Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది యైదవ అధ్యాయము - స్త్రీ దేవతా పూజా నిరూపణము

రామః - స్త్రీణాం పూజ్యతమా లోకే దేవతాస్తం ప్రకీర్తయ ! | తాసాం కాలం విధానం చ ఫలం పూజనత స్థథా || 1

పుష్కరః - శ్రియస్సంపూజనం కార్యం స్త్రీభిస్తుసతతం గృహే | పుష్పార్ఘ్యమాల్య నై వేద్య ధూపదీపాను లేపనైః ||

గృహసమ్మార్జనం రామ ! తథా తస్యోపలేపనమ్‌ - పుష్పోపహారకరణం సుధా శుక్లత్వ మేపచ || 3

సర్వమేత ద్విజానీయా చ్ఛ్రియ స్సంపూజనం ద్విజః | స్నానాను లేపనం యచ్చ గంధవర్ణావధారణమ్‌ || 4

సువర్ణతా చ నారీణాం శ్రియ స్సంపూజనా ద్భవేత్‌| అష్టమీషు చ సర్వాసు పూజనీయా ప్యశోకికా || 5

గంధమాల్య నమస్కార ధూపధీపాదిభి స్తథా | తస్మిన్నహని యా భుం క్తే నక్తం తైల వివర్జితమ్‌ || 6

భవత్యథ విశోకా సా యత్ర యత్రాభిజాయతే | అష్టమీషు చ సర్వాసు న చేచ్ఛక్నోతి భార్గవ! || 7

ప్రోష్ఠపద్యాం వ్యతీతాయాం యా స్యా త్కృష్టాష్టమీ ద్విజ ! తస్యా మవశ్యం కర్తవ్యా దేవ్యాః పూజా యథావిధి || 8

అపామివ త్రిలోకేషు ప్రకృతిః స్త్రీషు చోచ్యతే | యా ప్రేరయతి కర్మాణి లోకేషు ద్విజసత్తమ ! 9

తస్యాం సంపూజనం కార్యం శుక్లాం పంచదశీం తథా | మాల్యాను లేపనై ః శుక్లై ర్ధూపేన చ సుగంధినా || 10

రక్తవస్త్ర ప్రదానేన దీపదానేన చాప్యథ | వైదళైశ్చ తథా భ##క్ష్యైః భోజ్యైశ్చోషై#్య స్తథైవ చ || 11

పూజయిత్వా చ తాం దేవీం భోక్తవ్యం నిశి భార్గవ! | యది పంచదశీ సర్వాం నశక్నోతి కదాచన || 12

దేవ్యా స్సంపూజనం కార్య మవశ్య మపి కార్తికే | ఉషార్తిం పూజయే ద్యాతు సా తు నారీ పతివ్రతా || 13

సదా ధర్మరతా సాధ్వీ లోకే భవతి భార్గవ! | నాశుభే చ మతిస్తస్యాః కదాచిదపి జాయతే || 14

ఏకాదశీం తథా కృష్ణాం ఫాల్గునే మాసి భార్గవ ! | ఛందోదేవస్య కర్తవ్యా పూజా ధర్మభృతాం వరః || 15

పూజనా చ్ఛందోదేవస్య తనయం గుణవర్జితమ్‌ | న ప్రాప్నోతి తథా ప్నోతి తథా గుణవంత మసంశయమ్‌ || 16

గంధమాల్యాదిభి ర్భక్త్యా తథా వై వస్తు దేవతామ్‌ | ఏకాదశీం తథా ప్రాప్య చైత్రశుక్లస్య పూజయేత్‌ || 17

సంపూజ్యతాం మహాభాగ ! గృహభంగో న జాయతే | శుక్లాష్టమీం తు సంప్రాస్య మాసి భాద్రపదే తథా || 18

దూర్వాప్రతానం లుంపే త్తదుత్తరాశాభి గామినమ్‌ పూజయేద్గృహ మానీయ గంథమాల్యాను లేపనైః | 19

ఫలమూలై స్తథా రామ ! ధూపదీపౌ వివర్జయేత్‌ | అగ్నిపక్వం తథా సర్వం న నివేద్యం కథంచన || 20

భోక్తవ్యం చ తథా రామ ! వహ్ని పాక వివర్జితమ్‌ | దూర్వాంకురస్థాం సంపూజ్య విధినా ¸°వనశ్రియమ్‌ | 21

¸°వనం స్థిర మాప్నోతి యత్రయత్రాభిజాయతే సోపవాసా తు యా నారీ కృష్ణపక్షస్య కార్తికే || 22

ద్వాదశ్యాం పూజయే ద్విష్టుం గాం సవత్సా మనన్తరమ్‌ | గంధమాల్య నమస్కార ధూపధీపాన్న సంపదా || 23

నై వేద్యం గోరసం సర్వం వర్జనీయం ప్రయత్నతః | భోక్తవ్యం చ న ధర్మజ్ఞ | దోగ్జవ్యానైన చార్జునీ || 24

స్త్రీలకు మిక్కిలి పూజనీయులైన దేవతలం గీర్తిపుమని యాపూజాసమయము విధానము ఫలమును గూడ యానతిమ్మని పరశురాముడడుగ బుష్కరుండిట్లనియె. స్త్రీలు గృహమందేవేళ లక్ష్మి పూజ సేయవలెను. పుష్పార్ఘ్య ధూపదీపనై వైద్యాదులతో నర్చింపవలెను. దేవతా గృహసమ్మార్జనము అనులేపనము పుష్పోపహారకరణము తెల్లసున్నము పూయుట యిదంతయు లక్ష్మి పూజయని యే యెరుంగనగును. స్నానానులేపనము. గంధావదారణము స్త్రీలకు సువర్ణము (మంచి చాయ) లక్ష్మి పూజ వలన గల్గును అన్ని యష్టములందు అశోకికయను దేవతను పూజింపవలెను. గంధమాల్య నమస్కార ధూప దీపాదులచే నా నాడు నక్తముండి తై లవర్జితముగ భోజనము చేయునేని యా యింతి మరు జన్మ మందు విశోక యగును. అన్ని యష్టములందు అశోక పూజ సేయలేని దేని ప్రోష్టపది గడిచిన కృష్ణాష్టమి నాడా పూజ తప్పక చేయవలెను. ముల్లోకములందు. నీరు ప్రకృతి (మూలద్రవ్యము)అన్నట్లు స్త్రీగూడ ప్రకృతి యనియు చెప్పబడినది. లోకమందు కర్మ ప్రేరణను స్త్రీయే చేయును. అ ప్రకృతిని శుక్ల పక్ష పూర్ణిమనాడు తెల్లని పూల మాలలతో గంథముతో సుగంధభరితమైన ధూపముతో పూజసేయవలను. రక్తవస్త్రము సమకూర్చవలెను. దీపము వెట్టవలెను. విదళములైన వాని (సెనగలు, పెసలు మినుములు మొదలగునవి ద్విదళములు విసరిన రెండు ముక్కలగు నవి. అట్లు రెండు ముక్కలు గానివి గోధుమలు బియ్యము, మొదలయినవి విదళములు) జేసిన భక్ష్యములు భోజ్యములు చోష్యములతో నా దేవింబూజించి రాత్రి భోజనము సేయవలెను. దానినే నక్తమందురు. ప్రతిపూర్ణిమనాడు పూజ చేయలేని యెడల నాదేవిని కార్తీక పూర్ణమి నాడు తప్పక చేయవలెను. ఏ పతివ్రత ఉషార్తిని పూజించు నా విడ లోకమందు ధర్మాసక్తికలదగును. ఆమెపతి యెన్నడు నశుభ స్థానమందు బుట్టడు. ఫాల్గుణ బహుళైకాదశి నాడు ఛందో దేవతకు పూజ సేయవలెను. ఛందోదేవ పూజ వలన స్త్రీ గుణహీనుని కుమారుని గనక గుణవంతునే కనును. భక్తితో గంధమాల్యాదులచే చైత్రశుక్లెకాదశినాడు వాస్తు దేవతా పూజ సేయవలెను. అందువలన గృహభంగమెన్నడును గలుగదు. భాద్రపదశుక్లాష్టమినాడు గరిక దుబ్బల నుత్తర దిశభిముఖముగా జనువానిని బెరికి ఇంటికి దెచ్చి గంధ మాల్యాదులచే పండ్లతో పూజింపవలెను. ధూపదీపములు మాత్రము పనికిరావు. అగ్నిపక్వమైన పదార్థము నివేదింపరాదు. అపక్వములచే నైవేద్యము పెట్టవలెను. తాను యపక్వ పదార్థములనే తినవలెను. గరికపోచలందున్న వన లక్ష్మిని బుజించిన జన్మించిన చోటనెల్ల స్థిర ¸°వనము నొందును. కార్తిక బహుళద్వాదశినాడు యువతి యుపవసించి విష్ణువును తరువాత సవత్సమైన గోవును గంధ మాల్య ధూపదీప నమస్కారములతో బూజింపవలెను. గోరసము సర్వము ఆవుపాలు పెరుగు నెయ్యి మొదలయినవి యేవియు నివేదింపరాదు. తాను దినరాదు. ఆ పాలు పిదుకరాదు.

గానః ప్రాప్నోతి కృత్వైవం నాత్రకార్యా విచారణా | ధేను తాం యధి విప్రాయ ప్రదదాతి యథావిధి || 25

స్వర్గలోక మథ೭೭సాద్య న తతో వినివర్తతే | కార్తికే చ తథా మాసి కృతికాయాం చ పూజనమ్‌ || 26

కర్తవ్యం గంధకల శైర్గంధ మాల్యాను లేప నైః | భ##క్ష్యైశ్చ పరమాన్నైశ్చ కుల్మాషైః పర్పటై స్తథా || 27

శక్త్యా వసై#్త్రశ్చ ధర్మజ్ఞ ః మహారంజన రంజనై ః | గుడేన మధునాచైవ సితయా లవణన చ || 28

అర్థ్రకేణక్షుణా చైవ తథా కాలోద్భవైః ఫలై ః | సర్వైశ్చ వివిధైరన్నైర్గంధై ర్నానావిధై స్తథా || 29

పానకైశ్చ తథా హృద్యైః పూజనీయాశ్చ కృత్తికా ః | సహచంద్రమసా రామ ! తేన సౌభాగ్య మశ్నుతే || 30

నారీ చ రూపలావణ్య ధర్మేచాగ్ర్యాం తథా మతిమ్‌ | అవైధవ్యంచ ధర్మజ్ఞ ! యత్ర యత్రాభిజాయతే || 31

లవణస్య తులాం కృత్యా మహారంజన రంజితే || వస్త్రే వస్త్రేణ తేనాథ సాలంకారం సిత చ్ఛవిమ్‌|| 32

కృత్వా పిండం హరిద్రాక్తం కృత్తికానాం నివేదయేత్‌ | గ్రాహయే ద్ర్భాహ్మణం తాం చ ప్రా ప్తే చంద్రోదయే తథా || 33

అనేక కర్మాణా నారీ సౌభాగ్యం మహదశ్నుతే | పురుషో ప్యధ వై శుద్ధో సౌభాగ్యం మహదశ్నుతే || 34

యా భుం జ్తే గోరసప్రాయం కృత్వా బ్రాహ్మణ పూజనమ్‌ | సప్త జన్మాతరాణ్యవ సౌభాగ్యం రూప మేవ చ || 35

స్వర్గే తు భోగా నాప్నోతి సహభర్త్రా తు సా శుభా | 36

ప్రాప్య పంచదశీం రామ ! తథా శుక్లాం చ కార్తికీం| కార్తికం కార్తికం రామ ! గృహభిత్తౌ సమాలిఖేత్‌ || 37

ఉపద్వారం గృహద్బాహ్యం నానావర్ణైస్తు వర్ణకైః| గృహోపకరణం శక్త్యా తయోశ్చైవా భితో లిఖేత్‌|| 38

పీఠ ఖడ్గాసనాద్యత్ర శకటోలూఖలాదికమ్‌ | తతస్తౌ పూజయే న్నారీ నానభక్తి పరా శుచి ః || 39

గంధమాల్య నమస్కార ధూపధీపాన్న సంపదా | ఇక్షుణక్షు వికారైర్వా విశేషేణ ఛ పూజయేత్‌ || 40

తయోస్తు పూజనం కృత్వా మత్స్యంచ సికతాయుతమ్‌ | శక్తి నేత్రం న్యసేత్‌ క్షీరే తచ్చ దద్యాద్ద్విజాతయే || 41

తతశ్చ నక్తం భుంజీత తిలతైల వివర్జితమ్‌ | అనయోః పూజనాద్రామ ! గృహభంగం న చా ప్నుయాత్‌ || 42

పతివ్రతా మహాభాగ ! దీర్ఘ మాప్నోతి జీవితమ్‌ | కార్తికే చ తథా మాసి సార్థం చంద్రమసా సదా || 43

రోహిణ్యాం రోహిణీ పూజా కర్తవ్యా విధినా ద్విజ ః | సర్వై రవిధవా

చిహ్నైర్లవణన చ భూరిణా || 44

ఇట్లు చేసిన గోసమృద్దినందును. ఆ దేనువును విప్రునికిచ్చినవాడు స్వర్గమంది తిరిగిరాడు. కార్తికమాసమందు కృత్తికా నక్షత్రమందు (కార్తిక పూర్ణిమ) గంధకలశములతో గంధమూల్యాను లేపనములతో భక్ష్యములతో పరమాన్నములతో కుల్మాషములు పర్పటములతో పూజ చేయవలెను. యథాశక్తిగా మహారంజనము అయిన (పట్టు బంగారు వెండిజరీల గల) వస్త్రములతో బెల్లము తేనె పంచదార ఉప్పుతో అల్లముతో చెరకుతో నాకాలమందు పండు పండ్లతో వివిధమృష్టాన్నములతో నానావిధగంధములతో మనోహర పానకములతో కృత్తికా నక్షత్ర దేవతలను చంద్రునితో గూడ పూజింపవలెను. దాన సౌభాగ్యవంతుడగును. స్త్రీ రూపలావణ్యవతి యగును. ధర్మ మందును బుద్ధిగలదగును. ఎచ్చటపుట్టినను ధీర్ఘ సుమంగళియగును. లవణతులాదానము చేయవలెను. అనగా తెల్లని ఉప్పును వస్త్రముతో మూటగట్టి జరీ వస్త్రముతో చేసిన తక్కడె యందుంచి, అలంకరించి పసుపుతో ముద్ద చేసి కృత్తికులకు నివేదింపవలెను. చంద్రోదయమయినతర్వాత దానిని బ్రాహ్మణునికిదాన మీయవలెను. దీని వలన స్త్రీ మహా సౌభాగ్యవంతురాలగును. కృత్తిక ప్రతిపాదమందు నా కృత్తికలం బూజించి బ్రాహ్మణులం బూజించి గోరస ప్రాయముగ భోజనము చేసిన వనిత సప్తజన్మములు సౌభాగ్యవతి రూపవతియు నగును. భర్తతో నామె స్వర్గభోగముల ననుభవించును. కార్తిక పూర్తిమ నాడు కార్తికమును కార్తికి చిత్రమును యింటి గోడమీద వ్రాయవలెను. ఇంటి వెలుపలి ఉపద్వారమున నానావిధముల రంగులతో వారిని చిత్రించి యా మూర్తుల కెదురుగ గృహోపకరణ సామగ్రిని (అనగా పీఠము ఖడ్గము కుర్చీ శకటము రోలును మొదలు వానిని) జిత్రించి భక్తి భరితమై యా కార్తికీ కార్తిక దేవతలను గంధ మాల్యనమస్కార ధూపదీపాన్న సమృద్ధితో బూజింపవలెను. చేఱకు వికారములు = చెఱకు పానకము పంచదార బెల్లముతో జేసిన భక్ష్యములతో విశేష పూజ చేయవలెను. ఆదేవత లిద్దరినట్లు పూజించి పంచదారతో ముత్యపు చిప్పను కన్నులుగా నమర్చి మత్స్యవిగ్రహముచేసి పాలలో నుంచి ద్విజునకది దానమీయవలెను. ఆటుపై నక్తమునందు (రాత్రి) తిలలు తైలము లేకుండ భోజనము సేయవలెను. వీరి పూజ వలన గృహభంగ మెన్నడును బొందరు. పతివ్రతయై దీర్ఘాయువందును కార్తిక మాసమందు రోహిణీనక్షత్రమందు (పూర్ణిమమరునాడు) చంద్రునితో రోహిణీ నక్షత్ర దేవతా పూజ యథావిధి నొనర్చవలెను. ఆ పూజలో ముత్తైదువ యొక్క పుణ్యస్త్రీ చిహ్నములయిన పసుపు, కుంకుమ, మంగళసూత్రము, నల్లపూసలు, కాటుకయునను నైదువస్తువులను ప్రధానముగా బూజచేయవలెను. సమృద్ధమైన ఉప్పుతో గూడ యీ పూజ నెరపవలెను.

గంధమాల్య నమస్కార ధూప దీపా7న్నసపందా | తథా కుంకుమరక్తేన శక్త్యా భార్గవ ! వాససా || 45

సోభాగ్యం పరమాప్నోతి కృత్వైత త్పరమా7ంగనా | శుక్లపక్ష త్రయోదశ్యాం యా చ నారీ పతివ్రతా || 46

పూజయే త్సోపవాసా చ కామదేవ మతంద్రితా | పట్టవర్ణక విన్యాసం తస్య భార్యా తథా పతిమ్‌ || 47

గంధమాల్య నమస్కార ధూపదీపా7న్న సంపదా | గుడేన మధునా చైవ సితయా చాంద్రికేణ చ || 48

లవణన రసై శ్చాన్యైర్గంధై స్ససై#్యః పృథక్‌ పృథక్‌ | భ##క్ష్యై ర్నానావిధై శ్చైవ కుంకుమా7ర్ద్రేణ వాససా || 49

గంధతోయా7ంబు వూర్ణేన ద్రుమ పల్లవ శాలినా | పూర్ణకుంభేన భ##వ్యేన మాల్యకంఠేన భార్గవః || 50

కామదేవాయ నో దద్యా ద్యదవ్లుం కించి దేవ తు | తతశ్చ పశ్చా ద్భోక్తవ్యం సర్వ మవ్లువివర్జితమ్‌ || 51

సర్వాన్‌ కామా నవాప్నోతి కామ పూజావిధాయినీ | అథ చేన్నైవ శక్నోతి సర్వాం రామ ! త్రయోదశీమ్‌ || 52

చైత్ర శుక్లేన సర్వాసాం ఫల మాప్నోత్యసంశయమ్‌ | తస్మా త్సర్వ ప్రయత్నేన చైత్ర శుక్ల త్రయోదశీమ్‌ || 53

కామస్య పూజా కర్తవ్యా సర్వకామ ప్రదాయినీ | కామదేవం సమభ్యర్చ్య కార్య మాత్మాభిపూజనమ్‌ || 54

కుంకుమాంకై స్తథా వసై#్త్ర ర్గంధ మాల్య విభూషణౖః | భర్తారం వూజయే త్పశ్చా న్నరీ తు కృతమండనా || 55

కుంకుమాంకేన వస్త్రేణ గంధమాల్యై ర్మనోహరైః | పురుషో7పి సమభ్యర్చ్య కామదేవ మసంశయమ్‌ || 56

సర్వాన్‌ కామా నవాప్నోతి నా7త్రకార్యా విచారణా | తథా శుక్ల చతుర్థీషు గౌరీపూజా సదా భ##వేత్‌ || 57

స్నాతాభి స్సోపవాసాభి స్సూర్యస్యోదయనం ప్రతి | గంధ మాల్య నమస్కార ధూపదీపా7న్న సంపదా || 58

గుడేన సితయా చా7పి మధునా చా7ర్ద్రకేణ చ | సర్వైశ్చా7విధవా చిహ్నై ర్లవణన చ భూరిణా || 59

చతుర్థీద్వితీయే పూజ్యా సర్వక్త్యా విశేశషతః | ఆషాఢే7ప్యథవా మాసి మాఘే చా7ప్యథవా ద్విజః || 60

చతుర్ణామపి కుండానాం మధ్యే సూర్యాంశు సేవినీ | ఆషాఢే సోపవాసా తు తృతీయాయాం తథా వసేత్‌ || 61

న తస్యా దుర్లభం లోకే కించి ద్భవతి భార్గవ! | మాఘే7ప్యుపోషితా మాసి రాత్ర్యన్తే తుహినోత్కరైః || 62

శుక్లీకృత్వా7ఖిలాన్యంగా న్యధ్యాస్తే శయనం యయా | తతశ్చ శీతతోయేన పశ్చాత్స్నానం సమాచరేత్‌ || 63

సా7పి కామా నవాప్నోతి యాన్‌ రామ ! మనసేచ్ఛతి | పతివ్రతా సదా లోలా సుభగా రూపసంయుతా || 64

గంధమాల్య ధూపదీపాన్న సంపదతో నమస్కారములతో శక్తి యున్నచో కుంకుమమురంగుగల వస్త్రములతో పూజ సేయవలెను. పుణ్యాంగన యీ పూజచేసి పరమ సౌభాగ్యమందును. శుక్లపక్ష త్రయోదశినాడు సాధ్వి యుపవాసముండి తొందర పాటు లేక కామదేవుని యాయన సతిని రతీదేవిని పట్టవర్ణక విన్యాసమున (వస్త్రముమీద రంగులతో చిత్రించి) గంధమాల్య నమస్కార ధూపదీపనైవేద్య సమృద్ధిగా బెల్లము, పంచదార, తేనె, అల్లము, ఉప్పు మరి నైదు రసములచే గంధములచే సస్యములచే వేరు వేరు పెక్కు రకముల భక్ష్యములచే, కుంకుమతో దడిపిన వస్త్రముతో, చందనోదక పూర్ణము మంగళ పల్లవ భరితము మాలాంలంకృత కంఠ భాగముగల పూర్ణకుంభముతో రతీ మన్మథులం బూజింపవలెను. కామదేవునకు పులుపు యే మాత్రము సేయరాదు. మన్మథపూజ చేసిన యావిడ యవ్వల భోజనము సేయవలెను. అందు పులుపు పనికిరాదు. కామపూజ చేసిన కామిని సర్వకామములను బడయును. అన్ని త్రయోదశులు చేయలేనిచో నొక్క చేత్ర త్రయోదశి నాడైన యీరతీ మన్మథ పూజిచేసిన సుదతి సర్వత్రయోదశీ పూజాఫలమందును. సర్వప్రయత్నముగా నీ పూజను పుణ్యాంగనలు సేసి తీరవవలెను. కామదేవ పూజ చేసి తరువాత తన్నుదా పూజించుకొన వలెను. కుంకుమాలంకృతములైన వస్త్రములతో గంధమాల్యా భూషణములతో, దానలంకరించుకొని భర్తను బూజింపవలెను. కుంకుమమాంకమయిన వస్త్రముతో గంనమాల్యాదుబతో బురుషుడును నీ కామ పూజ గావించి సర్వకామములం బొందును. అదేవిధముగా శుక్ల చతుర్థినాడు గౌరీపూజ చేయనగును. స్నానముసేసి యుపవాసముసేసి సూర్యోదయవేళ గంధమాల్యాది షోడశోపచారములతో బెల్లము సర్వసుమంగళచిహ్నములు అనగా పసుపు, కుంకుమ, కాటుక మొదలయినవానితో సమృద్ధియైన ఉప్పుతో శుక్లకృష్ణపక్ష చతుర్థులు రెంటియందు సర్వశక్తితో గౌరీపూజ గావింపవలెను. ఆషాఢమున మాఘమందిది సేయవలెను. ఆషాఢములో తదియనాడుపవాసండి యీ పూజ సేసిన యామెకు లోకమందు దుర్లభ##మైనదే కొంచెము నుండదు. మాఘమందు గూడ యుపవాసముసేసి వేకువయందు మంచు బిందువులచే తన సర్వావయములను దెలుపొనరించుకొని పానుపుపైనధివసించి యవ్వల చన్నీళ్లతో స్నానము సేయవలెను. అట్లు సేసిన పతివ్రత మనసుపడిన కోరికలన్నింటిని బొందును. ఏయాందోళనములేక సౌభాగ్యవతియై సౌందర్యవతియై రాణించును.

ధర్మప్రియా చ భవతి గౌరీవూజన తత్పరా | ఆషాఢే దాడిమం పుష్పం మధౌ కార్పాస సంభవమ్‌ || 65

నివేద్య సర్వ మార్వాయై సౌభాగ్యం మహ దశ్నుతే | శక్రాణీ చ తథా పూజ్యా మాసి భాద్రపదే భ##వేత్‌ || 66

స్త్రీణాం గౌరీవిధానేన సర్వకామ ప్రదా హి సా | ప్రోష్ఠపదస్య మాసస్య చతుర్థ్యాం ద్విజసత్తమః || 67

శక్రాణీ పూజనం కృత్వా నాక పృష్టే మహీయతే | పూజాతిధిమ సర్వాసు రామ! బ్రాహ్మణ పూజనమ్‌ || 68

కర్తవ్యం యచ్చ నైవేద్యం దేయం తత్సుభగాసు చ | అనభ్యర్చ్య తధా గౌరీం గౌరీదీపం ప్రపశ్యతి || 69

దౌర్భాగ్యం మహాదాప్నోతి వర్జితం తస్య దర్శనమ్‌ | గౌరీపూజన కామా స్త్రీ తస్మిన్నహని యా ద్విజ! || 70

స్నాన ముష్టాంబునా కుర్యా త్సాపి సౌభాగ్య మశ్నుతే | సంపూజ్య విధినా గౌరీం యత్ర యత్రా7భిజాయతే || 71

రూప లావణ్య సౌభాగ్య యుక్తాభవతి చాప్యథ | నిత్యం చా7విధవా రామ! తథైవ చ పతివ్రతా || 72

ఏతాః పూజ్యతమాః స్త్రీషు దైవతస్థాః ప్రకీర్తితాః ' అతః పరం తు యా కుర్యా త్సతీ మార్గ వివర్జనమ్‌ || 73

హింసాత్మక మనిర్దిష్టం అశుద్ధం వా ద్విజోత్తమ! | దేవతా7రాధనం సాతు చిరం నరక మృచ్ఛతి || 74

తతస్తు చా7ప్యనాయుష్యం గ్రహభూత వివర్ధనమ్‌ | హింసాత్మకా తు యా నారీ దేవతా 7రాధనే రతా || 75

మూలకర్మరతా భర్త్రా సా7వివాహ్యా భృగూత్తమ ! | పౌంశ్చల్యాదపి నారీణాం రామ ! హింసా7 వివర్జితా || 76

స్త్రీ స్వభావం శుభం రామః సౌమ్యత్వం మార్దవం దయా | నిర్దయా రాక్షసీ రామ! పిశాచీ వా ద్విజోత్తమః || 77

అథవా సర్వ ముత్సృజ్య పతి పూజన తత్పరా | కేశవా7రాధనం కుర్యా చ్ఛ్రియశ్చ పురుషర్షభ ! || 78

తేనైవ సర్వ మాప్నోతి యత్కించి త్పర మృచ్ఛతి | అఫలం సర్వమేవ స్యా ద్భర్త్రనుజ్ఞాం వినా కృతమ్‌ || 79

కేశవా7రాధనం రామ! తథా7పి సఫలం స్త్రియః | సర్వభూతాని గోవిందో భర్తా నా7న్యస్తు యోషితః || 80

భర్త్రనుజ్ఞాం వినా తస్మా త్తతః పూజా విధీయతే || 80

నారాయణః వూజ్యతమోహి లోకే | నారాయణ స్సర్వగతః ప్రధానః |

నారాయణా7రాధన తత్పరా స్త్రీ | కామా నవాప్నోతి న సంశయో7త్ర || 81

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే స్త్రీ దేవతా పూజన నిరూపణం నామ పంచ త్రింశత్తమో7ధ్యాయః.

గౌరీ పూజాతత్పరయైన నారి ధర్మప్రియురాలగును. ఆషాఢమందు దానిమ్మపువ్వు తేనె ఆర్యాంబికకు నివేదించిననీరజాక్షి మహా సౌభాగ్యవతి యగును. భాద్రపదమందు శక్రాణియు (శకపత్ని శచీదేవి) గౌరీపూజా విధానమున పూజనీయ. సర్వకామప్రదమును. (భాద్రపద) మాస చతుర్థియందు శక్రాణీ దేవతా పూజచేసిన వారు స్వర్గ పూజ్యులగుదురు. ఈ పూజా తిథులన్నీటను బ్రాహ్మణ పూజయుం గర్తవ్యము. దేవతలకు నివేదించిన దెల్ల సువాసినులకు వాయన మీయవలెను. గౌరీదేవిం బూజింపకుండ గౌరీ దీపమును జూచిన దౌర్భాగ్యము నందును. పూజ సేయకుండ గౌరీ దీపము దర్శించుట నింద్యము. గౌరీ పూజాభి లాషిణి యా నాడుష్టోదకస్నానము సేయవలెను. అందుచే సౌభాగ్యమండును. గౌరీపూజ చేసిన సుందరి యొక్కడెక్కడ తాను జన్మించు నక్కడక్కడ రూపలావణ్య సౌభాగ్య శాలినియగును. నిత్యసుమంగళియునగును. మహాపతివ్రతయునగును. స్త్రీలకు బరమ పూజ్యులైన దేవతలుగా వీరు కీర్తింపబడినారు. దీనినిమించి సతీమణుల మార్గము దప్పి హింసాత్మకము శాస్త్ర నిర్దిష్టముగాని దేవతా రాధన మదియెల్ల శుద్ధముగాదు. అట్టిది చేసిన స్త్రీ చిరకాలము నరకమునంబడును. అది యనాయుష్యము. గ్రహబబాధలను భూతావేశములను పెంచును. హింసాత్మకయై ఇతరులను హింసించునదై మూలకర్మరతయైన (వశ్య విద్యలు చేతబడు ప్రయోగములు మొదలయిన వానికి మూలకర్మయని పేరు) భామినిని జారిణికంటెగూడ వివాహము సేసికొనరానిది. సొమ్యత్వము మార్దవము దయ యనునది స్త్రీ యొక్క శుభ స్వభావము. నిర్దయయైన స్త్రీ రాక్షసి పిశాచియగును. ఇందంతయుంగాదు సర్వము వదలి స్త్రీ పతి పూజా తత్పరయై కేశవారాధనము సేయవలెను. లక్ష్మీపూజ సేయవలెను. దాననే మానిని సర్వ భాగ్యముల నందగలదు. ఏకొంచెము పరమఫలమైన దాననే పొందును. భర్తయనుజ్ఞలేకుండ జేసినదెల్ల నిష్ఫలమే. కేశవా రాధనము మాత్రమట్లుగాదు. అది ఫలమే యగును. సర్వ భూతములు గోవిందుడే. స్త్రీకి భర్త గోవిందుడేగాని యితరుడుగాడు. కావున భర్త యనుజ్ఞలేకయో గోవిందుని బూజించుట భర్తను పూజించుటయే. కావున నదిమాత్రము స్త్రీకి విధింపబడినది. లోకమందు నారాయణుడు పూజ్యతముడు. నారాయణుడు సర్వగతుడు ప్రధానుడు. వారాయణారాధన తత్పరయయిన నారీ యభీష్టములంబొందును. ఇందు సందియములేదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున స్త్రీ దేవతాపూజానిరూపణమను ముప్పదియైదవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters