Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

అరువదియవ యధ్యాయము - ఆరోగ్యవ్రతము

పుష్కర:-శుక్లపక్షావసానే తు యద్రామ! దిన పంచకమ్‌ | తత్ర సంపూజయే ద్విష్ణుం విధినా యేత తం శృణు || 1

గోమూత్ర గోమయం క్షీరం దధి సర్పి స్తథైవ చ | ఏకైకేన చరేత్‌స్నాన మేకా దశ్యాదిషు క్రమాత్‌ ||

కౌప తాడాగ నాదేయైః పద్మినీసారసై7ర్జలైః | కర్తవ్యం క్రమశః స్నానం స్నాతః సంపూజయే ద్ధరిమ్‌ ||

తైల మిక్షురసం క్షౌద్రం క్షీరం సర్పిశ్చ భార్గవ! | స్నపయే ద్దేవదేవస్య కర్తవ్యం స్యా ద్దినక్రమాత్‌ ||

కాలా7గురు ముశీరం చ తథౄ జాతీఫలం ద్విజ! | కర్పూరం చందనం చైవ కల్పయే దనులేపనమ్‌ ||

కుసుమే ష్వంబుజాతేషు | గంధవత్సు సితేషు చ | ఏకైకం కల్పయే జ్జాతిం శ్రద్ధయా దివస క్రమాత్‌ ||

కృష్ణా గౌరా తథా తామ్రా కపిలా చ సితా తథా | యా ధేను స్తద్‌ ఘృతం దేయం దీపా 7ర్థం దివస క్రమాత్‌ ||

మాష ముద్గ కలాయానాం చణకస్య తిలస్య చ | భక్ష్యాణి వినివేద్యాని తథైవ దివస క్రమాత్‌ ||

ఫాణితం చ గుడం చైవ తథా మత్స్యండికా శుభా | ఖండం చ శర్కరాం చైవ క్రమశో వినివేదయేత్‌ ||

క్షీరవృక్షస్య సమిధ స్తథా దూర్వాం స్తిలా నపి | సిద్దార్థకా న్యథాజ్యం చ హావయే ద్దివస క్రమాత్‌ || 10

అనిరుద్ధాయ దేవాయ ప్రద్యుమ్నాయ తథైవ చ | సంకర్షణాయ దేవాయ వాసుదేవాయ చా7ప్యథ ||

నామ్నా తు జుహుయా ద్వహ్నిం ప్రణవేనా7న్తిమే7హని | అయస్సీసం తథా తామ్రం రజతం కనకం తథా ||

దక్షిణా7ర్థం ప్రదాతవ్యం ద్విజేభ్యో దివస క్రమాత్‌ | నక్తం చ గోరసప్రాయం భోక్తవ్యం తైల వర్జితమ్‌ ||

భూశోధనం చ కర్తవ్యం దేవస్య పురత స్తథా | గీత వాద్య స్తవైశ్చెవ పూజయే ద్దిన పంచకమ్‌ ||

ఏవం సంవత్సరం కృత్వా సర్వాన్‌ రోగాన్‌ వ్యపోహతి | గ్రహణ చ వ్రతస్యా స్య న కాల నియమ స్స్మృతః ||

నిత్యా7భ్యాసేన చైవా7స్య విష్ణులోకే మహీయతే | వ్రతం శ్రేష్ఠ మిదం ప్రోక్తం మయా తే భృగునందన! ||

థన్యం యశస్యం రిపునాశకారి | సౌభాగ్యదం పాపహరం పవిత్రమ్‌ |

ఆయుష్య మగ్ర్యం సుగతిప్రదం చ | వ్రతోత్తమం విఘ్నవినాశనం చ ||

ఇతి శ్రీ విష్ణుదర్మోత్తరే ద్వితీయఖండే ఆరోగ్యవ్రతం నామ షష్టితమో7ధ్యాయః

పుష్కరుండనియె. శుక్లపక్షముతుద నైదురోజులు యధావిధిగ విష్ణునిం బూజింపవలెను. ఆవిధి నెరింగింతు వినుము గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోమూత్రమును వీనితో నొక్కొక్క దానితో స్నానమేకాదశి మొదలుగా చేయవలెను. మరియు నూయి, తటాకము నది తామరకొలనులందుగూడ వరుసగ స్నానముసేసి హరిని బూజింప వలెను. నూనె చెరకురసము, తేనె, పాలు, నెయ్యియు దేవదేవునికబిషేకింపనగును. కాలాగురు, వట్టివేరు, జాజిపండు, పచ్చకర్పూరము చందనము ననువానితో ననులేపనము చేయవలెను. నీటంబుట్టిన వాసననించు తెల్లని పువ్వు లొక్కొక్క నా డొక్కక్కటిగ బూజింపవలెను. కృష్ణ, గౌర, తామ్ర, కపిల, కేవలముతెల్పుగు నైదు గోవుల నేతితో వరు సగ నైదునాళ్ళు దీపము పెట్టవలెను మినుముల, పెసలు, గుండ్రసెనగలు, సెనగలు, నువ్వులు ననువానితో జేసిన భక్ష్యములు నివేదింప వలెను. పటిక బెల్లము, బెల్లము ముత్స్యండికా=కండచక్కెర, ఖండము పులకండము, శర్కర=చక్కెరయువరసగా నివేదింపవలెను. క్షీరవృక్షసమిథలు (మేడి మొ|| పాలచెట్లుసమిథలు) గరికలు నువ్వులు ఆవాలు వరుసగా వరుసదినములందు హోమము సేయవలెను. అనిరుద్ధుడు, ప్రద్యుమ్ముడు, సంకర్షణుడు, వాసుదేవుడు నను నాల్గునామములతో నాల్గు రోజులు, నైదవనాడు కేవలము ప్రణవముతోడను, ఆజ్యాహుతులీయవలెను. అయస్సు (ఇనుము) సీసము, రాగి, వెండి,కనకము వరుస దినములందు ద్విజునకు దక్షిణ యీయవలెను. నూనె తాకకుండ కేవలము గోరసప్రాయముగా నక్త (రాత్రిమాత్రమే) భోజనము సేయవలెను. దేవుని ముందరి భూమిని శుభ్ర పరుపవలెను. ఐదురోజులు గీత వాద్య సంకీర్తనములతో హరింబూజ సేయవలెను. ఇట్లొక యే డీ వ్రతము చేసినవాడు సర్వరోగము లంబాయును. ఈ వ్రతగ్రహణమున కిదియదియనుకాల నియమములేదు. నిత్యాభ్యాసముగ నిదిసేసిన విష్ణు లోకమందు బూజింప బడును. ఇది శ్రేష్ఠమైనది నీకేను దెల్పితిని. ఇదిధన్యము, యశస్యము, రిపునాశకము, సౌభాగ్యప్రదము. పాపహరము, పవిత్రము, ఆయుష్యము, సర్వోత్తమము, సుగతిప్రదము, విఘ్న వినాశనము వ్రతోత్తమము.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున ఆరోగ్యవ్రతమును నరువదియవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters