Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదియైదవ యధ్యాయము - అశ్వప్రశంస

పుష్కరః- రాజ్ఞాం తురంగామా7యత్తో విజయో భృగునందన ! తస్మాత్సర్వ ప్రయత్నేన తురంగాణాం సమార్జనమ్‌ || 1

రాజ్ఞా యత్నవతా భావ్యం పాలనే చ విశేషతః | తావంత స్తురగా ధార్యా యావతాం పోషణం సుఖమ్‌ || 2

కర్తుం శక్యం న ధార్యా స్తే దుఃఖితాః క్షుథితా స్తథా | దుఃఖితా స్తే శ్రియం లోకే వినిఘ్నన్తి జయం తథా || 3

ధారణీయాః సువిహితా విధినా యవసాదితా. | విధృతాస్తే తథా కుర్యు ర్లోక ద్వయ జయం తథా || 4

మాంగళ్యాస్తే పవిత్రాస్తే రజస్తేషాం తథైవ చ | కైవల్యసై#్యవ తే భక్తా దేవస్య పరమేష్ఠినః || 5

అన్తే మధ్యే తథా తేన నా7నుజ్ఞాతా దివౌకసామ్‌ | తతో7శ్వమేధ తురగ స్తసై#్యవైకస్య హూయతే || 6

సర్వ రత్నా7ధికోజాత స్తురగో7మృత మన్థనాత్‌ | ఉచ్ఛైశ్శ్రవా స్తేన హయః సర్వరత్నోత్తమ స్మృతః || 7

సపక్షా దేవ వాహ్యా స్తే మనుష్యాణా మపక్షకాః | పద్మినీ శాలిహోత్రేణ వాహనా7ర్థం పురా కృతాః || 8

నీరాజయన్తి తే దేశాన్‌ హ్రేషితై ర్బలశాలినః | గంధర్వాస్తే వినిర్దిష్టాః శ్రియః పుత్రా జిత శ్రమాః || 9

ప్రధాన మంగం సైన్యస్య శోభా చ పరమా హయాః | సుదూర గమనే యుద్ధే యాన శ్రేష్ఠా స్తురంగమాః || 10

వల్గన్త ముచ్చై స్తురగం చామరా7పీడ ధారిణమ్‌ | ఆరుహ్య యా భ##వేత్తుష్టి ర్నసా రామ! త్రివిష్టపే || 11

సన్నద్ధ పురుషా7రూఢై స్సుసన్నద్ధె స్తురంగమైః | దృష్టై రేవా7రి సైన్యస్య పతన్తి హృదయా న్యలమ్‌ || 12

తురంగ పాదోద్ధృత ధూళి దండమ్‌ | యస్యా7తపత్రా7నుకృతిం కరోతి |

నభ స్సమగ్రా వసుధా తు తస్య| శైలా7వతంసా భవతీహ వశ్యా || 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పుష్కరోపాఖ్యానే అశ్వప్రశంసా నామ పంచ చత్వారింశో7ధ్యాయః.

పుష్కరుండనియె: భార్గవరామ! రాజుల విజయ మశ్వబలముపై నాధారపడి యున్నది. అందుచే తురగముల సంపాదనము నెన్ని యశ్వరములం బోషింపగల్గు నన్నిటి పోషణము తప్పక రాజు సేయవలెను. అంతకుమించి చేసినను నవి దుఃఖపడెనేని రాజుయొక్క సిరిసంపదలకు జయమునకు భంగము కూర్ప గలవు. అవి లెస్సంగా పోషింపబడెనేని యిహ పరములలో జయము నొసంగ గలవు. అశ్వములు మాంగళ్యములు, పవిత్రములు. వాని పాదధూళియు నట్టిదే. మోక్షమునకు పరమేష్టికినవి భక్తులు. మొదటగాని తుదనుగాని అవి దేవతల కనుమతింపబడలేదు. అందువలననే యాపరమేష్ఠిని (పరమదేవతను) ఒక్కనిగూర్చియే యశ్వమేధ మందశ్వము హోమము సేయబడుచున్నది. ఒక్క భగమంతునికే అవి హోమద్రవ్యముగా నేర్పరుపబడినది. అమృతమథనమందు సర్వరత్నాధికమై యశ్వరత్నమగు నుచ్చైశ్రవ ముద్భవించినది. ఆందువలన హయరత్నము సర్వరత్నాధికమని ఋషులు స్మరించిరి. రెక్కలు గల హయములు దేవతలు వాహనములు. రెక్కలులేనివి శాలిహోత్రుడు పద్మునిచేనవి మనుష్యులకు వాహనములుగా నేర్పరుపబడినవి. బలశాలులైన యా గుఱ్ఱములు తమ సకిలింపులచే దేశములకు నీరాజనమొసంగును. అవి లక్ష్మికి కొడుకులయిన గుఱ్రములు గంధర్వులుగా బేర్కొనబడినవి సైన్యాంగములలో నవి ముఖ్యాంగములు. సేనకు వానితోనే పరమశోభ. సుదూర ప్రయాణము నందు యుద్ధమునుందు నవి శ్రేష్ఠాతిశ్రేష్ఠములయిన యానములు. చామరమును ఆపీడముగా (శిరోలంకారముగ) మీదికెగురుచు దూకెడి గుఱ్రము నెక్కి స్వారిచేయు నపుడు గల్గుసంతుష్ఠి స్వర్గమందు గూడ గలగదు. సర్వసన్నద్ధులై యోధులెక్కిన సుసన్నద్ధములైన కవచములు దొడగిన గుఱ్ఱములు కనబడిన దేవశత్రు సైన్యముల హృదయములు పూర్తిగా గ్రుంగిపోవును. తురంగము యొక్క పాదదండ సముద్ధూతమగు ధూళి దండాకారముగా నెడతెగకుండ మీదికిలేచిన యశ్వ పాదరజస్సే ప్రభువునకు శ్వేతచ్ఛత్రమును అనుకరించును. ఆ ప్రభువునకాకాశ మావరించి యున్నంత మేరగల సర్వ వసుధయు స్వాధీనమగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ద్వితీయఖండమున అశ్వప్రశంసయను నలుబదియైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters