Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదియవ అధ్యాయము - సావిత్రీకృతయమస్తుతి

సావిత్రీ - సర్వధర్మ విధానజ్ఞః సర్వధర్మ ప్రవర్తకః | త్వమేవ జగతాం నాథః ప్రజా సంయమనో యమః || 1

కర్మణా మానురూప్యేణ యస్మా ద్వమయసి ప్రజాః | తస్మాత్త్వ ముచ్యసే దేవ! యమ ఇత్యేవ నామతః || 2

ధర్మేణమాః ప్రజా స్సర్వాః యథా రంజయసే ప్రభో! | తస్మాత్తే ధర్మరాజేతి నామ సత్యం నిగద్యతే || 3

సుకృతం దుష్కృతం చోభే పురోధాయ యథాజనాః | త్వత్సకాశ మథా7యాన్తి తస్మాత్త్వం మృత్యురుచ్యసే || 4

సర్వేషా మథ భూతానా యస్మా దన్తకరో భవాన్‌ | తస్మాత్త్వ మన్తకః ప్రోక్తః సర్వదేవైర్మహాద్యుతే || ! 5

వివస్వత స్త్వం తనయః ప్రథమః పరికీర్తితః | తస్మాద్వైవస్వతో నామ్నా సర్వదేవేషు కథ్యసే || 6

కాలం కలా7ద్యం కలయన్‌ సర్వేషాం త్వం హి తిష్ఠసి | తస్మాత్కాలేతి తే నామ ప్రోచ్యతే తత్సుదర్శిభిః || 7

ఆయుష్యే కర్మణి క్షీణ గృహ్ణాసి ప్రసభం జనమ్‌ | తస్శాత్త్వం కథ్యసే లోకే సర్వప్రాణహరేతివై || 8

తప ప్రసాదా ద్దేవేశ! ధర్మేతిష్ఠన్తి జన్తవః | తవ ప్రసాదా ద్దేవేశ ! సంకరో నైప జాయతే || 9

సతాం సదాగతి ర్దేవ! త్వమేవ పరికీర్తితః | జగతో7స్య జగన్నాథ ! మర్యాదా పరిపాలకః || 10

త్రాహి ! మాం త్రిదశ శ్రేష్ఠః దుఃఖితాం శరణా7గతామ్‌ | పితరౌ చ తథైవా7స్య రాజపుత్రస్య దుఃఖితౌ || 11

యమః- స్తుతేన భక్త్యా ధర్మజ్ఞే | మయా తుష్టేన సత్యవాన్‌ | తవ భర్తా విముక్తో7యం లబ్దకామా ప్రజా7బలే || 12

రాజ్యం కృత్వా త్వయా సార్థం వత్సరా7శీతి పంచకమ్‌ | నాకపృష్ఠ మథా7రుహ్యత్రిదశై స్సహ రంస్యతే || 13

స్తోత్రేణా7నేన ధర్మజ్ఞే! కల్యముత్థాయ యశ్చ మామ్‌ | కీర్తయిష్యతి తస్యా7పి దీర్ఘమాయు ర్భవిష్యతి || 14

పుష్కరః - ఏతావదుక్త్వా భగవాన్‌ యమస్తు | విముచ్య తం రాజసుతం మహాత్మా |

ఆదర్శనం తత్ర జగామ రామ! కాలేన సార్థం సహ మృత్యునా చ || 15

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే సావిత్రీ కృత యమస్తుతిర్నామ చత్వారింశో 7ధ్యాయః.

మార్కండేయుడిట్లనియె: సర్వధర్మ విధానమెరిగిన వాడవు సర్వధర్మ ప్రవర్తకుడవు ప్రజలను సంయమములో కట్టుబాటులో బెట్టువాడవు యముడవు జగత్తులకు ప్రభువునీవే. చేసికొన్న కర్మముల ననుసరించి ప్రజలను నియమింతువుగాన నీవు యముడనంబడుదువు. ధర్మముచే నీ ప్రజలను రంజింపజేయుదువు గావున ధర్మరాజువు పుణ్యపాపములు రెండును బురస్కరించికొని జనులు నీదరికేగు దెంతురు గావున నీవు మ్యత్యువవు. సర్వభూతముల నంతయుసేయు వాడువుగావున నీవంతకుడవు. వివస్వతునికి (సూర్యునికి) నీవు పెద్ద కుమారుడవుగాన వైవస్వతుడ వైతివి. కల వికల మొదలుగ కాలమానమను లెక్కించుచుందువుగావున నీపేరు ''కాలుడు'' అనబడినది ఆయువు క్షీణింపగనే తటాలున వచ్చి జనము నీవు లాగుదువు గాన నీవు సర్వప్రాణహరుడవు. జంతువులు నీ యనగ్రహము వలన ధర్మము నందుందురు. నీవలన ధర్మసంతరము కానే కాదు. సత్పురుషులకు గతివినీవేయని వర్ణింపబడినాడవు. ఈ జగత్తుయొక్క మర్యాదను పరిపాలించువాడవు నీవు. ఓ దేవతాశ్రేష్ఠ ! దుఃఖితనై శరణాగతనైన నన్ను రక్షింపుము. ఈ రాచబిడ్డ తలిదండ్రులు దుఃఖములోనున్నారు. వారినింగాపాడుము. అనవిని యముడు ధర్మజ్ఞులారా! నీస్తుతికి సంతుష్టుడనైనాచే నీభర్త సత్యవంతుడు విడువబడినాడు. నీకోరికవడసి యోయబలా ! ఇక జనుము. నీతోగూడ నాల్గువందలేండ్లు రాజ్యము సేసి నీపతి స్వర్గమునకేగి దేవతలతో గ్రీడింపగలదు ఓధర్మజ్ఞురాలా! ఈ నీ చేసిన స్తోత్రముచే వేకువనులేచి యెవ్వడు నన్ను గీర్తించునో వానికి దీర్ఘాయువు గలుగును. అని యిట్లానితిచ్చి మహాత్ముడు భగవంతునగు యముడా రాకుమారుని విడిచిపెట్టి పరుశురామా! కాలునితో మృత్యువుతోగూడ నక్కడనంతర్ధానమందెను.

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున సావిత్రికృతయస్తుతి సత్యవంతుసంజీవనము నను నలువదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters