Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పదియారవ యధ్యాయము - సావిత్ర్యుపాఖ్యానము వనప్రవేశము

పుష్కరః- వైలోమ్యం ధర్మరాజో7పి నాచర త్యథ యోషితామ్‌ | పతివ్రతానాం ధర్మజ్ఞ | పూజ్యా స్తస్యా7పి తాస్సదా || 1

అత్ర తే వర్ణయిష్యామి కథాం పాప ప్రణాశినీమ్‌ | యథా విమోక్షితో భర్తా మృత్యుపాశా 7వృతః స్త్రియా || 2

మద్రేషు శాకలే రాజా బభూవా7శ్వపతిః పురా | అపుత్ర స్తప్యమానో7సౌ పుత్రా7ర్థే సర్వకామదమ్‌ || 3

సావిత్ర్యాః కారయామాస లక్ష హోమం ద్విజోత్తమైః | సిద్ధార్థకై ర్హూయమానా సావిత్రీ వ్రత్యహం ద్విజః || 4

శత సంఖ్యై శ్చతుర్ధ్యాం తు మాసా ద్దశ దినే గతే! | కాలేతు దర్శయామాస స్వాం తనుం మనుజేశ్వరే || 5

సావిత్రీ - రాజన్‌ ! భక్తో7సి మే నిత్యం ప్రాప్స్యసే తనయాం శుభామ్‌ |

మద్దత్తాం యత్ప్రసాదాచ్చ పుత్రాన్‌ ప్రాప్స్యసి శోభనాన్‌ || 6

పుష్కరః- ఏతావదుక్త్వా సా రాజ్ఞః ప్రణతసై#్యవ భార్గవ! | జగామా7దర్శనం దేవీ ఖే యథా రామ! చంచలా || 7

మాలవ్యా నామ తస్యా7స్తి రాజ్ఞః పత్నీ పతివ్రతా | సుషువే తనయాం కాలే సావిత్రీ మేవ రూపతః || 8

సావిత్ర్యా హుతయా దత్తా త ద్రూప సదృశా తతః | సావి త్యేవ భ##వే దేషా జగాద నృపతి ర్ద్విజాన్‌ || 9

కాలేన ¸°వనం ప్రాప్తాం దదౌ సత్యవతే పితా| నారదాస్తు తతః ప్రాహ రాజానం దీప్త తేజసమ్‌ || 10

క్షీణాయురేష వర్షేణ భవిష్యతి నృపాత్మజః | ప్రదేయా చ సకృత్కన్యా చింతయిత్వా నరాధిప! || 11

తథా7పి ప్రదదౌ కన్యాం ద్యుమత్సేనా7త్మజే శుభామ్‌ | సావిత్ర్యపి చ భర్తారమాసాద్య నృపనందనమ్‌ || 12

నారదస్య తు వాక్యేన దూయమానేన చేతసా | శుశ్రూషాం పరమాం చక్రే భర్తృ శ్వశురయో ర్వనే || 13

రాజ్యభ్రష్ట స్సభార్యస్తు నష్ట చక్షు ర్నరాధిపః | తుతోష తాం సమాసాద్య రాజపుత్రీం తదా స్నుషామ్‌ || 14

చతుర్థే7హని మర్తవ్యం యదా సత్యవతా ద్విజ ! | శ్వశురేణా7భ్య నుజ్ఞాతా తదా రాజ్ఞాతు సా స్నుషా || 15

చక్రే త్రిరాత్రం ధర్మజ్ఞ! ప్రాప్తే తస్మిం స్తదా దినే | చారుపుష్ఫఫలా7హారం, సత్యవాన్‌ ప్రయ¸°వనమ్‌ || 16

శ్వశురేణా7 భ్యను జ్ఞాతా యాచనా భంగ భీరుణా | సావిత్ర్యపి జగామా 7శు సహభర్త్రా మహద్వనమ్‌ || 17

చేతసా దూయమానేన గూహమానా చ తద్భయమ్‌ | వనే పప్రచ్ఛ భర్తారం ద్రుమాంశ్చ సమృగాం స్తథా || 18

ఆశ్వాసయామాస స రాజపుత్రీం | క్లాంతాం వనే పద్మపలాశ నేత్రామ్‌ |

సందర్శనేనా7థ మృగ ద్విజానాం | తథా ద్రుమాణాం విపినే నృవీరః || 19

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే సావిత్ర్యుపాఖ్యానే వనప్రవేశోనామ షట్త్రింశత్తమో7ధ్యాయః.

పుష్కరుండనియెః- ధర్మరాజుగూడ పతివ్రతలకు స్త్రీలకు ప్రతికూలమగు పనిచేయడు. వారాయనకు గూడ పూజనీయులే. ఈయంశమందు పాపహారిణియైన కథను నీకు వర్ణించెద. ఒక అబలచేత మృత్యుపాశావృతుడయినభర్త యాపాశమునుండి ముక్తినందింపబడినాడు. మద్రదేశములందు శాకలనగరమునందు అశ్వపతియను రాజుండెను. అపుత్రకుడయిన యాతడు పుత్రార్థియై తపస్సుచేసి సర్వాభీష్ట ప్రదమైనదియు సావిత్రీదేవీసముద్దిష్టమగు లక్షహోమము నుత్తమద్విజులచే జరిపించెను. ప్రతిదినము సావిత్రీదేవి శతసంఖ్యాకముగా ఆవాలతో చతుర్ధియందు ప్రతిమాసము హూయమానయై పదియవరోజున స్వరూప దర్శన మనుగ్రహించి, రాజా! నాకు నిరంతర భక్తుడవైతివి. శుభస్వరూపిణిం దనయను గాంతువు. ఆమె ప్రసాదమున శోభనులైన పుత్రులనుం బడయగలవు. అని పలికిప్రణతుడైన యారేని ననుగ్రహించి యాదేవి యాకసమున మెఱుపువలె యదృశ్యమైచనియె. ఆరాజుపత్ని మాలవ్య యనునామె మహాపతివ్రత సకాలమున రూపమున సాక్షాత్సావిత్రియేయైన పుత్రింగనెను. సావిత్రీదేవి నుద్దేశించి చేసిన హోమ ప్రభావముచే నాదేవియే యదేరూపముగలది గావున నీ శిశివు సావిత్రియే యగునని యారాజు ద్విజులకు నివేదించెను క్రమమున వయసు వచ్చిన యా కన్యను దండ్రి సత్యవంతునకిచ్చెను. అంతట నారదుడు మాత్రము తేజస్వియైన రేనింగని ఈ రాజకుమారుడొక్కయేడులో క్షీడాయుష్కు డగును. రాజా ! ఆలోచించి ''యొక్కమారె కన్యయీయదగినది'' అనెను. అయినను నశ్వపతి ద్యుమత్సేన పుత్రునికి శుభలక్షణమైన కన్య నొసంగెను. సావిత్రియు నారాకుమారుని భర్తగా బడసి నారద వాక్యముచే బెగడొందు మనస్సుతో భర్తకు నత్తమామలకు పరమావధియైన శుశ్రూష నొనరించెను. ద్యుమత్సేన నృపతి రాజ్యభ్రష్టుడు భార్యతో కండ్లుపోయినవాడా కోడలింగొని సంతుష్టుడయ్యెను. సత్యవంతుడిక నాల్గవ రోజున మరణింప వలసియున్నదనగా నాకోడలు మామగారియొద్ద ననుజ్ఞగొని త్రిరాత్రము పుష్ప ఫలాహారముగావించెను. సత్యవంతుడడవికేగెను. యాచనను భంగపరచుచున్న బెదరు మహానుభావుడగు మామగారి యభ్యనుజ్ఞతో సావిత్రియుం మనసులో దిగులందుచు నా జడుపు దాచుకొని సత్వరముగా భర్తతో నడవికిం జనెను. చని యా వనమునంగల చెట్లను మృగములనుగూర్చి భర్తనడిగెను. అవ్వీరుడు సత్యవంతుడు మృగపక్షి దర్శనమున బెదరి చెదరి దిగులు పడుచున్న యా పద్మదళాయాత నేత్రయగు రాజపుత్రిని బెదరకుమని నెమ్మదిపరచెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున సావిత్ర్యుపాఖ్యానమున వనప్రవేశమను ముప్పదియారవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters