Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదినాలుగవ యధ్యాయము - గంధయుక్తి

పుష్కరః : శోధనం వమనం చైవ తథైవ చ విరేచనమ్‌ | భావనా చైవ పాకశ్చ బోధనం ధూపనం తథా ||

వాసనం చైవ నిర్దిష్టం కర్మాష్టక మిదం శుభమ్‌ | కపిత్థ బిల్వ జంబ్వా7మ్ర బీజపూరక పల్లవైః ||

కృత్వోదకం తు యద్ద్రవ్యం శోధితం శోచితం తు తత్‌ | తేషా మభావే శౌచం తు మృతదర్భాం7భసా భ##వేత్‌ ||

తదభావేతు కర్తవ్యం తదా ముస్తామ్భసా ద్విజ! | శుష్కం శుష్కం పునర్ద్రవ్యం పంచ పల్లవ వారిణా ||

ప్రక్షాళితం చా7ప్యసకృత్‌ వమితం తత్ర్పకీర్తితమ్‌ | పంచ పల్లవ తోయేన క్వాథయిత్వా పునః పునః ||

ద్రవ్యం సంశోషితం కృత్వా చూర్ణం తస్య తు కారయేత్‌ | హరీతకీం తతః పిష్ట్వా పంచ పల్లవ వారిణా ||

తేన పధ్యా కషాయేణ తచ్చూర్ణం భావయే త్సకృత్‌ | శోషితం శోధయే దేత ద్విరేకం తత్ప్రకీర్తితమ్‌ ||

తతస్తు గంధ ద్రవ్యేణ యథేష్టం కుంకుమా7దినా | భావయే త్తేన తద్ద్రవ్యం భావనా సా ప్రకీర్తితా ||

తేనైవ భావయేద్ద్రవ్యం పంచపల్లవ వారిణా | అశ్వత్థేనైవ తేనా7థ ద్రవ్యం రామ! తథా 7స్తు తత్‌ ||

మృదా పిహిత సత్వౌతు మృణ్మయే భాజన ద్వయే | విపచేత్తు విధూమా7గ్నా 7వర్త ధూమః పునః పునః || 10

పుష్కరుడనియె: 1 శోధనము 2 వమనము 3 విరేచనము 4 భావనము 5 పాకము 6 భోధనము 7 ధూపనము 8 వాసనము అనునవి కర్మాష్టము (ఎనిమిదికర్మలు) చెప్పబదినవి. వెలగ మారేడు నేరేడు మామిడి బీజపూరకము ననువానిచిగుళ్లువేసి ఆ నీళ్ళతోనే ద్రవ్యమును దోమినను కాచినను నావస్తువు శుద్ధమగును. అవిలేనపుడు దర్భభస్మోదకముతో తుంగముస్తలనీటితోను శోధనము సేయవలెను. ఎండి తిరిగి యెండిన వస్తువును పంచపల్లవజలముతో గడుగుట వమితమనబడును పంచపల్లములు 1 మామిడి, 2 వెలగ 3 నేరేడు 4 మారేడు 5 మాదీఫలము ననువాని చిగుళ్ళు ఇవి కర్కకాయలతో నానవేసిన నీటిలో నేదేనివస్తువును గాచి దాని నెండించి చూర్ణము సేయవలెను. అవ్వల పంచ పల్లవ జలము పోసి నూరి యా పథ్యాకషాయముతో (కరక్కాయ కషాయముతో) పై చూర్ణమును భావన సేయవలెను. అది యెండి పొడియైన తరువాత నేదేని ద్రవ్యమును దానితో దోముట విరేచన మనుబడును అటుమీద గంధద్రవ్యముతో (పరిమళ ద్రవ్యములు) కుంకుమపువ్వు మొదలగువానితో నేదేని వస్తువును భావన సేసినచో నది భావన యనబడును. ఆభావనచేసిన ద్రవ్యముతో ఆపంచపల్లవ జలములతో రావియాకు రసముతోను భావననేయబడిన ద్రవ్యము శుద్ధగును. ఆరెండుముద్దలను రెండు మట్టికుండలో బెట్టి పైని మూకుడు పెట్టి మట్టిపూసి పొగలేని నిప్పుమీద తిరిగితిరిగి మరుగగాచవలెను.

తావేవ క్వాధయే త్తావ తత్త్రైవా7ను గతో రసః | ఏతత్పాక విధానం తే పంచమం పరికీర్తి తమ్‌ ||

తతస్తు భావనాద్రవ్యం కల్కపిష్టం నియోజయేత్‌ | కల్కపిష్టే తథా ద్రవ్యే బోధనం పరికీర్తితమ్‌ ||

తతస్తు పూజయే ద్ద్రవ్యం పూర్వమేవ తు పధ్యయా | తతస్తు గురు శుక్తిభ్యాం చందనా 7గురుభి స్తతః || 13

కర్పూర మృగ దర్పాభ్యాం తత శ్చైనం ప్రధూపయేత్‌ | ఇత్యేత ద్ధూపనం రామ: కర్మతే7భిహితం మయా ||

తతస్తు గుళికాం కృత్వా యథాకామ మతంద్రితః | పుషై#్పర్వకుల జాతీనాం తథా7న్యేషాం సుగంధిభిః

ఛాయాసు శోష్యమాణస్య వాసనా క్రియతే తు యా | వాసనా సా వినిర్దిష్టా కర్మైత చ్చాష్టమం శుభమ్‌ ||

కర్మాష్టక మిదం కృత్వా వచాం పిండనిభాం తథా | ముస్తం శైలేయకం వా7పి సేవ్యం వా ద్విజసత్తమ! ||

శోధయే ద్గాంధికో విద్వా న్యథా7న్యత్కర్మ సేత్స్యతి | నిర్యాసానాం తు పుష్పాణాం కర్మాష్టక మిదం శుభమ్‌ ||

విదుషా నైవ కర్తవ్యం కార్య మన్యత్ర భార్గవ! | అశోధితై స్తథా ధూపాః కార్యా ద్రవ్యై ర్యథావిధి ||

అటు వానిని గాచినంతట వానిరసమందులో దిగును. దీనినే పాకమను నైదవశుద్ధి విధానమందురు. ఆమీద భావనచేసిన ద్రవ్యమును కల్కముగా మడ్డిగా దయారైన ముద్దతో ద్రవ్యమును దోముట బోధనమనంబడును. అటుపై నాద్రవ్యమును పథ్యాకషాయముతో (కరక్కాయ కషాయంతో) పూజయేత్‌ = పూతపట్టవలెను తోమవలెనన్నమాట. అబుపైని గురువుచే = కృష్ణా గురుశక్తిచే = ఉసిరి చందనము యిగురుచే పచ్చకర్పూరము కస్తూరి అను వానితో నా వస్తువునకు పొగవేయవలెను. ఇది ధూపనము. అవ్వల నాద్రవ్యమును గుళిక = ఉండచేసి పొగడ జాజిమొదలయిన సువాసన పుష్పములతో నీడ నెండించుట వసనాకర్మ యందురు. ఈ కర్మాష్టకము చేసి ముద్దగా నున్నవసను తుంగమస్తను శైలేయకము = శిలాజిత్తు సేవ్యం = వట్టివేరు (మంచి గంధము) గాని శోధింపవలెను. శుద్ధిసేయవలెను. అగరు మొదలైన బంకయే పువ్వులకును ఈ విధమైన శోధనము (గంధయుక్తి) చేయవలెను. ఇది యీ వెనుకచెప్పిన ప్రకార మెనిమిది రకములు ఈ విధముగా శోధన చేయని వస్తవులతోగూడ ధూపము వేయవచ్చును.

అతః పరం తు తే యోగాన్‌ కాంశ్చి ద్వక్ష్యామి తాన్‌శృణు! | నఖం కుష్ఠం ధనం మాంసీ స్పృక్త్వా శైలేయకం జలమ్‌ || 20

తథైవ కుంకుమం లాక్షా చందనా7గురుణీ నతమ్‌ | సరలా దేవ కాష్ఠం చ కర్పూరం కార్తయా సహ ||

బోలం కందురక శ్చెవ గుగ్గులుః శ్రీనివాసకః | సహ సర్జరసే నేయం ధూపద్రవ్యైకవింశతిః ||

ధూప ద్రవ్యగణా దస్మా దేకవింశా ద్యథేచ్ఛయా | ద్వేద్వే ద్రవ్యే సమాదాయ సర్జభాగే నియోజయేత్‌ ||

నవే పిణ్యాక వలయైః సంయోజ్య మధునా తథా | ధూప యోగ్యా భవన్తీ హ యథావత్‌ స్వేచ్ఛయా కృతాః ||

త్వచం జాతీ ఫలం తైలం కుంకుమం గ్రంధి పర్ణకమ్‌ | శైలేయం తగరం కాష్ఠం తాంబూలాం తగరం తథా ||

మాంసీ సరా7వకుష్ఠం చ నవ ద్రవ్యాణి నిర్దిశేత్‌ | ఏతేభ్యస్తు సమాదాయ ద్రవ్యం తత్ర యథేచ్ఛయా ||

మృగ దర్ప యుతం స్నానం కార్యం కందర్ప వర్ధనమ్‌ | ద్రుక్సురా నలదై స్తుల్యైః వా 7న్యకార సమాయుతైః ||

స్నాన ముత్పల గంధి స్యా త్సతైలం కుంకుమై ర్యుతమ్‌ | జాతీ పుష్ప సుగంధి స్యా త్తగరా7ర్ధేన యోజితమ్‌ ||

బాల కాంచన సంయుక్తం పాటలా కుసుమాయతే | సవ్యాపకం స్యా ద్వకులై స్తుల్యగంధి మనోహరమ్‌ || 29

ఇటుపై నాయోగములం గొన్ని తెల్పెద నాలింపుము. నఖము = రాజార్హము కర్పూరము కృష్ణాగరు కుష్ఠము = చెంగల్వ కోష్టు ధనము = మిరియము మాంసి = జటమాంసి అను వానిని శైలేయక జలముతో = శిలాజిత్తు నీటితో నూరి కుంకుమపువ్వు లక్క, చందనము, అగురు, నతము = సరలదేవకాష్ఠ సరళ దేవదారు కర్పూరము కార్త బోలము = బాలింతబోలు కుందురుకము = కుందురుష్కము (గుగ్గులులోరకము) గుగ్గులు శ్రీనివాసకము = ములుగోరింటలను సర్జరసముతో జాజియాకుల రసముతో నీ యిరువది యొక్క వస్తువులను గలిపి ధూపమునకు వినియోగింపవలెను. ఈ ధూప ద్రవ్య గణములోని రెండు రెండు వస్తువులను సర్జరముతో = జాజిరసము గలిపి నిమ్మగడ్డితో గూడ పిండిగా తయారుచేసి గుండ్రని (చక్రాకారములయిన చుట్టలతో) తేనెతో గలిపి ధూపమునకుపయోగించవలెను. 1.త్వచ (దాల్చిన చెక్క) లవంగపు పట్ట 2. జాజిపండు తైలము = చందన తైలము (సామాన్యమయిన నువ్వులను) 3. కుంకుమము (పువ్వు) 4. గంథిపర్ణకము 5. శైలేయము = శిలాత్తు (రాతిపువ్వు) 6. తగరము గ్రంథితగరము (నందివర్ణనము) 7. కాష్ఠం = మ్రానుపసుపు 8. తమలపాకు 9. మాంసి = జటమాంసి నరావ = చెంగల్వ కోష్టు. ఇది తొమ్మిదివస్తువులు (సంఖ్యకుదురలేదు) వీనిలో నిష్టమైన వస్తువులు గైకొని కస్తూరితో గూర్చి స్నానము సేసినది మన్మథ వర్ధనమగును. సమభాగములుగా గొనిన ద్రుక్సురా = కడిమి నలదములు = కురువేళ్ళు కుంకుమపువ్వుతో నూనెతో గలిపిన వీనితో స్నానము చేసిన నది కలువ పువ్వుల పరిమళము నించును. ఇందులో తగరము (గ్రంథితగరము) లేక చెంగల్వ కోష్టు కలిపి దానితో స్నానము చేసిన జాజిపువ్వు పరిమళము చిందును. = కురువేరు, కాంచన, సురపొన్న పువ్వు (నానార్థాలు) దేవకాంచనము తాళకము సంపెంగ కచోరాలుకలిపి స్నానము చేసిన సుమవాసనలభించును.

నాలికా వంశ సహితం కుట్టి పాదేన చా7ర్యకమ్‌ | ద్వికేసరం వేణుపాదం కుంద పుష్పాయతే తథా || 30

శైల పాదార్థ సంయుక్తం వ్యక్తం మదనకం భ##వేత్‌ | మంజిష్ఠా తగరం బాలం ద్వయం వ్యాఘ్రంనఖం నఖమ్‌ ||

గంధపత్రం చ విన్యస్య గంధతైలం భ##వే చ్చుభమ్‌ | తైలం నిష్పీడితం రామ! తిలైః పుష్పా7 ధివాసితైః ||

వాసనా పుష్ప సదృశ్యం గంధనే తు భ##వే ద్దృతమ్‌ | పూర్వవ చ్ఛోధయి త్వా తు ముస్తం సేవ్యం వచాం నిశామ్‌ ||

అభీష్ట మన్య త్కలుషం యథావ దనులేపయేత్‌ | ఉద్ధృత్య చందనాదిం చ శోధనం వమనం తథా ||

వర్జయిత్వా విరేకం చ శేష కర్మాణి కారయేత్‌ | తద్వా భవతి ధర్మజ్ఞ! వర్ణకం త్రిదివ ప్రియమ్‌ ||

పటవాసాం సి కార్యాణి వర్ణకైః శ్లక్ష్‌ణ చూర్ణితైః ఏలా లవంగ కక్కోల జాతీ ఫల నిశాకరాః ||

జాతిపత్రికయా సార్ధం స్వతంత్ర ముఖ వాసకమ్‌ | కర్పూరం కుంకుమం కాంతం మృగదర్పం హరేణుకమ్‌ ||

కక్కో లైలాలవంగం చ జాతీ కోశక మేవ చ | ద్పక్పత్రం త్రుటి ముస్తం చ లతా కస్తూరికం తథా ||

కంటకాని లవంగస్య ఫలపత్త్రైశ్చ జాతితః | కటుకం చ ఫలం రామ! కర్షికాండాం ప్రకల్పయేత్‌ ||

సవ్యాపకం = (చెంగల్వకోష్టులతో గూడిన, వకులముల (పొగడ పువ్వుల)తో చేసిన స్నానము మనోహర సువాసల నించును. నాలికావంశము (కుట్టిపాదము) (నాల్గవమారు మట్టియన్నమాట) ఆర్వకము ద్వికేశరం వేణుసారః = వెదురుగంధము వీని తైలముతో స్నానము చేసిన మొల్ల పువ్వుల వాసన చిందును. ఇందు శైలపాదార్ధ శిలాజిత్తు (రాతిపువ్వు) (8వ భాగము) చేసిన రసాంజనం సరళ##దేవదారు మదనకము. (మన్మథవర్ధనమగునన్నమాట.) మంజిష్ట = తగరము బాలద్వయము = కురువేరు ద్వయము (ద్వికమ్‌) అగరు వ్యాఘ్రనఖము = పులిగోరుచెట్టు పువ్వు = నఖమ్‌ (రాజాధ్వము) గంధపత్రము (ఆకుపత్రి పరిమళపు నూనెతో రంగపుష్పాధి వాసితములైన తిలలతో తీయబడిన నూనె రాసుకున్నచో నానా పుష్ప పరిమళము నించును. ఉన్నది యున్నట్లు తుంగముస్తలను వసను పసుపును పూసుకొనవలెను. మరియు నేదిష్టమో అది చందనాదులను మేనికి పూసుకొనవలెను. చందనాదులు సమానము రీతిలో గైకొని వాడుకో వలెను. వేరే విధానము మాత్రము పనికిరాదు. అందుచే దేవతలకు ప్రియమైన వర్ణము (రంగు) వచ్చును.

తచ్చూర్ణే ఖాదిరం సారం దద్యాత్తుల్య తులార్పితమ్‌ | సహకణ్యారసేనా7స్య కర్తవ్యా గుళికా శ్శుభాః || 40

ముఖే న్యస్తాః సుగుంధా స్తాః ముఖరోగ వినాశనాః | పూర్వం ప్రక్షాళితం సమ్యక్‌ పద్మ పల్లవ వారిణా ||

శక్త్వా తు గుళిక ద్రవ్యై ర్వాసికం ముఖ వాసకమ్‌ | కటుకం దన్తకాష్ఠం చ గోమూత్రే వాసితం త్ర్యహమ్‌ ||

కృతం చ పూగవ ద్రామ! ముఖ సౌగంధ్య కారకమ్‌ | త్వక్‌ పథ్యయో స్సమావంశౌ సిత భాగా7ర్థ సంయుతౌ ||

నాగవల్లీ సమోభాతి ముఖవాసో మనోహరః|

కటుక ఫల నతాంబు త్వక్‌ త్రుటివ్యాధి పత్రైః | నలదనత సురాభి స్తుల్య భాగా7న్వితాని ||

ద్విగుణిత కృతమాత్ర ప్రాతి కక్కోల సౌమ్యైః | శిశిర సరసమో7యం గంధపత్రం విదధ్యాత్‌ || 45

నిహిత మిద మనర్ఘం కర్ణపత్రం యువత్యాః | శమయతి వివిధాని శ్రోత్రపాళీ గదాని ||

అపర మపి చ యావత్‌ కామ మామోద మత్తుమ్‌ | భ్రమదళి పటలేన వ్యాప్యతే వక్త్ర భాగః || 46

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే గంధ యుక్తిర్నామ చతుష్టష్షి తమో7 ధ్యాయః.

మును జెప్పిన చూర్ణములో కవిరి సారము సమభాగము గలిపి కణ్యారసముతో కణీ =నల్లజీలకర్ర నెల్లి గుళికలు చేసికొని నోటవేసికొన్నచో నవి ముఖరోగములను హరించును. మొదట పథ్య (కరక) చిగుళ్ళ నీటితో చక్కగా ముఖము గడిగికొని మీద చెప్పిన గుళిక ద్రవ్యములతో ముఖవాసకము చేసికొనవలెను. కటుకము = చేదుగల దంత కాష్ఠము గోమూత్రమందు మూడు రోజులు నానవేసి దానితో పండ్లు తోముకొన్నను లేదా దానిని వక్కవేసి కొన్నట్లు వేసికొన్నను నోటిని సుగంధభరితముం జేయును. త్వక్కు (దాల్చినచెక్క) పథ్య (కరక్కాయ) సరిపాలు చేసి పంచదార సగము కలిపి నోటవేసి కొన్నచో తమలపాకుతో సమముగా నుండును. అది ముఖమునకు మనోహరమైన ముఖవాసనము. (సువాసనద్రవ్యము) త్రికటుములు నతము (ప్రియంగు) అంబు (కురువేరు) దాల్చినచెక్క యేలకులు వ్యాధిపత్రము నలదము (వట్టివేరు) కురువేరు ఇవి సమభాగములు గంధపత్రం (తాంబూలాము) వేసికొనవలెను. అమూల్యమైన దీనిని కర్ణపత్రముగా ధరించినచో కర్ణరోగములన్నింటిని శమింప జేయును, మరియు నా పరిమళము నానుటకు ముఖమునం దది జిందునంతసేపు తుమ్మెదల గుంపు ఆమె ముఖమును ముసరుకొను చుండును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమున గంధయుక్తియను నఱువదినాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters