Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నాలుగవ యధ్యాయము - జ్యౌతిషికలక్షణము

పుష్కరఉవాచ: ఏవం గుణగణాకీర్ణం వరయేయుర్నరాధిపమ్‌ | సంభూయ రాష్ట్రప్రవరాః క్షత్రియం తు కులోద్గతమ్‌ ||

వృతశ్చతై ర్ర్వతం రాజా గృహ్ణీయా ద్విజితేంద్రియః | ''పాలయిష్యామి వ స్సర్వాన్‌ ధర్మస్థాన్నాత్ర సంశయః || 2

వ్రతం గృహీత్వా రాజ్యార్థీ వృణుయాత్‌ ప్రాహ్మణోత్తమమ్‌ | సాంవత్సరం సుఖాయాస్య సర్వస్య జగోతో నృపః 3

సర్వలక్షణ లక్షణ్యం వినీతం ప్రియదర్శనమ్‌ | సురూపం వేష సంపన్నం నిత్య మూర్జిత దర్శనమ్‌ || 4

అదీన వాదినం ధీరం ధర్మనిత్యం జితేంద్రియమ్‌ | అవ్యంగం నాధికాంగం చ వేదవేదాంగ పారగమ్‌ || 5

చతుష్షష్ట్యంగ తత్తజ్ఞ మూహాపోహ విశారదమ్‌ | భూత భవ్య భవిష్యజ్ఞం గణితజ్ఞం విశేషతః || 6

విచంద్రా శర్వరీ యద్వత్‌, ముకుటం చ చ్యుతోపలమ్‌ | గణితేన తధా హీనం జ్యోతిషం నృపసత్తమ! || 7

ఆస్తికం శ్రద్ధ ధానంచ అను కూలం మహీపతేః | సాంవత్సరం నృపో గత్వా వరయే త్ప్రయతః శుచిః|| 8

యేనా7భిషిక్టో నృపతిః వినష్టస్టు నరాధిప ! సాంవత్సరం నతం విద్వాన్‌ వరయే న్నృప సత్తమ || 9

న హీనాంగం నవాచాలం నచ నిష్ప్రతిభం నృపః | కువేశ మలినం ముండం నాస్తికం పాప నిశ్చయమ్‌ || 10

భిన్న వృత్తించ వరయే ద్వరయే త్సద్గుణం సదా | వరయి త్వాతు వక్తవ్యాః స్వయ మేవ మహీభుజా || 11

పుష్కరుడనియె. ఇట్టి శుభలక్షణసంపన్నుని ఉత్తమకులమువానిని క్షత్రియుని రాష్ట్ర ప్రవఱులందురుకలిసి రాజుగా నెన్ను కొనవలెను. ఎన్ను కొనబడిన యారజింద్రియనిగ్రహము గలవాడై ''మీయందఱును ధర్మ నిష్ఠులనుగా నేను భావింతును. సందియములేదు ''అను వ్రతముగైకొని (ప్రమాణముగావించి) రాజ్యమేలదలచి సర్వజగత్తునకు దనకునుగూడ సుఖమొదవుకొనుటకు బ్రాహ్మణోత్తము నొకనని సాంవత్సరుని= జ్యోతిశ్శాస్త్రసంపండితు నెన్ను కొనవలెను. ఆజ్యౌతిషుకుని కుండ వలసిన లక్షణములు. సర్వశాస్త్ర లక్షణములు గలవాడు తెలిసినవాడు వినీతుడు (వినయశీలి) లేదా గురులచేజక్కని శిక్షణపొందినవాడు. ప్రియదర్శనుడు సురూపి సువేషి. నిత్యమును నుదారముగా గనిపించువాడు. వాచాదైన్యము భావదైన్యము లేనివాడు. ధర్మము నెప్పుడేని దప్పనివాడు జితేంద్రియుడు అంగలోపము లేనివాడు అధికాంగుడు కానివాడు, వేదవేంగపారంగతుడు, అరువది నాల్గంగముల నిగ్గు బాగదెలిసినవాడు, ఊహా పోహలందు నేరిమిగలవాడు ఏదేయెక విషయము నౌనని కాదని నిశ్చయించుటలో నేర్పరియన్నమాట. జరిగిన జరుగుచున్న జరుగనున్న విషయములలో దెలిసికొనగలవాడు గణితపారగుడునై జ్యౌతిషికుడుండవలెను. చంద్రుడులేని రాత్రి యెట్టిదో మణిపొదగని కిరీట మెట్టిదో, గణితములేని జ్యోతిషము ( జ్యోతిశ్శాస్త్రపరిజ్ఞానము) అట్టిది. కావున మంచి గణతజ్ఞుడుగా నుండవలెను. మరియు నాజ్యౌతిషికుడు ఆస్తికుడు గావలెను. శ్రద్ధావంతుడు రాజున కనుకూలుడునై యుండవలెను. రాజు అట్టివానని ప్రయతుడై శుచియై యేగి నాయాస్థానమందు మీరుడంవలయునని కోరవలెను. ఆకోరుటలో గూడ నేజ్యోతిషాచార్యుని వాగ్బలముచే రాజులు లోగడ నభిషిక్తులైరో, యెవ్వనివలన నష్టాలపాయిరో చక్కగా తెలిసికొనవలయును. హీనాంగుని ( అంగలోపముగలవానిని) వదరుబోతును ప్రతిభ లేనివానిని ( నవనవోన్మేషశాలియైన బుద్ధి ప్రతిభయనంబడును) మలినవేషుని తలబోడిని నా స్తికుని పాపసంకల్పుని భిన్నమతిని తనయెడ మనస్సు సరిగలేనివానిని) జ్యౌతిషికుని రాజు కోరరాదు. గుణవంతుని సాంవత్సరు నెన్నికొని రాజాయనతో నిట్లు పలుకవలెను.

యథైవాగ్ని ముఖాదేవా స్తథా రాజముఖాః ప్రజాః | యథైవాగ్ని ముఖా మంత్రాః రాజ్ఞాం సాంవత్సరా స్తథా || 12

త్వం మే మాతా పితాచైవ దేశికశ్చ గురు స్తథా | దైవం పురుషకారశ్చ జ్ఞాతవ్యౌ సతతం త్వయా || 13

సమధర్మజ్ఞ ః భద్రంతే రాజ్యం సాధారణం హి నౌ || సమానేయ శ్శుభో దేవ స్త్వయైవ మమ సత్తమ ! 14

పౌరుషేణ పదం కార్యం సమరం చ తథా మయా || స చేత్తదభి మన్యేత పార్థివస్య మహాగుణమ్‌ || 15

అథవా గుణ దోషేణ ప్రజ్ఞయా చాశు యో నృణామ్‌ || దైవోపఘాత స్సమరే విజ్ఞానం పౌరుషస్య చ || 16

దేవత లగ్ని ముఖులెట్లో ( ఆగ్ని దేవుడు దేవతలకు మఖమెట్లో (తన్ముఖముననే. వారు హవిస్సల నందికొని యారగింతురు గావున) ప్రజలు రాజముఖు లెట్లో మంత్రము లగ్ని ముఖము లెట్లో యట్లే రాజులకు సాంవత్సరులు జ్యౌతిషికులట్లు ముఖ్యమైయున్నారు. ఓ విద్వాంసుడా! నీవు నాకు తల్లి తండ్రి గురువు దేశికుడు నౌదువు. నీ వలన దైవము ( అదృష్టము) వురుషకారమును నేనెల్లవేళల నెరుంగవలసి యున్నానున సర్వధర్మజ్ఞ! నీకు నిరంతరము భద్రమగుగాక. రాజ్యమిది నీకును నాకును సాధారణము (ఉమ్మడిసొమ్ము) నే చేతనే దైవము శుభ్రపదుడు నాకు సమకూర్చ వలసినవాడు. నీచేతనే (నీచెప్పిన చొప్పున)నేను బురుషకారము సేయుటయు యుద్ధము సేయుటయు జరుపవలసినది. జ్యౌతిషికుల కభిమతమైనదేని యది రాజునకు మహా గుణమగును. ఆ యాచార్యుడు గుణ దోషములు చూచి తన ప్రజ్ఞతో యుద్థ మిద్దాన దైవమనుకూలమా? వ్యతిరేకమా? యనువిజ్ఞానముగొని నిర్ణయింప వలసినవాడు ప్రాజ్ఞుడా బ్రాహ్మణు ననుమతమున రాజు సర్వము గావింపవలెను.

బాడబం న చ ప్రాజ్ఞస్తు తసై#్య వాసుమతే తదా | తేనోద్దిష్టౌతు వరయే ద్రాజా మంత్రి పురోహితౌ || 17

తేనోద్దిష్టాంచ వరయే న్మహిషీం నృపసత్తమః || తతో భిషేక సంభారాన్‌ తస్య కుర్యా త్స దైవ విత్‌ || 18

కుంజరం తురగం కుర్యా త్తస్య రాజ్ఞః పరీక్షితౌ || భద్రాసనం చ ఛత్రంచ వాలవ్యజన మేవచ || 19

ఖడ్గరత్నం తథాచాపం రత్నాని వివిధాని చ | రాజ్ఞో మృతస్య యే త్వాసన్‌ సర్వాణి తే నరాధిప || 20

తే సకార్యా నరేంద్రస్య తేన దైవవిదా తధా | కామం సంవత్సరం కార్యా అలాభేన్యస్య భూభుజా || 21

గుణాధికస్య నో కార్యా యేన్యత్రాభిహితా మయా || 22

న తత్ర నాగాః సుభృతా నయోధా రాజ్ఞోన మాతా నపితా న బంధుః |

యత్రాస్య సాధ్యం భవతీహ విద్వాన్‌ సాంవత్సరో థర్మవిదప్రమత్తః || 23

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే సాంవత్సరిక లక్షణ కథనం నామ చతుర్థోధ్యాయః.

ఆజ్యోతిషాచార్యుడుద్దేశించిన వారినే రాజు మంత్రి పురోహితుల గావించుకొనవలెను. ఆయన యనుమతించిన యామెనే పట్టమహిషింగాగూడ వరింపవలెను. ఆమీద నారాజునకు పట్టాభిషేకమునకు గావలసిన సంభారములను. ఆదైవజ్ఞుడే సమకూర్పవలెను. భద్రగజము= పట్టపుటేనుగు గుఱ్ఱము భద్రాసనము ఛత్రము వాలవ్యజనము (చామరము) ఖడ్గరత్నము. చాపము వివిధజాతి రత్నములనన్నిటిని నాదైవజ్ఞుని చేతనే సంఘటితములు గాదగినవి. ఏ వస్తువైన దైవవిదు డాతని చేతనే సమకూర్పవలయును. ఆయన యంగికరింపడేని ఆ వస్తువెంత గుణవంతమయినం జేకొనరాదు. ఆయాగజ హయాది లక్షణము లింకొకచొట నేను జెప్పియున్నానుః అప్రమత్తుడై జ్యౌతిషికుడిదియే నన్న వస్తువే రాజు గ్రహింపవలెను గాని ఏనుగులు యోధులు తల్లిదండ్రి మఱి బంధు వేదియుగాదు జ్యౌతిషికుని మీదనే యతను యధారపడవలసినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున జ్యౌతిషిక లక్షణమను నాలుగవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters