్త తన్మే నిగదతః శ్రుణు | ద్వివిధం కథితం సామ తథ్యం చాతథ్య మేవ చ ||

తత్రాప్యతథ్యం సాధూనాం అక్రోశాయైవ జాయతే | తచ్చ సాధుప్రియం తే చ సామసాధ్యా న రామ! తే ||

మహాకులీనా ఋజవో కర్మనిష్ఠా జితేంద్రియాః | సామసాథ్యాన చాతథ్యం తేషు సామ ప్రయోజయేత్‌ ||

తథ్యం చ సామ కర్తవ్యం కులశీలాది వర్ణనమ్‌ | తథా తదుభయం రామ! కృతానాం చైవ వర్ణనమ్‌ ||

అనయైవ తథా యుక్త్యా కృతజ్ఞఖ్యాపనం స్వకమ్‌ | ఏవం సాంత్వేన కర్తవ్యా వశగా ధర్మతత్పరాః ||

సామ్నా యద్యపి రక్షాంపి గృహ్ణన్తీతి పరా శ్రుతిః | తథాప్యేత దసాధూనాం ప్రయుక్తం నోపకారకమ్‌ ||

అతి సంధిక మిత్యేవ పురుషం సామవాదినమ్‌ | అసాధవో విజానన్తి తస్మా త్తత్తేషు పర్జితమ్‌ ||

యే శుద్ధవంశా ఋజవః ప్రతీతాః | ధర్మే స్థితాః సత్యపరా వినీతాః ||

తే సామసాధ్యాః పురుషాః ప్రదిష్ఠాః | మనోన్నతా యే సతతం చ రామ! || 10

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే సామవిధిర్నామ సప్తషష్టితమోధ్యాయః.

పరశురాముడు వరుణకుమార ఓ తేజశ్శాలి! సామాద్యుపాయముల లక్షణము వాని ప్రయోగ విధాన మానతిమ్మన పుష్కరుండిట్లనియె. సామము, భేదము, దానము, దండము, ఉపేక్ష, మాయ, ఇంద్రజాలమునను నేడుపాయములు సెప్పబడినవి. వానిం గూర్చినా తెలుపున దాలింపుము. సామోపాయముత థ్యము ఆతథ్యమునని యిరుదెఱంగులు. వానిలో అతథ్యమయిన (అబద్ధమైన బూటకమైన) సామోపాయము సాధువులయొడ బ్రయోగించిన యెడల నది వారిని గోలపెట్టించుటకే యగును. ఇచ్చకములాడి జూపు సామమునకు సాధువులు లొంగరు. ఉత్తమ కులముల వారు ఋజువులు (సూటిగ నడచువారు) ధర్మనిష్ఠులు జితేంద్రియులు సామోపాయసాధ్యులే కాని వారి యెడల నీయతథ్యమైన సామమును మాత్రమును బ్రయోగింపరాదు. వారియెడల తథ్యమైన సామోపాయము కుల శీలాదివర్ణనమైన దానిని మాత్రమే యుపయోగింప వలెను. మఱియు వారుచేసిన మంచి పనుల వర్ణించుటయు నుచితము ఈ విధమయిన యుక్తితో వారి యెడల తన కృతజ్ఞతను దెలుపుట మూలమున సత్త్వోపాయముచే ధర్మ తత్పురులను వశులం గావించుకొనవలెను. సామముచే రాక్షసులు గూడ లోబడుదురని శ్రుతి (వేదము) చెప్పుచున్నది. అయిన నీ సమా మసాథురవుల యెడ నుపయోగించిన నుపకరింపదు. సామవాదియైన పురుషుని అసాధువు లతి సంధికు డనియే (చేతగాక చచ్చువడిన దద్దమ్మగా) భావింతురు. గావున వారియెడ సామము వర్జితము. శుద్ధవంశ్యులు ఋజుశీలురు ప్రతిష్ఠగల వారు ధర్మనిష్ఠులు సత్య సంధులు వినయశీలురు నభిమాన ధనులునైన వారుయెవ్వరో వారెల్ల యెడల సామోపాయ సాధ్యులని చెప్పబడినారు.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున సామవిధియను అఱువదియేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters