Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదియైదవ యధ్యాయము - పుత్రీయాష్టమీవ్రతము

పుష్కరః: ప్రోష్ఠపద్యా మతీతాయాం కృష్ణపక్షాష్టమీ తు యా| సోపవాసో నర స్తస్యాం యోషిద్వా తనయార్థినీ ||

స్నాత్వా సరసి ధర్మజ్ఞ! తోయే చాప్యథ సారసే | పూజనం వాసుదేవస్య యథా కుర్యా త్తథా శృణు! ||

ఘృతప్రస్థేన గోవిందం స్నాపయిత్వా జగద్గురుమ్‌ | క్షౌద్రేణ చ తతః పశ్చాత్‌ దధ్నా చ స్నపయే త్తతః ||

క్షీరేణ స్నపనం కృత్వా తతః పశ్చా ద్వివక్షితమ్‌ | సర్వౌషధైశ్చ గంధైశ్చ సర్వ బీజఫలై స్తథా ||

స్నాపయిత్వానులిప్యేత చందనాగురుకుంకుమైః | కర్పూరేణ తధా రామ! తధా జాతీఫలై శ్శుభైః ||

తతః కాలోద్భవైః పుషై#్పః పూజయిత్వా జనార్దనమ్‌ | ధూపం చాగురుణా దత్వా కృత్వా నైవేద్య ముత్తమమ్‌ ||

విశేషా ద్గోరస ప్రాయం పున్నాగై రన్వితైః ఫలైః| పౌరుషేణ చ సూక్తేన హుత్వా చాన న్తరం ఘృతమ్‌ ||

శూద్రోవాప్యథవా నారీ నామ్నాహుత్వా జగద్గురుమ్‌ | యవ పత్రాణి దద్యాత్తు ఫల్గూని కనకం తథా ||

పుత్రార్థం ప్రాశనం కుర్యాత్‌ ఫలైః పున్నా మభి శ్శుభై | స్త్రీ నామభిశ్చ కన్యార్థీ తతో భుక్త్వా యథేప్సితమ్‌ ||

పుత్రకామా నవాప్నోతి తథా సర్వ మభీప్సితమ్‌ | హవిష్యం దేవ దేవస్య భూమి శోభాం తు కారయేత్‌ ||

సంవత్సర మిదం కృత్వా వ్రత మాప్నోత్యభీప్సితమ్‌ | పుత్రకామా నవాప్నోతి తధా సర్వా నభీప్సితాన్‌||

పుత్రీయ మేతద్ర్వత ముత్తమం తే | మయేరితం యద్యపి ధర్మనిత్యమ్‌ |

తథాప్యనేనైన సమస్తకామాన్‌ | కృతేన లోకే పురుషా లభ##న్తే || 12

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పుత్రీయాష్టమీ వ్రతం నామ పంచాశత్తమోధ్యాయః

పుష్కరుండనియె: భాద్రపద పూర్ణిమ వెళ్లిన తరువాత భాద్రపద అష్టమీ నాడుపవసించి స్త్రీగాని పురుషుడుగాని సరస్సునందు స్నానముచేసి కుంచెడు నేతితో వాసుదేవపూజ గావింపవలెను. కుంచెడు నేతితో గోవిందునిస్నానము చేయించి యా జగద్గురు నటుపై పాలతో, నామీద సర్వౌషథులు, సర్వగంధములు సర్వబీజఫలములతో చందనాగురు కుంకుమ కర్పూర జాతీఫలాదులచే స్నానము చేయించి ఆకాలమందలి పువ్వులతో జనార్దను నర్చించి, అగురుధూప మొసంగి, అందు విశేషించి గోరసముల (ఆవుపాలు పెరుగు వెన్న నెయ్యి) జాజి పంద్ణతో చేర్చిన ఫలములను నైవేద్యము పెట్టి పురుష సూక్తముతో జగద్గురుని గూర్చి విష్ణునామ సంపుటిగా లాలుజహోమము చేయవలెను ఫల్గువులు = మేడిసమిధలుయవపత్రములు. బంగారమును దానము సేయవలెను. శూద్రుడేని స్త్రీయేని పుంనామము లయిన పండ్లను పు తార్ధియై (ఆమ్రః- మామిడిపండు పనస:- పనస ఇత్యాదులు పుంలిగమైన పండ్లు) కన్యార్థులైన వారు స్త్రీ నామములయిన పండ్లు (కదలీ-అరటి) మొదలయిన వానిని ప్రాశనము సేయవలెను. పుత్రకాములు పుత్రుల నందుదురు.అభీప్సితార్థముల నందుదురు. విష్ణువునకు హవిష్యమిచ్చిన సర్వపదార్థముల బడయును. ఈ పూజ చేయుచోటను చక్కగా నలంకరింపవలెను ఈ వ్రత మొక్కయేడు చేయవలెను. ఇది పుత్రీయ వ్రతము. ఈ వ్రతము చేసిన వారు పుత్రులతోబాటు సర్వాభీష్టములను పొందగలరు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పుత్రీయాష్టమీవ్రత మను నేబదియైదవ యధ్యాయము.

_______________________________________

N.B.యోగవైద్యాది శాస్త్రమందు గల ఓషధులు (మూలికలు) మఱి యితర పదముల వివరణ గ్రంథము చివర అనుబంధముగా చేర్చబడును. అనువాదకులు దీక్షతులు.

*వి.ధ.పు- 88

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters