Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది నాలుగవ అధ్యాయము - స్త్రీలక్షణములు

రామః - సాధ్వీనాంశ్రోతు మిచ్చామి దేవ | ధర్మా నశేషతః | సాధ్వ్యో హి నార్యో లోకానా మాధార ఇహ కీర్తితః || 1

పుష్కరః - ఏతదేవ పరం రామః రామాణాం ధర్మకారణమ్‌ | యదాసాం సర్వకార్యేషు నిత్యం హి పరతంత్రతా || 2

బాల్యే పితుర్వశే తిష్టేత్‌ పాణిగ్రాహస్య ¸°వనే |పుత్రాణాం భర్తరి ప్రేతే న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి || 3

పిత్రా భర్త్రాసుతే నేహ నేచ్ఛే ద్విరహ మాత్మనః | తేషాం చ విరహేణ స్త్రీ గర్హ్యే కుర్యా దుభే కులే || 4

సదా ప్రహృష్టయా భావ్యం గృహకార్యే చ దక్షయా | సుసంస్కృతో పస్కరయా వ్యయే చాము క్తహస్తయా || 5

యసై#్మ దద్యా త్పితాత్వేనాం తదఖావే పికారకః | తం శుశ్రూషేత జీవన్తం సంస్థితం నతు లంఘయేత్‌ || 6

మంగళార్థం స్యస్త్యయనం యజ్ఞ శ్చాసాం ప్రజాయతే | ప్రయుజ్యతే వివాహేషు ప్రదానం స్వామికారితమ్‌ || 7

అనృతా వృతుకాలోక్తే మంత్రసంస్కార కృత్ప ః | సుఖం నిత్యం దదాతీహ పరలోకే చయోషితః || 8

విశీలః కామవృత్తో వా గుణౖర్వా పరివర్జితః | ఉపచర్యః స్త్రీయా సాధ్వ్యా సతతం దేవవత్పతిః || 9

నాస్తి స్త్రీణాం పృథగ్యజ్ఞా న వ్రతం నాప్యుపోషితమ్‌ | పతిం శుశ్రూషతే యత్తు తేన స్వర్గే మహీయతే || 10

పాణిగ్రాహస్య సాధ్వీ స్త్రీ జీవతో వా మృతస్య నా | పతిలోక ముభీప్సంతీ నాచరే త్కించి దప్రియమ్‌ || 11

కామంతు క్షపయే ద్దేహం పుష్పమూల ఫలైశ్శుభైః | న తు నామాపి గృహ్ణీయాత్‌ పత్యౌ ప్రేతే పరస్యతు || 12

ఆసీతామరణాత్‌ క్షాన్తా నియతా బ్రహ్మచారిణీ | యోధర్మ ఏకపత్నీనాం కాంక్షన్తీ తమను త్తమమ్‌ || 13

అనేకాని సహస్రాణి సుముగ్ధ బ్రహ్మచారిణామ్‌ | దివంగతానాం విప్రాణా మకృత్వా కుల సన్తతిమ్‌ || 14

మృతే భర్తరి సాధ్వీ స్త్రీ బృహ్మచర్యే వ్యవస్థితా | స్వర్గం గచ్ఛ త్యపుత్రాపి యథా తే బ్రహ్మచారిణః || 15

అపత్యలోపా ద్యా తు స్త్రీ భర్తార మతివర్తతే | సేహ నిందా మవాప్నోతి పరలోకాచ్ఛ హీయతే || 16

నాన్పోత్పన్నా ప్రజాస్తీహ న చాప్యన్య పరిగృహా | న ద్వితీయశ్చ సాధ్వీనాం కశ్చి ద్భర్తోపదిశ్యతే || 17

పతిం హిత్వా నికృష్టం స్వం చోత్కృష్టం యా నిషేవతే | నింద్యైవ లోకే భపతి వరపూర్వేతి చోచ్యతే || 18

వ్యభిచారాత్తు భర్తుః స్త్రీ లోకాన్‌ ప్రాప్నోతి నిందితాన్‌ | శృగాల యోనిం చాప్నోతి పాపరోగైశ్చ పీడ్యతే || 19

పతిం యా నాభిచరతి మనోవాగ్దేహ సంయతా | ఇహాగ్రాం కీర్తిమాప్నోతి పరలోకే చ శస్యతే || 20

పత్యుభ్యధికం నారీ నోపవాస ప్రతం చరేత్‌ | అనాయుష్యం ద్విజ శ్రేష్ట| పత్యుస్తస్యాః తదుచ్యతే || 21

దేవతారాధనం కుర్యాత్‌ కామం వా బ్రాహ్మణోత్తమ! | నారీ పతిప్రతా రామః ప్రాప్తానుజ్ఞాతు భర్తృతః || 22

నారీ ఖల్వననుజ్ఞాతా పిత్రా భర్త్రా సుతేన వా | విఫలం తద్భవే త్తస్యాః యత్కరో త్యౌర్థ్వదైహికమ్‌ || 23

స్త్రీణాం పూజ్యతమా లోకే దేవతాగృహ వాసినామ్‌ | యా స్తాః సంపూజనీయా స్స్యుః తాసా మేవ యథావిథి || 24

తాసాం చ పూజనం కార్యం విదితం స్వామిన స్తథా | అన్యథా చేత్ర్పవ ర్తేత నిర్గ్రాహ్యా సా ప్రకీర్తితా || 25

గత్వాన్య పురుషం నారీ నరకం ప్రతిపద్యతే | కూటశాల్మ లిరిత్యుక్తం యావ దాభూత సంప్లవమ్‌ || 26

గర్హితా చ తథా పత్యు ర్నరకం యాతి భార్గవ! | దశవర్ష సహస్రాణి తథైవాప్రియవాదినీ || 27

సర్వావస్థాస్వపి స్త్రీషు న వధో విద్యతే ద్విజః | పరేణ శంకితా మేనాం సంయతాం వాసయే ద్గృహే || 28

హృతాదికారాం మలినాం పిండ మాత్రోపజీవినీమ్‌ | పరిభూతా మధశ్శయ్యాం వాసయే ద్వ్యభిచారిణిమ్‌ || 29

మూలకర్మ న కర్తవ్యం కథంచిదపియోషితా | మూలకర్మరతా నారీ కల్పం నరక మావసేత్‌ || 30

దౌర్భగ్యం మహదాప్నోతి తత్ర యత్రాభిజాయతే | యా చ నారీ సపత్నీనాం కుర్యా ద్దౌర్భాగ్యకారణమ్‌ || 31

కుహకై ః పర్యతే సాపి కల్పాన్తం నరకే ద్విజ! | పుంస్త్వమూలం తథాలక్ష్మీం వత్యుర్హింసతి సా తథా || 32

యక్ష రక్షః పిశాచానాం మూలకర్మరతా సదా | వశ్యో భవతి లోకేషు భర్తా తస్యా స్తథైవ చ || 33

నారీ కృత్వా పతిం వ్యశం సతతం మూలకర్మణా | లభ##తే ంతే తు దౌర్భాగ్యం భూతై ర్వా భక్ష్యతే ధ్రువమ్‌ || 34

తస్మా త్సర్య ప్రయత్నేన మూలకర్మ వివర్జయేత్‌ | అత్మాన మథ భర్తారం నాశ##యే న్మూలకర్మణా || 35

బ్రాహ్మణీ న పిబే న్మద్యం న చ విట్‌ క్షత్రియ స్త్రియః | సురాం పిబేయు ర్థర్మజ్ఞ ః తత్పానా న్నాశ మాప్నుయుః || 36

తతో భవతి ధర్మజ్ఞ | జలౌకా రక్త పాయికా | కల్పావశేషం సకలం తేన ఘెరేణ కర్మణా || 37

పరవేశ్మరుచి ర్న స్యాత్‌ న స్యా త్కలహశాలినీ | న తిష్టేచ్ఛ త్తథా ద్వారి న చ రామ ! గవాక్షకే || 38

మండనం వర్ణయే న్నారీ తథా ప్రోషిత భర్తృకా | దేవాతా೭೭రాధనపరా భ##వేద్భర్తృహితే రతా || 39

ధాగయే న్మంగళార్థాయ కించి దాభరణం తథా || న జాతు విధావా వేషం కదాచి దపి కారయేత్‌ || 40

పతివ్రతా తు యా నారీ సహ భర్త్రా దివంగతా | కల్పావశేషం ముదితా పూజ్యతే త్రిదశాలయే || 41

పతివ్రతాం సువర్ణాంస్త్రీం ద్విజాతిః పూర్వమారిణీమ్‌ | దాహయో దగ్ని హోత్రేణ యజ్ఞపాత్రైశ్చ ధర్మవిత్‌ || 42

భార్యాయై పూర్వ మారిణ్యౖ దత్వాగ్నీ నంత్యకర్మణి | పున ర్దార క్రియాం కుర్యా త్పున రాధాన మేవ చ || 43

మృతే భర్తరి యా సాధ్వీ పుత్ర మాశ్రిత్య భార్గవః తపసా శాతయే ద్దేహం తేన స్వర్గే మహియతే || 44

పతిపక్షే నరం కంచి త్పు త్రాభావే సమాశ్రయేత్‌ | బిభృయాద్ధి స చాప్యేనాం భోజనాచ్ఛాదనై స్సదా || 45

పతిపక్షే సుముచ్ఛిన్నే పితృపక్షః ప్రభుః స్త్రియః | విషమస్థాపి భర్తవ్యా పితృపక్షే స్వబంధుభిః || 46

మృతం భర్తార మాదాయ యది వాథ పతివ్రతా | ప్రవిశే ద్ద్విజశార్థూల ! జ్వలితం జాతవేదసమ్‌ || 47

తిస్రఃకోట్యర్ధకోటీ చ యాని లోమాని మానవే | తాపన్త్యేవ శతాబ్దాని స్వర్గలోకే మహీయతే || 48

వ్యాళ గ్రాహీ యథా సర్పం బిలాదుద్దరతే బలాత్‌ | ఏవం భర్తార మాదాయ సహతేనైన గచ్ఛతి || 49

సద్వృత్తమధ్యాపయితుం గతానాం | స్త్రీణాం వియోగ క్షత కాతరాణామ్‌ | 50

తాసాం మృతే జీవితవల్లభే హి | నా7గ్ని ప్రవేశా దపరో హి ధర్మః ||

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే - స్త్రీధర్మోనామ చతుస్త్రింశత్తమోధ్యాయః.

పరశురాములవారు దేవా ! పతివ్రతా స్త్రీ ధర్మములను బూర్తిగ వినగోరెదను. వారు లోకముల కాధారమైన వారని చెప్పబడియున్నదన పుష్కరుండిట్లనియె. సర్వకార్యములందును పరతంత్రయై యుండుట, రమణీమణులకు పరమ ధర్మకారణము. బాల్యమున తండ్రివశమందు ¸°వ్వనమందు పాణిగ్రాహి (పెనిమిటి) యొక్క వశమందు భర్త చనిపోయినమీదట పుత్రులయొక్క వశమందును స్త్రీ మెలగవలయును. స్త్రీ యెన్నడేని స్వాతంత్ర్యమున కర్హురాలుకాదు. తండ్రి భర్త కొడుకులతోటి తానుండవలెను. యెడబాటు స్త్రీ కోరరాదు. వారి నెడబాసియున్న స్త్రీ పుట్టినింటికిని మెట్టినింటికినిగూడ నింద్యము నొసరించును. ఇంటి పనులందు దక్షురాలై యిల్లా లెప్పుడు నానందభరితయై యుండవలెను. ఇంటిసొమ్ము వ్యయించుటలో జేతి విసురులేక యింటిలో సామాగ్రులను జక్కగ శభ్రపరచుచు నింటి పనులందు సర్వసమర్థురాలై యుండవలెను. తండ్రితన నెవ్వనికి దానము చేసే నాతండ్రి లేనప్పుడు గూడ యెవ్వడు తనకు దిక్కునగునో అట్టివాడు జీవించి యుండగా నతనని శుశ్రూషింపవలెను. అతని జవదాటరాదు. మంగళార్థము స్వస్త్యయనము స్త్రీలకు యజ్ఞము నందధికారము వివాహములందుపుట్టును. అందులకు భర్తయెడల చేయబడు కన్యా దాన సంస్కారము ప్రయోగింపబడును. ఋతువుకానప్పుడు ఋతుకాలమందు మంత్ర సంస్కారము సేయువాడు పతియే. స్త్రీకి సుఖము, నిత్యముగా నిహము, పరము నిచ్చువాడతడు. శీలరహితుడు, కామవర్తనుడు. గుణహీనుడు నైనను పతివ్రత పతిని దేవునట్లు పచరింపవలయును. స్త్రీలకు వేరే యజ్ఞము వ్రతము ఉపవాసము ననునవి లేనేలేవు. పతి శుశ్రూషవలన నామె స్వర్గమందు బూజ్యురాలగును. పాణిగ్రహణము సేసినవాడు బ్రతికియున్నను మృతుడైనను నతని కప్రియమును భర్తతోడి పుణ్యలోకమును గోరు నావిడ కొంచెముం జేయరాదు. భర్తపోయిన తర్వాత పూలు దుంపలు పండ్లుదిని దేహమును కృశింపజేసికొనవలెను. పర పురుషుని పేరైన జెప్పకూడదు. మరణ పర్యంతము నోరిమితో నియమముతో బ్రస్మాచారిణియై యుండవలెను. ఏకపత్నులయిన స్త్రీలకేది ధర్మమని చెప్పబడినదో యాయత్యుత్తమ ధర్మమునే కాంక్షించి యుండవలెను. మిక్కిలి యమాయికులు బ్రహ్మణచారులు నయిన విప్రులు కుల సంతతి నొసరింపకయే స్వర్గమునకు వెళ్లినవారున్నారు. భర్త దివంగతుడైనంత సాధ్వియగుస్త్రీ బ్రహ్మచర్య మందు నిలుకడ గొనినదై పుత్రులులేనిదైనను నా బ్రహ్మచారులట్లు స్వర్గమున కేగును.సంతానలోభమున భర్త నతిచరించని స్త్రీ నింద పడును. పరలోకమునుండి భ్రష్టురాలగును. పరలోకమునుండి భ్రష్టురాలగును. ఈమె కింకొకని వలన కలిగిన సంతానము పనికిరాదు. ఈమె యింకొకనికి భార్యకారాదు. సాధ్వులకు రెండవమగడు శాస్త్రమందు చెప్పబడలేదు. తన మగడు నికృష్టుడని ఇంకొకని బొందిన యాడుది లోకమున నింద్యురాలగును మున్నింకొకని గట్టుకొన్నదనుమాట పడును. స్త్రీ వ్యభిచారముచే నింద్యలోకముం బొందును. నక్కజన్మ మందును. పాపరోగమునందును. మనోనాక్కాయములచే నభిచరించని స్త్రీ యిక్కడ మహా కీర్తినందును. పరలోకమందును బ్రశంశలంగనును. స్త్రీ భర్తను మించి యుపవాస వ్రతమూనరాదు. అది భర్తయాయుష్యమునకు భంగమని చెప్పబడినది. భర్తయనుజ్ఞపొంది దేవతారాధనమును యధేచ్చగా జేయవచ్చును. తండ్రి భర్త కొడుకుగాని యనుజ్ఞయీయకుండ యామె యూర్థ్య దైహిక క్రియ యేదిసేసి నను నిష్పలమే. లోకమందు గృహస్తులకు పూజనీయమైన దేవతలు గృహమందున్న గృహిణులకు మిక్కిలి పూజింపవలసిన వారు. వారా దేవాతలను యథావిధిం పూజింపవలెను. అదికూడ స్త్రీ భర్తకు తెలిపియే చేయవలెను. ఇంకొకరీతి ప్రవర్తించిన యెడల నాస్త్రీ నిగ్రహింపవలసినదగును. అన్యపురుషునింపొందిన స్త్రీ కూట శాల్మలి యనునరకమును ప్రళయము దాక యనుభవించును. భర్త గర్హింప వలసినదగును. పదివేలేండ్లు నరకమందును. ఏ పరిస్థతిలోనైన స్త్రీల యెడ మరణశిక్షలేదు. పరపురుష శంకితయైనదాని నిల్లుగదలి వెళ్లకుండ నిర్భందింపవలెను. దాని వెంట పెత్తనము లేకుండజేసి మలినురాలింగా పిండమాత్ర జీవినిగావించి క్రింద పండుకొన బెట్టి యావ్వఖిచారిణిని పరాభవింవలెను. స్త్రీ యెన్నడు మూలకర్మ గట్టుట ప్రయోగాల నొసరింపరాదు. మూలకర్మరతయైన స్త్రీ బ్రహ్మకల్పము నరకముననుభవించును. మలి జన్మ మెత్తినచోట మహా దౌర్భాగ్యమందును. సవతులకు దౌర్భాగ్యము కలిగించు స్త్రీ అనేక కల్పములు మాయావులైన కింకరులచే నరకమందుండికింప బడును. ఆ స్త్రీ భర్తయొక్క పుంస్త్వములమును ఐశ్వర్యమును హింసించును. యక్షరక్షః పిశాచ ప్రయోగము లొసరించుటలో మూలకర్మరత యైన దాని భర్తలోకమందు పశుడగును. నిశ్చయము. స్త్రీ భర్తను మూలకర్మచే వశము చేసి కొనెనేని దౌర్భాగ్యమునందును. తను బ్రయోగించినభూతములచే దానే భక్షింప బడునది యగును. నిశ్చయము. అందుచే సర్వ యత్నములచే మూలకర్మ జోలికి పోరాదు. అది ఆత్మఘాతుక మగును. భర్తను నాశనము చేయును. బ్రాహ్మణ స్త్రీ క్షత్రియ వైశ్య స్త్రీలు మద్యమును దావరాదు. సురాపానముచే నాశనమందుదురు. మద్యపానము చేసిన స్త్రీ యవ్వల రక్తము ద్రావు జలగయై పుట్టును. అకల్ప మా ఘోర కర్మ మనుభవించును. స్త్రీ పొరుగిండ్ల దిరుగునుబలాట కలదిగాగూడదు. వీధి గుమ్మములో కిటికీలోగూడ నిలువరాదు. భర్త పరవాస మేగిన స్త్రీ (ప్రోషిత భర్త్రక) నగలు పెట్టుకొనరాదు. అలంకరించుకొనరాదు భర్తహితమే కోరునదై దేవతారాధనమందు నిమగ్నురాలయి యుండవలెను. శుభ నిమిత్తముగ పరిమితభరణములనే యెప్పుడు ధరింపవలనెను. భర్తలేనిది (విధవ) యెప్పుడేని వేషము వేయరాదు. పతివ్రతయై భర్తతో సహగమనము సేసిన సాధ్వి కల్పాంతముదాక నానంద భరితురాలై స్వర్గమందు బూజలందు కొనును. ధర్మవిదుడు సవర్ణయైన స్త్రీని పతివ్రతను ముందుజనిపోయిన దానిని అగ్నిహోత్రములో యజ్ఞపాత్రలతో దహింపవలెను. మందుమరణించిన భార్య కంత్య కర్మ మందగ్ని నిచ్చి పునర్దార క్రియను (పునర్వివాహమును) పునరాధానము (తిరిగియగ్ని హోత్రమును) చేసికొనవలెను. భర్త మృతుడైన యెడ పుత్ర నండజేసిర సాధ్వి తపస్సుచే దేహమనును గృశింప చేసికొని స్వర్గమందు పూజనీయ మగును. కొడుకులు లేనపుడు స్త్రీ భర్తవైపు మనుజు నొకవైపు జేరవచ్చును. అతడీమెకు తిండి బట్టయు నిచ్చి భరింపవలెను. మగని వంక యుచ్ఛిన్న మైనపుడు స్త్రీకి తండ్రి వంక రక్షక మగును. తండ్రివంక వారు విషమ స్థితిలో నున్నను దానిని భరింపవలెను. మృతుడైన భర్తం గొని పతివ్రత ప్రజల్వించు అగ్ని యందు ప్రవేశింపవలెను. మూడున్నర కోట్లు మానవుని శరీరములో నున్న రోమములు లెక్కకు సరియగు శతాబ్దములు సహగమనము చేసిన సతి స్వర్గమందు పూజ నీయయగును. పాములవాడు బలియై కన్నము నుండి పామును వెలికి లాగినట్లు సహగమనము సేసిన పతివ్రత భర్తనుద్ధరించి యతనితో పుణ్యలోకములకేగును. సచ్ఛరిత్రము బోధింపనెంచియు భర్త్ర వియోగమును గాయమునకు వెఱచునట్టి స్త్రీలకు ప్రాణవల్లభుడు మరణించి నపుడు అగ్ని ప్రవేశముకంటె మరి యెండు ధర్మము లేదు.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురణామందు స్త్రీ ధర్మ ప్రశంశయను ముప్పది నాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters