Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది మూడవ అధ్యాయము - పతివ్రతా మహాత్మ్యము

పుష్కరః - సాధ్వీనాం పాలనం కుర్యా త్పూజనం చ మహీపతిః | ఏక పత్న్యః స్త్రియ స్సర్వాః ధారయన్తి జగత్త్రయమ్‌ ||

భర్త్రవ్రతా భర్త్రపర్తా భర్త్రపూజన తత్పరా ః | యా తు స్త్రీ సా దివం యాతి సహభర్త్రా ద్విజోత్తమాః || 2

ఏకపత్న్యస్తు యద్దుఃఖ ద్విజ సహన్తేః సానుగాః | తేనతాః స్వర్గ మాసాద్య సుఖ మాయాన్త్యనేకథా || 3

తాసాం ప్రభావో హి మహాన్‌ తేజశ్చైవాతి దుస్సహమ్‌ | న కోపనీయా నోపేక్ష్యా నైవ తాశ్చ విమాన యేత్‌ || 4

నాహూయే దవరాధేషు దండ్యస్తాసాం పతిర్భవేత్‌ | పుత్రోవాప్యధవా నీతౌనైవ రాజా ప్రభుః క్వచిత్‌ || 5

నైవ సాధ్వీ వినిర్దిష్టా కేవలోపస్థరక్షణాత్‌ | విప్రియం నాచరేత్కించిత్‌ పత్యు స్సాధ్వీతి సా స్మృతా || 6

కర్మణా మనసా వాచా భర్తుః ప్రియహితై షిణీ | యా నారీ సా స్మృతా సాధ్వీ పతిపూజన తత్పరా || 7

నమస్కార్యాశ్చ పూజ్యాశ్చ వందనీయాశ్చ భార్గవః | రాజ్ఞా సర్వప్రయత్నేన తథా లోకైశ్చ సర్వశః || 8

అనాధాం చ తథా సాధ్వీం బిభృయా త్పార్థివోత్తమః |తసై#్మ యద్దీయతే దానం తదనన్తం ప్రకీర్తితమ్‌ || 9

సాధ్వీనా మవమానేన కులందహతి పూరుషః | తాసాం సంపూజనా ద్రామః స్వకులం చోన్నతిం నయేత్‌ || 10

న ధనేన న ధన్యేన న శీలేన న బంధుభిః | న యజ్ఞై ర్దక్షిణావద్భిః నాధీతేన తథైవ చ || 11

అకులాని కులా న్యాహుః కింతు స్త్రీణాం విచేష్టితైః | యేషు సాధ్వ్యః స్త్రియో రామః కులేషు కులధూర్వహాః || 12

మహాకులాని తానీహ కృశాన్యపి ధనైర్యది | పుత్రాణా మపి తత్పుత్రం (పుత్రత్వం?) సాధ్వీయస్యారణిర్భవేత్‌ || 13

హవ్యేషు సాధ్వీతనయం తథా కవ్యేషు యోజయేత్‌ | తత్రాల్పస్యాపి దానస్య మహాత్పుణ్యం ప్రకీర్తితమ్‌ || 14

గాయత్రీ తు యథా రామః యథా గంగా సరిద్వరా | పావనీ కీర్తనాదేవ తథా సాథ్వీ వరాంగనా || 15

రామాస్తు భృగుశార్దూలః న ప్రదుష్యన్తి కర్హిచిత్‌ | మాసి మాసి రజస్తాసాం దుష్కృతా న్యపకర్షతి || 16

సోమ స్తాసాం దదౌశౌచం గంధర్వ శ్శిక్షితాం గిరమ్‌ | అగ్నిశ్చ సర్వమేధ్యత్వం తస్మా న్నిష్కల్మషాః స్త్రియః || 17

బ్రాహ్మణా ః పాద తోమేధ్యాః గావో మేధ్యాస్తు పృష్టతః | అజాశ్వౌముఖతో మేథ్యౌస్త్రియో మేధ్యాస్తు సర్వతః || 18

యామయో యాని గేహాని శప న్త్యప్రతిపూజితాః | తాని కృత్యా హతానీవ వినశ్యన్తి సమన్తతః || 19

స్త్రియ శ్శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన | తస్మా త్సర్య ప్రయత్నేన పూజనీయా స్సదా స్త్రియః || 20

మిధ్యా న సాధ్వీ భవతీహ లోకే | భవత్యథాస్మిన్నపరే చ రామ ః |

సాధ్య్వ స్థథా పూజ్యతమా ః ప్రదిష్టాః | లోకేషు సర్వేషు చరాచరేషు |

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే సాధ్వీమాహాత్మ్యం నామ త్రయస్త్రింశోధ్యాయః.

పుష్కరుండనియె: రాజు సాధ్యులను బూజింపవలెను. పాలింపవలెను. ఏకపత్నులయినస్త్రీలు జగత్త్రయమును ధరింప గలరు భర్త్రవ్రత భర్త్రపర భర్త్రపూజన తత్పరయైన సాధ్వి భర్తతో స్వర్గమునకుం జనును. ఏకపత్నులు(ఒక భర్తను గైకొన్న వారు) వాని ననుసరించి కష్టమైన సహింతురో వారాతనితో స్వర్గముంబొంది యనేక విధముల సుఖముంబొందుదురు. అట్టి సాధ్వీమణుల ప్రభావమున చాలా గొప్పది. వారితేజస్సు దుస్సహము. అట్టి పతివ్రతకు కోపము రప్పింపరాదు. ఆమెనుపేక్షింపరాదు. అవమానింపరాదు. వారేదేని తప్పు సేసిన వారిని న్యాయస్థానములకు పిలువరాదు. వారికి దండ్యుడు వారిభర్తయే. లేదా కుమారుడు నీతి విషయములో రాజెప్పుడును ప్రభువు(సమర్థుడు) గాడు. కేవలము మానరక్షణ మాత్రముననే సాధ్వి (పతివ్రత) యని నిర్ధేశింప బడలేదు. భర్తకే కొంచెమేని యప్రియము చేయనిదే సాధ్వియని స్మృతులు పేర్కొనినవి. ఒక్క యేకాంతానుకూల్యమే కాదు సర్వకార్యాను కూల్యము పతివ్రతా ధర్మమన్న మాట. చేతిలో మనసులో మాటలో (త్రికరణములందు) భర్తప్రియముకోరి పతి పూజాతత్పరురాలైన స్త్రీయే సాధ్వియనబడినది. అట్టియిల్లాలు రాజునకు లోకులకును పూజింపదగినది. గౌరవింపదగినది. ఉత్తమ పార్థివు డనాథయైన సాధ్విని భరింపవలెను. ఆమెకిచ్చిన దాన మనంతము. సాధ్వుల నవమానించిన మానవుడు కులమున కెల్ల చిచ్చు పెట్టిన వాడగును. వాని పూజించినవాడు తనకులమునున్న తి నందించును. ధనముచే గాదు ధాన్యముచేగాదు శీలముచేగాదు బంధువులచేగాదు సదక్షిణయజ్ఞములచేగాదు అధ్యయనము చేతగాదు. ఆ కులములు కులములునగుట యొక్క స్త్రీల ప్రవర్తనముల చేతనే, ఏ కుటుంబములందు స్త్రీలు కుటుంబ భారవహలయ్యెద రాకులము నిహమందు ధనముచే కృశించిన వయినను మహా కులములే. సాధ్వి యెవ్వని కరణియో జననస్థానమో పుట్టుట కరణివలె (నీతిని జన్మమునకు కారణమన్నమాట) ఆట్టిపుత్రులకే నిజమైన పుత్రత్వముండును. (పున్నామ నరకమునుండి తరింపజేయువాడు పుత్రుడన్నమాట యక్కడనే సార్థకమగు నన్నమాట) పతి వ్రతాతనియుని హవ్యములందు (దేవతోద్దేశమున నిచ్చు హవిర్భాగ క్రియాకలాపమందు) కవ్యములందు పిత్రదేవతల కిచ్చువానియందు) నియోగింపవలెను అట్టివాని యందత్యల్పమైన దానమునకేని మహాపుణ్యము చెప్పబడినది. గాయంత్రియు నదీశ్రేష్టమగు గంగయునెట్లో సాధ్వియైన సుందరియునట్టే కీర్తనమాత్రమున విపత్రము చేయగలది. రమణీమణు వెన్నడేని దోషస్పర్శనందరు. నెలనెల నగు రజస్సు వారి దోషముల నపహరించి వేచియుండును. సోముడు వారికి శుచిత్వము నొసంగును. గంధర్వుడు మాటపొందికను గూర్చును అగ్ని సర్వపవిత్రత నిచ్చును. అందుచే స్త్రీలు నిష్కల్మషలు. బ్రాహ్మణుల పాదములందు పవిత్రులు, గోవులు పృష్టములందు పవిత్రములు, మేకలు గుఱ్ఱములు ముఖములం బవిత్రములు, స్త్రీలు సర్వావయవీపవిత్రులు. స్త్రీకి శ్రీకిని కొంచెమేని భేదములేదు. అందుచే గృహలక్ష్ముణుల సర్వప్రయత్నముచే పూజనీయులు. పతివ్రత యీలోకమందును పరలోకమందును మిథ్యగాదు. అనగా నుభయలోకముందును సాఫల్యము గూర్చును. చరాచరప్రపంచమందెల్లెడలను పతి వ్రతలు పరమపూజనీయులు అని చెప్పబడిరి.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున సాధ్వీమహాత్వమను ముప్పది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters