Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదిమూడవ యథ్యాయము - పుత్రీయరోహిణీ స్నానము

పరశురామః : పుత్రీయం భగవన్‌ ! స్నానం పుత్రీయ మథసప్తమీమ్‌ | పుత్రీయం చ సమాచక్ష్వ తథా వై కేశవ వ్రతమ్‌ ! ||

పుష్కరః : ఉపోషితా కృత్తికాసు యజమాన పురోహితౌ | రోహిణ్యాం స్నపనం కుర్యు ర్యజమానస్య భార్గవః ||

క్షీరవృక్ష ప్రరోహాభ్యాం సితమాల్య విభూషితమ్‌ | ప్రియంగు చందనో పేతాన్‌ పంచకుంభాన్‌ ప్రపూజయేత్‌ ||

ప్రాజ్ముఖం వ్రీహి రాశిస్థం కుంభై సై#్త రభిషేచయేత్‌ | విష్ణుం శశాంకం వరుణం రోహిణీం చ ప్రజాపతిమ్‌ ||

పూజయేత్‌ ప్రయత శ్శ్రద్ధీ గంధ మాల్యా7ను లేపనైః | ధూపః ప్రజాపతే ర్దేయః తథైవ శటకేశయాః ||

పరుశురాముడు పుత్రలాభము గూర్చు స్నానవిధానము పుత్రీయసప్తమి పుత్రీయ విష్ణువ్రతముం గూర్చి తెలుపుమన పుష్కరుండిట్లనియె. కృత్తికానక్షత్రమందు యజమాన పురోహితులుపవాసముండి, రోహిణియందు, యజమానునికి స్నానముచేయింపవలెను. క్షీరవృక్ష పల్లవములతో నాస్నానోదకము నింపవలెను. అటుపైని తెల్లని పూలమాలలచే నలంకరించి ప్రియంగు చందనములతో నింపిన యైదు కుంభములను బూజింపవలెను. వ్రీహిధాన్యరాశిపై తూర్పుగ కూర్చుండబెట్టి యా కుంభోదకముచే నభిషేకింపవలెను. విష్ణువు, చంద్రుడు, వరుణుడు, రోహిణి, ప్రజాపతి యను దేవతల శ్రద్ధతో బూజింపవలెను.

పంచ వృష్ట వృషాన్‌ దిగ్ధాన్‌ దధ్నాచ వినివేదయేత్‌ | ప్రజాధ్యక్షాయ హోమంచ దేవతానాం తు కారయేత్‌ ||

ఘృతేన సర్వబీజైశ్చ శుక్లవాస జితేంద్రియః | దక్షిణాం గురవే దేయాత్‌ కామ్యం గౌ ర్వాససీ శుభే ||

సువర్ణం చ మహాభాగః విప్రాణా మథ శక్తితః | శుక్లా చ గౌః వృషః శుక్ల స్తయో ర్లోమ శఫం తథా ||

శృంగాణి త్రివృతం కృత్వా మణి ర్ధార్య స్తతో భ##వేత్‌ |

అలంకృతం కేశ మిదం సదైవ | స్నానంతు కుర్వన్‌ పురుషో7థవా స్త్రీ |

పుత్రా నవాప్నోతి తథేష్టతాం చ | పుష్టిం తథా7 గ్ర్యాం విపులాం చ కీర్తిమ్‌ || 10

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పుత్రీయ రోహిణీ స్నాన వర్ణనం నామ త్రిపంచాశత్తమో7ధ్యాయః

పెరుగుతో బూయబడిన యైదు వృషభములను ప్రజాపతికి నివేదన సేయవలెను. ఆవునెయ్యి, నవధాన్యములు శుక్లవస్త్రములను, గురువునకు దక్షిణయీయవలెను. గోవును, శుభవసనద్వయము, సువర్ణమును యథాశక్తి విప్రులకీయవలెను. తెల్లని యావుతెల్లనియెద్దు వాని లోమము శఫడెక్క కొమ్ములు మూడుపేటలొనరించి యా మణి ధరింపవలెను. ఈ గోవు కేశము స్త్రీపురుషులలంకరించుకొని నిత్యము స్నానము చేయుచున్న యెడల పుత్రసంతానముం బొందుదురు. సర్వజనుల కిష్టులగుటయు పుష్టిని విపులమైన సంపదను కీర్తిని బొందుదురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పుత్రీయ రోహిణీ స్నానమును నేబదిమూడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters